Photo Courtesy: IPL 2026
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 19వ సీజన్‌లో తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన వైభవ్ సూర్యవంశీ 242 స్ట్రైక్‌రేట్‌తో 680 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ ఉపయోగిస్తున్న బ్యాట్ స్పాన్సర్‌షిప్‌కు సంబంధించి కళ్లు చెదిరే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వాడుతున్న బ్యాట్‌కు ఎస్ఎస్ (సరీన్ స్పోర్ట్స్) కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఇకపై వైభవ్ తన బ్యాట్‌పై ఏడాదికి రూ. 12కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్ఎస్ కంపెనీతో ఉన్న ఒప్పందంతో పోలిస్తే ఇది 24 రేట్లకు ఎక్కువ అని చెప్పొచ్చు.
అయితే ఈ కొత్త ఒప్పందం ప్రస్తుత స్పాన్సర్ ఎస్‌ఎస్‌తోనే జరిగిందా లేక వేరే కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరించనుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి వైభవ్ పోటీగా మారనున్నాడు.
ప్రస్తుతం కోహ్లీ బ్యాట్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఎంఆర్ఎఫ్ ఏడాదికి రూ. 12.5 కోట్లు అందుకుంటున్నాడు. అయితే ఎంఆర్ఎఫ్ కూడా వైభవ్ బ్యాట్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఇలా వైభవ్ తన బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించడమే కాదు, ఇప్పుడు బ్యాట్ ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో సంపాదించబోతున్నాడు.
Vaibhav Sooryavanshi has received a bat sponsorship offer of 12cr annually.
- It’s more than 24 times than his previous bat sponsorship deal. (CricBlogger). pic.twitter.com/ZwQkLN61uf— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2026


