breaking news
lohagad fort case
-
నోరు విప్పితే నిన్నూ తోసేస్తాం!
పుణె యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ మృతి కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. లోహగఢ్ కోటపై కేతన్‌ను కొండ నుంచి తోసేయడాన్ని తాను కళ్లారా చూశానని ఓ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అంతేకాదు.. ఈ విషయం బయటకు చెబితే తనకూ అదే గతి పడుతుందని బెదిరించారని చెప్పాడు. స్థానిక మీడియా కథనాల ద్వారా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఆ ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. జూన్ 18న కేతన్ తన కాబోయే భార్య సియా గోయల్‌తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లాడు. ఆ వెనక మరో వ్యక్తి కూడా వారిని అనుసరించాడు. అదే సమయంలో ఆ సాక్షి తన స్నేహితుడి కుటుంబంతో కోటకు వెళ్లాడు. మెట్లపై ఓ జంట ముందుగా వెళ్తుంటే.. వారి వెనుక హూడీ ధరించిన ఓ వ్యక్తి కనిపించాడు. వేసవి కాలంలో హూడీ ఎందుకు వేసుకున్నావని అతడిని నవ్వుతూ ప్రశ్నించా. అలా ఆ వ్యక్తి ముఖం నాకు గుర్తుండిపోయింది..కోటపైకి చేరుకున్న తర్వాత ఆ హుడీలో ఉన్న వ్యక్తి ఓ ఆలయం వద్ద కాసేపు కూర్చున్నాడు. అనంతరం కేతన్, సియాల వెంట వెళ్లాడు. కాసేపు అక్కడి నుంచి దూరంగా వెళ్లి తిరిగి వస్తుండగా.. సియా ఆ హుడీ వేసుకున్న వైపు చూపించడం కనిపించింది. ఆ తర్వాత సియా కింద కూర్చుని కేతన్ కాలిపై తన్నింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముసుగలో ఉన్న వ్యక్తి వెనుక నుంచి వచ్చి కేతన్‌ను కొండ అంచు వైపు తోసిశాడు..నోరు విప్పితే నీకూ అదేగతి!ఘటన తర్వాత నాకు కాళ్లు చేతులు వణికాయి. ధైర్యం తెచ్చుకుని ఆ హుడీ వేసుకున్న వ్యక్తిని ఆపాను. ఎందుకు అలా చేశావ్? అని నిలదీశాను. ఆ వ్యక్తి కోపంతో రగిలిపోయాడు. ఎవరి దగ్గర అయినా ఈ విషయం చెబితే నిన్నూ అలా తోసేసి చంపుతా అని బూతులు తిడుతూ బెదిరించాడు. ఆ టైంలో ఆ విషయాన్ని నా స్నేహితుడికి కూడా చెప్పలేదు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడ్డాను.అయితే కేతన్ కేసుపై మీడియాలో వస్తున్న కథనాలు చూసి షాక్ తిన్నా. కళ్లారా చూసింది చెప్పాలని పోలీసులను సంప్రదించా. ఐదు రోజుల తర్వాత అంటే.. జూన్ 23న నా వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు అని లోకల్ మీడియాతో ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.హూడీ.. కీలక గుర్తింపుఈ కేసులో మరో సాక్షి వాంగ్మూలం కూడా పోలీసుల దృష్టిలోకి వచ్చింది. లోహగఢ్ కోట ఎక్కుతున్న సమయంలో హూడీ వేసుకున్న చేతన్‌ను అతడూ గమనించినట్లు తెలుస్తోంది. ఎండాకాలంలో హూడీ ఎందుకు వేసుకున్నావని ప్రశ్నించగా.. చేతన్ క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సాక్షి తెలిపినట్టు సమాచారం. దీంతో హూడీ.. చేతన్ గుర్తింపును నిర్ధారించడంలో కీలకమైన అంశంగా మారింది.12 టెరాబైట్ల డేటా..కేవలం ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలపైనే కాకుండా డిజిటల్ ఆధారాలపైనా పోలీసులు దృష్టి పెట్టారు. దర్యాప్తులో దాదాపు 12 టెరాబైట్ల సాంకేతిక డేటాను విశ్లేషించినట్లు సమాచారం. ఆరు మొబైల్ ఫోన్లు, తొమ్మిది పెన్‌డ్రైవ్‌లు, బ్యాకప్‌లు, కాల్ రికార్డులు, సోషల్ మీడియా ఖాతాల నుంచి సమాచారాన్ని పరిశీలించారు. డిలీట్ చేసిన చాట్స్, ఇతర డేటాను ఫోరెన్సిక్ పద్ధతుల్లో తిరిగి పొందినట్లు పోలీసులు చెబుతున్నారు.కేతన్ మృతికి ముందు, తర్వాత డేటా తొలగింపునకు సంబంధించిన కొన్ని సెర్చ్‌లు కూడా దర్యాప్తులోకి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఐఫోన్లో డేటా ఎలా తొలగించాలి, చాట్ హిస్టరీని ఎలా క్లియర్ చేయాలి, డిలీట్ చేసిన సమాచారాన్ని తిరిగి పొందకుండా ఎలా చేయాలన్న అంశాలపై సెర్చ్‌లు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.5,053 పేజీల ఛార్జ్షీట్కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోటపై నుంచి పడి మృతి చెందినట్లు తొలుత భావించారు. అయితే దర్యాప్తులో ఇది ప్రమాదం కాదని, పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. సియా గోయల్, చేతన్ చౌదరి, అతడి స్నేహితుడు రితేశ్ హంగేను నిందితులుగా పేర్కొంటూ పుణె రూరల్ పోలీసులు 5,053 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందులో సుమారు 80–85 మంది సాక్షుల వాంగ్మూలాలతో పాటు డిజిటల్ ఆధారాలు, కాల్ రికార్డులు, ఫొటోలు, సీసీటీవీ ఫుటేజీ తదితర వివరాలను పొందుపరిచారు.పోలీసుల ప్రకారం.. కేతన్‌ను లోహగఢ్‌కు రప్పించేందుకు నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించారు. అక్కడ సియా ముందుగా కేతన్‌ను తోసిందని, ఆ తర్వాత చేతన్ తన్నడంతో అతడు లోయలో పడిపోయాడని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. తాజాగా ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం కూడా వెలుగులోకి రావడంతో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. దీంతో కేతన్ మృతి వెనుక అసలు ఏం జరిగిందన్న దానిపై దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది.ఇదీ చదవండి: బోరుబావి నుంచి బయటకు తీసేలోపే.. -
లోహగఢ్ కోట.. కేతన్ హత్యలో మరో షాకింగ్ ట్విస్ట్
మహారాష్ట్రలోని పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘గుట్టు రట్టయితే గుండెల్లో గుబులు’ అన్నట్టుగా పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె సన్నిహితుడు చేతన్ చౌదరి అరెస్టు కాగా.. తాజాగా వారి కుట్రలో భాగమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రితేష్ హాంగే కూడా పోలీసులకు చిక్కాడు. దీంతో ఈ కేసులో అసలు కథ మరింత ఆసక్తికరంగా మారింది.మూడో నిందితుడు అరెస్ట్జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్‌ను కొండపై నుంచి తోసి హత్య చేసిన కేసులో 22 ఏళ్ల రితేష్ హాంగేను పుణె రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రితేష్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య మూడుకు చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రితేష్ హాంగే ప్రధాన నిందితుడు చేతన్ చౌదరికి స్నేహితుడు. కేతన్ హత్యకు సంబంధించిన కుట్రలో రితేష్ కూడా భాగస్వామిగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేతన్‌ను హత్య చేయాలన్న ప్లాన్ గురించి అతడికి ముందే తెలుసునని పోలీసులు వెల్లడించారు.ముందు పెళ్లిని అడ్డుకోవాలనుకున్నారు..‘అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి’ అన్నట్టుగా ఈ హత్య వెనుక మొదట మరో ప్లాన్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేతన్, సియా గోయల్ వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో.. పెళ్లిని అడ్డుకునేందుకు సియా, చేతన్ తొలుత కేతన్‌ను తీవ్రంగా గాయపరచాలని భావించినట్లు తెలుస్తోంది. కేతన్ చేతులు, కాళ్లు విరగ్గొట్టి అతడిని గాయపరిస్తే పెళ్లి వాయిదా పడుతుందని వారు భావించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ ప్లాన్ ప్రమాదకరంగా మారొచ్చని భావించిన ఇద్దరూ.. చివరకు ఏకంగా కేతన్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుట్ర గురించి రితేష్‌కు కూడా ముందుగానే తెలుసునని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న కంగనా.. పక్కా స్కెచ్.. కేతన్ మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ‘పాము చావాలి.. కర్ర విరగకూడదు’ అన్నట్టుగా హత్య చేసినా తమపై అనుమానం రాకుండా ఉండేందుకు పలు మార్గాలను అన్వేషించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ఇంటర్నెట్లో సమాచారం వెతికినట్లు, సస్పెన్స్ సినిమాలను కూడా చూసినట్లు పోలీసులు తెలిపారు. టైగర్ పాయింట్, విసాపూర్ కోటతో పాటు పూణే పరిసరాల్లోని మరికొన్ని కోటలను నిందితులు పరిశీలించారు. ఆయా ప్రాంతాల ఫొటోలను పరస్పరం పంపించుకుని.. కేతన్ మరణాన్ని ప్రమాదంగా చూపించేందుకు ఏ ప్రదేశం అనువుగా ఉంటుందో అంచనా వేశారు. చివరకు లోహగఢ్ కోటను ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.హత్య తర్వాత రితేష్‌కు ఫోన్..అనుకున్నట్టుగానే జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్‌ను కొండపై నుంచి తోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం చేతన్.. తన స్నేహితుడు రితేష్‌కు ఫోన్ చేసి కేతన్ హత్యకు సంబంధించిన విషయాన్ని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో రితేష్ పాత్రకు సంబంధించిన ఆధారాలు లభించడంతో అతడిని అరెస్ట్ చేసినట్లు పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేతన్ హత్యకు ముందు జరిగిన కుట్ర, ముగ్గురు నిందితుల మధ్య జరిగిన సంభాషణలు, హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు రితేష్‌ను పోలీసులు విచారిస్తున్నారు. -
ప్లాన్-ఏకి భయపడి.. ప్లాన్-బీతో ఘాతుకం!
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరిన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌తో వివాహం ఇష్టం లేకనే సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడో షాకింగ్ విషయం బయటపడింది. ప్లాన్ ఏకు భయపడి.. ప్లాన్ బీను అమలు చేసి సియా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. కేతన్, సియాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. అయితే చేతన్‌తో ప్రేమలో ఉన్న సియా మాత్రం ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఓవైపు కేతన్‌తో సన్నిహితంగా ఉంటూనే.. మరోవైపు ప్రియుడితో దారుణమైన స్కెచ్‌లు గీసింది. ఇందుకోసం వెబ్ సిరీస్‌లు, క్రైమ్ సినిమాలు చూస్తూ గంటల తరబడి గడిపింది. చివరకు.. చేతన్‌తో కలిసి ఈ పెళ్లి ఆపడానికి రెండు ప్లాన్లు గీసింది. అందులో.. మొదటిది కేతన్కు యాక్సిడెంట్ చేయడం!. అతడిని గాయపరిచి పెళ్లిని వాయిదా వేయాలని.. ఆ తర్వాత కలిసి పారిపోవడమో లేదంటే ఈ గ్యాప్‌లో మరేదైనా ప్లాన్ అమలు చేయాలని భావించింది. అయితే ఆ ప్లాన్‌లో రిస్క్ ఎక్కువగా ఉందని భావించి డ్రాప్ అయ్యారు. కేతన్‌ను ఈ విషయం తెలిసిపోతే తమ పని అయిపోయినట్లేనని భయపడ్డారు. ఒకవేళ ప్లాన్ బెడిసి కొట్టి బలవంతంగా పెళ్లి జరిగితే ఆ తర్వాత తమ బంధం కొనసాగదని భావించారు. అందుకే ప్లాన్ బీ అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. పక్కా ప్లాన్ గీసి కేతన్‌ను అంతమొందించారు. సస్పెన్స్ సినిమాలు.. ఆన్లైన్ సెర్చ్లుహత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం సస్పెన్స్ సినిమాలు చూసారని, హత్య తర్వాత ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఇంటర్నెట్లో సమాచారం వెతికారని తెలిపారు. సియా ఫోన్ హిస్టరీలో ఈ విషయం బయటపడిందని తెలిపారు. అంతేకాదు.. కేతన్‌ను ఎక్కడ హత్య చేస్తే అది ప్రమాదంలా కనిపిస్తుందో తెలుసుకునేందుకు పలు ప్రాంతాలను పరిశీలించినట్లు వెల్లడించారు. లోనావాలాలోని టైగర్ పాయింట్, విశాపూర్ కోట తదితర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత లోహగఢ్ కోటను ఎంచుకున్నారని చెప్పారు.ముందుగానే రెక్కీ చేసిన సియా?దర్యాప్తులో భాగంగా సియా మే 31న కేతన్‌తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పర్యటన హత్యకు ముందు చేసిన రెక్కీ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అక్కడ ఎక్కడ నుంచి తోసేస్తే కేతన్ మృతి చెందుతాడు.. ఆధారాలు దొరకకుండా ఎలా చేయాలనే విషయాలను పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత జూన్ 3న మరోసారి అక్కడికి వెళ్లేందుకు కేతన్‌ను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.బాలి ట్రిప్ కూడా కుట్రలో భాగమేనా?సియా, కేతన్‌లు జూన్ 6న ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఎనిమిది రోజుల పాటు అక్కడ గడపాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ ప్రయాణం తమ కుట్రకు అడ్డుగా మారుతుందని భావించిన నిందితులు.. ఎలాగైనా ఆ పర్యటనను ఆపాలని ప్రయత్నించారు. ముంబై పర్యటన సమయంలో సియా కేతన్ పాస్‌పోర్ట్‌ను దొంగిలించిందని.. దీంతో బాలి ప్రయాణం రద్దయిందని పోలీసులు తెలిపారు.ముందే ఒకసారి హత్యాయత్నం?లోహగఢ్ కోట వద్ద జూన్ 14న సియా కేతన్‌ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేతన్ ఓ పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ఆ సమయంలో అనుమానం రాకుండా.. పాము నుంచి కాపాడేందుకు తానే తోశానని సియా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత జూన్ 18న మరోసారి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. చేతన్‌తో కలిసి కేతన్‌ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని కొత్త విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. -
కేతన్ అగర్వాల్ ఇంట మరో విషాదం
పూణే: మహారాష్ట్రలోని పూణే సమీపంలోని లోహగఢ్ కోట వద్ద జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే, ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. తన మనవడి హఠాన్మరణాన్ని తట్టుకోలేక కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ (71) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. జూన్ 18న లోహగఢ్ కోటపై నుంచి పడి కేతన్ మృతి చెందినప్పటి నుంచి దేవీచంద్ తీవ్ర మనోవేదనతో అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మొదట ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా భావించిన ఈ ఘటనను, పథకం ప్రకారం జరిగిన హత్యగా పూణే రూరల్ పోలీసులు నిర్ధారించారు. కేతన్ కాబోయే భార్య సియా గోయల్, పెళ్లి ఇష్టం లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా తన స్నేహితుడు చేతన్ చౌదరితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఇద్దరినీ కోర్టు జూలై 16 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. లోహగఢ్ కోటపై డమ్మీతో సీన్ రీక్రియేషన్ చేసిన పోలీసులు, లల్లానగర్ మైదానంలో హత్యకు ముందు వారు చేసిన రిహార్సల్స్ ఆధారాలను సేకరించారు. సియా తండ్రి ప్రవీణ్ గోయల్ ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. -
‘జరగని పెళ్లికి టికెట్లు ఎందుకో’..
ముంబై: తన కాబోయే భర్త, వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్, ఆమె స్నేహితురాలి మధ్య జరిగినట్లుగా భావిస్తున్న ఒక స్నాప్‌చాట్ సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ మహారాష్ట్ర పోలీసులు సంపాదించారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఇక ఆ చాట్‌లో కేతన్‌తో తన పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగబోదని ఒక స్నేహితురాలితో సియా చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్నాప్ చాట్ యాప్‌లో స్నేహితురాలు, సియా మధ్య జరిగిన చాటింగ్ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఇన్ని రోజులు సియా దాచిపెట్టిన మరో ఫోన్లో డేటాను వెలికితీయగా ఈ చాటింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.పెళ్లి, రిసెప్షన్ వేడుకలకు హాజరయ్యే అతిదులకు విమాన టికెట్లు బుక్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా సియా తన ఫ్రెండ్‌కు చాటింగ్‌లో ఒక మెసేజ్ పెట్టింది. 'నీ ఆధార్‌కార్డ్ ముందువైపు వెనుకవైపు ఫోటో తీసి నాకు పంపు. విమాన టికెట్లు నీరు బుక్ చేయాలి . అయినా జరగని పెళ్లికి ఈ టికెట్ల బుకింగ్ గోల ఏంటో. అయినా ఫర్లేదు. ముందయితే నీ ఆధార్ ఫొటోలు పంపు’ అని అందులో రాసింది. అందుకు ‘సరే. నీకు వాట్సాప్ పంపాను. చూసుకో’ అని స్నేహితురాలు బదులిచ్చింది.ఈ చాటింగ్ మే 25వ తేదీన జరిగింది. ఆ తర్వాత జూన్ 18వ తేదీన కేతన్ హత్య జరిగింది. అంటే చాలా రోజుల ముందు నుంటే కుట్రకు సియా పథక రచన చేసిందని పోలీసులు చెబుతున్నారు.కోట నుంచి కేతన్ పారపాటున పడిపోయాడని అందర్నీ నమ్మించేందుకు సియా ఇలా చివరి నిమిషందాకా విమాన టికెట్ల బుకింగ్ వంటి పెళ్లిపనుల్లో బిజీగా ఉన్నట్లు నటించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సియా, చేతన్‌లతో పాటు చేతన్ క్లాస్‌మెట్ ఒకరికి ఈ హత్యకుట్రతో సంబంధం ఉండని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
కేతన్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. సీన్లోకి మూడో వ్యక్తి!
పుణె: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో పుణె పోలీసులు కీలక ఆధారాల్ని సేకరించారు. ఈ కిరాతక హత్యకు సంబంధించి బీడ్ జిల్లాకు చెందిన, బాలేవాడి కంపెనీలో పనిచేస్తున్న మరో వ్యక్తిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరిలతో ఇతనికి పాత పరిచయం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.విచారణ సంస్థల కథనం ప్రకారం.. నిందితులు ఇద్దరూ కేతన్‌ను హతమార్చాలనే తమ కుట్రను ఈ మూడో వ్యక్తితో పంచుకున్నారు. అంతేకాకుండా, జూన్ 18న కేతన్‌ను లోహగఢ్ కోటపై నుండి నెట్టేసిన రోజున, తమతో పాటు రమ్మని అతడిని కోరారు. అయితే, ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడవద్దని వారిని వారించినట్లు తెలుస్తోంది.ఈ నేరపూరిత ప్రణాళిక గురించి అతనికి ఎంతవరకు తెలుసు. ఇందులో అతని పాత్ర ఎంత అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అతని వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ కేసులో మరో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పక్కా ప్రణాళికతో హత్య చేసి, సాక్ష్యాలు దొరకకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవడానికి నిందితులు ఇద్దరూ టీవీ సిరీస్ ‘క్రైమ్ పెట్రోల్’ఎపిసోడ్లను పదే పదే చూసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.అసభ్య ప్రవర్తన కేసు దర్యాప్తులో భాగంగా గురువారం పుణె రూరల్ పోలీసులు సియా గోయల్‌ను ఆమె మార్కెట్ యార్డ్ నివాసానికి తీసుకువెళ్లారు. లోహగఢ్ కోటకు వెళ్లిన సమయంలో ఆమె ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అయితే, దర్యాప్తు ముగించుకుని తిరిగి వాహనంలోకి వెళ్తున్న సమయంలో, అక్కడ కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల కెమెరాల వైపు సియా గోయల్ మధ్య వేలు చూపిస్తూ తీవ్ర అసభ్యంగా ప్రవర్తించడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.25 ఏళ్ల కేతన్ అగర్వాల్‌కు, సియా గోయల్‌కు వచ్చే నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, సియాకు చేతన్ చౌదరితో ఉన్న వివాహేతర సంబంధానికి కేతన్ అడ్డుగా మారాడని భావించిన వీరు జూన్ 18న లోహగఢ్ కోటపై నుండి అతడిని లోయలోకి నెట్టి హత్య చేశారు. పక్కాగా రిహార్సల్స్ చేసి మరీ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురిని కఠినంగా శిక్షించేందుకు పోలీసులు వేగంగా ఆధారాలను సేకరిస్తున్నారు. -
కేతన్ హత్య తర్వాత.. ఆ కోటకు పోటెత్తిన టూరిస్టులు.. కారణం ఇదే!
-
లవ్ ఎఫైర్ ముందే పసిగట్టిన కేతన్?
ముంబై: పూణేకి చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో రోజుకో మలుపు తిరుగుతుంది.తనకు కాబోయే భార్య సియా గోయల్ ప్రవర్తనపై కేతన్కు మొదటి నుంచే అనుమానాలు ఉన్నాయని.. పెళ్లికి ముందు ఆమె బ్యాక్గ్రౌండ్సర్గిగా చెక్చేశారా లేదా అని ఆయన తన కుటుంబ సభ్యులను గట్టిగా నిలదీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విచారణలో కేతన్ తండ్రి ఈ వివరాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.తండ్రి వద్ద ఈవిషమమై ఆందోళన వ్యక్తం చేసిన కేతన్పోలీసుల కథనం ప్రకారం... సియా ప్రవర్తన, ఆమె మాటల్లో పదే పదే 'చేతన్ చౌదరి' పేరు రావడంపై కేతన్ తనతో పలుమార్లు మాట్లాడాడు. జూన్ 6న ప్లాన్ చేసిన ప్రీ-వెడ్డింగ్ బాలి (ఇండోనేషియా) ట్రిప్ రద్దయినప్పటి నుండి కేతన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. సియా చిన్న చిన్న విషయాలకే తనతో గొడవ పడుతోందని తండ్రికి చెప్పాడు. అయితే, ఆమె వయసులో చిన్నదని, తాము ఆమెకు నచ్చజెబుతామని తండ్రి కేతన్‌ను ఊరడించారు. కేతన్ ఫోన్ చేసినప్పుడల్లా సియా ఫోన్ బిజీగా వచ్చేదని, వారి సంభాషణల్లో ఆమె తరచూ చేతన్ గురించి ప్రస్తావించేదని కేతన్ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. కేతన్ ఇన్ని అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, గోయల్ కుటుంబం తమ బంధువులకు తెలిసినవారే కావడంతో ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేతన్ కుటుంబ సభ్యులు అతనికి నచ్చజెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది.లోహగఢ్ కోట పర్యటన తర్వాత పెరిగిన అనుమానంజూన్ 14న లోహగఢ్ కోటను సందర్శించి వచ్చిన తర్వాత, కేతన్ మళ్లీ తన తండ్రిని కలిసి... అసలు పెళ్లి నిశ్చయించే ముందు సియా గురించి పూర్తిస్థాయిలో బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేశారా లేదా అని గట్టిగా నిలదీశాడు. సియా ప్రవర్తన రోజురోజుకూ అనుమానాస్పదంగా మారుతోందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడని తెలిపారు. అయినప్పటికీ వారు పెద్దగా పట్టించుకోలేదని పేర్కొన్నారు.లవ్ ట్రయాంగిల్... చివరకు దారుణ హత్యపూణేకి చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్‌కు, సియా గోయల్ కు ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, అప్పటికే చేతన్ చౌదరి (22) అనే యువకుడితో ప్రేమలో ఉన్న సియా, కేతన్‌ను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది.జూన్ 18న లోహగఢ్ కోటపైకి కేతన్‌ను తీసుకెళ్లిన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి అతడిని కొండపై నుండి కిందకు తోసి దారుణంగా హత్య చేశారు.సియా పాయింట్'గా మారిన ఘటనా స్థలంఈ ఘోర హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత, పూణేలోని లోహగఢ్ కోటకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. కేతన్‌ను ఏ పాయింట్ నుండి అయితే కిందకు నెట్టేశారో, ఆ క్రైమ్ స్పాట్‌ను స్థానికులు, సందర్శకులు ఇప్పుడు 'సియా పాయింట్' అని పిలుస్తూ, ఆ స్థలాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున టూరిస్టులు తరలివస్తున్నారు. -
లోహగఢ్ కోటకు అమాంతం పెరిగిన రద్దీ
ఒక విషాద ఘటన.. ఇప్పుడు ఓ పర్యాటక ప్రాంతాన్ని కొత్త కారణంతో వార్తల్లోకి తెచ్చింది. వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. అదే ఘటన జరిగినట్లు ప్రచారంలోకి వచ్చిన మహారాష్ట్రలోని లోహగఢ్ కోటకు ఇప్పుడు పర్యాటకుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా కేతన్‌ను తోసేశారని చెబుతున్న ప్రదేశాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతుండటం చర్చనీయాంశంగా మారింది.కేతన్ అగర్వాల్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత లోహగఢ్ కోటకు వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు స్థానికులు, టూరిజం వర్గాలు చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం పర్యాటకుల రద్దీ దాదాపు 25 శాతం పెరిగినట్లు సమాచారం. ఈ కేసులో నిందితురాలు సియా అనే యువతి పేరు పదేపదే వినిపించడంతో.. కేతన్‌ను లోయలోకి తోసేశారని ప్రచారంలోకి వచ్చిన ప్రాంతాన్ని సందర్శకులు ‘సియా పాయింట్’ గా పిలవడం ప్రారంభించారు. అధికారికంగా అలాంటి పేరు లేకపోయినా.. సోషల్ మీడియా ప్రభావంతో ఆ పేరు వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.కోటకు వెళ్లే పర్యాటకులు అక్కడి గైడ్లను, స్థానికులను సియా పాయింట్ ఎక్కడ ఉంది? కేతన్‌ను తోసింది ఇదే ప్రదేశమా? అంటూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆ ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ధోరణిపై స్థానికులు, పర్యాటక రంగానికి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన లోహగఢ్ కోటను ఒక నేర ఘటనతో గుర్తుపెట్టుకోవడం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనాల ఆధారంగా ప్రచారంలోకి వచ్చిన పేర్లను నిజాలుగా భావించొద్దని కూడా సూచిస్తున్నారు.మరో వైపు, ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ లోహగఢ్ కోట కూడా అనూహ్యంగా దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువుగా మారింది. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ కోట.. ఇప్పుడు ఒక సంచలన హత్య కేసు కారణంగా కొత్త గుర్తింపును సొంతం చేసుకోవడం విశేషం. -
కోటి ఇవ్వవా.. పెళ్లి షాపింగ్ చేసుకుంటా!
పూణే: కేతన్ అగర్వాల్ మర్డర్ కేస్.. ఇందులో సియా గోయల్, చేతన్ చౌదరిల పాత్ర చూస్తుంటే థ్రిల్లర్ మలయాళం సినిమా క్రైమ్ స్టోరీ కూడా నథింగ్ అనిపిస్తోంది! నిందితురాలు 20 ఏళ్ల సియా గోయల్, తన ప్రియుడు 22 ఏళ్ల చేతన్ చౌదరితో కలిసి ఈ హత్యకు ముందే పక్కా స్కెచ్ వేసింది. అంతటితో ఆగకుండా, పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. నేరం జరిగిన కొన్నేళ్ల తర్వాత వివాహం చేసుకోవాలంటూ తమ భవిష్యత్తును కూడా ముందే ప్లాన్ చేసుకోవడం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల్ని సైతం విస్మయానికి గురిచేస్తోంది.పెద్దలు నిర్ణయించిన వివాహం చేసుకోవడం ఇష్టం లేని సియా గోయల్, తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను పూణే సమీపంలోని లోహ్‌గఢ్ కోట వద్ద లోయలోకి తోసేసి అత్యంత క్రూరంగా హత్య చేసింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు పలు కీలక విషయాల్ని వెలికి తీశారు.లోహ్‌గఢ్ కోట వద్ద కేతన్ అగర్వాల్‌ను ఎలా హత్య చేయాలి?.. హత్య చేసే సమయంలో కేతన్ తప్పించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి?.. కేతన్‌ను హత్య చేసిన తర్వాత పోలీసులకు అనుమానం రాకుండా పెళ్లెప్పుడు చేసుకోవాలి?.. పెళ్లి చేసుకోవడంతో పాటు సియా, చేతన్ల జీవితం ఎలా ఉండాలి?.. ఇందుకోసం డబ్బులు ఎలా సంపాదించాలి?.. అని వీరంతా ముందే ప్లాన్ చేసినట్లు తేలింది.కేతన్ అగర్వాల్ హత్య తర్వాత తమ భవిష్యత్‌ను కలర్ఫుల్గా తీర్చిదిద్దేందుకు సియా గోయల్, చేతన్ చౌదరి ముందే మాట్లాడుకున్నారు. ఇందులో భాగంగానే, అనుమానం రాకుండా ఉండేందుకు నేరం జరిగిన మూడేళ్ల తర్వాత వివాహం చేసుకోవాలని అనుకున్నారు.ఈ ప్లాన్‌లో భాగంగా సియా.. పెళ్లి షాపింగ్ చేసే సాకుతో కాబోయే భర్త కేతన్ అగర్వాల్ వద్ద నుంచి ఏకంగా రూ.కోటి రూపాయలు తీసుకుంది. ఆ రూ.కోటి మొత్తాన్ని పెళ్లి షాపింగ్‌కు ఖర్చు చేయకుండా, సియా తన ప్రియుడైన చేతన్‌కు ఇచ్చేసింది. చేతన్‌తో పాటు తన భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశ్యంతో.. ఆ కోటి రూపాయలతో చేతన్ లైఫ్ సెటిల్ చేయడం, కొత్త బిజినెస్‌ను ప్రారంభించడం, ఆ తర్వాత కేతన్‌ను హత్య చేసిన మూడేళ్లకు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.ఇదిలా ఉండగా.. ఈ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు మరికొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. లోహగడ్ కోట పైనుంచి కేతన్ అగర్వాల్‌ను లోయలోకి తోసివేయమని ప్రియుడు చేతన్ చౌదరికి సంకేతం ఇవ్వడానికి సియా గోయల్ ఒక వింత ప్లాన్ వేసింది.తాను తోసేసే సమయంలో కింద పడుతూ పడుతూ కేతన్ తనని పట్టుకుంటే.. ఆ కంగారులో సియా కూడా ఎక్కడ లోయలో పడిపోతుందోనని వారు ముందే భయపడ్డారు. అందుకే సియా భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ప్రాణాంతకమైన ఆ తోపుడు సమయంలో కేతన్కు ఆమె ఏమాత్రం అందకుండా ఉండేందుకు, సియా కింద కూర్చోవాలని వారు పక్కాగా స్కెచ్ వేశారు.లోహగడ్ కోటపై నడుస్తున్నప్పుడు.. నీళ్లు తాగడానికో లేదా షూలేసులు కట్టుకునే నెపంతోనో సియా కింద కూర్చోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అలా సియా కింద కూర్చోవడమే చేతన్ చౌదరికి గ్రీన్ సిగ్నల్!ప్లాన్ ప్రకారం.. సియా కింద కూర్చోగానే, వెనుక నుంచి వచ్చిన చేతన్ చౌదరి..కేతన్ అగర్వాల్‌ను గట్టిగా లోయలోకి తోసి చంపేశాడని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ఇది సియాను ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి వారు బాగా ఆలోచించి వేసిన ఘోరమైన ఎత్తుగడ అని పోలీసులు వెల్లడించారు.మరోవైపు, జూన్ 18న కేతన్, సియాలను అనుసరించిన చేతన్ చౌదరి.. కేసులో ఇరుక్కోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. టోల్ ప్లాజాల వద్ద కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు తనను సులభంగా గుర్తిస్తారనే భయంతో.. అతను కారును వాడలేదు. పూణే నుండి లోహగడ్ కోటకు, సుమారు 90 కిలోమీటర్ల దూరం.. ఒక స్కూటర్‌పై ప్రయాణించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హత్యకు ఉపయోగించిన ఆ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు వెల్లడించారు.


