ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ షాక్‌.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్‌ ప్లేయర్‌ | SRH Player Leaves IPL 2026 Ahead Of Playoffs | Sakshi
Sakshi News home page

IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ షాక్‌.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్‌ ప్లేయర్‌

May 26 2026 8:03 PM | Updated on May 26 2026 8:43 PM

SRH Player Leaves IPL 2026 Ahead Of Playoffs

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో కీల‌క పోరుకు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీ ఎలిమినేట‌ర్‌లో భాగంగా ఎస్ఆర్‌హెచ్‌  బుధ‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్‌కు భారీ షాక్ త‌గిలింది.

ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ కమిందు మెండిస్ ఎస్ఆర్‌హెచ్ క్యాంప్‌ను వీడి శ్రీలంకకు వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తోంది. మెండిస్ జాతీయ జట్టు కమిట్‌మెంట్స్ కారణంగా జ‌ట్టును వీడిన‌ట్లు సమాచారం. శ్రీలంక జ‌ట్టు త్వ‌ర‌లోనే ఆల్‌ఫార్మాట్ సిరీస్‌ల‌లో వెస్టిండీస్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ పర్యటన కోసం ప్రకటించిన శ్రీలంక జట్టులో మెండిస్ భాగంగా ఉన్నాడు. 

ఈ కార‌ణంతో అత‌డు ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు ముందు త‌న స్వ‌దేశానికి వెళ్లిపోయాడు. ఇప్పటికే లంక జట్టుతో కలిసి ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో మెండిస్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవ‌కాశం రాలేదు. గ‌త సీజ‌న్‌లో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచినప్ప‌టికి.. ప్ర‌స్తుతం ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులో విదేశీ ఆట‌గాళ్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో మెండిస్‌కు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు ద‌క్క‌లేదు. ట్రావిస్ హెడ్‌, క్లాసెన్‌, క‌మ్మిన్స్‌, మ‌లింగ రూపంలో నలుగురు విదేశీ ఆట‌గాళ్లగా తుది జ‌ట్టులో కొన‌సాగుతున్నారు.

రాజస్తాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అంబరీష్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్. 
ఇంపాక్ట్ సబ్: ప్రఫుల్ హింగే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement