హెడ్‌ను అవమానించిన కోహ్లి | IPL 2026 SRH Vs RCB, Virat Kohli Refuses Handshake With Travis Head After Massive On-Field Moment, Video Went Viral | Sakshi
Sakshi News home page

SRH Vs RCB: హెడ్‌ పట్ల కోహ్లి అనుచిత ప్రవర్తన

May 23 2026 8:25 AM | Updated on May 23 2026 11:08 AM

IPL 2026, SRH VS RCB: Virat Kohli Refuses Handshake With Travis Head After Massive On-Field Moment

నిన్న (మే 22) జరిగిన ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్టార్‌ ప్లేయర్లు విరాట్‌ కోహ్లి-ట్రవిస్‌ హెడ్‌ మధ్య తేలికపాటి ఘర్షణ జరిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో వెంకటేష్‌ అయ్యర్‌ భారీ షాట్లు ఆడుతుండగా.. కోహ్లి హెడ్‌ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించాడు. నువ్వే వచ్చి బౌలింగ్‌ చేయ్యి అంటూ సైగలు చేయడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. హెడ్‌ మాత్రం చిరునవ్వుతో స్పందించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మ్యాచ్‌ అనంతరం ఆటగాళ్లు పరస్పరం హ్యాండ్‌షేక్‌లు చేసుకుంటుండగా.. కోహ్లి హెడ్‌ పట్ల మరోసారి అవమానకరంగా ప్రవర్తించాడు. కమిన్స్‌, అభిషేక్‌ శర్మలతో మాట్లాడి.. హెడ్‌ వద్దకు వచ్చేసరికి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ముందుకు సాగిపోయాడు. కోహ్లి ఇలా చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆర్సీబీపై ఎస్‌ఆర్‌హెచ్‌ 55 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ గెలిచినా ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

రెండో స్థానంలో గుజరాత్‌ నిలిచింది. మిగిలిన నాలుగో బెర్త్‌ కోసం రాజస్థాన్‌, పంజాబ్‌, కేకేఆర్‌, ఢిల్లీ మధ్య పోటీ కొనసాగుతుంది. మూడో స్థానంలో నిలవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ అడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్సీబీ-గుజరాత్‌ క్వాలిఫయర్‌-1లో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది.

భారీ స్కోర్‌
టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుని ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. అభిషేక్‌ శర్మ కేవలం 22 బంతుల్లో 56 పరుగులు చేసి పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను హైదరాబాద్‌వైపు తిప్పేశాడు. ట్రవిస్‌ హెడ్‌ (26) కూడా వేగంగా ఆడగా.. ఇషాన్‌ కిషన్‌ 46 బంతుల్లో 79 పరుగులతో మెరిపించాడు. చివర్లో హెన్రిచ్‌ క్లాసెన్‌ (24 బంతుల్లో 51), నితీశ్‌కుమార్‌ రెడ్డి (29 నాటౌట్‌) కూడా చెలరేగడంతో చేయడంతో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 255/4 భారీ స్కోరు నమోదు చేసింది.

అనంతరం లక్ష్యఛేదనను ఆర్సీబీ కూడా ఘనంగానే ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆదిలో వెంకటేష్‌ అయ్యర్‌ (44) మెరుపులు మెరిపించినా, కోహ్లి (15) మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన పడిక్కల్‌ (21), రజత్‌ పాటిదార్‌ (56), కృనాల్‌ పాండ్యా (41 నాటౌట్‌), టిమ్‌ డేవిడ్‌ (15 నాటౌట్‌) పర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్యం​ మరీ పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement