ఐపీఎల్-2026లో భాగంగా ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేసి కోహ్లి ఔటయ్యాడు.
ఈ క్రమంలో కోహ్లి ఈ ఏడాది సీజన్‌లో 600 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో వరుసగా నాలుగు సీజన్లలో 600కుపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. 2023, 2024, 2025 సీజన్లలో విరాట్ 600+ రన్స్ చేశాడు.
ఇప్పడు ఈ ఏడాది సీజన్‌లో కూడా కోహ్లి 50.00 సగటు, 164.38 స్ట్రైక్‌రేట్‌తో600 పరుగులు చేశాడు. గతంలో క్రిస్ గేల్ (2011, 2012, 2013), డేవిడ్ వార్నర్ (2016, 2017, 2019), కేఎల్ రాహుల్ (2020, 2021, 2022) వరుసగా మూడు సార్లు ఈ ఫీట్ అందుకున్నారు. కానీ వరుసగా నాలుగు సీజన్లలో కోహ్లి మినహా మిగితా ఎవరూ ఈ ఘనత సాధించలేకపోయారు.
అదేవిధంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో కోహ్లి నాలుగో స్ధానానికి ఎగబాకాడు. కోహ్లి ఇప్పటివరకు 18 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆడి శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్, కిరాన్ పొలార్డ్ సరసన కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో సీఎస్‌కే దిగ్గజం ఎంఎస్ ధోని(28) అగ్రస్ధానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్, రైనా(24) తర్వాతి స్ధానంలో కొనసాగుతున్నారు.
చదవండి: IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్


