ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి.. కోహ్లి మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 13 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేసి కోహ్లి ఔటయ్యాడు.
ముఖ్యంగా గుజరాత్ పేసర్ కగిసో రబాడకు కింగ్ కోహ్లి చుక్కలు చూపించాడు. రబాడ వేసిన రెండో ఓవర్‌లో కోహ్లి వరుసగా 5 సిక్స్‌లు బాది స్టేడియంను హోరెత్తించాడు. ఈ మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి రెండు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
కోహ్లి సాధించిన రికార్డులు ఇవే
👉భారత గడ్డపై ఐపీఎల్‌లో 8,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలు రాయిని విరాట్ అందుకున్నాడు. కాగా పలు ఐపీఎల్ సీజన్లు దక్షిణాఫ్రికా, యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. విదేశీ గడ్డపై జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లలో మొత్తంగా అతడు 1000కు పైగా పరుగులు చేశాడు. ఓవరాల్‌గా కోహ్లి పేరిట 9230 ఐపీఎల్ రన్స్ ఉన్నాయి. కాగా కోహ్లి దారిదాపుల్లో ఎవరూ లేరు.
భారత్‌లో అత్యధిక ఐపీఎల్ పరుగులు చేసిన ప్లేయర్లు వీరే
విరాట్ కోహ్లీ - 8,016
రోహిత్ శర్మ - 6,274
శిఖర్ ధావన్ - 5,819
డేవిడ్ వార్నర్ - 5,689
👉ఒకే ఓవర్‌లో 5 ఫోర్లు కొట్టిన మూడో ఆర్సీబీ బ్యాటర్‌గా క్రిస్ గేల్, షేన్ వాట్సన్ సరసన కోహ్లి నిలిచాడు. క్రిస్ గేల్, షేన్ వాట్సన్ గతంలో పుణే వారియర్స్ పై ఈ ఫీట్ సాధించారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది.156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో ఛేదించింది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్(43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి(28), దేవ్‌దత్త్ పడిక్కల్(40) మినహా మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు.
చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్


