కోహ్లి రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌ | Shreyas Iyer Shatters Virat Kohli Record-Also-Complete 5K Runs-1st T20I | Sakshi
Sakshi News home page

కోహ్లి రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌

Jul 2 2026 4:31 AM | Updated on Jul 2 2026 5:11 AM

Shreyas Iyer Shatters Virat Kohli Record-Also-Complete 5K Runs-1st T20I

భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టీ20 మ్యాచ్ వ‌ర్షార్ప‌ణ‌మైన‌ప్ప‌టికీ టీమిండియా ఆట‌గాళ్లు మాత్రం ప‌లు రికార్డులు త‌మ పేరిట లిఖించుకున్నారు. ఇప్ప‌టికే అభిషేక్ శ‌ర్మ ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో అరుదైన ఫీట్ సాధించ‌గా, తాజాగా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఏకంగా చేజింగ్ మాస్ట‌ర్ విరాట్ కోహ్లి రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు. 

విష‌యంలోకి వెళితే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అయ్య‌ర్ 47 బంతుల్లో 68 ప‌రుగుల‌తో రాణించాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో విఫ‌ల‌మైన శ్రేయ‌స్ ఇంగ్లండ్ గ‌డ్డ‌పై మాత్రం బ్యాట్ ఝ‌లిపించాడు. ఈ క్ర‌మంలో 37 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు క‌లిపి 5వేల ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. 

టీమిండియా త‌ర‌ఫున 5వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న 29వ బ్యాట‌ర్‌గా అయ్య‌ర్ నిలిచాడు. 147 ఇన్నింగ్స్‌ల్లో (అన్ని ఫార్మాట్లు) అయ్య‌ర్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఇందులో ఆరు సెంచ‌రీలు, 37 అర్ధ‌సెంచ‌రీలున్నాయి. ఇక తొలి టీ20లో హాఫ్ సెంచ‌రీ సాధించిన అయ్య‌ర్ ఇంగ్లండ్ గ‌డ్డ‌పై కెప్టెన్‌గా ఫిఫ్టీ సాధించిన తొలి ఆట‌గాడిగా అయ్య‌ర్ నిలిచాడు. గ‌తంలో టీ20 కెప్టెన్‌గా కోహ్లి చేసిన 47 ప‌రుగులే అత్యుత్త‌మంగా ఉండేది. 8 ఏళ్ల త‌ర్వాత కోహ్లి రికార్డును అయ్య‌ర్ బద్ద‌లు కొట్టాడు. 

అంతేకాదు టీ20 కెరీర్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ఇది మూడో అత్యుత్త‌మ వ్య‌క్తిగ‌త స్కోరు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా  20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (59), కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (47 బంతుల్లో 68) అర్ధ‌సెంచ‌రీల‌తో రాణించారు. ఆఖ‌ర్లో శివ‌మ్ దూబే  (21 బంతుల్లో 42 నాటౌట్‌) ప‌వ‌ర్‌హిట్టింగ్‌తో టీమిండియా భారీ స్కోరు చేయ‌గ‌లిగింది.  ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సాకిబ్ మ‌హ్మూద్ 3 వికెట్లు తీయ‌గా, ఆదిల్ ర‌షీద్‌, సామ్ క‌ర‌న్‌లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement