వనస్థలిపురంలో షాకింగ్‌ ఘటన.. పాల వ్యాపారి దారుణ హత్య! | hyderabad-vanasthalipuram-milk-vendor-murder | Sakshi
Sakshi News home page

వనస్థలిపురంలో షాకింగ్‌ ఘటన.. పాల వ్యాపారి దారుణ హత్య!

Sep 18 2026 7:44 AM | Updated on Sep 18 2026 7:47 AM

hyderabad-vanasthalipuram-milk-vendor-murder

హైదరాబాద్‌: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పాల వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఎన్‌జీవోస్‌ కాలనీ బస్‌స్టాప్‌ సమీపంలో పాల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలు, దుండగుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: రైలు కిందపడి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య.. జేబులో ‘నాన్న’ నంబర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement