క్వాలిఫ‌య‌ర్ పోరు.. కోహ్లీ విష‌యంలో ఆందోళ‌న‌! | RCB Worry-Kohli Batting Not-Much-Great-Playoff Matches Ahead Q1 | Sakshi
Sakshi News home page

క్వాలిఫ‌య‌ర్ పోరు.. కోహ్లీ విష‌యంలో ఆందోళ‌న‌!

May 26 2026 12:51 PM | Updated on May 26 2026 1:55 PM

RCB Worry-Kohli Batting Not-Much-Great-Playoff Matches Ahead Q1

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో మంగ‌ళ‌వారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ), గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య క్వాలిఫ‌య‌ర్‌-1 పోరు జ‌ర‌గ‌నుంది. ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ పోరులో అంద‌రి క‌ళ్లు ఆర్సీబీ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. కానీ ప్లేఆఫ్స్‌లో కోహ్లీ ప్ర‌ద‌ర్శ‌న అనుకున్నంత స్థాయిలో లేక‌పోవ‌డం ఆర్సీబీ జ‌ట్టులో కొంత ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

ఇప్ప‌టివ‌ర‌కు ప్లేఆఫ్స్‌లో 17 మ్యాచ్‌లాడిన కోహ్లీ 121 స్ట్రైక్‌రేట్‌తో 396 ప‌రుగులు సాధించాడు. మ‌రి గుజ‌రాత్ టైటాన్స్‌తో క్వాలిఫ‌య‌ర్ పోరులో కోహ్లీ ఎలా ఆడుతాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఉప్ప‌ల్ వేదిక‌గా ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రిగిన చివ‌రి లీగ్ మ్యాచ్‌లో కోహ్లీ కేవ‌లం 15 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. 

అయితే గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో పిచ్‌పై అవ‌గాహ‌న వ‌చ్చేవ‌ర‌కు నిల‌దొక్కుకుంటే మాత్రం కోహ్లీని ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు. పైగా ధ‌ర్మ‌శాల‌లో కోహ్లీకి మంచి రికార్డే ఉంది.  ఈ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఇక ఈ సీజ‌న్‌లో కోహ్లీ ఇప్ప‌టివ‌ర‌కు 14 మ్యాచ్‌ల్లో 557 ప‌రుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులోనూ కొన‌సాగుతున్నాడు. 

లీగ్ ద‌శ‌లో ఇరుజ‌ట్లు 18 పాయింట్ల‌తో స‌మానంగా ఉన్న‌ప్ప‌టికీ ఆర్సీబీ నెట్ ర‌న్‌రేట్ మెరుగ్గా ఉండ‌డంతో టేబుల్ టాప‌ర్‌గా నిలిచింది. క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్లో అడుగుపెట్ట‌నుండ‌గా, ఓడిన జ‌ట్టుకు క్వాలిఫ‌య‌ర్‌-2 రూపంలో మ‌రో అవ‌కాశం ల‌భించ‌నుంది. బుధ‌వారం జ‌రిగే ఎలిమినేట‌ర్‌లో ఎస్ఆర్‌హెచ్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇందులో గెలిచిన జ‌ట్టు క్వాలిఫ‌య‌ర్‌-2 ఆడ‌నుంది.

చదవండి:‘వాళ్లంతా క్రికెట్‌ తెలియని మూర్ఖులు’

Advertisement
 
Advertisement
Advertisement