breaking news
Taxila Town
-
‘తక్షశిల జోలికి వెళ్లొద్దు’.. పాక్‌కు యునెస్కో హెచ్చరిక
పాకిస్థాన్‌లోని వేదకాలపు నాటి తక్షశిలలో ప్రభుత్వం చేపడుతున్న పరిరక్షణ పనులపై ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగం యునెస్కో హెచ్చరించింది. ఈ పురాతన కట్టడాల సంరక్షణ పనుల్లో సిమెంట్ వాడటమే కాక, ఇతర ఆధునిక ముడి పదార్థాలు వినియోగించడాన్ని గుర్తించింది. ఇది యునెస్కో నిబంధనలకు విరుద్ధమని పేర్కొని, ప్రపంచ వారసత్వ ప్రదేశ జాబితాలోంచి తక్షశిల తొలగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది. పాకిస్థాన్ పురావస్తు శాఖ ఇటీవల తక్షశిలలో ప్రారంభించిన పునరుద్ధరణ పనుల్లో సిమెంట్ వినియోగించింది. తద్వారా పురావస్తు స్మారక చిహ్నాలను పరిరక్షించడానికి యునెస్కో అంతర్జాతీయంగా ఆమోదించిన సూత్రాలను ఉల్లంఘించింది.పాకిస్తాన్ ప్రస్తుతం ఖైబర్ పఖ్తున్వాలోని బునెర్‌లో ఉన్న బౌద్ధ క్షేత్రమైన రాణి ఘాట్‌తో పాటు సింధ్‌లోని థట్టాలో ఉన్న స్కిథో-పార్థియన్, బౌద్ధ క్షేత్రమైన భాన్భోర్ వంటి ప్రదేశాలకు ప్రపంచ వారసత్వ హోదాను కోరుతోంది. అయితే తాజాగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ చర్చల సమయంలో తక్షశిల వివాదం పాక్ చేసిన ప్రతిపాదనలకు ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. -
అక్కను కాల్చి చంపిన తమ్ముడు
ఇస్లామాబాద్: తన మాట ఖాతరు చేయలేదని సొంత అక్కనే కడతేర్చాడో తమ్ముడు. పాకిస్థాన్ లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తన మాట వినకుండా ఓటు వేసిందన్న కోపంతో నిందితుడు డానిష్ అలీ(20) ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. పశ్చిమ ఇస్లామాబాద్ కు 15 మైళ్ల దూరంలో ఉన్న తాజిలా పట్టణంలో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న డానిష్ అలీ అక్క ఆసిఫా నొరీన్(32) స్థానిక ఎన్నికల్లో ఓటు వేసింది. ఓటు వేయొద్దని అంతకుముందే ఆమెకు అలీ హెచ్చరించాడు. తన మాట కాదని ఓటు వేసిందన్న కోపంతో ఆసిఫాను తుపాకీలో అలీ కాల్చిచంపాడని పోలీసులకు వారి తండ్రి అబ్బాస్ తెలిపాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


