కుప్ప‌కూలిన కివీస్‌.. భారీ ఆధిక్యం దిశ‌గా ఇంగ్లండ్ | England Gets Lead-Ollie-Robinson Five Wicket Haul Vs New Zeland Test | Sakshi
Sakshi News home page

ENG Vs NZ: కుప్ప‌కూలిన కివీస్‌.. భారీ ఆధిక్యం దిశ‌గా ఇంగ్లండ్

Jun 5 2026 9:01 PM | Updated on Jun 5 2026 9:09 PM

England Gets Lead-Ollie-Robinson Five Wicket Haul Vs New Zeland Test

లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ప‌ట్టు బిగించిన‌ట్లుగా అనిపిస్తోంది. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 140 ప‌రుగుల‌కే ఆలౌట్ చేశామ‌న్న ఆనందం న్యూజిలాండ్‌కు ఎక్కువ‌సేపు నిల‌వలేదు. కివీస్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 113 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.  

61/6 క్రితంరోజు స్కోరుతో రెండోరోజు ఆట‌ను ప్రారంభించిన న్యూజిలాండ్ ఇంగ్లండ్ బౌల‌ర్ల ధాటికి ఎక్కువ‌సేపు నిల‌వ‌లేక‌పోయింది. న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో కైల్ జేమీస‌న్ (38 నాటౌట్‌) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. గ్లెన్ ఫిలిప్స్ (34) ప‌ర్వాలేద‌నిపించాడు. ఇంగ్లండ్ బౌలర్ల‌లో ఓలీ రాబిన్‌స‌న్ 5 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, జోష్ టంగ్ 3, అకిన్‌స‌న్‌లు రెండు వికెట్లు తీశాడు. 

దీంతో ఇంగ్లండ్‌కు 27 పరుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ త‌డ‌బ‌డిన‌ప్ప‌టికీ టీ విరామ స‌మ‌యానికి 42 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 166 ప‌రుగులు చేసింది. జేమీ స్మిత్ (31), అకిన్‌స‌న్ (7) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. ఓపెన‌ర్ ఎమిలియో గే (57) అర్థ‌సెంచ‌రీ సాధించగా, బెన్ డ‌కెట్ (33) ప‌ర్వాలేద‌నిపించాడు. 

కివీస్ బౌల‌ర్ల‌లో నాథ‌న్ స్మిత్ మూడు వికెట్లు తీయ‌గా, విలియం రూర్కీ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ 193 ప‌రుగుల ఆధిక్యంలో నిలిచింది. బౌల‌ర్ల‌కు విప‌రీతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై మ‌రో మూడు రోజులు ఆట మిగిలి ఉండ‌డంతో ఇంగ్లండ్‌కు విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. 

చదవండి: వైభవ్ క్రేజ్‌.. స్వదేశంలో ముగిసి విదేశంలో మొద‌లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement