బాబర్‌ ఆజం కోసం విరాట్‌ కోహ్లికి డిమోషన్‌! | Misbah-Ul-Haq Picks His All Time ODI World Playing XI, Virat Kohli And Jasprit Bumrah In, Rohit Sharma Shockingly Left Out | Sakshi
Sakshi News home page

బాబర్‌ ఆజం కోసం విరాట్‌ కోహ్లికి డిమోషన్‌!

May 26 2026 5:25 PM | Updated on May 26 2026 5:43 PM

Virat Kohli Added As Misbah-Ul-Haq Picks World XI

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ త‌న ఆల్ టైమ్ బెస్ట్ వ‌న్డే వ‌ర‌ల్డ్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ప్ర‌కటించాడు. ఈ జ‌ట్టులో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లికి మిస్బా చోటిచ్చాడు. కోహ్లితో పాటు భార‌త పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రాకు ఛాన్స్ ల‌భించింది. అయితే ఈ జ‌ట్టులో బాబ‌ర్ ఆజం కోసం కోహ్లి బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను మిస్బా మార్చ‌డం గ‌మ‌నార్హం.

వ‌న్డేల్లో కోహ్లి సాధ‌ర‌ణంగా మూడో స్ధానంలో బ్యాటింగ్ వ‌స్తాడు. ఇదే స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి కోహ్లి ఎన్నో వ‌రల్డ్ రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. కానీ మిస్బా మాత్రం విరాట్‌కు నాలుగో స్ధానంలో ఛాన్స్ ఇచ్చాడు. కోహ్లి స్ధానాన్ని బాబ‌ర్‌తో ఈ పాక్ లెజెండ్ భ‌ర్తీ చేశాడు.

ఇక ఓపెన‌ర్ల‌గా శ్రీలంక స్టార్ కుశాల్ మెండిస్‌, ఆస్ట్రేలియా ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్‌ను అత‌డు ఎంపిక చేశాడు. అయితే వ‌న్డేల్లో మూడు డ‌బుల్ సెంచ‌రీలు బాదిన రోహిత్ శ‌ర్మ‌కు ఈ జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇంగ్లండ్ నుంచి హ్యారీ బ్రూక్ జోఫ్రా ఆర్చ‌ర్‌, సౌతాఫ్రికా నుంచి డేవిడ్ మిల్ల‌ర్‌, మార్కో జానెస‌న్ ఈ జ‌ట్టులో ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి మిచెల్ శాంట్న‌ర్‌కు ఒక్క‌డికే ఈ జ‌ట్టులో చోటు ద‌క్కింది.

వ‌న్డేల్లో తిరుగులేని విరాట్‌
విరాట్ కోహ్లి 37 ఏళ్ల వయస్సులోనూ వన్డే క్రికెట్‌లో దూసుకుపోతున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్‌(14,797) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి తన ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ కంటే మాత్రమే వెనుకబడి ఉన్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు మాత్రం కోహ్లి(54) పేరిటే ఉంది. వచ్చే నెలలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో కోహ్లి తిరిగి మళ్లీ భారత జెర్సీలో కన్పించనున్నాడు.
చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement