breaking news
Virat Kohli
-
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపై ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు
టీమిండియా తరఫున పునరాగమనంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్రంగా నిరాశపరిచారు. చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 బరిలో దిగిన రో-కో తాజాగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా రీఎంట్రీ ఇచ్చారు. అయితే, పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 14 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేయగా.. కోహ్లి మరీ ఘోరంగా విఫలమయ్యాడు.ఎనిమిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు కోహ్లి. ఆసీస్‌తో వన్డేల్లో కోహ్లి ఇలా సున్నా చుట్టడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan).. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల ఆట తీరును విమర్శించాడు. గతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT) నాటి కోహ్లి వైఫల్యాలు పునరావృతం అవుతున్నాయని పేర్కొన్నాడు.ఆ వైఫల్యాలే వెంటాడుతున్నాయి.. ఇలా అయితే కష్టంకాగా బీజీటీ టెస్టు సిరీస్‌లో కోహ్లి ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడబోయి దాదాపు ఎనిమిదిసార్లు అవుటైన విషయం తెలిసిందే. మరోవైపు.. రోహిత్ కూడా నాటి సిరీస్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, ఈ ఇద్దరు ఇప్పుడు సరికొత్తగా తిరిగివచ్చారు. టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన రో- కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.ఇక ఫిట్‌నెస్‌కు మారుపేరైన కోహ్లి నెట్స్‌లో చెమటోడ్చి ఆస్ట్రేలియాకు చేరుకోగా.. రోహిత్ ఏకంగా పది కిలోల మేర బరువు తగ్గి మరింత ఫిట్‌గా తయారయ్యాడు. అయితే, ఇద్దరూ రీఎంట్రీలో విఫలం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ..‘‘ఫిట్నెస్ వేరు. మ్యాచ్ ఫిట్నెస్ వేరు. ఆసీస్‌తో తొలి వన్డేలో పరుగులు రాబట్టేందుకు రోహిత్ చాలా కష్టపడ్డాడు. ఇక విరాట్కేమో బీజీటీ కష్టాలు మళ్లీ తిరిగి వచ్చినట్లే కనిపిస్తోంది. అడిలైడ్, సిడ్నీ వన్డేల్లో మాత్రం వీరు కచ్చితంగా లోపాలను అధిగమించి సత్తా చాటుతారనే ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం ఉత్తమంఇక తొలి వన్డేలో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిన నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచన చేశాడు. ‘‘ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పర్యటించేటపుడు.. కాస్త ముందుగానే అక్కడికి వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం ఉత్తమం.నేరుగా వెళ్లి మ్యాచ్‌లు ఆడటం అంటే.. టీమిండియాకు కఠిన సవాలే. అక్కడి పిచ్ పరిస్థితులకు అంత తేలికగా అలవాటుపడలేము. బౌన్సీ పిచ్‌లు మనల్ని పరీక్షిస్తాయి. మన బౌలర్లు తొలి వన్డేలో సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయలేకపోయారు. ఇకనైనా పొరపాట్లు సరిచేసుకుంటే బాగుంటుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ హితవు పలికాడు.చదవండి: IND vs AUS: 244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లి -
244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) తమ అంతర్జాతీయ క్రికెట్ రీ ఎంట్రీ మ్యాచ్‌లో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు నెలల తర్వాత భారత్ తరపున ఆడిన ఈ సీనియర్ ద్వయం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగారు. బౌన్స్ అండ్ ఫాస్ట్ పెర్త్ పిచ్‌పై ఆసీస్ బౌలర్లను ఎదుర్కొవడానికి వీరిద్దరూ ఇబ్బంది పడ్డారు. హిట్‌మ్యాన్ జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో ఓ బౌన్సర్ బంతికి దొరికి పోగా.. స్టార్క్ బౌలింగ్‌లో డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. ఇక ఆడిలైడ్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో అందరి కళ్లుపై వీరిద్దరి పైనే ఉన్నాయి. తొలి వన్డేలో విఫలమైన రో-కో అడిలైడ్లోనైనా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆడిలైడ్ ఓవల్‌లో రోహిత్, కోహ్లి ట్రాక్ రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.కోహ్లి రికార్డు అదుర్స్.. ఈ మైదానంలో కోహ్లికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడిన కోహ్లి.. 61.00 సగటుతో 244 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఈ మైదానంలో అతడు చివరగా 2019లో ఆడాడు. అయితే ఈ ఓవల్ స్టేడియంలోని పిచ్ తొలుత ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించినప్పటికి.. నెమ్మదిగా స్పిన్నర్లు గేమ్‌లోకి వస్తారు. కాబట్టి ఈ మ్యాచ్‌లో కోహ్లి సత్తాచాటే అవకాశముంది. ఈ ఓవల్ మైదానంలో కోహ్లికి టెస్టుల్లో కూడా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 5 టెస్టులు ఆడిన కింగ్ కోహ్లి.. 52.70 సగటుతో 527 పరుగులు చేశాడు. ఈ చారిత్రత్మక మైదానంలో అతడి పేరిట మూడు టెస్టు సెంచరీలు ఉన్నాయి.రోహిత్.. నో హిట్అయితే ఈ మైదానంలో గత రికార్డులు రోహిత్ శర్మను భయపెడుతున్నాయి. అడిలైడ్‌లో హిట్‌మ్యాన్ ట్రాక్ రికార్డు అస్సలు బాగోలేదు. ఇప్పటివరకు ఈ మైదానంలో 6 వన్డేలు ఆడిన ఈ మాజీ కెప్టెన్.. 21.83 సగటుతో కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడ అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 44గా ఉంది. టెస్టుల్లో కూడా రోహిత్ తన మార్క్‌ను చూపించలేకపోయాడు.చదవండి: 352 వికెట్లు.. 10,470 రన్స్.. కట్ చేస్తే! రిటైర్మెంట్తో షాకిచ్చిన టీమిండియా క్రికెటర్ -
ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా ఎదుగుతాడు: నితీశ్ రెడ్డిపై రోహిత్ శర్మ ప్రశంసలు
టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కమార్ రెడ్డి (Nitish Kumar Reddy)పై భారత దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ప్రశంసలు కురిపించాడు. ఈ ఆంధ్ర ఆటగాడు మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటి ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని పేర్కొన్నాడు.అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో జట్టులోకి వచ్చిన నితీశ్ రెడ్డి.. ఇప్పటికే టెస్టుల్లో కీలక ఆటగాడిగా మారాడు. అంతకుముందే టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేసిన ఈ విశాఖ కుర్రాడు.. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌తో వన్డేల్లోనూ అడుగుపెట్టాడు.ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా టీమిండియా దిగ్గజ సారథి రోహిత్ శర్మ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్నాడు నితీశ్ రెడ్డి. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘క్యాప్ నంబర్ 260. నితీశ్ రెడ్డి. నీ ఆటిట్యూడ్, నైపుణ్యాలతో కెరీర్‌ను గొప్పగా ఆరంభించావు. ఇదే జోరును కొనసాగిస్తే వందకు 110 శాతం.. నువ్వు టీమిండియాతో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేస్తావని చెప్పగలను. ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా ఎదగబోతున్నావని అనిపిస్తోంది. నీపై నాకు ఆ నమ్మకం ఉంది. ప్రతి ఫార్మాట్లోనూ ఆడాలన్న నీ కల నెరవేరింది. అందరూ నీకు తోడుగా ఉంటారునీకు జట్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆటగాడిగా నీకేం కావాలో అన్నీ సమకూరుస్తుంది. ఎప్పుడు, ఏం కావాలన్నా అందరూ నీకు తోడుగా ఉంటారు. ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. గుడ్ లక్. నీ కెరీర్ గొప్పగా ఉండాలి’’ అంటూ రోహిత్ శర్మ నితీశ్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఆసీస్‌తో తొలి వన్డేలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ రెడ్డి 11 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌లు, తొమ్మిది టెస్టులు ఆడిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. టెస్టుల్లో ఎనిమిది, టీ20లలో మూడు వికెట్లు తీశాడు.అపుడు కోహ్లి.. ఇపుడు రోహిత్అదే విధంగా ఈ కుడిచేతి వాటం బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఖాతాలో టెస్టుల్లో 386, టీ20లలో 90 పరుగులు ఉన్నాయి. కాగా గతేడాది పెర్త్ వేదికగా భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్న 22 ఏళ్ల నితీశ్ రెడ్డి.. తాజాగా అదే వేదిక మీద రోహిత్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకోవడం విశేషం. తన కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోయే ఈ క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గిల్ సేనకు ఓటమిఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆసీస్‌తో తొలి వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.ఇక డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా తమ ముందు 131 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 21.1 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య గురువారం అడిలైడ్ వేదికగా రెండో వన్డే నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
అదేంటో.. ఎవరికీ అర్థం కాదు: DLS పద్ధతిపై గావస్కర్ విమర్శలు
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం ఆటంకం కలిగించిన కారణంగా 26 ఓవర్లకు ఈ మ్యాచ్‌ను కుదించగా.. భారత్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేసింది.డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యం 131 పరుగులుగా నిర్దేశించగా.. 21.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి కంగారూలు పనిపూర్తి చేశారు. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆసీస్ ఆధిక్యంలో నిలిచింది.అదేంటో.. ఎవరికీ అర్థం కాదుఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డీఎల్ఎస్ (Duckworth–Lewis–Stern method) పద్ధతి ద్వారా లక్ష్యాలు ఎలా నిర్దేశిస్తారో ఎవరికీ అర్థం కాదని వాపోయాడు. ‘‘ఈ మెథడ్ అందరికీ అర్థం అవుతుందని నేను అనుకోను. అయితే, సుదీర్ఘ కాలంగా ఈ పద్ధతినే వాడుతున్నారు.ఇలా మ్యాచ్‌లకు వర్షాలు ఆటంకం కలిగించినపుడు.. గతంలో ఓ భారతీయుడు VJD (వి. జయదేవన్ మెథడ్)మెథడ్‌ను ప్రవేశపెట్టాడు. దేశవాళీ క్రికెట్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇదే ఉపయోగించేది. అయితే, ఇప్పుడు ఉపయోగిస్తున్నారో లేదో తెలియదు.ఇరుజట్లకు సమన్యాయం జరిగేలాఏదేమైనా వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగినపుడు.. ఇరుజట్లకు సమన్యాయం జరిగేలా ఉండే పద్ధతులను వాడితే బాగుంటుంది. లక్ష్యం నిర్దేశించేందుకు ప్రామాణికం ఏమిటో వివరించాల్సి ఉంటుంది’’ అని సునిల్ గావస్కర్ ఇండియా టుడేతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.అదే విధంగా.. భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆసీస్‌తో తొలి వన్డేలో విఫలం కావడంపై కూడా గావస్కర్ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘టీమిండియా ఐదు నెలల క్రితమే చాంపియన్స్ ట్రోపీ గెలిచింది. జట్టు బాగుంది.రో- కో ఒక్కసారి ఫామ్‌లోకి వస్తేరోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తదుపరి మ్యాచ్‌లలో భారీగా పరుగులు రాబట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చాన్నాళ్ల తర్వాత వారు మైదానంలో అడుగుపెట్టారు. నెట్స్‌లో రిజర్వు బౌలర్ల త్రోడౌన్స్‌ను ఎదుర్కొన్నారు. వాళ్లిద్దరు ఫామ్‌లోకి వస్తే టీమిండియా 300- 320 పరుగులు చేయగలదు’’ అని గావస్కర్ రో-కోకు మద్దతుగా నిలిచాడు.కాగా అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన టీమిండియా యాజమాన్యం.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌ను నయా సారథిగా ఎంపిక చేసింది. ఇక గిల్ ఇప్పటికే టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆసీస్- భారత్ మధ్య గురువారం జరిగే రెండో వన్డేకు అడిలైడ్ వేదిక.చదవండి: ‘నా వల్లే జట్టు ఓడింది.. ఓటమికి బాధ్యత నాదే.. తెలివిగా ఆడితే బాగుండేది’ -
నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం (IND vs AUS 1st ODI) పాలైంది. ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు గుప్పించాడు.పెర్త్ వన్డేలో భారత తుదిజట్టు కూర్పు సరిగ్గా లేదని.. బ్యాటింగ్ డెప్త్ కోసం బౌలింగ్ విభాగాన్ని నీరుగార్చారని అశూ మండిపడ్డాడు. వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఆసీస్‌తో సిరీస్‌తో తన ప్రయాణం మొదలుపెట్టాడు. పెర్త్ స్టేడియంలో టాస్ ఓడిన భారత్.. ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.రో- కో ఫెయిల్ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ 8, గిల్ 10 పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) కూడా విఫలం కాగా.. అక్షర్ పటేల్ 31, కేఎల్ రాహుల్ 38 పరుగులతో రాణించి జట్టు పరువు కాపాడారు. ఆల్రౌండర్లలో వాషింగ్టన్ సుందర్(10), నితీశ్ కుమార్ రెడ్డి 19 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు.రాణించిన మిచెల్ మార్ష్వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులే చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 21.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసి.. డీఎల్ఎస్ పద్ధతితో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్), జోష్ ఫిలిప్ (37), మ్యాట్ రెన్షా (21 నాటౌట్) రాణించారు.Just when #TeamIndia needed it most! @Sundarwashi5 breaks a crucial partnership. 👏#AUSvIND 👉 1st ODI | LIVE NOW 👉 https://t.co/FkZ5L4CrRl pic.twitter.com/6e1VZmbAjz— Star Sports (@StarSportsIndia) October 19, 2025 తేలిపోయిన భారత బౌలర్లువికెట్ తీయడానికి తిప్పలు పడ్డ భారత బౌలర్లలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం గురించి అశ్విన్ మాట్లాడుతూ.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విషయంలో మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు.నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు‘‘వాళ్లు కేవలం ఇద్దరు స్పిన్నర్లతోనే ఎందుకు ఆడారో నేను అర్థం చేసుకోగలను. పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడించింది బ్యాటింగ్‌లో డెప్త్ కోసమే. ఇక స్పిన్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ చేయగలరు కాబట్టి నితీశ్‌ను వారికి జతచేశారు.కానీ ఇదేం పద్ధతి?అసలు మీరెందుకు బౌలింగ్‌పై దృష్టి పెట్టడం లేదు బాస్. ఇలాంటి పెద్ద మైదానాల్లో కాకపోతే కుల్దీప్ యాదవ్ ఇంకెక్కడ స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలడు? ఈ పిచ్‌పై బంతిని తిప్పుతూ అతడు బౌన్స్ కూడా రాబట్టగలడు.అత్యుత్తమ బౌలర్లను పక్కన పెడతారా?ఏమైనా అంటే.. బ్యాటింగ్ డెప్త్ అని మాట్లాడతారు. బ్యాటింగ్ ఆర్డర్ రాణించాలంటే... బ్యాటర్లే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కదా! పరుగులు రాబట్టడం బ్యాటర్ల పని. అదనపు బ్యాటర్ కోసం ఆల్రౌండర్లను దించి వారి పని మరింత సులువు చేయాల్సిన అవసరం ఏముంది? జట్టులో అత్యుత్తమ బౌలర్లను పక్కనపెట్టడం ఎంత వరకు సమంజసం?కేవలం బ్యాటింగ్ ఆర్డర్‌ను పొడిగించుకోవడానికి తుదిజట్టు కూర్పు విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి’’ అని అశ్విన్.. టీమిండియా యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆసీస్- భారత్ మధ్య గురువారం రెండో వన్డేకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అడిలైడ్ వేదిక.చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే? -
విరాట్ కోహ్లి డకౌట్.. చరిత్రలో తొలిసారి..!
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 19) జరుగుతున్న తొలి వన్డేలో (India Vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) డకౌటయ్యాడు. 8 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. తొలి బంతి నుంచే ఇబ్బంది పడిన కోహ్లి.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్ కొన్నోలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో కోహ్లికి ఇది తొలి డకౌట్.ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 29 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఐదు సెంచరీలు, 51కు పైగా సగటుతో పరుగులు చేశాడు. కానీ ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. చాలా విరామం తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన కోహ్లి డకౌట్ కావడంతో అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.ఓవరాల్‌గా కోహ్లికి వన్డేల్లో ఇది 17వ డకౌట్. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక డకౌట్లైన రికార్డు సచిన్ టెండూల్కర్ (20) పేరిట ఉంది. ఓవరాల్‌గా ఈ రికార్డు సనత్ జయసూర్య (34) ఖాతాలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. వరుణుడి ఆటంకాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్‌కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, అనంతరం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs AUS: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. సచిన్, ధోని సరసన -
రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. సచిన్, ధోనిల సరసన
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచ్‌ల మైలు రాయిని అందుకున్నాడు. ఆదివారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా రోహిత్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ ఫీట్ అందుకున్న ఐదో భారత క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని లు ఉన్నారు. 38 ఏళ్ల రోహిత్ భారత తరపున ఇప్పటివరకు 274 వన్డేలు, 67 టెస్టులు,159 టీ20లు ఆడాడు. గత ఏడాది జూన్‌లో టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. నాలుగు నెలల కింద టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. ఈ ముంబైకర్ ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్లో 19,708 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 264(వన్డేల్లో)గా ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం తర్వాత రోహిత్ భారత్ తరపున ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.500 పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ప్లేయర్స్ వీరే👉 సచిన్ టెండూల్కర్ – 664 మ్యాచ్‌లు👉విరాట్ కోహ్లి – 551 మ్యాచ్‌లు👉ఎంఎస్ ధోని – 535 మ్యాచ్‌లు👉 రాహుల్ ద్రవిడ్ – 504 మ్యాచ్‌లు👉రోహిత్ శర్మ – 500 మ్యాచ్లుచదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు -
రీ ఎంట్రీలో అట్టర్ ప్లాప్.. విరాట్ కోహ్లి డకౌట్! ఇలా అయితే కష్టమే?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తన రీ ఎంట్రీ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆతృతగా ఎదురు చూసిన అభిమానులను కింగ్ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ డకౌటయ్యాడు. 8 బంతులు ఆడిన కోహ్లి తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.కెప్టెన్ రోహిత్ శర్మ త్వరగా ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడని అంతా భావించారు. కానీ ఈ ఢిల్లీ ఆటగాడు అందరి అంచనాలను తారుమారు చేశాడు. తను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే అతడు ఇబ్బంది పడుతూ కన్పించాడు. వరుసుగా ఏడు బంతుల్లో సింగిల్ రన్ కూడా రాకపోవడంతో విరాట్‌పై ఒత్తడి పెరిగింది. ఈ క్రమంలో 7 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ తొలి బంతిని ఆఫ్ స్టంప్‌కు వెలుపుల లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని కోహ్లి డ్రైవ్ ఆడాలని ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బ్యాక్వర్డ్ పాయింట్లో కూపర్ కొన్నోలీ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో కోహ్లి డకౌట్‌గా మైదానాన్ని వీడాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో కోహ్లి డకౌట్ కావడం ఇదే తొలిసారి.అయితే వన్డే ప్రపంచకప్-2027లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్ కోహ్లి.. ఈ తరహా ప్రదర్శనలు కనబరిస్తే భారత జట్టులో చోటు గల్లంతే అని చెప్పుకోవాలి. ఫిట్నెస్ పరంగా అతడికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ వరల్డ్‌కప్ టోర్నీకి ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో అప్పటివరకు అతడు ఫామ్ ఎలా ఉంటుందన్నది ప్రశ్నర్థకంగా మారింది. మరోవైపు యువ ఆటగాళ్ల నుంచి కోహ్లి తీవ్ర పోటీ ఎదురు అవుతోంది. దీంతో కనీసం మిగిలిన రెండు వన్డేల్లోనైనా అతడు సత్తాచాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తన రీఎంట్రీలో నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.చదవండి: IND vs AUS: ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు..? ఎన్నో ఆశలు పెట్టుకున్నాముగాMitchell Starc gets Virat Kohli. pic.twitter.com/zsdEltOHRe— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2025 -
ఆసీస్‌తో తొలి వన్డే.. టీమిండియా ఓటమి
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వరుణుడి అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.వికెట్‌కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్7.5వ ఓవర్- 44 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో మాథ్యూ షార్ట్ (8) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్26 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఛేదనను ఆసీస్ ఘనంగా ప్రారంభించింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో హెడ్ రెండు బౌండరీలు బాదాడు. అయితే రెండో ఓవర్లో ఆసీస్‌కు షాక్ తగిలింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి హెడ్ (8) ఔటయ్యాడు. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన భారత్పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. వరుణుడి ఆటంకాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్‌కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా19.6వ ఓవర్- 84 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కుహ్నేమన్ బౌలింగ్‌లో రెన్షాకు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ (310 ఔటయ్యాడు. రాహుల్‌కు (17) జతగా వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లోకి వచ్చాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 26 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. భారత్ నాలుగో వికెట్ డౌన్..శ్రేయస్ అయ్యర్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన అయ్యర్.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(10), కేఎల్ రాహుల్(0) ఉన్నారు. మరి కాసేపట్లో ఆట మొదలుమరో 10 నిమిషాల్లో ఆట తిరిగి ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్‌ను వర్షం కారణంగా 35 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.మరోసారి వర్షం అడ్డంకి..పెర్త్ వన్డేకు వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. భారత్ స్కోర్ 37/3 వద్ద ఉండగా.. వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు.11 ఓవర్లకు భారత్ స్కోర్: 35/311 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(6), శ్రేయస్ అయ్యర్(6) ఉన్నారు.వర్షం అటంకి..తొలి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా ఆట నిలిచే పోయే సమయానికి భారత్ స్కోర్: 25/3.కెప్టెన్ గిల్ ఔట్.. భారత్‌కు వరుస షాక్‌లు తగిలాయి. కెప్టెన్ గిల్ ఔట్. ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేసిన గిల్.. ఇల్లీస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కింగ్ కోహ్లీ ఔట్..భారత్ మరో షాక్ తగిలింది. రోహిత్ బాటలోనే కింగ్ కోహ్లీ కూడా వెనుదిరిగాడు. స్టార్క్ బౌలింగ్‌లో కోహ్లీ.. క్యాచ్ అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఔట్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 14/1ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు..3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా13 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(5), రోహిత్ శర్మ(8) ఉన్నారు.బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్..పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఆస్ట్రేలియా-భారత్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున నితీశ్ కుమార్ రెడ్డి వన్డే అరంగేట్రం చేశాడు. అదేవిధంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లతో టీమిండియాకు బరిలోకి దిగింది.మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లు ఫాస్ట్ బౌలర్లగా చోటు దక్కించుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. అయితే స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కలేదు.రోహిత్, విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఆసీస్ తరపున ఇద్దరు ఆటగాళ్లు డెబ్యూ చేశారు. మాట్ రెన్షా, మిచెల్ ఓవెన్లకు వన్డే క్యాప్‌లను అందించారు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్ -
ఆసీస్‌తో తొలి వన్డే.. రోహిత్, కోహ్లి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌కు సమయం అసన్నమైంది. పెర్త్ వేదికగా ఆదివారం జరగనున్న తొలి వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుండగా.. ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఆడనుంది.అందరి దృష్టి భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) పైనే ఉన్నాయి. వీరిద్దరూ దాదాపు ఏడు నెలల తర్వాత బ్లూ జెర్సీలో కన్పించనున్నారు. దీంతో రో-కో ద్వయం ఎలా ఆడుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టీమిండియా ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్.పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే సమయంలో వరుణుడు పలు మార్లు ఆటకు అంతరాయం కలిగించే అవకాశముంది. వర్షం పడేందుకు 35 శాతానికి పైగా అస్కారం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం కూడా అక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.అయితే వర్షం కారణంగా పూర్తిగా రద్దు అయ్యే సూచనలు అయితే కన్పించడం లేదు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెర్త్ స్టేడియంలోని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామమే అనే చెప్పుకోవాలి. కాబట్టి భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్చదవండి: ప్లే ఆఫ్స్‌కు చేరిన తెలుగు టైటాన్స్ -
రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్ గిల్
టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) విజయశాతం 75. ఆటగాడిగానూ యాభై ఓవర్ల ఫార్మాట్లో హిట్‌మ్యాన్‌కు తిరుగులేదు. రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన రోహిత్.. ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) గెలిచాడు. రానున్న వన్డే వరల్డ్‌కప్‌లోనూ అతడే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని అంతా అనుకున్నారు.పది కిలోల బరువు తగ్గి అందుకు అనుగుణంగానే ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్.. ఇటీవలే టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించాడు. తద్వారా తన దృష్టి మొత్తం వన్డేలపైనే ఉంటుందని చెప్పకనే చెప్పాడు. అంతేకాదు.. 38 ఏళ్ల రోహిత్ ఇటీవలే పది కిలోల బరువు కూడా తగ్గి మునుపటి కంటే కూడా మరింత ఫిట్‌గా తయారయ్యాడు.అయితే, అనూహ్య రీతిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడి స్థాయంలో యువ ఆటగాడు, టెస్టు సారథి అయిన శుబ్‌మన్ గిల్‌కే వన్డే జట్టు బాధ్యతలూ అప్పగించింది. వన్డే వరల్డ్‌కప్-2027ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్న ట్లు బోర్డు తెలిపింది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో పాటు గిల్‌తోనూ రోహిత్‌కు విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరిగింది.రెండింటికీ చాలా తేడా ఉంటుందిఈ క్రమంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు శనివారం మీడియాతో మాట్లాడిన గిల్.. ఈ విషయంపై స్పందించాడు. ‘‘బయట మా గురించి జరుగుతున్న ప్రచారానికి, అంతర్గత విషయాలకు చాలా తేడా ఉంటుంది. మా మధ్య ఉన్న బంధాన్ని ఎవరూ చెరిపివేయలేరు.ఇంతకు ముందు మేమెలా కలిసి ఉన్నామో.. ఇప్పుడూ అలాగే ఉన్నాము. అతడు పూర్తి సహాయసహకారాలు అందించే వ్యక్తి. ఇన్నేళ్ల అనుభవం కారణంగా.. నేనేదైనా తప్పు చేసినట్లు భావిస్తే.. నా తప్పులను సరిదిద్దుతాడు. ఒకవేళ నాకు ఆయన సలహాలు అవసరమని భావిస్తే.. తప్పక అడుగుతా.అంతిమ నిర్ణయం నాదేప్రతి ఒక్కరి ఆలోచనలను నేను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తా. అలాగే మ్యాచ్ విషయంలో పరిస్థితులకు అనుగుణంగా నేనే అంతిమ నిర్ణయం తీసుకుంటా. రోహిత్ భాయ్, విరాట్ భాయ్‌తో నాకు మంచి రిలేషన్ ఉంది.నాకు ఏవైనా సందేహాలు వస్తే.. వారి సలహాలు తీసుకుంటా. నాకు సహాయం చేసేందుకు వాళ్లు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు’’ అని శుబ్‌మన్ గిల్ తెలిపాడు. తద్వారా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. కాగా రోహిత్ పాటు టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: IND vs AUS: జట్లు, షెడ్యూల్, వేదికలు, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
ఆసీస్‌తో తొలి వన్డే.. డేంజర్లో సచిన్ వరల్డ్ రికార్డు
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి దాదాపు 7 నెలల తర్వాత బ్లూ జెర్సీలో కన్పించనున్నాడు. ఆదివారం పెర్త్ వేదికగా జఆస్ట్రేలియాతో జరుగునున్న తొలి వన్డేలో సత్తాచాటేందుకు కింగ్ కోహ్లి సిద్దమయ్యాడు. మూడు రోజుల కిందట జట్టుతో పాటు ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిన విరాట్.. ఈ సిరీస్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్‌కు ఈ సిరీస్ చాలా కీలకం. ఈ క్రమంలో తొలి వన్డేకు ముందు కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లి..అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(100) అగ్రస్ధానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సచిన్ తన సుదీర్ఘ కెరీర్లో 51 టెస్టు, 49 వన్డేలు సెంచరీలు సాధించాడు. సచిన్ తర్వాతి స్ధానంలో 82 సెంచరీలతో విరాట్ కోహ్లి రెండో స్దానంలో ఉన్నాడు.ఈ మాజీ కెప్టెన్ వన్డేల్లో 51 శతకాలు సాధించగా.. టెస్టుల్లో 30 సెంచరీలు, టీ20ల్లో ఒకటి బాదాడు. ప్రస్తుతం ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కోహ్లి, సచిన్ పేరిట సంయుక్తంగా ఉంది. కోహ్లి వన్డేల్లో 51 సెంచరీలు చేయగా.. సచిన్ టెస్టుల్లో 51 శతకాలు చేశాడు. ఈ క్రమంలో పెర్త్ వన్డేలో కోహ్లి శతక్కొడితే.. ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్‌ను అధిగమిస్తాడు. తొలి వన్డేలో సచిన్ రికార్డు బ్రేక్ అవ్వకపోయినా మిగిలిన రెండు వన్డేల్లోనైనా కోహ్లి ఈ ఫీట్‌ను అందుకునే ఛాన్స్ ఉంది. కోహ్లికి ఆసీస్ గడ్డపై అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు అక్కడ 29 వన్డేలు ఆడిన విరాట్ 51.03 సగటుతో 1,327 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.చదవండి: IND vs AUS: 25 ఫోర్లు,8 సిక్స్‌లు.. పెర్త్‌లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ! -
గిల్, శ్రేయస్ కాదు.. అతడే టీమిండియా లీడింగ్ రన్ స్కోరర్: క్లార్క్
ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్‌కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే పెర్త్ వేదికగా ఆదివారం(అక్టోబర్ 19) జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు భావిస్తున్నాయి. అందు కోసం తమ తమ వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు దాదాపు ఏడు నెలల తర్వాత ఆడనుండడంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో టాప్ రన్‌స్కోరర్ ఎవరు? లీడింగ్ వికెట్ టేకర్ ఎవరు? విజేత ఎవరు? అన్న ఆంశాలపై తమ అంచనాలను మాజీలు వెల్లడిస్తున్నారు. ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖల్ క్లార్క్ చేరాడు. క్లార్క్ ఇటీవలే Beyond23 క్రికెట్ పోడ్కాస్ట్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్బంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత్ తరపున ఎవరు టాప్ స్కోరర్‌గా నిలుస్తారన్న ప్రశ్న క్లార్క్‌కు ఎదురైంది. అందుకు బదులుగా విరాట్ కోహ్లి(Virat Kohli) పేరును క్లార్క్ చెప్పుకొచ్చాడు."నా అభిప్రాయం ప్రకారం.. ఈ సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లిలో ఎవరు ఒకరో నిలుస్తారు. వారికి ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన అని అనుకుంటున్నారు. కాబట్టి వారు ఈ టూర్‌ను విజయవంతంగా ముగించే అవకాశముంది.అయితే ఆస్ట్రేలియా పిచ్‌లో ఓపెనర్‌గా వచ్చి కొత్త బంతిని ఎదుర్కొవడం అంత సులువు కాదు. అదే మూడు, నాలుగో స్దానంలో బ్యాటింగ్ చేయడం సులభం. ఎందుకంటే బంతి పాతబడి ఉంటుంది, అంతేకాకుండా పిచ్ కూడా బ్యాటర్లకు సహకరించనుంది. కాబట్టి రోహిత్ కంటే కోహ్లికే లీడింగ్ రన్స్కోరర్కే నిలిచే అవకాశాలు ఉన్నాయి" అని క్లార్క్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేరును క్లార్క్ చెప్పకపోవడం గమనార్హం. గిల్ కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌పై అదరగొట్టాడు. 700 పైగా పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఆస్ట్రేలియాపై వన్డేల్లో గిల్‌కు అంత మంచి రికార్డు లేదు. గిల్ ఇప్పటివరకు 8 వన్డే ఇన్నింగ్స్‌లలో 35.00 సగటుతో కేవలం 280 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: IND vs AUS: 25 ఫోర్లు,8 సిక్స్‌లు.. పెర్త్‌లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ! -
IND vs AUS: జట్లు, షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు వెళ్లింది. ఇందులో భాగంగా ఆదివారం (అక్టోబరు 19)నాటి మ్యాచ్‌తో తొలుత వన్డే సిరీస్‌కు తెరలేస్తుంది. అనంతరం ఆసీస్- భారత్ (IND vs AUS) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు ముహూర్తం ఖరారైంది.ఇందుకోసం ఇప్పటికే టీమిండియా- ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందాం!ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా వన్డే సిరీస్ షెడ్యూల్🏏తొలి వన్డే: అక్టోబరు 19 (ఆదివారం)- పెర్త్ స్టేడియం, పెర్త్🏏రెండో వన్డే: అక్టోబరు 23 (గురువారం)- అడిలైడ్ ఓవల్, అడిలైడ్🏏మూడో వన్డే: అక్టోబరు 25 (శనివారం)- సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం ఆసీస్- భారత్ వన్డే మ్యాచ్‌లు ఉదయం 9 గంటలకు ఆరంభంఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్🏏తొలి టీ20: అక్టోబరు 29 (బుధవారం)- మనుకా ఓవల్, కాన్బెర్రా🏏రెండో టీ20: అక్టోబరు 31 (శుక్రవారం)- మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్🏏మూడో టీ20: నవంబరు 2 (ఆదివారం)- బెలిరివ్ ఓవల్, హోబర్ట్🏏నాలుగో టీ20: నవంబరు 6 (గురువారం)- బిల్ పిప్పెన్ ఓవల్, గోల్డ్ కోస్ట్🏏ఐదో టీ20: నవంబరు 8 (శనివారం)- ది గాబా, బ్రిస్బేన్.👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45 నిమిషాలకు టీ20 మ్యాచ్‌లు ఆరంభం.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..👉జియో హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం👉టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్స్‌లో ప్రసారంఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టుఅభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మార్నస్ లబుషేన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.భారత్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టు (తొలి రెండు మ్యాచ్‌లకు మాత్రమే)మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ -
Ro- Ko వరుస సెంచరీలు చేస్తే.. వరల్డ్‌కప్‌లో ఆడతారా?: అగార్కర్
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నమెంట్ వరకు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతారా?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చ. ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణం.అంతేకాదు.. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు జట్లను ప్రకటించే సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిచ్చాయి. రో- కో వన్డే ప్రపంచకప్ ఆడతామని తమకు హామీ ఇవ్వలేదని అతడు పేర్కొన్నాడు.ఆడుతూనే ఉంటాం అనే సందేశంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తర్వాత కోహ్లి.. ‘‘మీరు ఎప్పుడైతే ఓ పనిని మధ్యలోనే వదిలేయాలని నిర్ణయించుకుంటారో.. అప్పుడే నిజంగా మీరు విఫలమైనట్లు’’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. తద్వారా తాను ఇంకొన్నాళ్లు ఆటలో కొనసాగే అవకాశం ఉందంటూ పరోక్షంగా అగార్కర్‌కు కౌంటర్ ఇచ్చాడు.మరోవైపు.. 38 ఏళ్ల రోహిత్ శర్మ సైతం ఇటీవలే పది కిలోల బరువు తగ్గి మరింత ఫిట్‌గా తయారయ్యాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా చివరగా టీమిండియా తరఫున బరిలో దిగిన రో-కో.. ఆసీస్‌తో అక్టోబరు 19 నాటి తొలి వన్డేతో రీఎంట్రీ ఇవ్వనున్నారు.ఇద్దరూ అత్యద్భుతమైన ఆటగాళ్లుఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. రో- కో భవితవ్యంపై మరోసారి స్పందించాడు. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం వాళ్లిద్దరు జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.ఇద్దరూ అత్యద్భుతమైన ఆటగాళ్లు. వరల్డ్‌కప్‌నకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. యువ ఆటగాళ్లు వీరి స్థానాలను ఆక్రమిస్తారేమో.. చెప్పలేము కదా!.. లేదంటే యువ ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కదేమో!ఏదేమైనా రోహిత్- కోహ్లి.. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు. ప్రతి మ్యాచ్ తర్వాత వారి ప్రదర్శన గురించి శల్య పరీక్ష చేయడం ఉండదు. వాళ్లు ఆడటం మొదలుపెట్టిన తర్వాత పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తీసుకుంటాం.వరుస సెంచరీలు చేస్తే.. వరల్డ్‌కప్‌లో ఆడతారా?కేవలం పరుగులు చేయడం కాదు.. ట్రోఫీ గెలవడం అత్యంత ముఖ్యం. ఒకవేళ ఆస్ట్రేలియాలో రోహిత్- కోహ్లి వరుసగా మూడు సెంచరీలు చేసినంత మాత్రాన.. వారు వన్డే వరల్డ్‌కప్-2027 ఆడతారనే గ్యారెంటీ లేదు కదా!..అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే మా నిర్ణయం ఉంటుంది’’ అంటూ రోహిత్- కోహ్లిలకు మరో మెగా టోర్నీ ఆడే అవకాశం ఇవ్వకపోచ్చని అగార్కర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.అదే సమయంలో తాము సీనియర్ ఆటగాళ్లకు అత్యంత గౌరవం ఇస్తామని.. వారితో జరిగే మా సంభాషణలు బయటకు రావు కాబట్టి బయట అందరూ ఏదో ఊహించుకుంటారని అగార్కర్ పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. రోహిత్- కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌తో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ Brace yourselves…they’re 𝘽𝙖𝙘𝙠 𝙄𝙣 𝘽𝙡𝙪𝙚𝙨 🔥 Rohit Sharma 🤝 Virat Kohli 🎥 Watch on loop as the duo gears up for #AUSvIND 💪 #TeamIndia | @ImRo45 | @imVkohli pic.twitter.com/u99yHyFfwJ— BCCI (@BCCI) October 17, 2025 -
IND vs AUS: ఈసారైనా కంగారులను కంగారు పెట్టిస్తారా?
వరల్డ్ క్రికెట్లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరుకు సమయం అసన్నమైంది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు ఆస్ట్రేలియా-భారత్ జట్లు సిద్దమయ్యాయి. తొలి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే పెర్త్‌కు చేరుకున్న భారత్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు ఆసీస్ కూడా స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో చెమటోడ్చుతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు బలబలాలు, గత రికార్డులు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దం.గిల్ జర్నీ మొదలు.. ఈ సిరీస్‌తో భారత వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ప్రయాణం మొదలు కానుంది. రోహిత్ శర్మ స్ధానంలో జట్టు పగ్గాలను గిల్‌కు సెలక్టర్లు అప్పగించిన సంగతి తెలిసిందే. టెస్టు కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న గిల్.. ఇప్పుడు వన్డే సారథిగా ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆసియాకప్, విండీస్‌తో టెస్టు సిరీస్ గెలిచి మంచి జోష్‌లో ఉన్న భారత్.. అదే జోరును ఆసీస్ గడ్డపై కొనసాగించాలని భావిస్తోంది. గిల్ సేన బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం చాలా వీక్‌గా కన్పిస్తోంది.బుమ్రా దూరం.. సిరాజ్‌పైనే భారంఆసీస్తో వన్డే సిరీస్‌కు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్ధానంలో మరో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో భారత్ పేస్ ధళ నాయకుడిగా సిరాజ్ వ్యవహరించనున్నాడు. అయితే భారత జట్టులో ఫాస్ట్ బౌలర్లలో సిరాజ్‌కు ఒక్కడికే ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది.అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ వంటి యువ పేసర్లకు ఆసీస్ పిచ్ల్పై పట్టు లేదు. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022లో అర్ష్‌దీప్ 10 వికెట్లు పడగొట్టినప్పటికి.. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో ఎలా రాణిస్తాడన్నది ప్రశ్నార్ధకంగా మారింది.హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడినప్పటికి వారి స్ధాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు. అతడితో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఆసీస్ పిచ్‌లు ఎక్కువగా పేస్ బౌలర్లు అనుకూలించే అవకాశమున్నందన తుది జట్టులో కుల్దీప్కు చోటు దక్కడం కష్టమే.రో-కోపై అందరి కళ్లు.. భారత బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కన్పిస్తోంది. భారత్ టాప్ ఆర్డర్, మిడిలార్డర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండి ఉన్నది. నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి స్టార్ ఆల్‌రౌండర్లు సైతం జట్టులో ఉన్నారు.కాబట్టి బ్యాటింగ్ పరంగా భారత్‌కు ఎటువంటి సమస్య లేదు. ముఖ్యంగా కోహ్లి, రోహిత్‌కు ఆసీస్ గడ్డపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ సీనియర్ ద్వయం మరోసారి చెలరేగితే కంగారులకు కంగారు తప్పదు. వీరిద్దరూ దాదాపు 7 నెలల తర్వాత భారత జట్టు తరపున ఆడేందుకు సిద్దమయ్యారు. దీంతో అందరి కళ్లు వీరిద్దరిపైనే ఉన్నాయి.ఆసీస్‌కు గాయల బెడద..కాగా ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ లేకుండా ఆడనుంది. నిజంగా ఇది ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే కమ్మిన్స్‌కు ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉంది. అతడితో పాటు వెన్ను గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం భారత్‌తో సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. గ్రీన్ స్దానంలో మార్నస్ లబుషేన్ జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా తొలి వన్డేకు స్టార్ స్పిన్నర్ జంపా, ఇంగ్లిష్ కూడా దూరమయ్యారు. కమ్మిన్స్ లేకపోవడంతో ఆసీస్ బౌలింగ్ విభాగం కూడా కాస్త వీక్‌గానే కన్పిస్తోంది. మిచెల్ స్టార్, జోష్ హాజిల్‌వుడ్‌లతో కూడిన ఆసీస్ బౌలింగ్ యూనిట్ ఫవర్ ఫుల్ భారత బ్యాటింగ్ లైనప్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అయితే హోమ్ ఎడ్వంటేజ్ ఖచ్చితంగా ఆసీస్‌కు కలిసిస్తోంది.భారత్‌కు హెడ్ 'ఎక్'భారత బౌలర్లకు ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ నుంచి ముప్పు పొంచి ఉంది. టీమిండియాపై వన్డేల్లో ట్రావిస్ హెడ్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత్‌పై 9 వన్డేలు ఆడిన హెడ్.. 43.12 సగటుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 137 పరుగులుగా ఉంది. టెస్టుల్లో భారత్‌పై 27 మ్యాచ్‌లు ఆడి 46.52 సగటుతో 1163 పరుగులు సాధించాడు. ఇక అతడితో కెప్టెన్ మిచిల్ మార్ష్, మాథ్యూ షార్ట్, అలెక్స్ క్యారీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఏదేమైనప్పటికి ఆసీస్ కంటే భారత్ బ్యాటింగ్ విభాగమే పటిష్టంగా కన్పిస్తోంది.ఆసీస్‌దే పైయి..భారత జట్టు చివరగా వైట్‌బాల్ సిరీస్‌లు ఆడేందుకు 2020-21లో వెళ్లింది. అయితే వన్డే సిరీస్‌ను 2-1తో టీమిండియా కోల్పోయింది. ఆ సిరీస్‌లో భారత్ తరపున హార్దిక్ పాండ్యా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు భారత్-ఆసీస్ మధ్య 152 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 84 మ్యాచ్‌లలో విజయం సాధించగా, భారత్ 58 మ్యాచ్‌లలో గెలిచింది. 10 మ్యాచ్‌లు ఫలితంలేకుండా ముగిశాయి.చెత్త రికార్డు..ఆస్ట్రేలియాలో భారత్ జట్టు చెత్త రికార్డు ఉంది. ఆసీస్ గడ్డపై భారత్ 54 వన్డేలు ఆడగా.. కేవలం 14 సార్లు మాత్రమే గెలిచింది. 38 సార్లు ఓడింది, 2 మ్యాచ్‌లు ఫలితంలేకుండా ముగిశాయి. అక్కడ భారత్ విజయం శాతం సుమారు 25.9% మాత్రమే. -
జోరుగా టీమిండియా సాధన
పెర్త్: దాదాపు ఏడాది క్రితం పెర్త్‌లోని ఆప్టస్ మైదానంలో ఆ్రస్టేలియాతో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లి అజేయ సెంచరీ సాధించాడు. అదే అతని టెస్టు కెరీర్లో చివరి సెంచరీ అయింది. ఇప్పుడు మళ్లీ అదే మైదానానికి వచ్చిన కోహ్లి కొత్త ఉత్సాహంతో కనిపించాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్ కోసం సన్నద్ధతలో భాగంగా అతను గురువారం సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ తర్వాత మొదటిసారి బరిలోకి దిగుతున్న కోహ్లి సాధనలో బాగా చురుగ్గా పాల్గొన్నాడు. ముందుగా 20 నిమిషాల పాటు ఫీల్డింగ్ డ్రిల్స్ చేసిన అతను ఆ తర్వాత 40 నిమిషాలు బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. హర్షిత్ రాణా, అర్‡్షదీప్ సింగ్‌లతో పాటు స్థానిక ఆటగాళ్లు బౌలింగ్ చేయగా... ఎలాంటి తడబాటు లేకుండా చక్కటి షాట్లు ఆడాడు. అతని పక్క నెట్స్‌లోనే మరో స్టార్ రోహిత్ శర్మ కూడా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఆరంభంలోనే కొద్దిసేపు రోహిత్ తన ఫుట్‌వర్క్, టైమింగ్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. అయితే కుదురుకున్న తర్వాత అతనూ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. సెషన్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో రోహిత్ చాలాసేపు చర్చించడం కనిపించింది. గతంతో పోలిస్తే ఈసారి కోహ్లి, రోహిత్‌ల వ్యవహార శైలి చాలా ఆసక్తికరంగా కనిపించింది. నెట్స్ వద్దకు అనుమతించిన అభిమానులతో సరదాగా మాట్లాడుతూ వీరిద్దరు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, సెల్ఫీలు దిగుతూ సమయం గడపడం విశేషం. ఈ ఇద్దరితో పాటు కేఎల్ రాహుల్ కూడా కొద్దిసేపు ప్రాక్టీస్ చేశాడు. గురువారం ఆప్షనల్ ప్రాక్టీస్ డే కాగా... భారత్ నుంచి రెండో బృందంలో వచ్చిన సిరాజ్, కుల్దీప్, అక్షర్ తదితరులు సాధనకు దూరంగా ఉన్నారు. పూర్తి స్థాయి జట్టుకు నేడు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అంతకుముందు ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్, జాయ్ రిచర్డ్సన్ కూడా నెట్స్‌లో సాధన చేశారు. -
రూ. 80 కోట్ల ప్రాపర్టీ అన్నకు ఇచ్చేసిన కోహ్లి.. ట్విస్ట్ ఏంటంటే?
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్(Shubman Gill) సారథ్యంలోని భారత జట్టు కంగారుల గడ్డపై అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత బృందంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి సైతం ఉన్నాడు. దాదాపు ఆరు నెలల తర్వాత టీమిండియా తరపున ఆడేందుకు సిద్దమయ్యాడు.ఐపీఎల్-2025 సీజన్ తర్వాత లండన్‌లో ఉన్న కోహ్లి ఇటీవలే భారత్‌కు వచ్చాడు. అయితే ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లి గురుగ్రామ్ ప్రాపర్టీని తన సోదరుడు వికాస్ పేరుకు బదిలీ చేసినట్టు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. 37 ఏళ్ల విరాట్ ఇటీవలే తన ఆస్తి సంబంధిత పనుల కోసం గురుగ్రామ్‌లోని వజీరాబాద్ తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. దైనిక్ భాస్కర్’ నివేదిక ప్రకారం.. అతడు గురుగ్రామ్‌లో ఉన్న తన ఇంటికి సంబంధించిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA)ని వికాస్ కోహ్లి పేరిట నమోదు చేసినట్లు సమాచారం.ఒక వ్యక్తి తన ప్రాపర్టీకి చెందిన ఆర్థిక, చట్టపరమైన, వ్యాపార సంబంధిత పనులు చూసుకోవడానికి మరొకరికి అధికారం కల్పించడాన్ని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు.కాగా కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ పేరిట గురుగ్రామ్‌లోని DLF ఫేజ్–1 ప్రాంతంలో విలాసవంతమైన విల్లా ఒకటి ఉంది. ఈ ప్రాపర్టీ విలువ సుమారు రూ.80 కోట్లు పైమాటే. సుమారు 10,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న ఆ విల్లా.. అద్భుతమైన ఇంటీరియర్స్, వుడ్‌వర్క్, స్విమ్మింగ్ పూల్, బార్ వంటి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడింది.చదవండి: IND vs AUS: జట్టు నుంచి తీసేశారు.. కట్ చేస్తే! ఆ కోపాన్ని అక్కడ చూపించేస్తున్నాడు -
Rohit- Kohli: ‘మా అభిమానులకు ఇదే ఆఖరి అవకాశం’
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన వీరిద్దరు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ (IND vs AUS ODIs)తో పునరాగమనం చేయనున్నారు. చాన్నాళ్ల తర్వాత రో- కో తిరిగి వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఖుషీ అవుతున్నారు.అదే సమయంలో రోహిత్- కోహ్లి వన్డేల నుంచి కూడా త్వరలోనే రిటైర్ అవనున్నారనే వార్త ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.హామీ ఇవ్వలేదువన్డే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు వేసి.. శుబ్‌మన్ గిల్ (Shubman Gil)కు పగ్గాలు అప్పగించడంపై స్పందిస్తూ.. ‘‘వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు.. రో- కో ఈ మెగా ఈవెంట్లో ఆడతామని హామీ ఇవ్వలేదు’’ అంటూ రిటైర్మెంట్ ఊహాగానాలకు అగార్కర్ ఊతమిచ్చాడు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టీమిండియా టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఆస్ట్రేలియాలోని అభిమానులకు ఇది ఆఖరి అవకాశమని కమిన్స్ అన్నాడు.ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్యాన్స్‌కు ఇదే ఆఖరు‘‘ నిస్సందేహంగా వారిద్దరు ఆటలో చాంపియన్లు. వారితో మేం ఆడినప్పుడల్లా అభిమానులు మ్యాచ్‌లు చూసేందుకు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. గత 15 ఏళ్లలో వారిద్దరు భారత్ ఆడిన ప్రతీ సిరీస్‌లో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్యాన్స్‌కు వారి ఆటను చూడటం ఇదే ఆఖరిసారి కావచ్చు’’ అని కమిన్స్ అభిప్రాయపడ్డాడు.కమిన్స్ లేకుండానేకాగా వెన్ను నొప్పితో బాధపడుతున్న కమిన్స్ టీమిండియాతో సిరీస్‌లలో ఆడటం లేదన్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో.. ఆసీస్ టీ20 సారథి మిచెల్ మార్ష్.. వన్డే జట్టును కూడా ముందుకు నడిపించనున్నాడు. ఇక అక్టోబరు 19- నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టులకు కూడా రోజుల వ్యవధిలో రో- కో గుడ్‌బై చెప్పేశారు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న ఈ దిగ్గజ బ్యాటర్లు.. ఐపీఎల్‌లోనూ అభిమానులను అలరిస్తున్నారు.చదవండి: IND vs AUS: వన్డే సిరీస్‌కు ముందు.. విరాట్ కోహ్లి పోస్ట్ వైరల్ -
ఆసీస్ టూర్ తర్వాత రిటైర్మెంట్.. !? విరాట్ కోహ్లి పోస్ట్ వైరల్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. చివరగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడిన కోహ్లి.. మళ్లీ ఇప్పుడు ఏడు నెలల తర్వాత భారత జెర్సీలో కన్పించనున్నాడు. ఈ నెల 19 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో సత్తాచాటేందుకు కింగ్ కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు.కాగా ఇప్పటికే టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. దీంతో ఈ మాజీ కెప్టెన్ వన్డే ప్రపంచకప్-2027లో ఆడుతాడా లేదా? అన్నది సగటు క్రికెట్ అభిమాని మొదడను తొలుస్తున్న ప్రశ్న. రోహిత్, కోహ్లి వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ మెగా టోర్నీకి ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో ఇప్పుడే ఏమి చెప్పలేమని అగార్కర్ చెప్పుకొచ్చాడు. అయితే వన్డే ప్రపంచకప్‌లో ఆడాలంటే ఖచ్చితంగా దేశవాళీ టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో పాల్గోవల్సేందేనని మాత్రం అగార్కర్ తెల్చి చేప్పేశాడు. కానీ రో-కో ద్వయం విజయ్ హాజారే ట్రోఫీలో ఆడుతారో లేదో మాత్రం తెలియదు. అయితే దేశవాళీ టోర్నమెంట్లలో ఆడకపోయినా వారిద్దరని వన్డే ప్రపంచకప్‌నకు ఎంపిక చేయాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. మరి కొంతమంది ఆసీస్ టూర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారని అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో కోహ్లి చేసిన ట్విట్ వైరలవుతోంది. "ఎప్పుడైతే మీరు ఓ పనిని మధ్యలోనే వదిలేయాలని నిర్ణయించుకుంటారో.. అప్పుడు మీరు నిజంగా విఫలమైనట్లే" ఎక్స్‌లో కోహ్లి రాసుకొచ్చాడు. దీంతో కింగ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. కోహ్లి రాబోయో వన్డే ప్రపంచకప్‌లో ఆడుతాడని ఫిక్స్ అయిపోతున్నారు.ఆసీస్‌తో సిరీస్‌కు భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్, ధ్రువ్ జురెల్, జైశ్వాల్చదవండి: పిరికిపందల్లారా!.. చిన్న పిల్లాడు.. వదిలేయండిరా!: టీమిండియా స్టార్ ఫైర్ -
ఎలా ఉన్నావు హీరో!
న్యూఢిల్లీ: దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ భారత జట్టుతో చేరారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగలేదు. టెస్టు లేదా టి20 జట్టు సభ్యులుగా ఉన్న ఇతర ప్లేయర్లు కలిసి ఆడుతూ బిజీగా ఉండగా వన్డేలకే పరిమితమైన రోహిత్, కోహ్లి మాత్రం టీమ్‌కు దూరంగా ఉన్నారు. వన్డే, టి20ల సిరీస్‌ల కోసం బుధవారం భారత జట్టు రెండు బృందాలుగా ఆ్రస్టేలియాకు బయల్దేరి వెళ్లింది. మొదటి బృందంలో రోహిత్, కోహ్లి, శ్రేయస్, కెపె్టన్ శుబ్‌మన్ గిల్ తదితరులు ఉన్నారు. ఎలా ఉన్నావు హీరో?ఈ సందర్భంగా రోహిత్, గిల్ భేటీ ఆసక్తిని సంతరించుకుంది. తన స్థానంలోనే గిల్‌ను సెలక్టర్లు వన్డే కెప్టెన్ గా నియమించగా... గిల్ నాయకత్వంలో రోహిత్ తొలిసారి ఆడనున్నాడు. టూర్‌కు వెళ్లేందుకు ఆటగాళ్లంతా ఒకే చోటికి చేరే క్రమంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రోహిత్‌ను చూసిన గిల్ దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే రోహిత్ కూడా ‘ఎలా ఉన్నావు హీరో’ అంటూ ఆత్మీయంగా పలకరించాడు. టీమ్ బస్సులోకి వెళ్లాక మొదటి సీటులోనే కూర్చున్న కోహ్లికి కూడా గిల్ అభివాదం చేయగా... దానికి బదులిచ్చిన కోహ్లి కెపె్టన్ భుజం తట్టి అభినందించాడు. జట్టు సహచరుల్లో కనిపించిన చిరునవ్వులు అందరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించాయి. ఆసీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు 3 వన్డేలు, 5 టి20లు ఆడుతుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. 𝙀𝙣 𝙧𝙤𝙪𝙩𝙚 𝘿𝙤𝙬𝙣 𝙐𝙣𝙙𝙚𝙧 ✈️Of familiar faces and special reunions as #TeamIndia depart for the Australia challenge 😍#AUSvIND pic.twitter.com/ElV3OtV3Lj— BCCI (@BCCI) October 15, 2025 -
IND-AUS XI: కోహ్లి, రోహిత్‌కు నో ప్లేస్..!
టెస్ట్‌ల్లో, వన్డేల్లో ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ (Pat Cummins) ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటూ రిహాబ్‌లో ఉన్నాడు. కమిన్స్ జులైలో వెస్టిండీస్ సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఆతర్వాత ఆసీస్ ఆడిన అన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. త్వరలో భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా ఎంపిక కాలేదు. నవంబర్‌లో జరిగే యాషెస్ సిరీస్‌లో తొలి టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు.అక్టోబర్ 19 నుంచి స్వదేశంలో భారత్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు ముందు కమిన్స్ వార్తల్లో నిలిచాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అతన్ని భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కూడిన ఆల్‌టైమ్ వన్డే జట్టును (Cummins All Time India Vs Australia ODI XI) ఎంపిక చేయమని అడిగారు.కమిన్స్ ఆశ్చర్యకరంగా వన్డేల్లో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లైన విరాట్ కోహ్లి (Virat kohli), రోహిత్ శర్మను (Rohit Sharma) ఎంపిక చేయలేదు. కమిన్స్ ఛాయిస్‌కు క్రికెట్ అభిమానులంతా షాకయ్యారు. కోహ్లి, రోహిత్‌ను ఎంపిక చేయని కమిన్స్.. భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ కెప్టెన్ ఎంఎస్ ధోని, భారత క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను తన ఆల్‌టైమ్ ఫేవరెట్ వన్డే జట్టుకు ఎంపిక చేశాడు.ఈ జట్టులో కేవలం ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే చోటు కల్పించిన కమిన్స్.. ఎనిమిది మంది ఆస్ట్రేలియన్లకు అవకాశం ఇచ్చాడు. డేవిడ్ వార్నర్‌ను సచిన్‌కు జోడీగా ఓపెనర్‌గా ఎంపిక చేసిన కమిన్స్.. ఆతర్వాత వరుసగా రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవన్‌కు మిడిలార్డర్లో చోటు కల్పించాడు.వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ధోనికి అవకాశం ఇచ్చిన కమిన్స్.. జహీర్ ఖాన్‌తో పాటు స్పెషలిస్ట్ పేసర్లుగా తన దేశానికే చెందిన గ్లెన్ మెక్‌గ్రాత్, బ్రెట్ లీకు చోటు కల్పించాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా దివంగత షేన్ వార్న్‌ను ఎంపిక చేశాడు.కమిన్స్ ఆల్‌టైమ్ బెస్ట్ ఇండియా, ఆస్ట్రేలియా మిక్స్డ్ వన్డే టీమ్..డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవాన్, ఎంఎస్ ధోని, షేన్ వార్న్, బ్రెట్ లీ, జహీర్ ఖాన్, గ్లెన్ మెక్గ్రాత్చదవండి: చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్ -
గంభీర్ లేకుండానే!.. రోహిత్, కోహ్లి, శ్రేయస్ ఆస్ట్రేలియాకు..
పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమైంది. తొలి బ్యాచ్‌లో భాగంగా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తదితరులు కంగారూ దేశానికి బయల్దేరారు.వీరితో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ కూడా ఢిల్లీ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. ఆ సమయంలో కొంత మంది సహాయక సిబ్బంది కూడా ఆటగాళ్ల వెంట ఉన్నారు.Team India off to Australia ✈️ pic.twitter.com/FCpqxYjTSI— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 15, 2025గంభీర్ లేకుండానే..అయితే, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ లేకుండానే తొలి బ్యాచ్‌తో వెళ్లడం లేదు. రెండో బ్యాచ్‌తో కలిసి అతడు సాయంత్రం ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నట్లు సమాచారం. ఇక టీమ్ బస్‌లో రోహిత్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ముందు వరుసలో కూర్చోగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Virat Kohli with Team India at Airport left for Australia. pic.twitter.com/ZJ6Wb80hPC— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 15, 2025 కాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టులను 2-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా.. అక్టోబరు 19 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ మొదలుపెట్టనుంది. ఈ సిరీస్‌కు ముందే వన్డే సారథిగా రోహిత్‌ను తప్పించిన బీసీసీఐ.. గిల్‌కు కెప్టెన్సీ అప్పగించింది.కెప్టెన్సీ మార్పు వెనుకఈ నేపథ్యంలో కెప్టెన్సీ మార్పు వెనుక గంభీర్ హస్తం ఉందనే విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్- కోహ్లి చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడారు. ఈ మెగా టోర్నీలో టీమిండియాను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించారు.ఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత టీమిండియా తరఫున రో- కో తొలిసారి ఆస్ట్రేలియాతో వన్డేల సందర్భంగా బరిలోకి దిగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న ఈ ఇద్దరు కంగారూ గడ్డపై సత్తా చాటాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడతారా?కాగా 37 ఏళ్ల రోహిత్, 36 ఏళ్ల కోహ్లి వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడతారో లేదోనని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. అయితే, పూర్తి ఫిట్‌గా ఉన్న ఈ ఇద్దరు తప్పక మెగా టోర్నీ ఆడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో.. వీరిద్దరి విషయంలో మేనేజ్మెంట్ వైఖరిపైనా సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐpic.twitter.com/BZLAUZArJP— Ro³ (@45__rohan) October 15, 2025 -
BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma)ల అంతర్జాతీయ క్రికెట్ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. వీరిద్దరు ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వచ్చినా.. అనూహ్యంగా ఇద్దరూ ఐదు రోజుల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించారు.వన్డే కెప్టెన్సీ నుంచి తొలగింపుఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పెద్దల వైఖరితో నొచ్చుకున్న రో- కో ఈ మేరకు అనూహ్య నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వినిపించాయి. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కూ వీడ్కోలు పలికిన రోహిత్- కోహ్లి.. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నారు. అయితే, ఊహించని రీతిలో రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది బీసీసీఐ.దేశీ టోర్నీలు కూడా ఆడాలిఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు రోహిత్ స్థానంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించింది. వన్డే వరల్డ్‌కప్-2027ను దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ఈ సందర్భంగా రో- కో వన్డే వరల్డ్‌కప్ వరకు కొనసాగుతారనే హామీ కూడా లేదని చెప్పాడు. అంతేకాదు.. అవసరమైతే ఈ ఇద్దరు దేశీ టోర్నీలు కూడా ఆడాల్సి ఉంటుందని సంకేతాలు ఇచ్చాడు.రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి వన్డేలకూ త్వరలోనే గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ వీరి అంతర్జాతీయ కెరీర్లో చివరిదనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు.స్పందించిన బీసీసీఐఢిల్లీలో మంగళవారం వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్ జయభేరి మోగించిన అనంతరం రాజీశ్ శుక్లా మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో రో- కో వన్డే రిటైర్మెంట్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వాళ్లిద్దరు జట్టులో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు.వారిద్దరి సమక్షంలో టీమిండియా కచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడించి తీరుతుంది. రో-కో లకు ఇదే చివరి సిరీస్ అనడం హాస్యాస్పదం. అసలు మేము ఈ విషయం గురించి ఆలోచించము. రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ఏదేమైనా రోహిత్- కోహ్లికు ఆసీస్ సిరీస్ ఆఖరిది అనడం తప్పు’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు.ఇద్దరూ ఇద్దరేకాగా వన్డేల్లో కోహ్లి, రోహిత్‌లకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో 51 సెంచరీలతో కోహ్లి ప్రపంచ రికార్డు సాధిస్తే.. రోహిత్ వన్డే ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది వీరిద్దరు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ విజేతగా నిలవడంలో తమ వంతు పాత్ర పోషించారు.అంతేకాదు 2025లో రోహిత్ ఇప్పటికి 8 వన్డేల్లో ఓ సెంచరీ సాయంతో 302 పరుగులు చేయగా.. కోహ్లి ఏడు ఇన్నింగ్స్ ఆడి 275 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 36 ఏళ్ల కోహ్లి ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా.. 37 ఏళ్ల రోహిత్ ఇటీవల పది కిలోలు తగ్గి మరింత ఫిట్‌గా తయారయ్యాడు. కాబట్టి ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ దృష్ట్యా వీరిద్దరు ఇప్పట్లో రిటైర్ కాకపోవచ్చని చెప్పవచ్చు.చదవండి: సిగ్గుచేటు అంటూ గంభీర్ ఫైర్.. బీసీసీఐ స్పందన ఇదే -
‘ప్రపంచకప్ టోర్నీకి చాలా సమయం ఉంది’
న్యూఢిల్లీ: భారత్, ఆ్రస్టేలియా మధ్య ఈ నెల 19 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. సిరీస్ ఫలితంకంటే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మళ్లీ ఈ సిరీస్‌తోనే బరిలోకి దిగుతున్న వీరిద్దరు ఇప్పటికే రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయి ఒక్క వన్డేలే ఆడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. ఈనేపథ్యంలో తాజా చర్చపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇప్పటికిప్పుడు వారిద్దరి భవిష్యత్తుపై తానేమీ చెప్పలేనని స్పష్టం చేశాడు. ‘వన్డే వరల్డ్‌కప్‌కు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కాబట్టి భవిష్యత్తుకంటే ప్రస్తుతంపైనే దృష్టి పెట్టడం ముఖ్యమని నేను భావిస్తా. వారిద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు అనడంలో సందేహం లేదు. పునరాగమనం చేస్తున్న వారి అనుభవం ఆ్రస్టేలియాలో పనికొస్తుంది. వీరిద్దరు బాగా ఆడి సిరీస్ విజయంలో భాగమవుతారని ఆశిస్తున్నా’ అని గంభీర్ చెప్పాడు. గిల్‌కు కెప్టెన్సీ అర్హత ఉంది... భారత టెస్టు కెప్టెన్సీతో పాటు వన్డేలకు కూడా సారథ్యం వహించే సత్తా, అర్హత శుబ్‌మన్ గిల్‌కు ఉన్నాయని, ఈ హక్కును అతను సాధించుకున్నాడని గంభీర్ ప్రశంసించాడు. ‘కెప్టెన్‌గా గిల్‌ను నియమించి ఎవరూ ఔదార్యం చూపించలేదు. అతడికి ఆ అర్హత ఉంది. కోచ్‌గా కూడా నేను ఈ మాట చెప్పగలను. ప్రపంచ క్రికెట్లో అతి కఠినమైన పర్యటనల్లో ఇంగ్లండ్ ఒకటి. అలాంటి చోట ఐదు టెస్టులూ గట్టిగా నిలబడి సిరీస్‌ను సమం చేసుకోగలగడం చిన్న విషయం కాదు. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టడంతో పాటు జట్టును సమర్థంగా నడిపి వన్డేల్లోనూ సారథి కాగల హక్కును అతను సాధించాడు’ అని గంభీర్ అన్నాడు. 2027 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ గురించి ఇప్పుడే మాట్లాడటం అనవసరమని, వరుసగా విజయాలు సాధించడమే తమ లక్ష్యమని అతను స్పష్టం చేశాడు. భారత జట్టు నవంబర్ 9న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడనుండగా... నవంబర్ 14 నుంచి కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు జరుగుతుంది. అయితే ప్రొఫెషనల్ క్రికెటర్లు తక్కువ సమయంలో పరిస్థితులకు తగినట్లుగా మార్చుకోగలరని విశ్వాసం వ్యక్తం చేసిన గంభీర్... టెస్టు టీమ్‌లో మాత్రమే సభ్యులైన ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాలని సూచించాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ గెలవడం పట్ల కోచ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే భారత్‌లో కూడా పేస్ బౌలర్లకు కూడా కాస్త అనుకూలించే విధంగా బౌన్సీ పిచ్‌లు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. హర్షిత్ రాణాపై అనవసర విమర్శలు... భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ వరుసగా అవకాశాలు పొందుతున్న పేస్ బౌలర్ హర్షిత్ రాణాపై ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిభావంతుడు కాకపోయినా... ఢిల్లీకి చెందినవాడు కావడంతో పాటు గంభీర్ ఐపీఎల్ టీమ్ కేకేఆర్‌కు మెంటార్‌గా ఉన్న సమయంలో సాన్నిహిత్యం వల్లే రాణాకు జట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఇటీవల ఇదే మాట అన్నాడు. తాజా విమర్శలపై గంభీర్ తీవ్రంగా స్పందించాడు. ఈ వివాదంలో హర్షిత్‌కు అతను పూర్తి మద్దతు పలికాడు. ‘యూట్యూబ్‌లో వ్యూస్ కోసం కొందరు ఒక 23 ఏళ్ల యువ ఆటగాడిని లక్ష్యంగా చేసుకున్నందుకు సిగ్గుపడాలి. రాణా తండ్రి మాజీ క్రికెటర్ కాదు. సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కానీ ఎన్ఆర్ఐ కానీ కాదు. అతను తన ప్రతిభను నమ్ముకొనే క్రికెట్ ఆడుతున్నాడు. ఒక ఆటగాడి ప్రదర్శన బాగా లేకుండా విమర్శించవచ్చు కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తారా. కావాలంటే నన్ను విమర్శించండి. నేను దానిని భరించగలను. కానీ 23 ఏళ్ల ఆటగాడిపై ఇది మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించారా. భారత క్రికెట్ జట్టు ఎవరిదో సొంత ఆస్తి కాదు. మన జట్టు గెలవాలని భావించే అందరిది ఈ జట్టు అని మర్చిపోవద్దు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
‘ఆస్ట్రేలియాలో కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడు’
వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా.. తదుపరి ఆస్ట్రేలియా (India Tour Of Australia 2025)లో పర్యటించనుంది. కంగారూ జట్టుతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అక్టోబరు 19 నుంచి టీమిండియా ఆసీస్ టూర్ ప్రారంభం కానుండగా... దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) చాన్నాళ్ల తర్వాత పునరాగమనం చేయనున్నారు.అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాకు ఆడిన రో- కో.. ఆ తర్వాత అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక గతేడాదే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు మేటి బ్యాటర్లు.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు.ఆస్ట్రేలియాలో గిల్ సారథ్యంలోఇలాంటి తరుణంలో రోహిత్ శర్మ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో గిల్ సారథ్యంలో మాజీ కెప్టెన్లు రోహిత్- కోహ్లి కలిసి ఆడనున్నారు.కాగా రోహిత్‌పై వేటు వేసిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. రోహిత్, కోహ్లి వన్డే వరల్డ్‌కప్-2027 ఆడటం గురించి తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రో-కో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరో నాలుగైదేళ్లు ఢోకా లేదు‘‘దయచేసి విరాట్ ఫిట్నెస్ గురించి ఎవరూ ఏమీ అడగకండి. ఫిట్నెస్ విషయంలో అతడొక గురు. అతడు ఏం చేసినా మిగతా వాళ్లు ఫాలో అయిపోతారు. కాబట్టి విరాట్ కోహ్లి ఫిట్నెస్ గురించి మనమేమీ ఆందోళన పడాల్సిన పనిలేదు.అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం అతడి కంటే ఫిట్‌గా ఉన్న మరొక ప్లేయర్ ఎవరూ లేరు. అయితే, కోహ్లి బ్యాట్చేతపట్టి ఎప్పుడెప్పుడు మైదానంలో దిగుతాడా అని నేను ఎదురుచూస్తున్నా.చాలా రోజులుగా అభిమానులతో పాటు నేనూ అతడి ఆటను మిస్సవుతున్నాను. వన్డేల్లో కోహ్లి ఇంకా ఎంతో సాధించగలడు. ఇంకొన్నేళ్లు ఆడగల సత్తా అతడికి ఉంది. కనీసం మరో నాలుగైదేళ్లు కోహ్లి వన్డేలు ఆడతాడని నేను నమ్ముతున్నా.కేవలం ఆడటమే కాదు.. తనదైన శైలిలో ఆధిపత్యం కూడా చూపిస్తాడని విశ్వసిస్తున్నా. ఆస్ట్రేలియాలో అతడి ఆట కోసం ఎదురుచూస్తున్నా. ఇక రోహిత్ విషయంలోనూ నేను ఇదే చెప్తా.కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడుఆస్ట్రేలియాలో ఈ ఇద్దరు దిగ్గజాలు భారీ స్కోర్లు సాధించి టీమిండియాను గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఆస్ట్రేలియా కోహ్లికి ఇష్టమైన ప్రత్యర్థి. మూడు వన్డేల్లో కలిపి అతడు కనీసం రెండు శతకాలైనా బాదుతాడని అనుకుంటున్నా’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు జరుగనున్నాయి.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్ -
కింగ్ కోహ్లి వచ్చేశాడు..!
భారత క్రికెట్ అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) భారత్‌లో (ఢిల్లీ) ల్యాండయ్యాడు. విరాట్ గత కొంతకాలంగా కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత కోహ్లి భారత్‌కు రావడం ఇదే మొదటిసారి.THE AURA OF KING KOHLI..!!!! 🐐- The Arrival of Virat Kohli at home in Delhi. 👑pic.twitter.com/fevrsiSB7L— Tanuj (@ImTanujSingh) October 14, 2025ఇవాళ (అక్టోబర్ 14) ఉదయం కోహ్లి న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటికి వస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.కోహ్లీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీల కోసం స్వల్ప తోపులాట కూడా జరిగింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణg మార్మోగిపోయింది. ప్రస్తుతం ఎక్స్‌లో #ViratReturns అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.త్వరలో ఆస్ట్రేలియాలో జరుగబోయే సిరీస్ కోసం కోహ్లి ఢిల్లీ నుంచి బయల్దేరతాడు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ కూడా వెళ్తాడని సమాచారం. మిగతా సభ్యులు ప్రత్యేక విమానంలో వెళ్లే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డే మ్యాచ్‌లు అక్టోబర్ 19 (పెర్త్), 23 (అడిలైడ్), 25 (సిడ్నీ) తేదీల్లో జరుగనున్నాయి.విరాట్ టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆసీస్‌తో వన్డే సిరీస్ ద్వారా కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లికి ఇదే తొలి సిరీస్. ఈ సిరీస్ తర్వాత కోహ్లి భవిష్యత్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా కోహ్లి వన్డేలకు కూడా రిటైర్మెంట్ (ఆసీస్ సిరీస్ తర్వాత) ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.చదవండి: సిగ్గు చేటు: అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్‌పై గంభీర్ ఫైర్ కోహ్లితో పాటు రోహిత్ కూడా టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ కూడా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. కోహ్లి, రోహిత్‌ల ఆట చూసేందుకు అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాలో కోహ్లి, రోహిత్‌ల నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నారు. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. ఆసియాలో తొలి బ్యాటర్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) ఓ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో (WTC) 3000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆసియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్ 12) మొదలైన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్‌లో 23 పరుగులు చేసి ఔటైన బాబర్.. 2 పరుగుల వద్ద 3000 పరుగుల మైలురాయిని తాకాడు. గత మూడేళ్లుగా విఫలమవుతున్నా బాబర్ ఈ ఘనత సాధించడం విశేషం. బాబర్ కంటే అన్ని విభాగాల్లో బలమైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా డబ్ల్యూటీసీలో 3000 పరుగుల మైలురాయిని తాకలేకపోయారు.ఆసియాలో అత్యధిక డబ్ల్యూటీసీ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బాబర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బాబర్‌కు అతి సమీపంగా టీమిండియా ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ఉన్నారు. కోహ్లి, రోహిత్ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి, బాబర్‌ను ఈ విభాగంలో అధిగమించే అవకాశం వారికి లేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2019లో పరిచయమైన విషయం తెలిసిందే.డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-6 ఆసియా బ్యాటర్లుబాబర్ ఆజమ్- 3021శుభ్‌మన్ గిల్- 2826రిషబ్ పంత్- 2731రోహిత్ శర్మ- 2716కరుణరత్నే- 2642విరాట్ కోహ్లి- 2617డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-8 బ్యాటర్లుజో రూట్- 6080స్టీవ్ స్మిత్- 4278మార్నస్ లబూషేన్- 4225బెన్ స్టోక్స్- 3616ట్రవిస్ హెడ్- 3300ఉస్మాన్ ఖ్వాజా- 3288జాక్ క్రాలే- 3041బాబర్ ఆజమ్- 3021పాకిస్తాన్-సౌతాఫ్రికా మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్ ఇది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఈ మ్యాచ్ ఇవాళ ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది.పాక్ ఇన్నింగ్స్‌లో నలుగురు అర్ద సెంచరీలు చేశారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) తృటిలో సెంచరీ మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (62), సల్మాన్ అఘా (52) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేశారు. రిజ్వాన్, సల్మాన్ అఘా క్రీజ్‌లో ఉన్నారు.మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (2), సౌద్ షకీల్ (0) పూర్తిగా నిరుత్సాహపరచగా.. బాబర్ ఆజమ్ (23) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 2, రబాడ, ప్రెనెలన్ సుబ్రాయన్, సైమన్ హార్మర్ తలో వికెట్ తీశారు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
శుబ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బ్రేక్
ల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. వెస్టిండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన గిల్.. 177 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.గిల్‌కు ఇది తన కెరీర్లో పదో టెస్టు సెంచరీ కావడం విశేషం. ఇంగ్లాండ్‌పై నాలుగు సెంచరీలతో 754 పరుగులు చేసిన గిల్, ఇప్పుడు విండీస్‌పై కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి సంచలన బ్యాటింగ్ ఫలితంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 518 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అతడితో పాటు జైశ్వాల్(175) సూపర్ సెంచరీతో మెరిశాడు. కాగా సెంచరీతో సత్తాచాటిన గిల్ రికార్డుల మోత మోగించాడు.గిల్ రికార్డుల పంట..ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC)లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ హిస్టరీలో ఇప్పటివరకు 71 మ్యాచ్‌లు ఆడిన గిల్ 2826 పరుగులు సాధించాడు. ఇంతకముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(2731) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో పంత్‌ను గిల్ అధిగమించాడు.కెప్టెన్‌గా అత్యంత వేగంగా 5 టెస్ట్ సెంచరీలు చేసిన మూడో ప్లేయర్‌గా శుబ్‌మన్ నిలిచాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. బ్రాడ్‌మన్ ఈ ఫీట్ సాధించడానికి 13 ఇన్నింగ్స్‌లు అవసరమవ్వగా.. గిల్ కేవలం కేవలం 12 ఇన్నింగ్స్‌లలోనే నమోదు చేశాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో అలిస్టర్ కుక్(9), గవాస్కర్(10) తొలి రెండు స్దానాల్లో ఉన్నాడు.ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్‌గా గిల్.. విరాట్ కోహ్లి (Virat Kohli) రికార్డు సమం చేశాడు. కోహ్లి 2017, 2018లో చెరో ఐదు సెంచరీలు చొప్పున చేశాడు. ఇప్పుడు ఈ ఏడాదిలో గిల్‌కు ఇది ఐదో టెస్టు సెంచరీ. 2025లో గిల్ మరో సెంచరీ సాధిస్తే కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.చదవండి: IND vs WI 2nd Test: టీమిండియాకు భారీ షాక్.. -
శతక్కొట్టి.. చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) శతకంతో మెరిశాడు. 177 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో అతడికి ఇది పదో సెంచరీ కావడం విశేషం.ఆరునెలలు తిరిగే లోపేఅంతేకాదు.. ఈ ఏడాది గిల్‌కు ఐదో టెస్టు శతకం. తద్వారా ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్‌గా గిల్.. విరాట్ కోహ్లి (Virat Kohli) రికార్డు సమం చేశాడు. 2017, 2018లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇక టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టి ఆరునెలలు తిరిగే లోపే గిల్ ఈ ఫీట్ సాధించడం మరో విశేషం.𝗚𝗶𝗹𝗹. 𝗚𝗹𝗼𝗿𝘆. 𝗚𝗿𝗲𝗮𝘁𝗻𝗲𝘀𝘀. 🙌@ShubmanGill reaches a brilliant century, guiding #TeamIndia towards a huge total, inching closer to the 500 mark! 🏏💪Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports &… pic.twitter.com/vIWGDISIcx— Star Sports (@StarSportsIndia) October 11, 2025ఇంగ్లండ్ పర్యటనలో నాలుగుకాగా జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడి స్థానంలో గిల్ సారథ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల్లో భాగంగా గిల్ నాలుగు శతకాలు బాదాడు.అంతేకాదు ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 269 పరుగులు సాధించి.. ఈ వేదిక మీద డబుల్ సెంచరీ సాధించిన భారత తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక టీమిండియా తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో తొలి టెస్టు జరుగగా.. భారత్.. విండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అనంతరం ఢిల్లీ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఇన్నింగ్స్ డిక్లేర్తొలిరోజు రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసిన భారత జట్టు.. శనివారం నాటి రెండో రోజు ఆటలో తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 134.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల భారీ స్కోరు వద్ద ఉన్న వేళ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది. గిల్ 196 బంతుల్లో 129 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (175) భారీ శతకం సాధించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (87) గొప్పగా రాణించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 38, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌రెడ్డి 43, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో స్పిన్నర్ జొమెల్ వారికన్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.చదవండి: గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
నాలో దూకుడు అలాగే ఉంది.. కానీ: గంభీర్ కామెంట్స్ వైరల్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనలో ఇప్పటికీ దూకుడు అలాగే ఉందని.. మైదానంలో తనను తాను ఇలా ఆవిష్కరించుకోవడం తన సహజమైన భావోద్వేగం అని తెలిపాడు. అయితే, వయసు పెరుగుతున్న దృష్ట్యా ఇంట్లో వాళ్ల కోసం కొన్నిసార్లు తనను తాను సంభాళించుకుంటున్నానని తెలిపాడు.కోహ్లితోనూ గొడవటీమిండియాకు ఆడిన రోజుల్లో గంభీర్ ఎంత అగ్రెసివ్‌గా ఉండేవాడో క్రికెట్ ప్రేమికులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చేవాడు. అంతేకాదు.. భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)తోనూ.. ఈ వరల్డ్‌కప్ విన్నర్ గొడవ పడిన విషయం తెలిసిందే.ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ‘ఢిల్లీ బాయ్స్’ గంభీర్- కోహ్లి రెండుసార్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. 43 ఏళ్ల గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత పాత పగలు పక్కనపెట్టి కోహ్లితో కలిసిపోయాడు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్వయంగా వీరిద్దరు చెప్పడంతో అభిమానుల మధ్య సోషల్ మీడియా ఫైట్స్‌కు తెరపడింది.ఎప్పుడూ గంభీరంగానేఇక గంభీర్ డగౌట్‌లోనూ ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. అతడి ముఖంలో అమావాస్యకో.. పున్నమికో గానీ నవ్వు కనిపించదు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే గంభీర్‌పై ఈ విషయంలో ఎన్నో మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి.నేను మారలేదుఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గౌతం గంభీర్ తన వ్యవహారశైలి గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాలో ఇప్పటికీ ఆ దూకుడు అలాగే ఉంది. నేను మారలేదు. అగ్రెసివ్‌గా ముందుకు వెళ్లాలనుకున్నపుడు గొడవ పడటమే నాకు ముందుగా గుర్తుకువస్తుంది.ఇంట్లో పిల్లలు ఉన్నారుఅయితే, వయసు పెరిగింది కాబట్టి.. నా మనసు.. ‘ఇంట్లో పిల్లలు ఉన్నారు’ కదా అని హెచ్చరిస్తుంది’’ అంటూ గంభీర్ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉంది.రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో విండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన గిల్ సేన.. శుక్రవారం మొదలుపెట్టిన రెండో టెస్టులోనూ జోరు కనబరుస్తోంది. టీమిండియా- వెస్టిండీస్ రెండో టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా గంభీర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. టీమ్ డిన్నర్ఇక ఈ మ్యాచ్‌కు ముందు గౌతీ తన ఇంట్లో టీమిండియాకు డిన్నర్‌పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా,ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ సహా కోచ్‌లు ర్యాన్ టెన్ డష్కాటే, మోర్నీ మోర్కెల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గంభీర్ పార్టీకి హాజరైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి గిల్‌కు పగ్గాలు అప్పగించడంపై గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో గౌతీ టీమ్ డిన్నర్ ఇవ్వడం గమనార్హం. చదవండి: ‘యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తా’ -
విండీస్‌తో రెండో టెస్ట్.. అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్ 10) మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 71 ఇన్నింగ్స్‌ల్లో ఈ అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్ భారత్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) (68 ఇన్నింగ్స్‌లు) జైస్వాల్ కంటే వేగంగా అంతర్జాతీయ క్రికెట్లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 51 ఓవర్లలో తర్వాత వికెట్ నష్టానికి 198 పరుగులు చేసింది. జైస్వాల్ 145 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జతగా సాయి సుదర్శన్ (58) క్రీజ్‌లో ఉన్నాడు.అంతకుముందు కేఎల్ రాహుల్ 54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 40, సాయి సుదర్శన్ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రాహుల్ వికెట్ వార్రికన్‌కు దక్కింది. అతడి బౌలింగ్‌లో రాహుల్ స్టంపౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు చేశారు. సిరాజ్, జడేజా బంతితో రాణించారు. చదవండి: విండీస్‌తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రా -
దేశవాళీ క్రికెట్లో కోహ్లి, రోహిత్!
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ... దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో భారత జట్టు సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుండగా... దానికి ముందు ఈ ఇద్దరు స్టార్లు విజయ్ హజారే ట్రోఫీలో కనీసం మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశాలున్నాయి. టెస్టు, టి20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు... కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం భారత జట్టు వన్డేలు ఆడకపోగా... ఆస్ట్రేలియాతో పర్యటన కోసం రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీని యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు అప్పగించి... కోహ్లి, రోహిత్‌ను ప్లేయర్లుగా ఈ పర్యటనకు ఎంపిక చేశారు. ఈ ఇద్దరు 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తుండగా... ఆలోపు టీమిండియా ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడేది లేకపోవడంతో... ఫామ్, ఫిట్నెస్ కాపాడుకు నేందుకు దేశవాళీల్లో ఆడాలని భావిస్తున్నట్లు సమాచారం. ‘జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్న ప్రతీ ఆటగాడు అందుబాటులో ఉన్న సమయంలో దేశవాళీల్లో ఆడాల్సిందే’అని ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించిన నేపథ్యంలో ఈ ఇద్దరు బరిలోకి దిగడంపై ఆసక్తి నెలకొంది. ‘డిసెంబర్ 6న విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికా తో టీమిండియా చివరి వన్డే మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మధ్య దాదాపు ఐదు వారాల సమయం ఉంది. విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభమవుతుంది. కివీస్‌తో సిరీస్‌కు ముందు ముంబై, ఢిల్లీ జట్లు విజయ్ హజారేలో ఆరేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. వాటిలో కనీసం మూడిట్లో రోహిత్, కోహ్లి ఆడొచ్చు’ అని బోర్డు అధికారి వెల్లడించాడు. మరోవైపు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తపరిచాడు. ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్ ‘ఎ’ మ్యాచ్‌లు, విజయ్ హజారే వంటి టోర్నీల్లో ఆడుతూ ఫామ్ కొనసాగించుకోవచ్చని పేర్కొన్నాడు. -
టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!.. రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..
ఇటీవలే ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) గెలిచిన టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ బిజీగా గడుపనుంది. అక్టోబరు నెల మొత్తం భారత క్రికెట్ జట్టు ఆటలో తలమునకలు కానుంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ మొదలుపెట్టిన టీమిండియా.. తొలి మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించి జయభేరి మెగించింది.ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టుకు అక్టోబరు 10- 14 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు బయల్దేరనుంది. అక్టోబరు 15వ తేదీనే గిల్ సేన భారత్ నుంచి ఆసీస్‌కు పయనం కానున్నట్లు సమాచారం.టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!అయితే, అంతకంటే ముందు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) టీమిండియాకు తన నివాసంలో డిన్నర్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆసీస్ టూర్‌కు ముందు... వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుబ్‌మన్ గిల్‌ను కొత్త సారథిగా ఎంపిక చేసింది.అయితే, రోహిత్‌ను ఓపెనర్‌గా జట్టులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్- హెడ్‌కోచ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసే దిగ్గజ కెప్టెన్‌పై వేటు వేశారంటూ పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..ఈ నేపథ్యంలో భారత జట్టు కంటే ముందే రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఓ రోజు ముందుగానే ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో గంభీర్.. గిల్ సేనకు ఢిల్లీలోని తన ఇంట్లో పార్టీ ఇచ్చేందుకు సిద్ధం కావడం మరోసారి సందేహాలకు తావిచ్చింది. రో-కోలకు గంభీర్‌తో సఖ్యత చెడిందనే గుసగుసలు మరోసారి గుప్పుమంటున్నాయి.కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. తొలుత మూడు వన్డేల సిరీస్.. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత్- ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు టీమిండియాసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్. చదవండి: టీమిండియాతో సిరీస్‌లకు ఆసీస్ జట్ల ప్రకటన -
అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar)పై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ (Steve Harmison) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ (Rohit Sharma)- విరాట్ కోహ్లి (Virat Kohli) విషయంలో అగార్కర్‌కు ఓటమి తప్పదని వ్యాఖ్యానించాడు. ఈ ఇద్దరు దిగ్గజ కెప్టెన్లు.. ముఖ్యంగా కోహ్లి.. అగ్కార్ను తప్పక ఓడించితీరతాడని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరు టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. రో- కో ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతుండగా.. బీసీసీఐ ఇటీవల అనూహ్య నిర్ణయం తీసుకుంది.శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలుఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మ వన్డే కెప్టెన్‌గా తప్పించి.. శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా గిల్ వన్డే సారథిగా తన ప్రయాణం మొదలుపెడతాడని వెల్లడించింది. ఇక ఈ జట్టులో రోహిత్, కోహ్లి ఆటగాళ్లుగా కొనసాగనున్నారు.రో- కోకు పరోక్షంగా వార్నింగ్ఇక రోహిత్‌పై వేటు వేయడం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. రో- కో వన్డే వరల్డ్‌కప్-2027 వరకు ఆడతారని గ్యారెంటీ లేదని పేర్కొన్నాడు. అందుకే గిల్‌ను కెప్టెన్ చేసినట్లు వెల్లడించాడు. అంతేకాదు.. వరల్డ్‌కప్ నాటికి జట్టులో ఉండాలంటే దేశీ క్రికెట్ కూడా ఆడకతప్పదని రో- కోకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు.అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదుఈ విషయం గురించి స్టీవ్ హార్మిసన్ తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ.. చివరికి అగార్కర్ అవమానకరమైన ముగింపు తప్పదని భావిస్తున్నా. ఈ పోటీలో మాజీ కెప్టెన్లు గెలుస్తారా? లేదంటే మాజీ ఆల్‌రౌండర్‌దే గెలుపా? అంటే.. కచ్చితంగా ఆ ఇద్దరే గెలుస్తారని అనుకుంటున్నా.అలా కాకుండా కేవలం కోహ్లి- శర్మలను రెచ్చగొట్టడానికి.. వారిని ఎలాగైనా వరల్డ్‌కప్‌లో ఆడించాలనే ఉద్దేశంతో అగార్కర్ ఈ మాటలు అంటే అది వేరే సంగతి. నిజంగా అదొక మంచి విషయమే అవుతుంది. అలా కాకుండా వారి గురించి ఉద్దేశపూర్వకంగానే ఇలా మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము.కోహ్లి మాత్రం కచ్చితంగా..రోహిత్ కంటే కోహ్లికి వన్డేల్లో గొప్ప రికార్డు ఉంది. రోహిత్ కోహ్లి కంటే వయసులోనూ కాస్త పెద్దవాడు. కాబట్టి వరల్డ్‌కప్ నాటికి రోహిత్ విషయం ఎలా ఉన్నా.. కోహ్లి మాత్రం కచ్చితంగా కొనసాగుతాడనే అనుకుంటున్నా.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లపై 350 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి లేకుంటే టీమిండియా ఎలా గెలవగలదు?.. బహుశా కోహ్లి మనసులో కూడా ఇదే ఉండి ఉంటుంది. ఏదేమైనా అగార్కర్‌కు ఈ విషయంలో ఓటమి తప్పదు.ఛేజింగ్ కింగ్ఒకవేళ అగార్కర్ నిజంగానే రో- కో గురించి అలా అన్నాడా? లేదంటే అనువాద తప్పిదాలు ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియవు’’ అని స్టీవ్ హార్మిసన్ పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ఛేజింగ్లోనే కోహ్లి 28 శతకాలు బాది 8064 పరుగులు రాబట్టాడు. ఇందులో 41 హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. అత్యుత్తమ స్కోరు 183. అంతేకాదు.. 300 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి ఏకంగా ఏడు సెంచరీలు నమోదు చేయడం అతడు ఛేజింగ్ కింగ్ అనడానికి మరో నిదర్శనం.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
రోహిత్‌పై వేటు సరైన నిర్ణయం.. కోహ్లి జట్టులో కొనసాగాలంటే..: డివిలియర్స్
టీమిండియా వన్డే కెప్టెన్‌ను మారుస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయం సరైందా? కాదా? అన్న చర్చ నడుస్తూనే ఉంది. రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించి శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు ఇవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో భారత దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar)తో పాటు మదన్ లాల్ వంటి వారు సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తుండగా. హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, మహ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు దీనిని తొందరపాటు చర్యగా అభివర్ణిస్తున్నారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా లెజండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కూడా భారత వన్డే జట్టు కెప్టెన్ మార్పు అంశంపై తాజాగా స్పందించాడు. రోహిత్ శర్మను తప్పించి గిల్‌ను కెప్టెన్‌ను చేయడం సరైన నిర్ణయమని పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలు వివరిస్తూ..రోహిత్‌పై వేటు సరైన నిర్ణయం‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (Virat Kohli).. వన్డే వరల్డ్‌కప్-2027 వరకు ఆడతారో లేదో నమ్మకం లేదు. ఆ ఆలోచనతోనే శుబ్‌మన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా చేసి ఉంటారు. అతడికి గొప్ప అవకాశం లభించింది.యువకుడు.. బ్యాటర్‌గానూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అద్భుతమైన నాయకుడిగా ఎదగగలడు. రోహిత్, కోహ్లి జట్టులో ఉండగానే గిల్‌ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం. ఈ ఇద్దరు గొప్ప, అనుభవజ్ఞులైన కెప్టెన్ల నుంచి గిల్ ఎంతో నేర్చుకునే అవకాశం లభిస్తుంది.రోహిత్, కోహ్లి జట్టులో కొనసాగాలంటే..వారి అనుభవం తనకు ఉపయోగపడుతుంది. కెప్టెన్‌గా ఎదిగే క్రమంలో అతడికి ఇది ఎంతో ముఖ్యం. వాళ్లిద్దరు జట్టులో ఉండటం గిల్‌కు సానుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఒకవేళ రోహిత్, కోహ్లి 2027 వరల్డ్‌కప్ వరకు కొనసాగాలనుకుంటే.. తప్పకుండా పరుగులు రాబట్టాల్సి ఉంటుంది.సెలక్టర్లకు బ్యాట్ ద్వారానే సందేశం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఈ పోటీని దాటి ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా పరుగులు చేయాల్సిందే. రోహిత్, కోహ్లి వరల్డ్‌కప్ వరకు జట్టులో ఉంటే.. టీమిండియాకు అంతకంటే గొప్ప ఆస్తి మరొకటి ఉండదు’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.ఆసీస్‌తో సిరీస్‌తో రీఎంట్రీకాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు. చివరగా ఇద్దరూ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా టీమిండియా తరఫున బరిలోకి దిగారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌తో రో- కో పునరాగమనం చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గిల్ జట్టును ముందుకు నడిపిస్తుండగా.. టీ20 టీమ్‌కు సూర్యకుమార్ యాదవ్ సారథిగా ఉన్నాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
విరాట్, రోహిత్ బలిపశువులా? టీమిండియా లో భారీ కుట్ర!
-
గిల్ కాదు!.. సూర్య తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ అతడే!
భారత క్రికెట్లో గత కొన్నాళ్లుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీమిండియా జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు వీడ్కోలు పలకగా.. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కూడా సంప్రదాయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.రో- కో బైబైఅంతకంటే ముందే.. అంటే 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు వన్డేల్లో మాత్రమే కొనసాగుతండగా.. ఆస్ట్రేలియా టూర్‌కు ముందు బీసీసీఐ రోహిత్‌పై వేటు వేసింది. వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించింది.ఇప్పటికే టెస్టు జట్టు సారథిగా వ్యవహరిస్తున్న యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను.. వన్డేలకూ కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయం గురించి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం సరికాదని పేర్కొన్నాడు.గిల్‌కే మేనేజ్మెంట్ మద్దతువన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి పూర్తిస్థాయిలో జట్టును సిద్ధం చేసే క్రమంలో గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపాడు. అంతేకాదు.. రోహిత్- కోహ్లి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆడతామనే హామీ ఇవ్వలేదంటూ అభిమానుల హృదయాలు ముక్కలు చేశాడు.ఇదిలా ఉంటే.. టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్ అయిన గిల్.. త్వరలోనే టీ20 కెప్టెన్‌గానూ స్వీకరించబోతున్నట్లు అగార్కర్ మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్-2026 తర్వాత తప్పుకొంటే.. గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.టెస్టులలో ఒకే.. కానీ వన్డేలలో..ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం భిన్నంగా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్‌కు గిల్ కెప్టెన్ కావడం మంచి పరిణామం. అందుకు తాను అర్హుడినని ఇప్పటికే తను నిరూపించుకుంటున్నాడు.అయితే, వన్డేల్లో మాత్రం.. గిల్ కంటే గొప్ప సామర్థ్యమున్న ఆటగాడు టీమిండియాకు దొరికేవాడు. బ్యాటర్‌గా అతడి గణాంకాలు ఫర్వాలేదు. కానీ ఇప్పటికిప్పుడు కెప్టెన్ అంటేనే కాస్త చిత్రంగా ఉంది.శ్రేయస్ అయ్యర్ వైపు చూపుటీ20 ఫార్మాట్లో మాత్రం ఇప్పటికీ శుబ్‌మన్ గిల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. నాకు తెలిసి టీ20 భవిష్య కెప్టెన్‌గా యాజమాన్యం శ్రేయస్ అయ్యర్ వైపు దృష్టి సారించే అవకాశం ఉందనిపిస్తోంది’’ అని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇటీవల టెస్టు ఫార్మాట్ నుంచి విరామం తీసుకున్న శ్రేయస్ అయ్యర్.. వన్డేల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.జట్టులోనే స్థానం లేదుమరోవైపు.. ఐపీఎల్లో గతేడాది కెప్టెన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ సారథిగా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. బ్యాటర్‌గానూ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించాడు. అయినప్పటికీ ఆసియా టీ20 కప్-2025 జట్టుకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఆటగాడిగానే శ్రేయస్‌కు స్థానమివ్వని యాజమాన్యం.. సూర్యకుమార్ యాదవ్ తర్వాత అతడిని ఏకంగా కెప్టెన్‌ను చేస్తుందంటూ ఊతప్ప అంచనా వేయడం విశేషం. కాగా ఆసీస్‌తో వన్డేలకు గిల్‌కు డిప్యూటీగా.. వైస్ కెప్టెన్‌గా అయ్యర్ ఎంపిక కావడం గమనార్హం.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
ఇది నిజంగా సిగ్గుచేటు: రోహిత్‌పై గంభీర్ ‘కామెంట్స్’ వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్ మార్పు విషయంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించాడంటూ హిట్‌మ్యాన్ అభిమానులు గౌతీని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. గౌతీతో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్‌పై కూడా రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.అది సిగ్గుచేటుఈ నేపథ్యంలో గౌతం గంభీర్ రోహిత్ శర్మను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో మరోసారి తెరమీదకు వచ్చింది. ఇందులో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ కాకపోతే అది జట్టు చేసుకున్న దురదృష్టమే కానీ... రోహిత్‌కు కాదు.పరిమిత ఓవర్ల క్రికెట్ లేదంటే టీ20 జట్టుకు అతడు కెప్టెన్ కాలేదంటే.. అది సిగ్గుచేటు. ఇంతకంటే రోహిత్ శర్మ ఇంకేం చేస్తే కెప్టెన్సీకి అర్హుడు అవుతాడు?’’ అంటూ గంభీర్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శిస్తూ రోహిత్ శర్మకు మద్దతు తెలిపాడు. పరోక్షంగా విరాట్ కోహ్లిని టార్గెట్ చేశాడు.నాడు కోహ్లి స్థానంలో రోహిత్ శర్మకాగా టీ20 ప్రపంచకప్-2021లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే టీమిండియా ఇంటిబాట పట్టడంతో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ కోహ్లిని తప్పించగా.. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి స్వయంగా తప్పుకొన్నాడు.ఈ క్రమంలో 2021-22 మధ్య కాలంలో కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌ను చేసింది బీసీసీఐ. అప్పటి నుంచి రోహిత్ సారథ్యంలో టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లలో సత్తా చాటిన టీమిండియా గతేడాది వరల్డ్‌కప్ గెలిచింది.అంతకుముందు వన్డే వరల్డ్‌కప్-2023లో అజేయంగా ఫైనల్ చేరింది. ఇటీవల ఐసీసీ చాంపియన్స్‌ట్రోఫీ-2025 గెలిచింది. అయితే, ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేల్లో కొనసాగుతానని చెప్పగా.. బీసీసీఐ అనూహ్యంగా అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది.ఇపుడు రోహిత్ ప్లేస్‌లో గిల్రోహిత్ స్థానంలో టెస్టు సారథిగా వచ్చిన యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌కు వన్డే పగ్గాలనూ అప్పగించింది. ఇందులో హెడ్‌కోచ్ గంభీర్ పాత్ర కీలకం అని తెలుస్తోంది. గంభీర్‌తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలిసి 38 ఏళ్ల రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించాలనే నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొనడం గమనార్హం.ఈ నేపథ్యంలో గంభీర్ గతంలో రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘‘అప్పుడలా.. ఇప్పుడిలా.. నిజంగానే ఇది సిగ్గుచేటు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2027 నాటికి గిల్ చుట్టు జట్టును నిర్మించే క్రమంలో అతడిని కెప్టెన్‌ను చేసినట్లు అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్Never seen anyone more hypocritical and two-faced than Gautam Gambhir. The same guy who once said, “If Rohit Sharma doesn’t become India’s captain, it’s India’s loss, not Rohit’s,” now doesn’t want him as captain after becoming coach himself. pic.twitter.com/pqRzYKDR2a— Kusha Sharma (@Kushacritic) October 4, 2025 -
గంభీర్, అగార్కర్ కలిసే చేశారు.. రోహిత్ కెప్టెన్‌గా ఉంటే ఆ ప్రమాదం!
‘వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను అకస్మాత్తుగా ఎందుకు తొలగించారు?’.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే ప్రధాన చర్చ. టీమిండియాకు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన హిట్‌మ్యాన్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మండలి తీరుపై ఓవైపు విమర్శలు వస్తుండగా.. మరోవైపు.. సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) వంటి దిగ్గజాలు మాత్రం బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.రోహిత్ కెప్టెన్‌గా ఉంటే ఆ ప్రమాదం!ఈ నేపథ్యంలో టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పునకు సంబంధించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన వివరాల మేరకు.. ‘‘నాయకుడిగా డ్రెసింగ్‌రూమ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. సారథిగా తనకంటూ ప్రత్యేక శైలి ఉంది.అయితే, తను ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరి అలాంటపుడు.. కేవలం ఒక్క ఫార్మాట్‌కు తను కెప్టెన్‌గా ఉంటే టీమ్ కల్చర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి ఆరు నెలలు గౌతం గంభీర్ టెస్టు, వన్డే జట్ల విషయంలో వెనక ఉండే నడిపించాడు.అంతా గంభీర్ ఆధీనంలోనే..అయితే, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం (టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్), ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లో ఓటమి తర్వాత గంభీర్ అన్ని విషయాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు.ప్రస్తుత నిర్ణయం (కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించడం) కూడా గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలిసికట్టుగా తీసుకున్నారు. రోహిత్, విరాట్ కోహ్లిల వయస్సు ఇప్పటికే 35 ఏళ్లు దాటిపోయింది. కెరీర్లో వారు చివరి అంకానికి చేరుకుంటున్నారు. ఇలాంటి దశలో అకస్మాత్తుగా రోహిత్, కోహ్లిలు ఫామ్ కోల్పోతే నాయకత్వ బృందంలో గందరగోళం తలెత్తే పరిస్థితి ఉంటుంది.గంభీర్ నిర్ణయాల వల్లే మెరుగైన ఫలితాలునిజానికి ఇంగ్లండ్ పర్యటనకు ముందే వీరిద్దరు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఏదేమైనా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్‌లో రెండు టెస్టుల్లోనూ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమిండియా గెలిచిన తీరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్‌తో పాటు కోహ్లి కూడా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టులకు ముందు సంప్రదాయ క్రికెట్‌కూ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డేల్లో మాత్రం మరికొన్నాళ్లు కొనసాగుతామని స్పష్టం చేశారు.త్వరలోనే టీ20 జట్టు పగ్గాలు కూడా అతడికేకానీ అనూహ్య రీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌ను వన్డేలకూ సారథిని చేసింది. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అగార్కర్ వెల్లడించాడు. అంతేకాదు.. రోహిత్- కోహ్లి 2027 ప్రపంచకప్ వరకు ఆడతామని తమకు హామీ ఇవ్వలేదని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ టూర్ సందర్భంగా గిల్ టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే టీ20 జట్టులోనూ సూర్యకుమార్ యాదవ్‌కు డిప్యూటీగా గిల్ ఆసియా కప్-2025లో పాల్గొన్నాడు. త్వరలోనే టీ20లకు కూడా అతడే కెప్టెన్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంలో గంభీర్ కీలక పాత్ర పోషించినట్లు బీసీసీఐ వర్గాల మాటల ద్వారా స్పష్టం అవుతోంది.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
IND Vs AUS: ఒకప్పుడు కోహ్లితో కలిసి ఆడారు.. కట్ చేస్తే.. ఇప్పుడు అంపైర్లుగా!
‘కింగ్’ కోహ్లి టీనేజ్‌లో భారత్‌ను అండర్–19 ప్రపంచకప్ విజేతగా నిలిపాడు. 2008లో అతని సారథ్యంలోనే యువ భారత్ ‘కప్’ తెచ్చింది. తర్వాత సీనియర్ జట్టు సభ్యుడైన కొన్నాళ్లకే 2011లో ధోని నేతృత్వంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచింది.తర్వాత చాంపియన్స్ ట్రోఫీ, గతేడాది టి20 ప్రపంచకప్, ఈ ఏడాది మరో చాంపియన్స్ ట్రోఫీ ఇలా చాలా ఐసీసీ ట్రోఫీల్లో కోహ్లి కీలక ఆటగాడయ్యాడు. తదుపరి 2027 వన్డే ప్రపంచకప్ బరిలో నిలిచేందుకు ఫిట్నెస్తో ఉన్నాడు. అయితే అతని 2008 సహచరుల్లో ఇద్దరు తన్మయ్ శ్రీవాస్తవ, అజితేశ్ అర్గల్లు ఇప్పుడు ఫీల్డ్ అంపైర్లుగా మారారు. 35 ఏళ్ల తన్మయ్, 37 ఏళ్ల అజితేశ్లకు కాలం కలిసివస్తే... ఐసీసీ ఎలైట్ అంపైర్లయితే... కోహ్లి ఆడే మ్యాచ్‌లకు, 2027 మెగా ఈవెంట్‌కు ఫీల్డ్ అంపైర్లుగా బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదు. ఇదే జరిగితే 22 గజాల పిచ్‌పై వికెట్ల ముందు కోహ్లి ఆడుతుంటే... వికెట్ల వెనుక (నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో) ఒకప్పటి సహచరులు అంపైరింగ్ చేయడాన్ని చూడొచ్చు. ఇక ప్రస్తుత విషయానికొస్తే తన్మయ్, అజితేశ్లు 2023లో బీసీసీఐ అంపైరింగ్ పరీక్షల్లో పాసయ్యారు. ఇప్పటికే రంజీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలకు అంపైరింగ్ చేశారు. తాజాగా వీరికి ప్రమోషన్ లభించింది. వీళ్లిద్దరు ఇప్పుడు భారత్ ‘ఎ’, ఆ్రస్టేలియా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌కు కాన్పూర్‌లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.చదవండి: ICC Womens World Cup 2025: పాక్‌పై భారత్ గెలుపు.. మహిళలూ మురిపించారు -
అందుకే రోహిత్ శర్మపై వేటు: కుండబద్దలు కొట్టిన అగార్కర్
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) శకం ముగిసింది. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్.. వన్డేల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని ప్రకటించాడు. అయితే, అనూహ్య రీతిలో ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్‌పై వేటు వేసింది.వన్డే సారథిగా రోహిత్ శర్మను తప్పించి.. అతడి స్థానంలో.. యువ ఆటగాడు, టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించింది. దీంతో రోహిత్ కేవలం ఆటగాడిగానే జట్టులో కొనసాగనున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ కెప్టెన్‌కు ఇది అవమానం లాంటిదేనని సోషల్ మీడియా వేదికగా సెలక్టర్ల తీరును ఎండగడుతున్నారు. వన్డేల్లో డెబ్బై ఐదుకు పైగా విజయశాతం కలిగి ఉన్న సారథి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలుకుతున్నారు.అందుకే రోహిత్ శర్మపై వేటుఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు జట్టును ప్రకటించిన సందర్భంగా ఈ విషయంపై వివరణ ఇచ్చాడు. ‘‘భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.జట్టు అత్యుత్తమ ప్రయోజనాల గురించే ఆలోచించాల్సి ఉంటుంది. ముందుగానే స్పందించి.. కొత్త వ్యక్తి (గిల్) చుట్టూ జట్టును నిర్మించాల్సి ఉంటుంది. ఇది సహేతుకమైన నిర్ణయం’’ అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.అదే విధంగా.. మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ప్రాక్టికల్‌గా అంతగా వర్కౌట్ కాదని.. అన్ని జట్లకు ఒకే కెప్టెన్ ఉండటం ద్వారా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు కూడా పని సులువు అవుతుందని పేర్కొన్నాడు. అయితే, కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రోహిత్‌తో ఎలాంటి చర్చ జరిగిందన్న విషయంపై మాత్రం అగార్కర్ స్పష్టతనివ్వలేదు.అప్పటి వరకు రో-కో ఆడటం కష్టమేఏదేమైనా వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని.. కెప్టెన్సీ విషయం గురించి రోహిత్‌తో మాట్లాడమని మాత్రమే అగార్కర్ వెల్లడించాడు. ఇక రోహిత్‌తో పాటు మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా దేశీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఆటగాళ్లు అందుబాటులో ఉన్నపుడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని మేము స్పష్టంగా చెప్పాము’’ అని పేర్కొన్నాడు.అంతేకాదు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే వరల్డ్‌కప్-2027 నాటికి ఆడే విషయంపై తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా ఇద్దరికీ ఫిట్నెస్ టెస్టులు నిర్వహించామని.. ఇద్దరూ మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నారని తెలిపాడు. కాగా అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన బీసీసీఐ శనివారం తమ జట్లను ప్రకటించింది.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ప్రకటన.. నితీశ్ రెడ్డికి బంపరాఫర్ -
క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చిన 2025
2025వ సంవత్సరాన్ని క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మరచిపోలేరు. ఎందుంటే ఈ ఏడాది ఒకరు కాదు ఇద్దరు కాదు 20 మందికి పైగా స్టార్ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు (Retirement) పలికారు. ఈ విషయం సగటు క్రికెట్ అభిమానికి తీవ్ర శోకాన్ని కలిగిస్తుంది. తమ ఆరాధ్య ఆటగాళ్లు ఇకపై అంతర్జాతీయ వేదికపై ఆడరని తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.ఈ ఏడాది న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ మార్టిన్ గప్తిల్‌తో రిటైర్మెంట్ల పరంపర మొదలైంది. మధ్యలో భారత దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్ట్‌లకు వీడ్కోలు పలికారు. తాజాగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ ఆట మొత్తానికి అల్విదా చెప్పాడు. ఈ మధ్యలో కొందరు కొన్ని ఫార్మాట్లకు మరికొందరు అంతర్జాతీయ కెరీర్ మొత్తానికి గుడ్‌బై చెప్పారు.ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం..మార్టిన్ గుప్తిల్ (అన్ని ఫార్మాట్లు)వరుణ్ ఆరోన్ (అన్ని ఫార్మాట్లు)తమీమ్ ఇక్బాల్ (అన్ని ఫార్మాట్లు)వృద్దిమాన్ సాహా (అన్ని ఫార్మాట్లు)షకీబ్ అల్ హసన్ (టెస్ట్)కేన్ విలియమ్సన్ (టీ20)షాపూర్ జద్రాన్ (అన్ని ఫార్మాట్లు)మహ్మదుల్లా (అన్ని ఫార్మాట్లు)దిముత్ కరుణరత్నే (అన్ని ఫార్మాట్లు)విరాట్ కోహ్లి (టెస్ట్)రోహిత్ శర్మ (టెస్ట్)మార్కస్ స్టోయినిస్ (వన్డే)స్టీవ్ స్మిత్ (వన్డే)గ్లెన్ మ్యాక్స్‌వెల్ (వన్డే)హెన్రిచ్ క్లాసెన్ (అన్ని ఫార్మాట్లు)ముష్ఫికర్ రహీం (వన్డే)నికోలస్ పూరన్ (అన్ని ఫార్మాట్లు)ఆండ్రీ రసెల్ (అన్ని ఫార్మాట్లు)ఏంజెలో మాథ్యూస్ (టెస్ట్)పియూశ్ చావ్లా (అన్ని ఫార్మాట్లు)అమిత్ మిశ్రా(అన్ని ఫార్మాట్లు)చతేశ్వర్ పుజారా (అన్ని ఫార్మాట్లు)మిచెల్ స్టార్క్ (టీ20)క్రిస్ వోక్స్ (అన్ని ఫార్మాట్లు)చదవండి: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ -
విరాట్ కోహ్లీని అధిగమించిన తిలక్ వర్మ
ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025 Final) పాకిస్తాన్‌పై భారత్ (India vs Pakistan) విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) తన కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. 147 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో తిలక్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 53 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఫహీమ్ అష్రఫ్ ధాటికి టాపార్డర్ కుప్పకూలిన వేల తిలక్ ప్రశాంతంగా, సమర్థంగా ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించాడు. సంజు శాంసన్, శివమ్ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బౌండరీలు, సిక్సర్లు బాదడంతో పాటు స్ట్రైక్ రొటేషన్‌లో తన నైపుణ్యాన్ని చూపించాడు. ఈ ఇన్నింగ్స్‌కు గానూ తిలక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సూపర్ సిక్సర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు లభించాయి.ఈ టోర్నీలో తిలక్ 7 మ్యాచ్‌ల్లో 71.00 సగటున, 131.48 స్ట్రైక్ రేట్‌తో 213 పరుగులు చేశాడు. మొత్తం T20I కెరీర్లో 32 మ్యాచ్‌లు ఆడిన తిలక్.. 53.44 సగటున, 149.14 స్ట్రైక్ రేట్ 962 పరుగులు చేశాడు.కోహ్లీని అధిగమించిన తిలక్ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తిలక్ వర్మ 30 T20I ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక సగటు కలిగిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీని (Virat Kohli) అధిగమించాడు.30 T20I ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక సగటు కలిగిన భారత బ్యాటర్లు:తిలక్ వర్మ- 53.4విరాట్ కోహ్లీ- 50.7మనీష్ పాండే- 43.1కేఎల్ రాహుల్- 41.9సూర్యకుమార్ యాదవ్- 39.0ఛేజింగ్‌లో మొనగాడుఅంతర్జాతీయ టీ20ల్లో తిలక్‌కు ఛేజింగ్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. 11 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 92.50 సగటున, 134.54 స్ట్రైక్ రేట్‌తో 370 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో ఇంత అద్భుతమైన సగటు చాలా తక్కువ మందికి ఉంది.ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన తిలక్ వర్మ, క్రమంగా భారత జట్టులో నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్‌గా ఎదిగాడు. ఒత్తిడిలో ఇన్నింగ్స్ నిర్మించడం, మ్యాచ్ ఫినిష్ చేయడం వంటి అంశాల్లో తిలక్ ఇప్పటికే తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు.ఇదిలా ఉంటే, నిన్న (సెప్టెంబర్ 28) జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, 9వ సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం ఆదిలో తడబడినప్పటికీ.. తిలక్ వర్మ అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు.చదవండి: Asia Cup 2025: సూర్యకుమార్ యాదవ్ చేశాడని పాకిస్తాన్ కెప్టెన్ కూడా..! -
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న విరాట్ కోహ్లి పోస్ట్
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) మైదానంలో దిగి చాన్నాళ్లే అయింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) ఫైనల్లో భాగంగా కోహ్లి చివరగా భారత్ తరఫున బరిలోకి దిగాడు. మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన టైటిల్ పోరులో ఒకే ఒక్క పరుగు చేశాడు.ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ ఆడాల్సి ఉండగా.. కోహ్లి ఊహించని రీతిలో సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక అంతకుముందే అంటే.. గతేడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు.ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్ఇక ఆట నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించాడు. భార్య అనుష్క శర్మ (Anushka Sharma), కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ (Akaay)లతో కలిసి లండన్‌లో ఉన్న కోహ్లి.. చాలా రోజుల తర్వాత తన వ్యక్తిగత ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.భార్య అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘చాలా రోజుల తర్వాత ఇలా..’’ అంటూ అభిమానులను పలకరించాడు. ఈ పోస్టుకు ఇప్పటికే తొమ్మిదిన్నర మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. విరాట్ చేసిన ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.ఆస్ట్రేలియాతో సిరీస్‌తో రీఎంట్రీఐపీఎల్-2025 తర్వాత కోహ్లి.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆసీస్‌తో అక్టోబరులో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లి ఆడనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే జిమ్‌లో చెమటోడుస్తున్న ఈ రన్‌మెషీన్.. పునరాగమనంలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు.కాగా ఈ ఏడాది కోహ్లి చిరకాల కోరిక నెరవేరిన విషయం తెలిసిందే. పదిహేడేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని అతడు ముద్దాడాడు. ఇక ఐపీఎల్ ఆరంభం నుంచి అంటే.. 2008 నుంచి ఇప్పటిదాకా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే.చదవండి: ఆసియా కప్-2025 ఫైనల్: అది సూర్య ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
చరిత్ర సృష్టించిన నిసాంక.. ఆసియా కప్ హిస్టరీలోనే...
టీమిండియాతో ఆసియా కప్-2025 సూపర్-4 మ్యాచ్‌లో.. శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక అద్భుత ప్రదర్శన కనబరిచాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి... 52 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని 107 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం.కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బద్దలుఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా పాతుమ్ నిసాంక (Pathum Nissanka) ఆసియా కప్ టీ20 టోర్నీలో సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఖండాంతర క్రికెట్ ఈవెంట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును నిసాంక బద్దలు కొట్టాడు.కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక ఇప్పటికే ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. లీగ్, సూపర్-4 మ్యాచ్‌లలో పరాజయమే ఎరుగక ఫైనల్ చేరింది టీమిండియా. ఈ క్రమంలో సూపర్-4 దశలో చివరిగా ఈ రెండు జట్లు (IND vs SL) నామమాత్రపు మ్యాచ్‌లో తలపడ్డాయి.అభిషేక్ శర్మ ధనాధన్దుబాయ్లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) మరోసారి మెరుపులు మెరిపించగా.. తిలక్ వర్మ (49 నాటౌట్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39) రాణించారు.Beast mode Abhishek Sharma! 🥵#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/CrQW1M492m— Sony Sports Network (@SonySportsNetwk) September 27, 2025 నిసాంక మెరుపు సెంచరీఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లంకకు.. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ కుశాల్ మెండిస్‌ను డకౌట్ చేశాడు. అయితే, భారత శిబిరానికి ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ నిసాంకతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ పెరీరా (32 బంతుల్లో 58) ధనాధన్ దంచికొట్టాడు.టీమిండియా సూపర్ విజయంఆఖర్లో దసున్ శనక (11 బంతుల్లో 22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసేసరికి శ్రీలంక కూడా ఐదు వికెట్ల నష్టానికి సరిగ్గా 202 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు.అయితే, ఈసారి టీమిండియా ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వలేదు. ఆరు బంతుల్లో లంకను రెండు పరుగులకు కట్టడి చేసి రెండు వికెట్లు తీసిన వికెట్ తీసిన భారత్.. ఆ తర్వాత తొలి బంతికే మూడు పరుగులు చేసి జయభేరి మోగించింది.ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యధిక పరుగుల వీరులు వీరే🏏పాతుమ్ నిసాంక (శ్రీలంక)- 12 ఇన్నింగ్స్‌లో 434* పరుగులు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 9 ఇన్నింగ్స్‌లో 429 పరుగులు🏏అభిషేక్ శర్మ (ఇండియా)- 6 ఇన్నింగ్స్‌లో 309 పరుగులు🏏బాబర్ హయత్ (హాంకాంగ్)- 8 ఇన్నింగ్స్‌లో 292 పరుగులు🏏మొహమ్మద్ రిజ్వాన్ (ఇండియా)- 6 ఇన్నింగ్స్‌లో 281 పరుగులు.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మPathum Nissanka anchors the chase with a six-hitting spree 💥 Watch #INDvSL LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/jlzQgHf6Ga— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025 -
Asia cup 2025: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసాల పర్వం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో (India vs Bangladesh) మరో మెరుపు అర్ద సెంచరీ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ అభి'షేక్' (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించడంతో అభిషేక్ ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది.ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో విరాట్ కోహ్లి (Virat kohli) తర్వాత వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ప్రస్తుత ఎడిషన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న అభిషేక్ ఇప్పటికే లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లు ఆడిన అతను.. 206.67 స్ట్రయిక్‌రేట్‌తో 248 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి 3 ఓవర్లలో నిదానంగా ఆడినప్పటికీ.. ఆతర్వాత అభిషేక్ గేర్ మార్చడంతో ఒక్కసారిగా పుంజుకుంది. అభిషేక్, గిల్ క్రీజ్‌లో ఉన్నంత వరకు పరుగులు పెట్టిన స్కోర్ బోర్డు.. ఈ ఇద్దరు ఔట్ కావడంతో ఒక్కసారిగా నెమ్మదించింది.వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 15 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా (11), అక్షర్ పటేల్ (2) క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ 75, గిల్ 29, శివమ్ దూబే 2, సూర్యకుమార్ యాదవ్ 5, తిలక్ వర్మ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా బౌలరల్లో రిషద్ హొసేన్ 2, తంజిమ్ సాకిబ్, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీశారు. అభిషేక్ శర్మ రనౌటయ్యాడు. చదవండి: సందిగ్దంలో సెలెక్టర్లు.. విండీస్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన వాయిదా -
ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు బరితెగించారు. ఓ బ్యాటర్ ఏకే-47 మాదిరి బ్యాట్‌తో సంబరాలు చేసుకుంటే.. ఇంకో ఆటగాడు ఇంకాస్త దిగజారి వ్యవహరించాడు. ప్రేక్షకులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో భారత నెటిజన్లు పాక్ ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఛీ.. మీ బుద్ధి మారదా?‘‘ఛీ.. మీ బుద్ధి మారదా? ఇంతకంటే ఇంకెంతకు దిగజారుతారు?’’ అంటూ చివాట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆసియా కప్-2025 టోర్నీ సూపర్-4లో భాగంగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) ఆదివారం తలపడ్డాయి.దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసి.. పాక్‌ను 171 పరుగులకు కట్టడిచేసింది. ఆపై 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉంటే.. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.ఏకే-47 గన్ ఎక్కుపెట్టినట్లుగాఫర్హాన్ నలభై ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 58 పరుగులు సాధించాడు. అయితే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగానే ఏకే-47 గన్ ఎక్కుపెట్టినట్లుగా అభినయిస్తూ బ్యాట్‌ను చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.విరాట్ కోహ్లి నామస్మరణయువ ఆటగాడు ఫర్హాన్ సంగతి ఇలా ఉంటే.. సీనియర్ ప్లేయర్ హ్యారిస్ రవూఫ్ మరో అడుగు ముందుకు వేశాడు. బౌండరీ రోప్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత దిగ్గజం విరాట్ కోహ్లి నామస్మరణ చేస్తూ ప్రేక్షకులు టీమిండియాను ఉత్సాహపరిచారు. దీంతో టీ20 ప్రపంచకప్-2022లో కోహ్లి తన బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లు బాది.. మ్యాచ్‌ను లాగేసుకున్న విషయం అతడికి గుర్తుకు వచ్చినట్లు ఉంది.ఇదొక దిగజారుడు చర్యఅయితే, ఇందుకు తాజా మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో సమాధానం ఇవ్వాల్సింది పోయి.. రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్.. భారత్‌కు చెందిన ఆరు ఫైటర్ జైట్లను కూల్చామని ప్రగల్బాలు పలికిన విషయం తెలిసిందే. మరోసారి ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. హ్యారిస్ రవూఫ్ సైగలు చేశాడు.అంతకు ముందు ప్రాక్టీస్ సమయంలో ఫుట్‌బాల్ ఆడుతూ.. 6-0sతో లీడ్‌లో ఉన్నామంటూ భారత జర్నలిస్టుల ముందు పాక్ ఆటగాళ్లు అతి చేశారు. ఈ నేపథ్యంలో ఇదొక దిగజారుడు చర్య అంటూ క్రికెట్ ప్రేమికులు పాక్ ఆటగాళ్ల తీరును విమర్శిస్తున్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరిస్తున్న విషయం తెలిసిందే.ఆసియా కప్ -2025 సూపర్ 4: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్👉పాకిస్తాన్ స్కోరు: 171/5 (20)👉టీమిండియా స్కోరు: 174/4 (18.5)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య Haris Rauf never disappoints, specially with 6-0. pic.twitter.com/vsfKKt1SPZ— Ihtisham Ul Haq (@iihtishamm) September 21, 2025సెకండ్ వికెట్ పడగొట్టిన Shivam Dube 💥 చూడండి #INDvPAK లైవ్Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/EZGkRemo4D— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025 -
IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)సరికొత్త చరిత్ర లిఖించాడు. పాకిస్తాన్‌పై టీ20 ఫార్మాట్లో.. పవర్ ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్-2025 టోర్నమెంట్లో దుబాయ్ వేదికగా భారత్- పాక్ ఆదివారం మ్యాచ్ ఆడాయి. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.తొలి బంతికే బౌండరీ బాదిఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం అందించాడు. తొలి బంతికే బౌండరీ బాది.. పాక్ కీలక పేసర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi)కి స్వాగతం పలికిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో బంతిని ఏకంగా సిక్సర్‌గా మలిచాడు.ధనాధన్ దంచికొట్టిఆ తర్వాత కూడా ధనాధన్ దంచికొట్టిన అభిషేక్ శర్మ మొత్తంగా.. 13 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 31 పరుగులు సాధించాడు. సయీమ్ ఆయుబ్ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను ఫాహిమ్ అష్రాఫ్ అందుకోవడంతో అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ (3.4 ఓవర్లో)కు తెరపడింది. కాగా పాకిస్తాన్ జట్టు మీద పవర్ ప్లేలో భారత బ్యాటర్లలో ఎవరికైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు (31) కావడం విశేషం. ఇదిలా ఉంటే.. అభిషేక్ (31)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్), తిలక్ వర్మ (31), శివం దూబే (7 బంతుల్లో 10 నాటౌట్) రాణించారు. ఫలితంగా 15.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన టీమిండియా.. పాక్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.పాకిస్తాన్‌పై టీ20 ఫార్మాట్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత క్రికెటర్లు🏏అభిషేక్ శర్మ- 31 పరుగులు- 2025లో దుబాయ్ వేదికగా..🏏విరాట్ కోహ్లి- 29 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా🏏రోహిత్ శర్మ- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా🏏కేఎల్ రాహుల్- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా.చదవండి: పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్! -
కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా
ఆసియా కప్-2025 (Asia Cup)లో భాగంగా టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా పాకిస్తాన్‌కు ఆదిలోనే షాకిచ్చాడు. భారత బౌలింగ్ అటాక్‌ను ఆరంభించిన ఈ పేస్ ఆల్‌రౌండర్ తొలి బంతిని వైడ్‌గా సంధించాడు. అయితే, ఆ తర్వాత వెంటనే వికెట్ తీసి టీమిండియాకు శుభారంభం అందించాడు.హార్దిక్ వేసిన అవుట్‌స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన పాక్ ఓపెనర్ సయీమ్ ఆయుబ్.. బంతిని గాల్లోకి లేపగా జస్ప్రీత్ బుమ్రా క్యాచ్ పట్టాడు. దీంతో ఆయుబ్ డకౌట్ అయ్యాడు. ఫలితంగా పాక్ తొలి వికెట్ కోల్పోగా.. హార్దిక్ ఖాతాలో తొలి వికెట్ చేరింది.పాండ్యా సూపర్ క్యాచ్ఇక ఆ మరుసటి ఓవర్లో హార్దిక్ పాండ్యా మంచి క్యాచ్ అందుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో వన్‌డౌన్ బ్యాటర్ మహ్మద్ హ్యారిస్ (3) ఇచ్చిన క్యాచ్‌ను పాండ్యా కష్టపడి పట్టాడు. బ్యాట్ టాప్ ఎడ్జ్‌ను తాకిన బంతి గాల్లోకి లేవగా లాంగ్ లెగ్‌లో నుంచి పరిగెత్తుకుని వచ్చి మరీ అందుకున్నాడు. ఫలితంగా పాక్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రెండో భారత ఫీల్డర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ 65 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. హార్దిక్ పాండ్యా.. మహ్మద్ హ్యారిస్ క్యాచ్‌తో కలిపి 55 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భారత్- పాక్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పది ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఫీల్డర్లురోహిత్ శర్మ- 65హార్దిక్ పాండ్యా- 55*విరాట్ కోహ్లి- 54సూర్యకుమార్ యాదవ్- 51*సురేశ్ రైనా- 42. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన𝗕𝗢𝗢𝗠! 💥India are tearing through. Pakistan lose their 2nd wicket 🔥Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/xqJXwEHqnf— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు
దిగ్గజ బ్యాటర్, టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లి ఈ ఏడాది మే 12న టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి యావత్ క్రికెట్ ప్రపంచానికి ఊహించని షాకిచ్చాడు. కోహ్లిలో మరో మూడు, నాలుగేళ్లు టెస్ట్‌ల్లో కొనసాగే సత్తా ఉన్నా ఎందుకో సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. కోహ్లి ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా అతను మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అంతకుముందే (గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత) పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విరాట్.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. త్వరలో ఆస్ట్రేలియాతో వారి దేశంలోనే జరుగబోయే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ పాల్గొనే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, తాజాగా విరాట్ టెస్ట్ రిటైర్మెంట్పై ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన తాలిబన్ అగ్రనేత అనాస్ హక్కానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే హకాన్నీ విరాట్ టెస్ట్ రిటైర్మెంట్పై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. విరాట్ కోహ్లి టెస్ట్ రిటైర్మెంట్ వెనుక కారణాలు నాకు తెలియదు. బహుశా భారత మీడియా వల్ల విసిగిపోయి అతనలా చేసి ఉండవచ్చు. విరాట్ లాంటి ఆటగాడు కనీసం 50 ఏళ్ల వరకైనా ఆడాలన్నది నా కోరిక. విరాట్‌కు ఇంకా చాలా సమయం మిగిలి ఉంది. జో రూట్‌ను చూడండి, సచిన్ అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును ఛేదిస్తున్నాడు. విరాట్ కూడా ఆ రికార్డును టార్గెట్‌గా పెట్టుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.హక్కానీ లాంటి ఉగ్ర నేపథ్యమున్న నేత విరాట్ టెస్ట్ రిటైర్మెంట్పై స్పందించడం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం తాలిబన్ల ప్రభుత్వం నడుస్తున్న విషయం తెలిసిందే. హక్కానీకి తాలిబన్ ఉద్యమ నేత. తాలిబన్లు తీసుకునే అంతర్గత నిర్ణయాల్లో హక్కానీ కీలకపాత్రధారుడు. హక్కానీ క్రమం తప్పకుండా క్రికెట్‌ను ఫాలో అవుతుండటంతో పాటు సోషల్‌మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. హక్కానీ వారి దేశ క్రికెట్ జట్టుకు (ఆఫ్ఘనిస్తాన్) మంచి మద్దతుదారుడు. వారి తురుపుముక్క రషీద్ ఖాన్‌ను హక్కానీ అనునిత్యం ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ భారత్‌తో పాటు ఆసియా కప్‌లో పాల్గొంటుంది. ఈ ఖండాంతర టోర్నీలో ఇరు జట్లు వేరువేరు గ్రూప్‌ల్లో ఉండటంతో గ్రూప్ దశలో పోటీపడటం లేదు. ఇరు జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తే సూపర్ ఫోర్లో తలపడే అవకాశం ఉంటుంది. -
Team India: వాళ్ళు లేక విల విల! అది రో-కో రేంజ్
-
విరాట్- అనుష్క.. మమ్మల్ని కూడా బయటకు పొమ్మన్నారు!
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ రన్‌మెషీన్.. వర్ధమాన క్రికెటర్లకు ఆదర్శప్రాయం. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడొక రోల్‌మోడల్.కోహ్లిని నేరుగా కలిసి బ్యాటింగ్ మెళకువలు నేర్చుకోవాలని తహతహలాడే వారెందరో!.. తాము కూడా ఆ కోవకే చెందుతామని చెబుతోంది భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues). అయితే, తాను, స్మృతి మంధాన (Smriti Mandhana) చేసిన పని వల్ల విరాట్ కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ కాస్త అసౌకర్యానికి గురికావాల్సి వచ్చిందని తాజాగా వెల్లడించింది.ఒకే హోటల్లో బస.. అనుష్క కూడా అక్కడే‘‘అప్పుడు భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాయి. ఇరుజట్లకు ఒకే హోటల్లో బస ఏర్పాటు చేశారు. అప్పుడు స్మృతి, నేను కలిసి విరాట్‌ను కలవాలి అనుకున్నాం.మీతో మాట్లాడాలనుకుంటున్నాము అనగానే.. ‘ఓహ్.. ప్లీజ్.. మేము ఇక్కడే కేఫ్‌లో ఉన్నాము వచ్చేయండి’ అని కోహ్లి చెప్పాడు. అప్పుడు అనుష్క శర్మ కూడా అక్కడే ఉంది.మొదటి అర్ధగంట సేపు క్రికెట్ గురించి మాట్లాడాము. ఈ క్రమంలో .. నేను, స్మృతి భారత మహిళా క్రికెట్లో కీలక ప్లేయర్లుగా ఉండిపోతామని కోహ్లి అన్నాడు. మేమిద్దరం గొప్ప పేరు తెచ్చుకుంటామని అన్నాడు.ఇక చాలు.. బయటకు వెళ్లండిఆ తర్వాత బ్యాటింగ్ గురించి మాకు కొన్ని టిప్స్ ఇచ్చాడు. మా మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడుకున్నాము. ఏదో.. పాత స్నేహితులు చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నట్లుగా మా సంభాషణలు కొనసాగాయి.అప్పటికి నాలుగు గంటలు గడిచిపోయింది. అప్పుడు కేఫ్ నిర్వాహకులు వచ్చి.. ‘సమయం దాటిపోయింది.. ఇక వెళ్లండి’ అని చెప్పేంత వరకు అక్కడే కూర్చున్నాము. సుమారుగా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మేము అక్కడి నుంచి వెళ్లిపోయాము’’ అని జెమీమా రోడ్రిగ్స్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.లండన్‌లోనే నివాసంకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి.. 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. లండన్‌లో అకాయ్‌కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క కోహ్లితో కలిసి అక్కడే ఎక్కువగా ఉంటోంది. మ్యాచ్‌లు ఉన్నపుడు మాత్రమే కోహ్లి భారత్‌కు వస్తున్నాడు. ఇక పెళ్లికి ముందు నుంచే కోహ్లితో పాటు అనుష్క కూడా టీమిండియా వెళ్లే పర్యటనల్లో భాగమయ్యేదన్న విషయం తెలిసిందే.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ సిరీస్‌కు కోహ్లి-రోహిత్ దూరం!?
అంతా ఊహించిందే జరిగింది. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియా-ఎ సిరీస్‌లో భాగం కావడం లేదు. ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన రోకో ద్వయం ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు.చివరగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జెర్సీలో కన్పించిన వీరిద్దరూ తిరిగి వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. ఈ క్రమంలో వీరిద్దరిని స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న అనాధికారిక వన్డే సిరీస్‌లో భారత్-ఎ జట్టు తరపున ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది వారికి ప్రాక్టీస్ ఉపయోగపడుతుందని, అందుకు రో-కో కూడా అంగీకరించారని పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఇవన్నీ వట్టి రూమర్సే అని ఆయన కొట్టిపారేశారు."ఆస్ట్రేలియా-తో జరిగే సిరీస్‌లో రోహిత్, కోహ్లి ఇద్దరూ ఆడడం ఆసాధ్యమనే చెప్పాలి. ఇప్పటివరకు మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా జానియర్లతో కలిసి ఆడమని వారిని మేము బలవంతం కూడా చేయము. వారింత వారు ప్రాక్టీస్ కావాలని భావిస్తే, ఆస్ట్రేలియా వన్డేలకు ముందు ఒకటి రెండు అనాధికారిక మ్యాచ్‌లు ఆడే అవకాశముంది. కానీ ఇది జరగకపోవచ్చు. ఎందుకంటే వారు ప్రస్తుతం చాలా ఫిట్‌గా ఉన్నారు. ఆస్ట్రేలియాతో వన్డేలకు రోహిత్, కోహ్లి కూడా సిద్దంగా ఉన్నారని" సదరు అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా రోహిత్ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఫిట్‌గా కన్పిస్తున్నాడు. దాదాపు ఎనిమిది కేజీలు తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవలే హిట్‌మ్యాన్ తన ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేశాడు. కోహ్లి ఇంకా తన ఫిట్నెస్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంది. కాగా ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆసీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20 సిరీస్‌లో మెన్ ఇన్ బ్లూ తలపడనుంది.చదవండి: ఆల్‌టైమ్ ఆసియా టీ20 జట్టు: భారత్ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్ -
ఆల్‌టైమ్ ఆసియా టీ20 జట్టు: భారత్ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్
ఆసియా కప్- 2025 (Asia Cup) టోర్నీకి రంగం సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఈసారి ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. భారత్ ఆతిథ్య దేశంగా వ్యవహరించనుండగా.. టీమిండియాతో పాటు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.భారత్ నుంచి ఐదుగురుఇందుకోసం ఇప్పటికే ఎనిమిది జట్లు యూఏఈకి చేరుకుని.. అన్ని విధాలా సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బ్రెట్ లీ.. ఆసియా ఉత్తమ టీ20 జట్టును ఎంచుకున్నాడు. ఇందులో ఐదుగురు టీమిండియా స్టార్లకు చోటిచ్చిన ఈ ఆసీస్ దిగ్గజం.. బంగ్లాదేశ్ నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు.యూఏఈ నుంచి ఇద్దరుఅయితే, అనూహ్యంగా యూఏఈ నుంచి ఇద్దరు.. హాంకాంగ్ నుంచి ఒక ఆటగాడికి బ్రెట్ లీ తన జట్టులో చోటివ్వడం విశేషం. ఇక పాకిస్తాన్ నుంచి ఇద్దరిని ఎంచుకున్న బ్రెట్ లీ... స్పిన్ విభాగంలో శ్రీలంక, అఫ్గనిస్తాన్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చాడు. అయితే, బ్రెట్ లీ ఎంచుకున్న జట్టులో టీమిండియా టీ20 ప్రపంచకప్ విజేతలు యువరాజ్ సింగ్ (2007), సూర్యకుమార్ యాదవ్ (2024)లకు మాత్రం చోటు ఇవ్వకపోవడం గమనార్హం. ధోని, రో- కో తమకు తామే సాటిఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌గా ధోని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2007లో భారత్ వరల్డ్‌కప్ గెలవడంలో యువీది కూడా కీలక పాత్ర.ఇక అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక రన్‌స్కోరర్ రోహిత్ శర్మ (4231 పరుగులు). ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లి (4188) ఉన్నాడు. 2024లో కెప్టెన్‌గా రోహిత్ పొట్టి ప్రపంచకప్ గెలవగా.. కోహ్లి ఖాతాలో మరో టైటిల్ చేరింది. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా కూడా టీమిండియాను చాంపియన్‌గా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ టోర్నీ తర్వాత రోహిత్- కోహ్లి.. ఇద్దరూ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారుబ్రెట్ లీ ఎంచుకున్న ఆసియా ఆల్‌టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్విరాట్ కోహ్లి (ఇండియా), రోహిత్ శర్మ (ఇండియా), మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), బాబర్ హయత్ (హాంకాంగ్), మహేంద్ర సింగ్ ధోని (ఇండియా), హార్దిక్ పాండ్యా (ఇండియా), వనిందు హసరంగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), అమ్జద్ జావేద్ (యూఏఈ), మొహమ్మద్ నవీద్ (యూఏఈ), హ్యారిస్ రవూఫ్ (పాకిస్తాన్), జస్ప్రీత్ బుమ్రా (ఇండియా).చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
‘ఎవరూ తోపులు కారు.. నేనే దేవుడిని అనుకుంటే ఇలాగే ఉంటుంది’
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ కెరీర్లో చివరి దశకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్, టెస్టులకు ఈ లెజెండరీ బ్యాటర్లు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా తరఫున వన్డేల్లో కొనసాగుతున్న రో-కో ద్వయం వన్డే ప్రపంచకప్-2027 వరకు ఆడతారా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మారింది.ఆట కంటే ఎవరూ తోపులు కారుఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తండ్రి, భారత మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చంద్రకాంత్ పండిట్ వంటి కోచ్ దగ్గరికి వెళ్తే కోహ్లి, రోహిత్ మరికొన్నేళ్ల పాటు ఆటలో కొనసాగవచ్చని పేర్కొన్నాడు. ‘‘రోహిత్, విరాట్ అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లు అని ఒప్పుకొంటాను.అయితే, వారికి గనుక నేనే కోచ్‌ని అయి ఉంటే.. ‘ఉదయం ఐదు గంటలు అయింది. లేవండి.. శిక్షణ మొదలుపెడదాం పదండి’ అనే చెప్తా. ఎందుకంటే ఆట కంటే ఎవరూ గొప్పోళ్లు, తోపులు కారు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి పదే పదే అవుటయ్యాడు.పది కిలోమీటర్లు పరిగెత్తాలి బాబూ!అయినా సరే.. విరాట్ దగ్గరికి వెళ్లి.. ‘నువ్వు తప్పుగా ఆడుతున్నావు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు’ అని ఎవరూ ఎందుకు చెప్పరు? రోహిత్ దగ్గరికి వెళ్లి ఐదు గంటలకే లేచి పది కిలోమీటర్లు పరిగెత్తాలి అని ఎందుకు అతడిని తొందరపెట్టరు?డాన్ బ్రాడ్‌మాన్ సగటు 99.9గా ఉంటే.. మన సగటు 54-55 మధ్య మాత్రమే ఎందుకు ఉందని రో-కో తమను తాము ఎందుకు ప్రశ్నించుకోరు?.. ‘నేనే దేవుణ్ణి.. అందరికంటే గొప్పోడిని’ అనుకుంటే కుదరదు. సచిన్ 43 ఏళ్ల వయసు వరకు ఎలా ఆడగలిగాడు? ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే మంచిది.ముంబై తరపున రంజీల్లో ఆఖరి వరకు సచిన్ ఆడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని యోగ్రాజ్ సింగ్ విరాట్- రోహిత్‌ల తీరును విమర్శించాడు. ఇన్సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గతేడాది ఐపీఎల్ టైటిల్ అందించిన దేశీ కోచ్ చంద్రకాంత్ పండిట్ వంటి వారి వద్దకు రో-కో వెళ్లి.. తమ తప్పులు సరిచేసుకోవాలని యోగ్రాజ్ ఈ సందర్భంగా సూచించాడు.ఆసీస్‌తో వన్డేలతో రీఎంట్రీ కాగా టీమిండియా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్-2025 టోర్నమెంట్‌తో బిజీ కానుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో టోర్నీ జరుగుతున్నందున విరాట్- రోహిత్‌కు మరికొంత కాలం విశ్రాంతి లభించనుంది. ఈ మెగా ఈవెంట్ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టులు ఆడిన తర్వాత.. పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇక ఆసీస్‌తో వన్డే సిరీస్‌తో వీరిద్దరు రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇ ప్పటికే ఇద్దరూ ఫిట్నెస్ పరీక్ష పాసయ్యారు. కాగా రోహిత్- కోహ్లి చివరగా ఆస్ట్రేలియా టూర్లో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియాకు ఆడారు.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్.. కోహ్లి, స్కైను అధిగమించి ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ఫుల్ మెంబర్స్ దేశాల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను వెనక్కు నెట్టాడు.నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవడంతో ఈ ఘనత సాధించాడు. ఈ అవార్డుతో అంతర్జాతీయ టీ20ల్లో రజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల సంఖ్య 17కు చేరగా.. కోహ్లి, స్కై 16 వద్ద ఉన్నారు. ఓవరాల్‌గా (ఐసీసీ సభ్య దేశాలన్నీ) అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు మలేసియా ఆటగాడు విరన్‌దీప్ సింగ్ (22) పేరిట ఉంది.కొనసాగుతున్న రజా హవాఅంతర్జాతీయ టీ20ల్లో సికందర్ రజా హవా గత కొంతకాలంగా కొనసాగుతుంది. ఈ ఫార్మాట్లో అతను 39 ఏళ్ల లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ, తన దేశం కాని దేశానికి వన్నె తెస్తున్నాడు. రజా పాకిస్తాన్లో పుట్టి, జింబాబ్వే తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.2013లో అంతర్జాతీయ టీ20 కెరీర్ మొదలుపెట్టిన రజా.. 12 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించి, టాప్ ఆల్రౌండర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. వ్యక్తిగతంగా సత్తా చాటుతూనే, కెప్టెన్‌గా జింబాబ్వేకు చిరస్మరణీయ విజయాలు అందిస్తున్నాడు. తాజాగా అలాంటి ప్రదర్శనే మరోసారి చేసి, తమ కంటే చాలా రెట్లు పటిష్టమైన శ్రీలంకను చిత్తు చేయడంలో ముఖ్యపాత్ర పోషించాడు.స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 6) జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో సత్తా చాటి తన జట్టుకు అదిరిపోయే విజయాన్నందించాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన రజా.. శ్రీలంకను 80 పరుగులకే కుప్పకూల్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే శ్రీలంకను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. -
కోహ్లి భిన్నమైన ప్లేయర్!.. కానీ టఫెస్ట్ బ్యాటర్ మాత్రం అతడే: షాహిన్ ఆఫ్రిది
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi) తనకు కఠిన సవాలు విసిరిన బ్యాటర్ పేరును తాజాగా వెల్లడించాడు. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) అందరి కంటే భిన్నమైన ఆటగాడు అని చెప్పిన షాహిన్.. అతడి కంటే ఓ సౌతాఫ్రికా బ్యాటర్‌కు బౌల్ చేయడం అత్యంత కష్టమని చెప్పాడు.అనతికాలంలోనే కీలక బౌలర్‌గా కాగా టీనేజీలోనే పాకిస్తాన్ తరఫున షాహిన్ ఆఫ్రిది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2018లో వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా అరంగేట్రం చేసిన అతడు.. అనతికాలంలోనే కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఇప్పటి వరకు పాక్ తరఫున 84 టీ20లు, 66 వన్డేలు, 31 టెస్టులు ఆడిన షాహిన్ ఆఫ్రిది.. ఆయా ఫార్మాట్లలో వరుసగా.. 107, 131, 116 వికెట్లు కూల్చాడు.ఏడేళ్ల కెరీర్లో షాహిన్ ఆఫ్రిది ఎంతో మంది మేటి బ్యాటర్లకు బౌలింగ్ చేశాడు. అయితే, ఈ లెఫ్టార్మ్ పేసర్ కేవలం ఆసియా కప్, ప్రపంచకప్ వంటి టోర్నీల్లో మాత్రమే టీమిండియా ఆటగాళ్లకు బౌల్ చేశాడు. ఈ నేపథ్యంలోనే.. తనకు కఠిన సవాలు విసిరిన బ్యాటర్ ఎవరన్న విషయంలో విరాట్ కోహ్లిని కాదని సౌతాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లాకు ఓటేశాడు.టెస్టులలో ఒక్కసారి కూడా..సౌతాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి హషీమ్ ఆమ్లా 18672 పరుగులు చేశాడు. ఇందులో 55 సెంచరీలు, 80 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఈ మాజీ క్రికెటర్‌ను టెస్టుల్లో అవుట్ చేయడంలో పాతికేళ్ల షాహిన్ ఆఫ్రిది ఒక్కసారి కూడా సఫలం కాలేదు. అతడికి 31 పరుగులు సమర్పించుకున్నాడు.అదే విధంగా.. వన్డేల్లో హషీమ్ ఆమ్లాను రెండుసార్లు అవుట్ చేయగలిగిన షాహిన్ ఆఫ్రిది.. 40 పరుగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఈ పాక్ పేసర్‌కు.. మీ కెరీర్లో ఇంత వరకు ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది.కోహ్లి భిన్నమైన ప్లేయర్!.. కానీ టఫెస్ట్ బ్యాటర్ మాత్రం అతడేఇందుకు బదులిస్తూ.. ‘‘వన్డేల్లో, టెస్టుల్లో ఆయనతో మ్యాచ్‌లు ఆడాను. ఇంగ్లండ్ టీ20 టోర్నీ విటలిటి బ్లాస్ట్‌లో కూడా ఆయనతో పోటీపడ్డాను. ఆయనొక గొప్ప బ్యాటర్. తన ప్రణాళికలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంటాడు.అందుకే హషీం ఆమ్లానే నాకు కఠినమైన సవాలు విసిరిన బ్యాటర్ అని చెప్పగలను. ఇక విరాట్ కోహ్లి విషయానికొస్తే.. అతడొక భిన్నమైన ప్లేయర్. అయితే, నా వరకు మాత్రం హషీమ్ భాయ్ మాత్రం అందరికంటే టఫెస్ట్ బ్యాటర్’’ అని షాహిన్ ఆఫ్రిది పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం యూఏఈ పర్యటనలో జట్టుతో కలిసి ఉన్న షాహిన్.. తదుపరి ఆసియా కప్ టీ20-2025 టోర్నీలో ఆడనున్నాడు. సెప్టెంబరు 9 -28 వరకు జరిగే ఈ ఈవెంట్‌కు యూఏఈ వేదిక.చదవండి: భారత జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
కోహ్లి ఏమైనా పైనుంచి దిగి వచ్చాడా?
-
‘ధోని, కోహ్లిలకు యువీ అంటే భయం.. అందుకే తొక్కేశారు’
టీమిండియా ఆల్రౌండర్లలో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ప్రత్యేకం. భారత్ 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో ఈ చండీగఢ్ స్టార్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా సొంతగడ్డపై యాభై ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.ఇక ఈ రెండు ఐసీసీ ట్రోఫీలను మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సారథ్యంలోనే టీమిండియా గెలుచుకోవడం విశేషం. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న తర్వాత విరాట్ కోహ్లి (Virat Kohli) భారత జట్టు పగ్గాలు చేపట్టగా.. యువీ అతడి నాయకత్వంలోనూ ఆడాడు. అయితే, క్యాన్సర్ బారిన పడిన తర్వాత యువీ కెరీర్ నెమ్మదించింది. ఈ క్రమంలో 2017లో టీమిండియా తరఫును ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. ఆ తర్వాత రెండేళ్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.అక్కడంతా వెన్నుపోటుదారులేఈ పరిణామాల నేపథ్యలో యువీ తండ్రి, కోచ్ యోగ్రాజ్ సింగ్.. ధోని, కోహ్లిలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘డబ్బు, పేరు ప్రఖ్యాతులు, విజయం ఉన్న చోట.. స్నేహితులు ఉండరు. అక్కడంతా వెన్నుపోటుదారులే ఉంటారు.అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతూ ఉంటే వెనక్కి లాగాలని ప్రయత్నిస్తారు. చాలా మందికి యువరాజ్ సింగ్ అంటే భయం. అతడు తనకున్న ప్రతిభతో తమ స్థానాల్ని ఎక్కడ ఆక్రమిస్తాడేమోననే అభద్రతా భావం.ధోని, కోహ్లిలకు యువీ అంటే భయంయువీ.. దేవుడు సృష్టించిన గొప్ప ఆటగాడు. గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ ప్లేయర్స్. ఎంఎస్ ధోని నుంచి.. ఆ తర్వాత కెప్టెన్ అయిన వారి దాకా అంతా యువీ అంటే భయపడేవాళ్లే. తమ కుర్చీని అతడు లాక్కుంటాడేమోనని భయపడ్డారు.నా కుమారుడికి సచిన్ టెండుల్కర్ తప్ప క్రికెట్ ప్రపంచంలో మంచి స్నేహితులు ఎవరూ లేరు’’ అని యోగ్రాజ్ సింగ్ ఇన్సైడ్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. భయం వల్లే ధోని, కోహ్లిలు తన కుమారుడి కెరీర్ నాశనం చేశారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా ధోనిపై యోగ్రాజ్ ఆరోపణలు ఇదే మొదటిసారి కాదు. అయితే, ఈసారి కోహ్లిని కూడా ఇందులోకి లాగాడు.మేటి ఆల్‌రౌండర్‌కాగా ఎడమచేతి వాటం బ్యాటర్.. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన యువీ.. 2000- 2017 తదాకా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాడు. టీమిండియా తరపున 40 టెస్టుల్లో 1900, 304 వన్డేల్లో 8701, 58 టీ20 మ్యాచ్‌లలో కలిపి 1177 పరుగులు సాధించాడు. అదే విధంగా.. టెస్టుల్లో తొమ్మిది, వన్డేల్లో 111, టీ20లలో 28 వికెట్లు పడగొట్టాడు.చదవండి: చరిత్ర సృష్టించిన బవుమా బృందం.. బ్రీట్జ్కే వరల్డ్ రికార్డుతో.. -
కెప్టెన్లకు నచ్చితేనే అవకాశాలు!.. ధోని, కోహ్లిలే టార్గెట్?
టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను జాతీయ జట్టుకు ఆడే సమయంలో సెలక్షన్ విధానం వేరుగా ఉండేదని పేర్కొన్నాడు. కెప్టెన్లకు నచ్చితే అవకాశాలు వస్తూనే ఉంటాయని.. లేదంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోవాల్సి ఉంటుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.కాగా భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకొన్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని స్థాయిల్లోనూ ఆట నుంచి రిటైర్ అవుతున్నట్లు అతడు తెలిపాడు. కాగా 43 ఏళ్ల మిశ్రా తొలిసారి 2003లో భారత జట్టుకు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. 25 ఏళ్ల తర్వాత గుడ్‌బై చెబుతున్నామరో ఐదేళ్ల తర్వాత అతనికి టెస్టు ఆడే అవకాశం దక్కింది. భారత జట్టు తరఫున 2017లో మిశ్రా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక 2000–01 సీజన్లో తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన అమిత్ మిశ్రా 25 ఏళ్ల పాటు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.‘నా జీవితంలో అన్ని రకాలుగా భాగమైన క్రికెట్‌కు 25 ఏళ్ల తర్వాత గుడ్‌బై చెబుతున్నా. నా కెరీర్లో ఎన్నో విజయాలు, మలుపులు, భావోద్వేగాలు ఉన్నాయి. నా కెరీర్లో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. మరో రూపంలో ఆటతో నా అనుబంధం కొనసాగుతుంది’ అని అమిత్ మిశ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్లో మిశ్రా 22 టెస్టుల్లో 35.72 సగటుతో మొత్తం 76 వికెట్లు పడగొట్టాడు. 36 వన్డేలు, 10 టీ20ల్లో కలిపి అమిత్ 80 వికెట్లు తీశాడు. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. తన కెరీర్లో ఎక్కువగా మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లిల సారథ్యంలోనే ఆడటం విశేషం.కెప్టెన్లకు నచ్చితేనేఇక రిటైర్మెంట్ అనంతరం అమిత్ మిశ్రా హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. తనకు టీమిండియాలో అవకాశాలు తక్కువగా రావడం పట్ల స్పందించాడు. ‘‘నిజంగా ఓ ఆటగాడిని అన్నింటికంటే నిరాశపరిచే విషయం ఇదే. కొన్నిసార్లు జట్టులో ఉంటాము.. మరికొన్ని సార్లు మనల్ని ఎంపిక చేయరు.మరికొన్నిసార్లు జట్టులో ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఉండదు. ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటే విసుగు వస్తుంది. నా విషయంలో చాలాసార్లు ఇలాగే జరిగింది. కొంత మంది ఆటగాళ్లంటే కెప్టెన్లకు ఇష్టం.కాబట్టి వారికి వరుస అవకాశాలు వస్తూ ఉంటాయి. అయినా.. అదో పెద్ద విషయం కాదు. ఏదేమైనా మనల్ని మనం నిరూపించుకుంటే అవకాశం అదే తలుపు తడుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే అంతా ఉంది.ఒకవేళ సెలక్టర్లు నన్ను పరిగణనలోకి తీసుకోలేదంటే.. ఫిట్నెస్, బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా ఎందులో ఇంకా మెరుగవ్వాలని మాత్రమే ఆలోచించేవాడిని. టీమిండియాకు ఆడే ఛాన్స్ వచ్చినప్పుడల్లా నన్ను నేను నిరూపించుకున్నాడు. ఎల్లప్పుడూ కఠిన శ్రమ, అంకిత భావంతో పనిచేసే వాడిని’’ అని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు.ధోనిని అడిగాను కూడా!కాగా గతంలో ధోని జట్టులో తనకు స్థానం కరువు అవడం గురించి మిశ్రా స్పందించాడు. ‘‘జట్టు ఎంపిక సమయంలో చాలా అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. మనం మన ఆటపై దృష్టి పెడితే చాలు. తుదిజట్టును కెప్టెన్ నిర్ణయిస్తాడు. నాకు ఎంఎస్ ధోనితో మంచి అనుబంధం ఉంది.నన్ను ఎందుకు తీసుకోలేదని ఒకటి.. రెండు సందర్భాల్లో అతడిని అడిగాను. జట్టు కూర్పునకు అనుగుణంగానే నన్ను పక్కనపెట్టామని అతడు చెప్పాడు’’ అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.ఐపీఎల్లో సుదీర్ఘ కాలం తనదైన ముద్రఇదిలా ఉంటే.. హరియాణా తరఫున రంజీ ట్రోఫీలో ఎన్నో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు నమోదు చేసిన మిశ్రా...బ్యాటింగ్‌లో కూడా కర్ణాటకపై డబుల్ సెంచరీ (202 నాటౌట్) సాధించడం విశేషం. ఇక ఐపీఎల్లో సుదీర్ఘ కాలం తనదైన ముద్ర వేసిన బౌలర్లలో అమిత్ మిశ్రా కూడా ఒకడు. 2008 నుంచి 2024 వరకు మధ్యలో ఒక సీజన్ మినహా ప్రతీసారి మిశ్రా ఐపీఎల్ బరిలోకి దిగాడు.అంతేకాదు.. హైదరాబాద్, ఢిల్లీ, లక్నో తరఫున ఆడిన అతను 162 మ్యాచ్‌లలో 7.37 ఎకానమీతో 174 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానంతో ముగించాడు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 3 హ్యాట్రిక్‌లు (2008, 2011, 2013) సాధించిన ఏకైన బౌలర్‌గా మిశ్రా నిలిచాడు. చదవండి: కివీస్ క్రికెట్ దిగ్గజం సంచలన నిర్ణయం.. 41 ఏళ్ల వయసులో రీ ఎంట్రీ.. ఓ ట్విస్ట్ -
అతడికి అనుమతి ఎందుకు?.. అసలు బీసీసీఐ ఏం చేస్తోంది?
ఆసియా కప్-2025 టోర్నమెంట్, ఆ తర్వాత వరుస సిరీస్‌ల నేపథ్యంలో ఇప్పటికే భారత ఆటగాళ్లలో చాలా మంది ఫిట్నెస్ పరీక్షకు హాజరయ్యారు. బెంగళూరులో నిర్వహించిన టెస్టుల్లో వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), టెస్టు సారథి శుబ్‌మన్ గిల్, టీ20 జట్టు నాయకుడు సూర్యకుమార్ యాదవ్ పాసయ్యారు.వీరితో పాటు మహ్మద్ సిరాజ్, జితేశ్ శర్మ (Jitesh Sharma), ప్రసిద్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్, అభినవ్ మనోహర్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, సంజూ శాంసన్, శివం దూబే, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, ముకేశ్ కుమార్, హార్దిక్ పాండ్యా (Hardik Pandya), ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్ తదితరులు ఫిట్నెస్ పరీక్ష పూర్తి చేసుకున్నట్లు సమాచారం.వారంతా రెండో దశలో..ఇక రెండో దశలో భాగంగా రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ నెలలో ఫిట్నెస్ పరీక్ష పూర్తిచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆటగాళ్లంతా బెంగళూరులో ఫిట్నెస్ పరీక్షకు హాజరైతే.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి మాత్రం లండన్‌లోనే ఉన్నాడు.లండన్‌లోనే కోహ్లి ఫిట్నెస్ టెస్టుఅక్కడే కోహ్లి ఫిట్నెస్ పరీక్షలో పాల్గొన్నట్లు సమాచారం. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి కోహ్లి ముందుగానే అనుమతి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, టీమిండియా అభిమానులు మాత్రం దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘కోహ్లి భారత్‌లో కంటే లండన్‌లోనే ఎక్కువగా ఉంటాడు.తన కుటుంబమంతా అక్కడే ఉంటుంది. మ్యాచ్‌లు, ఐపీఎల్ ఉన్నపుడు మాత్రమే ఇండియాకు వస్తాడు. ఇప్పుడు ఫిట్నెస్ టెస్టు కూడా అక్కడేనా?.. అసలు బీసీసీఐ ఎందుకిలా చేస్తోంది?..అతడు ఏమైనా స్పెషలా? వేరేదేశంలో ఫిట్నెస్ టెస్టుకు ఎలా అనుమతినిస్తారు? మాకైతే ఇప్పుడు కోహ్లి ఇంగ్లండ్ క్రికెటర్ ఏమో అనే డౌట్ వస్తోంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ, కోహ్లి తీరును ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా రీఎంట్రీకాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇటీవలే టెస్టుల నుంచి కూడా వైదొలిగాడు. ప్రస్తుతం వన్డే, ఐపీఎల్లో కొనసాగుతున్న ఈ దిగ్గజ బ్యాటర్.. తదుపరి ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదిలా ఉంటే.. చివరగా ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా.. తదుపరి ఆసియా కప్-2025 టోర్నీలో పాల్గొననుంది. సెప్టెంబరు 9-28 వరకు పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీకి యూఏఈ వేదిక.చదవండి: ధృవ్ జురెల్‌ను తప్పించిన సెలెక్టర్లు -
బెంగళూరు తొక్కిసలాటపై తొలిసారి స్పందించిన విరాట్ కోహ్లి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ యేడు ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆనందం ఆ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు కానీ, అభిమానాలకు కానీ, యాజమాన్యానికి కానీ ఎన్నో రోజుల మిగల్లేదు. ఆర్సీబీ టైటిల్ గెలిచిన మరుసటి రోజు, అంటే జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 75 మందికి పైగా గాయపడ్డారు.ఈ విషాద సంఘటనపై నాడు యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మానవాళి మొత్తం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. చాలా కాలం సైలెంట్‌గా ఉన్న ఆర్సీబీ యాజమాన్యం కొద్ది రోజుల కిందటే మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది.తాజాగా ఈ ఘటనపై ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా స్పందించాడు (తొలిసారి). ఆర్సీబీ అధికార వెబ్సైట్ ద్వారా తన భావాలను పంచుకున్నాడు.జూన్ 4 లాంటి విషాదాన్ని జీవితంలో ఏదీ సిద్ధం చేయదు. ఇది మా ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత ఆనందకరమైన క్షణంగా ఉండాల్సింది. కానీ విషాదంగా మారింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. గాయాలపాలైన వారు పూర్తిగా కోలుకోవాలని దేవుడిని వేడుకుంటున్నాను. వారి బాధ మా కథలో భాగమైంది. ఇకపై జాగ్రత్తగా, గౌరవంతో, బాధ్యతతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు.“Nothing in life really prepares you for a heartbreak like June 4th. What should’ve been the happiest moment in our franchise’s history… turned into something tragic. I’ve been thinking of and praying for the families of those we lost… and for our fans who were injured. Your… pic.twitter.com/nsJrKDdKWB— Royal Challengers Bengaluru (@RCBTweets) September 3, 2025కాగా, బెంగళూరు దుర్ఘటనపై ఏర్పాటైన రిటైర్డ్ జడ్జి మైఖేల్ డికున్హా నేతృత్వంలోని కమిషన్ ఆర్సీబీ యాజమాన్యాన్ని బాధ్యులుగా చేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల్లో ఆర్సీబీ యాజమాన్యం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. బెంగళూరులో శ్రద్ధాంజలి స్థూపం నిర్మించనున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా 6-పాయింట్ల మానిఫెస్టోను విడుదల చేసింది. -
‘రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు ఆడాలి’
కెప్టెన్‌గా టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మ (Rohit Sharma) సొంతం. 2024లో టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన హిట్‌మ్యాన్.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మరో టైటిల్ సాధించాడు.అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్తద్వారా మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni- 3) తర్వాత భారత్‌కు అత్యధిక ఐసీసీ టైటిళ్లు అందించిన సారథిగా రోహిత్ చరిత్రకెక్కాడు. ఇక 2024లో వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పాడు.ప్రస్తుతం వన్డేల్లో కెప్టెన్ కొనసాగుతున్న 38 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా పదిహేనేళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ గురించి టీమిండియా యువ పేసర్ ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు క్రికెట్ ఆడాలి‘‘భారత క్రికెట్ మంచి కోసం రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు క్రికెట్ ఆడాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. 2019లో మేము రాజ్‌కోట్ వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతున్నపుడు.. నేను సరిగ్గా బౌల్ చేయలేకపోయాను. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాను.అప్పుడు డ్రెసింగ్‌రూమ్‌లో రోహిత్ భయ్యా నాతో ప్రత్యేకంగా మాట్లాడాడు. జట్టులోని సభ్యులంతా వెళ్లిపోయిన తర్వాత.. నా దగ్గరికి వచ్చి.. నేనెలా ఆడాలో చెప్పాడు. నాలో ఉన్న నైపుణ్యాల గురించి నాకంటే ఎవరికీ ఎక్కువగా తెలియదని.. నా సామర్థ్యాలను నేనే బయపెట్టాలని చెప్పాడు.ఇలాంటి కెప్టెన్లు అరుదుమేము స్టేడియం వీడి వెళ్తున్నపుడు అభిమానులంతా రోహిత్ భయ్యాను చూసి సంతోషంతో కేకలు వేస్తుంటే.. ‘ఏదో ఒకరోజు నీకు కూడా ఇలాంటి ఆనందకర సమయం వస్తుంది’ అని నాతో అన్నాడు. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలని చెప్పాడు.ఇలాంటి కెప్టెన్లు అరుదు. ప్రతి మ్యాచ్ తర్వాత భాయ్ నాతో మాట్లాడుతూ.. నా తప్పొప్పులను ఓపికగా వివరించాడు. ఇంత మంచి మనసు ఉన్నవాళ్లు కూడా ఇక్కడ ఉంటారా? అనిపించింది. రిషభ్ పంత్‌తో కూడా భయ్యా ఇలాగే ఉంటాడు.పూర్తి ఫిట్గావ్యక్తిగా, కెప్టెన్‌గా ఆయనకు ఆయనే సాటి. నిజంగా ఆరోజు రోహిత్ భయ్యా స్థానంలో వేరే వాళ్లుంటే అంత ఓపికగా నాతో మాట్లాడేవారే కాదు. ఈ మధ్య జాతీయ క్రికెట్ అకాడమీలో భయ్యాను కలిశాను. ఆయన పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. నిజంగా ఇలాంటి కెప్టెన్లు టీమిండియాకు అవసరం. ఆయన ఇంకో పదేళ్లు ఆడితే బాగుంటుంది’’ అని ఖలీల్ అహ్మద్ రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు.రోహిత్ కెప్టెన్సీలో అరంగేట్రంకాగా 2018లో మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోగా.. అతడి స్థానంలో రోహిత్ శర్మ ఆసియా వన్డే కప్ టోర్నీలో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. అప్పుడే ఖలీల్ అహ్మద్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 11 వన్డేలు, 18 టీ20లు ఆడిన ఖలీల్ అహ్మద్.. ఆయా ఫార్మాట్లలో 15, 16 వికెట్లు తీశాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ గతేడాది చివరగా టీమిండియాకు ఆడాడు.చదవండి: అవకాశం రాకుంటే.. నేనూ యూఎస్‌కు వెళ్లిపోయేవాడిని: టీమిండియా స్టార్ -
కోహ్లి దేశీ బాయ్!.. రన్ మెషీన్ మాత్రం అతడే: గంభీర్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత టీమిండియాతో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు కూడా విశ్రాంతి లభించింది. దాదాపు నెలరోజులుగా ఈ మాజీ క్రికెటర్ ఎక్కువగా కుటుంబానికే సమయం కేటాయించాడు. ఇక ఇటీవల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)-2025 ఫైనల్‌కు కూడా గౌతీ హాజరయ్యాడు.ఈ క్రమంలో ఓ ఫన్ సెగ్మెంట్లో గంభీర్ భాగమయ్యాడు. ఈ పదం వినగానే మీకు ఏ క్రికెటర్ గుర్తుకువస్తారు అంటూ యాంకర్ అడుగగా.. ఈ ఢిల్లీ స్టార్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. ‘క్లచ్ (క్లిష్ట పరిస్థితులు, ఒత్తిడిలో గొప్పగా రాణించే ఆటగాడు’ ఎవరన్న ప్రశ్నకు గంభీర్.. సచిన్ టెండుల్కర్ పేరు చెప్పాడు.ఇక ‘దేశీ బాయ్’గా విరాట్ కోహ్లిని అభివర్ణించిన గౌతీ.. స్పీడ్ అన్న పదం వినగానే తనకు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గుర్తుకువస్తాడన్నాడు. అదే విధంగా.. ‘గోల్డెన్ ఆర్మ్ (పార్ట్ టైమ్ బౌలరే అయినా కీలక వికెట్లు పడగొట్టే ఆటగాడు)’ అనగానే నితీశ్ రాణా పేరు చెప్పిన గంభీర్.. ‘మోస్ట్ స్టైలిష్’ అన్న పదానికి శుబ్‌మన్ గిల్ పేరు చెప్పాడు.ఇక ‘మిస్టర్ కన్సిస్టెంట్’గా రాహుల్ ద్రవిడ్‌ను పేర్కొన్న గంభీర్.. ‘రన్‌మెషీన్’ అనగానే తనకు వీవీఎస్ లక్ష్మణ్ గుర్తుకువస్తాడని తెలిపాడు. ‘మోస్ట్ ఫన్నీ’గా రిషభ్ పంత్ పేరు చెప్పిన గంభీర్.. ‘డెత్ ఓవర్ స్పెషలిస్టు’గా జహీర్ ఖాన్‌కు ఓటేశాడు.కాగా 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకోగా.. గంభీర్ ఆ బాధ్యతలు చేపట్టాడు. వన్డే, టీ20లలో కోచ్‌గా వరుస విజయాలు సాధించిన ఈ ఢిల్లీ మాజీ బ్యాటర్.. టెస్టుల్లో మాత్రం విఫలమయ్యాడు.గంభీర్ మార్గదర్శనంలో స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో తొలిసారి 3-0తో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (3-1)తో కోల్పోయింది. అయితే, ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరిచింది.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్ తర్వాత.. శుబ్‌మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఇందులో బర్మింగ్‌హామ్ టెస్టు విజయం ప్రత్యేకమైనది. ఈ వేదికపై తొలిసారి భారత్ టెస్టు గెలవడం విశేషం. ఈ సానుకూల ఫలితాలు గంభీర్‌కు కాస్త ఉపశమనం కలిగించాయి.ఇక తదుపరి ఆసియా కప్-2025 టోర్నమెంట్‌తో టీమిండియాతో పాటు గంభీర్ బిజీ కానున్నాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో సెప్టెంబరు 9-28 వరకు ఈ టోర్నీ జరుగనుంది. కాగా ఈ ఏడాది గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. గతేడాది ప్రారంభమైన ఢిల్లీ ప్రీమియర్ లీగ్.. రెండో ఎడిషన్ ఆదివారం ముగిసింది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో.. నితీశ్ రాణా కెప్టెన్సీలోని వెస్ట్ ఢిల్లీ లయన్స్.. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా డీపీఎల్-2025 చాంపియన్‌గా అవతరించింది. -
నేను.. రోహిత్ ఘోరంగా ఢీకొట్టుకున్నాం.. ఆరోజు ధోని ఫైర్: కోహ్లి
భారత క్రికెట్లో ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎవరివారే ప్రత్యేకం. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనుడు. విరాట్ కోహ్లి (Virat Kohli).. టెస్టుల్లో టీమిండియాను అగ్రపథాన నిలిపిన సారథి.. సచిన్ టెండుల్కర్ తర్వాత అత్యధిక సెంచరీల వీరుడిగా చెరగని రికార్డు..రోహిత్ శర్మ (Rohit Sharma).. హిట్‌మ్యాన్‌గా గుర్తింపు.. వన్డే, టీ20లలో తిరుగులేని బ్యాటర్.. కెప్టెన్‌గా భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన నాయకుడు. అయితే, కోహ్లి, రోహిత్ తొలినాళ్లలో ధోని సారథ్యంలోనే ఆడారు. అతడి నాయకత్వంలోనే రోహిత్ ఓపెనర్‌గా ప్రమోట్ అయితే.. కోహ్లి నాడు భవిష్య కెప్టెన్‌గా ఎదిగాడు.నాడు పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్ఆసియా టీ20 కప్-2025 సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురికి సంబంధించిన ఓ పాత ఘటన తాజాగా వైరల్ అవుతోంది. ఆసియా వన్డే కప్-2012లో భాగంగా నాడు టీమిండియా పాకిస్తాన్‌తో తలపడింది. ఆరోజు 231/2తో పటిష్టంగా ఉన్న పాక్ జట్టు.. భారీ స్కోరు దిశగా పయనిస్తుండగా.. కోహ్లి- రోహిత్ వల్ల తప్పిదం జరిగింది.ఒకరినొకరు ఢీకొట్టుకుని కిందపడిపోయారుటీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో..38 ఓవర్ తొలి బంతిని ఉమర్ అక్మల్ బౌండరీ దిశగా తరలించాడు. బంతిని ఆపే క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి- రోహిత్ బలంగా ఒకరినొకరు ఢీకొట్టుకుని కిందపడిపోయారు. ఫలితంగా పాక్‌కు అదనంగా మరో రెండు పరుగులు.. మొత్తంగా త్రీ రన్స్ వచ్చాయి.ధోనికి చాలా కోపం వచ్చిందిదీంతో కెప్టెన్ ధోని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన గురించి 2020లో అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడాడు. ‘‘ఆరోజు ఎంఎస్ ఏమాత్రం సంతోషంగా లేడు. అప్పుడు తనకి చాలా కోపం వచ్చింది. వాళ్లు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నారు. మన వల్ల అదనపు పరుగులు కూడా వస్తున్నాయి.అప్పుడు వాళ్లకు ఒక్క పరుగే రావాల్సింది. కానీ మనం మూడు ఇచ్చాము. ఇర్ఫాన్ బంతి వెంట నెమ్మదిగా పరిగెడుతూ ధోని వైపు త్రో చేశాడు. అప్పుడు ఎంఎస్.. ‘అసలు వీళ్లిద్దరు అలా ఎలా ఢీకొట్టుకున్నారు. మూడు పరుగులు ఎలా ఇచ్చారు’ అన్నట్లుగా ముఖంలో భావాలు పలికించాడు.ఆరోజు నేను మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. రోహిత్ డీప్ స్వ్కేర్ లెగ్‌లో ఉన్నాడు. ఇద్దరమూ బంతిని పట్టుకోవాలని పరిగెత్తాము. ఇంతలో నా తల కుడి భాగం అతడి భుజానికి బలంగా తాకింది. అప్పటికి అదేమీ సీరియస్ అనిపించలేదు.కానీ ఐదు నిమిషాల తర్వాత అసలేం జరిగిందో మాకు అర్థమైంది’’ అని కోహ్లి గుర్తుచేసుకున్నాడు. కాగా నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ఛేజింగ్ ‘కింగ్’ భారీ సెంచరీఇక లక్ష్య ఛేదనలో ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లి 148 బంతుల్లో 183 పరుగులు సాధించి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సచిన్ టెండుల్కర్తో కలిసి రెండో వికెట్‌కు 133 పరుగులు జోడించిన కోహ్లి.. రోహిత్‌తో కలిసి 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా.. ఆరు వికెట్లు మిగిలి ఉండగానే.. 48 ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. నాటి మ్యాచ్‌లో కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.చదవండి: తప్పుకొన్న తిలక్ వర్మ.. జట్టులోకి గుంటూరు కుర్రాడు -
టాప్-5 క్రికెటర్లలో కోహ్లికి నో ఛాన్స్.. సారీ చెప్పిన డివిలియర్స్
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించినప్పటి నుంచి మొదలైన వారిద్దరి స్నేహ బంధం ఇప్పటికి అలానే కొనసాగుతోంది. అయితే ప్రతీసారి కోహ్లికి సపోర్ట్‌గా ఉండే ఏబీడీ.. ఈసారి మాత్రం కింగ్ అభిమానులను నిరాశపరిచాడు. డివిలియర్స్ ఇటీవల బియర్డ్ బీఫోర్ వికెట్ పాడ్ కాస్ట్లో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్లో తాను చూసిన టాప్-5 బెస్ట్ టెస్టు క్రికెటర్లు ఎవరన్న ప్రశ్న హోస్ట్ నుంచి డివిలియర్స్‌కు ఎదురైంది. ఆశ్యర్యకరంగా డివిలియర్స్ ఎంచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి పేరు లేదు.నేను చాలా మంది దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడాను. టాప్-5లో అగ్రస్దానం కచ్చితంగా జాక్ కల్లిస్(సౌతాఫ్రికా)కే దక్కుతుంది. ఆ తర్వాత మొహమ్మద్ ఆసిఫ్(పాకిస్తాన్) ఉంటాడు. జీవితంలో నేను ఎదుర్కొన్న అత్యుత్తమ సీమర్ అతడే. ఇక మూడో స్ధానం షేన్ వార్న్(ఆస్ట్రేలియా). వార్నీ బౌలింగ్‌ని ఆడటాన్ని ఆస్వాదిస్తా. కానీ అతడి బౌలింగ్‌లో నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు.అతడు బంతిని రిలీజ్ చేసే విధానం, అతడి హెయిర్ స్టైల్.. వర్ణించడానికి మాటలు చాలవు. ఇక నాలుగో స్ధానంలో ఆండ్రూ ఫ్లింటాఫ్(ఇంగ్లండ్) ఉంటాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో కల్లిస్కు ఫ్లింటాఫ్ వేసిన యార్కర్ ఇప్పటికీ నాకు గుర్తు ఉంది. నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ యార్కర్ అదే. చివరగా మరో స్ధానం మిగిలి ఉంది. ఈ ప్లేస్ ఇండియన్ లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌కు ఇవ్వాలనకుంటున్నాను. నేను అతడికి ఒక అభిమానని. సచిన్ బ్యాటింగ్ స్టైల్ చాలా అందంగా ఉంటుందని డివిలియర్స్ పేర్కొన్నాడు. అయితే పక్కన ఉన్న ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ అదిల్ రషీద్.. కోహ్లికి ఛాన్స్ ఇవ్వలేదని గుర్తించాడు. అందుకు ఏబీడీ స్పందిస్తూ.. సారీ విరాట్. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టమని అన్నాడు. కాగా ఇటీవల ముగిసిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో సౌతాఫ్రికాను డివిలియర్స్ ఛాంపియన్‌గా నిలిపాడు.చదవండి: తప్పుకొన్న తిలక్ వర్మ.. జట్టులోకి గుంటూరు కుర్రాడు -
పొట్టివాళ్లే గొప్ప బ్యాటర్లు... సచిన్, కోహ్లి ఇందుకు ఉదాహరణ: ద్రవిడ్
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎత్తు తక్కువగా ఉన్నవాళ్లే గొప్ప బ్యాటర్లుగా ఎదిగారని పేర్కొన్నాడు. ఇందుకు టీమిండియా దిగ్గజాలు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి (Virat Kohli) చక్కటి ఉదాహరణ అని తెలిపాడు.అయితే, ప్రస్తుత టీ20 జమానాలో తనలాంటి పొడవైన బ్యాటర్లకు ఎత్తు అదనపు ప్రయోజనంగా మారిందని ద్రవిడ్ పేర్కొన్నాడు. బలంగా సిక్సర్లు బాదేందుకు ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. హల్ చాల్ ఔర్ సవాల్ పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు మాట్లాడుతూ..నేను కాస్త పొడవుగా ఉంటాను.. కాబట్టి‘‘క్రీజులో ఉన్నపుడు బ్యాలెన్స్ చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది. గావస్కర్ (Sunil Gavaskar) అద్భుతంగా తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటాడు. క్రీజులో ఆయన నిలబడే తీరు సూపర్.నేను కాస్త పొడవుగా ఉంటాను కదా!.. కాబట్టి ఆయనను అనుకరించడం సాధ్యంకాకపోయేది. నాకైతే బ్యాలెన్స్ చేసుకోలేక.. అసౌకర్యంగా ఉండేది. అలాగే సచిన్ టెండుల్కర్ కూడా!గావస్కర్ మాదిరే తనూ చక్కగా బ్యాలెన్స్ చేసుకునేవాడు. ఏదేమైనా పొట్టిగా ఉన్న వాళ్లకు ఇదొక అదనపు ప్రయోజనం. వాళ్ల గురుత్వాకర్షణ కేంద్ర బలం తక్కువగా ఉంటుంది. అందుకే గొప్ప బ్యాటర్లలో చాలామంది పొట్టివాళేల ఉంటారు.సచిన్, కోహ్లి ఇందుకు ఉదాహరణగావస్కర్, టెండుల్కర్, బ్రియన్ లారా, రిక్కీ పాంటింగ్.. డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఇందుకు ఉదాహరణ. కోహ్లి కూడా షార్టిష్. నేను తనని పొట్టివాడు అని అనడం కోహ్లికి నచ్చకపోవచ్చు’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.అయితే, టీ20 యుగంలో హైట్ బ్యాటర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని ద్రవిడ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. భౌతికశాస్త్రం అర్థం చేసుకుంటే మీకు ఇది అర్థమవుతుంది. కెవిన్ పీటర్సన్, కీరన్ పొలార్డ్, పొడవుగా ఉండటం వల్ల సిక్సర్లు బలంగా బాదగలిగారు. టీ20 ఫార్మాట్ విస్తృతమయ్యాక టాలెస్ట్ బ్యాటర్ల హవా నడుస్తోంది’’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.చదవండి: గిల్, స్కై, సంజూ కాదు!.. టీమిండియాకు ఆ ముగ్గురే గేమ్ ఛేంజర్లు: సెహ్వాగ్ -
కోహ్లి, గిల్ కాదు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం: ఇంగ్లండ్ స్టార్ పేసర్
మార్క్ వుడ్.. వరల్డ్ క్రికెట్లో అత్యంత వేగంతో బంతులు సంధించే పేస్ బౌలర్లలో ఒకడు. గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతడిది. కానీ ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్‌ను ఓ బ్యాటర్ భయపెట్టాడంట. సదరు బ్యాటర్‌కు బౌలింగ్ చేసేందుకు వుడ్ తీవ్రంగా శ్రమించాడంట.ఆ బ్యాటర్ ఎవరో కాదు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ ఏడాది మార్చి నుంచి గాయం కారణంగా ఇంగ్లండ్ జట్టుకు దూరంగా ఉంటున్న మార్క్ వుడ్.. తిరిగి తన ఫిట్నెస్ను పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. యాషెస్ సిరీస్ సమయానికి గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.అయితే మార్క్ వుడ్ తాజాగా ఓవర్లాప్ క్రికెట్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇప్పటివరకు తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ ఎవరన్న ప్రశ్న వుడ్‌కు ఎదురైంది. అందుకు అతడు బదులుగా రోహిత్ శర్మ పేరును చెప్పాడు. 35 ఏళ్ల మార్క్ వుడ్ అన్ని ఫార్మాట్లలోనూ హిట్‌మ్యాన్‌ను ఎదుర్కొన్నాడు."నా కెరీర్లో ఇప్పటివరకు నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ రోహిత్ శర్మ. ఫార్మాట్ ఏదైనా కానీ అతడికి బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డాను. షార్ట్ బాల్ వేసినప్పుడు అతడిని ఔట్ చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది. కానీ ఆ రోజు అతడు మంచి రిథమ్‌లో ఉంటే అపడం ఎవరి తరం కాదు. భారీ షాట్లతో విరుచుకుపడతాడు" అని వుడ్ పేర్కొన్నాడు.అదేవిధంగా విరాట్ కోహ్లి గురుంచి కూడా వుడ్ మాట్లాడాడు. "కోహ్లికి అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ప్రతీ బౌలర్‌కు అతడి నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ ఆఫ్‌సైడ్ ఫోర్త్, ఫిఫ్త్ స్టంప్‌లైన్‌లో వచ్చే బంతులు ఆడే విషయంలో మాత్రం అతడికి బలహీనత ఉంది. వాటికి తప్ప మరో బంతికి అతడిని అవుట్ చేయడం చాలా కష్టం" అని మార్క్ వుడ్ చెప్పుకొచ్చాడు. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ద్వయం స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్‌లకు బౌలింగ్ చేయడం కష్టమని ఈ ఇంగ్లీష్ స్పీడ్ స్టార్ తెలిపాడు.చదవండి: పాక్, భారత్, శ్రీలంక కాదు.. ఆసియాకప్ గెలిచేది వాళ్లే: పాక్ మాజీ క్రికెటర్ -
ODIs: ‘కోహ్లిని తప్పించలేరు.. రోహిత్ శర్మపై వేటు వేసేందుకు కుట్ర?’
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి (Manoj Tiwary) సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను పక్కనపెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో అంతర్గత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించాడు. వన్డే ప్రపంచకప్-2027 నాటికి రోహిత్ తనకు తానుగా తప్పుకొనేలా చేయాలని చూస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.కొత్తగా బ్రోంకో టెస్టు అయితే, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) దగ్గర మాత్రం వారి పప్పులు ఉడకవని మనోజ్ తివారి పేర్కొన్నాడు. అసలు విషయం ఏమిటంటే.. బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్నెస్ పరీక్షకు కొత్తగా బ్రోంకో టెస్టును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రగ్బీ, ఫుట్‌బాల్ ఆటగాళ్లకు నిర్వహించే బ్రోంకో టెస్టు ద్వారా టీమిండియా క్రికెటర్ల ఫిట్నెస్ను పరీక్షించాలని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (CoE) నిర్ణయించింది.ఇందులో భాగంగా ఆటగాడు తొలుత 20 మీటర్ల షటిల్ రన్ చేయాలి. తర్వాత దీనిని 40, 60 మీటర్లకు పెంచుతారు. ఈ మూడూ కలిపి ఒక సెట్ కాగా.. మొత్తంగా ఐదు సెట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే.. ఓవరాల్‌గా 1200 మీటర్ల దూరం విరామం లేకుండా ఆటగాడు వేగంగా పరుగుతీయాలి. ఇందుకు కేవలం ఆరు నిమిషాల సమయం ఉంటుంది.కోహ్లిని తప్పించలేరు.. రోహిత్‌పై వేటు వేసేందుకు కుట్రఈ నేపథ్యంలో బ్రోంకో టెస్టు గురించి మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘‘వన్డే వరల్డ్‌కప్-2027 ప్రణాళికల నుంచి విరాట్ కోహ్లిని తప్పించడం అంత తేలికేమీ కాదు. అయితే, రోహిత్ శర్మపై విషయంలో మాత్రం వారు సఫలమయ్యే అవకాశం ఉంది. భారత క్రికెట్లో ఏం జరుగుతుందో నేను గత కొన్నాళ్లుగా నిశితంగా పరిశీలిస్తున్నా.కొన్ని రోజుల క్రితం బ్రోంకో టెస్టు ప్రవేశపెట్టారు. రోహిత్ శర్మ లాంటి వాళ్లను బయటకు పంపేందుకే ఇలాంటి కఠినమైన ఫిట్నెస్ పరీక్షను తీసుకువచ్చారు. అన్నిటికంటే ఇదే టఫెస్ట్ ఫిట్నెస్ టెస్టు. అయినా.. ఇప్పుడే ఇది ఎందుకు ప్రవేశపెట్టారు? హెడ్‌కోచ్‌గా తొలి టెస్టు సిరీస్‌కు సన్నద్ధమైనపుడే దీనిని తీసుకురావాల్సింది.ఈ ప్రశ్నలకు నాకైతే బదులు తెలియదు. అయితే, నిశితంగా పరిశీలిస్తే మాత్రం రోహిత్ శర్మ ఈ టెస్టు పాస్ కావడం కష్టం. అతడు ఫిట్‌నెస్‌పై అంతగా దృష్టి పెట్టడు. బ్రోంకో టెస్టు ద్వారా అతడిని ఆపేయాలనే ఉద్ధేశంతో ఉన్నారని నాకు సందేహం’’ అంటూ మనోజ్ తివారి పరోక్షంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.చదవండి: ఒక్క సిక్స్‌తో అంతా తలకిందులయ్యేది.. అప్పుడు నేను..: సిరాజ్ -
ఆర్సీబీ కోచ్ లేదంటే మెంటార్‌గా వస్తా: ఏబీ డివిలియర్స్
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB de Villiers)కు ఉన్న ఫ్యాన్‌ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్‌తోనూ అభిమానులను అలరించాడు.ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)తో తన ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన డివిలియర్స్.. 2011లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)లో చేరాడు. రిటైర్మెంట్ వరకు అదే జట్టుతో కొనసాగిన ఏబీడీకి ఆర్సీబీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. కోహ్లితో కలిసి సంబరాలుఐపీఎల్-2025 ఫైనల్లో ఆర్సీబీ గెలవగానే యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌తో కలిసి డివిలియర్స్ కూడా విరాట్ కోహ్లి (Virat Kohli)తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీకి మద్దతుగా వచ్చి.. ఆర్సీబీ పదిహేడేళ్ల సుదీర్ఘకల నెరవేరగానే డివిలియర్స్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు.ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పటికీ డివిలియర్స్ తమ జట్టులో భాగంగానే భావిస్తారు. అతడు తిరిగి వస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా తమ అభిలాషను తెలుపుతూ ఉంటారు. ఇక ఇందుకు సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. డివిలియర్స్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు.కోచ్ లేదంటే మెంటార్‌గా..అయితే, ఆటగాడిగా రీఎంట్రీ కాకుండా.. కోచ్ లేదంటే మెంటార్ పాత్రలో ఆర్సీబీలో చేరే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. ‘‘భవిష్యత్తులో నేను మళ్లీ ఐపీఎల్లో భాగమయ్యే అవకాశం ఉంది. అయితే, సీజన్ ఆసాంతం ప్రొఫెషనల్ విధులు నిర్వర్తించేందుకు నేను సిద్ధంగా లేను.మనసంతా ఆర్సీబీతోనేఆరోజులు ముగిసిపోయాయి. ఏదేమైనా నా మనసు ఎల్లప్పుడూ ఆర్సీబీతోనే ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ ఫ్రాంఛైజీ నాకు కోచ్ లేదా మెంటార్‌గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తే.. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తులో ఐపీఎల్లో పునరాగమనం చేస్తే కచ్చితంగా ఆర్సీబీతోనే ఉంటాను’’ అని డివిలియర్స్ వార్తా సంస్థ IANSతో పేర్కొన్నాడు.పరుగుల వీరుడుకాగా సౌతాఫ్రికా తరఫున 2004- 2018 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు డివిలియర్స్. తన కెరీర్లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 8765, 9577, 1672 పరుగులు సాధించాడు.ఇక ఐపీఎల్లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీ డివిలియర్స్ 5162 పరుగులు సాధించాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి. 2021లో ఆర్సీబీ తరఫున కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోరులో డివిలియర్స్ చివరగా తన ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు వారే: ఛతేశ్వర్ పుజారా -
ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావాల్సి వస్తే.. ఆరోజే రిటైర్మెంట్: కోహ్లి
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli)తో కలిసి ఆడాలనేది ఎంతో మంది యువ క్రికెటర్లకు చిరకాల కోరిక. అతడితో కలిసి డ్రెసింగ్ రూమ్ షేర్ చేసుకున్నా చాలని తపించే ప్లేయర్లు ఎందరో!.. ఐపీఎల్-2025 ద్వారా ఉత్తరప్రదేశ్ కుర్రాడు స్వస్తిక్ చికారాకు ఆ కల నెరవేరింది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ప్రాతినిథ్య వహించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.ట్రోఫీని ముద్దాడుతూఅరంగేట్రం చేయకపోయినా.. సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ పదిహేడేళ్ల తర్వాత టైటిల్ గెలిచిన ఆర్సీబీ జట్టులో చికారా భాగమయ్యాడు. అంతేకాదు.. కోహ్లితో కలిసి ట్రోఫీని ముద్దాడుతూ ఫొటోలకు ఫోజులిస్తూ సంతోషంలో తేలిపోయాడు. ఇరవై ఏళ్ల ఈ యూపీ బ్యాటర్ తాజాగా కోహ్లి గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు.ఆరోజే క్రికెట్‌ను వదిలేస్తాను‘‘‘నేను ఎంత కాలం ఫిట్‌గా ఉంటే.. అంతకాలం క్రికెట్ ఆడతాను. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రం అస్సలు రాను. సింహంలా ఆడటంలోనే మజా ఉంది. నేను 20 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయగలగాలి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు రావాలి.ఏ రోజైతే నేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావాల్సి వస్తుందో ఆరోజే క్రికెట్‌ను వదిలేస్తాను’ అని విరాట్ భయ్యా నాతో చెప్పారు’’ అని స్వస్తిక్ చికారా (Swastik Chikara) రెవ్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి అంటే.. 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి.. పరుగుల వరద పారిస్తున్నాడు. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ ఈసారి అందడంతో ఫుల్ ఖుషీ అయిపోయాడు.వన్డే, ఐపీఎల్లో కొనసాగుతున్న కోహ్లిఇక 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డేలతో పాటు ఐపీఎల్లో కొనసాగుతున్నాడు ఈ రన్‌మెషీన్.కాగా 36 ఏళ్ల కోహ్లి ఇప్పటి టీమిండియా తరఫున 123 టెస్టుల్లో 9230, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. వన్డేల్లో సచిన్ టెండుల్కర్‌కు కూడా సాధ్యంకాని రీతిలో 51 సెంచరీలు సాధించి.. 14181 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఐపీఎల్లో ఇప్పటికి 267 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 8661 రన్స్ రాబట్టాడు.చదవండి: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రెడ్డికి చోటు -
లార్డ్స్‌లో విరాట్ కోహ్లి.. ఆ సిరీస్‌కు సన్నద్ధం.. సెలక్టర్లకు మెసేజ్!
వన్డే వరల్డ్‌కప్-2027 వరకు టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఆటలో కొనసాగుతారా?.. ఈ ఇద్దరి పేర్లను మెగా ఐసీసీ టోర్నీకి బీసీసీఐ (BCCI) సెలక్టర్లు పరిగణిస్తున్నారా? లేదా?.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇదో హాట్‌టాపిక్.ఇటీవల ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ నుంచి విరాట్, రోహిత్ పేర్లు మాయంకావడం.. ఆ తర్వాత తప్పును సరిదిద్దుకున్న ఐసీసీ మళ్లీ వారి పేర్లను చేర్చడం.. వన్డే రిటైర్మెంట్ వార్తలకు ఊతమిచ్చింది. ఇలాంటి తరుణంలో విరాట్, రోహిత్.. ఇద్దరూ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టడం ద్వారా వదంతులకు చెక్ పెట్టేశారు.లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌కు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. కాగా ప్రస్తుతం లండన్‌లో ఉన్న విరాట్ కోహ్లి.. తాజాగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో నెట్ ప్రాక్టీస్ చేయడం విశేషం. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ దాదాపు రెండు గంటల పాటు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించినట్లు సమాచారం.స్పిన్, పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ... వైవిధ్యభరితమైన షాట్లు ఆడుతూ కోహ్లి తన ప్రాక్టీస్ సెషన్‌ను పూర్తిచేసినట్లు తెలిసింది. ఇక ప్రాక్టీస్‌కు వెళ్లిన సమయంలో లార్డ్స్ స్టేడియంలో అభిమానులతో కలిసి కోహ్లి ఫొటోలకు ఫోజులిచ్చాడు.భారత్-ఎ తరఫునమరోవైపు.. రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. మరో అనూహ్య నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో స్వదేశంలో జరుగబోయే అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్-ఎ తరఫున ఆడాలని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పగా.. ఆ వెంటనే కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఈ ఇద్దరూ వన్డేల్లో మాత్రం కొనసాగుతామని స్పష్టం చేశారు.ఆసీస్ సిరీస్‌తో కోహ్లి, రోహిత్ రీ ఎంట్రీఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20లలో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్‌మన్ గిల్ టీమిండియా పగ్గాలు చేపట్టారు. గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసిన భారత్.. తదుపరి యూఏఈ వేదికగా సూర్య కెప్టెన్సీలో ఆసియా టీ20 కప్-2025 టోర్నీ ఆడనుంది. సెప్టెంబరు 9-28 వరకు జరిగే ఈ ఖండాంతర టోర్నీ అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టులు ఆడుతుంది భారత జట్టు. ఆ తర్వాత అక్టోబరులో ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. చదవండి: Asia Cup 2025: అదొక వింత నిర్ణయం.. కెప్టెన్ అయ్యే ప్లేయర్‌ను జట్టు నుంచి తీసేస్తారా?రోహిత్, విరాట్ కోహ్లి రిటైర్మెంట్!? .. బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు -
రోహిత్, విరాట్ కోహ్లి రిటైర్మెంట్!? .. బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియా టూర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీ20లు, టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వీరిద్దరూ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత రో-కో ద్వయం ఇప్పటివరకు భారత తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే వన్డే ప్రపంచకప్-2027 దృష్ట్యా వీరిద్దరి స్ధానాల్లో యువ ఆటగాళ్లను బీసీసీఐ సిద్దం చేయనుందని, అక్టోబర్‌లో ఆసీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీసే ఆఖరిదని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సీనియర్ ద్వయం రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ (BCCI ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. అవన్నీ వట్టి రూమర్సే అని అతడు కొట్టిపారేశారు. రోహిత్, కోహ్లి ఇద్దరూ వైట్ బాల్ క్రికెట్లోకి తిరిగొచ్చేందుకు తమ ట్రైనింగ్‌ను తిరిగి ప్రారంభించారు. కాగా రాజీవ్ శుక్లా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో శుక్లాను సచిన్ టెండూల్కర్‌లాగానే రోహిత్, కోహ్లిలకు ప్రత్యేకంగా ఫేర్వెల్ నిర్వహిస్తారా ? అని హోస్ట్ ప్రశ్నించాడు."రోహిత్, కోహ్లి ఇంకా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కాలేదు. వారిద్దరూ ఇంకా వన్డేలు ఆడుతున్నారు. వారు ప్రస్తుతం కేవలం రెండు ఫార్మాట్ల నుంచి మాత్రమే తప్పుకొన్నారు. మరో ఫార్మాట్లో ఆడుతున్నప్పుడు మీరెందుకు వారి ఫేర్వెల్ గురుంచి మాట్లాడుతున్నారు? వారి రిటైర్మెంట్ గురించి మీరంతా ఎందుకు ఆందోళన చెందుతున్నారు? బీసీసీఐకి ఒక పాలసీ ఉంటుంది. బీసీసీఐ ఎవరిని కూడా రిటైర్మెంట్ ఇవ్వమని అడగదు. వారే సొంతంగా తమ నిర్ణయాలు తీసుకోవాలి. ప్లేయర్ తీసుకునే నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము. ఆటగాళ్లు విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో మాకు తెలుసు. కానీ ఇదంతా ఇప్పుడు అనవసరం.విరాట్ కోహ్లి చాలా ఫిట్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా బాగా ఆడుతున్నాడు. కాబట్టి వారి ఫేర్వెల్ గురుంచి ఆలోచిండం ఆపయేండి" అని శుక్లా పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఆక్టోబర్‌లో భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం -
విరాట్ నుంచి ఆ రెండు రికార్డులకు ముప్పు తప్పినట్లే..!
క్రికెట్లో రికార్డుల రారాజు ఎవరంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు విరాట్ కోహ్లి. ఈ బ్యాటింగ్ దిగ్గజం మరో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ బిరుదుకు పూర్తి న్యాయం జరగాలంటే విరాట్ మరో రెండు భారీ రికార్డులు బద్దలు కొట్టాల్సి ఉంది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడేలా కనిపించడం లేదు. ఎందుకుంటే, విరాట్ ఇదివరకే టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. తాజాగా విరాట్ వన్డే రిటైర్మెంట్పై కూడా ఊహాగానాలు ఎక్కువయ్యాయి. పైగా అతడి వయసు కూడా పైబడుతుంది.ఈ పరిస్థితుల్లో విరాట్ సచిన్ ఖాతాలో ఉన్న ఆ రెండు భారీ రికార్డులను బద్దలు కొట్టడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఆ రికార్డులకు విరాట్ నుంచి ముప్పు తప్పినట్లే అనుకోవాలి. ఇంతకీ ఆ రెండు రికార్డులు ఏవంటే.. మొదటిది వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు. రెండవది అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సెంచరీల రికార్డు.ప్రస్తుతం ఈ రెండు రికార్డులు విరాట్ కనుచూపుమేరల్లో కూడా లేవు. నాలుగైదేళ్ల కిందట ఈ రికార్డులను విరాట్ సులువుగా బద్దలు కొడతాడని అనిపించింది. అయితే గత కొంతకాలంగా విరాట్ నెమ్మదిపడటంతో ఈ రికార్డులు పరిధి దాటిపోయాయి. విరాట్‌కు వీటికి దూరం పెరిగిపోయింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ రికార్డులు అందని ద్రాక్షాల్లా మిగిలిపోవడం ఖాయమని అనిపిస్తుంది. ఇదే జరిగితే ఆ రెండు భారీ రికార్డులు సచిన్ ఖాతాలోనే సేఫ్‌గా ఉంటాయి. వాటిని సమీప భవిష్యత్తులో కూడా ఎవరూ బద్దలు కొట్టలేరు.వన్డేల్లో అత్యధిక పరుగులుసచిన్ ఖాతాలో ఉన్న ఈ రికార్డును (18426) చేరుకోవాలంటే విరాట్ మరో 4245 పరుగులు చేయాలి. విరాట్ వయసు దృష్ట్యా ఇది అసంభవమనే చెప్పాలి. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 14181 పరుగులు ఉన్నాయి. మహా అయితే అతడు మరో 50 లేదా 60 వన్డేలు ఆడతాడు. ఈ మ్యాచ్‌ల్లో 4000 పైచిలుకు పరుగులు సాధించడం అసాధ్యం.100 సెంచరీలుప్రపంచ క్రికెట్లో అసాధ్యంగా కనిపించే ఈ రికార్డును సచిన్ నెలకొల్పాడు. నాలుగైదేళ్ల కిందటి వరకు ఈ రికార్డును విరాట్ సాధిస్తాడనే నమ్మకముండేది. అయితే విరాట్ గత కొంతకాలంగా నెమ్మదించడంతో ఈ రికార్డుకు దూరం పెరిగింది. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 82 సెంచరీలు ఉన్నాయి. సచిన్ రికార్డును సమం చేయాలన్నా విరాట్ మరో 18 సెంచరీలు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమనే చెప్పాలి. ఈ లెక్కన పై రెండు రికార్డులు సచిన్ ఖాతాలోనే సేఫ్‌గా ఉంటాయి. -
తప్పు సరిదిద్దుకున్న ఐసీసీ.. రీఎంట్రీ ఇచ్చిన రోహిత్, కోహ్లి
ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 20) ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఘోర తప్పిదం జరిగింది. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండు, నాలుగు స్థానాల్లో ఉండిన టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-100లో కూడా కనబడలేదు. ఈ ఇద్దరి పేర్లు ఆకస్మికంగా మాయం కావడంపై సోషల్‌మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్స్ నడుస్తుండగా ఐసీసీ స్పందించింది.సాంకేతిక లోపం కారణంగా రోహిత్, కోహ్లి పేర్లు ర్యాంకింగ్స్‌లో కనబడలేదని వివరణ ఇచ్చింది. తప్పును సరి దిద్దుకుంటూ వారిద్దరి పేర్లను తిరిగి ర్యాంకింగ్స్ జాబితాలో చేర్చింది. అప్డేట్ చేసిన తర్వాత రోహిత్, కోహ్లి తమ పాత ర్యాంకులైన రెండు, నాలుగు స్థానాలను తిరిగి దక్కించుకున్నారు.రోహిత్, కోహ్లి వన్డే ర్యాంకింగ్స్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంతో వారి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ర్యాంకింగ్స్‌లో కనపడకపోయే సరికి రోహిత్, కోహ్లి వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించారని ప్రచారం జరిగింది. అయితే సాంకేతిక లోపం కారణంగా తప్పిదం జరిగిందని తెలిసి రోహిత్, కోహ్లి అభిమానుల మనసులు కుదుటపడ్డాయి.కాగా, సాంకేతిక లోపం కారణంగా తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మరిన్ని తప్పిదాలు దొర్లాయి. రోహిత్, కోహ్లి పేర్లు మాయమైపోవడంతో పాటు పలువురు రిటైరైన ఆటగాళ్ల పేర్లు జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్, స్టీవ్ టికోలో, అలెక్స్ ఓబండ, థామస్ ఒడోయో, అన్షీ రథ్ లాంటి పేర్లు ఉన్నాయి. తప్పిదాన్ని గుర్తించిన తర్వాత ఐసీసీ వీరి పేర్లను తొలగించింది.సవరించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, చరిత్ అసలంక, హ్యారీ టెక్టార్, శ్రేయస్ అయ్యర్, ఇబ్రహీం జద్రాన్, కుసాల్ మెండిస్ టాప్-10లో ఉన్నారు. -
రోహిత్, కోహ్లికి ఊహించని షాకిచ్చిన ఐసీసీ.. ఆకస్మికంగా తొలగింపు
ఐసీసీ తాజాగా (ఆగస్ట్ 20) ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను భారీ షాక్‌కు గురి చేశాయి. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు.. వారం తిరిగేలోపే ర్యాంకింగ్స్ నుంచి పూర్తిగా మాయమైపోయారు. ఇవాళ (ఆగస్ట్ 20) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్, కోహ్లి పేర్లు కనిపించలేదు. ఇది చూసి రోహిత్, కోహ్లితో పాటు వారి అభిమానులు కూడా షాక్‌కు గురవుతున్నారు. ఇంత సడెన్‌గా తమ ఆరాధ్య ఆటగాళ్ల పేర్లు ఎలా మాయమైపోయాయని ఆశ్చర్యపోతున్నారు. ఇలా జరగడంలో ఐసీసీ తప్పిదమేమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. కొందరేమో రోహిత్, కోహ్లి టీ20, టెస్ట్ తరహాలో వన్డే రిటైర్మెంట్ కూడా సడెన్‌గా ప్లాన్ చేశారేమోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఐసీసీ రూల్స్ ఇలా..!ఐసీసీ ర్యాంకింగ్ రూల్స్ ప్రకారం.. ఓ ఆటగాడు 9-12 నెలల కాలంలో సంబంధింత ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోతే ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. అయితే తాజా ఉదంతంలో రోహిత్, కోహ్లి విషయంలో అలా జరగలేదు. వీరిద్దరు మార్చి 9న, అంటే ఐదు నెలల కిందట ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు. ఈ లెక్కన రోహిత్, కోహ్లి పేర్లు సడెన్‌గా వన్డే ర్యాంకింగ్స్ నుంచి తొలగించడానికి వీల్లేదు.మరి ఏం జరిగి ఉంటుంది..?రోహిత్, కోహ్లి పేర్లు వన్డే ర్యాంకింగ్స్ నుంచి ఆకస్మికంగా తొలగించడం వెనుక ఏదైనా కుట్ర (బీసీసీఐ) దాగి ఉందా అని వారి అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు ఈ ఫార్మాట్లో కొనసాగుతామని పరోక్షంగా చెప్పారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ సానుకూలంగా లేదని తెలుస్తుంది.రోహిత్, కోహ్లి రెండు ఫార్మాట్లలో లేకపోయినా యువ ఆటగాళ్లతో టీమిండియా పటిష్టంగా ఉందని వారి భావన. వీరిద్దరు వన్డేల నుంచి తప్పుకున్నా జట్టుపై పెద్ద ప్రభావముండదని వారి అభిప్రాయం. ఇప్పటి నుంచే వన్డేల్లో రోహిత్, కోహ్లి ప్రత్యామ్నాయాలకు తగినన్ని అవకాశాలిస్తే 2027 వరల్డ్‌కప్ సమయానికి రాటుదేలతారని వారి అంచనా. ఇవన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీయే రోహిత్, కోహ్లిలను బలవంతంగా వన్డేల నుంచి తప్పుకునేలా చేస్తుందన్న వాదన వినిపిస్తుంది. ఇందులో భాగంగానే వారి పేర్లను వన్డే ర్యాంకింగ్స్ నుంచి తొలగించేలా ఐసీసీకి లేఖ రాసి ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఇదే జరిగి ఉంటుందని రోహిత్, కోహ్లి అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే, వన్డే ర్యాంకింగ్స్ నుంచి రోహిత్, కోహ్లి పేర్లు తొలగింపు తర్వాత కూడా శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బాబర్ ఆజమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. టీమిండియా నుంచి శ్రేయస్ అయ్యర్ ఆరో స్థానంలో ఉన్నాడు. -
అసలేం అనుకుంటున్నారు?: రోహిత్, కోహ్లి, గిల్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం
టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ తీరుపై భారత మాజీ క్రికెటర్ కర్సన్ ఘవ్రీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దిగ్గజ బ్యాటర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) కు కనీస మర్యాద ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డాడు. అనుభవం, నైపుణ్యం ఉన్న లెజెండ్ సలహాలు ఇస్తే.. వాటిని సానుకూల దృక్పథంతో స్వీకరించాలే తప్ప.. ప్రతి విమర్శలు చేస్తారా? అంటూ ఫైర్ అయ్యాడు.పాతికేళ్లకు పైగా..భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా పేరొందిన సునిల్ గావస్కర్.. ఆ తర్వాత కామెంటేటర్‌గా అవతారమెత్తాడు. పాతికేళ్లకు పైగా తన వ్యాఖ్యానంతో ప్రేక్షకులను అలరిస్తూ.. మైదానంలో ఆటగాళ్లు చేసే తప్పులను విశ్లేషిస్తూ విమర్శలు చేస్తూంటాడు ‘లిటిల్ మాస్టర్’. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఆట తీరును సందర్భానుసారం విమర్శిస్తూ కామెంట్లు చేశాడు.కోహ్లి కౌంటర్.. రోహిత్ ఫిర్యాదు!ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఐపీఎల్లో కోహ్లి స్ట్రైక్ రేటును ప్రస్తావించడం.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మపై గావస్కర్ చేసిన విమర్శలను వాళ్లు తేలికగా తీసుకోలేకపోయారు. తాను స్ట్రైక్‌రేటు గురించి కాకుండా .. జట్టు ప్రయోజనాల కోసమే ఆడతానని కోహ్లి స్పష్టం చేయగా.. గావస్కర్ కామెంట్రీపై రోహిత్ శర్మ ఏకంగా బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.గిల్‌కు ఆయన అవసరం ఎంతగానో ఉందిఈ పరిణామాల నేపథ్యంలో గావస్కర్ సహచర ఆటగాడు కర్సన్ ఘవ్రీ.. నవతరం ఆటగాళ్ల తీరు సరిగ్గా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘గత 25 ఏళ్లకు పైగా గావస్కర్ కామెంట్రీ చేస్తున్నాడు. యువ ఆటగాళ్లకు ఆయన మాటలు విలువైన సలహాలు. కానీ.. మన ఆటగాళ్లలో కొందరు మాత్రం సలహాల కోసం గావస్కర్ వద్దకు వెళ్లనే వెళ్లరు.విదేశీ ఆటగాళ్లు గావస్కర్ సలహాల కోసం వస్తుంటే.. మనోళ్లు మాత్రం ఆయనను పట్టించుకోరు. ఇప్పుడు భారత జట్టులో ఉన్న ప్రతీ ఆటగాడు కచ్చితంగా గావస్కర్ వద్దకు వెళ్లాలి. ముఖ్యంగా శుబ్‌మన్ గిల్‌కు ఆయన అవసరం ఎంతగానో ఉంది.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ల ఆటను గావస్కర్ విమర్శించాడని వార్తలు వస్తాయే తప్ప.. సలహాల కోసం వాళ్లు ఆయనను సంప్రదించినట్లు ఎక్కడా కనబడదు. ఏదేమైనా గావస్కర్ సలహాలు ఇస్తే దానిని స్వీకరించకపోవడం నాన్సెన్స్ అనే చెప్పాలి.ఎవరైతే ఏంటి? అసలేం అనుకుంటున్నారు?నువ్వు రోహిత్ శర్మ లేదంటే విరాట్ కోహ్లి అయితే ఏంటి?.. దిగ్గజాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. గావస్కర్ ఏం చెప్పినా అది మీ మంచి కోసమే. అంతెందుకు రవిశాస్త్రి కూడా విమర్శలు చేస్తాడు. అయితే, గావస్కర్ తనదైన శైలిలో మంచీ, చెడూ విశ్లేషిస్తాడు’’ అని మాజీ పేసర్ కర్సన్ ఘవ్రీ విక్కీ లల్వాణీ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు.చదవండి: ఆసియా కప్- 2025: అభిషేక్ శర్మకు జోడీగా.. వైభవ్ సూర్యవంశీ ఉండాలి: మాజీ కెప్టెన్ -
ఐపీఎల్‌పై రూ. 7.50 లక్షల ప్రశ్న.. సమాధానం మీకు తెలుసా?
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’.. ఇండియాలో మోస్ట్ పాపులర్ రియాలిటీ గేమ్ షోలలో ఒకటి. ఎన్నో సీజన్ల నుంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటున్న ఈ షో తాజాగా 17వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్లో కూడా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.అయితే గత వారంలో కంటెస్టెంట్లకు క్రికెట్‌కు సంబంధించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్‌పై సెంచరీతో చేసిన భారత ఆటగాడు ఎవరు అన్న ప్రశ్న హోస్ట్ అమితాబ్ అడిగారు. ఈ ప్రశ్నకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఇందుకు సమాధానం ఆప్షన్ బి విరాట్ కోహ్లి. ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్ధిపై కోహ్లి అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. కాగా ఈ ప్రశ్న "సూపర్ సాండూక్" అనే స్సెషల్ రౌండ్లో భాగంగా అడిగారు. ఈ రౌండ్లో మొత్తం పది ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు పదివేలు. మొత్తం పది ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే లక్ష రూపాయలు బహుమతిగా లభించనుంది. అదేవిధంగా మరో కంటెస్టెంట్‌కు రూ. 7.50 లక్షలకు గానూ ఐపీఎల్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు పర్పుల్ క్యాప్ గెలవని ప్లేయర్ ఎవరు? అన్న ప్రశ్న అమితాబ్ అడిగారు. ఇందుకు ఆప్షన్స్‌గా ఎ. లసిత్ మలింగ, బి.హర్షల్ పటేల్, సి. డ్వేన్ బ్రావో, డి. భువనేశ్వర్ కుమార్. సరైన సమాధనం అప్షన్ ఎ. లసిత్ మలింగ. మలింగ మినహా హర్షల్ పటేల్, డ్వేన్ బ్రావో, భువనేశ్వర్ ఐపీఎల్లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచారు.చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. సౌతాఫ్రికాకు భారీ షాక్ -
17 ఏళ్ల కెరీర్.. విరాట్ సాధించిన భారీ రికార్డులు ఇవే..!
టీమిండియా స్టార్ ఆటగాడు, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో ఇవాల్టితో (ఆగస్ట్ 18) 17 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 2008లో ఇదే రోజున విరాట్ వన్డేల ద్వారా టీమిండియా అరంగేట్రం చేశాడు. నాటి నుంచి విరాట్ ఏం చేశాడో ప్రపంచమంతా చూసింది.17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ, పరుగుల వరద పారిస్తున్న విరాట్.. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. మరెన్నో కొత్త రికార్డులు నెలకొల్పాడు. ఈ సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో విరాట్ సాధించిన భారీ రికార్డులపై ఓ లుక్కేద్దాం.అన్ని ఫార్మాట్లలో 550 మ్యాచ్‌లు ఆడిన విరాట్... 52.27 సగటున 82 సెంచరీలు, 143 హాఫ్ సెంచరీల సాయంతో 27599 పరుగులు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (34357), సంగక్కర (28016) తర్వాత మూడో స్థానంసచిన్ (100) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడుఒకే దశకంలో 20000 పైచిలుకు పరుగులు చేసిన తొలి ఆటగాడుసచిన్ (76) తర్వాత అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (69) అందుకున్న ఆటగాడుఅత్యధిక మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు (21) అందుకున్న ఆటగాడుఅత్యధిక ఐసీసీ అవార్డులు (10) అందుకున్న ఆటగాడువన్డేల్లో అత్యధిక సెంచరీలు (51) చేసిన ఆటగాడువన్డేల్లో అత్యంత వేగంగా 8000-14000 పరుగులు చేసిన ఆటగాడువన్డే ఛేదనల్లో అత్యధిక సెంచరీలు (24) చేసిన ఆటగాడువన్డేల్లో ఓ జట్టుపై (శ్రీలంక) అత్యధిక సెంచరీలు (10)వన్డేల్లో మూడు దేశాలపై (శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా) 8కి పైగా సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడుటీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (39)టీ20ల్లో అత్యధిక సగటు (48.70) కలిగిన ఆటగాడుటీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (39)ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో నంబర్ వన్‌గా నిలిచిన ఏకైక భారత ఆటగాడుకెప్టెన్గా అత్యధిక (7) డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడుఅత్యంత వేగంగా 25 టెస్ట్ సెంచరీలు చేసిన భారత ఆటగాడుభారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారధి (68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు)గతేడాది టీ20 ఫార్మాట్‌కు.. ఈ ఏడాది టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్, ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. -
August 18.. క్రికెట్ దిగ్గజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రోజు
ఆగస్ట్ 18.. భారత్ క్రికెట్‌కు సంబంధించి ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజు భారత్ క్రికెట్ దిగ్గజాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. 17 ఏళ్ల కిందట (2008) ఈ రోజున విరాట్ కోహ్లి అనే ఢిల్లీ కుర్రాడు జెంటిల్మెన్ గేమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. డంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో క్రికెట్ అభిమానులకు పరిచయమయ్యాడు. అనంతరం 2010 జూన్ 12న జింబాబ్వేపై టీ20 అరంగేట్రం.. మరుసటి ఏడాది (2011) జూన్ 20న వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేశాడు.కెరీర్ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డా, ఆతర్వాత విరాట్ ఏం చేశాడో ప్రపంచం మొత్తం చూసింది. ఇంకా చూస్తూనే ఉంది. విరాట్ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ, పరుగుల వరద పారిస్తూ ఎన్నో ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. మరెన్నో కొత్త రికార్డులను సృష్టించాడు. గతేడాది టీ20 ఫార్మాట్‌కు.. ఈ ఏడాది టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.ఆగస్ట్ 18.. ఈ రోజు భారత్ మరో స్టార్ బ్యాటర్‌ను ప్రపంచ క్రికెట్‌కు పరిచయం చేసింది. 2018లో ఈ రోజున చిచ్చరపిడుగు రిషబ్ పంత్ టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. గడిచిన ఏడేళ్లలో పంత్ టెస్ట్‌ల్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు అపురూప విజయాలు అందించాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే జరిగింది. అయితే ఈ పర్యటనలో పంత్ చివరి టెస్ట్‌కు ముందు గాయపడి సిరీస్ నుంచి వైదొలిగాడు.టెస్ట్ అరంగేట్రానికి ముందే పంత్ టీ20 ఫార్మాట్ ద్వారా భారత క్రికెట్‌కు పరిచయమయ్యాడు. 2017 ఫిబ్రవరి 1న పంత్ ఇంగ్లండ్‌తో టీ20తో పొట్టి ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్ట్ అరంగేట్రం తర్వాత అదే ఏడాది అక్టోబర్ 21న పంత్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మూడు ఫార్మాట్లలో స్థిరపడిన పంత్ మధ్యలో కారు ప్రమాదం కారణంగా కొద్ది కాలం ఆటకు దూరమైనా, ఆతర్వాత తిరిగి జట్టులోకి వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు.ఆగస్ట్ 18 భారత్ క్రికెట్‌కు మరో చిచ్చరపిడుగును పరిచయం చేసింది. 2023లో ఈ రోజున విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ మెరుపుల తర్వాత భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న రింకూ.. ఐర్లాండ్‌తో మ్యాచ్ ద్వారా టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది డిసెంబర్ 19 రింకూ వన్డేల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే వన్డేల్లో రింకూ కేవలం 2 మ్యాచ్‌లకు మాత్రమే పరిమితయ్యాడు. తన ఆటతీరు సుదీర్ఘ ఫార్మాట్‌కు సరిపోదు కాబట్టి, రింకూ టెస్ట్ అరంగేట్రం చేయలేదు. ఐపీఎల్లో కేకేఆర్‌కు ఆడుతూ యశ్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా 5 సిక్సర్లు బాదడంతో రింకూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ మ్యాచ్‌లో రింకూ తన జట్టుకు సంచలన విజయాన్ని అందించడంతో పాటు ప్రపంచం మొత్తాన్ని ఆకర్శించాడు. -
కోహ్లి కాదు!.. ఆ టీమిండియా స్టార్ మోస్ట్ డేంజరస్ బ్యాటర్
దిగ్గజ బౌలర్లకు సైతం నిద్రలేని రాత్రులు మిగిల్చిన బ్యాటర్లలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag)ఒకడు. మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో అతడు దిట్ట. ఇక సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తమకు తామే సాటిప్రపంచ క్రికెట్లో శతక శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా సచిన్ చిరస్మరణీయ రికార్డు సాధించాడు. అద్భుతమైన నైపుణ్యాలతో బౌలర్లను బోల్తా కొట్టిస్తూ పరుగులు పిండుకోవడంలో అతడికి అతడే సాటి. వీరితో పాటు టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. అలాగే రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి కూడా టీమిండియా నుంచి వచ్చిన గొప్ప ఆటగాళ్లలో ప్రత్యేక స్థానం ఉంటుంది.బౌలర్లకు చుక్కలు చూపించగల సత్తా ఉన్న ఈ నలుగురు భారత ప్లేయర్ల గురించి సౌతాఫ్రికా పేసర్ వేన్ పార్నెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎదుర్కొన్న కఠినమైన బ్యాటర్లలో సెహ్వాగ్ ముందుంటాడని పేర్కొన్నాడు. కోహ్లి కాదు.. సెహ్వాగ్ డేంజరస్ బ్యాటర్‘‘నాకు తెలిసి ప్రతి ఒక్కరు.. నేను విరాట్ కోహ్లి పేరు చెప్తానని భావించి ఉంటారు. అయితే, నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచి వీరేందర్ సెహ్వాగ్ నాకో తలనొప్పిగా మారాడు. ఇక సచిన్ టెండుల్కర్ కూడా నా బౌలింగ్‌లో ఎంతో సులువుగా పరుగులు రాబట్టేవాడు. అతడొక నైపుణ్యాల ఘని.సచిన్ చాలా స్మార్ట్సెహ్వాగ్ ఎక్కువగా బౌండరీలు బాదడానికి ఇష్టపడతాడు. అయితే, టెండుల్కర్ మాత్రం ప్రత్యర్థిని తికమకపెడతాడు. తను మొదట ఆడిన షాట్‌కు అనుగుణంగా మనం ఫీల్డింగ్ సెట్ చేసి, బౌలింగ్ వ్యూహం మార్చుకుంటే తాను మరోలా ఆడతాడు. సచిన్ చాలా స్మార్ట్‌గా బ్యాటింగ్ చేస్తాడు.ధోనికి బౌలింగ్ చేయడం కష్టంటీమిండియాతో మ్యాచ్ అంటే నాకు నిద్రలేని రాత్రులే మిగిలేవే. ఇక ధోని వంటి ఆటగాడికి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం చాలా చాలా కష్టం’’ అంటూ వేన్ పార్నెల్ టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు.కాగా 36 ఏళ్ల వేన్ పార్నెల్ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్. సౌతాఫ్రికా తరఫున ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి 15 వికెట్లు తీశాడు. అదే విధంగా.. 73 వన్డేల్లో 99 వికెట్లు పడగొట్టిన పార్నెల్.. 56 టీ20 మ్యాచ్‌లు ఆడి 59 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక మూడు ఫార్మాట్లలో కలిపి టీమిండియాతో ఇప్పటికి 23 మ్యాచ్‌లు ఆడిన పార్నెల్ పందొమ్మిది వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా తరఫున చివరగా 2023లో అతడు.. టీ20 మ్యాచ్ ఆడాడు.చదవండి: ఆసియా కప్-2025: పాక్ జట్టు ప్రకటన -
విరాట్, రోహిత్ రిటైర్మెంట్ వెనుక కుట్ర..? మాజీ ప్లేయర్ సంచలన కామెంట్స్
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. భారత క్రికెట్‌కు డాదాపు 16 ఏళ్ల పాటు తమ సేవలను అందించిన ఈ ఇద్దరి లెజెండరీ క్రికెటర్లకు సరైన వీడ్కోలు మాత్రం లభించింది.ఈ కోవకు చెందిన వారే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు. వారిద్దరూ కూడి ఎటువంటి వీడ్కోలు లేకుండా తమ టెస్టు కెరీర్లను ముగించారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్, కోహ్లిలు వారం రోజుల వ్యవధిలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందిరికి షాకిచ్చారు.ఈ సీనియర్ ద్వయం లేకుండానే ఇంగ్లండ్‌కు వెళ్లిన భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమంగా ముగించింది. అయితే తాజాగా రోహిత్, కోహ్లి రిటైర్మెంట్లపై భారత మాజీ ఆల్ రౌండర్ కర్సన్ ఘావ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐలో రాజకీయాల వల్లే వారిద్దరూ త్వరగా రిటైరయ్యారని ఆయన ఆరోపించాడు."వరల్డ్ క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. మరో మూడేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడే సత్తా కోహ్లికి ఉంది. అటువంటిది ఆకస్మికంగా కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడం వెనక కొన్ని శక్తులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను.అంతేకాకుండా సుమారు 14 ఏళ్ల పాటు భారత జట్టుకు తన సేవలను అందించిన విరాట్‌కు బీసీసీఐ కనీసం ఫేర్వెల్ కూడా ఏర్పాటు చేయలేదు. కోహ్లి, రోహిత్ వంటి ఆటగాళ్లు ఘనమైన వీడ్కోలుకు ఆర్హులు. ఇది బీసీసీఐలోని అంతర్గత రాజకీయాల కారణంగా జరిగింది.దీనిని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ కారాణాలతోనే కోహ్లి త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ కూడా కావాలనుకుంటే మరి కొన్నాళ్ల పాటు ఆడేవాడు. కానీ కొంత మంది బీసీసీఐ పెద్దలు అతడిని జట్టు నుంచి బయటకు పంపాలని చూశారు. వారు కోరుకున్న విధంగానే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడని" విక్కీ లాల్వానీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘావ్రీ పేర్కొన్నాడు. -
గిల్‌కు వారిద్దరి సపోర్ట్ కావాలి.. లేదంటే కష్టమే: సురేష్ రైనా
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో వీరిద్దరూ భారత జెర్సీలో కన్పించనున్నారు. అయితే ఈ సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లిలు ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వన్డే వరల్డ్‌కప్-2027 కోసం వారిద్దరూ స్ధానంలో యువ ఆటగాళ్లను సిద్దం చేసే యోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో రో-కో వన్డే భవిష్యత్తుపై టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్లో రోహిత్, కోహ్లి సేవలు భారత జట్టుకు కచ్చితంగా అవసరమని రైనా అభిప్రాయపడ్డాడు."ప్రస్తుత భారత వన్డే జట్టులో నంబర్ 1, నంబర్ 3లో సరైన ఆటగాళ్లు లేరు. ప్రత్యేకంగా ఛేజింగ్‌లో ఆయా స్ధానాల్లో నిలకడగా రాణించే ఆటగాళ్లు కావాలి. కాబట్టి ఎంతో అనుభవం ఉన్న రోహిత్, విరాట్ భారత జట్టులో కొనసాగాలి. వారిద్దరి తమ సేవలను టీమిండియాకు మరి కొన్నాళ్లపాటు అందించాలి. ఇక శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్ పర్యటనలో అద్బుతంగా రాణించాడు.వన్డే జట్టును కూడా నడిపించగలడు. కానీ గిల్‌కు విరాట్, రోహిత్ లాంటి ఆటగాళ్లు అవసరం. వారిద్దరూ వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ గెలిచిన జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇద్దరూ లెజెండరీ కెప్టెన్లు. కచ్చితంగా వారిద్దరూ భారత డ్రెస్సింగ్ రూమ్‌లో భాగం కావాలి" అని టెలికాం ఆసియా స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. కాగా భవిష్యత్తులో వన్డేల్లో కూడా భారత జట్టు పగ్గాలను గిల్‌కు అప్పగించే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: అప్పటిలా కాదు.. అన్నీ మారిపోయాయి.. కోహ్లితో మాట్లాడాలంటే..: భువీ -
అప్పటిలా కాదు.. అన్నీ మారిపోయాయి.. కోహ్లితో..: భువీ
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)తో తన అనుబంధం ఏళ్లుగా కొనసాగుతోందని.. అయితే, ఇప్పుడు తమ మధ్య జరిగే సంభాషణలు పూర్తిగా మారిపోయాయని వెల్లడించాడు. జట్టులో చోటు గల్లంతుకాగా కోహ్లి కెప్టెన్సీలో టీమిండియాలో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్న భువీ.. ఆ తర్వాత కెరీర్లో వెనుకబడిపోయాడు. టీమిండియా తరఫున 2022లో చివరగా ఆడిన భువనేశ్వర్ కుమార్.. ఆ తర్వాత వివిధ లీగ్‌లలో సత్తా చాటినా రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు పేస్ దళంలో కీలకంగా మారగా.. వీరితో పాటు ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ప్రసిద్ కృష్ణల రాకతో భువీ స్థానం గల్లంతైంది.తిరిగి ఆర్సీబీ గూటికిప్రస్తుతం లీగ్ క్రికెట్ మాత్రమే ఆడుతున్న భువనేశ్వర్ కుమార్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2025 మెగా వేలంలో కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ రైటార్మ్ పేసర్‌ను వదిలేయగా.. ఆర్సీబీ రూ. 10.75 కోట్లకు అతడిని కొనుక్కుంది. ఇందుకు తగ్గట్లుగానే భువీ పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.ఈ సీజన్లో 14 మ్యాచ్‌లలో కలిసి 17 వికెట్లు కూల్చిన భువీ.. ఆర్సీబీ తొలిసారి ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆర్సీబీలోకి పునరాగమనం చేసిన వెంటనే.. తన పాత కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి ఈ మేర జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.అప్పటిలా కాదు.. అన్నీ మారిపోయాయి.. కోహ్లితో మాట్లాడాలంటేఈ నేపథ్యంలో తాజాగా భువనేశ్వర్ కుమార్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. కోహ్లితో తన అనుబంధం గురించి వివరించాడు. ‘‘ఇప్పుడు అన్నీ మారిపోయాయి. అప్పట్లో ఉన్నట్లు కాదు. మేము ఇప్పుడు మా కుటుంబాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం.క్రికెట్ కాకుండా.. మిగిలిన జీవితం గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నాం. అప్పట్లో మేము యువకులం. అప్పటికి పెళ్లిళ్లు కూడా కాలేదు. అందుకే అందరు యువకుల మాదిరే మేము కూడా జోక్స్ వేసుకుంటూ సరదాగా గడిపేవాళ్లం. కానీ ఇప్పుడు మేము పరిణతి చెందిన పురుషులం.వయసు పెరుగుతోంది కదా!ఏదేమైనా మైదానంలో మాత్రం మేము ఎప్పుడూ ప్రొఫెషనల్‌గానే ఉంటాము. ఆర్సీబీ లేదంటే.. ఏ ఫ్రాంఛైజీ అయినా ఓ ఆటగాడిని కొన్నదంటే.. జట్టులోని మిగతా సభ్యులతో అతడికి స్నేహం ఉన్నా లేకపోయినా.. మైదానంలో సమిష్టిగా విజయం కోసం పోరాడాల్సి ఉంటుంది.అందుకే గ్రౌండ్లో మేము కేవలం ఆట గురించి మాత్రమే చర్చించుకుంటాం. అయితే, ఆట ముగిసిన తర్వాత అంతా మళ్లీ మామూలే. మా వయసు పెరుగుతోంది కదా! అందుకే.. అప్పటికీ.. ఇప్పటికీ సంభాషణల్లో చాలా మార్పులు వచ్చాయి’’ అని 35 ఏళ్ల భువీ చెప్పుకొచ్చాడు. -
Independence Day: కోహ్లి అలా.. గంభీర్ ఇలా.. పోస్ట్ వైరల్
భారత స్వాతంత్య్ర దినోవత్సం సందర్భంగా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఉద్వేగపూరిత నోట్ రాశాడు. ఎంతో మంది వీరుల ప్రాణత్యాగాల వల్లే మనం ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నాడు. అలాంటి నిజమైన హీరోలకు సెల్యూట్ చేస్తున్నానంటూ... దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు.భారతీయుడినైనందుకు గర్విస్తున్నా‘‘ఈరోజు మనం ఇలా స్వేచ్ఛగా నవ్వగలుగుతున్నామంటే అందుకోసం నాడు వారంతా ధైర్యంగా ఒక్కటై పోరాడటమే కారణం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన వీరుల త్యాగాన్ని గౌరవిస్తూ.. వారికి సెల్యూట్ చేస్తున్నా. భారతీయుడినైనందుకు గర్విస్తున్నా. జై హింద్’’ అంటూ విరాట్ కోహ్లి ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అతడి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా అంతర్జాతీయ క్రికెట్లో 82 శతకాలు సాధించిన కోహ్లి.. ఇప్పటికే ఇంటర్నేషనల్ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డే, ఐపీఎల్లో కొనసాగుతున్న ఈ దిగ్గజ బ్యాటర్.. ఇటీవలే మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు అతడు సన్నద్ధమవుతున్నాడు.కాగా టీమిండియా తరఫున 123 టెస్టులు ఆడిన కోహ్లి.. 30 శతకాలు, ఏడు డబుల్ సెంచరీల సాయంతో 9230 పరుగులు సాధించాడు. అదే విధంగా.. 125 టీ20 మ్యాచ్‌లలో కలిపి 4188 రన్స్ చేశాడు. ఇందులో ఓ శతకంతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లండన్‌లో నివాసంమరోవైపు.. వన్డేల్లో ఛేజింగ్ కింగ్‌గా పేరొందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్‌కు కూడా సాధ్యం కాని విధంగా.. 51 సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.ఇక కోహ్లి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామికా, అకాయ్‌లతో కలిసి లండన్‌లోనే ఎక్కువగా నివాసం ఉంటున్నాడు. కెరీర్‌కు సంబంధించిన షెడ్యూల్ పూర్తికాగానే వెంటనే లండన్‌లో వాలిపోతున్నాడు. తమ పిల్లల గోప్యత, సంరక్షణ దృష్ట్యా కోహ్లి దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.దిగ్గజాల శుభాకాంక్షలు.. నా దేశమే నా గుర్తింపుటీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను విజేతగా నిలిపిన తర్వాత మువ్వన్నెల జెండా చేతబట్టిన ఫొటోను షేర్ చేశాడు. ఇక టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే, మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ తదితరులు 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్.. ‘‘నా దేశం, నా గుర్తింపు.. నా జీవితం.. జై హింద్’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. చదవండి: ధోని జట్టు నుంచి నన్ను తప్పించాడు.. అప్పుడే రిటైర్ అయ్యేవాడిని.. కానీ..: సెహ్వాగ్ -
నేను కోచింగ్ ఇచ్చిన అత్యుత్తమ ఆటగాడు అతడే: రవి శాస్త్రి
విరాట్ కోహ్లి.. కెప్టెన్‌గా, ఆటగాడిగా తన పేరును భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్‌ను సాధించికపోయినప్పటికి భారత జట్టుకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించాడు.అతడి నాయకత్వంలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. అంతేకాకుండా భారత జట్టును ఐదేళ్ల పాటు నంబర్ 1 జట్టుగా కోహ్లి నిలిపాడు. అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లి అద్బుతాలు చేశాడు. తాజాగా కోహ్లితో తన ప్రయణాన్ని గురించి రవిశాస్త్రి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కింగ్ కోహ్లిపై శాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు."నేను కోచ్‌గా పనిచేసిన అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉంటాడు. అతడొక అద్బుతమైన బ్యాటర్, లీడర్. భారత జట్టును రెడ్ బాల్ ఫార్మాట్లో నంబర్ వన్‌గా ఐదేళ్ల పాటు నిలిపాడు. ఆ ఐదేళ్లలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి సేనా దేశాల్లో టీమిండియా చిరస్మరణీయ విజయాలను అందుకుంది.అంతేకాకుండా అదే సమయంలో విరాట్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా విదేశాల్లో అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడు ఆడిన కొన్ని ఇన్నింగ్స్‌లు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాక కోహ్లిని భారత జట్టు సారథిగా ఎంపిక చేయాలని నేను సూచించాను. బ్యాటర్‌గా అతడికి ఉన్న స్కిల్స్, గేమ్ పట్ల మక్కువ, ఆధిపత్యం చెలాయించే నైజం, కష్టపడి ఆడడం వంటి ఎన్నో లక్షణాలు నన్ను ఆకట్టుకున్నాయి" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా 2017 నుంచి 2021 వరకూ ఈ వరల్డ్ కప్ విన్నర్ భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా సేవలందించాడు. ఇక కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టు క్రికెట్‌కు కోహ్లి వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. తన టెస్టు కెరీర్‌ను 9230 పరుగులతో ఈ ఢిల్లీ బాయ్ ముగించాడు.చదవండి: PAK vs WI: 'ఇకనైనా దేశం కోసం ఆడండి'.. పాక్ జట్టుపై షోయబ్ అక్తర్ ఫైర్ -
ఆసీస్ గడ్డపై వేటకు సిద్దమవుతున్న కింగ్ కోహ్లి..
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్-2025 సీజన్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న కింగ్ కోహ్లి.. ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో భారత జట్టు తరపున ఆడనున్నాడు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న కోహ్లి ఆసీస్‌తో సిరీస్ కోసం తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు.ట్రైనింగ్ సెషన్లో గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ నయీమ్ అమీన్‌తో కోహ్లి కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అభిమానులు కింగ్ తిరిగొస్తున్నాడని తెగ సంబరపడుతున్నారు. కాగా టెస్టులకు,టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.పొట్టి ప్రపంచకప్-2024 విజయం తర్వాత అంతర్జాతీయ టీ20లు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. కోహ్లి చివరగా భారత తరపున ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. ఈ మెగా టోర్నీ టైటిల్‌ను భారత్ సొంతం చేసుకోవడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఐదు మ్యాచ్‌లలో మొత్తంగా విరాట్ 218 పరుగులు చేశాడు.వన్డే వరల్డ్‌కప్‌లో కోహ్లి ఆడుతుతా?అయితే దక్షిణాఫ్రికా వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్-2027లో కోహ్లి ఆడేది అనుమానమే. అప్పటికి అతడి వయస్సు 38 ఏళ్ల దాటుతుండడంతో ఈ మెగా టోర్నీకి ఓ యువ ఆటగాడిని సిద్దం చేసే యోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది.ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కోహ్లి, రోహిత్‌ల వన్డే భవిష్యత్తుపై ఓ క్లారిటి వచ్చే అవకాశముంది. ఇప్పటి నుంచి ప్రపంచకప్-2027 ముందు వరకు భారత జట్టు 27 వన్డేలు ఆడనుంది. వరల్డ్ కప్ కోసం జట్టు సెలక్షన్ రేసులో ఉండాలంటే ఈ సీనియర్ ద్వయం ఫిట్నెస్, ఫామ్‌ను కాపాడుకోవాలి.అయితే దేశవాళీ టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో కూడా రోకో ఆడనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన ఆక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.చదవండి: ఐపీఎల్-2025లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! టీమిండియా లెజెండ్‌పై వేటు? -
కోహ్లిని దాటేసిన వార్నర్.. పొట్టి క్రికెట్లో మరో ఘనత
ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ప్రైవేట్ టీ20 లీగ్‌ల్లో సత్తా చాటుతూనే ఉన్నాడు. వయసు మీద పడుతున్నా (38) వార్నర్‌లో జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్ ఆడుతున్న వార్నర్ (లండన్ స్పిరిట్).. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు (70 నాటౌట్, 71) బాదాడు.మాంచెస్టర్ ఒరిజినల్స్‌పై 71 పరుగుల ఇన్నింగ్స్ అనంతరం వార్నర్ పొట్టి క్రికెట్లో ఓ ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లిని వెనక్కు నెట్టి టాప్-5లోకి (ఐదో స్థానం) చేరాడు. కోహ్లి తన టీ20 కెరీర్లో 414 మ్యాచ్‌ల్లో 13543 పరుగులు చేయగా.. వార్నర్ 419 మ్యాచ్‌ల్లో 13545 పరుగులు చేసి కోహ్లిని అధిగమించాడు. హండ్రెడ్ లీగ్‌లో వార్నర్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. ఈ జాబితాలో క్రిస్ గేల్ 14562 పరుగులతో (463 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. కీరన్ పోలార్డ్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.వార్నర్‌కు పోలార్డ్ స్థానానికి చేరుకోవడానికి 309 పరుగులు.. హేల్స్ స్థానానికి చేరుకోవడానికి 269 పరుగులు, షోయబ్ మాలిక్ స్థానానికి చేరుకోవడానికి కేవలం 16 పరుగులు మాత్రమే కావాలి. హండ్రెడ్ లీగ్‌లో మరో మ్యాచ్‌లోనే వార్నర్ షోయబ్ మాలిక్ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.కాగా, ఇటీవలికాలంలో పేలవ ప్రదర్శనలు చేసిన వార్నర్.. హండ్రెడ్ లీగ్‌తోనే తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. దీనికి ముందు జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో వార్నర్ 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 114 పరుగులు మాత్రమే చేశాడు. హండ్రెడ్‌లో వార్నర్ రాణిస్తున్నా అతని జట్టు లండన్ స్పిరిట్ మాత్రం మెరుగైన ప్రదర్శనలు చేయలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. ఆ మ్యాచ్‌లో కూడా డేవిడ్ వార్నరే (70 నాటౌట్) ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. -
ఫామ్‌లో ఉంటే కొనసాగించాలి
కోల్‌కతా: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను వన్డే ఫార్మాట్లో కొనసాగించడమే ఉత్తమమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో రోహిత్, కోహ్లి అసాధారణ క్రికెటర్లని... ఫామ్‌లో ఉంటే మరిన్ని రోజులు ఈ ఇద్దరినీ ఆడించాలని ‘దాదా’ సూచించాడు. మీడియాలో రోహిత్, కోహ్లి భవితవ్యంపైనే తరచూ ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆ్రస్టేలియా పర్యటనతోనే ఇద్దరి అంతర్జాతీయ కెరీర్ ముగుస్తుందనే వార్తలపై స్పందించిన గంగూలీ ‘నాకు వాటి గురించి ఏమాత్రం తెలియదు. కాబట్టి వ్యాఖ్యానించను’ అని అన్నాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అతను మీడియాతో మాట్లాడుతూ ‘ఇద్దరి ఫామ్‌ను చూడాలి. బాగా ఆడుతుంటే కొనసాగించాలి. వన్డేల్లో కోహ్లిది అసాధారణ రికార్డు. రోహిత్‌ది కూడా! జట్టుకు భారంగా ఏమీ లేరు. బాధ్యతగానే రాణిస్తున్నారు. అలాంటపుడు ఈ ఫార్మాట్లో కొనసాగించడంలో తప్పేముంది’ అని అన్నాడు. కోహ్లి, రోహిత్ ఇదివరకే టి20, టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీమిండియానే ఫేవరెట్... వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ టి20 టోర్నీలో భారతే ఫేవరెట్ అని గంగూలీ అన్నాడు. ‘టెస్టుల్లో భారత్ ఎంతటి కఠినమైన ప్రత్యర్థో ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో చాటుకుంది. వన్డే, టి20ల్లో కూడా మన జట్టు మేటిగా ఉంది. దుబాయ్ వేదికపై భారత్ తప్పకుండా సత్తా చాటుకుంటుంది. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మంచి నాయకుడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది’ అని ‘దాదా’ చెప్పాడు. సభ్యుల సహకారంతో బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్ష పదవికి మరోసారి పోటీ పడతానని గంగూలీ తెలిపాడు. 2015 నుంచి 2019 వరకు ‘క్యాబ్’ అధ్యక్షుడిగా కొనసాగిన గంగూలీ... తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగానూ పని చేశాడు. తదుపరి వన్డే ప్రపంచకప్ 2027లో జరగనుంది. ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటివరకు కోహ్లి, రోహిత్ ఆడతారనే స్పష్టత ఎవరికీ లేదు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా పర్యటనతోనే ఆ ఇద్దరి భవితవ్యం తేలిపోతుందనే చర్చ మీడియాలో జోరందుకుంది. అక్టోబర్ 19న ఆ్రస్టేలియా టూర్ మొదలవుతుంది. పెర్త్, అడిలైడ్, సిడ్నీ వేదికలపై టీమిండియా మూడు వన్డేలు ఆడుతుంది. అలాగే స్వదేశంలో దక్షిణాఫ్రికాతోనూ మూడు వన్డేల ద్వైపాక్షకి సిరీస్‌లో పాల్గొంటుంది. వచ్చే క్యాలెండర్ ఇయర్లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లతో భారత్‌కు బిజీ షెడ్యూల్ ఉంది. -
కోహ్లి, రోహిత్ అభిమానులకు చేదు వార్త
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు చేదు వార్త. ఈ భారత స్టార్ ద్వయం త్వరలోనే వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించి కెరీర్‌ను ముగిస్తారని సమాచారం. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరుగబోయే సిరీసే వీరికి చివరిదని ఓ ప్రముఖ దినపత్రిక తమ కథనంలో పేర్కొంది. రోహిత్, కోహ్లి ఇప్పటికే టీ20లకు, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.కొద్ది రోజుల ముందు వరకు రోకో (రోహిత్, కోహ్లి) 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు ఆడతారని ప్రచారం జరిగింది. అయితే తాజా నివేదిక ప్రకారం ఇది తప్పని తెలుస్తుంది. ఒకవేళ రోకో 2027 వరల్డ్‌కప్ ఆడాలని అనుకుంటే డిసెంబర్లో జరిగే విజయ్ హజారే ట్రోఫీలో తమను తాము నిరూపించుకోవాలని బీసీసీఐ ఆదేశించిందట.ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా బీసీసీఐ రోహిత్, కోహ్లిలకు రంజీల్లో నిరూపించుకోవాలని కండీషన్ పెట్టింది. బోర్డు ఆదేశానుసారం వారు అలా చేసినా, అనూహ్యంగా టెస్ట్‌ల నుంచి తప్పుకున్నారు.ఇప్పుడు వన్డేల విషయంలోనూ రోకో గతంలో ఎదుర్కొన్న ఛాలెంజ్‌నే ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. జట్టులోకి రావాలంటే తప్పక దేశవాలీ టోర్నీల్లో రాణించాల్సి ఉంటుంది.యువ ఆటగాళ్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రోహిత్, కోహ్లి 2027 వరల్డ్ కప్ వరకు ఆడటం అనుమానంగా కనిపిస్తుంది. వీరికి వయసు మీద పడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇటీవల వైరలైన కోహ్లి తెల్ల గడ్డం ఫోటో ఇందుకు నిదర్శనం. పైకి కనిపించకపోయినా కోహ్లి కంటే రోహితే వయోభారం సమస్యలను అధికంగా ఎదుర్కొంటున్నాడు. రోహిత్ విషయానికొస్తే.. బాగా లావైపోయి ఆటకు పనికొస్తాడా అన్నట్లు కనిపిస్తున్నాడు. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వీరు ప్రాక్టీస్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు. కోహ్లి లండన్‌లోనే మకాం వేసి అప్పుడప్పుడు బ్యాట్‌ను తిప్పుతుండగా.. రోహిత్ పూర్తిగా ప్రాక్టీస్ మానేసి కుటుంబంతో జాలీ ట్రిప్‌లు ఎంజాయ్ చేస్తున్నాడు. -
‘విరాట్ భయ్యా అరుస్తూనే ఉన్నాడు.. నాకేమో భయం’
టెస్టుల్లో అరంగేట్రం సందర్భంగా తనకు ఎదురైన అనుభవం గురించి టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana) తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఓవైపు తనను భయపెడుతుంటే.. మరోవైపు.. విరాట్ భయ్యా, రాహుల్ భయ్యా తనను ‘ఆందోళన’కు గురిచేశారంటూ సరదా విషయాలు పంచుకున్నాడు.తొలి వికెట్‌గా అతడుకాగా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా హర్షిత్ రాణా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో అతడు బంతితో రంగంలోకి దిగాడు. ట్రవిస్ హెడ్ (11) రూపంలో తన తొలి అంతర్జాతీయ వికెట్ దక్కించుకున్న ఈ రైటార్మ్ పేసర్.. జిడ్డు ఇన్నింగ్స్‌తో క్రీజులో పాతుకుపోయిన మిచెల్ స్టార్క్ (112 బంతుల్లో 26)ను కూడా వెనక్కి పంపించాడు.నాకు ఇది గుర్తుండిపోతుందిఈ క్రమంలో హర్షిత్.. స్టార్క్‌కు బౌన్సర్ సంధించగా.. బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో కంగారుపడ్డ హర్షిత్.. అంతా ఒకేనా అన్నట్లు స్టార్క్‌కు సైగ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘నేను నీకంటే ఫాస్ట్‌గా బౌల్ చేయగలను. నాకు ఇది గుర్తుండిపోతుంది’’ అంటూ స్టార్క్ సరదాగా వ్యాఖ్యానించాడు.చచ్చానురా దేవుడా!ఈ విషయం గురించి హర్షిత్ రాణా తాజాగా మాట్లాడుతూ.. ‘‘చాలా సేపటి తర్వాత ఆరోజు నేను స్టార్క్‌కు బౌన్సర్ వేశాను. అతడు స్లెడ్జ్ చేయగానే.. నేను నవ్వేశాను. కానీ.. తిరిగి బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నపుడు.. ‘చచ్చానురా దేవుడా!.. ఇక ఇప్పుడు అతడు నాకు కూడా బౌన్సర్సే వేస్తాడు’ అని భయపడ్డాను.కొట్టు.. ఇంకా కొట్టుఇంతలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ భయ్యా, కేఎల్ భాయ్.. ‘సేమ్ స్పాట్లో అతడికి మళ్లీ బంతి తగిలేలా బౌలింగ్ వెయ్’ అని అరుస్తూనే ఉన్నారు. నేనేమో.. ‘భయ్యా మీరైతే అతడి బౌలింగ్‌లో సులభంగానే ఆడేస్తారు. మరి నా పరిస్థితి ఏమిటి?అనుకున్నదే జరిగిందిఅతడు కూడా నన్ను హెల్మెట్‌పై బంతితో కొడతాడు’ అని మనసులోనే అనుకున్నా. అనుకున్నట్లుగానే రెండో టెస్టులో స్టార్క్ బాల్‌ను నా హెల్మెట్ మీదకు వేశాడు’’ అని బీర్‌బైసెప్స్ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌గా నిలవడంలో స్టార్క్, హర్షిత్‌లు కీలక పాత్ర పోషించారు.ఇక పెర్త్ టెస్టులో హర్షిత్ రాణా మొత్తంగా నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలోని టీమిండియా ఆస్ట్రేలియాను ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే, ఐదు మ్యాచ్‌ల బోర్డర్- గావస్కర్ ట్రోఫీని మాత్రం 1-3తో చేజార్చుకుంది. చదవండి: AUS vs ENG: అతడికి ఇక నిద్రలేని రాత్రులే!.. వార్నర్ ఓ జోకర్!Mitch Starc offers a little warning to Harshit Rana 😆#AUSvIND pic.twitter.com/KoFFsdNbV2— cricket.com.au (@cricketcomau) November 23, 2024 -
World Cup 2027: రోహిత్, కోహ్లి ఖేల్ ఖతం.. గంభీర్ గర్జన!
-
నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్
విరాట్ కోహ్లి (Virat Kohli).. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్లో సంచలనాలు సృష్టించిన ఈ దిగ్గజ బ్యాటర్.. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. టీమిండియా లెజెండ్, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సెంచరీలు (82) బాదిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.ప్రపంచ రికార్డుఇక వన్డేల్లో సచిన్‌కూ సాధ్యం కాని విధంగా.. 51 శతకాలు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే, గతేడాది అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకొన్న ఈ రన్‌మెషీన్.. ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఊహించని విధంగాసంప్రదాయ క్రికెట్లో టీమిండియాను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన విరాట్ కోహ్లి.. తనలో ఇంకా ఆడగలిగే సత్తా ఉండి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ.. ‘‘గడ్డానికి కొన్ని రోజుల క్రితమే రంగు వేసుకున్నాను.తరచూ ఇలా గడ్డానికి రంగే వేయాల్సి వస్తుందంటేనే.. మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని అర్థం’’ అంటూ లండన్‌లో యువీ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన కోహ్లి సరదాగా వ్యాఖ్యానించాడు. తాజాగా కోహ్లి న్యూ లుక్కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నిన్ను ఇలా చూడలేకపోతున్నాం విరాట్ భయ్యా! భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త షాష్ విరాట్ కోహ్లితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం షేర్ చేశాడు. ఇందులో కోహ్లి గడ్డం, మీసం తెల్లబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది చూసిన కింగ్ అభిమానులు.. ‘‘నిన్ను ఇలా చూడలేకపోతున్నాం విరాట్ భయ్యా! నువ్వు పెద్దవాడివై పోతున్నామంటే మనసు ఒప్పుకోవడం లేదు. నువ్వు ఎల్లప్పుడూ యాంగ్రీ యంగ్‌మేన్ లుక్‌లోనే ఉండాలి’’ అంటూ ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు.వన్డేలకు కూడా రిటైర్మెంట్?మరికొందరేమో టెస్టులోకి తిరిగి రావాలని కోరుతుండగా.. ఇంకొందరు మాత్రం వన్డేలకు కూడా కోహ్లి త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టుల నుంచి వైదొలిగిన 36 ఏళ్ల కోహ్లి.. వన్డేల్లో, ఐపీఎల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. తిరుగులేని ఛేజింగ్ కింగ్కాగా విరాట్ కోహ్లి తదుపరి ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా టీమిండియాలో పునరాగమనం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 123 టెస్టులు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 9230, 4188 పరుగులు సాధించాడు.ఇక వన్డేల్లో ఛేజింగ్ కింగ్‌గా పేరొందిన కోహ్లి ఇప్పటికి 302 మ్యాచ్‌లు ఆడి 14181 పరుగులు చేశాడు. చివరగా ఐపీఎల్-2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆడాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరు పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలన్న కోహ్లి, ఆర్సీబీ పదిహేడేళ్ల కల నెరవేరింది. ఇక కోహ్లి తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌లతో కలిసి లండన్‌లోనే ఎక్కువగా నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. చదవండి: సంజూ శాంసన్‌కు మీకిస్తే బదులుగా ఇద్దరిని ఇవ్వండి.. రాయల్స్ డిమాండ్..! -
నువ్వు గొప్పోడివి సిరాజ్: విరాట్ కోహ్లి సోదరి పోస్ట్ వైరల్
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓవల్ టెస్టు (Oval Test)లో తీవ్రమైన ఒత్తిడి ఉన్నా.. అతడు భారత్‌ను విజయతీరాలకు చేర్చడమే ఇందుకు కారణం. ఇంగ్లండ్ విజయానికి ఏడు పరుగులు.. టీమిండియా గెలుపునకు ఒక వికెట్ కావాల్సిన వేళ సిరాజ్ తనలోని అత్యుత్తమ బౌలర్‌ను వెలికితీసి అద్భుతం చేశాడు.సూపర్ డెలివరీతో గస్ అట్కిన్సన్ (17)ను పదో వికెట్‌గా వెనక్కి పంపి.. ఇంగ్లండ్ ఆట కట్టించాడు. దీంతో ఆఖరిదైన ఐదో టెస్టులో ఆరు పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చడం విశేషం.ఓ పొరపాటు.. తీవ్రమైన ఒత్తిడిఅయితే, ఓవల్ టెస్టులో నాలుగో రోజు ఆటలో భాగంగా సిరాజ్ కారణంగా పెద్ద పొరపాటే జరగింది. హ్యారీ బ్రూక్ (Harry Brook) 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టిన ఈ రైటార్మ్ పేసర్.. అనూహ్యంగా బౌండరీ లైన్ తొక్కేశాడు. దీంతో అవుట్ కావాల్సిన హ్యారీ బ్రూక్ సిక్సర్‌తో పండుగ చేసుకోవడమే కాదు.. ఆ తర్వాత ధనాధన్ ఇన్నింగ్స్‌తో శతక్కొట్టి (98 బంతుల్లో 111) మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పే ప్రయత్నం చేశాడు.అయితే, ఆఖరికి బ్రూక్ సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ తొలుత క్యాచ్ డ్రాప్ చేసినందుకు సిరాజ్‌పై విమర్శలు వచ్చాయి. అయినాసరే ఒత్తిడిని జయించిన సిరాజ్.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగి ఐదో రోజు అద్భుత ప్రదర్శనతో టీమిండియాను గెలిపించాడు.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిలతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సిరాజ్ మియాపై ప్రశంసలు కురిపించారు. ఇక విరాట్ కోహ్లి అక్క భావనా కోహ్లి ధింగ్రా సైతం సిరాజ్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ రాయడం విశేషం.సిరాజ్.. నువ్వు గొప్పోడివి‘‘ఈ ఆట ఎల్లప్పుడూ అద్భుతమైన అనుభవాలను అందించడంలో విఫలం కాదు. ఆశావహ, సానుకూల దృక్పథంతో.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ స్పూర్తిదాయక హీరోలు ఉన్నంత వరకు ఈ ఆట ఇలాకాక.. ఇంకెలా ఉంటుంది?! మహ్మద్ సిరాజ్.. నువ్వు గొప్పోడివి’’ అంటూ భావనా కోహ్లి ధింగ్రా తన ఇన్‌స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టగా.. వైరల్ అవుతోంది. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లండ్, రెండో టెస్టులో భారత్ గెలవగా.. మూడో టెస్టులో ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది. అనంతరం నాలుగో టెస్టు డ్రా కాగా.. ఐదో టెస్టులో భారత్ గెలిచింది. ఓవల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సిరాజ్ నిలవగా.. భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.చదవండి: బీసీసీఐ వేటు!.. నా ఫ్యామిలీ లాంటిది అంటూ భావోద్వేగం -
ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు: గంభీర్ స్పీచ్ వైరల్
ఇంగ్లండ్ గడ్డ మీద ఆద్యంతం ఆసక్తిగా సాగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఆఖరిదైన ఐదో టెస్టులో అసాధారణ రీతిలో పుంజుకుని ఆతిథ్య జట్టుపై విజయభేరి మోగించింది. తద్వారా ఓడిపోవడం ఖాయమనుకున్న ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని 2-2తో సమం చేసింది.దీంతో వరుస పరాజయాల తర్వాత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు కాస్త ఊరట లభించింది. టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు కూడా శుభారంభమే దక్కింది. అయితే, తుదిజట్టు విషయంలో కొన్ని అనూహ్య ఎంపికలు, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను సిరీస్ మొత్తానికి దూరంగా ఉంచడం వీరిద్దరిపై విమర్శలకు కారణమయ్యాయి.దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత..ఏదేమైనా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత... అది కూడా విదేశీ గడ్డ మీద జరిగిన సిరీస్‌లో భారత్ ఈ మేర సఫలం కావడం హర్షించదగ్గ విషయమే. ఈ పరిణామాల నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ డ్రెసింగ్‌రూమ్‌లో చేసిన ప్రసంగం వైరల్‌గా మారింది.ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు‘ఇక్కడ ఈ సిరీస్‌ను 2–2తో ముగియడం చాలా గొప్ప ఫలితం. అందరికీ నా అభినందనలు. అయితే మనం మెరుగుపడేందుకు ఇంకా అవకాశం ఉంటుంది. దాని కోసం మరింత కష్టపడుతూనే ఉండాలి. అలా చేస్తే సుదీర్ఘ కాలం టీమిండియా ప్రపంచ క్రికెట్‌ను శాసించగలదు.ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. డ్రెస్సింగ్‌రూమ్‌లో సంస్కృతి ఎలా ఉండాలంటే అందరూ ఇందులో భాగం కావాలని కోరుకోవాలి. ఇదే మనం చేయాల్సిన పని’ అని గంభీర్ మార్గనిర్దేశనం చేశాడు. ఓవల్‌లో విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ ఈ మేరకు ఆటగాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడాడు.గొప్పగా అనిపించిందిఈ సందర్భంగా ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అనే ప్రత్యేక అవార్డును రవీంద్ర జడేజా చేతుల మీదుగా వాషింగ్టన్ సుందర్ అందుకున్నాడు. ‘ఇంగ్లండ్‌లో వరుసగా నాలుగు టెస్టులు ఆడే అవకాశం రావడం నా అదృష్టం. ఇక్కడ బాగా ఆడాలని ఎంతో కోరుకున్నాను. ప్రతీ రోజు మన జట్టు ఆడిన తీరు చాలా గొప్పగా అనిపించింది’ అని సుందర్ వ్యాఖ్యానించాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్-2025 ఫలితాలు👉తొలి టెస్టు- హెడింగ్లీ, లీడ్స్- ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు✊రెండో టెస్టు- ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్- 336 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం- ఈ వేదికపై భారత్‌కు ఇదే తొలి గెలుపు👉మూడో టెస్టు- లార్డ్స్, లండన్- 22 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్🤝నాలుగో టెస్టు- ఓల్డ్ ట్రఫోర్డ్, మాంచెస్టర్- డ్రా✊ఐదో టెస్టు- కెన్నింగ్టన్ ఓవల్, లండన్- ఆరు పరుగుల తేడాతో టీమిండియా గెలుపు🤝సిరీస్ ఫలితం- 2-2తో సమంచదవండి: Asia Cup 2025: ఆసియా కప్‌లో గిల్, జైస్వాల్! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
కోహ్లి, రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు భారీ షాక్?
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను అభిమానులు టీమిండియాలో జెర్సీలో చూసి దాదాపు 6 నెలలపైనే అవుతోంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు అనుహ్యంగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ దిగ్గజ క్రికెటర్లు.. కేవలం వన్డేల్లో మాత్రమే ఆడాలని నిర్ణయించుకున్నారు.అయితే ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో విరాట్, రోహిత్‌లను చూడొచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ రాజకీయ, దౌత్యపరమైన పరిణామాలతో బంగ్లా పర్యటనను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో అభిమానులకు నిరాశే మిగిలింది. తిరిగి వీరిద్దని ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో చూసే అవకాశముంది. కానీ ఈ సీనియర్ ద్వయం వన్డే ప్రపంచకప్-2027లో ఆడడం అనుమానమే. వీరిద్దరి వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై ఓ బీసీసీఐ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు."కోహ్లి, రోహిత్ శర్మ వన్డే ఫ్యూచర్‌పై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాము. వన్డే ప్రపంచకప్-2027కు మాకు ఇంకా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఉంది. అప్పటికి కోహ్లి, రోహ్లి ఇద్దరి వయస్సు 40 సంవత్సరాలు దాటుతోంది. కాబట్టి ఈ మెగా ఈవెంట్ కోసం మేము స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. కొంతమంది యువ ఆటగాళ్లకు కూడా జట్టులో అవకాశమివ్వాలి. కోహ్లి, రోహిత్ ఇద్దరూ వైట్‌బాల్ క్రికెట్లో భారత జట్టు ఎంతో కాలం నుంచి తమ సేవలను అందిస్తున్నారు. ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యారు. వారు ప్రతీదీ సాధించారు.కాబట్టి అటువంటి లెజెండరీ క్రికెటర్లను రిటైర్మెంట్ ప్రకటించాలని ఎవరూ ఒత్తిడి తీసుకురారు. కానీ తదుపరి వన్డే సైకిల్ ప్రారంభమయ్యే సమయానికి వారు వారు మానసికంగా, శారీరకంగా సిద్దంగా ఉన్నారో లేదో పరీక్షించక తప్పదు అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.చదవండి: టీమిండియా గెలుస్తుందని నాకు ముందే తెలుసు: సౌరవ్ గంగూలీ -
నన్ను నమ్మినందుకు థాంక్యూ విరాట్ భయ్యా: మహ్మద్ సిరాజ్
"నేను జస్సీ భాయ్ (జస్ప్రీత్ బుమ్రా) మాత్రమే నమ్ముతాను. ఎందుంటే అతడొక గేమ్ ఛేంజర్". టీ20 ప్రపంచకప్-2024 విజయనంతరం మహ్మద్ సిరాజ్ చెప్పిన మాటలు ఇవి. ఆ సందర్భంగా సిరాజ్ ఇంగ్లీష్ సరిగ్గా మాట్లడకపోవడంతో చాలా మంది ట్రోలు చేశారు.కానీ ఇప్పుడు అవే మాటలు సిరాజ్‌కు సరిపోతాయి. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో సిరాజ్ పేరు మారు మ్రోగుపోతుంది. ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ మియా సంచలనం సృష్టించాడు. బుమ్రా పక్కన లేకపోయినప్పటికి ప్రత్యర్ధులను బెంబెలెత్తించాడు.భారత పేస్ ధళ నాయకుడిగా నిప్పులు చెరిగాడు. ఓటమి కోరుల్లో చిక్కుకున్న తన జట్టును వారియర్‌లా విజయతీరాలకు చేర్చాడు. విశ్రాంతి, విరామం లేకుండా ఓ యోదుడులా పోరాడాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి భారత జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్ ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ క్రమంలో సిరాజ్‌పై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు."ఓవల్‌లో టీమిండియా గొప్ప విజయం సాధించింది. సిరాజ్, ప్రసిద్ద్ల పట్టుదల, దృఢ సంకల్పం వల్లే భారత్‌కు ఈ అద్బుతమైన విజయం దక్కింది. జట్టు కోసం ప్రతీసారి ముందుండి పోరాడే సిరాజ్ ని చూస్తే చాలా ఆనందంగా ఉంది " అని విరాట్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా కోహ్లి ట్విట్‌పై సిరాజ్ స్పందించాడు. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు భయ్యా అంటూ సిరాజ్ రిప్లే ఇచ్చాడు.చదవండి: అతడొక సంచలనం.. ప్రాణం పెట్టి ఆడాడు! ఎంత చెప్పిన తక్కువే: గిల్ -
ENG VS IND 5th Test: కోహ్లిని దాటేసిన రాహుల్
టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్నాడు. బ్యాటింగ్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 532 పరుగులు చేసి సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో రాహుల్ ఫీల్డర్‌గానూ సత్తా చాటాడు. 5 మ్యాచ్‌ల్లో 6 క్యాచ్‌లు (ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ ఇంకా కొనసాగుతుంది) పట్టాడు. స్లిప్స్‌లో రాహుల్ చాలా అలర్ట్‌గా ఉంటూ ఇంగ్లండ్ బ్యాటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు.KL RAHUL HAS BEEN FANTASTIC IN SLIPS...!!! 💪 pic.twitter.com/juvyI9uH5R— Johns. (@CricCrazyJohns) August 3, 2025ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో రాహుల్ బెన్ డకెట్ (ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో) క్యాచ్ పట్టడంతో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని అధిగమించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ కోహ్లిని వెనక్కు నెట్టాడు. ఇంగ్లండ్‌లో కోహ్లి టెస్ట్‌ల్లో 25 క్యాచ్‌లు పడితే.. తాజాగా రాహుల్ తన క్యాచ్‌ల సంఖ్యను 26కు పెంచుకున్నాడు. ఈ విభాగంలో సునీల్ గవాస్కర్ (35), రాహుల్ ద్రవిడ్ (30) మాత్రమే రాహుల్ ముందున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ మోస్తరుగా ఆడుతుంది. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (23), బ్రూక్ (38) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకా 210 పరుగులు చేయాలి. అదే భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
సచిన్ గొప్పా? విరాట్ కోహ్లి గొప్పా?
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలు ఇద్దరూ ఇద్దరే. వీరిద్దరిలో ఎవరు గొప్ప క్రికెటర్ అంటే సమాధానం చెప్పేందుకు కచ్చితంగా ఆలోచించాల్సిందే. ఒకరేమో 24 ఏళ్ల పాటు తన జీవితాన్ని భారత క్రికెట్‌కు అంకితం చేస్తే.. మరొకరేమో గత 17 ఏళ్ల నుంచి తన సేవలను అందిస్తున్నారు.ఒకరు క్రికెట్‌కు గాడ్ అయితే.. మరొకరు ఆ దేవుడు రికార్డులను కొల్లగొడుతున్న రన్ మిషన్. కాబట్టి సచిన్, కోహ్లిలలో ఎవరు గ్రేట్ క్రికెటర్ అంటే నీళ్లు నమలాల్సిందే. తాజాగా ఇదే పరిస్థితి సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు ఎదురైంది.ఏబీ డివిలియర్స్ ఇటీవల శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్ పాడ్ కాస్ట్లో పాల్గోన్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలో గొప్ప క్రికెటరో ఎవరో ఎంచుకోవాలని ఏబీడీని హోస్ట్ అడిగాడు. అందుకు కాసేపు ఆలోచించి డివిలియర్స్ తెలివగా సమాధనమిచ్చాడు."ఇద్దరిని ఒకరితో ఒకరని పోల్చలేము. ఎందుకంటే ఆ తరంలో సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్. ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లి గ్రేట్. ఎవరి తరంలో వారు గొప్ప క్రికెటర్లు. కాబట్టి పోల్చడం అసాధ్యం. నాక్ సచిన్ అంటే చాలా గౌరవం. అతను అతిసాధారణ స్థాయి నుంచి ఒక లెజెండ్‌గా ఎదిగాడు. ఇక విరాట్ నా స్నేహితుడు. కాబట్టి ఇద్దరిలో ఎవరూ గొప్ప అని నేను చెప్పలేను. అయితే విరాట్ ఆల్ ఫార్మాట్లలో గ్రేట్ నేను భావిస్తున్నాను. వన్డే, టెస్టు ఫార్మాట్లలో సచిన్‌ను మించిన వారు లేరు అనుకుంటున్నా" అని డివిలియర్స్ పేర్కొన్నాడు.టాప్ రన్ స్కోరర్‌గా..సచిన్ టెండూల్కర్ టీమిండియా తరఫున 200 టెస్టు మ్యాచ్‌లు ఆడి 15,921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి టెస్టు కెరీర్లో 51 సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా వన్డేల్లో కూడా మాస్టర్ బ్లాస్టర్ టాప్‌లో ఉన్నాడు. 452 ఇన్నింగ్స్‌లలో 49 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో 18426 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా సచిన్ తన అంతర్జాతీయ కెరీర్లో 34,357 పరుగులు చేశాడు.సెంచరీల రికార్డు బ్రేక్..ఇక టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కోహ్లి తన టెస్టు కెరీర్లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. అయితే వన్డేల్లో మాత్రం అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. సచిన్ వన్డేల్లో 49 శతకాలు చేస్తే.. కోహ్లి ఇప్పటివరకు 51 సెంచరీలు నమోదు చేశాడు. మొత్తంగా 302 వన్డేల్లో కోహ్లి ఇప్పటివరకు 57.88 సగటుతో 14181 రన్స్ చేశాడు.ఇక ఇది ఇలా ఉండగా.. వరల్డ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నీ విజేతగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ నిలిచింది. ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చిత్తు చేసింది. ఈ విజయంలో డివిలియర్స్‌ది కీలక పాత్ర. 60 బంతుల్లో డివిలియర్స్ 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 120 పరుగులు చేశాడు.చదవండి: ప్రియజిత్.. ఇంత త్వరగా వెళ్లిపోయావా? 22 ఏళ్లకే క్రికెటర్ మృతి -
‘కోహ్లిపై వేటుకు సిద్ధమైన ఆర్సీబీ.. అతడి స్థానంలో మాజీ క్రికెటర్’
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)- విరాట్ కోహ్లి (Virat Kohli).. ఈ రెండు పేర్లను విడదీసి చూడలేము. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభం నుంచి ఈ దిగ్గజ బ్యాటర్ ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. జట్టు ముఖచిత్రమైన కోహ్లి వల్లే ఆర్సీబీకి అమితమైన ఫ్యాన్‌బేస్ ఏర్పడిందనడంలో సందేహం లేదు.అయితే, కెప్టెన్‌గా ఆర్సీబీకి టైటిల్ అందించడంలో మాత్రం కోహ్లి విఫలమయ్యాడు. బ్యాటర్‌గా సత్తా చాటినా సారథిగా ట్రోఫీ అందించలేకపోయాడు. ఈ టీమిండియా మాజీ కెప్టెన్‌కు సాధ్యం కాని ఘనతను మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఇటీవలే సాధించాడు. ఐపీఎల్-2025లో ఆర్సీబీని విజేతగా నిలిపి తొలి టైటిల్ అందించాడు.కోహ్లిపై వేటుకు సిద్ధమైన ఆర్సీబీ!ఇక కెప్టెన్‌గా దారుణంగా విఫలమైన వేళ.. అంటే 2019లో కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆర్సీబీ యాజమాన్యం భావించిందంట. అంతేకాదు.. అతడి స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్‌ను సారథిగా నియమించాలనుకుందట. ఆర్సీబీ మాజీ ఆటగాడు, ఇంగ్లండ్ ప్లేయర్ మొయిన్ అలీ తాజాగా ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.‘‘గ్యారీ కిర్‌స్టెన్ కోచ్‌గా ఉన్న సమయంలో పార్థివ్ పటేల్‌ను కెప్టెన్‌గా నియమించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అతడిది అద్బుతమైన క్రికెట్ బ్రెయిన్. అందుకే ఆర్సీబీ కెప్టెన్ చేయాలనుకున్నారు.రేసులో పార్థివ్ పటేల్ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరిగాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. పార్థివ్ పటేల్ కెప్టెన్ కాలేదు. అయితే, తన పేరును మాత్రం కెప్టెన్సీని సీరియస్‌గానే పరిశీలనలోకి తీసుకున్నారు’’ అని మొయిన్ అలీ ఇండియా టుడేతో పేర్కొన్నాడు.కాగా 2019లో ఆర్సీబీ ఘోరంగా విఫలమైంది. కోహ్లి కెప్టెన్సీలో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2021లో ఆర్సీబీ కెప్టెన్‌గా వైదొలిగిన కోహ్లి.. కేవలం ఆటగాడిగా కొనసాగుతున్నాడు.శతక ధీరుడుకోహ్లి స్థానంలో కెప్టెన్‌గా వచ్చిన సౌతాఫ్రికా దిగ్గజం ఫాఫ్ డుప్లెసిస్ 2024 వరకు సారథిగా కొనసాగాడు. ఈ ఏడాది రజత్ పాటిదార్ ఆర్సీబీ నాయకుడిగా నియమితుడై.. తొలి ప్రయత్నంలోనే ట్రోఫీని ముద్దాడాడు. ఇదిలా ఉంటే.. కోహ్లి ఐపీఎల్లో ఇప్పటి వరకు ఆర్సీబీ తరఫున 267 మ్యాచ్‌లు ఆడి 8661 పరుగులు సాధించాడు. ఇందులో రికార్డు స్థాయిలో ఎనిమిది శతకాలు ఉన్నాయి.ఇక గతేడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇటీవలే టెస్టులకు కూడా గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం వన్డేలతో పాటు ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.చదవండి: ‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’ -
అవిశ్రాంత యోధుడు సిరాజ్.. కోహ్లిని కూడా దాటేశాడు..!
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలి కాలంలో టీమిండియా ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా మారిపోయాడు. ముఖ్యంగా టెస్ట్‌ల్లో అవిశ్రాంత యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మాంచెస్టర్ టెస్ట్‌లో పాల్గొన్న సిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ దశాబ్దంలో (2020ల్లో) భారత్ తరఫున అత్యధిక టెస్ట్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని సైతం అధిగమించాడు. విరాట్ 2020 నుంచి టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించకముందు వరకు 39 టెస్ట్‌లు ఆడగా.. సిరాజ్ మాంచెస్టర్ టెస్ట్‌తో 40వ టెస్ట్ పూర్తి చేసుకున్నాడు. 2020 డిసెంబర్లో టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేసిన సిరాజ్.. ఆ ఏడాదంతా (2020) టెస్ట్‌లు ఆడకపోయినా ఈ దశాబ్దంలో భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవడం విశేషం.వర్క్ లోడ్ కారణంగా మేనేజ్మెంట్ రొటేషన్ పాలసీని ప్రవేశపెట్టినప్పటికీ సిరాజ్ టీమిండియా ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్‌లోనూ ఆడాల్సి వస్తుంది. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు క్రమం తప్పకుండా విశ్రాంతినిస్తున్న మేనేజ్మెంట్ సిరాజ్‌ను మాత్రం దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో ఆడిస్తుంది. లెక్కలు చూసుకోవడానికి ఇది బాగానే ఉన్నా పరిస్థితి ఇలాగే కొనసాగితే సిరాజ్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.పని భారం ఎక్కువై సిరాజ్ గాయాల బారిన పడితే కెరీర్ అర్దంతరంగా ముగిసే ప్రమాదం ఉంది. ఇప్పటికే సిరాజ్ వయసు 31 సంవత్సరాలు. ఇలా నిర్విరామంగా ఆడితే అతని కెరీర్ మరో రెండు, మూడేళ్లకు మించి కొనసాగే అవకాశం ఉండదు. టీమిండియా మేనేజ్మెంట్ ఇకనైనా మేల్కొని సిరాజ్‌కు కూడా వరుస విరామాల్లో విశ్రాంతి కల్పించకపోతే చేజేతులా ఓ టాలెంటెడ్ క్రికెటర్ కెరీర్‌ను ప్రమాదంలోకి తోసేసినట్లవుతుంది. సిరాజ్ తాజాగా ముగిసిన మాంచెస్టర్ టెస్ట్‌లో సింహభాగం బౌలింగ్ చేశాడు. 24 ఏళ్ల యువ పేసర్ అన్షుల్ కంబోజ్ కేవలం 18 ఓవర్లు వేస్తే సిరాజ్ బుమ్రా తర్వాత అత్యధికంగా 30 ఓవర్లు బౌలింగ్ చేశాడు. కెప్టెన్లకు సిరాజ్‌పై ఉన్న నమ్మకంతో అతనికే తరుచూ బౌలింగ్ రొటేట్ చేస్తున్నారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇది సమంజసమే అయినప్పటికీ.. ఓ టాలెండెట్ బౌలర్ అర్దంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఉంది.సిరాజ్ త్వరలో తన కెరీర్లో 41వ టెస్ట్ ఆడటం కూడా దాదాపుగా ఖరారైంది. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లో ఒకవేళ బుమ్రాకు విశ్రాంతినిచ్చినా సిరాజ్‌ను మాత్రం తప్పక ఆడిస్తారు. ఈ విషయంలో టీమిండియాకు మరో ఆప్షన్ కూడా లేదు. సత్తా చాటుతాడనుకున్న యువ పేసర్ అన్షుల్ కంబోజ్ నాలుగో టెస్ట్‌లో ప్రభావం చూపలేకపోయాడు. మరో ఆప్షన్ అయిన ప్రసిద్ద్ కృష్ణను మేనేజ్మెంట్ నమ్మే పరిస్థితుల్లో లేదు. మరో రెండు ఆప్షన్లైన ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్ గాయాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జులై 31 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్ట్‌లో సిరాజ్ ఆడటం దాదాపుగా ఖాయమనే చెప్పాలి. -
సచిన్, ధోని, కోహ్లి సంపాదన తెలిసి.. నోరెళ్లబెట్టిన ఇంగ్లండ్ స్టార్లు!
సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar).. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. విరాట్ కోహ్లి (Virat Kohli).. ఈ మూడు పేర్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్రికెట్‌ను కూడా ఓ మతంగా భావించే భారత్‌లో కోట్లాది మంది అభిమానులకు వీరు దేవుళ్లతో సమానం అంటే అతిశయోక్తి కాదు. తమదైన ఆటతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిన వీరు.. సంపాదనలోనూ ముందే ఉన్నారు.రెండు చేతులా సంపాదనఈ టీమిండియా దిగ్గజ త్రయం వెయ్యి కోట్లకు పైగా సంపాదన కలిగి ఉన్నారని అంచనా. క్రికెటర్లుగా బీసీసీఐ నుంచి పొందే ప్రయోజనాలతో పాటు.. తమ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ఎన్నో ప్రఖ్యాత బ్రాండ్లకు వీరు అంబాసిడర్లుగా ఉన్నారు. తద్వారా రెండు చేతులతో సంపాదిస్తున్నారు.శతక శతకాల ధీరుడు సచిన్, మూడు ఐసీసీ ట్రోఫీల వీరుడు ధోని రిటైర్ అయినా.. సంపాదనలో మాత్రం ముందే ఉన్నారు. ఇక కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా సూపర్స్టార్ల సంపద గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అడిగిన ప్రశ్నకు.. భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది.రూ. 100 కోట్లకు పైగానే‘‘టీమిండియా సూపర్స్టార్ల సంపాదన ఏమేర ఉంటుంది’’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో వాన్.. రవిశాస్త్రిని అడిగాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్ల సంపాదన చాలా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎండార్స్మెంట్ల ద్వారా రూ. 100 కోట్లకు పైగానే సంపాదించి ఉంటారు.నోరెళ్లబెట్టిన ఇంగ్లండ్ స్టార్లు!అవును.. పది మిలియన్ల పౌండ్లు. నేనైతే వంద రూపాయలకు ఒక పౌండ్ చొప్పున ఇప్పుడు లెక్కకడుతున్నా. ఎంఎస్, విరాట్, సచిన్... 15- 20కి పైగా యాడ్లు చేస్తారు. రోజూ ఏదో వ్యాపకం ఉంటుంది. ఒక్కరోజు నటించే యాడ్‌తో కోట్లు సంపాదిస్తారు’’ అని రవిశాస్త్రి చెప్పాడు. దీంతో నోరెళ్లబెట్టడం వాన్ వంతైంది. అతడితో పాటు అక్కడే ఉన్న అలిస్టర్ కుక్ కూడా ఆశ్చర్యపోయాడు.ఎవరికి వారే సాటికాగా సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసి... ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడి పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డు బద్దలయ్యే ప్రసక్తే లేదని చెప్పవచ్చు. ఇక ధోని టీమిండియాకు 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు.మరోవైపు.. సూపర్‌స్టార్ కోహ్లి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పటికి ఎనభై రెండు శతకాలు సాధించి.. సచిన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇక వన్డేల్లో 51 సెంచరీలతో సచిన్‌ను కూడా అధిగమించి.. అత్యధిక శతకాల వీరుడిగా కొనసాగుతున్నాడు. కాగా అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. వన్డేలతో పాటు ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.చదవండి: మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?: మాజీ క్రికెటర్ ప్రశంసలు -
రోహిత్ లేడు!.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్లు వీరే!
భారత క్రికెట్లో అత్యంత గొప్ప క్రికెటర్లు ఎవరన్న ప్రశ్నకు టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) తనదైన శైలిలో బదులిచ్చాడు. తన దృష్టిలో ఐదుగురు ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్లు ఉన్నారన్న ఈ మాజీ సారథి.. 70, 80, 90వ దశకాల నుంచి ముగ్గురు ఆటగాళ్లకు ఇందులో చోటిచ్చాడు.ఇక నయా క్రికెటర్లలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)తో పాటు లెజెండరీ బ్యాటర్, తనకు అత్యంత సన్నిహితుడైన విరాట్ కోహ్లిల పేర్లను రవిశాస్త్రి ఈ జాబితాలో చేర్చాడు. ఈ మేరకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్‌లతో కలిసి క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రవిశాస్త్రిని.. భారత అత్యుత్తమ క్రికెటర్లలో టాప్-5 పేర్లు చెప్పాల్సిందిగా అడిగారు.ధోనికే పెద్దపీటఇందుకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా ఈ జాబితాలో సునిల్ గావస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్ ఉంటారు.. వీరితో పాటు విరాట్ కోహ్లి కూడా ఉండాల్సిందే.. వీరంతా తమ అద్భుత ఆట తీరుతో యువ ఆటగాళ్లపై ప్రభావం చూపారు.నిజానికి బిషన్ సింగ్ బేడీ పేరు కూడా చెప్పాలి. కానీ ఎంఎస్ ధోని ఆయన కంటే ముందు వరుసలో ఉంటాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు. అయితే, అతడు ఇంకా యువకుడే.. తనలో ఇంకా ఎంతో క్రికెట్ మిగిలి ఉంది. మిగిలిన వాళ్లు తమ అంతర్జాతీయ క్రికెట్‌ను ముగించేశారు కదా!నంబర్ వన్ అంటే సచినేనా దృష్టిలో సన్నీ కపిల్, సచిన్, ధోని, విరాట్... ఈ ఐదుగురే ఆల్‌టైమ్ టాప్-5 గ్రేటెస్ట్ ప్లేయర్లు. వీరిలో నంబర్ వన్ ఎవరని అడిగితే గావస్కర్ పేరే చెప్తా. అతడి బ్యాటింగ్ అద్భుతం. ఇక కపిల్ అసాధారణ క్రికెటర్.అయితే, వీరందరిలో ఫుల్ ప్యాకేజీ నంబర్ వన్ ఎవరంటే సచిన్ టెండుల్కర్. 24 ఏళ్ల పాటు సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన అతడు.. ఏకంగా 100 సెంచరీలు సాధించాడు. వసీం అక్రమం, వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్ వంటి పాక్ పేస్ దిగ్గజాలను..అదే విధంగా.. ఆసీస్, ఇంగ్లండ్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.. ప్రొటిస్ నుంచి జాక్వెస్ కల్లిస్, షాన్ పొలాక్.. ఇలాం ప్రతి ఒక్కరిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. టెక్నిక్ పరంగా అతడి ఆట అమోఘం’’ అని రవిశాస్త్రి అలిస్టర్ కుక్, మైకేల్ వాన్లకు చెప్పాడు. అయితే, టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన మరో దిగ్గజ కెప్టెన్, మేటి బ్యాటర్ రోహిత్ శర్మకు మాత్రం రవిశాస్త్రి టాప్-5లో చోటివ్వలేదు.కాగా 1981- 1992 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన రవిశాస్త్రి.. అంతర్జాతీయ స్థాయిలో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 11 శతకాలు, ఒక డబుల్ సెంచరీ సాయంతో 3839 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో 3108 రన్స్ రాబట్టాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.చదవండి: IND vs ENG: అతడిని కాదని అన్షుల్‌ను ఎలా ఎంపిక చేస్తారు?: సెలక్టర్లపై ఫైర్ -
కోహ్లి కంటే జడేజా ఎక్కువ పరుగులు చేశాడు.. కానీ: సురేశ్ రైనా
టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)పై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) ప్రశంసలు కురిపించాడు. టెస్టు క్రికెట్లో జడ్డూ ప్రపంచంలోనే ఉత్తమ ఆల్‌రౌండర్ అని కొనియాడాడు. ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి కంటే.. జడ్డూ ఎక్కువే పరుగులే రాబట్టాడని పేర్కొన్నాడు.కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు గెలవగా.. రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి గెలిచి చరిత్ర సృష్టించింది గిల్ సేన.పోరాడిన జడేజాఅయితే, లార్డ్స్ టెస్టులో ఆఖరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. నిజానికి ఈ మ్యాచ్‌లో భారత్ భారీ తేడాతో ఓడిపోయే క్లిష్ట పరిస్థితుల్లో రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా జడ్డూను ప్రశంసిస్తూనే.. కాస్త వేగంగా ఆడి ఉంటే బాగుండేదని విమర్శించాడు.కోహ్లి కంటే అతడే ఎక్కువ పరుగులు చేశాడుఈ మేరకు.. ‘‘ఇంగ్లండ్‌లో విరాట్ కోహ్లి కంటే రవీంద్ర జడేజా ఎక్కువ పరుగులు స్కోరు చేశాడు. ఇద్దరి మధ్య హాఫ్ సెంచరీల సంఖ్యలో వ్యత్యాసం మీకు కనిపిస్తుంది. ఇక టెస్టు క్రికెట్లో ప్రపంచంలోనే జడేజా అత్యుత్తమ ఆల్‌రౌండర్.ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమంగా రాణిస్తూ క్లిష్ట పరిస్థితుల్లో జట్టును కాపాడతాడు. లార్డ్స్ టెస్టులో ఒకానొక సందర్భంలో మనం 100 పరుగుల తేడాతో ఓడిపోతాం అనిపించింది. అయితే, పట్టుదలగా అతడు ఆఖరి వరకు నిలబడిన తీరు అమోఘం.అయితే, జడ్డూ కాస్త రిస్క్ తీసుకుని ఆడి ఉంటే విజయ లాంఛనం పూర్తి చేసేవాడేమో! బుమ్రా క్రీజులో ఉన్నంత సేపు జడ్డూకు ఆ అవకాశం ఉండేది. కొన్ని ఫోర్లు, సిక్సర్లు బాదితే బాగుండేది’’ అని సురేశ్ రైనా స్పోర్ట్తక్తో పేర్కొన్నాడు. కాగా లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు (జూలై 23-27)కు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం వేదిక.ఏడు హాఫ్ సెంచరీలుఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద భారత మాజీ టెస్టు బ్యాటర్ కోహ్లి 33 ఇన్నింగ్స్‌లో కలిపి 1096 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు.. కోహ్లికి సమకాలీనుడైన జడ్డూ 29 ఇన్నింగ్స్ ఆడి.. ఓ సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీల సాయంతో 969 పరుగులు సాధించాడు. తాజా సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి జడేజా ఇప్పటికి 327 పరుగులు పూర్తి చేసుకున్నాడు.చదవండి: BCCI: నితీశ్ రెడ్డితో పాటు అతడూ అవుట్.. జట్టులోకి కొత్త ప్లేయర్ -
India-England Test XI: భారత్ నుంచి ఏడుగురు.. సచిన్‌కు నో ప్లేస్
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar)లో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలిస్తే.. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తొలిసారి విజయబావుటా ఎగురవేసింది. అయితే, లార్డ్స్‌లో ఆఖరి వరకు పోరాడిన గిల్ సేనకు చేదు అనుభవమే మిగిలింది. దీంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్‌లోనూ తొలిసారి గెలిచి సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్ఇక ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కామెంటేటర్ వ్యవహరిస్తున్న టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఆసక్తికర ఎంపికతో ముందుకు వచ్చాడు. ఇరుజట్ల నుంచి 21వ శతాబ్దానికి గానూ తన అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. దిగ్గజాలకు నో ప్లేస్అయితే, ఇందులో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)తో పాటు గౌతం గంభీర్, మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మలకు మాత్రం పుజ్జీ చోటివ్వలేదు.అదే విధంగా.. ఇంగ్లండ్ లెజెండరీ ఆటగాళ్లు సర్ అలిస్టర్ కుక్, జేమ్స్ ఆండర్సన్ (James Anderson)లను కూడా పుజారా పట్టించుకోలేదు. ఇక తన కంబైన్డ్ జట్టుకు ఓపెనర్లుగా అలెక్ స్టెవార్ట్, రాహుల్ ద్రవిడ్‌లను ఎంచుకున్న పుజారా.. వన్‌డౌన్‌లో జో రూట్‌ను ఆడిస్తానని తెలిపాడు. భారత్ నుంచి ఏడుగురుమరోవైపు.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని ఎంపిక చేసుకున్న ఈ వెటరన్ బ్యాటర్.. ఐదో స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా.. బౌలింగ్ విభాగంలోనూ టీమిండియా ఆటగాళ్లకే పుజారా పెద్ద పీట వేశాడు. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు చోటిచ్చిన పుజారా.. స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు స్థానం కల్పించాడు. ఇంగ్లండ్ నుంచి ఇద్దరు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఆండ్రూ ఫ్లింటాఫ్, బెన్ స్టోక్స్‌లను పుజారా ఎంపిక చేశాడు. మొత్తంగా టీమిండియా- ఇంగ్లండ్ 21వ శతాబ్దపు అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లకు మాత్రమే పుజారా చోటివ్వడం విశేషం. పన్నెండో ఆటగాడిగా మాథ్యూ హోగర్డ్ను పుజ్జీ ఎంచుకున్నాడు.ఎదురుచూపులే మిగిలాయికాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 103 టెస్టులు ఆడిన పుజారా 7195 పరుగులు సాధించాడు. ఇందులో 19 శతకాలు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐదు వన్డేల్లో కలిపి 51 పరుగులు మాత్రమే చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐపీఎల్లో 30 మ్యాచ్‌లలో కలిపి 390 రన్స్ చేశాడు. చివరగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ ఆడిన పుజారా.. టీమిండియాలో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, యువ ఆటగాళ్లతో పోటీలో అతడు పూర్తిగా వెనుకబడ్డాడు.పుజారా ఎంచుకున్న 21వ శతాబ్దపు భారత్- ఇంగ్లండ్ కంబైన్డ్ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్అలెస్ స్టెవార్ట్ (వికెట్ కీపర్), రాహుల్ ద్రవిడ్, జో రూట్, విరాట్ కోహ్లి, వీవీఎస్ లక్ష్మణ్, బెన్ స్టోక్స్, ఆండ్రూ ఫ్లింటాఫ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మాథ్యూ హొగర్డ్ (12th man).చదవండి: ODI WC 2011: యువీని సెలక్ట్ చేయడం అవసరమా?.. ధోని నిర్ణయం ఇదే.. -
అరంగేట్రానికి సిద్దమవుతున్న కోహ్లి అన్న కొడుకు..
టీమిండియా స్టార్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కుటుంబం నుంచి మరొకరు క్రికెట్ ప్రపంచానికి పరిచయం కానున్నారు. అతడి అన్న కొడుకు ఆర్యవీర్ కోహ్లి ప్రొఫిషనల్ క్రికెట్లో అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 సీజన్లో 14 ఏళ్ల ఆర్యవీర్.. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ (SDS) తరపున ఆడనున్నాడు.ఇటీవల జరిగిన డీపీఎల్ వేలంలో లక్ష రూపాయల కనీస ధరకు సౌత్ ఢిల్లీ అతడిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో తన డీపీఎల్ సీజన్ కోసం ఆర్యవీర్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. లెగ్ స్పిన్నర్ అయిన ఆర్యవీర్ తన సహచర బ్యాటర్లకు నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్యవీర్‌పై సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ హెడ్ కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ సర్సందీప్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆర్యవీర్‌కు అద్బుతమైన టాలెంట్ ఉందని అతడు కొనియాడాడు."ఆర్యవీర్ కోహ్లి ఒక రైజింగ్ స్టార్. అతడికి ప్రస్తుతం 14 ఏళ్లు మాత్రమే. అతడు భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు. అతడిపై కోహ్లి అనే ట్యాగ్ ఎటువంటి ఒత్తిడి తీసుకురాదు. ఎందుకంటే అతడి వద్ద అద్బుతమైన టాలెంట్ ఉంది.అతడిలో కష్టపడి పనిచేసే తత్వం ఉంది" అని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్సందీప్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వద్ద ఆర్యవీర్ శిక్షణ తీసుకున్నాడు. వెస్ట్ ఢిల్లీ క్రికెట్ ఆకాడమీలో ఆర్యవీర్‌ను రాజ్‌కుమార్ తన శిక్షణతో రాటుదేల్చాడు. ఈ టోర్నీలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ఆడనున్నాడు. రూ. 8లక్షలకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది.చదవండి: అతడికి రెస్ట్ ఏమి అవసరం లేదు.. రెండు టెస్టుల్లోనూ ఆడించండి: కుంబ్లేVIDEO | Virat Kohli's nephew, Aryaveer Kohli, trained with "no baggage" of his famed last name in the training session of the South Delhi Superstarz ahead of the second edition of the Delhi Premier League.Budding leg-spinner Aryaveer Kohli, son of Virat's elder brother Vikas,… pic.twitter.com/HYu2U39qqJ— Press Trust of India (@PTI_News) July 17, 2025 -
క్రెడిట్ కాంగ్రెస్ సర్కార్‌కు.. నిందలు కోహ్లీకి..
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, కర్ణాటక క్రికెట్ ఆసోసియేషన్ కారణమని పేర్కొంటూ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించడంపై బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.ఐపీఎల్లో ఆర్సీబీ విజయానికి క్రెడిట్ కొట్టేయాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దుర్ఘటనలకు మాత్రం ఆర్సీబీ క్రికెటర్ విరాట్ కోహ్లీపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. క్రెడిట్ సొంతం చేసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరాటపడ్డారని చెప్పారు. ఆర్సీబీ యాజమాన్యంతోపాటు శివకుమార్, కర్ణాటక ప్రభుత్వ అధికారుల పిలుపు మేరకు భారీగా జనం తరలివచ్చారని అరవింద్ బెల్లాద్ గుర్తుచేశారు.చిన్నస్వామి స్టేడియంలో జరిగే విజయోత్సవాలకు హాజరు కావాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది డి.కె.శివకుమార్ కాదా? అని ప్రశ్నించారు. దుర్ఘటనకు ఆర్సీబీ కారణమైతే పోలీసులను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని నిలదీశారు. 11 మంది మరణానికి కారణమైన తొక్కిసలాటకు కర్ణాటక ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరొకరిపై నిందలు వేసి తప్పించుకోవాలని చూడడం సరైంది కాదన్నారు. -
అనుమతి లేకుండానే విజయోత్సవాలు
బెంగళూరు: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయం తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ నెట్వర్క్స్ లిమిటెడ్‌తోపాటు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) కారణమని కర్ణాటక ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముందస్తుగా అనుమతి తీసుకోకుండానే విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు కర్ణాటక సర్కార్ స్పష్టంచేసింది. ఈ ర్యాలీ నిర్వహించాలని ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్ఏ సంస్థ, కేఎస్‌సీఏ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తప్పు పట్టింది. పోలీసులకు ముందుగా సమా చారం ఇవ్వలేదని, చట్టప్రకారం తీసుకోవాల్సి అనుమతులేవీ తీసుకోలేదని వెల్లడించింది. జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, మరో 30 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ గెలిస్తే బెంగళూరులో విజయో త్సవాలు నిర్వహిస్తామంటూ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారని, అధికారికంగా అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆ సమాచారంలో పూర్తి వివరాలు లేకపోవడంతో విజయోత్సవాలకు పోలీసులు అంగీకరించలేదని తెలిపింది. కేవలం సమాచారం ఇవ్వడాన్ని అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అయినప్పటికీ జూన్ 4న ఆర్సీబీ టీమ్ యాజమన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, విధాన సౌధ నుంచి చిన్న స్వామి స్టేడియం ద్వారా విక్టరీ పరేడ్ నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేసిందని వెల్లడించింది. సోషల్ మీడియాలో మొదటి పోస్టు ఉదయం 7.01 గంటలకు, చివరి పోస్టు మధ్యాహ్నం 3.14 గంటలకు పెట్టినట్లు తెలిపింది. ఆన్లైన్లో ఉచిత పాసులు అందుబాటులో ఉన్నాయని యాజమాన్యం చెప్పగా, అప్పటికే జనం స్టేడియం వద్దకు చేరుకున్నారని వివ రించింది. మొత్తానికి ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్ఏ నెట్వర్క్స్ లిమిటెడ్, కేఎస్‌సీఏ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు ప్రభు త్వం స్పష్టంచేసింది. ఈ దుర్ఘటనకు వారే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొంది. CAT says IPL Team #RCB is prima facie responsible for Bengaluru Stampede which claimed 11 lives.Police is not magician, can't be expected manage huge crowds if not given sufficient time to make arrangements, the Tribunal observed.@RCBTweets @KarnatakaCops #BengaluruStampede pic.twitter.com/2QdmvohATs— Live Law (@LiveLawIndia) July 1, 2025ఆర్సీబీ సేవకులుగా పోలీసులు బెంగళూరు తొక్కిసలాట ఘటనలో ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్‌తోపాటు మరికొందరు పోలీసులను సస్పెండ్ చేయడాన్ని కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంది. పోలీసులు ఆర్సీబీ టీమ్‌కు సేవకులుగా వ్యవహరించారని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఆక్షేపించింది. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయకుండానే ఆర్సీబీ విజయోత్సవాల కోసం ఏర్పాటు చేశారని ఆరోపించింది. అనుమతి ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఆర్సీబీ సేవలో తరించారని విమర్శించింది. 🚨 Karnataka Govt blames RCB for Bengaluru Stampede🚨Govt to High Court—No permission was taken for RCB’s victory paradePublic was invited without police consultationOver 3 lakh people gathered near Chinnaswamy Stadium11 people died, 50+ injured in the chaos… pic.twitter.com/KQTFFJxoWx— VIPIN_UPDATE🚨 (@Vipin_Update) July 17, 2025 -
రిటైరైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. బాబర్ ఆజమ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా చారిత్రక రికార్డులు సాధించాడు. తాజాగా ఐసీసీ ఆల్‌టైమ్ టీ20 పాయింట్లను అప్డేట్ చేయగా.. అందులో విరాట్ కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు 897 నుంచి 909 పాయింట్లకు పెరిగాయి. దీంతో విరాట్ మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ (అత్యుత్తమంగా) అందుకున్న తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికే విరాట్ టెస్ట్‌ల్లో అత్యుత్తమంగా 937, వన్డేల్లో అత్యుత్తమంగా 909 రేటింగ్ పాయింట్స్ కలిగి ఉన్నాడు.ఐసీసీ టీ20 రేటింగ్ పాయింట్ల అప్డేషన్ తర్వాత విరాట్ మరో చారిత్రక రికార్డును కూడా సాధించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం నంబర్ వన్‌గా కొనసాగిన బ్యాటర్‌గా అవతరించాడు. రేటింగ్ పాయింట్ల అప్డేషన్ తర్వాత విరాట్ నంబర్ వన్‌గా కొనసాగిన జమానా 1013 రోజుల నుంచి 1202 రోజులకు మారింది. రేటింగ్ పాయింట్ల అప్డేషన్కు ముందు అత్యధిక కాలం నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఉండేది. బాబర్ టీ20ల్లో 1057 రోజులు నంబర్ వన్‌గా కొనసాగాడు. తాజా అప్డేషన్తో విరాట్ బాబర్ రికార్డును బద్దలు కొట్టి అత్యధిక కాలం నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.పై రెండు రికార్డులతో విరాట్ టీ20 కెరీర్ మరింత హైలైట్ అయ్యింది. విరాట్ ఇప్పటికే వన్డే, టెస్ట్‌ల్లో లెక్కలేనన్ని, ఎవరికీ సాధ్యపడని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కొత్తగా చేరిన రెండు రికార్డులతో విరాట్ అంతర్జాతీయ కెరీర్ మొత్తం పరిపూర్ణమైనట్లైంది.విరాట్ అంతర్జాతీయ కెరీర్లో 125 టీ20లు ఆడి 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టుల్లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 36 ఏళ్ల విరాట్ వన్డేల్లో ఇప్పటివరకు 302 మ్యాచ్‌లు ఆడి 57.9 సగటున 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీల సాయంతో 14181 పరుగులు చేశాడు. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టీ20లకు, టెస్టులకు వీడ్కోలు పలికినప్పటికి అంతర్జాతీయ క్రికెట్లో తన రికార్డుల వేట మాత్రం కొనసాగిస్తున్నాడు. విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ఆల్‌టైమ్ టీ20 ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి రేటింగ్ పాయింట్స్‌ను అప్డేట్ చేసింది.కోహ్లి రేటింగ్ పాయింట్స్ 897 నుంచి 909కి పెరిగాయి. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకున్న తొలి ప్లేయర్‌గా కింగ్ కోహ్లి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్లో అత్యధికంగా 937 రేటింగ్ పాయింట్స్ సాధించగా.. వన్డేల్లో అతడి పేరిట 909 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.ఓవరాల్‌గా ఆల్ టైమ్ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ డేవిడ్ మలన్ 919 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సూర్యకుమార్ యాదవ్ 912 రేటింగ్ పాయింట్స్‌తో నిలిచాడు. వీరిద్దరి తర్వాత స్ధానంలో కోహ్లి ఉన్నాడు.కోహ్లి తన కెరీర్లో 125 అంతర్జాతీయ టీ20లు ఆడి 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టుల్లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కోహ్లి రికార్డు స్ధాయిలో 51 వన్డే సెంచరీలు చేశాడు.చదవండి: IND vs ENG: 'తప్పేమి కాదు.. అతడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలి' -
'తప్పేమి కాదు.. అతడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలి'
అండర్సన్-సచిన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో టీమిండియా పోరాడినప్పటికి విజయం సాధించలేకపోయింది.దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2 తేడాతో గిల్ సేన వెనకబడింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ మదన్‌లాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని తన టెస్టు రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలని మదన్‌లాల్ కోరాడు. కోహ్లి అవసరం జట్టుకు ఉందని, తన అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకోవాలని అతడు అభిప్రాయపడ్డాడు.విరాట్ కోహ్లికి భారత క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. అతడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని, టెస్టుల్లో తిరిగి ఆడాలని నేను కోరుకుంటున్నాను. విరాట్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంలో తప్పులేదు. ఈ సిరీస్‌లో కాకపోయినా, తదుపరి సిరీస్‌లో అతడు తదుపరి టెస్టు సిరీస్‌లోనైనా ఆడాలి.అతడు ఇంకా ఇప్పటికి చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఒకటి రెండేళ్లు ఈజీగా ఆడగలడు. తన అనుభవంతో యువ ఆటగాళ్లను రాటుదేల్చాలి. అతడు రిటైర్మెంట్ ప్రకటించి ఎక్కువ రోజులు కాలేదు, కాబట్టి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది" అని క్రికెట్ ప్రీడిక్టాలో మదన్‌లాల్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. అతడికంటే ముందు కెప్టెన్ రోహిత్ శర్మ రెడ్‌బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: జితేశ్ శర్మకు అవమానం.. దినేశ్ కార్తిక్ కూడా పట్టించుకోలేదా? -
అత్యంత అరుదైన మైలురాయికి తాకిన జో రూట్
లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ మిడిలార్డర్ ఆటగాడు జో రూట్ ఓ అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రూట్ టెస్ట్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 8000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా సచిన్ టెండూల్కర్ (13492), మహేళ జయవర్దనే (9509), జాక్ కల్లిస్ (9033) తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మైలురాయిని తాకే క్రమంలో రూట్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (7564) అధిగమించాడు.కెరీర్ తొలినాళ్లలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన రూట్.. నాలుగో స్థానానికి మారిన తర్వాత సంచలనాలు నమోదు చేశాడు. ఈ స్థానంలో రూట్ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడి తన జట్టుకు అపురూప విజయాలనందించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో తన జట్టును గాడిలో పెట్టే పనిలో ఉన్నాడు. లంచ్ విరామం తర్వాత రూట్ 31 పరుగులతో క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. అతనికి జతగా బెన్ స్టోక్స్ (14) ఉన్నాడు. 35 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 129/4గా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 250 పరుగులు చేసినా పెద్ద స్కోరే అవుతుంది. ఈ పిచ్‌పై ఛేజింగ్ చాలా కష్టంగా ఉండనుంది. భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను 200లోపు ఆలౌట్ చేస్తేనే ఛేజింగ్‌కు సులువుగా ఉంటుంది.ఇవాళ తొలి సెషన్లో టీమిండియా పేసర్లు చెలరేగిపోయారు. సిరాజ్ (7-2-11-2), నితీశ్ రెడ్డి (5-1-20-1), ఆకాశ్‌దీప్ (5-2-23-1) పదునైన బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. భారత పేస్ అటాక్ ధాటికి ఇంగ్లండ్ 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డకెట్ (12), ఓలీ పోప్‌ను (4) సిరాజ్ పెవిలియన్‌కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్‌ను (23) ఆకాశ్‌దీప్ ఔట్ చేశారు.ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్‌మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్‌దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
ఆటకే వీడ్కోలు... ఆదాయంలో రారాజులు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి పుష్కరం గడిచింది. అతని సమకాలీకులు రాహుల్ ద్రవిడ్ (2012లో ఆఖరి మ్యాచ్), సౌరవ్ గంగూలీ (2008లో) తమ ఆటను ముగించి చాలా కాలమైంది. ఈతరం దిగ్గజం ధోని కూడా మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కొన్ని ఫార్మాట్ల నుంచి రిటైరయ్యారు. కానీ క్రికెట్ అభిమానుల్లో వీరందరి పట్ల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఆటకు సంబంధించిన లేదా క్రికెటేతర కార్యక్రమం అయినా సరే...వీరు హాజరైతే చాలు, దాని విలువ అమాంతం పెరిగిపోతుంది. ఈ దిగ్గజ క్రికెటర్లకు వాణిజ్యపరంగా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వీరు వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా పని చేస్తుండటం విశేషం. పైగా ఆయా బ్రాండ్లకు అంబాసిడర్లుగా మాత్రమే కాకుండా చాలా వ్యాపారాల్లో సహ భాగస్వాములుగా తాము కూడా మార్కెట్‌ను శాసిస్తున్నారు. – సాక్షి, క్రీడా విభాగంముగ్గురూ ముగ్గురేసచిన్ టెండూల్కర్ ప్రస్తుతం 25 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. వీటిలో 10 కంపెనీల్లో అతను సహ భాగస్వామి. సగం వాటిలో అతను కేవలం పెట్టుబడులు పెట్టడంతోనే సరిపెట్టగా... మరో సగం కంపెనీ వ్యవహారాల్లో తన సలహాలు, సూచనలు కూడా ఇస్తూ చురుకైన భాగస్వామిగా ఉన్నాడు.మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏకంగా 42 బ్రాండ్స్‌తో జత కట్టాడు. రెగ్యులర్‌గా ప్రకటనల్లో కనిపించే బ్రాండింగ్ కాకుండా ప్రీమియం స్పోర్ట్స్ టూరిజం కంపెనీ ‘డ్రీమ్ సెట్ గో’ను సొంత వ్యాపారంలా ప్రమోట్ చేస్తున్నాడు. ఇక రాహుల్ ద్రవిడ్ వీరిలో మరింత ప్రత్యేకం. ఈ మిస్టర్ డిపెండబుల్ కనీసం సోషల్ మీడియాలో కూడా లేడు. కానీ 24 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యంగా నెమ్మదైన స్వభావానికి బ్రాండ్ అంబాసిడర్‌లాంటి ద్రవిడ్.. క్రెడిట్ కార్డ్ పేమెంట్ కంపెనీ ‘క్రెడ్’కోసం ‘నేను ఇందిరానగర్ గూండాను..’అంటూ చేసిన యాడ్ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.పేరు ప్రఖ్యాతలే పెట్టుబడిగా...క్రికెట్ నుంచి తప్పుకొని చాలా రోజులైనా ఈ మాజీలకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. దీనిపై వ్యాల్యుయేషన్ రంగంలో నిష్ణాతులైన హర్‡్ష తలికోటి మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ కెరీర్లో వారు సాధించిన ఘనతలతో వచ్చిన పేరుప్రఖ్యాతులే కాదు.. ప్రజల్లో ఇప్పటికీ ఉన్న క్లీన్ ఇమేజ్, అభిమానులకు వారంటే ఉన్న గౌరవం, ఏళ్లు గడిచాక కూడా తమను తాము మార్చుకుంటూ ప్రస్తుత సెలబ్రిటీల్లో కూడా తమ ప్రత్యేకత నిలబెట్టుకోవడమే అందుకు కారణం’అంటాడు. పైగా తాము నమ్మిన, విశ్వాసం ఉన్నవాటితోనే జత కట్టడానికి వీరు సిద్ధమవుతారు. ‘గ్రండ్‌ఫోస్’పంప్స్‌ను తన ఇంట్లో ఎనిమిదేళ్లుగా వాడుతున్నాను కాబట్టి దానికి ప్రచారం చేసేందుకు సిద్ధమైనట్లు ద్రవిడ్ చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ.ధోని, విరాట్, రోహిత్ఈతరం అభిమానుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లి ప్రస్తుతం చెరో 45 బ్రాండ్లతో కలిసి పని చేస్తుండటం విశేషం. ఇటీవల ‘ఎజిలిటాస్’స్పోర్ట్స్ కంపెనీలో కోహ్లి రూ.40 కోట్లతో భాగస్వామిగా చేరి అన్నీ తానే అయి నడిపిస్తున్నాడు. 10 స్టార్టప్‌లలో అతను పెట్టుబడులు పెట్టాడు. ధోని కూడా ఫుడ్ అండ్ బేవరేజెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరో స్పేస్ కంపెనీల్లో భాగమయ్యాడు. అలాగే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులు, టీ20ల నుంచి రిటైరైనా క్రేజ్ తగ్గలేదు. అడిడాస్, సియట్, నిస్సాన్ వంటి అనేక ప్రముఖ కంపెనీలకు ప్రకటనకర్తగా ఉన్నాడు. సుమారు 20 బ్రాండ్లతో కలిసి పనిచేస్తున్నాడు.ఉభయతారక ఒప్పందాలుభారత్లో క్రికెటర్లకు పాన్ ఇండియా విలువ ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో ఒక్కో ప్రాంతం లేదా భాషకే పరిమితమయ్యే సినిమా తారలతో పోలిస్తే క్రికెటర్ల ప్రకటనలే పెద్ద సంఖ్యలో జనానికి చేరతాయని ప్రకటన రంగ నిపుణులు చెబుతున్నారు. బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాలు ఉభయతారకంగా ఉంటూ అటు ప్లేయర్లకు, ఇటు కంపెనీలకు కూడా లాభదాయకంగా ఉండటం కారణంగా ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ కాలపు అనుబంధం కొనసాగుతోంది.ధోని బ్రాండింగ్ చేస్తున్న ఏరో స్పేస్ కంపెనీ ‘గరుడ’ఆదాయం ఏడాది తిరిగే లోగా రూ.15 కోట్ల నుంచి రూ. 123 కోట్లకు చేరగా, తర్వాతి సంవత్సరమే కంపెనీ పూర్తిగా లాభాల్లోకి మళ్లింది. కోకాకోలాతో గంగూలీ అనుబంధం 18 ఏళ్లుగా కొనసాగుతుండగా, పవర్ కంపెనీ ల్యుమినస్ 15 ఏళ్లుగా సచిన్‌తో కలిసి ఉంది. ఆటకు గుడ్‌బై చెప్పినా మార్కెటింగ్, బ్రాండింగ్‌ను తాము శాసించగలమని ఈ దిగ్గజాలంతా నిరూపిస్తున్నారు.⇒ ప్రభుత్వరంగ సంస్థ బీపీసీఎల్‌కు చెందిన ల్యూబ్రికెంట్స్ యాడ్‌లో ద్రవిడ్ నటించిన తర్వాత అమ్మకాలు భారీ ఎత్తున పెరిగాయని స్వయంగా కంపెనీ వెల్లడించింది. కర్ణాటకలో ‘గ్రండ్‌ఫోస్’పంప్స్‌తో ద్రవిడ్ జతకట్టిన తర్వాతే అవి ప్రజలకు మరింత చేరువయ్యాయి.⇒ ‘గరుడ’బ్రాండ్‌తో వచి్చన డ్రోన్ల వ్యాపారం పెరుగుదలకు ధోని మాత్రమే కారణమని ఆ సంస్థ సీఈఓ అగీ్నశ్వర్ వెల్లడించడం ‘కెప్టెన్ కూల్’విలువేమిటో చెబుతుంది. -
చరిత్ర సృష్టించిన గిల్.. కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. టెస్టు సారథిగా అరంగేట్రంలోనే సెంచరీఇక ఈ సిరీస్ ద్వారానే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి భారీ శతకం (147) సాధించాడు.తద్వారా టెస్టు జట్టు సారథిగా తొలి ప్రయత్నంలోనే సెంచరీ చేసి అనేక రికార్డులను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గిల్ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో మాత్రం గిల్ తన విశ్వరూపం చూపించాడు.డబుల్ సెంచరీ, శతకంతో చెలరేగితొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా భారీ డబుల్ సెంచరీ (269)తో దుమ్ములేపిన ప్రిన్స్.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకం (161) సాధించాడు. తద్వారా ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడు, కెప్టెన్‌గా గిల్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.ఇక తాజాగా లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో గిల్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ సాబ్.. రెండు ఫోర్ల సాయంతో కేవలం 16 పరుగులే రాబట్టాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు.ఆసియా తొలి కెప్టెన్‌గా..అయితే, మూడో టెస్టులో గిల్ విఫలమైనప్పటికీ.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికి ఐదు ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన గిల్ ఏకంగా 601 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా తొలి కెప్టెన్‌గా గిల్ ప్రపంచ రికార్డు సాధించాడు. అంతకుముందు కోహ్లి పేరిట ఈ రికార్డు ఉండేది.ఇంగ్లండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్లు వీరే🏏శుబ్‌మన్ గిల్ (ఇండియా)- 601* రన్స్- 2025లో..🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593 రన్స్- 2018లో..🏏మహ్మద్ అజారుద్దీన్ (ఇండియా)- 426 రన్స్- 1990లో..🏏జావేద్ మియాందాద్ (పాకిస్తాన్)- 364 రన్స్- 1992లో..🏏సౌరవ్ గంగూలీ (ఇండియా)- 351 రన్స్- 2002లో...👉ఇక ఓవరాల్‌గా ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్ల జాబితాలో... గిల్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ (597)ను గిల్ అధిగమించాడు. ఇక ఈ లిస్టులో గ్యారీ సోబర్స్ (722), గ్రేమ్ స్మిత్ (714) గిల్ కంటే ముందు వరుసలో ఉన్నారు. చదవండి: చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను.. ఎందుకంటే: బుమ్రా -
రోహిత్ శర్మకు భారీ షాక్!?.. వన్డే కెప్టెన్‌గానూ గిల్?
గతేడాది నుంచి టీమిండియాలో భారీ మార్పులే జరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిస్తూఈ క్రమంలో మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిస్తూ పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్‌తో రోహిత్ స్థానాన్ని భర్తీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌గా సూర్యకు పగ్గాలు అప్పగించగా.. అతడు ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలు అందిస్తూ దూసుకుపోతున్నాడు.ఇక టీ20ల నుంచి తప్పుకొన్న తర్వాత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగిన రోహిత్ శర్మకు వన్డేల్లో మోదం, టెస్టుల్లో ఖేదం అన్నట్లుగా పరిస్థితి మారింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీప్ కావడంతో పాటు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ 3-1తో ఓడి పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది.టెస్టు రిటైర్మెంట్ ప్రకటనఈ రెండు సిరీస్‌లలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా పూర్తిగా విఫలమైన రోహిత్ శర్మ.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌లోనూ టెస్టులకు సారథిగా అతడే ఉంటాడని ముందుగా బీసీసీఐ లీకులిచ్చినా.. అనూహ్యంగా రోహిత్ నుంచి టెస్టు రిటైర్మెంట్ ప్రకటన వచ్చింది. అయితే, వన్డేల్లో మాత్రం తాను కొనసాగుతానని రోహిత్ శర్మ చెప్పగా.. బీసీసీఐ కూడా తమ వన్డే కెప్టెన్ అంటూ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.టీమిండియా టెస్టు సారథిగా గిల్ఇక రోహిత్ శర్మ తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. వీరిద్దరి కంటే ముందే.. అంటే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడే స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో టెస్టుల్లో ప్రస్తుత టీమిండియాలో రవీంద్ర జడేజా సీనియర్‌గా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు.అయితే, పనిభారాన్ని తగ్గించే నిమిత్తం బుమ్రా నిర్ణయానుసారమే అతడి పేరును బోర్డు కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో అనూహ్య రీతిలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ఎంపికయ్యాడు.చారిత్రాత్మక విజయంతో..ఇక కెప్టెన్‌గా తొలి టెస్టులోనే సెంచరీ బాది రికార్డులు సృష్టించిన గిల్.. తొలి ప్రయత్నంలో గెలుపును మాత్రం అందుకోలేకపోయాడు. అయితేనేం.. రెండో టెస్టులోనే చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)తో చెలరేగి.. ఈ వేదికపై తొలిసారి భారత్‌కు గెలుపు అందించాడు.తదుపరి వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా గిల్! ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. రెవ్‌స్పోర్ట్స్ జర్నలిస్టు ఒకరు.. ‘‘తదుపరి వన్డే సిరీస్‌లో గిల్ కెప్టెన్‌గా ఉండబోతున్నాడు’’ అని ట్వీట్ చేశారు. దీంతో రోహిత్ శర్మను తప్పించి గిల్‌కు వన్డే పగ్గాలు కూడా అప్పగిస్తారా? అనే చర్చ నడుస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2027లో జరుగనున్న విషయం తెలిసిందే.అప్పటికి రోహిత్ శర్మకు 40 ఏళ్లు వస్తాయి గనుక.. అతడు ఆడకపోవచ్చని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌తో పాటు.. కోహ్లి కూడా వరల్డ్‌కప్ టోర్నీ కంటే ముందే వన్డేలకూ గుడ్‌బై చెబుతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు ఇప్పటికే టీమిండియాకు ఎనలేని సేవ చేశారని.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని పేర్కొంటున్నారు.ఇకపై ఐపీఎల్లో మాత్రమే రో-కో కొనసాగితే చాలని అంటున్నారు. కాగా టెస్టు రిటైర్మెంట్ తర్వాత బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా వీరిద్దరు రీఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అయితే, బీసీసీఐ మాత్రం సెప్టెంబరులో జరగాల్సిన ఈ సిరీస్‌ను వాయిదా వేసింది. ఈ క్రమంలో నవంబరులో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా రోహిత్, కోహ్లి పునరాగమనం చేయనున్నారు. ఇంతలోనే రోహిత్ నుంచి పగ్గాలు గిల్ చేపట్టబోతున్నాడనే వదంతి సోషల్ మీడియాలో వ్యాపిస్తోంది.చదవండి: కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే7th May ko kaha tha. Baar baar mat poocho bhai log. #RohitSharma #ShubmanGill https://t.co/PWcHEyJHbr— Rohit Juglan (@rohitjuglan) July 10, 2025Whenever India's next odi series will be - Gill will lead— Rohit Juglan (@rohitjuglan) July 10, 2025 -
రంగు వేసుకోవాల్సి వచ్చిందంటే...
లండన్: ఇంగ్లండ్ పర్యటన ఆరంభానికి కొద్దిరోజుల ముందు విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా ఎంతో ఆడగలిగే సత్తా ఉండి కూడా తప్పుకోవడం పట్ల అన్ని వైపుల నుంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. ఇప్పుడు దీనికి సంబంధించి స్వయంగా కోహ్లి హాస్యోక్తంగా జవాబిచ్చాడు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్ నిధుల సేకరణ కార్యక్రమంలో అతను పాల్గొన్నాడు. మైదానంలో కోహ్లి లేని లోటు కనిపిస్తోందంటూ వ్యాఖ్యాత చెప్పడంతో దానికి స్పందిస్తూ అతను తన రిటైర్మెంట్పై సరదా వ్యాఖ్య చేశాడు. ‘నా గడ్డానికి రెండు రోజుల క్రితమే రంగు వేసుకున్నాను. ప్రతీ నాలుగు రోజులకు ఒకసారి ఇలా గడ్డానికి రంగు వేసుకోవాల్సి వస్తోందంటేనే మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి’ అని విరాట్ అన్నాడు. ప్రస్తుతం కోహ్లి లండన్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవిశాస్త్రిని ఉద్దేశించి మాట్లాడిన కోహ్లి అతనితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘భారత జట్టు టెస్టుల్లో సాధించిన కొన్ని ఘనతలు రవిశాస్త్రి సహకారం లేకపోతే సాధ్యం కాకపోయేవి. మేమిద్దరం ఎంతో స్పష్టతతో కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకున్నాం. మీడియా సమావేశాల్లో కఠిన ప్రశ్నలు తనే ఎదుర్కొంటూ నాకు కూడా కీలక సమయాల్లో ఆయన ఎంతో అండగా నిలిచారు. అందుకే ఆయనంటే నాకు ఎంతో గౌరవం. నా కెరీర్ ప్రయాణంలో రవిశాస్త్రికి కూడా ప్రధాన పాత్ర ఉంది’ అని కోహ్లి చెప్పాడు. గత 15 ఏళ్ల కాలంలో భారత జట్టుపై అత్యంత ప్రభావం చూపించిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడని రవిశాస్త్రి కితాబిచ్చాడు. స్టార్లు హాజరు... యువరాజ్ సింగ్‌కు చెందిన ‘యు వి కెన్’ ఫౌండేషన్ నిధుల సేకరణ కార్యక్రమం లండన్‌లో పెద్ద స్థాయిలో జరిగింది. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో సహా దీనికి హాజరయ్యాడు. కోహ్లితో పాటు పలువురు దిగ్గజాలు బ్రియాన్ లారా, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. శుబ్‌మన్ గిల్ సారథ్యంలో భారత క్రికెట్ టీమ్ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీమిండియా ఆటగాళ్లు అక్కడి నుంచి నిష్క్రమించిన తర్వాతే కోహ్లి వచ్చాడు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత, మాజీ ఆటగాళ్లంతా ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కీపర్ రిషభ్ పంత్ పాల్గొన్న వేలం ఇక్కడ హైలైట్‌గా నిలిచింది. కళాకృతులతో ప్రత్యేకంగా రూపొందించింన ఒక బ్యాట్‌ను భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అందించే అవకాశం కోసం వేలం జరిగింది. అక్కడికి వచ్చిన అతిథులతో వేలంలో పోటీ పడిన పంత్ 17 వేల పౌండ్లకు (సుమారు రూ.20 లక్షలు) ఆ చాన్స్‌ను దక్కించుకోవడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా యువరాజ్ ఫౌండేషన్‌కు సుమారు రూ.12 కోట్ల నిధులు వచ్చాయి. -
లార్డ్స్‌లో టీమిండియా రికార్డులు ఇవే.. 2021 ఫలితం రిపీట్ అవుతుందా?
ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో మరో రసవత్తర పోరుకు సమయం అసన్నమైది. క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ మైదానం వేదికగా గురువారం ప్రారంభం కానున్న మూడో టెస్టులో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1 సమంగా ఉండడంతో.. లార్డ్స్‌లో టెస్టులో ఎలాగైనా గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.అందుకు తగ్గట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ జట్టులోకి స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. అదేవిధంగా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. లార్డ్స్‌లో ఆడడం ఖాయమైంది.అంతకుతోడు లార్డ్స్ మైదానంలో పచ్చికతో కూడిన వికెట్‌ను తాయారు చేయడంతో ఫాస్ట్ బౌలర్లకు, బ్యాటర్లకు మధ్య గట్టి పోటీ నెలకోనుంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత క్రికెట్ జట్టు టెస్టు రికార్డులు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.భయపెడుతున్న గత రికార్డులు..ఈ మైదానంలో గత రికార్డులు భారత అభిమానులను భయపెడుతున్నాయి. లార్డ్స్‌లో ఇప్పటివరకు 19 టెస్టులు ఆడిన టీమిండియా.. కేవలం మూడింట మాత్రమే గెలిచి 12 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత జట్టు 1986లో కపిల్‌దేవ్ నేతృత్వంలో లార్డ్స్‌లో తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 2014 లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో గెలిచింది. అనంతరం చివరగా 2021లో విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ గెలిచింది.గిల్ మ్యాజిక్ చేస్తాడా..?టీమిండియా లార్డ్స్‌లో చివరగా 2021లో టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు అద్బుతం చేసింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కోహ్లి సేన.. ఏడేళ్ల తర్వాత లార్డ్స్‌లో టెస్టు విజయాన్ని అందుకుంది. 272 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్‌ను 120 పరుగులకే భారత్ ఆలౌట్ చేసి తమ సత్తాను చాటింది.ఇప్పుడు యువ సారథి శుబ్‌మన్ గిల్ వంతు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టు 2021 నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. లార్డ్స్‌లో 2021 నాటి చారిత్రత్మక టెస్ట్ విజయంలో భాగమైన ఐదుగురు భారత ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో కూడా ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ప్లేయర్లు అప్పుడు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోసారి ఈ సీనియర్ ప్లేయర్లు తమ స్దాయికి తగ్గట్టు రాణిస్తే ప్రత్యర్ధి జట్టుకు చెమటలు పట్టక తప్పుదు.ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ -
రోహిత్, కోహ్లి అభిమానులకు గుడ్ న్యూస్
దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా ఆగస్ట్‌లో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ ఏడాది పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్ట్‌లో టీమిండియా ఖాళీగా ఉండనుంది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు బీసీసీఐ శ్రీలంక క్రికెట్ బోర్డుతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఆగస్ట్‌లో భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లు (3 వన్డేలు, 3 టీ20లు) నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది.ఇందుకు శ్రీలంక బోర్డు ఒకే చెబితే మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆగస్ట్‌లో జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడటంతో భారత్‌తో సిరీస్ ఆడేందుకు శ్రీలంక బోర్డుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు. ఆగస్ట్ చివర్లో శ్రీలంక జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది. ఆలోపే భారత్‌తో సిరీస్ జరిగే ఆస్కారం ఉంది. భారత్ చివరిసారిగా 2023లో శ్రీలంకలో పర్యటించింది. ఈ ఏడాది లంకలో టీమిండియా పర్యటన షెడ్యూల్ కాలేదు. అయితే అనుకోకుండా ఈ ప్రతిపాదన వచ్చింది.ఆగస్ట్‌లో బరిలోకి దిగనున్న దిగ్గజాలు..?భారత్, శ్రీలంక మధ్య ఆగస్ట్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌ల ప్రస్తావనకు రావడంతో టీమిండియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫ్యాన్స్ పట్టరాని సంతోషంతో తేలిపోతున్నారు. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి ఈ వన్డే సిరీస్‌లో తప్పక ఆడతారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సిరీస్ సాధాసాధ్యాలపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సిరీస్‌లో రోహిత్, కోహ్లి పాల్గొనే దానిపై కూడా క్లారిటీ రానుంది.ఒకవేళ శ్రీలంకతో సిరీస్ సాధ్యపడకపోతే మాత్రం రోహిత్, కోహ్లి అభిమానులు వారి రాక కొరకు అక్టోబర్ వరకే వేచి చూడాల్సిందే. అక్టోబర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరుగనుంది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ సిరీస్‌లో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌లో రోహిత్, కోహ్లి తప్పక ఆడే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లి చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో కలిసి ఆడారు. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచి 13 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఆ టోర్నీ తర్వాతే రోహిత్, కోహ్లి రోజుల వ్యవధిలో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకుముందు వీరిద్దరు ఒకేసారి (2024 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత) టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. -
‘అతడు కోహ్లి, టెండుల్కర్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు’
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ మార్క్ బుచర్ ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో చక్కగా రాణిస్తున్నాడని.. సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిల స్థానాన్ని అతడు భర్తీ చేస్తున్నాడని కొనియాడాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ బ్యాటర్‌గా అదరగొడుతున్నాడని.. మంచినీళ్లప్రాయంలా పరుగుల వరద పారిస్తున్నాడని ప్రశంసించాడు.ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో తొలుత టీమిండియాను ఓటమి పలకరించింది. లీడ్స్‌లో శుబ్‌మన్ గిల్ సహా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (రెండు సెంచరీలు) శతక్కొట్టినా.. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం వల్ల ఓటమిపాలైంది.అయితే, రెండో టెస్టులో మాత్రం ఆ తప్పిదాన్ని పునరావృతం చేయలేదు. మరోసారి బ్యాటర్‌గా దుమ్ములేపిన గిల్.. కెప్టెన్‌గానూ అదరగొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269) కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161)తో అలరించాడు.సారథిగానూ తనదైన వ్యూహాలతో ముందుకు సాగి జట్టుకు చారిత్రాత్మక విజయం అందించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌ను ఏకంగా 336 పరుగులతో ఓడించిన భారత్.. ఈ వేదికపై తొలిసారి విజయభేరి మోగించింది. ప్రస్తుతానికి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి మార్క్ బుచర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘క్రీడా ప్రపంచంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉండటం కంటే ఒత్తిడితో కూడిన బాధ్యత మరొకటి ఉండదు. ప్రతీ అడుగును నిశితంగా పరిశీలిస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు.బ్యాటింగ్ ఆర్డర్లో కోహ్లి, టెండుల్కర్ స్థానాన్ని గిల్ భర్తీ చేస్తున్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడిపై ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడి ఉంది. అయినా సరే.. మంచినీళ్లప్రాయంగా తన పని చేసుకుంటూ పోతున్నాడు. కొత్త బాధ్యతను ఎంతో చక్కగా, సౌకర్యవంతంగా నిర్వర్తిస్తున్నాడు’’ అని గిల్‌పై బుచర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు (జూలై 10-14)కు లార్డ్స్ వేదిక. -
టీమిండియా గెలుపుపై సచిన్ అలా.. కోహ్లి ఇలా..
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా చారిత్రాత్మక టెస్టు విజయం నేపథ్యంలో భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి (Virat Kohli) హర్షం వ్యక్తం చేశారు. యువ సారథి శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో పాటు జట్టును అభినందించారు. కాగా ప్రసిద్ధ ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమిండియా తొలిసారి గెలుపు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు రిటైర్మెంట్ తర్వాత.. తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లిన యువ జట్టు.. ఈ అద్భుతం చేసింది.కెప్టెన్‌గా తొలి టెస్టులో ఓటమిని చవిచూసినప్పటికీ రెండో టెస్టులో మాత్రం శుబ్‌మన్ గిల్.. గత తప్పిదాలను పునరావృతం కానీయలేదు. ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా అదరగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు.ఆకాశ్‌పై ప్రశంసలుఈ నేపథ్యంలో టీమిండియాతో పాటు గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పందిస్తూ... ‘‘టీమిండియా అద్భుత టెస్టు విజయం సాధించినందుకు నీకు శుభాకాంక్షలు గిల్. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టారు.టీమిండియా తన వ్యూహాలతో ఇంగ్లండ్ తమ ఆట తీరును మార్చుకునేలా చేసింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించి గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ అద్భుతం. ఇక ఆకాశ్ దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?!... జో రూట్‌కు అతడు వేసిన బంతిని ‘బాల్ ఆఫ్ ది సిరీస్’గా చెప్పుకోవచ్చు. అంతేకాదు.. జాంటీరోడ్స్ మాదిరి మహ్మద్ సిరాజ్ క్యాచ్ అందుకోవడాన్ని నేనైతే పూర్తిగా ఆస్వాదించాను’’ అని సచిన్ టెండుల్కర్ భారత ఆటగాళ్లను ప్రశంసించాడు.కోహ్లి పోస్ట్ వైరల్మరోవైపు.. విరాట్ కోహ్లి సైతం స్పందిస్తూ.. ‘‘ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాకు గొప్ప విజయం. ఏమాత్రం బెదురులేకుండా ఆడి.. ఇంగ్లండ్‌పై ఆద్యంతం పైచేయి సాధించారు. శుబ్‌మన్ గిల్ బ్యాట్‌తోనూ.. సారథిగా తన వ్యూహాలతోనూ గొప్పగా రాణించాడు.ప్రతి ఒక్కరు గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇలాంటి పిచ్‌పై సిరాజ్, ఆకాశ్ బౌలింగ్ చేసిన తీరును కొనియాడాల్సిందే’’ అని ట్వీట్ చేశాడు. కాగా కోహ్లి పోస్టును ఇప్పటికే ఐదున్నర మిలియన్ల మందిక్షించారు. ఇక టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన టీమిండియా.. ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా భారత్ ఐదు సెంచరీలు నమోదు చేసినా.. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది.గిల్ సెంచరీలు.. అదరగొట్టిన ఆకాశ్అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో బ్యాటర్లతో పాటు బౌలర్లూ అదరగొట్టారు. కెప్టెన్ గిల్ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) బాది ముందుండి నడిపించగా.. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (55), రిషభ్ పంత్ (65), రవీంద్ర జడేజా (69 నాటౌట్) అర్ధ శతకాలతో సత్తా చాటారు. దీంతో భారత్ ఇంగ్లండ్‌కు 608 పరుగుల లక్ష్యం విధించగా.. నాలుగో రోజు ఆటలో మూడు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టుకు వరణుడు సాయం చేసేలా కనిపించాడు.ఆఖరిదైన ఐదో రోజు వర్షం అంతరాయం కలిగించగా.. మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగుస్తుందేమోనన్న భయాలు నెలకొన్నాయి. అయితే, వాన తెరిపినిచ్చిన తర్వాత పేసర్ ఆకాశ్ దీప్ ఆకాశమే హద్దుగా చెలరేగి వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఏడు వికెట్లతో అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్While Siraj & Akash Deep tore through England, the umpire had other plans for DSP Siraj… and got the stare of the century. 😤🎥India made history — first Asian team to conquer Edgbaston! 🏰🇮🇳From serious records to serial reactions —Historic win. Hilarious moments. One… pic.twitter.com/jF3q64fpws— Star Sports (@StarSportsIndia) July 6, 2025 -
కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
అంతా ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్‌లో భారత జట్టు పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ధ్రువీకరించింది. ఇరు బోర్డుల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ కమిట్మెంట్స్, రెండు జట్ల షెడ్యూల్‌ను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.ఈ సిరీస్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని భారత క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.వాయిదా ఎందుకంటే?కాగా ఈ ఏడాది ఆరంభం నుంచే బంగ్లా-భారత్ వైట్‌బాల్ సిరీస్‌లపై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లా పర్యటనకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూసింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకోమని భారత ప్రభుత్వం బీసీసీఐని సూచించినట్లు తెలుస్తోంది.మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలాక అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ అట్టుడికింది. ప్రస్తుతం తాత్కాళిక ప్రభుత్వ ఏర్పాటుతో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు కనబడుతున్నప్పటికీ, నివురుగప్పిన నిప్పులా మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తితే ఛాన్స్ ఉంది. అంతకుతోడు బంగ్లాదేశ్ మాజీ మంత్రులు, రాజకీయ నేతలపై అక్కడ తరచూ మూకదాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.వచ్చే ఏడాదికల్లా ఎన్నికలు పూర్తయితే పరిస్థితిలో మార్పుంటుందని బోర్డు భావిస్తోంది. వీటిన్నంటిని పరిగణలోకి తీసుకునే ఈ పర్యటను బీసీసీఐ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం.. భారత జట్టు ఆతిథ్య బంగ్లాతో వచ్చేనెల 17 నుంచి 31 వరకు చిట్టగాంగ్, ఢాకా వేదికలపై మూడేసి చొప్పున వన్డేలు, టి20లు ఆడాల్సి ఉంది. రోహిత్-కోహ్లి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..మరోవైపు తమ ఆరాధ్య క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను మైదానంలో చూడాలన్న ఆశపడ్డ అభిమానులు మరి కొన్న నెలలు వేచి చూడాల్సిందే. టెస్టు, టీ20లకు ప్రకటించిన రోహిత్, కోహ్లి కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నారు. ఈ క్రమంలో బంగ్లాతో జరిగే వన్డే సిరీస్‌లో వీరిద్దరని చూడవచ్చని అంతా భావించారు. కానీ ఇప్పుడు టూర్ వాయిదా పడడంతో ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో రో-కో ద్వయం ఆడనున్నారు.చదవండి: సునామీ శతకంతో విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్ -
జైసూ నేర్చుకోవాలి!.. భారత అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్ ఎవరో తెలుసా?
క్రికెట్ ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు జట్లలో టీమిండియా ఒకటి. భారత జట్టు ఫీల్డింగ్ కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందింది. ముఖ్యంగా స్లిప్స్, గల్లీ పాయింట్లో టీమిండియా ఫీల్డింగ్‌కు తిరుగులేదు. 2023 నుంచి ఇప్పటి వరకు భారత జట్టు ఈ పాయింట్లలో క్యాచ్‌లు పట్టడంలో 80.6 శాతం మేర విజయవంతమైంది.ఈ గణాంకాల జాబితాలో టీమిండియా తర్వాత న్యూజిలాండ్ 78.5 శాతం, శ్రీలంక 78.3 శాతంతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే, ఇటీవల ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఏకంగా ఎనిమిది క్యాచ్‌లు నేలపాలు చేసిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టు చేతిలో గిల్ సేన ఓటమికి ఇదే ప్రధాన కారణమైంది.ఫీల్డింగ్ వైఫల్యంపై విమర్శలుఈ నేపథ్యంలో భారత జట్టు ఫీల్డింగ్ వైఫల్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సీనియర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో పాటు.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)పై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో జైసూ ఏకంగా నాలుగు క్యాచ్‌లు మిస్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. క్రిక్‌విజ్ కథనం ప్రకారం.. 2006 నుంచి ఉన్న డేటాను గమనిస్తే.. భారత్ ఇలా ఓ టెస్టు మ్యాచ్‌లో ఏకంగా ఎనిమిది క్యాచ్‌లు మిస్ చేయడం ఇది మూడోసారి. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో క్యాచ్‌లు పట్టడంలో 52.9 శాతం మాత్రమే విజయవంతమైంది.నిజానికి.. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ఆడుతున్న సమయంలో స్లిప్స్‌లో క్యాచ్‌లు అందుకోవడంలో భారత్ విజయశాతం అధికంగా ఉండేది. ముఖ్యంగా వీరిలో స్లిప్ ఫీల్డర్‌గా సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్నది రాహుల్ ద్రవిడ్‌కే!..భారత అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్ ఎవరో తెలుసా?స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడం, క్యాచ్‌లు అందుకోవడం ఓ కళ. ఇందులో నంబర్ వన్ భారత ప్లేయర్‌గా ద్రవిడ్ పేరు చెప్పవచ్చని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే చెప్పడం ఇందుకు నిదర్శనం. టెస్టు క్రికెట్లో ద్రవిడ్ స్లిప్స్ ఫీల్డర్‌గా ఏకంగా 210 క్యాచ్‌లు అందుకున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లు అటాకింగ్‌లో ఉన్నపుడు అతడు మరింత గొప్పగా రాణించేవాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన కాగా.. భారత క్రికెట్లో ద్రవిడ్‌దే అగ్రస్థానం.టీమిండియా మాజీ కోచ్ జాన్ రైట్ కూడా ద్రవిడ్ ఫీల్డింగ్ నైపుణ్యాల నుంచి గతంలో కొనియాడాడు. ‘‘2000 సంవత్సరంలో నేను టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు తొలి టెస్టులోనే స్లిప్స్‌లో మూడు- నాలుగు క్యాచ్‌లు డ్రాప్ చేశాం.అయితే, ద్రవిడ్ ఫస్ట్ స్లిప్‌లోకి వచ్చిన తర్వాతే మా క్యాచింగ్ ప్రదర్శన మెరుగుపడింది. ముఖ్యంగా విదేశీ గడ్డపై అతడి వల్లే ఎక్కువ సక్సెస్ రేటు సాధించగలిగాం’’ అని జాన్ రైట్ ద్రవిడ్‌ను ప్రశంసించాడు.వీరు కూడా..ఇక ద్రవిడ్‌తో పాటు మాజీ కెప్టెన్లు మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, అజింక్య రహానేలతో పాటు.. వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ ఫీల్డింగ్ పొజిషన్లో మెరుగ్గా రాణించాడు. ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ద్రవిడ్, అజారుద్దీన్ వంటి దిగ్గజాల ఫీల్డింగ్ వీడియోలు చూస్తే.. స్లిప్ ఫీల్డింగ్ ఎలా చేయాలో.. వారి వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో యువ ఆటగాళ్లకు అవగాహన వస్తుంది. తద్వారా ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. లేదంటే.. లీడ్స్ టెస్టు మాదిరి గెలవాల్సిన మ్యాచ్‌లో.. ఓటమి రూపంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! -
భారీ డబుల్ సెంచరీ.. కోహ్లి ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారీ డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి రికార్డులు తిరగరాశాడు. రెండో రోజు గిల్ టీ విరామం తర్వాత కాసేపటికే ఔటయ్యాడు. టంగ్ బౌలింగ్‌లో ఓలీ పోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ డబుల్ సెంచరీతో గిల్ చాలా రికార్డులు సాధించాడు.కోహ్లి ఆల్ టైమ్ రికార్డు బద్దలుఈ మ్యాచ్‌లో 269 పరుగులు చేసి ఔటైన గిల్.. టెస్ట్‌ల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. విరాట్ 2019లో సౌతాఫ్రికాపై 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టి టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా అవతరించాడు. గిల్ కెప్టెన్‌గా తన మూడో ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం.టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత కెప్టెన్లు..గిల్-269కోహ్లి-254 నాటౌట్ (2019)కోహ్లి-243 (2017)కోహ్లి-235 (2016)ధోని-224 (2013)టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాళ్లు..వీరేందర్ సెహ్వాగ్ - 319వీరేందర్ సెహ్వాగ్ - 309కరుణ్ నాయర్ - 303*వీరేందర్ సెహ్వాగ్ - 293వీవీఎస్ లక్ష్మణ్ - 281రాహుల్ ద్రవిడ్ - 270శుభ్‌మన్ గిల్ - 269ఇంగ్లండ్‌లో 250+ స్కోర్లు సాధించిన పర్యాటక టెస్ట్ కెప్టెన్లు..311 - బాబ్ సింప్సన్ (AUS), ఓల్డ్ ట్రాఫోర్డ్, 1964277 - గ్రేమ్ స్మిత్ (SA), ఎడ్జ్‌బాస్టన్, 2003269 - శుభ్‌మన్ గిల్ (IND), ఎడ్జ్‌బాస్టన్, 2025259 - గ్రేమ్ స్మిత్ (SA), లార్డ్స్, 2003విదేశీ టెస్టుల్లో టీమిండియా తరపున 250+ స్కోర్లు చేసిన ఆటగాళ్లు..309 - వీరేంద్ర సెహ్వాగ్ vs PAK, ముల్తాన్, 2004270 - రాహుల్ ద్రవిడ్ vs PAK, రావల్పిండి, 2004269 - శుభ్‌మన్ గిల్ vs ENG, ఎడ్జ్‌బాస్టన్, 2025254 - వీరేంద్ర సెహ్వాగ్ vs PAK, లాహోర్, 2006గిల్ సాధించిన మరిన్ని రికార్డులు..ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్..ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడు.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడు.. విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్.. ఇంగ్లండ్‌లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడు.. టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. గిల్ ఔటయ్యాక భారత్ అదే స్కోర్ వద్ద ఆకాశ్‌దీప్ (6) వికెట్ కూడా కోల్పోయింది. 149 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 583/9గా ఉంది. సిరాజ్ (7), ప్రసిద్ద్ కృష్ణ (2) క్రీజ్‌లో ఉన్నారు.యశస్వి జైస్వాల్ (87), కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషబ్ పంత్ (25), నితీశ్ కుమార్ రెడ్డి (1), రవీంద్ర జడేజా (89), సుందర్ (42), గిల్ (269), ఆకాశ్‌దీప్ (6) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, టంగ్, బషీర్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
డబుల్ సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్.. 311 బంతుల్లో 200 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో తొలి ద్విశతకం (Maiden Test Double Century)నమోదు చేయడంతో పాటు.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా గిల్ ఇన్నింగ్స్‌లో ప్రస్తుతానికి 21 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నో అరుదైన రికార్డులను కూడా గిల్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ హోదాలో టెస్టుల్లో ద్విశతకం బాదిన దిగ్గజాల సరసన గిల్ చేరాడు. గిల్ కంటే ముందు.. విరాట్ కోహ్లి ఏడుసార్లు ఈ ఫీట్ నమోదు చేయగా.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఒక్కో డబుల్ సెంచరీ బాదారు.విదేశీ గడ్డ మీద కోహ్లి తర్వాత..అదే విధంగా.. విదేశీ గడ్డ మీద విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్‌గానూ గిల్ చరిత్రకెక్కాడు. కోహ్లి 2016లో నార్త్ సౌండ్‌లో 200 పరుగులు సాధించాడు.👉అత్యంత పిన్న వయసులో టెస్టు డబుల్ సెంచరీ చేసిన భారత రెండో కెప్టెన్‌గానూ ఘనత.. ఈ జాబితాలో గిల్ కంటే ముందు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నాడు.🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 1964లో ఢిల్లీ వేదికగా 23 ఏళ్ల 39 రోజుల వయసులో..🏏శుబ్‌మన్ గిల్- 2025లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా 25 ఏళ్ల 298 రోజుల వయసులో..🏏సచిన్ టెండుల్కర్- 1999లో అహ్మదాబాద్ వేదికగా 26 ఏళ్ల 189 రోజుల వయసులో..🏏విరాట్ కోహ్లి- 2016లో నార్త్ సౌండ్ వేదికగా 27 ఏళ్ల 260 రోజుల వయసులో...500 పరుగుల మార్కు దాటిన టీమిండియాఎడ్జ్బాస్టన్ వేదికగా ఓవైపు శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఎండ్ నుంచి వాషింగ్టన్ సుందర్ అతడికి సహకారం అందిస్తున్నాడు. 129 ఓవర్ల ఆట ముగిసేసరికి సుందర్ 24, గిల్ 231 పరుగులతో ఉండగా.. టీమిండియా స్కోరు: 510/6. అంతకు ముందు రవీంద్ర జడేజా అర్ధ శతకం (89) బాది అవుట్ కాగా.. తొలిరోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్‌పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
చరిత్ర తిరగరాసిన శుబ్‌మన్ గిల్.. అత్యధిక స్కోరుతో..
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపుతున్నాడు. తొలిరోజే శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గురువారం నాటి రెండో రోజు ఆటలో 150 పరుగుల మార్కు అందుకున్నాడు. 263 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో గిల్ ఈ మేర స్కోరు చేశాడు.తద్వారా టీమిండియా దిగ్గజ బ్యాటర్, కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా అవతరించాడు. ఇంతకు ముందు 2018 నాటి టెస్టు మ్యాచ్‌లో కోహ్లి ఇదే వేదికపై 149 పరుగులు స్కోరు చేశాడు. తాజాగా గిల్ కోహ్లిని అధిగమించి ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర తిరగరాశాడు. ఇక టెస్టుల్లో గిల్ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం ఇదే తొలిసారి.భారత రెండో కెప్టెన్‌గా..ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్‌గానూ గిల్ నిలిచాడు. 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ హోదాలో 179 పరుగులు సాధించాడు.మూడో సారథిగా..అదే విధంగా.. 26వ పడిలో అడుగుపెట్టక ముందే టెస్టు ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మార్కు దాటిన భారత మూడో కెప్టెన్‌గానూ గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు మన్సూర్ అలీఖాన్ పటౌడీ రెండుసార్లు ఈ ఘనత సాధించగా.. సచిన్ టెండుల్కర్ కూడా ఈ ఫీట్ నమోదు చేశాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడే నిమిత్తం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ సిరీస్‌తో గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఐదు వికెట్లు తేడాతో ఓటమిపాలైంది.జడేజాతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యంఈ క్రమంలో బుధవారం (జూలై 2) నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలు కాగా.. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదు వికెట్లు నష్టపోయి 310 పరుగులు చేసిన భారత్.. గురువారం నాటి రెండో రోజు 400 పరుగుల మార్కు దాటింది. 107 ఓవర్లుముగిసే సరికి గిల్ 164, జడేజా 88 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 200 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టును ఆదుకున్నారు. అయితే, తన స్కోరుకు మరో పరుగు జతచేసిన తర్వాత జడ్డూ జోష్ టంగ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.లంచ్ బ్రేక్ సమయానికి స్కోరు ఎంతంటే?గురువారం భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు: 419/6 (110). గిల్ 168, వాషింగ్టన్ సుందర్ ఒక పరుగుతో ఉన్నారు.చదవండి: ఇదేం సెలక్షన్?.. ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్ -
ENG VS IND 2nd Test Day 2: ప్రమాదంలో కోహ్లి రికార్డు
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అజేయ సెంచరీతో (114), రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 87, కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు.రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు శుభ్‌మన్ గిల్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రెండో రోజు గిల్ మరో 36 పరుగులు చేస్తే, ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై 150 పరుగులు మార్కును తాకిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తరఫున ఇప్పటివరకు ఎవరూ 150 పరుగుల మార్కును తాకలేదు. 2018లో విరాట్ 149 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటివరకు ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. విరాట్ రికార్డును ఛేదించే క్రమంలో గిల్ సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్‌లను అధిగమించే అవకాశం ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లో సచిన్ 122, పంత్ 146 పరుగులు చేశారు.కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఛేదనలో బెన్ డకెట్ (149) సూపర్ సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. జాక్ క్రాలే (65), జో రూట్ (53 నాటౌట్), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (44 నాటౌట్) తలో చేయి వేశారు.ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్బుతంగా ఆడారు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదు శతకాలు నమోదయ్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134).. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు.ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. -
కఠినంగా ఉన్నా నమ్మాల్సిందే..! ఈ దశాబ్దంలో బాబర్ ఆజమే టాప్ బ్యాటర్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్లలో దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. అతను అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించి దాదాపుగా రెండేళ్లవుతుంది. అతని చివరి సెంచరీ కూడా పసికూన నేపాల్‌పై (వన్డేలో) సాధించాడు.బాబర్ తన చివరి 10 టెస్ట్‌ల్లో, 10 వన్డేల్లో, 10 టీ20ల్లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయలేదు. హాఫ్ సెంచరీలు కూడా ఎనిమిదే చేశాడు (40 ఇన్నింగ్స్‌ల్లో). వరుస వైఫల్యాల కారణంగా కెప్టెన్సీ కోల్పోయిన బాబర్.. ప్రస్తుతం జట్టులో చోటును కూడా ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు.కెరీర్లో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నా, బాబర్ ఇప్పటికీ టాప్ బ్యాటర్‌గా ఉండటం నమ్మశక్యంగా లేదు. ఈ దశాబ్దంలో (2020-2025 జూన్ 30 వరకు) అత్యధిక పరుగులు చేసిన అంతర్జాతీయ బ్యాటర్ల జాబితాలో బాబర్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.Babar Azam is currently the leading run-scorer of this decade among all international batters.#ViratKohli #RohitSharma #BabarAzam #CricTracker pic.twitter.com/WfD2qA4Y6H— CricTracker (@Cricketracker) July 1, 20252020-2025 మధ్యకాలంలో బాబర్ 202 ఇన్నింగ్స్‌లు ఆడి 8222 పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్లో ఈ దశాబ్దంలో ఎవరూ ఇన్ని పరుగులు చేయలేదు. 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్.. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 14600 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు, 102 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఈ దశాబ్దంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ తర్వాతి స్థానంలో కూడా పాక్ ఆటగాడే ఉండటం విశేషం. ఆ జట్టు వన్డే సారధి మహ్మద్ రిజ్వాన్ ఈ దశాబ్దంలో 191 ఇన్నింగ్స్‌ల్లో 7231 పరుగులు చేశాడు.బాబర్, రిజ్వాన్ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ ఉన్నాడు. బ్రూక్ 2020 నుంచి 2025 జూన్ 30 వరకు 151 ఇన్నింగ్స్‌లు ఆడి 6998 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి తర్వాత టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఉన్నారు. ఈ దశాబ్ద ఆరంభంలో పెద్దగా ఫామ్‌లో లేని కోహ్లి.. ఇప్పటివరకు 173 ఇన్నింగ్స్‌లు ఆడి 6155 పరుగులు చేయగా.. రోహిత్ 169 ఇన్నింగ్స్‌ల్లో 5982 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లి, రోహిత్ టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. -
‘వాళ్ల దగ్గర అల్లావుద్దీన్ అద్భుతదీపం లేదు.. తప్పంతా మీదే’
ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం తీరును కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (CAT) తప్పుబట్టింది. ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం మేనేజ్మెంటే అని తేల్చిచెప్పింది. ఐపీఎల్లో అత్యంత ఆదరణ ఉన్న జట్టు ఆర్సీబీ.తీరిన కలఇందుకు ప్రధాన కారణం టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli). 2008 నుంచి ఇప్పటిదాకా అదే జట్టుతో కొనసాగుతున్నాడు ఈ రన్‌మెషీన్. అయితే, పదిహేడేళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీ ఈసారి ఆర్సీబీ సొంతమైంది. ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ టైటిల్ సొంతం చేసుకుంది. దీంతో కోహ్లి, ఆర్సీబీ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.తీవ్ర విషాదంఫ్రాంఛైజీ కూడా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో అభిమానులకు పిలుపునివ్వడం విషాదకర ఘటనకు దారితీసింది. అహ్మదాబాద్ నుంచి ట్రోఫీతో బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆర్సీబీ ఆటగాళ్లకు స్వాగతం పలికే క్రమంలో.. జూన్ 4న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏకంగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా యాభై మంది గాయాలపాలయ్యారు. దీంతో ఆర్సీబీ, కర్ణాటక ప్రభుత్వ తీరుపై విమర్శలు వచ్చాయి.తప్పంతా మీదేఈ నేపథ్యంలో అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్‌పై వేటు పడింది. ఈ క్రమంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ వద్దకు విషయం చేరగా.. మంగళవారం విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ ఆర్సీబీ యాజమాన్యానిదే ఈ దుర్ఘటనకు బాధ్యత అని స్పష్టం చేసింది. వికాస్ కుమార్‌ను వెంటనే తన పదవిలో తిరిగి నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బలమైన సాక్ష్యాధారాలు లేకుండా ఇలా పోలీసులను సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొంది.ఈ మేరకు.. ‘‘ఆర్సీబీ పోలీసుల నుంచి సరైన రీతిలో అనుమతి తీసుకోలేదు. వారి నుంచి ఆమోదమూ పొందలేదు. అకస్మాత్తుగా.. విజయోత్సవం గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున జనసమూహం చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకుంది.వాళ్ల దగ్గర అల్లావుద్దీన్ అద్భుతదీపం లేదుఅయితే, పన్నెండు గంటల్లోనే స్టేడియం వద్ద ఏర్పాట్లు చేయడం పోలీసులకు సాధ్యపడలేదు. నిజానికి వారికి మరింత సమయం ఇవ్వాల్సింది. పోలీసులు కూడా మనుషులే. వాళ్లేమీ దేవుళ్లో.. లేదంటే ఇంద్రజాలికులో కాదు.ఇలా అనుకోగానే.. అలా ఏర్పాట్లు చేయడానికి వారి వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపమేమీ లేదు’’ అంటూ ఆర్సీబీకి చివాట్లు పెట్టింది కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్. అదే సమయంలో పోలీసుల పట్ల సహానుభూతి వ్యక్తం చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ సంబంధిత వివాదాలను క్యాట్ పరిష్యరిస్తుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది.చదవండి: నా మనసంతా అక్కడే.. ఎక్కడున్నా పట్టేస్తారు: పెదవి విప్పిన కావ్యా మారన్ -
సెహ్వాగ్ ఇద్దరు కొడుకులు.. కోహ్లి కుటుంబం నుంచి ఒకరు..
దేశవ్యాప్తంగా టీ20 లీగ్‌లకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) కూడా తెరమీదకు వచ్చింది. గతేడాది ఆరంభమైన ఈ లీగ్ ద్వారా.. ఐపీఎల్-2025 నయా సంచలనాలు ప్రియాన్ష్ ఆర్య (Priyansh Arya), దిగ్వేశ్ సింగ్ రాఠి (Digvesh Singh Rathee) వెలుగులోకి వచ్చారు.డీపీఎల్ ప్రస్తుతం రెండో సీజన్‌కు సిద్ధమైంది. ఈసారి అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు కూడా లీగ్‌లో ప్రవేశించాయి. ఈసారి మరో అదనపు ఆకర్షణ కూడా ఉంది. టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి కుటుంబం నుంచి ఓ స్పిన్ బౌలర్ డీపీఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు.ఆర్యవీర్ కోహ్లి ఎంట్రీ?కోహ్లికి కొడుకు వరసయ్యే ఆర్యవీర్ కోహ్లి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ దగ్గర అతడు మెళకువలు నేర్చుకుంటున్నాడు అంతేకాదు.. భారత విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరు కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్ కూడా డీపీఎల్ వేలంలోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి పేర్లు షార్ట్‌లిస్ట్ అయినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ ఇప్పటికే ఢిల్లీ అండర్ 19 జట్టుకు ఆడుతుండగా.. 15 ఏళ్ల వేదాంత్ ఆఫ్ స్పిన్నర్. ఇతడు అండర్-16 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఇద్దరూ డీపీఎల్ వేలంలో ‘బి’ కేటగిరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే దిగ్గజాల వారసుల ఆట చూసేందుకు అభిమానులు డీపీఎల్‌పై ఓ లుక్కేయడం ఖాయం.సత్తా చాటిన ప్రియాన్ష్, దిగ్వేశ్కాగా జూలై 5న ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలం జరుగనుంది. ఇక గతేడాది సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌కు ఆడిన ప్రియాన్ష్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు.. పది మ్యాచ్‌లలో కలిపి 608 పరుగులు చేసి లీగ్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ క్రమంలో రూ. 3.80 కోట్ల ధరతో ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌లో చేరిన ప్రియాన్ష్ చెన్నై సూపర్ కింగ్స్ మీద 42 బంతుల్లో 103 పరుగులతో చెలరేగి చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. సౌత్ ఢిల్లీకే ఆడిన దిగ్వేశ్ సింగ్ రాఠీ సైతం డీపీఎల్‌లో సత్తాచాటి ఐపీఎల్లో ప్రవేశించాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేయగా.. ఈ ఏడాది జట్టు తరఫున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. 13 ఇన్నింగ్స్‌లో కలిపి పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు.ఇక డీపీఎల్‌లో ఈసారి అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు కూడా లీగ్‌లో ప్రవేశించాయి. గతేడాది సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, పురాణీ ఢిల్లీ 6 పేరిట ఆరుజట్లు తలపడ్డాయి. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ టైటిల్ గెలవగా.. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ రన్నరప్‌గా నిలిచింది. ఇక తొలి సీజన్‌కు వీరేందర్ సెహ్వాగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: ‘షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్‌ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’ -
రోహిత్, కోహ్లికి నో ఛాన్స్!.. వరుణ్ చక్రవర్తి డ్రీమ్ టీ20 ఎలెవన్ ఇదే
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన డ్రీమ్ టీ20 ఎలెవన్ (Dream T20 Eleven)ను ప్రకటించాడు. ఇందులో భారత దిగ్గజ టీ20 స్టార్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli)లకు మాత్రం చోటు దక్కలేదు. అయితే, ఇందులో ఓ ట్విస్టు ఉంది. కాగా కర్ణాటకలోని బీదర్‌లో జన్మించిన వరుణ్ తొలుత ఆర్కిటెక్ట్‌గా పనిచేశాడు.నటన వైపు అడుగులుఆ తర్వాత గిటార్ ప్లేయర్‌గానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని తన స్నేహితులతో కలిసి ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లాడు. అయితే, అక్కడ ఆ అవకాశం దొరకలేదు కానీ.. క్రికెట్ ఆడతాడు కాబట్టి ఆ సినిమాలోని ఓ పాత్రకు వరుణ్ ఎంపికయ్యాడు. అలా నటుడిగా మారిన తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్'కు దర్శకుడిగానూ వ్యవహరించాడు.క్రికెట్ నైపుణ్యాలకు మెరుగుపెట్టుకునిఅయితే, తర్వాత మళ్లీ పాత కథే. ఇంటీరియర్ డిజైనర్‌గా సత్తా చాటాలనుకుని కంపెనీ పెట్టి చేతులు కాల్చుకున్నాడు. పాతికేళ్ల వయసుకే ఇన్ని అనుభవాలు సంపాదించిన వరుణ్.. క్రికెట్ నైపుణ్యాలకు మెరుగుపెట్టుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.శ్రీలంకతో టీ20 మ్యాచ్ సందర్భంగా 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వరుణ్ చక్రవర్తి.. ఈ ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025ని భారత్ కైవసం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 18 టీ20లు, నాలుగు వన్డేలు ఆడిన ఈ రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ వరుసగా 33, 10 వికెట్లు తీశాడు.ట్విస్ట్ ఏమిటంటేప్రస్తుతం విరామం తీసుకుంటున్న వరుణ్ చక్రవర్తి.. మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన డ్రీమ్ టీ20 ఎలెవన్‌ను చెప్పాలంటూ అశూ.. వరుణ్‌ను అడిగాడు. అయితే, ఇక్కడే ఓ మెలిక పెట్టాడు. వరుణ్‌తో కలిసి ఆడిన ఆటగాళ్ల నుంచే జట్టును ఎంపిక చేసుకోవాలని చెప్పాడు.ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలను వదిలేసి వరుణ్ తన జట్టును ప్రకటించాడు. ఓపెనర్లుగా బట్లర్, హెడ్లను ఎంచుకున్న అతడు.. వన్‌డౌన్‌లో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటిచ్చాడు. అదే విధంగా.. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తన సహచర ఆటగాళ్లైన ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్‌లను కూడా వరుణ్ తన జట్టులోకి ఎంపిక చేసుకున్నాడు. ఇక టీమిండియా నుంచి సూర్యతో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు స్థానం కల్పించాడు. స్పిన్నర్ల జాబితాలో రషీద్ ఖాన్‌కు పెద్దపీట వేశాడు. శ్రీలంక యువ పేసర్ పతిరణకు కూడా వరుణ్ తన జట్టులో చోటిచ్చాడు.వరుణ్ చక్రవర్తి డ్రీమ్ టీ20 ఎలెవన్:జోస్ బట్లర్ (ఇంగ్లండ్), ట్రవిస్ హెడ్ (ఆస్ట్రేలియా), సూర్యకుమార్ యాదవ్ (ఇండియా), నికోలస్ పూరన్ (వెస్టిండీస్), హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా), హార్దిక్ పాండ్యా (ఇండియా), ఆండ్రీ రసెల్ (వెస్టిండీస్), సునిల్ నరైన్(వెస్టిండీస్), రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), జస్ప్రీత్ బుమ్రా (ఇండియా), మతీశ పతిరణ (శ్రీలంక).చదవండి: ‘షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్‌ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’ -
అతడి భార్య పోటీకి వస్తుందేమో!.. నేనే నంబర్ వన్!
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసలు కురిపించాడు. అద్భుత నైపుణ్యాలు జెస్సీ సొంతమని.. బ్యాటింగ్ లెజెండ్స్ సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి (Virat Kohli)లతో సరిసమాన గౌరవానికి అతడు అర్హుడని పేర్కొన్నాడు. బుమ్రా తన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడన్న అశూ.. అందరికంటే తానే వీరాభిమానినని తెలిపాడు.ఇంగ్లండ్ పర్యటనలోకాగా ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బుమ్రా.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో అతడు సత్తా చాటాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 24.4 ఓవర్ల బౌలింగ్‌లో 83 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఈ కుడిచేతివాటం పేసర్ స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది.సమాన గౌరవం దక్కాలిఇదిలా ఉంటే.. గిల్ సేన మ్యాచ్ ఓడినా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ప్రదర్శన పట్ల మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తాను బుమ్రాకు వీరాభిమానినంటూ అశూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘టెండుల్కర్, కోహ్లి మాదిరే బుమ్రాకు సమాన గౌరవం దక్కాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సచిన్ టెండుల్కర్‌ల విషయంలో మనమేం చేశామో.. జెస్సీ విషయంలోనూ అదే చేయాలి. నిజానికి బౌలర్‌గా అతడికి అందరికంటే ఎక్కువ గౌరవమే దక్కాలి.అతడి భార్య పోటీకి వస్తుందేమో!.. నేనే నంబర్ వన్అతడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎంతో మంది అతడిని ప్రేమిస్తున్నారు. నేనైతే అతడి నంబర్ వన్ ఫ్యాన్‌ని. నాకు తెలిసి ఈ నంబర్ వన్ ఫ్యాన్ విషయంలో బుమ్రా భార్య నాతో పోటీకి వస్తుందేమో! కానీ నేను మాత్రం నేనే నంబర్ వన్ అని చెప్తా’’ అంటూ అశ్విన్ బుమ్రా పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు.కాగా బుమ్రా సతీమణి సంజనా గణేషన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ అన్న విషయం తెలిసిందే. ఐసీసీ ఈవెంట్లతో పాటు ఐపీఎల్‌లోనూ వ్యాఖ్యాతగా సత్తా చాటుతోందామె. ఈ జంటకు కుమారుడు అంగద్ బుమ్రా ఉన్నాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉన్న టీమిండియా.. జూలై 2-6 వరకు రెండో టెస్టు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. పనిభారం తగ్గించే నిమిత్తం యాజమాన్యం అతడికి రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చినట్లు సమాచారం.చదవండి: సచిన్ సర్ కొడుకు.. అర్జున్‌పై ఎలా అరవగలను?.. కెప్టెన్‌గా ఉన్నపుడు జరిగిందిదే! -
T20 WC: భయంతో వణికిపోయా.. అతడే గేమ్ ఛేంజర్: రోహిత్ శర్మ
టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). అతడి సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ (T20 World Cup) గెలిచిన భారత్.. యాభై ఓవర్ల ఫార్మాట్లో ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)ని కూడా కైవసం చేసుకుంది. ఇక పొట్టి వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ప్రస్తుతం భారత వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్ నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఒక దశలో తాను భయంతో వణికిపోయానని.. అయితే, తమ జట్టు మీద తనకున్న నమ్మకం వమ్ముకాలేదని పేర్కొన్నాడు. అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ మ్యాచ్‌ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకువచ్చిందని తెలిపాడు.ఆదుకున్న కోహ్లి, అక్షర్, దూబేకాగా బార్బడోస్ వేదికగా గతేడాది జూన్‌లో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాతో తలపడింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా... ఓపెనర్ రోహిత్ శర్మ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ డకౌట్ కాగా.. పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 3 పరుగులకే అవుటయ్యాడు.ఈ క్రమంలో దూకుడుగా మొదలుపెట్టి 1.3 ఓవర్లలోనే 23 పరుగులు సాధించిన టీమిండియా.. ఐదో ఓవర్ పూర్తయ్యేసరికి 34 పరుగులు మాత్రమే చేసి మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి దశలో మరో ఓపెనర్ విరాట్ కోహ్లి (76), ఐదు, ఆరు స్థానాల్లో వచ్చిన అక్షర్ పటేల్ (47), శివం దూబే (27) జట్టును ఆదుకున్నారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి టీమిండియా 176 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులే చేయగలిగింది. దీంతో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టీమిండియా పదమూడేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది.భయంతో వణికిపోయాను.. ఏమీ తోచలేదుఈ విషయాలను గుర్తు చేసుకున్న రోహిత్ శర్మ.. ‘‘నిజం చెప్పాలంటే నేను వణికిపోయాను. నాకసలు ఏమీ తోచలేదు. ఫలితం విషయంలో ప్రత్యర్థికి అవకాశం ఇచ్చామా అనిపించింది.అయితే, నా మనసులో మాత్రం మా లోయర్ ఆర్డర్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ టోర్నీ మొత్తంలో వారికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటికీ.. ఈసారి కచ్చితంగా ప్రభావం చూపుతారని నమ్మాను.అతడే గేమ్ ఛేంజర్నిజానికి చాలా మందికి అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ గురించి గుర్తుండకపోవచ్చు. అయితే, అతడే గేమ్ ఛేంజర్. క్లిష్ట పరిస్థితుల్లో 31 బంతుల్లో 47 పరుగులు చేయడం గొప్ప విషయం. ఇక విరాట్ గురించి చెప్పేదేముంది. తను అద్భుత బ్యాటింగ్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు’’ అని పేర్కొన్నాడు. జియోహాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఫైనల్లో విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా... భారత ప్రధాన పేసర్ ‘జస్ప్రీత్ బుమ్రా’ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.చదవండి: విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్ -
వాళ్లని మెచ్చుకో.. తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్!
టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌పై భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంకా ‘కింగ్’ను కించపరిచేలా వ్యాఖ్యానాలు చేయడం ఎందుకని ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే..?!భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు మొదలైన విషయం తెలిసిందే. లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. టీమిండియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.రాహుల్, జైస్వాల్ జోరుఈ క్రమంలో ఓపెనర్లు కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్ కలిసి భారత్‌కు శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లీడ్స్‌లో టీమిండియా ఓపెనింగ్ జంటకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్, జైస్వాల్‌లను కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసించాడు. అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతులను వదిలేసి మంచి పనిచేశారంటూ కొనియాడాడు. అదే సమయంలో పరోక్షంగా కోహ్లిని ఉద్దేశించి విమర్శలు చేశాడు.వాళ్లని మెచ్చుకో.. తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్!‘‘ఓ మాజీ బ్యాటర్.. పదే పదే ఇలాంటి బంతుల వెనుక పడి.. తనను తాను చిక్కుల్లో పడేసుకునేవాడు’’ అంటూ కోహ్లి పేరు ప్రస్తావించకుండానే మంజ్రేకర్ పరోక్షంగా అతడిని విమర్శించాడు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులు మంజ్రేకర్‌పై మండిపడుతున్నారు.‘‘బాగా ఆడినందుకు రాహుల్- జైస్వాల్‌లను మెచ్చుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పటికీ కోహ్లి పేరును వాడుకోవడం ఎందుకు? అతడు రిటైర్ అయిపోయాడు. ఇప్పటికైనా అతడిని వదిలేయండి. మంజ్రేకర్ సాబ్.. మీ పేరు నలుగురి నోళ్లలో నానేందుకు ఇలా చేయడం సరికాదు’’ అని చురకలు అంటిస్తున్నారు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌ను టీమిండియా ఇంగ్లండ్‌తో పర్యటనతో ఆరంభించింది. ఈ సిరీస్‌కు ముందే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానంలో శుబ్‌మన్ గిల్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.ఇక కోహ్లి, రోహిత్ చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్టులు ఆడారు. నాటి టూర్లో కోహ్లి పదే పదే అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతులను ఆడే క్రమంలో అత్యధికసార్లు వికెట్ పారేసుకున్న విషయం తెలిసిందే.జైసూ హాఫ్ సెంచరీ..మ్యాచ్ విషయానికొస్తే.. భోజన విరామ సమయానికి ముందే కేఎల్ రాహుల్ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అరంగేట్ర ఆటగాడు, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సాయి సుదర్శన్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. 35 ఓవర్లు ముగిసే సరికి మరో ఓపెనర్ జైస్వాల్ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. కెప్టెన్ గిల్ 36 బంతుల్లో 33 పరుగులు సాధించాడు. జట్టు స్కోరు: 135/2 (35) . చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. ఈ శతాబ్దంలో ఒకే ఒక్కడు! -
Ind vs Eng 1st Test: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్
టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన ప్రిన్స్.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా పేరు తెర మీదకు రాగా.. తానే స్వయంగా రేసు నుంచి తప్పుకొన్నాడు. పనిభారం కారణంగా సెలక్టర్లు కూడా ఇందుకు అంగీకరించి.. రోహిత్ స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు టెస్టు జట్టు పగ్గాలు అప్పగించారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో శుక్రవారం (జూన్ 20) మొదలైన తొలి టెస్టు సందర్భంగా సారథిగా గిల్ తన ప్రయాణం ఆరంభించాడు.ఈ నేపథ్యంలో పలు అరుదైన రికార్డులను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న వయసులోనే భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన కెప్టెన్ల జాబితాలో చేరిన ప్రిన్స్.. 21వ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన సారథిగా చరిత్రకెక్కాడు. ఇన్నాళ్లుగా కోహ్లి పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు.అంతేకాదు.. ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరు మీదున్న రికార్డును కూడా గిల్ ఈ సందర్భంగా సవరించాడు. కాగా టెస్టుల్లో భారత్‌కు గిల్ 37వ కెప్టెన్.యంగెస్ట్ ఇండియన్ టెస్టు కెప్టెన్లు🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 21 ఏళ్ల 77 రోజుల వయసులో- 1962లో బ్రిడ్జ్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో పోరుతో..🏏సచిన్ టెండుల్కర్- 23 ఏళ్ల 169 రోజుల వయసులో- 1996లో ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..🏏కపిల్ దేవ్- 24 ఏళ్ల 48 రోజులు వయసులో- 1983లో కింగ్స్టన్ వేదికగా వెస్టిండీస్‌తో పోరుతో..🏏రవి శాస్త్రి- 25 ఏళ్ల 229 రోజుల వయసులో- 1988లో చెన్నై వేదికగా- వెస్టిండీస్‌తో పోరుతో..🏏శుబ్‌మన్ గిల్- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో పోరుతో..21వ శతాబ్దంలో పిన్న వయసులో టీమిండియా టెస్టు కెప్టెన్లుగా తొలి మ్యాచ్ ఆడింది వీరే.. ఒకే ఒక్కడు గిల్!🏏శుబ్‌మన్ గిల్- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో పోరుతో..🏏విరాట్ కోహ్లి- 26 ఏళ్ల 34 రోజుల వయసులో- 2014లో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..🏏సచిన్ టెండుల్కర్- 26 ఏళ్ల 253 రోజుల వయసులో- 2000లొ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..🏏మహేంద్ర సింగ్ ధోని- 26 ఏళ్ల 379 రోజుల వయసులో- 2008లొ కాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో పోరుతో..🏏వీరేందర్ సెహ్వాగ్- 27 ఏళ్ల 59 రోజుల వయసులో- 2006లో అహ్మదాబాద్ వేదికగా శ్రీలంకతో పోరుతో..ఇంగ్లండ్‌లో టీమిండియా యంగెస్ట్ కెప్టెన్లు వీరే..🏏శుబ్‌మన్ గిల్- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్ వేదికగా..🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 26 ఏళ్ల 154 రోజుల వయసులో- 1967లో లీడ్స్ వేదికగా..🏏కపిల్ దేవ్- 27 ఏళ్ల 150 రోజుల వయసులో- 1986లో లార్డ్స్ వేదికగా..🏏మహ్మద్ అజారుద్దీన్- 27 ఏళ్ల 168 రోజుల వయసులో- 1990లో లార్డ్స్ వేదికగా..🏏జస్ప్రీత్ బుమ్రా- 27 ఏళ్ల 178 రోజుల వయసులో- 2022లో ఇంగ్లండ్ వేదికగా..👉 ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 92/2. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ 42 పరుగులకు అవుట్ కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 42 పరుగుల వద్ద ఉన్నాడు. అరంగేట్ర ఆటగాడు, వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.చదవండి: IND vs ENG: పాపం నితీశ్ కుమార్.. అతడి కోసం పక్కన పెట్టేశారు? -
ఇంగ్లండ్- భారత్ టెస్టు సిరీస్.. డేంజర్లో సచిన్, కోహ్లి రికార్డులు
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రంగం సిద్దమైంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనున్న ఈ సిరీస్.. శుక్రవారం(జూన్ 20) నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి టెస్టులో అమీతుమీ తెల్చుకోవడానికి భారత్-ఇంగ్లండ్ జట్లు సిద్దమయ్యాయి.అయితే ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ ఇంగ్లండ్ గ్రేట్ బ్యాటర్.. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డులపై కన్నేశాడు.మరో మూడు హాఫ్ సెంచరీలు చేస్తే..భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లలో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డు లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. గవాస్కర్ తన కెరీర్లో ఇంగ్లండ్‌పై 16 టెస్టు ఫిప్టీలు చేశారు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్ 13 హాఫ్ సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు.ఆ తర్వాత స్ధానంలో జూరూట్(11 హాఫ్ సెంచరీలు) ఉన్నాడు. ఈ క్రమంలో రూట్ మరో మూడు హాఫ్ సెంచరీలు చేస్తే.. సచిన్ అధిగమిస్తాడు. అదేవిధంగా ఆరు హాఫ్ సెంచరీలు చేస్తే సునీల్ గవాస్కర్ ఆల్‌టైమ్ రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.చరిత్రకు అడుగు దూరంలో..భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్లలో 4036 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్ధానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్(3990) ఉన్నాడు. ఈ లిస్ట్‌లో మూడో స్ధానంలో జో రూట్(3858) ఉన్నాడు. ఇప్పుడు రూట్ 133 పరుగులు చేస్తే సచిన్‌ను, 179 పరుగులు సాధిస్తే విరాట్‌ను అధిగమించి అగ్రస్ధానానికి చేరుకుంటాడు.కాగా భారత్‌పై జో రూట్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు రూట్ టీమిండియాపై రూట్ 28 సార్లు (13 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు) ఏభైకి పైగా పరుగులు చేశాడు. రూట్ మరో ఐదు అర్ధ శతకాలు చేస్తే సచిన్, కోహ్లి(32)ను దాటేస్తాడు.చదవండి: Mohammed Siraj: బిజినెస్ రంగంలోకి సిరాజ్.. బంజారా హిల్స్‌లో లగ్జరీ రెస్టారెంట్ -
నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్‌గా ఉండాలనుకుంటున్నా: గిల్
లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు శుక్రవారం(జూన్ 20) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో శుభరంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం(జూన్ 18) టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నాడు.ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు గిల్ సమాధనమిచ్చాడు. భారత కెప్టెన్‌గా తను ఎదుర్కొనున్న ఛాలెంజ్స్ కోసం గిల్ మాట్లాడాడు. అయితే కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్‌పై పడకుండా చూసుకుంటాని అతడు చెప్పుకొచ్చాడు. "ఇప్పటివరకు ఏ విధంగా అయితే పూర్తి స్వేఛ్చతో బ్యాటింగ్ చేశానో, ఇకపై కూడా అదే కొనసాగిస్తున్నాను. కెప్టెన్సీ గురుంచి ఎక్కువగా ఆలోచించకుండా నా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ సిరీస్‌లో బెస్ట్ బ్యాటర్‌గా ఉండాలని భావిస్తున్నా. విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్ధానం కోసం ఇప్పటికే గంభీర్ భాయ్, నేను చర్చించుకున్నాము. మా దగ్గర రెండు వేర్వేరు కాంబినేషన్లు సిద్దంగా ఉన్నాయి. పిచ్‌ను పరిశీలించాక ఓ నిర్ణయం తీసుకుంటాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ పేర్కొన్నాడు.భయపెడుతున్న గిల్ రికార్డు..శుబ్‌మన్ గిల్ తన కెరీర్లో 32 టెస్టులు ఆడి 1893 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. కానీ సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి రికార్డు మాత్రం టీమ్‌మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. సెనాదేశాల్లో గిల్ ఇప్పటివరకు 11 టెస్టులు ఆడి 514 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌లో అయితే అతడి ప్రదర్శన మరి దారుణంగా ఉంది. ఇంగ్లండ్ గడ్డపై మూడు టెస్టులు ఆడిన శుబ్‌మన్.. 14.66 సగటుతో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: ‘కోహ్లి చెప్పింది నిజమే.. కానీ మాకూ కుటుంబం ఉంటుంది.. డబ్బు సంపాదించాలి’ -
కోహ్లి చెప్పింది నిజమే.. కానీ కుటుంబాన్నీ పోషించుకోవాలిగా!: బుమ్రా
టెస్టు క్రికెట్ గురించి టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) చేసిన వ్యాఖ్యలపై భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్పందించాడు. కోహ్లి మాటలతో తాను ఏకీభవిస్తానని.. అయితే, పరిస్థితులకు అనుగుణంగానే క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్ నుంచి ఒక్కోసారి తప్పుకోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు.కాగా టెస్టు క్రికెట్ (Test Cricket)లో బ్యాటర్‌గా, భారత జట్టు కెప్టెన్‌గా చిరస్మరణీయ విజయాలు సాధించిన విరాట్ కోహ్లి.. ఇటీవలే సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక పద్దెనిమిదేళ్ల కలను నిజం చేసుకుంటూ.. ఐపీఎల్-2025 సీజన్లో కోహ్లి ట్రోఫీని ముద్దాడాడు. టెస్టు క్రికెట్‌తో పోలిస్తే ఐపీఎల్ ఐదు అంచెల కిందేక్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చాంపియన్‌గా నిలవడంతో ఈ రన్‌మెషీన్ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. తన జీవితంలోని గుర్తుంచుకోదగ్గ గొప్ప క్షణాల్లో ఇదొకటి అని తెలిపాడు. అయితే, తన దృష్టిలో టెస్టు క్రికెట్‌తో పోలిస్తే ఐపీఎల్ ఐదు అంచెల కిందే ఉంటుందని వ్యాఖ్యానించాడు. సంప్రదాయ ఫార్మాట్ అంటే తనకెంతో ఇష్టమని.. యువ, వర్ధమాన క్రికెటర్లు కూడా రెడ్ బాల్ క్రికెట్‌ను గౌరవించాలని సూచించాడు.టెస్టు క్రికెట్లో రాణిస్తే ప్రపంచంలో ఎక్కుడైనా ఏ ఫార్మాట్లోనైనా రాణించగలరనే ఆత్మవిశ్వాసం వస్తుందని కోహ్లి పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బుమ్రా తనదైన శైలిలో స్పందించాడు.కోహ్లి చెప్పింది నిజమే‘‘కోహ్లి చెప్పినట్లు టెస్టు ఫార్మాట్లో ఆడటం ద్వారా ఆటగాడిగా గొప్ప గౌరవం లభిస్తుంది. నేను కూడా యువ క్రికెటర్లకు ఈ ఫార్మాట్‌ను గౌరవించమని, వీలైనంత ఎక్కువగా ఆడమనే చెప్తాను. అయితే, అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. నేను కూడా చిన్నప్పటి నుంచి టెస్టు క్రికెట్‌పై ప్రేమను పెంచుకున్నాను.నా దృష్టిలో అదే అత్యుత్తమమైనది. సంప్రదాయ క్రికెట్లో ప్రదర్శన ఆధారంగానే నా స్థాయిని అంచనా వేసుకునేవాడిని. అయితే, ఇప్పటి ఆటగాళ్ల ఆలోచనా విధానం వేరుగా ఉంది. టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.డబ్బు సంపాదించాలి కదా!ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు జరుగుతున్నాయి. ఆటగాళ్ల మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది. ఏదేమైనా ఫాస్ట్ బౌలర్లను ఈ విషయంలో మనం తప్పుబట్టలేము. టెస్టు క్రికెట్ ఆడేందుకు అందరి శరీరం సహకరించకపోవచ్చు.కెరీర్ కాపాడుకోవాలి. కుటుంబాన్ని పోషించుకోవాలంటే డబ్బు సంపాదించాలి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంపై అదనపు భారం వేసి కష్టపెట్టడం సరికాదు. అందుకే చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉంటారని అనుకుంటున్నా.టెస్టు క్రికెట్ ఆడాలనే కోరిక బలంగా ఉన్నా.. శరీరం సహకరించకపోతే వారు కూడా ఏమీ చేయలేరు కదా!’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. కాగా వెన్నునొప్పి కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు ఐపీఎల్-2025లో ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న బుమ్రా.. తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున రీఎంట్రీ ఇచ్చాడు.ఇక ఇప్పుడు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అతడు పునరాగమనం చేయబోతున్నాడు. ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20)నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’ -
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ల అత్యుత్తమ Ind-Eng జట్టు.. కోహ్లికి నో ప్లేస్!
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) టెస్టు సిరీస్ గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా ఇరుజట్లకు ఇదే తొలి సిరీస్. దీనికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది.ఇక విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడబోయే తొలి సిరీస్ కూడా ఇదే. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో దిగ్గజాలు లేని భారత జట్టు స్టోక్స్ బృందాన్ని వారి సొంతగడ్డపై ఢీకొట్టనుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.విరాట్ కోహ్లికి నో ప్లేస్ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ ఆర్థర్టన్, నాసిర్ హుసేన్.. 21వ శతాబ్దానికి సంబంధించి భారత్- ఇంగ్లండ్ ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేశారు. అయితే, వీరిద్దరు సంయుక్తంగా ఎంచుకున్న ఈ జట్టులో టీమిండియా దిగ్గజ బ్యాటర్, లెజెండరీ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి మాత్రం చోటు ఇవ్వలేదు.ఈ విషయం గురించి నాసిర్ హుసేన్ మాట్లాడుతూ.. టీమిండియా- ఇంగ్లండ్ నుంచి మేము ఎంపిక చేసుకున్న అత్యుత్తమ జట్టులో కోహ్లి లేడు. జో రూట్ కూడా లేడు. వారిద్దరు లేకపోవడాన్ని అందరూ జీర్ణించుకోలేకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు.కాగా భారత్ నుంచి విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్‌తో పాటు ‘వాల్’ రాహుల్ ద్రవిడ్, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్, యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ప్రస్తుత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు ఆర్థర్టన్, నాసిర్ హుసేన్ చోటు ఇచ్చారు.21వ శతాబ్దానికి గానూ ఆర్థర్టన్, నాసిర్ హుసేన్ ఎంచుకున్న భారత్- ఇంగ్లండ్ కంబైన్డ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..వీరేందర్ సెహ్వాగ్, అలిస్టర్ కుక్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, కెవిన్ పీటర్సన్, బెన్ స్టోక్స్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్, జస్ప్రీత్ బుమ్రా.ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్-2025కి భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవేభారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్. -
Ind vs Eng: కోహ్లి స్థానంలో అతడే: క్లారిటీ ఇచ్చిన పంత్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభం నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ కీలక అప్డేట్ అందించాడు. విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి పేరు వెల్లడించాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్లో భాగంగా టీమిండియా తమ తొలి సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ముందే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రోహిత్ స్థానాన్ని శుబ్‌మన్ గిల్‌తో భర్తీ చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. అతడికి డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను నియమించింది. కాగా కోహ్లి నిష్క్రమణ నేపథ్యంలో టెస్టుల్లో భారత బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో ఎవరు దిగుతారన్న అంశంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.కోహ్లి వారసుడిగా కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ పేర్లు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రి- మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శుబ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.అయితే, అతడు ఆడుతున్న మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను యథావిధిగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాను’’ అని రిషభ్ పంత్ వెల్లడించాడు. దీంతో తుదిజట్టుపై మరోసారి సందిగ్దం నెలకొంది. సాయి సుదర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడా? లేదంటే ‘ట్రిపుల్ సెంచూరియన్’ కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.ఇంగ్లండ్‌తో టెస్టులకు టీమిండియా:శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.చదవండి: టీమిండియాకు గేమ్ ఛేంజర్లు వీరిద్దరే: ఊహించని పేర్లు చెప్పిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ -
తమ్ముడి గురువు.. ఆ అక్క మర్చిపోలేదు!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దిగ్గజ బ్యాటర్‌గా పేరొందిన ఈ రన్‌మెషీన్ ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ముఖ్యంగా వన్డేల్లో ఛేజింగ్ కింగ్‌గా పేరొందిన కోహ్లి.. ఈ ఫార్మాట్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 51 శతకాలు సాధించాడు.అదే విధంగా.. టీమిండియా తరఫున టెస్టుల్లో 30, టీ20లలో ఓ సెంచరీ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 82 శతకాలు నమోదు చేసిన కోహ్లి.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక కోహ్లి ఈ స్థాయికి చేరడంలో అతడి కుటుంబంతో పాటు చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ (Rajkumar Sharma)ది కూడా కీలక పాత్ర.పశ్చిమ ఢిల్లీలోని రాజ్‌కుమార్ శర్మ క్రికెట్ అకాడమీలో ఓనమాలు దిద్దిన కోహ్లి.. ఆధునిక క్రికెట్ యుగంలో మకుటంలోని మారాజుగా ఎదిగాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కోహ్లి ఇప్పటికీ తన చిన్ననాటి కోచ్‌తో కాంటాక్టులో ఉన్నాడు. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్‌పై గెలిచిన నేపథ్యంలో శర్మకు ఫోన్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.ఇక ఈరోజు రాజ్‌కుమార్ శర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా కోహ్లి అక్క భావనా కోహ్లి ధింగ్రా (Bhawna Kohli Dhingra ) తన తమ్ముడి గురువుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కోహ్లికి రాజ్‌కుమార్ శర్మ మొమెంటో అందిస్తున్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘హ్యాపీ బర్త్‌డే సర్. మీరే నిజమైన మార్గ నిర్దేశకులు.. మెంటార్’’ అంటూ విషెస్ తెలియజేశారు.ఈ నేపథ్యంలో కోహ్లి- రాజ్‌కుమార్ శర్మల బంధం మరోసారి తెరమీదకు వచ్చింది. కాగా 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కోహ్లి.. ఇప్పటి వరకు 302 వన్డేలు ఆడి 14181 పరుగులు సాధించాడు.అదే విధంగా.. 125 టీ20 మ్యాచ్‌లలో కలిపి ఓ శతకం సాయంతో 4188 రన్స్ చేశాడు. 123 టెస్టుల్లో కలిపి 9230 పరుగులు సాధించాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. ఇటీవలే టెస్టులకు కూడా వీడ్కోలు పలికాడు.ప్రస్తుతం వన్డేలతో పాటు ఫ్రాంఛైజీ క్రికెట్లో కొనసాగుతున్న కోహ్లి ఇటీవలే తన చిరకాల కలను సాకారం చేసుకున్నాడు. ఐపీఎల్-2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవడంతో తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు. కాగా ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి.. క్యాష్ రిచ్ లీగ్‌లో తన జట్టును చాంపియన్‌గా నిలిపేందుకు పదిహేడేళ్లు పట్టింది.చదవండి: టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ విడుదల -
కోహ్లి లేకుండా టీమిండియాతో సిరీస్.. స్టోక్స్ రియాక్షన్ వైరల్!
ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలో భారత జట్టు స్టోక్స్ బృందంతో తలపడనుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఆడే తొలి టెస్టు సిరీస్ కావడంతో గిల్ సేన ఎలా ఆడబోతుందన్న అంశంపైనే క్రికెట్ ప్రేమికుల దృష్టి కేంద్రీకృతమైంది.అతడికి ఎవరూ సాటిరారుఈ నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విరాట్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోహ్లి సేవలను కచ్చితంగా మిస్ అవుతుందని.. అతడి పోరాటపటిమ, పట్టుదలకు ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. క్లాస్ ప్లేయర్ లేకుండా బరిలోకి దిగడం భారత జట్టుకు కాస్త కష్టంగానే ఉంటుందని తెలిపాడు.ఈ మేరకు.. ‘‘పోరాటతత్వం గల.. అదే విధంగా క్రీడాస్పూర్తిని రగిల్చే కోహ్లిని టీమిండియా మిస్ అవుతుందనడంలో సందేహం లేదు. గెలుపు కోసం అతడు పడే తాపత్రయం, అందుకోసం అతడు చేసే పోరాడే విధానానికి ఎవరూ సాటిరారు.18వ నంబర్‌ను అతడు తన గుర్తింపుగా మార్చుకున్నాడు. వేరొక భారత ఆటగాడి జెర్సీపై నంబర్ 18ను చూడటం కాస్త చిత్రంగానే అనిపించవచ్చు. సుదీర్ఘకాలంగా అతడు టీమిండియా క్లాస్ ప్లేయర్‌గా కొనసాగిన తీరు అమోఘం’’ అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.కోహ్లి ఉంటేనే మజాఅదే విధంగా కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. తాను అతడి మెసేజ్ చేశానన్న స్టోక్స్... అతడు లేని టెస్టు క్రికెట్ ఆడటం అంత గొప్పగా ఉండదని చెప్పానన్నాడు. ‘‘ విరాట్ కోహ్లికి ప్రత్యర్థిగా ఆడటంలో ఎంతో మజా ఉంటుంది. కానీ ఇకపై అది జరుగబోదని తెలిసి నాకు కాస్త విచారంగా అనిపించింది.మైదానంలో ఉన్నప్పుడు యుద్ధరంగంలో ఉన్నట్లే నేను, కోహ్లి భావిస్తాం. ఆట విషయంలో మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకే విధంగా ఉంటుంది. ఇంగ్లండ్ జట్టు మీద అతడు ఎంతో గొప్పగా ఆడాడు. అతడొక క్లాస్ ప్లేయర్’’ అని స్టోక్స్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.దిగ్గజ కెప్టెన్ కూడా!కాగా టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి తన పద్నాలుగేళ్ల టెస్టు కెరీర్లో.. 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు సాధించాడు. ఇందులో ముప్పై శతకాలు ఉన్నాయి. అంతేకాదు.. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కోహ్లి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. అంతేకాదు.. గ్రేమ్ స్మిత్ (53 విజయాలు), రిక్కీ పాంటింగ్ (48 విజయాలు), స్టీవ్ వా(41 విజయాలు) తర్వాత అత్యధిక టెస్టు విజయాలు (40) అందుకున్న సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్ గడ్డ మీద కెప్టెన్‌గా పది టెస్టులు ఆడిన కోహ్లి.. మూడింట జట్టును గెలిపించాడు.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు భారత బ్యాటింగ్ లైనప్ ఇదే.. రోహిత్, కోహ్లికి ప్రత్యామ్నాం వీళ్లే..! -
కోహ్లి, రోహిత్ లేకపోయినా పర్వాలేదు.. గిల్ అంతా చూసుకుంటాడు: గూచ్
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తొలి సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్దమయ్యాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ కోసం గిల్ సేన తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌లో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేని యువ భారత జట్టు ఎలా రాణిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కమంలో ఇంగ్లండ్ మాజీ టెస్టు కెప్టెన్ కెప్టెన్ గ్రాహం గూచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.కోహ్లి, రోహిత్ స్ధానాలను భర్తీ చేసే అద్బుత ఆటగాళ్లు ప్రస్తుత భారత జట్టులో ఉన్నారని గూచ్ అభిప్రాయపడ్డాడు. ఈ ఇద్దరి దిగ్గజాల స్ధానాలను భర్తీ చేసేందుకు సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ సిద్ధంగా ఉన్నారు. కానీ టీమ్ మెన్జ్మెంట్ ఎవరికి అవకాశమిస్తుందో వేచి చూడాలి."భారత క్రికెట్లో కొత్త యుగం మొదలైంది. నా వరకు అయితే.. ఒక దారి మూసుకుపోతే, మరో దారి తెరుచుకుంటుంది. ఈ పర్యటనలో భారత ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తారని నేను నమ్ముతున్నాను. భారత క్రికెట్ జట్టులో ప్రతిభకు కొదవలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వారసత్వాన్ని కొనసాగించేందుకు యువ ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారు.అయితే బుమ్రా అన్ని మ్యాచ్‌లలో ఆడకపోవడం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే. బుమ్రా ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. ఎటువంటి పరిస్థితులలోనైనా అతడిని ఎదుర్కొవడం అంత సులభం కాదు. ఈ పర్యటనలో భారత జట్టుపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది.కానీ కొంతమంది యువ ఆటగాళ్లు తమ ప్రదర్శలనతో ముందుకు రావాలి. ఇక భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం అరుదైన గౌరవంగా భావించాలి. శుబ్‌మన్ గిల్ జట్టును విజయ పథంలో నడిపిస్తాడన్న నమ్మకం నాకు ఉందని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గూచ్ పేర్కొన్నాడు.చదవండి: ICC Odi Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్ -
ఏంజెలో మాథ్యూస్‌కు ఘనంగా వీడ్కోలు.. కోహ్లి ఇలాంటి గౌరవానికి అర్హుడు కాడా..?
శ్రీలంక క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన ఏంజెలో మాథ్యూస్ కెరీర్లో తన చిట్టచివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగాడు. ఇవాల్టి నుంచి (జూన్ 17) శ్రీలంక స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ కెరీర్లో తనకు చివరిదని మాథ్యూస్ ఇదివరకే ప్రకటించాడు. మాథ్యూస్ సహచరుల నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్ పొందాడు. ఆ సమయంలో మాథ్యూస్ ముఖంలో చిరునవ్వులు విరబూసాయి. లంక క్రికెట్‌కు ఎంతో చేసిన మాథ్యూస్‌కు చివరి టెస్ట్‌కు ముందు ఘనమైన వీడ్కోలు లభించింది. ఇది చూసి భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు. EMOTIONAL SCENES AT GALLE 🥺❤️- A beautiful farewell from Test Cricket for Angelo Mathews, An Icon Sri Lankan Cricket. pic.twitter.com/DrdazYSC4y— Johns. (@CricCrazyJohns) June 17, 2025భారత క్రికెట్‌కు విశ్వవ్యాప్త ఖ్యాతి తెచ్చిన విరాట్ కనీసం ఇలాంటి వీడ్కోలు కూడా అర్హుడు కాడా అని ప్రశ్నిస్తున్నారు. విరాట్ ఇటీవలే టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్ గౌరవార్దం బీసీసీఐ ఎలాంటి వీడ్కోలు సన్నాహాలు ప్లాన్ చేయకపోవడమే అతని అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. లంక క్రికెట్ బోర్డును చూసైనా బీసీసీఐ నేర్చుకోవాలని విరాట్ ఫ్యాన్స్ చురకలంటిస్తున్నారు. కాగా, విరాట్ రిటైర్మెంట్ ప్రకటించాకే మాథ్యూస్ కూడా టెస్ట్‌లకు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. విరాట్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్‌లకు ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల ఏంజెలో మాథ్యూస్ శ్రీలంక తరఫున 118 టెస్ట్‌లు, 226 వన్డేలు, 90 టీ20లు ఆడాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన మాథ్యూస్ మధ్యలో గాయాల కారణంగా బౌలింగ్‌కు వీడ్కోలు పలికి కేవలం బ్యాటర్‌గానే కొనసాగాడు. మాథ్యూస్ టెస్ట్‌ల్లో ఓ డబుల్ సెంచరీ, 16 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీల సాయంతో 8167 పరుగులు చేశాడు. వన్డేల్లో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీల సాయంతో 5916 పరుగులు చేశాడు. టీ20ల్లో 6 హాఫ్ సెంచరీల సాయంతో 1416 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 33 వికెట్లు, వన్డేల్లో 126, టీ20ల్లో 45 వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ శ్రీలంకలో పర్యటిస్తుంది. గాలే వేదికగా ఇవాళ ప్రారంభమైన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్‌కు టాస్ గెలిచిన ఆనందం ఎంతోసేపు నిలబడలేదు. 5 పరుగులకే ఆ జట్టు ఓపెనర్ అనాముల్ హక్ (0) వికెట్ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్‌లో కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి అనాముల్ ఔటయ్యాడు. షద్మాన్ ఇస్లాం (8), మొమినుల్ హక్ (12) క్రీజ్‌లో ఉన్నారు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 20/1గా ఉంది. ఈ సిరీస్‌తో బంగ్లాదేశ్ ఫుల్‌టైమ్ టెస్ట్ కెప్టెన్‌గా నజ్ముల్ హసన్ షాంటో జర్నీ మొదలవుతుంది. -
భారత కెప్టెన్ ఒక సూపర్ స్టార్.. కానీ అతడిని మిస్ అవుతారు: ఓలీ పోప్
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో మైదానంలో ఎంతో యాక్టివ్‌గా ఉండే విరాట్ కోహ్లి సేవలను భారత్ మిస్ అవుతుందని పోప్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ప్రస్తుత భారత జట్టులో యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నారని అతడు కొనియాడాడు.ఇంగ్లండ్ టూర్‌కు ముందు కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు వరకైనా కొనసాగాలని విరాట్‌ను సెలక్టర్లు కోరినప్పటికి అతడు మాత్రం తన మనసును మర్చుకోలేదు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెడ్ బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి షాకిచ్చాడు. దీంతో టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ నియమితుడయ్యాడు. అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత టెస్టు జట్టులోకి చోటు దక్కగా.. కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేశాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌పై గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు.. ప్రాక్టీస్‌లో మునిగితేలుతోంది. ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలోని యంగ్ టీమిండియా ఎలా రాణిస్తుందో అందరూ ఆతృతగా ఎదురు చూస్తోంది.ఈ నేపథ్యంలో ఓలీ పోప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఇది యువ భారత జట్టు. కానీ ఈ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. చాలా మందికి కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. అదేవిధంగా కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టాలెంట్ కోసం మనందరికీ తెలుసు.అతడొక సూపర్ స్టార్. అయితే స్లిప్‌లో నిలబడి ప్రత్యర్ధి బ్యాటర్లను ఏకగ్రాతను కోల్పోయేలా చేసే విరాట్ కోహ్లి సేవలను మాత్రం భారత్ కోల్పోతుంది. అయినప్పటికీ భారత జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. వారిని ఎదుర్కొనేందుకు మా ఆటగాళ్లు కూడా సిద్దంగా ఉన్నారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్‌లో తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనం -
WTC Final: కోహ్లి ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన ట్రవిస్ హెడ్
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో ఇవాళ (జూన్ 11) మధ్యాహ్నం 3 గంటలకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులు ఏంటో చూద్దాం.కోహ్లి ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన హెడ్ఈ మ్యాచ్‌లో (రెండు ఇన్నింగ్స్‌ల్లో) ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ 94 పరుగులు చేస్తే ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొడతాడు. విరాట్ ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో ఇప్పటివరకు 411 పరుగులు చేయగా.. ట్రవిస్ హెడ్ ఖాతాలో ప్రస్తుతం 318 పరుగులు (కేవలం 3 ఇన్నింగ్స్‌ల్లోనే) ఉన్నాయి.బుమ్రా రికార్డుకు ఎసరు పెట్టిన కమిన్స్, స్టార్క్నేటి నుంచి ప్రారంభం కాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ స్పీడ్స్టర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఐదు, ఆరు వికెట్లు తీస్తే, ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో (2023-2025) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా అవతరిస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉంది. బుమ్రా ఈ సైకిల్లో 77 వికెట్లు తీయగా.. కమిన్స్ 73, స్టార్క్ 72 వికెట్లు తీశారు.చరిత్ర సృష్టించనున్న బవుమాఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మరో 46 పరుగులు చేస్తే (రెండు ఇన్నింగ్స్‌ల్లో) డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ పేరిట ఉంది. ఎల్గర్ డబ్ల్యూటీసీలో 1935 పరుగులు చేయగా.. ప్రస్తుతం బవుమా ఖాతాలో 1890 పరుగులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే బవుమా మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక విజయాలు సాధించిన సౌతాఫ్రికా కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు డీన్ ఎల్గర్, బవుమాల పేరిట సంయుక్తంగా ఉంది. ఇద్దరు తలో 8 విజయాలు సాధించారు.లియోన్ ఊరిస్తున్న అశ్విన్ రికార్డుఈ మ్యాచ్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేస్తే డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డును లియోన్ టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి షేర్ చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఇద్దరు తలో 11 ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.చరిత్ర సృష్టించేందుకు 2 వికెట్ల దూరంలో ఉన్న మహారాజ్ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు తీస్తే.. సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం మహారాజ్ ఖాతాలో 198 వికెట్లు ఉన్నాయి. -
సడెన్ షాక్‌లిస్తున్న స్టార్ క్రికెటర్లు.. ఆందోళనలో అభిమానులు
అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ ఏడాది అచొచ్చినట్లు లేదు. స్టార్ క్రికెటర్లు ఒక్కొరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ క్రికెట్ అభిమానులకు సడెన్ షాక్‌లిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ తొలుత రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆతర్వాత టీమిండియా స్పీడ్‌స్టర్ వరుణ్ ఆరోన్, బంగ్లాదేశ్ బ్యాటింగ్ దిగ్గజం తమీమ్ ఇక్బాల్, టీమిండియా వికెట్‌కీపర్ వృద్దిమాన్ సాహా, శ్రీలంక స్టార్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే, బంగ్లాదేశీ స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ మహ్మదుల్లా రిటైర్మెంట్ ప్రకటించారు. కొద్ది రోజుల కిందట సౌతాఫ్రికా విధ్వంసకర యోధుడు హెన్రిచ్ క్లాసెన్ అనూహ్య పరిణామాల మధ్య రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా విండీస్ సిక్సర్ల వీరుడు నికోలస్ పూరన్ 29 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేశాడు. పైన పేర్కొన్న ఆటగాళ్లంతా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు.సడెన్ షాక్‌లు..ఈ ఏడాది కొందరు క్రికెటర్లు సడెన్ షాక్‌లు ఇచ్చారు. మొదటి షాక్ ఆసీస్ దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇచ్చాడు. స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆతర్వాత ఆసీస్ విధ్వంసకర వీరుడు మార్కస్ స్టోయినిస్ మరో షాక్ ఇచ్చాడు. స్టోయినిస్ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఆతర్వాత బంగ్లాదేశ్ ఆల్‌టైమ్ గ్రేట్ వన్డే బ్యాటర్ ముష్ఫికర్ రహీం మరో షాక్ ఇచ్చాడు. అప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రహీం వన్డేల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.క్రికెట్ దునియాకే భారీ షాక్..ఈ ఏడాది క్రికెట్ అభిమానులకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అతి పెద్ద షాక్‌లు ఇచ్చారు. వీరిద్దరు ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్, విరాట్ టెస్ట్ ఫార్మాట్ నుంచి వైదొలగడం భారత క్రికెట్‌కు భారీ లోటు. ఈ ఇద్దరు మరో భారత ఆటగాడు రవీంద్ర జడేజాతో కలిసి 2024 టీ20 వరల్డ్‌కప్ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. రోహిత్, కోహ్లి టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాక శ్రీలంక దిగ్గజ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ కూడా సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. -
'అతడొక సూపర్ స్టార్.. మరో విరాట్ కోహ్లి అవుతాడు'
భారత్ ఇంగ్లండ్ మధ్య టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ ఆరంభానికి మరో పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌పై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.ఇక ఇది ఇలా ఉండగా.కాగా భారత టెస్టు క్రికెట్లో నాలుగో నంబర్ బ్యాటింగ్ స్దానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1970ల నుండి 1980ల వరకు దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేయగా.. ఆ తర్వాత గవాస్కర్ వారసుడిగా సచిన్ టెండూల్కర్ రెండు దశాబ్దాలకు పైగా నాలుగో నంబర్లో కొనసాగాడు. అనంతరం సచిన్ నుంచి 2013లో విరాట్ కోహ్లి ఆ బాధ్యతలను స్వీకరించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడంతో కీలకమైన నాలుగో స్ధానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. కొంతమంది సాయిసుదర్శన్ పేరును సూచిస్తుంటే.. మరి కొంతమంది కరుణ్ నాయర్‌ను పేరును చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ దిగ్గజ స్పిన్నర్ మాంటీ పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి స్ధానంలో సాయిసుదర్శన్ సరైనోడని పనేసర్ అభిప్రాయపడ్డాడు."ప్రస్తుత భారత జట్టులో అద్బుతమైన యువ ఆటగాళ్లు ఉన్నారు. అందులో ఒకరు సర్రే ఆటగాడు సాయిసుదర్శన్. అతడు చాలా దూకుడుగా, ఎటువంటి భయం లేకుండా ఆడుతాడు. అతడికి ఇంగ్లండ్ కండీషన్స్‌లో ఆడిన అనుభవం ఉంది. సర్రే క్రికెట్ క్లబ్ తరపున అద్బుతంగా రాణించాడు. అతడు భారత క్రికెట్లో మరో విరాట్ కోహ్లి అవుతాడు. కోహ్లి ఆడిన నాలుగో స్ధానాన్ని సుదర్శన్ సమర్ధవంతంగా భర్తీ చేస్తాడని నేను భావిస్తున్నాను. విరాట్ కోహ్లికి రెడ్ బాల్ క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. యువ భారత జట్టు కోహ్లి వారసత్వాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా" అని ఇన్సైడ్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్ పేర్కొన్నాడు. -
UEFA టైటిల్ గెలిచిన పోర్చుగల్.. కోహ్లి తరహాలో భావోద్వేగానికి లోనైన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన దేశానికి రెండో UEFA నేషన్స్ లీగ్ టైటిల్‌ను అందించాడు. జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా ఆదివారం (జూన్ 8) జరిగిన ఫైనల్లో పోర్చుగల్ పెనాల్టీ షూటౌట్లో స్పెయిన్‌పై 5-3 గోల్స్‌తో నెగ్గి టైటిల్‌ను కైవసం చేసుకుంది. షూటౌట్‌కు ముందు ఇరు జట్లు 2-2 గోల్స్‌తో సమంగా నిలిచాయి. - Virat Kohli lifting IPL Trophy.- Cristiano Ronaldo lifting UEFA Trophy.TWO GOATs OF SPORTS. 🐐🙇 pic.twitter.com/WKXtmTel70— Tanuj (@ImTanujSingh) June 8, 2025ఎక్స్ట్రా టైమ్‌లో కూడా ఫలితం రాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో ఓ గోల్ చేశాడు. ఇది అతని కెరీర్లో 138 గోల్. నిర్ణీత సమయంలో తొలుత స్పెయిన్‌కు చెందిన మైఖేల్ ఒయార్జబాల్ గోల్ చేయగా.. రొనాల్డో తన గోల్‌తో స్కోర్ సమం చేశాడు. అనంతరం స్పెయిన్‌కు చెందిన మార్టిన్ జుబిమెండి రెండో గోల్ చేయగా.. పోర్చుగల్ తరఫున నునో మెండెస్ గోల్ చేసి స్కోర్ సమం చేశాడు.- Virat Kohli after winning the IPL Trophy.- Cristiano Ronaldo after winning the UEFA Nations trophy.TWO GOATS GOT EMOTIONAL..!!!! 🥹❤️ pic.twitter.com/Ms8poAVOQx— Tanuj (@ImTanujSingh) June 8, 2025మరోవైపు మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కైలియన్ ఎంబపే నేతృత్వంలోని ఫ్రాన్స్ ఆతిథ్య దేశం జర్మనీపై 2-0 గోల్స్ తేడాతో నెగ్గింది.- Kohli after winning IPL Trophy.- Ronaldo after winning UEFA Trophy.TWO GOATS CRYING AFTER WINNING THE TROPHY. 🥹❤️ pic.twitter.com/8TFasrUWSn— Tanuj (@ImTanujSingh) June 8, 2025కోహ్లి తరహాలో భావోద్వేగానికి లోనైన రొనాల్డోఆర్సీబీ ఈ యేడు ఐపీఎల్ టైటిల్ గెలిచాక ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఏ రకంగా భావోద్వేగానికి లోనయ్యాడో, క్రిస్టియానో రొనాల్డో కూడా తన రెండో UEFA నేషన్స్ లీగ్ టైటిల్ గెలిచాక అదే తరహాలో ఎమోషనల్ అయ్యాడు. కోహ్లి, రొనాల్డో కంపారిజన్ ఇమేజ్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. Cristiano Ronaldo got Emotional when he's won the UEFA national league trophy for Portugal. 🥹- What a Video for UEFA history. ❤️pic.twitter.com/LZgq4vVDiP— Tanuj (@ImTanujSingh) June 8, 2025క్రికెట్ అభిమానులు కోహ్లి, రొనాల్డోను కీర్తిస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే అంటూ ఆకాశానికెత్తుతున్నారు. కోహ్లి, రొనాల్డో లేటు వయసులోనూ అత్యుత్తమ ఫిట్నెస్ను కలిగి తమతమ క్రీడా విభాగాల్లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. -
రోహిత్, కోహ్లి ఫేర్‌వెల్‌కు ప్లాన్ చేస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇరువురు వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉన్నారు. రోకో (రోహిత్, కోహ్లి) 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతామని సూచనప్రాయంగా తెలిపినట్లు సమాచారం.రోకో ఈ ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా తరఫున బరిలోకి దిగవచ్చు. అనంతరం అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ పాల్గొనవచ్చు. ఒకవేళ ఈ సిరీస్‌లో రోకోకు పాల్గొంటే కెరీర్లో వారికి అదే చివరి ఆస్ట్రేలియా పర్యటన అవుతుంది.ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా రోహిత్, కోహ్లి ఫేర్‌వెల్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్బర్గ్ అక్టోబర్‌లో జరిగే భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సందర్భంగా రోహిత్, కోహ్లిలకు ఘనంగా వీడ్కోలు పలకాలని ప్లాన్ చేస్తున్నారు.ఓ సందర్భంగా టాడ్ ఇలా అన్నారు. మా దేశంలో (ఆస్ట్రేలియా) విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడటం అదే చివరిసారి కావచ్చు. ఒకవేళ అలా అయితే వారికి గొప్పగా వీడ్కోలు పలకాల్సిన ధర్మం మాకుంది. వారిరువురు భారత క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంతో చేశారు. అలాంటి వారికి గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన చేస్తాము.ఇదిలా ఉంటే, రోహిత్, కోహ్లి తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ తర్వాత టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. వారిద్దరి కెరీర్లో చివరి టెస్ట్‌లు ఆస్ట్రేలియా గడ్డపైనే ఆడారు. అయితే ఆ సిరీస్ జరిగే నాటికి రోహిత్, కోహ్లి రిటైర్మెంట్ గురించి ఆలోచించకపోయి ఉండవచ్చు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు చోటు చేసుకున్న పరిణామాల అనంతరం వారిద్దరు రోజుల వ్యవధిలో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పారు.బీసీసీఐ సైతం రోహిత్, కోహ్లిలకు ఫేర్వెల్ పలకలేకపోయింది. ఈ జోడీ టెస్ట్‌ల్లో ఇంకొంతకాలం కొనసాగుతారని అంతా అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, వారిద్దరు టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పి భారత క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేశారు. రోకో 2027 వరల్డ్‌కప్ వరకు వన్డేల్లో కొనసాగుతామని చెప్పినప్పటికీ.. ఈ విషయంపై కూడా అంత గ్యారెంటీ లేదు.ఎందుకంటే, ఆ సమయానికి రోహిత్ వయసు 40, కోహ్లి వయసు 38గా ఉంటుంది. ఆ టైమ్ వరకు ఇరువురు ఫిట్‌గా ఉంటారో లేదో. ఈ విషయంలో కోహ్లి గురించి ఆలోచన లేనప్పటికీ, రోహిత్‌పైనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే రోహిత్ ఫిట్‌నెస్‌కు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మరో రెండేళ్ల తర్వాత అంటే అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో మరి.