దోపిడీలు చేసేందుకే ఆయుధాలు చోరీ | Three army personnel assisted Mallesh in the theft of army weapons in Bollaram | Sakshi
Sakshi News home page

దోపిడీలు చేసేందుకే ఆయుధాలు చోరీ

Oct 4 2026 4:47 AM | Updated on Oct 4 2026 4:47 AM

Three army personnel assisted Mallesh in the theft of army weapons in Bollaram

వివరాలు వెల్లడిస్తున్న మల్కాజ్‌గిరి కమిషనర్‌ సుమతి

బ్యాంకులు, జ్యువెల్లరీ షాపులలో దొంగతనాలకు వినియోగించేలా ప్రణాళిక

మల్లేశ్‌కు సహకరించిన ముగ్గురు ఆర్మీ సిబ్బంది

సాక్షి, హైదరాబాద్‌: బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ఎలాంటి ఉగ్రకోణాలు లేవని, ఆయుధాలతో బెదిరించి చోరీలు చేయాలనే ఉద్దేశంతోనే దొంగతనం చేశారని మల్కాజ్‌గిరి కమిషనర్‌ సుమతి  వెల్లడించారు. ఇక్కడి నుంచి ఎత్తుకెళ్లిన ఆయుధాలను బ్యాంకులు, జ్యువెల్లరీ షాపులలో చోరీలకు వాడాలనుకున్నారని, ధనవంతులను బెదిరించి దోపిడీ చేయాలని నిందితులు కుట్ర చేసినట్లు సీపీ తెలిపారు. 

ప్రధాన నిందితుడు మాజీ హవల్దార్‌ ఉప్పుతోళ్ల మల్లేష్‌ కస్టడీ విచారణలో తెలిపిన వివరాల ఆధారంగా మల్లేష్‌ అన్న మల్లిఖార్జున్, స్నేహితుడు నిరంజన్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అక్రమ ఆయుధాల వ్యాపారులు ఆవి డే అలియాస్‌ ఓబీ, బీర్బల్‌ షా, ప్రకాశం జిల్లా మర్కాపురానికి చెందిన సిపాయి కొండూరి శేషులు, నాయక్‌ వినోద్‌ కుమార్, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన హవల్దార్‌ ప్రవీణ్‌లను అరెస్ట్‌ చేసి, జ్యూడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. వివరాలను కమిషనర్‌ శనివారం మీడియాకు వెల్లడించారు. మల్లేశ్‌ది ముందు నుంచి నేర స్వభావమే. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తన అన్న మల్లికార్జున్, స్నేహితుడు నిరంజన్‌లతో కలిసి పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. బ్యాంక్‌లు, జ్యువెల్లరీ షాపులు, ధనవంతుల ఇళ్లపై దాడి చేసి దోపిడీలు చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే భయాందోళనలు సృష్టించేందుకు ఆయుధాలు అవసరమని భావించిన మల్లేష్‌.. తాను పనిచేసే బొల్లారం ఆర్మీ క్యాంపస్‌ నుంచే చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. తనతో కలిసి పనిచేసిన సహచరులు సిపాయి కొండూరి శేషులు, నాయక్‌ వినోద్‌ కుమార్, హవిల్దార్‌ ప్రవీణ్‌లను సంప్రదించాడు. వారి సహకారంతో కోట్, మేగజైన్‌ తాళాలు పగలగొట్టి ఆయుధాలు, తూటా లు చోరీ చేశారు. పశి్చమ బెంగాల్‌కు చెందిన ఆయుధ వ్యాపారి ఓబీకి విక్రయించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మల్లేష్‌ పోలీసులకు దొరికిపోవడంతో డీల్‌ కుదరలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement