అక్రమ సంబంధం ఉందని.. చెల్లిని చంపేశాడు! | Girl strangulated by brother over affair with neighbour | Sakshi
Sakshi News home page

అక్రమ సంబంధం ఉందని.. చెల్లిని చంపేశాడు!

May 25 2015 7:47 PM | Updated on Sep 3 2017 2:40 AM

ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న కోపంతో.. తన సొంత చెల్లెలిని మెడకు కరెంటు వైరు బిగించి చంపేశాడో అన్నయ్య.

ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న కోపంతో.. తన సొంత చెల్లెలిని మెడకు కరెంటు వైరు బిగించి చంపేశాడో అన్నయ్య. మీరట్ సమీపంలోని లీసా రే గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నజియా అలియాస్ లజ్జో (18) అనే అమ్మాయిని ఆమె సొంత అన్న మహ్మద్ యాసిన్ (25) పీకకు కరెంటువైరు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.

అనంతరం అతడు నేరుగా వెళ్లి పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఆ అమ్మాయికి తన పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, దాంతో యాసిన్ ఆగ్రహం చెందాడని పోలీసులు తెలిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement