అక్కను కాల్చి చంపిన తమ్ముడు | Brother kills sister for voting in Pakistan | Sakshi
Sakshi News home page

అక్కను కాల్చి చంపిన తమ్ముడు

Dec 3 2015 11:33 AM | Updated on Sep 3 2017 1:26 PM

అక్కను కాల్చి చంపిన తమ్ముడు

అక్కను కాల్చి చంపిన తమ్ముడు

తన మాట ఖాతరు చేయలేదని సొంత అక్కనే కడతేర్చాడో తమ్ముడు.

ఇస్లామాబాద్: తన మాట ఖాతరు చేయలేదని సొంత అక్కనే కడతేర్చాడో తమ్ముడు. పాకిస్థాన్ లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తన మాట వినకుండా ఓటు వేసిందన్న కోపంతో నిందితుడు డానిష్ అలీ(20) ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. పశ్చిమ ఇస్లామాబాద్ కు 15 మైళ్ల దూరంలో ఉన్న తాజిలా పట్టణంలో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న డానిష్ అలీ అక్క ఆసిఫా నొరీన్(32) స్థానిక ఎన్నికల్లో ఓటు వేసింది. ఓటు వేయొద్దని అంతకుముందే ఆమెకు అలీ హెచ్చరించాడు. తన మాట కాదని ఓటు వేసిందన్న కోపంతో ఆసిఫాను తుపాకీలో అలీ కాల్చిచంపాడని పోలీసులకు వారి తండ్రి అబ్బాస్ తెలిపాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement