ఎమ్మెల్యే దానం అనర్హతపై హైకోర్టు తీర్పు నేడే | Telangana High Court Verdict On Danam Disqualification Petition Updates | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే దానం అనర్హతపై హైకోర్టు తీర్పు నేడే

Sep 18 2026 7:42 AM | Updated on Sep 18 2026 7:47 AM

Telangana High Court Verdict On Danam Disqualification Petition Updates

సాక్షి, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ‘అనర్హత’అంశంలో స్పీకర్‌ తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లలో హైకోర్టు ఇవాళ(శుక్రవారం) తీర్పు వెలువరించనుంది. మధ్యాహ్నం 3:45 గంటలకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వనుంది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌.. కాంగ్రెస్‌లో చేరారని ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన స్పీకర్‌ (ట్రిబ్యునల్‌ చైర్మన్‌ హోదాలో).. చట్టపరంగా ఆయన పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ఇవాళ దానం పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు తీర్పు చెప్పనుంది.

ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో సెగలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement