కప్పు గెలిచారు.. అంతలోనే ఆర్సీబీ లెజెండ్ రిటైర్మెంట్‌ | RCB Legend Retires Despite IPL 2026 Title Win | Sakshi
Sakshi News home page

కప్పు గెలిచారు.. అంతలోనే ఆర్సీబీ లెజెండ్ రిటైర్మెంట్‌

Jun 3 2026 1:41 PM | Updated on Jun 3 2026 1:57 PM

RCB Legend Retires Despite IPL 2026 Title Win

ఐపీఎల్‌-2026 సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ బాసు శంకర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ బుధవారం ఎక్స్‌వేదికగా ధ్రువీకరించింది.

మా అందరి కళ్లల్లో నీళ్లు
"మీరు తీసుకున్న ఈ నిర్ణయం మా అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించింది. బసు శంకర్ సార్… ఈ సీజన్ విజయంలో మీ పాత్ర వెలకట్టలేనిది. ఈ విజయం..  తెరవెనుక మీరు పడిన లెక్కలేనన్ని గంటల కష్టానికి ప్రతిఫలం. ఈ సక్సెస్‌లో భాగమైన మా సపోర్ట్ స్టాఫ్ ,మేనేజ్‌మెంట్ సభ్యులందరికీ ధన్యవాదాలు" ఆర్సీబీ ఓ భావోద్వేగ పోస్ట్‌ను ఎక్స్‌లో షేర్ చేసింది. 

ఎనిమిది సీజన్ల పాటు
2019లో ఆర్సీబీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన బసు శంకర్‌, ఎనిమిది సీజన్ల పాటు తన సేవలను అందించాడు. బెంగళూరు జట్టు వరుసగా రెండు సార్లు విజేతగా నిలవడంలో ఆయనది కీలక పాత్ర. ప్లేయర్లతో వివిధ రకాల వ్యాయామాలు చేయిస్తూ శారీరక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఆయన తెరవెనుక పోషించిన పాత్ర అసాధారణమైనది. 

అంతకంటే ముందు భారత జాతీయ క్రికెట్ జట్టుకు హెడ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా పనిచేశారు.  భారత క్రికెట్‌లో 'యో-యో' (Yo-Yo) టెస్ట్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చి, టీమిండియాను ప్రపంచంలోనే అత్యంత ఫిట్ ప్రొఫెషనల్ జట్టుగా మార్చిన ఘనత ఆయనదే. విరాట్ కోహ్లి లాంటి దిగ్గజం ఫిట్‌నెస్ సక్సెస్‌ వెనక కూడా బసు శంకర్‌ ఉన్నారు.


 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement