ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు వృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని మంగవారం సందర్శించారు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ బ్యాటర్ కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి ఆధ్యాత్మిక ఆశ్రమానికి వచ్చాడు. ప్రేమానంద్ మహారాజ్‌కు చెందిన రాధా కేళీ కుంజ్ ఆశ్రమానికి వెళ్లారు.
కాగా కోహ్లీ, అనుష్క దంపతులు ఇప్పటికే అనేక సార్లు ఆశ్రమాన్ని విజిట్ చేశారు. ఆశ్రమానికి వెళ్లి బయటకు వస్తున్న కోహ్లీ, అనుష్కకు సంబంధించిన వీడియోలు, ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా సింపుల్ డ్రెస్సులో ఇద్దరూ ఆశ్రమానికి వెళ్లారు. మాస్క్‌లతో తమ ముఖాన్ని కవర్ చేసుకున్నారు.
ప్రేమానంద్ ఆధ్యాత్మిక బోధనలు వినేందుకు తరుచూ అనుష్క, కోహ్లీ జంట ఆశ్రమానికి వెళ్తుంటారు. ఇది చూసిన ఆర్‌సీబీ అభిమానులు.. ‘వారెవ్వా కోహ్లీ.. ఒక్కరోజులో ఎంత మార్పు’..‘టైటిల్ టు ఆధ్యాత్మికం వైపు అడుగులు’ అంటూ కామెంట్లు చేశారు.
గత ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్‌పై ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ట్రోఫీ పట్టుకున్న సమయంలో కోహ్లీ నుదురుపై అనుష్కా కిస్ ఇచ్చింది.ఆ తర్వాత ఆర్సీబీ గెలుపు సంబరాలకు సంబంధించిన ఒక ఈవెంట్‌లోనూ విరుష్క జంట అదిరిపోయే స్టెప్పులతో అలరించారు.
🎥 | Virat Kohli and Anushka Sharma’s visit to #PremanandMaharaj’s Radha Keli Kunj Ashram in #Vrindavan has gone viral on #socialmedia, with a video showing the couple seeking blessings from the spiritual leader. The visit came days after #RCB’s historic #IPL title triumph, and… pic.twitter.com/QPucsbjK6i
— The Statesman (@TheStatesmanLtd) June 2, 2026


