అక్కను చంపేసి.. పోలీసులకు ఫోన్! | Man kills sister in Delhi, telephones police | Sakshi
Sakshi News home page

అక్కను చంపేసి.. పోలీసులకు ఫోన్!

Aug 6 2014 12:48 PM | Updated on Sep 2 2017 11:28 AM

ఢిల్లీలో ఘోరం జరిగింది. 30 ఏళ్ల మహిళను ఆమె తమ్ముడే పొడిచి చంపేశాడు. అంతేకాదు.. ఆ తర్వాత పోలీసులకు స్వయంగా తానే ఫోన్ చేసి, అక్కను చంపేసినట్లు చెప్పాడు.

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. 30 ఏళ్ల మహిళను ఆమె సొంత తమ్ముడే కత్తితో పొడిచి చంపేశాడు. అంతేకాదు.. ఆ తర్వాత పోలీసులకు స్వయంగా తానే ఫోన్ చేసి, అక్కను చంపేసినట్లు చెప్పాడు. 30 ఏళ్ల వయసున్న జ్యోతి అనే మహిళను ఆమె తమ్ముడు మొహిందర్ (27) పొడిచి చంపేశాడు. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని ఆర్కె పురం ప్రాంతంలో జరిగింది. ఆర్కె పురం సెక్టార్ 3లో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఉద్యోగం ఏమీ లేని మొహిందర్.. తానే స్వయంగా ఫోన్ చేసి నేరం గురించి చెప్పాడన్నారు. అతడి ఒంటి మీద కడా కొన్ని కత్తి గాట్లు ఉండటంతో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ చికిత్స చేసిన తర్వాత అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అక్కాతమ్ముళ్ల మధ్య ఆస్తి వివాదం వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement