లవ్ ఎఫైర్ ముందే పసిగట్టిన కేతన్? | siya having an affair ketan agarwal raised doubts over fiances link with chetan | Sakshi
Sakshi News home page

లవ్ ఎఫైర్ ముందే పసిగట్టిన కేతన్?

Jun 30 2026 7:59 PM | Updated on Jun 30 2026 8:25 PM

siya having an affair ketan agarwal raised doubts over fiances link with chetan

ముంబై: పూణేకి చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో రోజుకో మలుపు తిరుగుతుంది.తనకు కాబోయే భార్య సియా గోయల్ ప్రవర్తనపై కేతన్‌కు మొదటి నుంచే అనుమానాలు ఉన్నాయని.. పెళ్లికి ముందు ఆమె బ్యాక్‌గ్రౌండ్‌సర్గిగా చెక్‌చేశారా లేదా అని ఆయన తన కుటుంబ సభ్యులను గట్టిగా నిలదీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విచారణలో కేతన్ తండ్రి ఈ వివరాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

తండ్రి వద్ద ఈవిషమమై ఆందోళన వ్యక్తం చేసిన కేతన్

పోలీసుల కథనం ప్రకారం... సియా ప్రవర్తన, ఆమె మాటల్లో పదే పదే 'చేతన్ చౌదరి' పేరు రావడంపై కేతన్ తనతో పలుమార్లు మాట్లాడాడు.  జూన్ 6న ప్లాన్ చేసిన ప్రీ-వెడ్డింగ్ బాలి (ఇండోనేషియా) ట్రిప్ రద్దయినప్పటి నుండి కేతన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. సియా చిన్న చిన్న విషయాలకే తనతో గొడవ పడుతోందని తండ్రికి చెప్పాడు. అయితే, ఆమె వయసులో చిన్నదని, తాము ఆమెకు నచ్చజెబుతామని తండ్రి కేతన్‌ను ఊరడించారు. 

కేతన్ ఫోన్ చేసినప్పుడల్లా సియా ఫోన్ బిజీగా వచ్చేదని, వారి సంభాషణల్లో ఆమె తరచూ చేతన్ గురించి ప్రస్తావించేదని కేతన్ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. కేతన్ ఇన్ని అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, గోయల్ కుటుంబం తమ బంధువులకు తెలిసినవారే కావడంతో ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేతన్ కుటుంబ సభ్యులు అతనికి నచ్చజెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది.

లోహగఢ్ కోట పర్యటన తర్వాత పెరిగిన అనుమానం
జూన్ 14న లోహగఢ్ కోటను సందర్శించి వచ్చిన తర్వాత, కేతన్ మళ్లీ తన తండ్రిని కలిసి... అసలు పెళ్లి నిశ్చయించే ముందు సియా గురించి పూర్తిస్థాయిలో బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేశారా లేదా అని గట్టిగా నిలదీశాడు. సియా ప్రవర్తన రోజురోజుకూ అనుమానాస్పదంగా మారుతోందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడని తెలిపారు. అయినప్పటికీ వారు పెద్దగా పట్టించుకోలేదని పేర్కొన్నారు.

లవ్ ట్రయాంగిల్... చివరకు దారుణ హత్య
పూణేకి చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్‌కు, సియా గోయల్ కు ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, అప్పటికే చేతన్ చౌదరి (22) అనే యువకుడితో ప్రేమలో ఉన్న సియా, కేతన్‌ను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది.జూన్ 18న లోహగఢ్ కోటపైకి కేతన్‌ను తీసుకెళ్లిన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి అతడిని కొండపై నుండి కిందకు తోసి దారుణంగా హత్య చేశారు.

సియా పాయింట్'గా మారిన ఘటనా స్థలం
ఈ ఘోర హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత, పూణేలోని లోహగఢ్ కోటకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. కేతన్‌ను ఏ పాయింట్ నుండి అయితే కిందకు నెట్టేశారో, ఆ క్రైమ్ స్పాట్‌ను స్థానికులు, సందర్శకులు ఇప్పుడు 'సియా పాయింట్' అని పిలుస్తూ, ఆ స్థలాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున టూరిస్టులు తరలివస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement