కోహ్లి సహచరుడు, పంజాబ్‌ కింగ్స్‌ మాజీ ప్లేయర్‌ ఆకస్మిక మృతి | Virat Kohli's Ex Teammate Passes Away In The Middle Of IPL 2026 | Sakshi
Sakshi News home page

కోహ్లి సహచరుడు, పంజాబ్‌ కింగ్స్‌ మాజీ ప్లేయర్‌ ఆకస్మిక మృతి

May 6 2026 4:31 PM | Updated on May 6 2026 4:44 PM

Virat Kohli's Ex Teammate Passes Away In The Middle Of IPL 2026

ఐపీఎల్ 2026 మధ్యలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ పంజాబ్ క్రికెటర్, బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి అండర్‌ 19 జట్టు సహచరుడు, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ (పంజాబ్‌ కింగ్స్‌) మాజీ ఆటగాడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ ఆకస్మికంగా కన్నుమూశాడు. ఆతని వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. గిల్‌ మృతికి గల కారణాలు తెలియరాలేదు.

చండీగఢ్‌లో జన్మించిన అమన్‌ప్రీత్ సింగ్ గిల్, పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు భారత అండర్‌-19 జట్టు తరఫున కూడా ఆడాడు. అలాగే ఐపీఎల్ ప్రారంభ దశలో పంజాబ్‌ కింగ్స్‌ (అప్పటి కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌) జట్టులో భాగంగా ఉన్నాడు.క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు.

కోహ్లీతో కలిసి అండర్-19లో
అమన్‌ప్రీత్ గిల్, బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లితో కలిసి 2007లో అండర్-19  ప్రపంచకప్‌లో ఆడాడు. ఆ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి మంచి ప్రతిభ చాటాడు.

అమన్‌ప్రీత్ గిల్ మృతిపై పంజాబ్‌ క్రికెట్‌ అసోసిచయేషన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. "పంజాబ్ క్రికెట్‌కు అంకితభావంతో సేవలందించిన అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మరణం చాలా బాధాకరం" అని పేర్కొంది. అమన్‌ప్రీత్ అంత్యక్రియలు ఇవాళ (మే 6) చండీగఢ్‌లోని మణిమజ్రా శ్మశానవాటికలో నిర్వహించారు. అమన్‌ప్రీత్ గిల్ మృతికి సంతాపంగా ఇవాళ జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్లు ధరించే అవకాశం ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement