ప్రయాగ్‌రాజ్ : డబ్బు, ఆస్తి మీద విపరీమైన వ్యామోహంతో ఎంతటి దారుణానికైనా తెగ బడుతున్నారు మనుషులు. మానవ విలువల్ని, బంధాల్ని బంధుత్వాల్ని మరిచి సొంత తల్లిదండ్రులను, తోగబుట్టిన సోదరిని హత్య చేశాడో దుర్మార్గుడు. చివరికి అతను కూడా అదే అత్యాశకు బలైపోయాడు. ఉత్తర ప్రదేశ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని భవనంలోఈ దారుణ ఘటన వెలుగు చూసింది. కర్మ ఎవరిని విడిచిపెట్టదనే సూత్రం వీరి విషయంలో అక్షరాలా నిజమైంది.
పోలీస్ కమిషనర్ జోగేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ మలకా ప్రాంతంలో ఉన్న ఒక కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో వివాదం నెలకొంది. వీరేంద్ర వైశ్య, ఆయన భార్య తమ ఆస్తి నుండి కుమారుడు అభిషేక్‌కు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో వారి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు అభిషేక్. తల్లిదండ్రులు, సోదరిని చంపడానికి ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే తన స్నేహితుడు సన్నీ గుప్తాను ఇంటికి పిలిపించు కున్నాడు. ప్లాన్ ప్రకారం వారిని మట్టుబెట్టాడు. ఆ తర్వాత, ఇద్దరూ కలిసి ఇంటో దొంగిలించిన విలువైన వస్తువులను పంచుకోవడానికి గ్రౌండ్ ఫ్లోర్‌లోని దుకాణానికి వెళ్లారు. అయితే ఈ పంపకాల సమయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో ఏరాడ్‌తో అయితే తల్లిదండ్రులను హత్య చేశాడో అదే రాడ్‌తో అభిషేక్‌ను హత్య చేసి, శవాన్ని దుకాణంలోనే వదిలేసి, షాప్‌కు తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు సన్నీ.
రెండు రోజుల తరువాత ఆ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా భయంకరమైన దృశ్యం కనిపించింది. మే 31 సాయంత్రం అభిషేక్, గుప్తాతో కలిసి వీరేంద్ర, అనిత, మీనాక్షిలను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో వీరేంద్ర వైశ్య (70), ఆయన భార్య అనిత (65), కుమార్తె మీనాక్షి (45) మృతదేహాలను స్వాధీనం తీసుకున్నారు.
మొదట, అభిషేక్ హంతకుడై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావించి, అతని కోసం గాలించారు.. కానీ మృతదేహాలపై డిటర్జెంట్, శుభ్రపరిచే రసాయనాలుపూసి ఉండటంతో, రక్తపు మరకలున్న టీ-షర్టు, కుటుంబ కలహాలు, ఆభరణాలచోరీ , నకిటీ నోట్ ఆధారంగా హత్య పథకాన్ని వారు వెలికితీశారు. అదే భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న తాళం వేసిన దుకాణాన్ని బలవంతంగా తెరిచారు. అక్కడ అభిషేక్ వైశ్య (40) మృతదేహం లభించింది. సిసిటివి ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలించి నిందితుడైన సన్నీ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. అతడినుంచి బంగారం, 360 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.
ఫ్యామిలీ బిజినెస్
వీరేంద్ర వైశ్య ఆ ప్రాంతంలో పేరున్న వ్యాపారవేత్త. భార్య అనిత, కుమార్తె మీనాక్షి, పెద్ద కుమారుడు అభిషేక్‌తో కలిసి ఆ భవనంలో నివసించేవాడు. కింది అంతస్తులో సుమారు 15 నుండి 16 దుకాణాలు ఉండేవి, వాటిలో చాలా వరకు అద్దెకు ఇచ్చి, ప్రతి నెలా లక్ష రూపాయలకు పైగా ఆదాయాన్ని ఆర్జించేవి. లిక్విడ్ డిటర్జెంట్ మరియు టాయిలెట్ క్లీనర్‌లతో సహా వెస్టిజ్ ఉత్పత్తులను అమ్మే దుకాణాన్ని అభిషేక్ నడిపేవాడు. మరొకటి మీనాక్షికి చెందింది. ఆమె ఇటీవలే ఒక గిఫ్ట్ గ్యాలరీ వ్యాపారాన్ని ప్రారంభించింది.
చిన్నకొడుకుతో విభేదాలు, తప్పుడు నోట్
కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు, సుమారు 15 ఏళ్ల క్రితం వీరేంద్ర తన చిన్న కొడుకు అశ్వినిని తన కొడుకు కాదని వదిలేశాడని సమాచారం. ఆ కుటుంబంలో ఆస్తి తగాదాలు పదేపదే తలెత్తుతూ ఉండేవి. వీరిద్దరినీ బంటీ, బబ్లూ అని పిలిచేవారు. ఈ హత్యను తప్పు దారి పట్టించేందుకు బంటీ , కోడలు బబ్లూనే చంపారు అనే నోట్ వదిలారు. అయితే వివాహ వెబ్‌సైట్ మోసాలకు సంబంధించిన ఒక కేసులో అశ్విని, రితు 2024లో జైలు పాలయ్యారు.


