టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాలి పిక్క కండరాల గాయంతో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన కోహ్లీ తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో కోహ్లీ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.
దీంతో జూలైలో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరమైనట్లే. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 'కోహ్లీ తొడ కండరంలో చీలిక వచ్చింది. ఈ గాయానికి శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే ఇది నయం కావడానికి మాత్రం సుమారు ఆరు వారాల సమయం పట్టనుంది.
దీనిలో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోహ్లీ పునరావాసం పొందే అవకాశముంది. కాగా కోహ్లీ తన గాయంపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలోని ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్‌షా పర్దివాలాను టెలి-కన్సల్ట్ అయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్‌లో కండరాల్లో చీలిక వచ్చినట్లు రిపోర్ట్‌లో తేలింది.' అని పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు ఫిట్‌నెస్ మదింపు కోసం రోహిత్ శర్మ జూన్ 8న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి హాజరుకానున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది . ఈ సిరీస్ కోసం రోహిత్‌ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతని లభ్యత పూర్తిగా ఫిట్‌నెస్ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.


