విరాట్‌ కోహ్లి ప్రపంచ రికార్డు | Virat Kohli Scripts History, Shatters World Record During RCB vs SRH Clash, Check Out Match Highlights Inside | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి ప్రపంచ రికార్డు

May 23 2026 4:03 AM | Updated on May 23 2026 10:03 AM

Virat Kohli Scripts History, Shatters World Record During RCB vs SRH Clash

ఐపీఎల్‌-2026లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. 256 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి తన మార్క్ చూపించలేకపోయాడు. 11 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే కోహ్లి త్వ‌ర‌గా ఔటైన‌ప్ప‌టికి వెంకటేశ్‌ అయ్యర్‌తో కలిసి మొదటి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

దీంతో విరాట్ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక ఫిప్టి ప్లస్‌ భాగస్వామ్యాల్లో భాగమైన ఆటగాడిగా విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు సృష్టించాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు  211 సార్లు యాభై ప్లస్  పార్ట్‌నర్‌షిప్స్‌లో భాగ‌మ‌య్యాడు. ఇంత‌కుముందు ఇంగ్లండ్‌ మాజీ బ్యాటర్ అలెక్స్ హేల్స్ (210 యాభై ప్లస్ భాగస్వామ్యాలు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో హేల్స్‌ను కోహ్లి అధిగ‌మించాడు.

టీ20ల్లో అత్యధిక 50+ భాగస్వామ్యాల్లో భాగ‌మైన‌ టాప్-5 బ్యాటర్లు
విరాట్ కోహ్లి-211
హేల్స్‌-210
డేవిడ్ వార్న‌ర్‌-200
బాబ‌ర్ ఆజం-196
క్రిస్ గేల్‌-191

ఇక మ్యాచ్ విషయానికి వ‌స్తే.. స‌న్‌రైజ‌ర్స్ చేతిలో 55 ప‌రుగుల తేడాతో ఆర్సీబీ ఓట‌మి పాలైంది. 256 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 200 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది. 

అయిన‌ప్ప‌టికి బెంగ‌ళూరు పాయింట్ల ప‌ట్టిక‌లో త‌మ స్ధానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 255 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో ఇషాన్ కిషన్‌ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement