వైభవ్‌తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే.. వీడియో వైరల్‌ | Ek Bihari Sab Pe Bhaari: Kohli Tells Sooryavanshi Then Dont Listen Message | Sakshi
Sakshi News home page

వైభవ్‌తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే.. వీడియో వైరల్‌

Jun 3 2026 4:17 PM | Updated on Jun 3 2026 4:29 PM

Ek Bihari Sab Pe Bhaari: Kohli Tells Sooryavanshi Then Dont Listen Message

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్‌ తొలి టైటిల్‌ కోసం పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన ఈ రన్‌మెషీన్‌ కల గతేడాది ఫలించింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభ సీజన్‌ నుంచి అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) 2025లో తొలిసారి ట్రోఫీ గెలిచింది.

ఐపీఎల్‌-2026లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

వైభవ్‌ నమస్కారం చేయగా.. 
ఇదిలా ఉంటే.. ఫైనల్లో విజయం తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు, ఆరెంజ్‌క్యాప్‌ విన్నర్‌ వైభవ్‌ సూర్యవంశీతో కోహ్లి కాసేపు ముచ్చటించాడు. కోహ్లిని చూసి వైభవ్‌ నమస్కారం చేయగా.. ప్రతిగా అతడి భుజం తట్టి హత్తుకున్నాడు. 

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘కింగ్‌’.. ‘బేబీ బాస్‌’తో ఏం మాట్లాడాడో తెలుసుకోవాలని నెటిజన్లు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.

వాళ్ల మాటలు పట్టించుకోకు
ఈ నిరీక్షణకు ఆర్సీబీ తెరదించింది. కోహ్లి- వైభవ్‌ల వీడియోను బుధవారం షేర్‌ చేసిన యాజమాన్యం.. కోహ్లి వైభవ్‌కు ఇచ్చిన సలహా ఏమిటో తెలియజేసింది. వీడియో ప్రకారం.. ‘‘నువ్వు ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. నీ కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసం వల్లే నువ్వు ఇది సాధించగలిగావు.

అయితే, నీ గురించి ఎవరు.. ఏం మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? అన్న విషయాల గురించి అస్సలు పట్టించుకోకు. నిజం చెప్పాలంటే.. బిహారీ ఎవరినైనా ఓడించగలడు. ఎవరినైనా అధిగమించగలడు’’ అని కోహ్లి వైభవ్‌తో పేర్కొన్నాడు.

776 పరుగులు
కాగా గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. ఈ సీజన్‌లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. కోహ్లి ఈ సీజన్‌లో 675 పరుగులు సాధించి టాప్‌-4లో నిలిచాడు. ఫైనల్లో రాణించి ఆర్సీబీ రెండో టైటిల్‌ గెలవడంలో తన వంతు సాయం అందించాడు.

చదవండి: నువ్వు కూర్చో.. అతడినే వన్‌డౌన్‌లో పంపుతాం అన్నాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement