‘జరగని పెళ్లికి టికెట్లు ఎందుకో’.. | Siya Goyal Snapchat message to friend goes viral | Sakshi
Sakshi News home page

‘జరగని పెళ్లికి టికెట్లు ఎందుకో’..

Jul 5 2026 8:04 AM | Updated on Jul 5 2026 8:08 AM

Siya Goyal Snapchat message to friend goes viral

ముంబై: తన కాబోయే భర్త, వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్, ఆమె స్నేహితురాలి మధ్య జరిగినట్లుగా భావిస్తున్న ఒక స్నాప్‌చాట్ సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ మహారాష్ట్ర పోలీసులు సంపాదించారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.  

ఇక ఆ చాట్‌లో కేతన్‌తో తన పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగబోదని ఒక స్నేహితురాలితో సియా చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్నాప్‌ చాట్‌ యాప్‌లో స్నేహితురాలు, సియా మధ్య జరిగిన చాటింగ్ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఇన్ని రోజులు సియా దాచిపెట్టిన మరో ఫోన్లో డేటాను వెలికితీయగా ఈ చాటింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

పెళ్లి, రిసెప్షన్ వేడుకలకు హాజరయ్యే అతిదులకు విమాన టికెట్లు బుక్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా సియా తన ఫ్రెండ్‌కు చాటింగ్‌లో ఒక మెసేజ్ పెట్టింది. 'నీ ఆధార్‌కార్డ్‌ ముందువైపు వెనుకవైపు ఫోటో తీసి నాకు పంపు. విమాన టికెట్లు నీరు బుక్‌ చేయాలి . అయినా జరగని పెళ్లికి ఈ టికెట్ల బుకింగ్ గోల ఏంటో. అయినా ఫర్లేదు. ముందయితే నీ ఆధార్ ఫొటోలు పంపు’ అని అందులో రాసింది. అందుకు ‘సరే. నీకు వాట్సాప్‌ పంపాను. చూసుకో’ అని స్నేహితురాలు బదులిచ్చింది.

ఈ చాటింగ్ మే 25వ తేదీన జరిగింది. ఆ తర్వాత జూన్ 18వ తేదీన కేతన్ హత్య జరిగింది. అంటే చాలా రోజుల ముందు నుంటే కుట్రకు సియా పథక రచన చేసిందని పోలీసులు చెబుతున్నారు.

కోట నుంచి కేతన్ పారపాటున పడిపోయాడని అందర్నీ నమ్మించేందుకు సియా ఇలా చివరి నిమిషందాకా విమాన టికెట్ల బుకింగ్ వంటి పెళ్లిపనుల్లో బిజీగా ఉన్నట్లు నటించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సియా, చేతన్‌లతో పాటు చేతన్ క్లాస్మెట్‌  ఒకరికి ఈ హత్యకుట్రతో సంబంధం ఉండని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement