breaking news
Shreyas Iyer
-
భేష్.. గెలిచారు!.. మరి మీ ఐదో బౌలర్ ఎవరు?
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు విజయాల ఖాతా తెరిచాడు. అతడి నాయకత్వంలో జింబాబ్వేతో తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఏడు మ్యాచ్‌ల తర్వాత శ్రేయస్ అయ్యర్ తొలిసారి గెలుపు రుచిచూశాడు.హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా.. జింబాబ్వేను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలర్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన జింబాబ్వే.. 125 పరుగులకే పరిమితమైంది.ఏడు వికెట్ల తేడాతోఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ మూడు వికెట్లు నష్టపోయి 13.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ తుదిజట్టు కూర్పుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరి మీ ఐదో బౌలర్ ఎవరు?‘‘జట్టులో కేవలం నలుగురు బౌలర్లు.. పేసర్లు ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ.. స్పిన్నర్ రవి బిష్ణోయి మాత్రమే ఉన్నారు. మరి మీ ఐదో బౌలర్ ఎవరు?.. దీనికి జవాబు శివం దూబే అంటారేమో!.. మరి ఆరో బౌలర్?.. ఎవరూ లేరు.ఆరో బౌలర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. నిజానికి శివం దూబే ఆల్‌రౌండర్ కదా!.. అతడు ఈసారి బంతితో కాస్త మెరుగ్గానే రాణించాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో 32 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. నిజంగా ఇది పెద్ద విషయమేమంచి క్యాచ్ కూడా పట్టాడు. ఏదేమైనా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేయించడం ద్వారా యాజమాన్యం అతడిపై పూర్తి విశ్వాసం కనబరిచింది. నిజంగా ఇది పెద్ద విషయమే.సరైన నిర్ణయంఇక మయాంక్ యాదవ్‌తో బౌలింగ్ ఎటాక్ ఆరంభించి కెప్టెన్ శ్రేయస్ మంచి పని చేశాడు. అశోక్ శర్మను కూడా ముందుగానే పంపించడం సరైన నిర్ణయం. ఏదేమైనా వీళ్లిద్దరిని జట్టులో చూడటం ఎంతో బాగుంది. ముఖ్యంగా మయాంక్ గాయం నుంచి కోలుకుని రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. నిలకడగా బౌలింగ్ చేశాడు’’ అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా యూకే పర్యటనతో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ ప్రయాణం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీమిండియా వైట్‌వాష్ అయింది.చదవండి: పిల్లాడినే.. నాకు ఆ అర్హత లేదు: వైభవ్ -
‘అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛ’
దాదాపు రెండేళ్ల తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు మయాంక్ యాదవ్. ఐపీఎల్లో సత్తా చాటిన ఈ ‘ఫాస్టెస్ట్’ బౌలర్.. 2024లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత గాయాల కారణంగా కనుమరుగైపోయాడు. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భగా మయాంక్ రీఎంట్రీ ఇచ్చాడు.హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. తొలి బంతికే జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్‌ను డకౌట్ చేసిన మయాంక్.. వన్‌డౌన్ బ్యాటర్ డియోన్ మైర్స్ (6)ను కూడా అవుట్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటాలో 24 ఏళ్ల ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.Aate hi kaam shuru kar diye 🔥💪Watch it LIVE only on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3#ZIMvIND #RokoNahiThoko #MayankYadav pic.twitter.com/Pg9RugnnTR— FanCode (@FanCode) July 23, 2026గొప్పగా అనిపించిందితద్వారా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ స్పందిస్తూ.. ‘‘రెండేళ్లు జట్టుగా దూరంగా ఉండటం నా జీవితంలో అత్యంత కష్టకాలం. అప్పుడు నాకు 22-23 ఏళ్ల మధ్య వయసు. అంత చిన్నవయసులోనే గాయాల వల్ల సుదీర్ఘకాలం ఆటకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది.అయితే, దేశానికి ఆడటం గొప్ప విషయం. అదే స్ఫూర్తిగా ముందుకు సాగి సవాళ్లను అధిగమించాను. జింబాబ్వేలో పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తాయని విన్నాను. నేను హరారేలో ఆడటం ఇదే మొదటిసారి. గొప్పగా అనిపించింది. జట్టు విజయానికి నా వంతు సహకారం అందించాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు.అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛఅదే విధంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై మయాంక్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడి కెప్టెన్సీలో ఆడటం ఇదే తొలిసారి. మ్యాచ్‌కు ముందు మేము ఎక్కువగా మాట్లాడుకోలేదు కూడా!.. అయితే, మ్యాచ్ సమయంలో బౌలర్లపై అతడు పూర్తి నమ్మకం ఉంచాడు.నాకు నచ్చినట్లుగా బౌలింగ్ చేయమని చెప్పాడు. అతడూ కొన్ని సలహాలు ఇచ్చాడు. సారథి ఇచ్చిన ధైర్యంతో నేను ముందుకు సాగాను. అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అనిపించింది’’ అని మయాంక్ యాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్‌తో 2024 నాటి టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు.చదవండి: నేనింకా పిల్లాడినే.. క్రెడిట్ నాకు ఇవ్వొద్దు: వైభవ్ -
భయమనేది లేదు.. అతడొక అత్యద్భుతం: శ్రేయస్ అయ్యర్
టీ20ల్లో టీమిండియా ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్ధేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మెన్ ఇన్ బ్లూ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 13.2 ఓవర్లలో ఊదిపడేసింది.యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లో 50 పరుగులు సాధించి భారత తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. ఇక ఈ కమ్‌బ్యాక్ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తన కెప్టెన్సీలో జట్టు తొలి విజయం సాధించడం సంతోషంగా ఉందని అయ్యర్ అన్నాడు."ఈ విజయం నాకు చాలా ప్రత్యేకమైనది. కెప్టెన్‌గా తొలి గెలుపును అందుకోవడం సంతోషాన్నిస్తోంది. ఈ మ్యాచ్‌లో మా బాయ్స్ అందరూ అద్భుతంగా రాణించారు. తొలుత మా బౌలర్లు పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేశారు. ఈ పిచ్‌పై బంతి ఎక్కువగా బౌన్స్ అవుతుందని నేను ముందే పసిగట్టాను.అందుకే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాను. మయాంక్ యాదవ్ సంచలన స్పెల్ బౌలింగ్ చేశాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ అసాధరణ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి ఏ మాత్రం భయం లేదు. వైభవ్ బ్యాటింగ్ చేసిన తీరు నిజంగా అత్యద్భుతం. హరారే పిచ్‌పై అతడికి బాగా అవగాహన ఉంది. ఇదే గ్రౌండ్లో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులు సాధించాడు. ఆ అనుభవమే ఈ మ్యాచ్‌లో అతడికి పనికొచ్చింది. రాబోయో రెండు మ్యాచ్‌లలో కూడా ఇదే జోరును కొనసాగించి సిరీస్ క్లీన్ చేస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో శ్రేయస్ పేర్కొన్నాడు. -
వైభవ్ విశ్వరూపం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయ్యర్ టాస్ గెలవడం ఇది వరుసగా ఎనిమిదో సారి. దీంతో అంతర్జాతీయ టీ20లలో వరుసగా 8 టాస్‌లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా శ్రేయస్ రికార్డులెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని టీమిండియా సారథిగా 2010-12 మధ్య కాలంలో వరుసగా 7 సార్లు టాస్ గెలిచాడు. తాజా మ్యాచ్‌తో ధోనిని అయ్యర్ అధిగమించాడు.టీ20ల్లో వరుసగా టాస్‌లు గెలిచిన భారత కెప్టెన్లు వీరేశ్రేయస్ అయ్యర్: 8 (జూన్ 2026 – జూలై 2026)ఎం.ఎస్. ధోని: 7 (మే 2010 – ఫిబ్రవరి 2012)విరాట్ కోహ్లి: 6 (ఆగస్టు 2019 – డిసెంబరు 2019)రోహిత్ శర్మ: 5 (ఫిబ్రవరి 2020 – ఫిబ్రవరి 2022)ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్లో ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారన్ సామీ పేరిట ఉంది. సామీ 2015-16 మధ్య కాలంలో టీ20ల్లో వరుసగా 10 టాస్‌లు గెలిచాడు. ఆ తర్వాత రెండో స్ధానంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా(9) ఉన్నాడు. వీరిద్దరి తర్వాత స్ధానంలో హ్యారీ బ్రూక్(8), ఆరోన్ ఫించ్(8)లో కలిసి శ్రేయస్ సంయుక్తంగా నిలిచాడు. కాగా అయ్యర్ టాస్‌లు గెలుస్తున్నప్పటి మ్యాచ్‌లు మాత్రం గెలవడం లేదు. ఇప్పటివరకు అతడి సారథ్యంలో 7 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. -
IND vs ZIM: వైభవ్ మెరుపులు.. టీమిండియా ఘన విజయం
హరారే వేదికగా గురువారం నాటి తొలి టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. భారత్ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 13.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది.ఓపెనర్లలో అభిషేక్ శర్మ (1) విఫలమైనప్పటికీ.. వైభవ్ సూర్యవంశీ మెరుపు అర్ద శతకంతో రాణించాడు. కేవలం 18 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు బాది 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 35) రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (28*), వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (6*)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా 13.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి భారత్ 126 పరుగులు చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.Updates10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 96-2ఇషాన్ 26, శ్రేయస్ అయ్యర్ 17 పరుగులతో ఉన్నారు.వైభవ్ మెరుపు అర్ధ శతకం6.1: నగరవ బౌలింగ్‌లో రెండు పరుగులు పూర్తి చేసుకుని యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్. కేవలం 18 బంతుల్లోనే తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ. ఆ మరుసటి బంతికే అవుటయ్యాడు. స్కోరు: 68-2. ఇషాన్ 16 పరుగులతో ఉన్నాడు. శ్రేయస్ క్రీజులోకి వచ్చాడు.భారత్ తొలి వికెట్ డౌన్టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అభిషేక్ శర్మ.. ముజరబాని బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 9 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. 3 ఓవర్లకు భారత స్కోర్: 23/1 టీమిండియా టార్గెట్ ఎంతంటే?జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌లో మధెవెరే(39) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మరుమణి(27), బర్ల్(26) రాణించారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దూబే, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.వరుసగా రెండు వికెట్లుఆఖరి ఓవర్లో జింబాబ్వే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి మధెవెరే(39), మూడో బంతికి ఎవాన్స్(0) ఔటయ్యారు.ఐదో వికెట్ డౌన్13.1: రవి బిష్ణోయి బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన బర్ల్ (26). మెధెవెరె 8 పరుగులతో ఉండగా.. స్కోరు: 64-5. మరుమాణి క్రీజులోకి వచ్చాడు.పది ఓవర్లలో జింబాబ్వే స్కోరు: 46-4 (10)మెధెవెరె 5, బర్ల్ 12 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్‌జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్‌లో సికిందర్ రజా(4) ఔటయ్యాడు. మెధెవెరె క్రీజులోకి వచ్చాడు.పవర్ ప్లేలో జింబాబ్వే స్కోరు: 26-3 (6)బర్ల్ 1, రజా 4 పరుగులతో ఉన్నారు.పీకల్లోతు కష్టాల్లో జింబాబ్వేజింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో డియాన్ మైర్స్(6) ఔటయ్యాడు. మయాంక్‌కు ఇది రెండో వికెట్ కావడం గమనార్హం. 5 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 21/2జింబాబ్వే రెండో వికెట్ డౌన్‌జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన బెన్ కర్రాన్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 20/2తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వేభారత బౌలింగ్ అటాక్ ఆరంభించిన మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో తొలి బంతికే... వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన బ్రియాన్ బెన్నెట్ (0). క్రీజులోకి డియాన్ మైర్స్. జింబాబ్వే స్కోరు: 6-1 (1). బెన్ కర్రాన్ సున్నా, డియాన్ మైర్స్ ఆరు పరుగులతో ఉన్నారు.అశోక్ శర్మ అరంగేట్రంరాజస్తాన్ పేసర్ అశోక్ శర్మ ఈ మ్యాచ్‌తో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. అదేవిధంగా యువ పేసర్ మయాంక్ యాదవ్ దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు యువ ఆటగాళ్లు న్యూమాన్ న్యామ్హురి, బెన్ కరన్ జింబాబ్వే తరపున డెబ్యూ చేశారు.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బెన్ కర్రాన్, డియాన్ మైర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీభారత్ : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్ -
IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!
ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్‌స్వీప్‌ల తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య గురువారం నాటి తొలి టీ20కి హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్ నుంచి ఓపెనర్ సంజూ శాంసన్‌ను పక్కనపెట్టిన యాజమాన్యం.. వైభవ్ సూర్యవంశీని మాత్రం కొనసాగించింది.అదే విధంగా.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ తదితర యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్లను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా.. రింకూ సింగ్‌ను కూడా తిరిగి పిలిపించింది.అభిషేక్ జోడీగా ఎవరు?ఈ నేపథ్యంలో జింబాబ్వేతో తొలి టీ20కి భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతున్న అంశం ఆసక్తికరంగా మారింది. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారా? లేదంటే వైభవ్‌ను ఎంపిక చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్ 14, 13, 15 పరుగులు చేసి విఫలమయ్యాడు.అయితే, హరారే వేదికగా ఈ ఏడాది అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లోనే 175 పరుగులతో విధ్వంసం సృష్టించి.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. కానీ టీమిండియా తరఫున అరంగేట్రం తర్వాత మాత్రం అతడు అంచనాలు అందుకోలేకపోతున్నాడు.ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు అవకాశం ఉంటుందా?అదే సమయంలో గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న ప్రభ్‌సిమ్రన్ సింగ్.. ఈ ఏడాది కూడా 510 పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే పంజాబ్ తరఫున ప్రభ్‌సిమ్రన్ ఈ మేరకు రాణించాడు.నా జట్టు ఇదేఇలాంటి తరుణంలో భారత మాజీ క్రికెటర్ ఎస్. బద్రీనాథ్ తన తుదిజట్టులో ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీకే పెద్దపీట వేశాడు. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్, నాలుగో నంబర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మను కొనసాగించిన బద్రీనాథ్.. ఆరు, ఏడు స్థానాల్లో ఆల్‌రౌండర్లు శివం దూబే, సూర్యాంశ్ షెడ్గేలను ఎంచుకున్నాడు. రింకూ సింగ్‌ను మాత్రం పక్కనపెట్టాడు.ఇక స్పిన్ విభాగంలో హర్ష్ దూబే, రవి బిష్ణోయి రూపంలో ఇద్దరిని ఎంపిక చేసిన బద్రీనాథ్.. పేస్ దళంలో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్‌లకు చోటిచ్చాడు.జింబాబ్వేతో తొలి టీ20కి బద్రీనాథ్ ఎంచుకున్న జట్టువైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.చదవండి: ICC ODI WC 2027: దమ్ముంటే అతడిని తప్పించండి -
'అతడికి సలహాలు అక్కర్లేదు.. కచ్చితంగా చెలరేగుతాడు'
భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం హరారే వేదికగా జరగనుంది. వరుస సిరీస్‌ల ఓటముల అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా.. తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది.ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన సహచరలకు కీలక సూచనలు చేశాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఎదురైన పరాజయాలను పక్కనపెట్టి ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని అయ్యర్ పిలుపునిచ్చాడు. "ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యనటనలలో మాకు అనుకూల ఫలితాలు రాలేదు. కానీ ఈ ఓటముల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. భవిష్యత్తులో ఒక జట్టుగా మనం ఏ విషయాలపై దృష్టి పెట్టాలి, మైదానంలో పరిస్థితులకు తగ్గట్లుగా ఎలా మారాలి అనే విషయాలపై స్పష్టత వచ్చింది. నాతో పాటు జట్టులో చాలా మంది ఆటగాళ్లకు ఇదే తొలి జింబాబ్వే పర్యటన.కాబట్టి ఇక్కడ కండీషన్స్‌కు ఎంత వేగంగా అలవాటుపడితే అంత మెరుగైన ఫలితాలు వస్తాయి. నేను మా బాయ్స్‌కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బయట నుంచి విమర్శలను పట్టించుకోవద్దు. కేవలం మీ ఆటపైనే దృష్టి సారించి ఫియర్ లెస్ క్రికెట్ ఆడండి. మేము ఒక జట్టుగా సమిష్టిగా రాణించాల్సిన అవసరముంది. జింబాబ్వేను ఏ మాత్రం తేలికగా తీసుకోము. ప్రత్యర్ధి జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారిలో కొంతమందికి ఐపీఎల్లో ఆడిన అనుభవం కూడా ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో అయ్యర్ పేర్కొన్నాడు.అదేవిధంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురుంచి శ్రేయస్ మాట్లాడుతూ.. "ఇంగ్లండ్ సిరీస్ తర్వాత మా బాయ్స్‌కు తగినంత విరామం దొరికింది. దీంతో యువ ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. వైభవ్ కూడా ఎక్కడ తప్పు చేశాడో దాన్ని సరిదిద్దుకుని ఉంటాడు. అందుకే నేను అతడికి పెద్దగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.చదవండి: భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్.. జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే -
భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్.. జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే
భారత్-జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సమయం అసన్నమైంది. జూలై 23 నుంచి హరారే వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో ఘోర పరాజయాలను చవిచూసిన భారత్.. ఈ సిరీస్‌తో తిరిగి విజయాల బాట పట్టాలని పట్టుదలతో ఉంది.ఇప్పటికే జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన శ్రేయస్ సేన మూడు రోజుల పాటు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. ఈ సిరీస్ భారత జట్టుతో పాటు వైభవ్ సూర్యవంశీ, మయాంక్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లకు ఎంతో కీలకం కానుంది. తన అరంగేట్ర సిరీస్‌లో విఫలమైన వైభవ్.. ఇప్పుడు జింబాబ్వేపై ఎలా రాణిస్తాడోనని అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఛాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన యువ పేసర్ మయాంక్ యాదవ్‌పై కూడా అందరి కళ్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌లలో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు కూడా తన ఫామ్‌ను అందుకోవడానికి ఈ జింబాబ్వే పర్యటన ఎంతగానో ఉపయోగపడనుంది.మరోవైపు సొంతగడ్డపై వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న జింబాబ్వే.. టీమిండియాను అడ్డుకునేందుకు తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ తదితర విషయాలను తెలుసుకుందాం.షెడ్యూల్ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి.1వ టీ20- జూలై 23, 2026- గురువారం- సాయంత్రం 4:30- హరారే స్పోర్ట్స్ క్లబ్2వ టీ20- జూలై 25, 2026- శనివారం-సాయంత్రం 4:30- హరారే స్పోర్ట్స్ క్లబ్3వ టీ20-జూలై 26, 2026- ఆదివారం- సాయంత్రం 4:30- హరారే స్పోర్ట్స్ క్లబ్ఈ మ్యాచ్‌లను భారత్‌లో జీ ఎంటర్టైన్మెంట్కు చెందిన సరికొత్త స్పోర్ట్స్ ఛానెల్ Unite8 Sports లో వీక్షించవచ్చు. అదేవిధంగా ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్సైట్లో కూడా ఈ మ్యాచ్‌లను చూడవచ్చు.జట్లుభారత్శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్. జింబాబ్వే సికిందర్ రజా (కెప్టెన్), బ్రియన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, తనకా చివాంగా, బెన్ కుర్రాన్, బ్రాడ్ ఎవాన్స్, వెస్లీ మాధెవెరె, తాడివనాషే మరుమాని, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజారబాని, డియోన్ మైయర్స్, రిచర్డ్ న్గరావా, న్యూమాన్ నియామ్హురీ, మిల్టన్ షుంబా, తఫద్వా త్సిగా (వికెట్ కీపర్). -
తొలి బంతి నుంచే హిట్టింగ్ ఆడగలను కానీ..: టీమిండియా స్టార్
ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం తొలి టీ20 నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగ.ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగల సత్తా తనకు ఉందని.. అయితే, పరిస్థితులకు తగ్గట్లుగానే తాను బ్యాటింగ్ చేస్తానని పేర్కొన్నాడు. వైస్ కెప్టెన్‌గా తనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయని.. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తానంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవాలుకాగా ఐర్లాండ్‌తో సిరీస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ టీ20లలో ఇవ్వడంతో పాటు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇక టీ20 ప్రపంచకప్ టోర్నీలో మంచి ప్రదర్శన కనబరిచిన తిలక్ వర్మకు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ లభించింది. అయితే, ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్ చేతుల్లో టీమిండియా వరుసగా 2-0, 4-0తో క్లీన్‌స్వీప్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.బ్యాటర్‌గా శ్రేయస్ ఫర్వాలేదనిపించినా.. సారథిగా అతడికి చేదు అనుభవమే మిగిలింది. మరోవైపు.. తిలక్ వర్మ స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతడి స్ట్రైక్‌రేటు 110 కాగా.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 152.94కు చేరినప్పటికీ సగటు 26 మాత్రమే.ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ వంటి మాజీ క్రికెటర్లు తిలక్ వర్మను జట్టు నుంచే తొలగించాలనే డిమాండ్లు చేశారు. ఈ క్రమంలో జింబాబ్వేతో తొలి టీ20కి ముందు తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘‘టీ20 ఫార్మాట్లో ఒక్కోసారి వేర్వేరు ఆటగాళ్లు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుంది.ఆ సత్తా నాకుంది.. కానీపిచ్ పరిస్థితులకు తగినట్లుగా ప్లాన్ ఉంటుంది. కాబట్టి ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అంతిమంగా జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ప్రణాళిక ప్రకారం.. తొలి బంతి నుంచే హిట్టింగ్ ఆడాలంటే నేను అదే పని చేస్తా. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగల సత్తా నాకుంది. కానీ యూకే పిచ్ పరిస్థితుల్లో అది అంత సులువు కాదు. పైగా మ్యాచ్‌లో ఎలాంటి స్థితిలో ఉన్నామో కూడా చూసుకోవాలి.నేను బ్యాటింగ్‌కు వెళ్లేసరికి జట్టు పవర్‌ప్లేలోనే నాలుగైదు వికెట్లు కోల్పోతూ వచ్చింది. అలాంటప్పుడు వచ్చీ రాగానే షాట్లు ఆడటం సరైంది కాదు. పైగా వైస్ కెప్టెన్ అంటే నేను మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది. అందుకే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ఆలోచించాల్సి వచ్చింది. పోరాటపటిమ ఉన్న జట్టుగత రెండేళ్లుగా ఎక్కువగా ఆసియాలోని పిచ్‌లపైనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మేం ఇంగ్లండ్‌కు వెళ్లగానే ఇబ్బంది పడ్డాం’’ అని తిలక్ వర్మ తనను విమర్శించిన వారికి కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. జింబాబ్వే మంచి పోరాటపటిమ ఉన్న జట్టు అని ప్రశంసించిన తిలక్ వర్మ.. వారిని ఓడించడం కూడా అంత సులువేమీ కాదన్నాడు. చదవండి: టీమిండియాపై గెలవగలం: జింబాబ్వే కెప్టెన్ -
IND vs ZIM: సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్ కాదు: జింబాబ్వే కెప్టెన్
విదేశీ పర్యటనలో ఉన్న టీమిండియా వరుస పరాజయాలు చవిచూసింది. యూకే టూర్లో భాగంగా తొలుత ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడ్డ భారత జట్టు.. అనూహ్య రీతిలో పసికూన చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టి ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో వైట్‌వాష్ అయింది.దీంతో యూకే పర్యటనతో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు అత్యంత చేదు అనుభవమే మిగిలింది. విజయమన్నదే లేకుండా అతడు ఈ రెండు సిరీస్‌లను అవమానకర రీతిలో ముగించాల్సి వచ్చింది.ఇపుడు జింబాబ్వేతో సిరీస్అనంతరం.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోనూ టీమిండియా ఓటమిపాలైంది. ప్రత్యర్థికి 1-2తో సిరీస్‌ను సమర్పించుకుంది. ఇక ఇప్పుడు భారత జట్టు జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ బృందం ఎలాగైనా ఈసారి గెలుపు ఖాతా తెరిచి.. సిరీస్‌లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే, అదేమీ అంత తేలిక కాదు. ఐరిష్ జట్టు వంటి పసికూన చేతిలో ఓడిన టీమిండియాకు.. జింబాబ్వే కూడా కఠిన సవాలు విసురుతోంది.అసాధారణ విజయాలుఇటీవలి కాలంలో ఆ జట్టు సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. టీ20 ప్రపంచకప్-2026లో అనూహ్య రీతిలో మాజీ చాంపియన్, పటిష్ట ఆస్ట్రేలియా జట్టునే జింబాబ్వే మట్టికరిపించింది. ఏకంగా 23 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్ దశలోనే ఆసీస్‌ను ఎలిమినేట్ చేసింది. ఆ తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై కూడా విజయాలు సాధించింది.ఇక ఇటీవల బంగ్లాదేశ్ జట్టు తమ దేశంలో పర్యటించగా ఏకైక టెస్టులో బంగ్లాను ఏకంగా ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో జింబాబ్వే మట్టికరిపించింది. ఆ తర్వాత వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే, టీ20 సిరీస్‌ను మాత్రం 1-2తో బంగ్లాకు కోల్పోయింది. ఏదేమైనా ఇటీవల అన్ని ఫార్మాట్లలో చెప్పుకోదగ్గ విజయాలతో జింబాబ్వే పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.టీమిండియా ఫేవరెట్ కాదుఈ నేపథ్యంలో తాజా టీ20 సిరీస్‌లో టీమిండియా హాట్ ఫేవరెట్ కదా అన్న ప్రశ్నకు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. ‘‘అదేం లేదు. ఈ సిరీస్‌లో గెలిచేందుకు ఇరుజట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి.ఏదేమైనా నేనొక విషయం కచ్చితంగా చెప్పగలను. జింబాబ్వే ఇటీవలి కాలంలో అత్యంత నిలకడగా ఆడుతూ క్రికెట్లోని అసలైన మజాను అందిస్తోంది. ఈ సిరీస్ ద్వారా కూడా జింబాబ్వే కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది.వార్వన్ సైడ్ కానే కాదుప్రస్తుతం టీమిండియా సంధి దశలో ఉంది. జింబాబ్వే పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఈ సిరీస్ ఎంతమాత్రం ఏకపక్షంగా ఉండబోదని చెప్పగలను’’ అని రజా పేర్కొన్నాడు. కాగా టీమిండియా- జింబాబ్వే మధ్య జూలై 23, 25, 26 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. చదవండి: iND vs ENG: ప్రపంచంలోనే బెస్ట్.. అతడిని ఎందుకు ఆడించలేదు?Another exciting challenge awaits Team India! 🇮🇳Zimbabwe skipper Sikandar Raza is excited for the upcoming series against India and believes fans are in for an entertaining contest! 👊🔥#ZIMvIND pic.twitter.com/6iyXDzZbLn— Star Sports (@StarSportsIndia) July 21, 2026 -
ODI WC: భారత జట్టు ఇదే.. వాళ్లకు నో ఛాన్స్!
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లోనూ టీమిండియాకు భంగపాటే ఎదురైంది. తొలుత టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0 క్లీన్‌స్వీప్ అయిన భారత జట్టు.. ఆ తర్వాత వన్డే సిరీస్‌లో 2-1తో ఓడిపోయింది. తొలి వన్డేలో గెలిచిన గిల్ సేన.. ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ ఓడిపోయింది.ఫిట్‌నెస్‌లేని ఆటగాళ్లకు గిల్ వార్నింగ్ముఖ్యంగా లార్డ్స్‌లో భారత బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఇక జస్ప్రీత్ బుమ్రా గాయం వల్ల ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అంతకుముందే ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడి జట్టుకు దూరమయ్యాడు.ఇక ఈ సిరీస్ కంటే ముందే ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి కూడా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తరచూ గాయపడే ఆటగాళ్ల వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతింటోందని కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2027లో వరుసగా ఏడు మ్యాచ్‌ల దాకా ఆడాల్సి ఉంటుందని.. అలాంటి కీలక సమయంలో వీరితో కష్టమేనంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.తమ ఫిట్నెస్ ప్రమాణాలు మెరుగుపడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని గిల్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి తరుణంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ బ్యాటర్ అభినవ్ ముకుంద్ వరల్డ్‌కప్ జట్టును ఎంచుకున్నాడు.వారికే పెద్దపీటటాపార్డర్లో ఎలాంటి మార్పులు చేయని అభినవ్.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ- కెప్టెన్ శుబ్‌మన్ గిల్ జోడీని వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లిని కొనసాగించాడు. అయితే బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌కు మాత్రం చోటివ్వలేదు. ఇక వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లను ఎంచుకున్న అభినవ్.. మిడిలార్డర్లో వీరితో పాటు శ్రేయస్ అయ్యర్‌కు చోటిచ్చాడు.ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంచుకున్న అభినవ్ ముకుంద్.. రవీంద్ర జడేజాను పక్కనపెట్టాడు. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు స్థానమిచ్చిన అతడు.. వరుణ్ చక్రవర్తికి చోటివ్వలేదు.ఇక పేస్ విభాగంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్‌లకు చోటు ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ పేర్లను అభినవ్ ముకుంద్ పరిగణనలోకి తీసుకోలేదు. వీళ్లు కూడా ఉండవచ్చుఅయితే, వరల్డ్‌కప్ టోర్నీకి ఇంకా సమయం ఉంది కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్ ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చినా అభినవ్ ఆశ్చర్యం లేదన్నాడు. కాగా వచ్చే ఏడాది సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది.వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి అభినవ్ ముకుంద్ ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.చదవండి: ఐపీఎల్ టూ ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్! -
రోహిత్ వివాదం.. టీమిండియాకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
రోహిత్ శర్మ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్‌లు ఉన్న సమయంలో వీలైనంత మేర సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిదని ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది. శనివారం లండన్‌లోని భారత హైకమిషన్ నిర్వహించిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో భాగంగా టీమిండియాతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గంభీర్ సహా ఆటగాళ్లంతా హాజరయ్యారు.99 శాతం అదే ధోరణిలో: రాజీవ్ శుక్లారాజీవ్ శుక్లా మాట్లాడుతూ..'భారతదేశంలో 99 శాతం మంది ప్రజలు తమను తాము క్రికెట్ నిపుణులుగా భావిస్తుంటారని, అందుకే మ్యాచ్‌లకు ముందు ఆటగాళ్లు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని నా అభిప్రాయం. మన జట్టులో ప్రతిభకు కొదవలేదని, కేవలం ఆటపై దృష్టి పెట్టడమే ఆటగాళ్లు ముందున్న కర్తవ్యం. అనవసర విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.' అని చెప్పుకొచ్చారు.బయటి విషయాలు పట్టించుకోను: గిల్టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తన చేతిలో లేని బయటి అంశాల గురించి ఆలోచించకుండా, కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా అధిగమించగలనని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే టీమిండియాలో క్యాంప్‌లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్న వేళ గిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇక గాయాల నుంచి కోలుకొని టీ20 కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన శ్రేయస్ అయ్యర్ తన పునరాగమన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహచర ఆటగాళ్లు చేసిన ఫోన్ కాల్స్, వారు ఇచ్చిన మద్దతు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, అందుకే మరింత బలంగా జట్టులోకి తిరిగి రాగలిగానని అయ్యర్ భావోద్వేగంతో పేర్కొన్నాడు. చారిత్రక బంధం: గంభీర్ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ భారత్-బ్రిటన్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాల వల్ల యూకే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రదేశమేనని అన్నారు. భారత క్రికెట్ అనేది కేవలం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కాదని, జట్టును బేషరతుగా ప్రేమించే ప్రతి ఒక్క నిజాయితీ గల అభిమానికి చెందుతుందని గంభీర్ స్పష్టం చేశాడు. ఇక ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చిన యూకేలోని భారత హైకమిషనర్ పి. కుమారన్, డిప్యూటీ హైకమిషనర్ కార్తీక్ పాండేలు టీమిండియాకు ఘన స్వాగతం పలికారు. ఇదే వారంలో అమల్లోకి వచ్చిన భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) వ్యాపారంతో పాటు క్రీడారంగానికి కూడా ఎన్నో కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ టీమిండియా సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని వారు కొనియాడారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇవాళ చివరి వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. -
టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరి వెళ్లిన టీమిండియా
జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా శనివారం రాత్రి భారత్ నుంచి బయల్దేరి వెళ్లింది. ఈ సిరీస్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినివ్వడంతో అతడి స్థానంలో జట్టు మెంటార్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వీవీఎస్ లక్ష్మణ్ సహా తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇతర క్రికెటర్లు జింబాబ్వే టూర్‌కు వెళ్తున్న ఫొటోలను బీసీసీఐ పంచుకుంది. ఇంగ్లండ్ టూర్లో ఇవాళ చివరి వన్డే ఆడిన అనంతరం టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, శివమ్ దూబేలు నేరుగా జింబాబ్వేకు పయనం కానున్నారు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో టీ20 కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా.. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో ఓటమిపాలైంది. తన కెప్టెన్సీలో శ్రేయస్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో జింబాబ్వే సిరీస్ అతడికి కీలకం కానుంది. జింబాబ్వే టూర్లో టీమిండియానే ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ ఆతిథ్య జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జూలై 23 నుంచి మొదలుకానుంది. తొలి టీ20 జూలై 23న హరారే వేదికగా సాయంత్రం 4.30 గంటలకు జరగనుంది. 2024 జూలైలో చివరగా జింబాబ్వేలో పర్యటించిన భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది.ఇక ఈ సిరీస్‌కు సంజూ శాంసన్‌ను పక్కకు తప్పించారు. రింకూ సింగ్, మయాంక్ యాదవ్‌లతో పాటు ప్రబ్సిమ్రన్లను జింబాబ్వే టూర్‌కు ఎంపిక చేసింది.జింబాబ్వే టూర్‌కు టీమిండియా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యాష్ ఠాకూర్, అశోక్ శర్మ, ప్రబ్‌సిమ్రన్, మయాంక్ యాదవ్.𝙀𝙣 𝙧𝙤𝙪𝙩𝙚 𝙩𝙤 𝙕𝙞𝙢𝙗𝙖𝙗𝙬𝙚 🇿🇼#TeamIndia | #ZIMvIND pic.twitter.com/akRFqycwXC— BCCI (@BCCI) July 18, 2026చదవండి: రిటైర్మెంట్ ఊహాగానాలపై రోహిత్ తొలి స్పందన! -
కోహ్లి, శ్రేయస్ రాణించినా.. స్వల్ప స్కోర్‌కే టీమిండియా ఆలౌట్
కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (65), శ్రేయస్ అయ్యర్ (66) రాణించడంతో భారత్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓ దశలో (178-3) భారీ స్కోర్ చేసేలా కనిపించిన భారత్.. విరాట్ కోహ్లి ఔటయ్యాక వరుసగా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ క్రీజ్‌లో పాతుకుపోయినప్పటికీ.. అతడికి ఎవరు పెద్దగా సహకరించలేదు. ఆఖర్లో బుమ్రా (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 230 పరుగుల మార్కును తాకగలిగింది. అట్కిన్సన్ వేసిన ఇన్నింగ్స్ 43వ ఓవర్లో బుమ్రా 3 ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు.అంతకుముందు భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ (26), శుభ్‌మన్ గిల్ (31) ఓ మోస్తరు ఆరంభాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ స్థానంలో ఆడుతున్న ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచారు. గత మ్యాచ్‌లో అద్భుత అర్ద శతకాలతో సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్ (2), అక్షర్ పటేల్ (1) ఈ మ్యాచ్‌లో చేతెల్తేశారు. విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యారు. జోఫ్రా ఆర్చర్ వరుస బంతుల్లో అక్షర్, దూబేలను ఔట్ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపటికే గుర్నూర్ బ్రార్ 7 పరుగుల వద్ద ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రసిద్ద్ కృష్ణ (0) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్ తలో 3 వికెట్లతో సత్తా చాటగా.. సాకిబ్ మహమూద్ 2, సామ్ కర్రన్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్!
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. కానీ ఈ మెగా టోర్నీ తర్వాత జట్టు ఆడిన తొలి సిరీస్‌లోనే ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌పై వేటు పడింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. కెప్టెన్‌గా తప్పించడమే కాకుండా.. జట్టులోనే అతడికి స్థానం లేకుండా చేసింది.గత ఏడాదిన్నర కారణంగా బ్యాటర్‌గా సూర్యకుమార్ వ్యక్తిగత వైఫల్యలే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన యాజమాన్యం.. చిచ్చర పిడుగు, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టుకు ఎంపిక చేసింది.ఘోర పరాభవం!అయితే, అయ్యర్ కెప్టెన్సీలో తొలి సిరీస్‌లోనే భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌లో 2-0తో టీమిండియా వైట్‌వాష్‌కు గురైంది. ఇక ఇంగ్లండ్ చేతిలోనూ 4-0తో క్లీన్‌స్వీప్ అయింది. దీంతో తాజా యూకే టూర్ భారత క్రికెట్ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.ఈ నేపథ్యంలో సూర్యను గుర్తు చేసుకుంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అతడిని కొనసాగించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టు కరిష్మా సింగ్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.బీసీసీఐ గ్రీన్ సిగ్నల్!.. కానీ ఓ కండిషన్!సూర్యకు టీమిండియా తలుపులు శాశ్వతంగా ఏమీ మూసుకుపోలేదన్నారు. అతడు త్వరలోనే తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే, అందుకోసం సూర్య దేశవాళీ క్రికెట్లో ముంబై తరఫున.. అదే విధంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫునా కచ్చితంగా రాణించాల్సి ఉంటుందని కరిష్మా చెప్పుకొచ్చారు.అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు కరిష్మా తెలిపారు. బంతి ఇప్పుడు సూర్య కోర్టులోనే ఉందన్నారు. దేశీ క్రికెట్లో రాణిస్తే తప్పక అతడు తిరిగి టీమిండియాలో అడుగుపెడతారని జోస్యం చెప్పారు. కాగా మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, దినేశ్ కార్తిక్ తదితరులు కొన్నాళ్లపాటు జాతీయ జట్టుకు దూరమైనా.. దేశీ క్రికెట్లో సత్తా చాటి తిరిగి జట్టులో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు భారత జట్టు ఇదే! -
‘అందుకే వైభవ్‌ను తప్పించి.. సంజూను ఆడించాము’
టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ కావడమే ఇందుకు కారణం. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ గురైన శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌నూ విజయమన్నదే లేకుండా ముగించింది. ఇంగ్లిష్ జట్టు చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది.ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కోసం వరల్డ్‌కప్ హీరో సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా సంజూ ఐర్లాండ్‌తో రెండు టీ20లు (5, 0).. అదే విధంగా ఇంగ్లండ్‌తో తొలి టీ20 (1)లో విఫలమయ్యాడు.ఈ క్రమంలోనే సంజూను తప్పించి.. అతడి స్థానంలో ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ రెండో టీ20తో అరంగేట్రం చేశాడు. అయితే, వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 13, 14, 15 పరుగులు చేశాడు. అంతేగాక వైభవ్ రాకతో టాపార్డర్‌లో ముగ్గురూ (ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్) లెఫ్టాండర్లే అయ్యారు.ఈ నేపథ్యంలో నామమాత్రపు ఐదో టీ20లో మాత్రం వైభవ్ సూర్యవంశీని తప్పించి.. సంజూ శాంసన్‌ను తిరిగి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వివరణ ఇచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ..‘‘సౌతాంప్టన్ పిచ్ పరిస్థితికి తగ్గట్లు మేము అత్యుత్తమ ఓపెనింగ్ కాంబినేషన్‌తో ముందుకు వెళ్లాలని అనుకున్నాము. అభిషేక్ శర్మతో కలిసి కుడిచేతి వాటం బ్యాటర్‌తో ఓపెనింగ్ చేయించాలని ఫిక్స్ అయ్యాము. అందుకే వైభవ్‌ను తప్పించాము. ఈ మ్యాచ్‌కు ఇలా చేయడమే సరైన నిర్ణయం. సంజూ గన్ బ్యాటర్. గతంలో ఒంటిచేత్తో ఎన్నో సిరీస్‌లు గెలిపించాడు’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఐదో టీ20లో సంజూ 27 పరుగులు చేయగా.. అభిషేక్ 3 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. టీమిండియా 201 పరుగులకే కుప్పకూలింది. -
ఇంగ్లాండ్ తో ఓటమికి వైభవే కారణం
-
శ్రేయస్ అయ్యర్‌ను తొలగించండి.. ఈజీ ఆప్షన్ అదే!
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 విజేతగా నిలిచిన టీమిండియాకు.. విదేశీ గడ్డ మీద ఘోర పరాభవం ఎదురైంది. మెగా టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత తొలి ప్రయత్నంగా ఐర్లాండ్‌తో తలపడ్డ భారత్ ఊహించని రీతిలో.. ఆతిథ్య జట్టు చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది.శ్రేయస్ అయ్యర్‌కు చేదు అనుభవంఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్‌వాష్ అయింది. దీంతో టీమిండియా టీ20 కెప్టెన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన శ్రేయస్ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం మిగిలింది. ఈ రెండు టీ20 సిరీస్‌లలో భారత్ క్లీన్‌స్వీప్ కావడంతో అతడి కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈజీ ఆప్షన్ అదే!అదే సమయంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైనా మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ రెండు సిరీస్‌లలో టీమిండియా ఘోర ఓటమి నేపథ్యంలో గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను తొలగించడమనేది అత్యంత సులువైన ఆప్షన్.అయితే, ఆ విషయం పక్కనపెట్టి భారత జట్టు ఓటమికి అసలు కారణాలు ఏమిటో ముందు విశ్లేషించండి. నిజానికి ఐర్లాండ్, ఇంగ్లండ్.. అంటే విదేశీ గడ్డ మీద ఈ మ్యాచ్‌లు జరగడమే భారత్ ఓటమికి ప్రధాన కారణం.వికెట్ ఇలా ఉంది కాబట్టే మన బ్యాటర్లు విదేశీ పిచ్‌ల మీద ఆడేందుకు ఏమాత్రం సన్నద్ధం కాలేదు. ఎందుకంటే.. మన సెలక్టర్లు కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వీరిని విదేశీ టూర్‌కు ఎంపిక చేశారు. ఐపీఎల్ మన బ్యాటర్లకు ఓ కవచం వంటిది. ఇక్కడ రాణిస్తే చాలు జాతీయ జట్టులోకి వచ్చేస్తామనే నమ్మకం కుదిరింది.అయితే, ఐపీఎల్ రూపొందించినటువంటి ఫ్లాట్ పిచ్‌లను నేను జీవితంలో ఇంత వరకు చూడనేలేదు. వికెట్ ఇలా ఉంది కాబట్టే మన బ్యాటర్లు.. ముఖ్యంగా టాపార్డర్‌లో వచ్చిన వాళ్లు మంచినీళ్ల ప్రాయంగా పరుగులు రాబడుతున్నారు.మరి విదేశాల్లో వికెట్లు ఇలా ఉండవు కదా. అక్కడ మార్బుల్ షీట్‌పై బ్యాటింగ్ చేయడం కుదరదు. ఇలాంటపుడే సెలక్టర్లు మరింత తెలివిగా ఆలోచించాల్సింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ గడ్డ మీద రాణించిన శుబ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లను సెలక్ట్ చేయాల్సింది.దిక్కుమాలిన ఐడియా ఇచ్చిన వారిపైనే వేటుఈ పరాజయాల నేపథ్యంలో లోతుగా విచారణ, విశ్లేషణ జరపాలి. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు రూపొందించమని బీసీసీఐకి సలహా ఇచ్చిన వారిని ముందుగా తొలగించాలి. ఐపీఎల్‌ను మరింత పాపులర్ చేయాలని.. వాణిజ్యపరంగా లాభాలు పొందాలని చూస్తే పరిస్థితులు ఇలాగే దిగజారిపోతాయి’’ అని సంజయ్ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా వరుస సిరీస్‌లలో వైట్‌వాష్ నేపథ్యంలో టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఇంగ్లండ్‌కు కోల్పోయింది.చదవండి: ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్? -
టీ20 సిరీస్ ఓటమి.. నంబర్‌వన్ ర్యాంక్ గోవిందా
నాలుగు నెలల కిందట జరిగిన టీ20 ప్రపంచకప్‌ను మూడోసారి కైవసం చేసుకొని నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించిన టీమిండియా తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఓటమితో ఆ స్థానాన్ని కోల్పోయింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో ఇంగ్లండ్‌కు అప్పగించి దారుణ పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు సిరీస్‌తో పాటు నంబర్‌వన్ స్థానాన్ని కూడా ఇంగ్లండ్‌కు అప్పగించేసింది. 1605 రోజుల తర్వాత టీమిండియా టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం.పాయింట్ల పరంగా మార్పు లేనప్పటికీ మ్యాచ్‌ల పరంగా తేడా ఉండడంతో ఇంగ్లండ్ తొలి స్థానాన్ని ఆక్రమించింది. రెండో స్థానంలో భారత్ (268 పాయింట్లు), మూడో స్థానంలో ఆస్ట్రేలియా (260 పాయింట్లు) కొనసాగుతున్నాయి. గత నాలుగేళ్లలో నంబర్‌వన్ ర్యాంకు కోల్పోవడంతో పాటు రెండు వరుస టీ20 సిరీస్‌లు ఓడడం కూడా టీమిండియాకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఓటమి ద్వారా పలు చెత్త రికార్డులను కూడా భారత్ తన పేరిట లిఖించుకుంది.👉టీమిండియాకు పరుగుల పరంగా (56 పరుగులు) ఇది నాలుగో అతిపెద్ద ఓటమి. గతంలో 2026లో ఇంగ్లండ్ చేతిలోనే 125 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 2091లో న్యూజిలాండ్ చేతిలో 80 పరుగులు, 2026లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.👉ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఓడడం ద్వారా ఒక సిరీస్‌లో అత్యధిక ఓటములు చవిచూసినట్లయింది. గతంలో 2009 మహిళల ప్రపంచకప్‌లో మూడు ఓటములు, 2010 మహిళల ప్రపంచకప్‌లో మూడు ఓటములు, 2023 వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు ఓటములు చవిచూసింది.👉కెప్టెన్‌గా తొలి ఏడు టీ20 మ్యాచ్‌ల్లో గెలుపు లేని ఆటగాళ్ల జాబితాలో శ్రేయస్ అయ్యర్ చోటు సంపాదించాడు. గతంలో బ్రెండన్ టేలర్ (జింబాబ్వే), ఎల్టన్ చిగుంబరా (జింబాబ్వే), తిసారా పెరీరా (శ్రీలంక) ఈ ఫీట్ సాధించారు. ఇక భారత కెప్టెన్లలో రెండు వరుస టీ20 సిరీస్‌లతో పాటు ఏడు మ్యాచ్‌ల్లో గెలుపు రుచి చూడని తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు నమోదు చేశాడు.👉 భారత క్రికెటర్ ప్రిన్స్ యాదవ్ ఒక చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అంబటి రాయుడు తర్వాత తాను ఆడిన మొదటి నాలుగు మ్యాచ్‌ల్లోనూ ప్రిన్స్ యాదవ్ ఓటమి చవిచూడడం గమనార్హం. 🚨 INDIA’S REIGN AS THE NO.1 RANKED T20I TEAM IS OVER AFTER 1,605 DAYS. 🚨 pic.twitter.com/LOr51llcdt— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2026చదవండి: 'ఇది మాకు గుణపాఠం.. ఓటమికి కారణం అదే' -
'ఇది మాకు గుణపాఠం.. ఓటమికి కారణం అదే'
ఐర్లాండ్ టూర్లో 0-2తో క్లీన్‌స్వీప్ అయిన టీమిండియా ఇంగ్లండ్ టూర్లోనూ అదే కంటిన్యూ చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో ఇంగ్లండ్‌కు అప్పజెప్పి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. శనివారం రాత్రి జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 56 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఇది వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఆరో ఓటమి (ఒక మ్యాచ్ వర్షంతో రద్దు) కావడం గమనార్హం. ఏడు మ్యాచ్‌లుగా గెలుపు మొహం చూడని శ్రేయస్ అయ్యర్ టీమిండియా తరఫున అత్యంత చెత్త కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్‌తో సిరీస్ ఓటమి తమకు ఒక గుణపాఠం లాంటిదని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ పేలవ ఫీల్డింగ్‌తో పాటు నాణ్యత లేని బౌలింగ్ జట్టు ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపాడు. అయ్యర్ మాట్లాడుతూ.. 'నిజాయితీగా చెప్పాలంటే ఇంకా మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంగ్లండ్ పరిస్థితులకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మేము ఆడిన ప్రతి మైదానంతో పోలిస్తే మేము ఆడిన వికెట్లలో ఇదే బహుశా అత్యుత్తమమైనది కావొచ్చు. మ్యాచ్ మ్యాచ్‌కు పరిస్థితులు మారిపోతున్నాయి. తొలుత ఇంగ్లండ్ గడ్డపై బ్యాటింగ్ చేయడానికే చాలా కష్టపడ్డాం. కానీ ఇవాళ్టి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చాలా మెరుగయ్యామనిపించింది. ప్రొఫెషనల్ ఆటలో ఓటములు సహజమే. కానీ ఈ సిరీస్ ఓటమి మాకు గుణపాఠం లాంటిది. మ్యాచ్‌లు గెలవడంలో ఫీల్డింగ్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది. నేటి మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు జారవిడవడంతో పాటు పేలవంగా ఫీల్డింగ్ చేశాము. 200-210 పరుగుల టార్గెట్‌ను ఈ గ్రౌండ్లో ఈజీగా ఛేదించవచ్చు. 200 నుంచి 225 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్ మా తప్పిదాల వల్ల మరో 25 నుంచి 30 పరుగులు అదనంగా రాబట్టింది. పేలవ ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక బ్యాటింగ్ సమయంలో పవర్ ప్లేలో వెనువెంటనే వికెట్లు కోల్పోవడం కూడా విజయాన్ని దూరం చేసినట్లయింది. మంచి భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమయ్యాం. బౌలింగ్ కూడా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బుమ్రా, పాండ్యా వంటి అనుభవజ్ఞలైన బౌలర్లు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇంగ్లండ్ మ్యాచ్ విజయానికి అర్హులు. మొదట బట్లర్.. ఆ తర్వాత కెప్టెన్ హ్యారీ బ్రూక్ వేగంగా ఆడి మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. ఏది ఏమైనా ఈ సిరీస్ ఓటమి మాకు గుణపాఠం లాంటిది. ఇంగ్లండ్ గడ్డపై మరోసారి టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చినప్పుడు మా కుర్రాళ్లు జాగ్రత్తగా ఆడతారని నేను అనుకుంటున్నా. కెప్టెన్‌గా సిరీస్ ఓటమి నాకు బాధ కలిగించింది. కానీ కెప్టెన్‌గా మాత్రం చాలా విషయాలు నేర్చుకున్నా.' అని ముగించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) టీ20ల్లో రెండో సెంచరీతో చెలరేగగా...కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) త్రుటిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (25 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 28; 4 ఫోర్లు), సంజు సామ్సన్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ఇప్పటి వరకు ఐసీసీ టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న భారత్‌ను వెనక్కి నెట్టి తాజా ఫలితంతో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకుంది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 14న ప్రారంభం కానుంది.చదవండి: ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్ సెమీస్‌కి.. నార్వే ఇంటికి.. -
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్
భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు సాధించాడు. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక సార్లు (వరుసగా) టాస్ గెలిచిన కెప్టెన్‌గా ధోని రికార్డు సమం చేశాడు. శ్రేయస్, ధోని వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచారు. ఈ జాబితాలో శ్రేయస్, ధోని తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (6), రోహిత్ శర్మ (5) ఉన్నారు.ఇంగ్లండ్‌తో ఇవాళ (జులై 11) జరుగుతున్న ఐదో టీ20లో టాస్ గెలవడం ద్వారా శ్రేయస్ కోహ్లి రికార్డును అధిగమించి, ధోని రికార్డును సమం చేశాడు.భారత టీ20 కెప్టెన్‌గా అత్యధిక వరుస టాస్ విజయాలు..శ్రేయస్ అయ్యర్ – 7* (2026)ఎంఎస్ ధోని – 7 (2010-12)విరాట్ కోహ్లీ – 6 (2019)ఎంఎస్ ధోని – 5 (2007)రోహిత్ శర్మ – 5 (2020-22)మళ్లీ టాస్ గెలిచిన శ్రేయస్.. ఆసారైనా మ్యాచ్ గెలిచేనా..?భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వరుసగా ఏడో మ్యాచ్‌లో టాస్ గెలిచాడు. అయితే ఈ ఏడు మ్యాచ్‌ల్లో అతడు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాడు. ఐర్లాండ్ సిరీస్‌తో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ ఆ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి, సిరీస్‌ను మాత్రం 0-2తో కోల్పోయాడు. ఆతర్వాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనూ టాస్ గెలవగా.. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల్లోనూ శ్రేయస్ టాస్ గెలిచినా, ఒక్క మ్యాచ్‌లోనూ టీమిండియాను గెలిపించలేకపోయాడు.దీంతో ఈసారైనా మ్యాచ్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రేయస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ షేడ్గే జట్టులోకి వచ్చారు.భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్‌ల -
తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!.. గంభీర్‌కు గండం!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. మెగా ఈవెంట్ తర్వాత దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు తొలిసారిగా టీ20 సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది.అత్యంత చేదు అనుభవంవరల్డ్కప్లో జట్టును విజేతగా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌పై అనూహ్యంగా వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఈ టూర్ నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, శ్రేయస్‌కు సారథిగా తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం ఎదురైంది.ఇంగ్లండ్ పర్యటనలోనూఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఐరిష్ జట్టు చేతిలో ఓటమి చెందడం.. సిరీస్‌ను భారత్ చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇక ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే తరహా ఫలితం పునరావృతమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఓటమి పాలైంది.తీవ్ర స్థాయిలో విమర్శలుఈ క్రమంలో ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుదిజట్టు ఎంపికలో గంభీర్‌దే అంతిమ నిర్ణయం అని.. తరచూ మార్పులు చేస్తూ కెప్టెన్‌ను సైతం గందరగోళానికి గురిచేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.నిజానికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావడం గంభీర్‌కు ఇష్టం లేదని.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఒత్తిడితోనే అతడు ఇందుకు అంగీకరించాడనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో టీమిండియా వరుసగా రెండు టీ20 సిరీస్‌లు కోల్పోవడం సందేహాలకు తావిస్తోంది.తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం వరుస ఓటములపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ సేనతో పాటు.. గంభీర్ టీమ్‌పైనా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.వేటు పడుతుందా?ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ANIతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా స్వదేశానికి తిరిగి రాగానే వరుస ఓటములపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. గంభీర్‌పై కూడా స్క్రుటినీ ఉంటుంది’’ అని తెలిపాయి. కాగా గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందిలో ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్‌గా ర్యాన్ టెన్ డష్కాటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఉన్నారు.ఇక తాజా సిరీస్‌లలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ విఫలం కావడంతో ఎవరిపైనైనా వేటు పడుతుందా? లేదంటే గంభీర్ చెప్పినట్లు సంధి దశ కాబట్టి పదవీకాలం పూర్తయ్యేంత వరకు వీరిని కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా గంభీర్ కాంట్రాక్టు 2027 వరకు ఉన్న సంగతి తెలిసిందే.గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా డిజాస్టర్లు ఇవే👉స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్👉పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (ఆస్ట్రేలియాతో)ని చేజార్చుకున్న భారత్👉పాతికేళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్ 👉అరంగేట్రం నుంచి మూడు సీజన్లలో డబ్ల్యూటీసీ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి (2023-25)👉సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు తొలిసారి వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్👉ఐర్లాండ్‌కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన భారత్👉ఇంగ్లండ్‌కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు అతిపెద్ద ఓటమి (ఇంగ్లండ్‌తో రెండో టీ20లో 125 పరుగుల తేడాతో చిత్తు) etc.చదవండి: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ -
‘శ్రేయస్‌ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’
ఐర్లాండ్ గడ్డపై సిరీస్ ఓటమితో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై అదే దారుణ ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది. తొలి టీ20 వర్షార్పణం కాగా, ఆ తర్వాత జరిగిన మూడు టీ20ల్లోనూ పరాజయం చవిచూసిన టీమిండియా 0-3తో ఇంగ్లండ్‌కు సిరీస్‌ను కోల్పోయింది. కనీసం చివరి టీ20లోనైనా విజయం సాధించి గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించాలని టీమిండియా భావిస్తోంది. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఏదీ కలిసిరావడం లేదు. బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికీ కెప్టెన్‌గా వరుస ఓటములు అతడిని ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట ఓటమి (ఒక మ్యాచ్ రద్దు) పాలయ్యింది. దీంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా టీ20ల్లో ఇప్పటిదాకా గెలుపు రుచి చూడలేదు. అటు టీమిండియా కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం. దీంతో అయ్యర్ కెప్టెన్సీపై అప్పుడే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈసారి అయ్యర్‌తో పాటు కోచ్ గంభీర్‌పై కూడా కత్తి వేలాడుతోందనే వార్తలు వస్తున్నాయి. అదీగాక జింబాబ్వే టూర్‌తో పాటు ఆసియా గేమ్స్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను టీమిండియా వెంట పంపించాలని బీసీసీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ రెయాన్ టెన్డెస్కటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో టీమిండియా ఓటమి పాలైన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టెన్ డస్కటే మాట్లాడాడు. 'టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఇప్పుడే బాధ్యతలు చేపట్టాడు. అతడి కెప్టెన్సీలో టీమిండియాకు వెంటనే విజయాలు రావాలంటే ఎలా? కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. మ్యాచ్ ఓటములకు శ్రేయస్‌ను నిందించడం ఆపండి. అతడు కెప్టెన్‌గా నిలుదొక్కుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పుడు వచ్చే ఓటములే తర్వాత గెలుపుకు బాటలు వేస్తాయి. నిజానికి శ్రేయస్ తన నాయకత్వాన్ని బాధ్యతగా నిర్వహిస్తున్నాడు. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కేవలం కొన్ని మ్యాచ్‌లకే అతడు కెప్టెన్‌గా వైఫల్యం చెందాడని పేర్కొనడం సరికాదు. అంతకముందు సూర్యకుమార్ కూడా ఆరంభంలో ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఎలాంటి విజయాలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకాలం ఒక కెప్టెన్సీలో ఆడి ఇప్పుడు మరో కొత్త కెప్టెన్‌తో ఆడుతుండడంతో జట్టులో సమతుల్యం లోపించింది. రాబోయే రోజుల్లో అది చక్కబడి మళ్లీ అంతా సవ్యంగా సాగుతుంది. ఇక జట్టులో పాండ్యా, బుమ్రా లోటు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ బాగా రాణిస్తున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 190 పరుగులు సాధించడమే గాక కోహ్లీ రికార్డును కూడా సమం చేశాడు. టీమిండియా మ్యాచ్‌లు ఓడుతున్నప్పటికీ అయ్యర్ మాత్రం బ్యాటర్‌గా విఫలం కాలేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లండ్, టీమిండియా మధ్య చివరి టీ20 మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా ఆడనున్నాయి. 🔴 STOP BLAMING SHREYAS IYER – COACH SAYS HE NEEDS TIME 🤯🎙️: Ryan ten Doeschate backed Shreyas, saying he deserves time as captain. He praised Iyer's leadership, accountability, and batting, urging everyone not to judge him after just a few matches.pic.twitter.com/tqNDEQAXEm— Sam (@cricsam02) July 10, 2026Read: అరుదైన ఫీట్‌తో ఫిఫా చరిత్రను తిరగరాసిన ఎంబాపె -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ గడ్డపై గత రెండు టీ20 సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా ఈసారి మాత్రం తేలిపోయింది. బ్రిస్టల్ వేదికగా గురువారం ఇంగ్లండ్ జట్టుతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్ చేతిలో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు 0–3తో కోల్పోయింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా... తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ఓటమి ఎదురైంది. దీంతో కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు తీవ్ర నిరాశే మిగిలింది.అయితే, ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వ్యక్తిగతంగా మాత్రం శ్రేయస్ అయ్యర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 49 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు.డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలుఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ గడ్డ మీద కెప్టెన్ హోదాలో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. ఇక రెండో టీ20లో 37 పరుగులు చేసిన కెప్టెన్ సాబ్.. మూడో టీ20లో మాత్రం ఐదు పరుగులకే అవుటయ్యాడు. తాజాగా నాలుగో టీ20లో 80 పరుగులతో సత్తా చాటి.. ఇప్పటికి మొత్తంగా 190 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో కెప్టెన్ హోదాలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు👉శ్రేయస్ అయ్యర్ (ఇండియా)- 2026లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 190 పరుగులు (రెండు అర్ధ శతకాలు)👉ఏబీ డివిలియర్స్ (సౌతాఫ్రికా)- 2017లో మూడు మ్యాచ్‌లలో కలిపి 146 పరుగులు (ఒక అర్ధ శతకం)👉ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)- 2020లో మూడు మ్యాచ్‌లలో కలిపి 125 పరుగులు👉జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 2024లో రెండు మ్యాచ్‌లలో కలిపి 123 పరుగులు (రెండు అర్థ శతకాలు)👉బాబర్ ఆజం (పాకిస్తాన్)- 2021లో మూడు మ్యాచ్‌లలో కలిపి 118 పరుగులు (ఒక అర్ధ శతకం)కోహ్లి రికార్డు సమంఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద టీ20 సిరీస్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్‌గానూ శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అదే విధంగా ఇంగ్లండ్ జట్టుపై అత్యధిక వ్యక్తిగత టీ20 స్కోరు నమోదు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లి (80 నాటౌట్) రికార్డును కూడా శ్రేయస్ సమం చేశాడు. కాగా ఐర్లాండ్ పర్యటనతో టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం మిగిలింది. కనీవినీ ఎరుగని రీతిలో ఐరిష్ జట్టు చేతిలో టీమిండియా 2-0తో వైట్‌వాష్ అయింది. తాజాగా ఇంగ్లండ్‌కు సిరీస్‌ను చేజార్చుకుంది.చదవండి: ఆఖరి బంతికి సింగిల్... భారత్‌కు షాకిచ్చిన శ్రీలంక -
నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం?: శ్రేయస్ అయ్యర్
టీమిండియా వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లోనూ భారత జట్టు పరాజయం పాలైంది. ఆతిథ్య జట్టు చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 3-0తో సిరీస్ సొంతం చేసుకోగా.. టీమిండియా వరుసగా రెండో టీ20 సిరీస్‌ను చేజార్చుకుంది.ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీమిండియా ఓటమిపై స్పందించాడు. ‘‘మరోసారి మాకు నిరాశే మిగిలింది. ఈ పిచ్‌పై 158 అనేది కచ్చితంగా కాపాడుకోగలిగే స్కోరైతే కాదు. అందుకు తగ్గట్లుగానే ఇంగ్లండ్ వేగంగానే ఈ లక్ష్యాన్ని ఛేదించింది.మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్ మీదకు బంతులు వేయమని మా బౌలర్లకు చెప్పాను. అలా అయితే బ్యాటర్లు బౌండరీలు రాబట్టడం కష్టతరమవుతుంది. అయితే, మా ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాము. ఎప్పుడైతే మా వ్యూహాన్ని కొద్దిగా మార్చామో ఆ సమయంలో వాళ్లు పరుగులు పిండుకున్నారు.నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం?అయితే, నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల మాత్రం నేను సంతోషంగానే ఉన్నాను. కానీ గెలుపునకు నా ఇన్నింగ్స్ ఉపయోగపడలేదంటే దానికి ఎటువంటి అర్థం ఉండదు. నిజానికి నేను బాగా ఆడిన దాదాపు ప్రతిసారీ జట్టు గెలిచేది. కానీ దురదృష్టవశాత్తూ ఈసారి అలా జరగలేదు. తదుపరి మ్యాచ్‌లోనైనా ఆటంకాలు అధిగమించి అనుకున్న ఫలితం రాబట్టగలమనే అనుకుంటున్నాం.When the chips were down, the skipper stood tallest. 💙A magnificent innings from Shreyas Iyer. 🙌 Watch #ENGvIND LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/E5Lx13kGYs— Sony Sports Network (@SonySportsNetwk) July 9, 2026పొరపాట్లు సహజమేప్రస్తుతం జట్టు సంధి దశలో ఉంది. మా వల్ల చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. యువ క్రికెటర్లలో చాలా మంది తొలిసారి ఇలాంటి పిచ్‌లపై ఆడుతున్నారు. కాబట్టి తప్పులు సహజమే. అయితే, వీటి నుంచి ఎంత తొందరగా పాఠాలు నేర్చుకుంటామనేదే ముఖ్యం.బలంగా తిరిగి వస్తాముమా జట్టులో క్విక్ లెర్నర్స్ ఉన్నారు. కచ్చితంగా విదేశీ గడ్డ మీది పరిస్థితులను అర్థం చేసుకుని.. వికెట్‌ను సరిగ్గా అంచనా వేసి మరింత బలంగా తిరిగి వస్తారని నమ్ముతున్నా’’ అని శ్రేయస్ అయ్యర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా బ్రిస్టల్ వేదికగా గురువారం రాత్రి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.శ్రేయస్ మెరిసినా..నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 158 పరుగులకే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ 49 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో శివం దూబే (22) మాత్రమే ఇరవై పరుగులు దాటాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 13.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి పని పూర్తి చేసింది.ఓపెనర్ ఫిల్ సాల్ట్ అజేయ అర్ధ శతకం (59*)తో రాణించగా.. హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ (35 బంతుల్లో 79 నాటౌట్)తో మెరిశాడు. ఇక ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండు, మూడు.. తాజాగా నాలుగో టీ20లో గెలిచి ఆతిథ్య జట్టు 3-0తో సిరీస్ గెలుచుకుంది. కాగా అంతకుముందు టీమిండియా ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే.చదవండి: వైభవ్ సూర్యవంశీ అట్టర్ఫ్లాఫ్ -
శ్రేయస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
బ్రిస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వైభవ్ సూర్యవంశీ(15), అభిషేక్ శర్మ(16), ఇషాన్ కిషన్(4) వంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన చోట.. ఇంగ్లండ్ బౌలర్లకు శ్రేయస్ చుక్కలు చూపించాడు. తన ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన శ్రేయస్, క్రీజులో సెటిల్ అయ్యాక బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఓ వైపు క్రమం తప్పకొండా వికెట్లు పడుతున్నప్పటికి, అయ్యర్ తన దూకుడును కొనసాగించాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(22) పర్వాలేదన్పించాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగుల స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, అదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు. -
శ్రేయస్‌కు అండగా నిలబడ్డ సోదరి
భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడి సోదరి శ్రేష్ఠ అయ్యర్ తన సోదరుడికి అండగా నిలుస్తూ, భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్లను ఉదాహరణగా చూపించి విమర్శలకు సమాధానం ఇచ్చింది.సూర్యకుమార్ యాదవ్ స్థానంలో యూరప్ పర్యటనకు శ్రేయస్ అయ్యర్‌ను టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేసిన భారత జట్టు యాజమాన్యం అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు విజయవంతంగా నడిపించిన శ్రేయస్, ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 0-2తో ఓడిపోగా, ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. అనంతరం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ పరాజయం పాలవడంతో కెప్టెన్‌గా ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయాడు.ఈ నేపథ్యంలో ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన శ్రేష్ఠ అయ్యర్, "విరాట్ కోహ్లీ ఒక లెజెండ్, రోహిత్ శర్మ ఒక లెజెండ్, సచిన్ టెండూల్కర్ ఒక లెజెండ్. వాళ్లు కూడా తమ కెరీర్లో ఎన్నో మ్యాచ్‌లు ఓడిపోయారు. కానీ ప్రతిసారీ శ్రేయస్నే విమర్శిస్తే సమస్య అతనిలో కాకుండా విమర్శించే వారిలోనే ఉండొచ్చు" అని వ్యాఖ్యానించింది.అయితే శ్రేష్ఠ చేసిన ఈ పోలికలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సచిన్ టెండూల్కర్ 1996లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి నాలుగు వన్డేల్లో రెండింట్లో జట్టుకు విజయాలు అందించాడు. విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్సీ ఆరంభంలో తొలి ఓటమి తర్వాత వరుస విజయాలు సాధించాడు. రోహిత్ శర్మ తన తొలి వన్డే సిరీస్‌లో శ్రీలంకపై 2-1తో విజయం అందించగా, శుభ్‌మన్ గిల్ కూడా కెప్టెన్‌గా తన తొలి టీ20 సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు నమోదు చేశాడు. ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ శ్రేయస్‌ను దిగ్గజాలతో పోల్చడం సరైంది కాదని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.నెటిజన్లు శ్రేయస్‌ను దిగ్గజాలతో పోల్చొద్దని చెప్పినప్పటికీ.. శ్రేష్ఠ మాత్రం తన సోదరుడిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. "శ్రేయస్ గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆటగాడు. అతడిలో చాలా సామర్థ్యం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు అతడే భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు పొందుతాడని నేను బలంగా నమ్ముతున్నాను" అని పేర్కొంది.ఇదిలా ఉండగా, ప్రారంభ వైఫల్యాలు ఎదురైనా శ్రేయస్ అయ్యర్‌పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు జట్టు యాజమాన్యం విశ్వాసం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. 2028 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ జట్టుతో కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్న నేపథ్యంలో శ్రేయస్‌కు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తోంది. -
ఒకే ఒక్క ఓటమితో చెత్త రికార్డు లిస్టులో టీమిండియా
-
టీమిండియాకు చుక్కలు చూపించాడు.. కట్ చేస్తే! భారీ రివార్డ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తాజాగా ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దుమ్ములేపాడు. ఇంగ్లండ్ టూర్లో శ్రేయస్ కెప్టెన్‌గా విఫలమైనప్పటికి బ్యాటర్‌గా మాత్రం రాణించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 150.68 స్ట్రైక్ రేట్‌తో 110 పరుగులు చేశాడు.ఈ ప్రదర్శన కారణంగా శ్రేయస్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 425 స్థానాలు ఎగబాకి 93వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెథల్ తొలిసారి టాప్-10 లోకి దూసుకొచ్చాడు. బెథల్.. మార్ష్, బ్రెవిస్ వంటి స్టార్ క్రికెటర్లను వెనక్కి నెట్టి 8వ స్ధానానికి చేరుకున్నాడు. కాగా మాంచెస్టర్ టీ20లో బెథల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 191 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయినా.. బెథెల్ మాత్రం 46 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇందుకు ఫలితంగా ర్యాంకింగ్స్‌లో బెథల్కు భారీ రివార్డు లభించింది. తొలి రెండు స్ధానాల్లో భారత ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆదిల్ రషీద్, సామ్ కరన్ తమ స్ధానాలను మెరుగుపరుచుకున్నారు. భారత్‌పై ఇప్పటివరకు 3 వికెట్లు పడగొట్టిన రషీద్, ఒక స్థానం ఎగబాకి 3వ స్థానానికి చేరుకున్నాడు. సామ్ కరన్ బౌలింగ్ జాబితాలో 71 స్ధానం, ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో 13వ స్ధానం సొంతం చేసుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో భారత ఆటగాడు శివమ్ దూబే టాప్-10 నుంచి బయటకు వెళ్లిపోయాడు.చదవండి: IND vs ENG: సూర్యకుమార్ గుర్తొస్తున్నాడు -
IND vs ENG: సూర్యకుమార్ గుర్తొస్తున్నాడు
దేశం మారిన టీమిండియా ఆట తీరు మాత్రం మారలేదు. పసికూన ఐర్లాండ్ చేతిలో క్లీన్‌స్వీప్ అయిన భారత జట్టు.. ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై కూడా అదే పరాభవం దిశగా కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో వెనుకబడి ఉంది.వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లలో అద్భుతాలు చేసిన టీమిండియా.. యూకే పర్యటనలో మాత్రం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. మన జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమై ఘోర పరాజయాలను మూట కట్టుకుంది. ఒకప్పుడు వరుస దైపాక్షిక సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్.. ఇప్పుడు అదే వరుసగా ఓటములు చవిచూడడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్సీ మార్పు కారణంగానే టీమిండియాకు ఈ పరిస్థితి ఏర్పడందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఐర్లాండ్ టూర్‌కు ముందు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించి మూడు నెలల తిరగకముందే సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేశారు. కెప్టెన్‌గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే తప్పించారు. పేలవ ఫామ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సందర్భంగా చీఫ్ సెలక్టర్ అగార్కర్ కానీ స్పష్టం చేశాడు.అతడి స్ధానంలో మరో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించారు. దాదాపు రెండేళ్లగా భారత టీ20 జట్టులోనే లేని అయ్యర్‌ను తీసుకొచ్చి కెప్టెన్‌గా చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. భారత జట్టును అద్భుతంగా నడిపించిన సూర్యను పక్కన పెట్టడాన్ని చాలా మంది తప్పుపట్టారు. కానీ అయ్యర్ కూడా సూర్యలానే జట్టును విజయ పథంలో నడిపిస్తాడని టీమ్ మేనెజ్మెంట్తో పాటు బీసీసీఐ కూడా నమ్మింది. కానీ వారి నమ్మకాన్ని శ్రేయస్ వమ్ము చేశాడు.అక్కడ సక్సెస్.. ఇక్కడ ఫ్లాప్ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా పేరు సంపాదించిన శ్రేయస్ అయ్యర్.. టీమిండియా సారథిగా మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. భారత కెప్టెన్‌గా తొలి విజయం కోసం అయ్యర్ ఎదురు చూస్తున్నాడు. అతడి నాయకత్వంలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో అన్నింటిలోనూ భారత్ ఓటమి పాలైంది. అతడి కెప్టెన్సీలోనే తొలిసారి ఐర్లాండ్‌తో సిరీస్ కోల్పోయి భారత్ ఘోర పరభావాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో 76 పరుగులకే కుప్పకూలి మరో చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. కెప్టెన్‌గా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో శ్రేయస్ విఫలమవుతున్నాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో డెత్ ఓవర్లో స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించి.. భారత ఓటమికి కారణమయ్యాడు. దీంతో అయ్యర్ కెప్టెన్సీపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. కెప్టెన్‌గా శ్రేయస్ కంటే సూర్య ఎంతో బెటర్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి.సలాం సూర్య భాయ్!నిజంగానే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ రికార్డు అద్భుతంగా ఉంది. అతడి కెప్టెన్సీలో 52 టీ20లు టీమిండియా.. 42 మ్యాచ్‌లలో విజయం సాధించింది. అంతేకాకుండా అతడి సారథ్యంలోనే భారత్ ఆసియా కప్ (2025)తో పాటు 2026 టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. సూర్యకుమార్ కెప్టెన్సీ కాలంలో టీమిండియా ఒక్క అంతర్జాతీయ టీ20 సిరీస్‌ను కూడా కోల్పోలేదు. ఆడిన 8 ద్వైపాక్షిక సిరీస్‌లను క్లీన్ స్వీప్ లేదా విజయంతో ముగించింది. -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్ అయిన భారత జట్టు.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ చెత్త ప్రదర్శన కొనసాగిస్తోంది. నాటింగ్‌హామ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో శ్రేయస్ సేన ఇంగ్లండ్ చేతిలో మట్టికరిచింది.ఇంగ్లండ్ భారీ స్కోరుఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. కాగా ట్రెంట్‌బ్రిడ్జ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.చతికిల పడ్డ టీమిండియాఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాపార్డర్ రెండంకెల స్కోరు చేయగా.. లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (13), వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (13) పరుగులతో టాప్ రన్ స్కోరర్లుగా నిలిచారు.ఇక ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఏడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో 10 పరుగులు చేసి నిష్క్రమించాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, ఇంతటి ఫ్లాప్ షోలోనూ అభిషేక్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ జట్టుపై టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్‌పై టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్లు🏏అభిషేక్ శర్మ- 28🏏హార్దిక్ పాండ్యా- 27🏏విరాట్ కోహ్లి- 19🏏రోహిత్ శర్మ- 18🏏సూర్యకుమార్ యాదవ్ -18.మూడో టీ20 సందర్భంగా టీమిండియా నమోదు చేసిన చెత్త రికార్డులు ఇవే👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతిపెద్ద ఓటమి. (125 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో చిత్తు)👉ఇంగ్లండ్‌లో టీ20 మ్యాచ్‌లో అతి తక్కువ స్కోరుకే ఆలౌట్ అయిన జట్టుగా టీమిండియా (76/10).👉ఐదు టీ20 మ్యాచ్‌లలో విజయమన్నదే లేకుండా టీమిండియా పరాజయాల పరంపర కొనసాగించడం ఇదే తొలిసారి. ఐర్లాండ్ చేతిలో రెండు, ఇంగ్లండ్ చేతిలో రెండు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా. ఇక వర్షం వల్ల ఇంగ్లండ్‌తో తొలి టీ20 రద్దు కాగా.. మొత్తంగా వరుసగా ఐదు మ్యాచ్‌లలో టీమిండియాకు గెలుపున్నదే లేకుండా పోయింది.👉టీ20 మ్యాచ్‌లో 11.4 (అతి తక్కువ) ఓవర్లలో టీమిండియా ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. చదవండి: అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్ -
టీమిండియా ఆటతీరుపై శ్రేయస్ ఆగ్రహం
నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శనను "అత్యంత దారుణం"గా అభివర్ణించాడు. ఇలాంటి ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని స్పష్టం చేశాడు.అతడి మాటల్లో.. "ఈ ప్రదర్శనను వర్ణించడానికి 'అత్యంత దారుణం' అనే పదం తప్ప మరోటి కనిపించడం లేదు. ఇంత పెద్ద తేడాతో ఓడిపోవడం అసలు అంగీకారయోగ్యం కాదు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇది 200 పరుగులు చేసే పిచ్ కాదని నా అభిప్రాయం. పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం మాకు భారీ ఎదురుదెబ్బగా మారింది.బౌలింగ్‌లో కూడా జట్టు ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోయింంది. జట్టు సమావేశాల్లో ఎంత ప్రణాళిక రూపొందించినా, మైదానంలో పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయాలి. ఈ వికెట్‌పై హార్డ్ లెంగ్త్ బంతులు ప్రభావవంతంగా ఉన్నాయి. కానీ మేము వాటిని తగినంతగా వేయలేదు.అలాగే 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో బ్యాటర్లు ప్రణాళికాబద్ధంగా ఆడాలి. మొత్తంగా మా అమలు చాలా పేలవంగా సాగింది" అని అన్నాడు.అయితే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో బలంగా పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. "గతాన్ని తలచుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. మేం చాలా పేలవమైన క్రికెట్ ఆడాం. అయినా ఈ ఓటమి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మళ్లీ జట్టుకు ఊపు తీసుకొచ్చేందుకు ప్రతి ఆటగాడు తన వంతు బాధ్యత ఎలా నిర్వర్తించాలనే దానిపై ఆలోచించాలి" అని తెలిపాడు.కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 44 బంతుల్లో 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, జోస్ బట్లర్ 36, సామ్ కరన్ 24 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు.202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైంది. ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌కు రెండో అత్యల్ప స్కోరు కాగా, 125 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత జట్టు చరిత్రలోనే అత్యంత భారీ పరాజయంగా నిలిచింది. ఇప్పుడు సిరీస్‌లో నిలవాలంటే జూలై 9న బ్రిస్టల్‌లో జరిగే నాలుగో టీ20లో భారత్ తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అయ్యర్ నాయకత్వంలో భారత్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి. అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లోనూ భారత్ పరాజయం పాలైంది. -
టాస్ గెలిచిన టీమిండియా.. శ్రేయస్ అరుదైన ఫీట్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండో టీ20లో ఓటమి పాలైన భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం విజయం సాధించి ఆధిక్యంలో నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. రవి బిష్ణోయి స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి రాగా.. ఇంగ్లండ్ జట్టు ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండో టీ20లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌పై విజయాన్ని అందుకుంది.అయితే మ్యాచ్ ఆరంభానికి ముందే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఫీట్ సాధించాడు. భారత టీ20 కెప్టెన్‌గా అయ్యర్ టాస్ గెలవడం ఇది ఐదోసారి. ఈ నేపథ్యంలో అంతర్ర్జాతీయ టీ20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్లలో అత్యధికసార్లు టాస్ నెగ్గిన జాబితాలో శ్రేయస్ అయ్యర్ రోహిత్ శర్మ, ధోనిలతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరికంటే ముందు ఎంఎస్ ధోని ఏడుసార్లు (మే 2010 నుంచి ఫిబ్రవరి 2012 వరకు), విరాట్ కోహ్లి ఆరుసార్లు (ఆగస్టు 2019 నుంచి డిసెంబర్ 2019 వరకు), తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to bowl first at Trent Bridge.Updates ▶️ https://t.co/jan4S8zsaV#ENGvIND pic.twitter.com/ptcxBFxRP5— BCCI (@BCCI) July 7, 2026చదవండి: సెమీస్‌కు దూసుకెళ్లిన గాఫ్.. పిన్న వయస్కురాలిగా చరిత్ర -
గౌరవం దక్కలేదన్నాడు!.. సూర్యకుమార్ పోస్ట్ వైరల్
తన గురించి జరుగుతున్న ప్రచారంపై టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. అవన్నీ కేవలం కల్పితాలేనని.. అసత్య వార్తలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా.. టీమిండియా గొప్ప విజయాలు సాధించాలని.. జట్టుకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశాడు.ఏకంగా జట్టు నుంచే తప్పించారుకాగా ఈ ఏడాది భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్‌పై యాజమాన్యం అనూహ్య రీతిలో వేటు వేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచినా.. ఆటగాడిగా విఫలమయ్యాడనే కారణంతో అతడిని ఏకంగా జట్టు నుంచే తప్పించారు సెలక్టర్లు.సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. అయితే, శ్రేయస్ సారథ్యంలో.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో టీమిండియాకు ఇటీవల ఘెర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్ పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా ఊహించని విధంగా 2-0తో క్లీన్‌స్వీప్ అయింది.అనంతరం ఇంగ్లండ్ పర్యటనను కూడా ఓటమితోనే మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై విమర్శలు వస్తున్నాయి. సూర్యను తప్పించి పొరపాటు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ సైతం ఇలాగే స్పందించాడనే వార్త వైరల్ అయింది.గౌరవం దక్కలేదన్నాడు!తనను కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారో స్పష్టంగా తెలియదని.. సమాచారం కూడా ఇవ్వలేదని.. అసలు తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని సూర్య అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై సూర్య తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.సూర్యకుమార్ పోస్ట్ వైరల్‘‘భారత జట్టు కూర్పు పట్ల నేను సంతోషంగా ఉన్నాను. టీమిండియాకు మంచి జరగాలనే ఎల్లప్పుడూ కోరుకుంటాను. కుర్రాళ్లు ఎంతో గొప్పగా రాణిస్తున్నారు. వారికి నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.ముఖ్యంగా వైభవ్.. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇది ఇంకాస్త ఆసక్తిగా సాగాలని నేను కోరుకుంటున్నా. ఆడుతున్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదించు. దేశాన్ని గర్వపడేలా చేయాలి. ఇక సోషల్ మీడియాలో నేను అన్నట్లుగా ఓ వార్త ప్రచారం కావడం నా దృష్టికి వచ్చింది.అవన్నీ తప్పుడు కథనాలు. నకిలీ వార్తలను నాకు ఆపాదిస్తున్నారు. నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇలాంటి అసత్య ప్రచారాలను దయచేసి నమ్మవద్దు.భారత క్రికెట్, నా సహచర ఆటగాళ్లకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. ఇలాంటి నకిలీ వార్తల కంటే ఆట గురించిన చర్చే ఎక్కువగా ఉంటుంది. ఉండాలి కూడా’’ అని సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.చదవండి: మూడో టీ20కి ముందు వైభవ్‌కు గాయం! -
సంజూపై వేటు.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సోమవారం టీమిండియా జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టులో ఓపెనర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున సంచలన ప్రదర్శన కనబరిచిన ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ సింగ్ జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నాడు.ఇక 2026 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలవడంలో సంజూ శాంసన్‌ది కీలకపాత్ర. టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంజూ శాంసన్ ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లతో పాటు ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో ఆడినప్పటికీ విఫలమయ్యాడు. దీంతో రెండో టీ20కి శాంసన్‌ను తప్పించి వైభవ్‌కు అవకాశమిచ్చారు. ఇక జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సంజూ శాంసన్‌ను పూర్తిగా పక్కనబెట్టారు. చిన్న జట్టుతో సిరీస్ కావడంతో శాంసన్‌కు రెస్ట్ ఇచ్చి ఉంటారని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. ఇక జాతీయ జట్టుకు తొలిసారి ఎంపికైన ప్రబ్‌సిమ్రన్ ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున 168.87 స్ట్రైక్‌రేట్‌తో 510 పరుగులు సాధించాడు. ఇతర మార్పుల విషయానికొస్తే రింకూ సింగ్, మయాంక్ యాదవ్ తిరిగి రీఎంట్రీ ఇవ్వగా.. హర్ష్‌దూబే, యష్ ఠాకూర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ అశోక్ శర్మకు పిలుపొచ్చింది.జింబాబ్వే పర్యటనకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రబ్‌సిమ్రన్ (వికెట్ కీపర్).జింబాబ్వే పర్యటనలో టీమిండియా షెడ్యూల్:తొలి టీ20: జూలై 23, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)రెండో టీ20: జూలై 25, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)మూడో టీ20: జూలై 26, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)Read: టీమిండియాతో మూడో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన -
టీమిండియాలోకి యార్కర్ల కింగ్.. ఇక ఇంగ్లండ్‌కు చుక్కలే?
టీమిండియా కెప్టెన్‌గా తొలి విజయం కోసం శ్రేయస్ అయ్యర్ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్ధానంలో భారత టీ20 పగ్గాలను చేపట్టిన శ్రేయస్.. జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. అతడి సారథ్యలో భారత జట్టు వరుసగా మూడు ఓటములను చూవిచూసింది.ఐర్లాండ్‌తో తొలిసారి సిరీస్‌ను కోల్పోయిన భారత్, ఇప్పుడు ఇంగ్లండ్ టూర్లో అదే తీరును కనబరుస్తోంది. తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో మెన్ ఇన్ బ్లూ ఓటమి పాలైంది. ఇప్పుడు శ్రేయస్ సేన ఆతిథ్య జట్టుతో ట్రెండ్‌బ్రిడ్జ్ వేదికగా మూడో టీ20లో తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌తో తిరిగి గెలుపు బాట పట్టాలని భారత్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.బిష్ణోయ్‌పై వేటురెండో టీ20లో దారుణంగా విఫలమైన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై వేటు వేసేందుకు టీమ్ మేనెజ్మెంట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ తిరిగి జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. ప్రిన్స్ యాదవ్ ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో డెబ్యూ చేశాడు.తన అరంగేట్ర మ్యాచ్‌లో ప్రిన్స్ అదరగొట్టాడు. 4 ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికి ఇంగ్లండ్‌తో తొలి రెండో టీ20లకు స్పిన్నర్ బిష్ణోయ్ కోసం ప్రిన్స్‌ను గంభీర్ అండ్ కో పక్కన పెట్టింది. కానీ బిష్ణోయ్ పూర్తిగా తేలిపోవడంతో ప్రిన్స్ యాదవ్ తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడం దాదాపు ఖాయమైనట్లే. ఈ ఢిల్లీ పేసర్‌కు కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో అద్భుత బౌలింగ్ చేయగలడు. పిన్ పాయింట్ యార్కర్ల వేయడంలో దిట్ట. ప్రిన్స్ యాదవ్ పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లతో కలిసి బంతిని పంచుకోనున్నాడు. కాగా ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరపున ప్రిన్స్ అసాధరణ ప్రదర్శన చేశాడు. దీంతో జాతీయ సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు వచ్చింది. అఫ్గాన్ సిరీస్‌లో వన్డే అరంగేట్రం కూడా చేశాడు.చదవండి: శ్రీలంక గడ్డపై ద్రవిడ్ కుమారుడి విశ్వరూపం! -
పసికూన చేతిలో పరాభవం.. ఇంగ్లండ్‌లోనూ అదే తడబాటు
టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్, వరుసగా రెండు పొట్టి ప్రపంచకప్ టైటిల్స్ గెలుచుకున్న టీమిండియాకు ఏమైంది? తమకు కలిసొచ్చిన టీ20 ఫార్మాట్లో ఎందుకు విఫలమవుతోంది? ఒకప్పుడు పసికూనలను ఆటాడుకున్న భారత్,..ఇప్పుడు ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో సైతం ఘోర పరాభవాన్ని మూట కట్టుకుని అబాసుపాలైంది. ఐర్లాండ్ టూర్లో ఎదురైన ఓటముల నుంచి టీమిండియా ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. ఇంగ్లండ్ గడ్డపై అదే తీరును భారత్ కొనసాగిస్తోంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో మెన్ ఇన్ బ్లూ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. అసలు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ సరికొత్త ‘టమిండియా’ ఎందుకు తడబడుతోంది? లోపాలు ఎక్కడున్నాయి? వాటిపై ఓ లుక్కేద్దాం.కెప్టెన్సీ మార్పు కొంపముంచిందా?ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ముందు భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. కెప్టెన్సీ నుంచి మాత్రమే కాకుండా జట్టు నుంచే సూర్యను తప్పించింది. పేలవ ఫామ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ అజిత్ అగార్కర్ తెలిపాడు. అతడి స్ధానంలో మరో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు భారత టీ20 జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో కెప్టెన్‌గా విజయవంతమైన అయ్యర్.. అంతర్జాతీయ క్రికెట్లో కూడా టీమిండియాను అదేవిధంగా నడిపిస్తాడని అంతా భావించారు. కానీ అయ్యర్ ఆరంభంలోనే అందరి అంచనాలను తారు మారు చేశాడు. కెప్టెన్‌గా తన తొలి మూడు మ్యాచ్‌లలోనూ ఓటమి చవిచూశాడు. అయితే సూర్య విషయానికి వస్తే.. అతడి ఫామ్ దిగజారిన మాట వాస్తవే. కానీ కెప్టెన్‌గా మాత్రం అతడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ సుమారు 80 శాతం విజయాలను సాధించింది. ఆసియాకప్, ప్రపంచకప్‌లతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి ప్రధాన టీ20 సిరీస్‌లో కూడా భారత్ గెలుపొందింది. దీంతో ఇప్పుడు సూర్యను అంతా గుర్తు చేసుకుంటున్నారు. సూర్య వుంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో కనీసం మూడో టీ20లోనైనా అయ్యర్ కెప్టెన్‌గా తొలి విజయాన్ని అందుకుంటాడో లేదో వేచి చూడాలి.సరిపోని స్కోర్లు.. స్ట్రైక్ రేట్ పెంచాల్సిందేఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 190 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ.. ఆధునిక టీ20 క్రికెట్లో అది ఏ మాత్రం సరిపోదని మరోసారి రుజువైంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చెప్పినట్లు, ఈ మ్యాచ్‌లో భారత్ మరో 20 పరుగులు తక్కువగా చేసింది. అంతేకాకుండా మిడిల్ ఓవర్లలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోతున్నారు. అభిషేక్ శర్మ తనదైన శైలిలో పవర్‌ప్లేలో దుమ్ములేపుతుంటే.. ఆ తర్వాత రన్‌రేట్‌ను అదే వేగంతో కొనసాగించడంలో మన బ్యాటర్లు విఫలమవుతున్నారు. ఐర్లాండ్ సిరీస్‌లో కూడా ఇదే జరిగింది. మిడిల్ ఓవర్లలో వికెట్లు కాపాడుకునే క్రమంలో డాట్ బాల్స్ ఎక్కువగా ఆడుతున్నారు. దీంతో స్కోర్ వేగం తగ్గి భారీ టార్గెట్లను ప్రత్యర్ధి ముందు భారత్ ఉంచలేకపోతుంది. కచ్చితంగా భారత బ్యాటర్లు తమ స్ట్రైక్ రేట్ పెంచాల్సిందే.తేలిపోతున్న బౌలర్లుమరోవైపు భారత బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. పరుగులను కట్టడి చేయలేక తేలిపోతున్నారు. మాంచెస్టర్ టీ20లో కూడా అదే జరిగింది. 190 పరుగులను డిఫెండ్ చేసుకునే క్రమంలో భారత బౌలర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఇంగ్లండ్ బ్యాటర్లు స్వీప్‌లు, రివర్స్ స్పీప్లు ఆడుతుంటే.. మన బౌలర్లు కనీసం లెంగ్త్‌ను కూడా మార్చలేదు.కీలక సమయాల్లో చెత్త బంతులు వేసి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌కు అప్పగించారు. అర్ష్‌దీప్ మినహా ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా వంటి పేసర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లలో విజయం సాధించాలంటే కచ్చితంగా బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో మెరుగ్గా రాణించాల్సిందే. లేదంటే యూకే పర్యటనలో మరో సిరీస్ ఓటమి తప్పదు. -
బిష్ణోయ్‌ను నిందించని శ్రేయస్
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో కీలక సమయంలో ఖరీదైన ఓవర్ వేసి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడైన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెనుకేసుకొచ్చాడు. జట్టు ఓటమికి ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు.మ్యాచ్ అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ.. మ్యాచ్ ఎక్కడ మా చేతుల్లో నుంచి జారిపోయిందో నాకు తెలుసు. కానీ ఒకే ఆటగాడిని చూపించి అతనినే నిందించాలనుకోవడం లేదు. 16వ ఓవర్ తర్వాత మ్యాచ్ మొమెంటం పూర్తిగా మారిపోయిందని అన్నాడు.బిష్ణోయ్ వేసిన వరుస నోబాల్స్ గురించి ప్రశ్నించగా.. ఒక నోబాల్ వేసినా అతను మరింత బలంగా తిరిగి వస్తాడని నమ్ముతున్నాను. 17వ ఓవర్లో మ్యాచ్ మా చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. అతను ఈ అనుభవం నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది.ఈ పిచ్‌పై 190 పరుగులు చాలామంచి స్కోరు. ముఖ్యంగా చివరి ఓవర్లో తిలక్ వర్మ ఆడిన అజేయ 24 పరుగుల ఇన్నింగ్స్ అసాధారణం. అదే సమయంలో జేకబ్ బేతెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని పేర్కొన్నాడు.టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కూడా శ్రేయస్ ప్రశంసలు కురిపించాడు. "అతనిలో ఏమాత్రం భయం కనిపించలేదు. గత కొన్ని నెలలుగా అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడు. అరంగేట్రం ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. అతని ఆత్మవిశ్వాసం చూడటానికి చాలా ఆనందంగా ఉంది" అని అన్నాడు.కాగా, 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 16 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 49 పరుగుల దూరంలో ఉండింది. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన రవి బిష్ణోయ్ వరుసగా రెండు నోబాల్స్ వేయగా, ఫ్రీ హిట్లను జేకబ్ బేతెల్ రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు. అదే ఓవర్లో మరో సిక్స్, ఒక ఫోర్‌తో కలిపి మొత్తం 29 పరుగులు రావడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ ఆధీనంలోకి వెళ్లింది. చివరకు ఆతిథ్య జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. -
శ్రేయస్ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి
భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన తొలి భారత కెప్టెన్‌గా అపఖ్యాతి పాలయ్యాడు. కొద్ది రోజుల కిందట ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్.. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు, ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇలా చూస్తే శ్రేయస్ భారత టీ20 కెప్టెన్‌గా తన కెరీర్‌ను హ్యాట్రిక్ ఓటములతో మొదలుపెట్టాడు.ఈ అవాంఛనీయ రికార్డులతో పాటు శ్రేయస్ మరో అపఖ్యాతిని కూడా మూటగట్టుకున్నాడు. కెప్టెన్‌గా చివరి 11 మ్యాచ్‌ల్లో ఏకంగా 9 మ్యాచ్‌ల్లో తన జట్టును గెలిపించలేకపోయాడు. భారత టీ20 కెప్టెన్‌గా కెరీర్ ప్రారంభించడానికి ముందు అతడు ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఎడిషన్‌లో శ్రేయస్ తన చివరి 7 మ్యాచ్‌ల్లో ఏకంగా ఆరింట తన జట్టును పరాజయాలబాట పట్టించాడు. ఆ ఒక్క గెలుపు చివరి లీగ్ మ్యాచ్‌లో వచ్చింది.ఈ లెక్కన శ్రేయస్ తన చివరి 11 ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక విజయం సాధించాడు. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కెప్టెన్‌గా ఘనమైన ట్రాక్ రికార్డు ఉందన్న కారణంగా టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్న శ్రేయస్ ఇలాంటి చెత్త ప్రదర్శనలు చేస్తుండటం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. భారత కెప్టెన్‌గా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ ఖాతా కూడా తెరవలేకపోవడం ఫ్యాన్స్‌ను విస్మయానికి గురి చేస్తుంది.శ్రేయస్ తాజా ఓటమి విషయానికొస్తే.. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. అభిషేక్ శర్మ (43), ఇషాన్ కిషన్ (49), శ్రేయస్ అయ్యర్ (37), తిలక్ వర్మ (24 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో టీమిండియా అరంగేట్రం చేసిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రెండు సిక్సర్లు బాదినా, 14 పరుగులకే పరిమితమై నిరాశపరిచాడు.అనంతరం 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ.. జేకబ్ బేతెల్ (78 నాటౌట్) చెలరేగి ఆడి అద్భుత విజయాన్నందించాడు. అతడికి కెప్టెన్ హ్యారీ బ్రూక్ (39), టామ్ బాంటన్ (39) సహకరించారు. ఓ దశలో ఇంగ్లండ్ గెలుపుపై ఆశలు వదులుకున్నప్పటికీ.. రవి బిష్ణోయ్ వేసిన ఓ ఓవర్ ఆ జట్టును గెలుపు ట్రాక్ ఎక్కించింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బిష్ణోయ్ ఏకంగా 29 పరుగులు సమర్పించుకొని టీమిండియా కొంపముంచాడు. ఆతర్వాత ఒత్తిడి తగ్గడంతో ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నాటింగ్హమ్ వేదికగా జులై 7న జరుగనుంది. -
టాస్ గెలిచిన టీమిండియా: అతడిపై వేటు.. వైభవ్ అరంగేట్రం
ఇంగ్లండ్‌తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఓపెనర్‌గా సంజూ శాంసన్ స్థానాన్ని పదిహేనేళ్ల వైభవ్ భర్తీ చేశాడు.టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘మేము ఈసారి కూడా తొలుత బ్యాటింగ్ చేస్తాం. మా తుదిజట్టులో ఒక మార్పు. సంజూ స్థానంలో వైభవ్ ఆడతాడు. గత రెండు నెలలుగా అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.అత్యుత్తమ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అతడు ఒత్తిడికి లోనుకాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలకడగా ఆడగలడు’’ అని వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. కాగా 15 ఏళ్ల 99 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్.. అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. మరోవైపు.. గత మూడు మ్యాచ్‌లలో విఫలమైన సంజూ (5, 0, 1)పై యాజమాన్యం వేటు వేసింది.తుదిజట్లుటీమిండియావైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.చదవండి: శ్రీలంకతో వన్డే.. భారత్ ఘన విజయం -
వీళ్ళ కోసమారా! సింహం లాంటి బుద్దోడిని పక్కన పెట్టారు
-
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైనప్పటికీ టీమిండియా ఆటగాళ్లు మాత్రం పలు రికార్డులు తమ పేరిట లిఖించుకున్నారు. ఇప్పటికే అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో అరుదైన ఫీట్ సాధించగా, తాజాగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏకంగా చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లి రికార్డును బద్దలుకొట్టాడు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులతో రాణించాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో విఫలమైన శ్రేయస్ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం బ్యాట్ ఝలిపించాడు. ఈ క్రమంలో 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 5వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా తరఫున 5వేల పరుగులు పూర్తి చేసుకున్న 29వ బ్యాటర్‌గా అయ్యర్ నిలిచాడు. 147 ఇన్నింగ్స్‌ల్లో (అన్ని ఫార్మాట్లు) అయ్యర్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఇందులో ఆరు సెంచరీలు, 37 అర్ధసెంచరీలున్నాయి. ఇక తొలి టీ20లో హాఫ్ సెంచరీ సాధించిన అయ్యర్ ఇంగ్లండ్ గడ్డపై కెప్టెన్‌గా ఫిఫ్టీ సాధించిన తొలి ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. గతంలో టీ20 కెప్టెన్‌గా కోహ్లి చేసిన 47 పరుగులే అత్యుత్తమంగా ఉండేది. 8 ఏళ్ల తర్వాత కోహ్లి రికార్డును అయ్యర్ బద్దలు కొట్టాడు. అంతేకాదు టీ20 కెరీర్లో శ్రేయస్ అయ్యర్‌కు ఇది మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (59), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68) అర్ధసెంచరీలతో రాణించారు. ఆఖర్లో శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) పవర్‌హిట్టింగ్‌తో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మూద్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, సామ్ కరన్‌లు చెరో వికెట్ పడగొట్టారు. -
అభిషేక్, దూబే మెరుపులు
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్‌తో తొలి టి20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. ఐర్లాండ్ చేతిలో రెండు టి20ల్లోనూ ఓడి సిరీస్ కోల్పోయిన టీమ్... ఇంగ్లండ్‌తో పోరును సాధికారికంగా మొదలు పెట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68; 6 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 59; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా...శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో భారీ షాట్లు ఆడాడు. అభిషేక్, అయ్యర్ మూడో వికెట్‌కు 38 బంతుల్లో 82 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాఖిబ్ మహమూద్‌కు 3 వికెట్లు దక్కాయి. మ్యాచ్ రద్దుఇంగ్లండ్ ఛేదన సమయానికి భారీ వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. కీలక భాగస్వామ్యం... భారత తుది జట్టులో టీనేజర్ వైభవ్ సూర్యవంశీకి మరోసారి చోటు దక్కలేదు. సంజు సామ్సన్ (1) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలం కాగా, ఇషాన్ కిషన్ (0) మళ్లీ రనౌట్ కావడంతో 6 పరుగులకే భారత్ 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అభిషేక్, అయ్యర్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అభిషేక్ తనదైన శైలిలో ధాటిగా చెలరేగగా, కెప్టెన్‌గా తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన అయ్యర్ ఈ సారి జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. డాసన్ ఓవర్లో సిక్స్ కొట్టిన అభిషేక్ మహమూద్ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదాడు. ల్యూక్‌వుడ్ ఓవర్లోనూ వరుసగా 3 ఫోర్లు కొట్టిన అతను 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ అవుటైన తర్వాత భారత్ జోరును నిలువరించడంలో ఇంగ్లండ్ బౌలర్లు సఫలమయ్యారు. 8 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 87/2 కాగా...తర్వాతి 6 ఓవర్లలో జట్టు 38 పరుగులే చేయగలిగింది. తిలక్‌వర్మ (13) ప్రభావం చూపలేకపోగా, 38 బంతుల్లో అయ్యర్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయ్యర్ వెనుదిరిగాక దూబే దూకుడుతో భారత్ మెరుగైన స్కోరుతో ముగించగలిగింది. రషీద్ బౌలింగ్‌లో అతను కొట్టిన 2 సిక్స్‌లు హైలైట్‌గా నిలిచాయి.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) బాంటన్ (బి) మహమూద్ 1; అభిషేక్ (ఎల్బీ) (బి) కరన్ 59; ఇషాన్ కిషన్ (రనౌట్) 0; అయ్యర్ (ఎల్బీ) (బి) మహమూద్ 68; తిలక్ (సి) డాసన్ (బి) మహమూద్ 13; దూబే (నాటౌట్) 42; హర్షిత్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 0; అక్షర్ (రనౌట్) 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–88, 4–124, 5–165, 6–174, 7–189. బౌలింగ్: ల్యూక్‌వుడ్ 3–0–35–0, మహమూద్ 4–0–33–3, డాసన్ 3–0–26–0, జాక్స్ 3–0–30–0, రషీద్ 4–0–39–1, స్యామ్ కరన్ 3–0–25–1. -
బెదిరింపులకు భయపడం వైభవ్ ఎంట్రీపై కెప్టెన్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
-
నాకు సూర్య అవన్నీ చెప్పాడు: శ్రేయస్ అయ్యర్
టీమిండియా టీ20 కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయింది. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైనా విమర్శల వర్షం కురుస్తోంది.ఇక ఐర్లాండ్ పర్యటన ముగించుకున్న టీమిండియా ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్‌కు.. మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రశ్న ఎదురైంది.సూర్య నాతో మాట్లాడాడుఇందుకు బదులిస్తూ.. ‘‘సూర్యకుమార్ యాదవ్, నేనూ దాదాపుగా ఒకేలా ఆలోచిస్తాము. దేశవాళీ క్రికెట్లో అతడితో కలిసి చాలా ఏళ్లు ఆడాను. ఇక్కడికి వచ్చేముందు కూడా సూర్య నాతో మాట్లాడాడు.యాజమాన్యం ఎలా పనిచేస్తుంది.. వివిధ సందర్భాల్లో ఆటగాళ్లు ఎలా స్పందిస్తారు.. వారి ఆలోచనలు ఏవిధంగా ఉంటాయన్న అంశాలపై నాకు ఇన్పుట్స్ ఇచ్చాడు. మా మధ్య సంభాషణ అర్థవంతంగా సాగింది. అతడి నుంచి నేర్చుకోవాల్సి చాలానే ఉంది’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.అనూహ్య రీతిలో వేటు కాగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌పై యాజమాన్యం అనూహ్య రీతిలో వేటు వేసింది. కెప్టెన్‌గా రాణించినా బ్యాటర్‌గా విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, సూర్యకు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మరొక్క అవకాశం ఇస్తారని భావించినా.. యాజమాన్యం మాత్రం అతడిని సారథ్య బాధ్యతల నుంచే కాకుండా.. జట్టు నుంచీ తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.చదవండి: IND vs ENG: షెడ్యూల్, జట్లు.. టైమింగ్స్.. పూర్తి వివరాలు -
వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తిప్పికొట్టిన శ్రేయస్
ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద వివాదం నడుస్తోంది. ఆ సిరీస్‌లో వైభవ్ తప్పక అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నా, చివరికి అతనికి ప్లేయింగ్ XIలో చోటు దక్కలేదు. దీంతో టీమిండియా మేనేజ్మెంట్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ వివాదంలోకి రాజకీయ నాయకులు కూడా ఎంటయ్యారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వైభవ్‌ను ఐర్లాండ్ సిరీస్‌లో ఆడించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్, గౌతమ్ గంభీర్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సూచించినా వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకోలేదంటూ టీమిండియా మేనేజ్మెంట్పై ధ్వజమెత్తారు. ఓ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ పేపర్ స్టేట్మెంట్ను సోషల్‌మీడియాలో ట్యాగ్ చేస్తూ టీమిండియా సిస్టమ్‌పై అసహనం వ్యక్తం చేశారు.గిరిరాజ్ సింగ్ చేసిన రచ్చపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తాజాగా స్పందించాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ..తాను సోషల్ మీడియా లేదా న్యూస్ ఛానల్స్‌లో వచ్చే ఒత్తిడిని పట్టించుకోనని, జట్టు అవసరాలు మరియు ప్రదర్శన ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నాడు. దీంతో వైభవ్ అరంగేట్రంపై వస్తున్న రాజకీయ ఒత్తిడిని నేరుగా తిప్పికొట్టాడు.ఇదిలా ఉంటే, ఇవాళ ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టీ20లోనూ వైభవ్ అరంగేట్రం అనుమానమేనని తెలుస్తోంది. భారత మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్ అందరూ ముక్తకంఠంతో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌కు వత్తాసు పలుకుతున్నారు. దీన్ని బట్టి నేటి మ్యాచ్‌లోనూ వైభవ్ అరంగేట్రం లేనట్లే అన్న విషయం స్పష్టమవుతుంది. ఈ లెక్కన వైభవ్ అరంగేట్రం కోసం మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. -
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
యూకే పర్యటనలో ఉన్న టీమిండియాకు మరో కఠిన సవాల్ ఎదురు కానుంది. జూలై 1 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల తొలి టీ20 డర్హామ్ వేదికగా బుధవారం జరగనుంది. ఐర్లాండ్ చేతిలో ఎదరైన ఘోర పరాభవం నుంచి తిరిగి పుంజుకుని ఇంగ్లండ్ గడ్డపై సత్తాచాటాలని భారత్ పట్టుదలతో ఉంది.అయితే ఐర్లాండ్ సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని కనీసం ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనా ఆడిస్తారా? లేదా? అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన సంజూ శాంసన్ స్ధానంలో సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాలని చాలా మంది సూచిస్తున్నారు. మరికొందరు ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టి వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టీ20కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శ్రేయస్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జట్టు కూర్పు కోసం అయ్యర్‌ను విలేకరులు ప్రశ్నించారు. అయితే తుది జట్టు కాంబినేషన్‌ను ముందుగానే వెల్లడించడం తనకు ఇష్టం లేదని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.తొలి టీ20 కోసం మా ప్రణాళికలను సిద్దం చేసుకున్నాం. అయితే మేము ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామో బహిరంగంగా వెల్లడించలేను. ఎందుకంటే ప్రత్యర్థులకు మా వ్యూహాలు తెలిసిపోతాయి. అందుకే గోప్యంగా ఉంచాలనుకుంటున్నాను అని శ్రేయస్ పేర్కొన్నాడు.అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ గురించి విలేకరులు శ్రేయస్‌ను మరోసారి ప్రశ్నించారు. అయితే సూర్యవంశీ జట్టులో ఉంటాడా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వకుండా అయ్యర్.. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగుపై ప్రశంసల జల్లు కురిపించాడు."సూర్యవంశీ అద్భుతమైన ఆటగాడు. వైభవ్ వంటి గన్ ప్లేయర్‌ను బెంచ్‌లో కూర్చోబెట్టడం కెప్టెన్‌గా ఎంత కష్టమో నాకు తెలుసు. అలాగే అతడికి ఎప్పుడు అవకాశం ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోవడం టీమ్ మేనేజ్మెంట్కు కూడా సవాల్‌గా మారింది. ఎందుకంటే గత కొన్ని సిరీస్‌లుగా అద్భుతంగా రాణించిన ఎంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ప్రస్తుతం జట్టులో ఉన్నారు. కాబట్లట్టి సీనియర్లకు మద్దతుగా నిలవాల్సిన అవసరముంది. కానీ వైభవ్‌కు ఎప్పుడు అవకాశం వచ్చినా ఖచ్చితంగా అత్యుత్తమంగా రాణిస్తాడన్న నమ్మకం నాకు ఉందని" శ్రేయస్ వెల్లడించాడు. అయితే శ్రేయస్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైభవ్‌కు మరోసారి నిరాశే ఎదురయ్యే అవకాశముంది.చదవండి: ఆస్ట్రేలియాకు గుడ్ బై.. వేరే దేశానికి ఆడనున్న స్టార్ ఆల్‌రౌండర్ -
'అదే టీమిండియా కొంపముంచింది'.. ప్లేయర్లపై గవాస్కర్ ఫైర్
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన ప్రస్థానాన్ని ఓటమితో ఆరంభించాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 తేడాతో క్లీన్ స్వీప్ అయింది. ఈ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌పై భారత్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోయిన రికార్డు లేదు. కానీ ఇప్పుడు వరుసగా మ్యాచ్‌లలోనూ ఓడిపోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదొక మాయని మచ్చ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్ల నిర్లక్ష్య వైఖరిపై కూడా గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌లో ఒకరిద్దరూ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమిండియా ఛేదించలేక చతికలపడడం గమనార్హం."జూన్ 28(ఆదివారం) అనేది భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుగా నిలిచిపోతుంది. మ్యాచ్‌లో ఓడిపోవడం, సిరీస్‌ను కోల్పోవడం సహజం. కానీ ఏ జట్టు చేతిలో ఓడిపోయామనేది ముఖ్యం. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి, వాటిలో కొన్నింటిలో నేను కూడా భాగమయ్యాను. అయితే ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోవడం మాత్రం ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఘెర పరాభావంగా చెప్పుకోవాలి.ఒకవేళ ఐర్లాండ్ అద్భుతమైన క్రికెట్ ఆడి గెలిస్తే ఆ బాధ ఇంతగా ఉండేది కాదు. కానీ భారత ఆటగాళ్లలో కనిపించిన మితిమీరిన ఆత్మవిశ్వాసం, నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ఓటమి ఎదురైంది. అదే నన్ను ఎక్కువగా బాధించింది. ఈ ఓటమి 1983 ప్రపంచ కప్ ఫైనల్లో వెస్టిండీస్ ప్రదర్శనను గుర్తు చేసింది. ఆ సమయంలో భారత బౌలర్లు తెలివిగా, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారు.మ్యాచ్‌ను ఈజీగా ముగించేలా కనిపించిన వివ్ రిచర్డ్స్‌ను అవుట్ చేస్తూ కెప్టెన్ కపిల్ దేవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అప్పుడు వెస్టిండీస్ బ్యాటర్లు ఔటైన తీరును గమనిస్తే అతివిశ్వాసం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్‌లో భారత బ్యాటర్లు కూడా అదే తప్పు చేశారు" అని స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నారు.చదవండి: IND vs IRE: భారత్‌పై ఘన విజయం.. ఐర్లాండ్‌కు భారీ షాక్ -
IND vs IRE: గంభీర్‌పై ఐస్లాండ్ క్రికెట్ పోస్ట్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్ టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు.. అనూహ్య రీతిలో తొలి టీ20లో ఓటమి పాలైంది. ఆటలో గెలుపోటములు సహజం.. రెండో మ్యాచ్‌లోనైనా తప్పు దిద్దుకుంటారని భావించిన అభిమానులకు మరోసారి భంగపాటే ఎదురైంది.ఒక్క పరుగు తేడాతో..తాజాగా రెండో టీ20 మ్యాచ్‌లోనూ శ్రేయస్ అయ్యర్ సేన ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలై.. సిరీస్‌ను చేజార్చుకుంది. ఇక ఐర్లాండ్ తొలిసారి టీమిండియాను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి తమ క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మరోసారి విమర్శకులకు టార్గెట్ అయ్యాడు. ఆల్రౌండర్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామంటే ఫలితం ఇలాగే ఉంటుందంటూ గంభీర్‌కు మాజీ క్రికెటర్లు చురకలు అంటిస్తున్నారు.మిడిలార్డర్లో నిఖార్సైన బ్యాటర్ కావాలిఐర్లాండ్ చేతిలో టీమిండియా పరాభవం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం గంభీర్‌పై విమర్శనా బాణాలు ఎక్కుపెట్టాడు. ‘‘గంభీర్ మార్గదర్శనంలో ఇది జరిగింది. అయితే, ఇప్పుడే ఓ అంచనాకు రాకూడదు. కానీ ఇక్కడ ఆల్‌రౌండర్లకే ప్రాధాన్యం కదా!..నిజానికి టీమిండియాకు మిడిలార్డర్లో నిఖార్సైన బ్యాటర్ అవసరం ఉంది’’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఇక తమదైన శైలిలో ట్వీట్లు చేస్తూ నెటిజన్లను అలరించే ఐస్లాండ్ క్రికెట్ సైతం ఈసారి గంభీర్ పట్ల కాస్త వ్యంగ్యంగానే స్పందించింది.మాకు కోచ్‌గా వద్దు‘‘గౌతం గంభీర్‌ను మా జట్టుకు హెడ్‌కోచ్‌గా కోరుకోవడం లేదని ధ్రువీకరిస్తున్నాం. అతడు గొప్ప ప్రతిభావంతుడు. అయినప్పటికీ మాకైతే వద్దు. ఐర్లాండ్‌లో ఏదైతే జరిగిందో.. నిజంగా ఆ ఫలితాలు నిజంగా చిరకాలం గుర్తుండిపోయే బహుమతులు’’ అంటూ ఐస్లాండ్ క్రికెట్ సెటైర్లు వేసింది.ఛీ.. ఆఖరికి వీళ్లకూ లోకువైపోయాం!దీంతో.. ‘ఛీ.. ఆఖరికి అనామక క్రికెట్ బోర్డు చేతిలోనూ మాటలు పడేలా చేశారు’ అంటూ గంభీర్, ఆటగాళ్లపై భారత జట్టు అభిమానులు మండిపడుతున్నారు. కాగా బెల్ఫాస్ట్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా.. ఐర్లాండ్‌ను 154 పరుగులకు కట్టడి చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన భారత్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.చదవండి: అభిషేక్, సంజూ వల్ల టీమిండియాకు అప్రతిష్ట We can confirm that we don't wish to add Gautam Gambhir to our coaching staff. He clearly has talent, though. To take those Indian players and deliver those results in Ireland takes truly remarkable gifts.— Iceland Cricket (@icelandcricket) June 28, 2026 -
IND vs IRE: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్
ఐర్లాండ్‌తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా బెల్ఫాస్ట్ వేదికగా ఐరిష్ జట్టు మరోసారి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా... టీమిండియా లక్ష్య ఛేదనలో తేలిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 153 పరుగులే చేసింది. ఫలితంగా ఒక్క పరుగు తేడాతో గెలుపొంది ఐర్లాండ్ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.***********************************************************************************ఎనిమిదో వికెట్ డౌన్17.5: హోలార్డ్ బౌలింగ్‌లో సూర్యాంశ్ (1) అవుట్.ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా17.2: హోలార్డ్ బౌలింగ్‌లో మెక్కార్తికి క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్‌గా వెనుదిరిగిన తిలక్ వర్మ (55). విజయానికి 16 బంతుల్లో 38 పరుగులు కావాలి.ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా16.1: హంఫ్రేస్ బౌలింగ్‌లో శివం దూబే (20) అవుట్. స్కోరు: 109-6(16.1). తిలక్ 48 పరుగులతో ఉన్నాడు.15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 104-5తిలక్ 46, శివం దూబే 17 పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ డౌన్11.3: మాథ్యూ హోలార్డ్ బౌలింగ్ టక్కర్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగిన అక్షర్ పటేల్ (14). స్కోరు: 74-5(11.3)పది ఓవర్లలో టీమిండియా స్కోరుతిలక్ వర్మ 27 , అక్షర్ పటేల్ 12 పరుగులతో ఉన్నారు. విజయానికి 60 బంతుల్లో 89 పరుగులు కావాలి. వర్షం వల్ల ఆటకు అంతరాయంఎనిమిది ఓవర్ల తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. భారత్ విజయానికి 72 బంతుల్లో 101 పరుగులు కావాలి. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి.ఎనిమిది ఓవర్లలో టీమిండియా స్కోరు: 54-4అక్షర్ పటేల్ ఏడు, తిలక్ వర్మ 21 పరుగులతో ఉన్నారు.పవర్ ప్లేలో టీమిండియా స్కోరు:41-4(6)తిలక్ 14, అక్షర్ పటేల్ 1 పరుగుతో ఉన్నారు. విజయానికి 84 బంతుల్లో 114 పరుగులు కావాలి.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్4.5: జై ముంద్రా బౌలింగ్‌లో తిలక్ వర్మ బంతిని ఎదుర్కోగా.. ఇషాన్ (12) సింగిల్ కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. స్కోరు: 35-4(4.5). తిలక్ వర్మ 13 పరుగులతో ఉండగా.. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు.మూడో వికెట్ డౌన్2.4: జై ముంద్రా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (7 బంతుల్లో 10) బౌల్డ్. స్కోరు: 19-3(2.4). విజయానికి 136 పరుగులు కావాలి. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (9*) క్రీజులో ఉన్నారు.సంజూ, అభిషేక్ శర్మ డకౌట్తొలి ఓవర్లోనే ఐర్లాండ్ లెఫ్టార్మ్ పేసర్, భారత సంతతి ఆటగాడు జై ముంద్రా సంచలనం సృష్టించాడు. తొలి బంతికే సంజూను గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపిన జై.. నాలుగో బంతికి అభిషేక్ శర్మను డకౌట్ చేశాడు. భారత్ స్కోరు: 1-2(0.5). ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.టీమిండియా టార్గెట్ ఎంతంటే?ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు19.6: ఆఖరి బంతికి ఇషాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన మెక్కార్తి (2)19.4: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హ్యారీ టెక్టార్ (53).ఆరో వికెట్ డౌన్18.3: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా వెనుదిరిగిన జార్జ్ డాక్రెల్ (14 బంతుల్లో 19). స్కోరు 144-6(18.4)👉 వర్షం అంతరాయం.. నాలుగు నిమిషాల్లో మళ్లీ మొదలైన మ్యాచ్ (7.28 PM)ఐదో వికెట్ డౌన్14.5: వరుసగా రెండో వికెట్ తీసిన శివం దూబే. డెలానీని బౌల్డ్ చేసి డకౌట్‌గా వెనక్కి పంపిన దూబే. స్కోరు: 113-5(14.5). జార్జ్ డాక్రెల్ క్రీజులోకి వచ్చాడు. పదిహేను ఓవర్లలో ఐర్లాండ్ స్కోరు: 114-5(15).నాలుగో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్14.4: శివం దూబే బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన బెంజమిన్ (23 బంతుల్లో 37). క్రీజులోకి డెలానీ. స్కోరు: 113-4(14.4). హ్యారీ టెక్టార్ 37 పరుగులతో ఉన్నాడు.సెంచరీ కొట్టిన ఐర్లాండ్13.2: హర్షిత్ రాణా బౌలింగ్ ఫోర్ బాదిన బెంజమిన్. సెంచరీ పూర్తి చేసుకున్న ఐర్లాండ్. 102-3(13.3).12 ఓవర్లలో ఐర్లాండ్ స్కోరు: 88-3బెంజమిన్ 18, హ్యారీ టెక్టార్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.మూడో వికెట్ డౌన్7.3: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగిన లోర్కాన్ టక్కర్ (18 బంతుల్లో 15). ఐర్లాండ్ స్కోరు: 50-3 (8). బెంజమిన్, హ్యారీ టెక్టార్ క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్2.2: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రాస్ అడైర్ (7 బంతుల్లో 16). కెప్టెన్ లోర్కాన్ టక్కర్ క్రీజులోకి వచ్చాడు. ఐర్లాండ్ స్కోరు: 26-2(3). టక్కర్ 1, హ్యారీ టెక్టార్ 4 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఐర్లాండ్1.5: హర్షిత్ రాణా బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ఇచ్చి పెవిలియన్ చేరిన టిమ్ టెక్టార్ (6 బంతుల్లో 5). హ్యారీ టెక్టార్ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరి అరంగేట్రంఈ మ్యాచ్ సందర్భంగా తమ జట్టు తరఫున సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ (టీ20) అరంగేట్రం చేస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. సూర్యాంశ్ ఐపీఎల్లో సత్తా చాటాడని.. అతడి ఆట తీరుపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు. అయితే, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది.తొలి టీ20లో విఫలమైన వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణపై వేటు పడింది. వారిద్దరి స్థానాల్లో సూర్యాంశ్, ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు. అయితే, ఐర్లాండ్ మాత్రం తొలి టీ20లో టీమిండియాపై గెలుపొందిన జట్టునే కొనసాగించింది. కాగా బెల్ఫాస్ట్ వేదికగా తొలి టీ20లో ఆతిథ్య ఐర్లాండ్ టీమిండియాను 34 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా తొలిసారి భారత జట్టుపై గెలుపు నమోదు చేసింది.తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.ఐర్లాండ్టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(కెప్టెన్, వికెట్ కీపర్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై ముంద్రా, మాథ్యూ హోలార్డ్. -
ఐర్లాండ్ చేతిలో ఓటమి.. కెప్టెన్‌గా నాకు గొప్ప ఆరంభం
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. పసికూనలా భావించే ఐర్లాండ్ చేతిలో భారత జట్టు అనూహ్య రీతిలో ఓడిపోయింది. బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ సేన 34 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో పరాజయం పాలైంది.టక్కర్ అర్ధ శతకం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాపార్డర్‌ను కుదేలు చేసి శుభారంభం అందుకున్నా.. తర్వాత దానిని కొనసాగించలేకపోయింది. ఐరిష్ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన లోర్కాన్ టక్కర్ మెరుపు అర్ధ శతకం (38 బంతుల్లో 50)తో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. గెరాత్ డెలనీ (50) కూడా రాణించాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు.. శివం దూబే ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమింఇయా 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అభిషేక్ ఒక్కడే..ఓపెనర్ అభిషేక్ శర్మ (49) చెలరేగినా మిగతా వారి నుంచి అతడికి సహకారం అందలేదు. లోయర్ ఆర్డర్లో శివం దూబే (14 బంతుల్లో 25) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఐర్లాండ్ చేతిలో టీమిండియా తొలిసారి టీ20 మ్యాచ్‌లో పరాజయం నమోదు చేసింది.ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఇదొక గొప్ప ఆరంభం అని పేర్కొనడం గమనార్హం. ‘‘ఏదీ సులువుగా దొరకదు. కఠినంగా శ్రమిస్తేనే విజయం వరిస్తుంది. గతంలో ఏం జరిగిందన్న విషయంతో సంబంధం లేకుండా.. వర్తమానంలో జీవించడం ముఖ్యం.The perfect start for the Men in Blue.💙Harshit Rana strikes early, and Sanju Samson does the rest behind the stumps.👏Watch #IREvIND LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/esK99zoUwA— Sony Sports Network (@SonySportsNetwk) June 26, 2026కెప్టెన్‌గా గొప్ప ఆరంభంప్రత్యర్థిని కట్టడి చేసే అవకాశం లభిస్తే.. ఆ క్షణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చేజారనీయకూడదు. నిజానికి ఆరంభంలో మా బౌలర్లు అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. వరుసగా వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. కానీ ఆ తర్వాత మేము మొమెంటమ్ కోల్పోయాము.ఇక్కడ వాళ్లు 140 పరుగులు చేయడం గొప్పే అనిపించింది. కానీ వారిని మేము కట్టడి చేయలేకపోయాము. ఏదేమైనా ఇక్కడ గొప్ప అనుభవం లభించింది. ఇలాంటి పిచ్‌లపై మరిన్ని మ్యాచ్‌లు ఆడాలి. అప్పుడే వికెట్‌పై మాకు ఓ అవగాహన వస్తుంది. ఏదేమైనా కెప్టెన్‌గా నాకిది గొప్ప ఆరంభమే’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.చదవండి: అందుకే వైభవ్‌ను ఆడించలేదు: శ్రేయస్The moment history was made! 💚#BackingGreen | #IREvIND | #FáilteSolar pic.twitter.com/irDjNkEbK9— Cricket Ireland (@cricketireland) June 26, 2026 -
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు
ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్‌లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో అయ్యర్ చోటు సంపాదించాడు. గతంలో విరాట్ కోహ్లీ (2017లో ఇంగ్లండ్‌పై), రిషబ్ పంత్ (2022లో సౌతాఫ్రికాపై), శుబ్‌మన్ గిల్ (2024లో జింబాబ్వేపై) కెప్టెన్లుగా తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూశారు. తాజాగా వీరి సరసన శ్రేయస్ అయ్యర్ నిలిచాడు.👉2024 జనవరి నుంచి టీమిండియా ఒక్క టీ20 సిరీస్‌ను కోల్పోవడం జరగలేదు. 2023లో సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 1-1తో డ్రా చేసుకుంది. అప్పటినుంచి టీమిండియా వరుసగా 12 సిరీస్‌లు గెలుచుకోవడం గమనార్హం.👉ఇక ఐర్లాండ్ 12సార్లు (అన్ని ఫార్మాట్లు) టీమిండియాతో తలపడింది. ఇందులో 9 టీ20లు, మూడు వన్డేలున్నాయి. కాగా ఐర్లాండ్‌కు టీమిండియాపై ఇదే తొలి విజయం కావడం విశేషం.👉అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌ను ఓడించిన 11వ జట్టుగా ఐర్లాండ్ నిలిచింది. ఇక ఐర్లాండ్ చేతిలో ఓటమి చవిచూసిన 8వ దేశంగా భారత్ నిలిచింది. ఇక ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ మాత్రమే మిగిలి ఉన్నాయి. -
తప్పు చేశారు.. వైభవ్‌కు అవకాశమివ్వాల్సింది!
ఐర్లాండ్‌తో తొలి టీ20లో టీమిండియా దారుణ పరాజయం చవిచూసింది. ఐర్లాండ్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 148 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అయితే పసికూన చేతిలో ప్రపంచ నంబర్‌వన్, చాంపియన్ అయిన భారత్ ఓటమిని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసి చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్‌తో తొలి టీ20లో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటమి సంగతి పక్కనబెడితే.. ఇవాళ వైభవ్ జట్టులో ఉండుంటే అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ వచ్చేవాడు. ట్రై సిరీస్ ఫైనల్లో వైభవ్ విధ్వంసంర చూశాకా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయకపోయినా వేగంగా పరుగులు చేసేవాడు. ఆరంభంలోనే ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించేవాడేమో. అవసరమయితే 12 లేదా 13 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసేవాడేమో. అతడి విధ్వంసంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుండేదేమో. అభిషేక్ శర్మ తన స్టైల్ ఆటను ఆడినప్పటికీ, ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్‌తో పాటు ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ కూడా తక్కువ స్కోర్లకే వెనుదిరగడం టీమిండియా కొంపముంచింది. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడం టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ఆదుకుంటాడునుకున్న తిలక్ వర్మ చేతులెత్తేయడం, ఆల్‌రౌండర్ ట్యాగ్లు తగిలించుకొని బరిలోకి దిగిన శివమ్ దూబే, అక్షర్‌పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు బాధ్యతగా ఆడాల్సింది పోయి నిర్లక్ష్యంగా వికెట్లు పారేసుకోవడం కనిపించింది. ఇదంతా జరగకుండా ఉండాలని అనుకొని ఉంటే వైభవ్‌కు ఒక ఛాన్స్ ఇచ్చి ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది అన్నట్లుగా.. వైభవ్‌ను ఆడించకుండా తప్పు చేశారు అని చాలా మంది అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 🚨 🚨 Shreyas Iyer creates history in his first match as captain 🚨 🚨 INDIA LOST FOR THE FIRST TIME TO IRELAND 💥 Imagine having Vaibhav Sooryavanshi ( who could have finished the game in 12th over) & not making him play. And instead going with Test players like washington… pic.twitter.com/3fgLG08qV7— TheFakeFakeer (@TheFakeFakeer) June 26, 2026 -
వైభవ్‌ను ఆడించకపోవడంపై శ్రేయస్ వివరణ!
ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. ట్రై సిరీస్‌లో ఇండియా- ఏ తరఫున ఫైనల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిసిన వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్‌తో తొలి టీ20లో ఆడిస్తారనుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. అయితే వైభవ్‌ను ఆడించకపోవడంపై టాస్ సమయంలో శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు. అయ్యర్ మాట్లాడుతూ.. ‘బెల్ఫాస్ట్ మైదానం వాతావరణం, కండిషన్స్ మాకు పూర్తిగా కొత్తవి.. అందుకే మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. ఇక వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే.. దురదృష్టవశాత్తూ అతను ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు.. మా జట్టులో అద్భుతమైన ప్లేయర్స్ ఉండడంతో ఎవరిని తీసేయలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే గతంలో (టీ20 ప్రపంచకప్ 2026) మంచి ప్రదర్శన చేసిన సీనియర్ ప్లేయర్ల వైపే మేము మొగ్గు చూపుతున్నాం. ఖచ్చితంగా టైమ్ వచ్చినప్పుడు వైభవ్‌కు అవకాశం దక్కుతుంది. పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా టీమిండియా మేనేజ్మెంట్ పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగుతుంది’ అని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇక తొలి టీ20 కోసం కోసం భారత్ సెలక్ట్ చేసుకున్న కాంబినేషన్ లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఒక ఆల్‌రౌండర్, మరో ఇద్దరు స్పిన్నర్లని తుది జట్టులోకి తీసుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) అర్ధసెంచరీతో రాణించగా, గారెత్ డెలానీ (32 బంతుల్లో 49) మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు తీయగా, అక్షర్‌పటేల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
షాకిచ్చిన ఐర్లాండ్.. తొలి టీ20లో టీమిండియా ఓటమి
బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియాకు ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఐర్లాండ్ తొలి టీ20లో 34 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.👉 ఐర్లాండ్‌తో తొలి టీ20లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. అక్షర్ పటేల్ (15) గెరాత్ డెలానీ బౌలింగ్‌లో వెనుదిరగడంతో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. టీమిండియా గెలవాలంటే 18 బంతుల్లో 45 పరుగులు అవసరం. 👉 25 పరుగులు చేసిన శివమ్ దూబే జై మూండ్రా బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరగడంతో టీమిండియా 135 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.👉ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. వాషింగ్టన్ సుందర్ (9) రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. అంతకముందు ఆదుకుంటాడునుకున్న తిలక్ వర్మ (19) వెనుదిరగడంతో టీమిండియా 90 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లు ముగిసేసరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.అభిషేక్ (50) ఔట్టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (50) అర్ధశతకం సాధించిన వెంటనే వెనుదిరిగాడు. మెక్‌కార్తీ బౌలింగ్‌లో మాథ్యూ హంపెరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అభిషేక్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.అయ్యర్ విఫలం.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తడబడుతోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3) మాట్ హాలండ్ బౌలింగ్‌లో జార్జ్ డాక్రెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 60 పరుగుల వ ద్ద మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1) విఫలమయ్యారు.టీమిండియా టార్గెట్ 183 పరుగులుబెల్ఫాస్ట్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు టీమిండియా ముందు మంచి టార్గెట్‌నే నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) అర్ధసెంచరీతో రాణించగా, గారెత్ డెలానీ (32 బంతుల్లో 49) మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు తీయగా, అక్షర్‌పటేల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు జార్జ్ డాక్రెల్ (19) రూపంలో ఐర్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డాక్రెల్ వెనుదిరిగాడు.లోర్కాన్ టక్కర్ (50) ఔట్అర్ధసెంచరీ సాధించిన వెంటనే కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) హర్షిత్ రానా బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా హర్షిత్ రానాకు ఇది మూడో వికెట్ కావడం విశేషం. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. లోర్కాన్ టక్కర్ ఫిఫ్టీఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ ఫిఫ్టీ సాధించడంతో ఆ జట్టు కాస్త కోలుకుంది. 14 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 4 వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. టక్కర్ 35 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించాడు. గారెత్ డెలానీ (13) అతడికి సహకరిస్తున్నాడు.👉13 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. లోర్కాన్ టక్కర్ (43), గారెత్ డెలానీ (12) క్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్8 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (10), గరెత్ డిలేని (1) పరుగుతో ఆడుతున్నారు. శివమ్ దూబే బౌలింగ్‌లో 15 పరుగులు చేసిన బెంజమిన్ కాలిట్జ్ ప్రసిధ్ క్రిష్ణకు క్యాచ్ ఇచ్చి వెదనుదిరగడంతో నాలుగో వికెట్ కోల్పోయింది.మూడో వికెట్ డౌన్30 పరుగుల వద్ద ఐర్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రానా బౌలింగ్‌లో 17 పరుగులు చేసిన టిమ్ టెక్టర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండు వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు టీమిండియా బౌలర్లు చుక్కులు చూపిస్తున్నారు. 25 పరుగుల వద్ద ఐర్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హారీ టెక్టర్ డకౌట్ అయ్యాడు. అంతకముందు హర్షిత్ రానా బౌలింగ్‌లో ఓపెనర్ రాస్ అడైర్ (12) కీపర్ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బెల్ఫాస్ట్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత్, ఐర్లాండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 8 టీ20 మ్యాచ్‌లు జరిగితే అన్నింటిలోనూ టీమిండియానే విజయం సాధించడం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు. టైం వచ్చినప్పుడు వైభవ్ జట్టులోకి వస్తాడని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.తుది జట్లుటీమిండియా: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణఐర్లాండ్: టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(వి/సి), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై మూండ్రా, మాథ్యూ హోలార్డ్టీ20 ప్రపంచకప్‌లో రెండోసారి విజేతగా నిలిచిన తర్వాత భారత జట్టు తమ తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌కు సిద్ధమైంది. వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనే లేని శ్రేయస్ అయ్యర్... ఐపీఎల్లో కనబర్చిన నాయకత్వ ప్రదర్శనతో ఇప్పుడు తొలిసారి భారత టి20 జట్టుకు సారథిగా బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు గతంలో రెండు మ్యాచ్‌లలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన లోర్కాన్ టకర్ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఐర్లాండ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్ అంటే ఫలితం గురించి ఆలోచించాల్సిన అసవరం కూడా లేదు. సంజూ సామ్సన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ల విధ్వంసకర ఆటపై కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఐర్లాండ్‌తో తొలి టి20 మ్యాచ్ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. దానికి ఒకే ఒక్కడు కారణం. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తాడా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. -
నువ్వు అద్భుతాలు చేస్తావని నమ్ముతున్నా: గంభీర్
భారత టీ20 క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. నూతన కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన ప్రయాణాన్ని ఆరంభించేందుకు సిద్ధమయ్యాడు. ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం అతడు తొలిసారి టీమిండియా టీ20 సారథిగా బరిలోకి దిగబోతున్నాడు.కేవలం ఆటలోనే కాదు..ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పర్యటనను ఆరంభించే ముందు.. టీమిండియా కొత్త కెప్టెన్‌గా నియమితుడైన శ్రేయస్‌కు నా శుభాకాంక్షలు. జాతీయ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవం.నువ్వు ఈ బాధ్యతను చక్కగా నెరవేరుస్తూ.. అద్భుతంగా రాణించగలవని కచ్చితంగా చెప్పగలను. కేవలం ఆటలోనే కాదు.. మైదానం వెలుపలా నువ్వు గొప్పగా పనిచేయగలవు’’ అని గంభీర్.. శ్రేయస్ అయ్యర్‌ను ప్రశంసించాడు. కాగా టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 అందించిన సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసి మరీ.. యాజమాన్యం శ్రేయస్‌కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.దాదాపు మూడేళ్ల తర్వాతఈ క్రమంలో దాదాపు మూడేళ్ల తర్వాత శ్రేయస్.. ఏకంగా సారథిగా టీ20 జట్టులో పునరాగమనం చేయనున్నాడు. ఇక ఈ ముంబైకర్‌ను కెప్టెన్‌గా నియమించడంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ది కీలక పాత్ర అని సమాచారం. గంభీర్ వద్దన్నా పట్టుబట్టి మరీ శ్రేయస్నే కెప్టెన్‌గా నియమించినట్లు ప్రచారం జరుగుతోంది.గంభీర్‌తో విభేదాలు?కాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఆ జట్టుకు టైటిల్ అందించాడు. అయితే, అతడి కంటే కూడా.. అప్పుడు ఆ జట్టు మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్‌కే ఈ విషయంలో ఎక్కువగా క్రెడిట్ దక్కింది. ఈ విషయంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి.కోల్‌కతా ఫ్రాంఛైజీతో తెగదెంపులుఅనంతరం గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. శ్రేయస్ కోల్‌కతా ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లకు అతడిని కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. ఇక 2025లో బ్యాటర్‌గా.. సారథిగా సత్తా చాటి తొలి ప్రయత్నంలోనే పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు శ్రేయస్.పంజాబ్ సారథిగా సూపర్ హిట్ అయినా..అయితే, ఈ ఏడాది ఆరంభంలో వరుసగా విజయాలు సాధించిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడింది. దీంతో ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ చేరుకుండానే పంజాబ్ నిష్క్రమించింది. అయితే, ఆటగాడిగా శ్రేయస్ మాత్రం రాణించాడు. ఇక ఐపీఎల్‌తో పాటు దేశీ క్రికెట్లోనూ రాణించిన ఈ ముంబైకర్‌కు టీమిండియా యాజమాన్యం ఏకంగా కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చి.. తిరిగి జట్టులోకి తీసుకోవడం విశేషం.చదవండి: వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను బలి చేయలేము -
ఐర్లాండ్ బయల్దేరిన టీమిండియా.. ప్రత్యేక ఆకర్షణగా వైభవ్!
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా మంగళవారం చెన్నై నుంచి బయల్దేరింది. ఈ నేపథ్యంలో సిరీస్‌కు ఎంపికైన నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. చెన్నై అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో టీమిండియా బృందం ప్రత్యేక ఫ్లైట్ ఎక్కింది. 'ఐర్లాండ్ టూర్‌కు సిద్ధం’ అన్నట్లుగా వైభవ్ సూర్యవంశీ తన సహచర ప్లేయర్ అభిషేక్ శర్మతో కలిసి సెల్ఫీని పంచుకున్నాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఇదే తొలి అంతర్జాతీయ సిరీస్ కానుండడం విశేషం. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడనున్న వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్న అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులకెక్కనున్నాడు. శ్రీలంక పర్యటనలో ఇండియా-ఏ జట్టు ట్రై సిరీస్ విజేతగా నిలవడంలో వైభవ్ కూడా కీలకపాత్ర పోషించాడు. శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన ఫైనల్లో వైభవ్ 29 బంతుల్లోనే 94 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఊపులోనే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ తుదిజట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో వైభవ్ తన ప్రతాపం చూపించాల్సిన అవసరముంది. ఇక డుబ్లిన్ వేదికగా రెండు వన్డేలు ఆడనున్న టీమిండియా ఆ తర్వాత జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. జూలై 1 నుంచి 11 మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు, ఆ తర్వాత జూలై 14 నుంచి 19 మధ్య మూడు వన్డేలు ఆడనుంది. వన్డే జట్టును గిల్ నడిపించనుండగా, టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇదే తొలి సిరీస్ కానుంది. VAIBHAV SOORYAVANSHI HAS DEPARTED TO CREATE HISTORY IN IRELAND. 🇮🇳- Youngest ever to receive the Indian jersey. 🔥 pic.twitter.com/uq2ZxEceWQ— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2026Read: మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్.. అల్జీరియా సంచలన విజయం -
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా సీనియర్ బృందం నేరుగా ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ గ్యాప్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో యువకులతో నిండిన జట్టు ఐర్లాండ్ టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. అయ్యర్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి టీ20 సిరీస్ కానుండగా, వైభవ్ సూర్యవంశీ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. వీరిద్దరితో పాటు మరికొందరు కొత్త క్రికెటర్లకు కూడా రాణించేందుకు ఇదే మంచి అవకాశం కానుంది. మిగతావారి సంగతి పక్కనబెడితే ఒక నలుగురు క్రికెటర్లకు మాత్రం ఐర్లాండ్ సిరీస్ కీలకం కానుంది. వాళ్లే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్నర్ రవి బిష్ణోయి.శ్రేయస్ అయ్యర్..ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా 2025 సీజన్లో పంజాబ్‌ను ఫైనల్ చేర్చిన శ్రేయస్ అయ్యర్ 2024 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌ను విజేతగా నిలిపాడు. అయితే 2026 సీజన్లో పంజాబ్ ప్లేఆఫ్ చేరడంలో విఫలమైనప్పటికీ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ సక్సెస్ అయ్యాడు. తన కెప్టెన్సీతో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారిన సూర్యకుమార్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి ఆ బాధ్యతలు శ్రేయస్‌కు అప్పగించారు. ఐర్లాండ్‌తో సిరీస్ కెప్టెన్‌గా అయ్యర్‌కు మొదటి సిరీస్ కానుంది. అయితే బ్యాటర్‌గా తనను తాను ఎప్పుడో నిరూపించుకున్న అయ్యర్ ఇక కెప్టెన్‌గా ఐపీఎల్ ప్రదర్శనను చూపిస్తాడా లేదా అన్నది చూడాలి. 2028లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. మరి వారి అంచనాలను ఎంతమేర అందుకుంటాడనేది ఐర్లాండ్ సిరీస్‌తో తేలిపోనుంది.వైభవ్ సూర్యవంశీ..ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఆదివారం ముగిసిన ట్రై సిరీస్ ఫైనల్లో టీ20 తరహా బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. కొద్దిలో ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ 11 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతకముందు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున విధ్వంసం సృష్టించిన వైభవ్ 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఎగురేసుకుపోయాడు. వన్డే క్రికెట్లోనూ టీ20 తరహా ఆటతీరును ప్రదర్శించిన వైభవ్ పొట్టి ఫార్మాట్లో మరింత రెచ్చిపోయేందుకు ఆస్కారముంది. అయితే తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండడం వైభవ్‌పై అంచనాలను పెంచేసింది. ఇంగ్లండ్‌తో టూర్‌కు ముందు ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో అంచనాలను అందుకొని భారీ స్కోర్లతో చెలరేగాలని వైభవ్ భావిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన వైభవ్‌కు ఆ జట్టులో చోటు దక్కడం కాస్త కష్టమే అయినప్పటికీ, ఐర్లాండ్‌తో సిరీస్‌లో రాణిస్తే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లోనూ ఆడే అవకాశాలు మెండుగా ఉంటాయి.నితీశ్‌కుమార్ రెడ్డి..హార్దిక్ పాండ్యా గాయపడడంతో ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు నితీశ్‌కుమార్ రెడ్డికి ఇదే మంచి అవకాశం. ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన నితీశ్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో కీలక సమయాల్లో రాణించగలడన్న పేరున్న నితీశ్‌కుమార్ ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే టెస్టు ఫార్మాట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్న నితీశ్‌రెడ్డి టీ20 జట్టులోనూ తన స్థానాన్ని నిలుపుకునేందుకు ఐర్లాండ్ టూర్ మంచి అవకాశం అని చెప్పొచ్చు.రవి బిష్ణోయి..ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు గాయంతో వరుణ్ చక్రవర్తి దూరం కావడంతో అతడి స్థానంలో రవి బిష్ణోయి చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ వన్డేలకు పరిమితం కావడంతో టీ20ల్లో రాణించేందుకు రవి బిష్ణోయికు ఐర్లాండ్సిరీస్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన రవి బిష్ణోయి 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్‌తో సిరీస్‌లో రవి బిష్ణోయి ఫ్రంట్‌లైన్ స్పిన్నర్‌గా సేవలందించేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జూన్ 26 (శుక్రవారం) బెల్ఫాస్ట్ వేదికగా జరగనుంది.Read: 90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన! -
కెప్టెన్ అవ్వగానే రేంజ్ మారింది.. ముంబైలో శ్రేయస్ ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
-
షాకింగ్.. శ్రేయస్ అయ్యర్ ఇంటి అద్దె రూ.7.14కోట్లు
టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబైలో అత్యంత విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నాడు. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ 'స్క్వేర్ యార్డ్స్' ప్రకారం.. వర్లీ ప్రాంతంలో ఉన్న ఈ ఖరీదైన అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ కోసం మూడేళ్ల కాలానికి గాను ఏకంగా రూ.7.14 కోట్లతో అయ్యర్ లీజు ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఈ ఫ్లాట్ సుమారు 3,875 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్లాట్‌తో పాటు అయ్యర్‌కు నాలుగు కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించబడ్డాయి. ఈ లీజ్ ఒప్పందం మొత్తం 36 నెలల కాలపరిమితికి కుదిరింది. ప్రతి సంవత్సరం అద్దె సుమారు 7 శాతం చొప్పున పెరుగుతుంది. దీనికి సంబంధించి జూన్ 10న రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. ఈ ఒప్పందం కోసం రూ. 1.84 లక్షల స్టాంప్ డ్యూటీ అయ్యర్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ముంబై రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది.నెలవారీ అద్దె మొదటి సంవత్సరం- రూ.18.50 లక్షలురెండూ సంవత్సరం- రూ.19.79 లక్షలుమూడో సంవత్సరం-రూ.21.18 లక్షలునూతన సాథిగా అయ్యర్కాగా ఇటీవల శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ స్ధానంలో అయ్యర్‌కు జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. అయ్యర్ ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ నుంచి భారత కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నారు.చదవండి: IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం వాయిదా? -
కెప్టెన్ గా శ్రేయస్... ఆనందంతో అయ్యర్ తండ్రి డాన్స్ వైరల్ అవుతున్న వీడియో
-
టీం ఇండియా కెప్టెన్సీపై అయ్యర్ ఫస్ట్ రియాక్షన్
-
కెప్టెన్ అయ్యాక శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత టీ20 కెప్టెన్‌గా నియమితుడయ్యాక శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి పనిచేయబోతున్న నేపథ్యంలో, తన నాయకత్వ శైలిని మార్చుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.ప్రస్తుతం ముంబై టీ20 లీగ్ ఆడుతున్న అయ్యర్ ఓ సందర్భంగా మాట్లాడుతూ.. భారత జట్టు కెప్టెన్సీ పెద్ద సవాలే కానీ, దాని కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఇంతకుముందు ఎలా ఉన్నానో, ఇకపై కూడా అలాగే ఉంటానని అన్నాడు. ఈ వ్యాఖ్యలను కొందరు గంభీర్‌కు పరోక్ష సందేశంగా అభివర్ణిస్తున్నారు.గంభీర్-అయ్యర్ గతంలో ఐపీఎల్లో కలిసి పని చేశారు. 2024లో వీరిద్దరి కాంబినేషన్లో (మెంటార్-కెప్టెన్) కేకేఆర్ టైటిల్ గెలిచింది. అంతకుముందు ఇద్దరూ ఆటగాళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడారు.అయ్యర్ శైలి ప్రత్యేకంఅయ్యర్ నాయకత్వంలో ప్రధానంగా కనిపించే అంశం ఆటగాళ్లపై నమ్మకం. ఒకసారి ఆటగాడికి అవకాశం ఇస్తే అతడికి పూర్తి మద్దతు ఇవ్వడం అయ్యర్ శైలిగా గుర్తింపు పొందింది.ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ అభివృద్ధిలో అయ్యర్ పాత్ర కీలకమని పలుమార్లు ప్రశంసలు వచ్చాయి. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవడం, ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం అయ్యర్ బలంగా భావిస్తారు. -
టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ తొలి స్పందన!
భారత జట్టు టీ20 కెప్టెన్‌గా తనను నియమించడంపై శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించాడు. ముంబై టీ20 లీగ్‌లో ముంబై ఫాల్కన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ విజయం అనంతరం మాట్లాడాడు. 'చాలా సంతోషంగా ఉంది. ఆటగాడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే పెద్ద విషయం. అలాంటిది ఒక జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప అనుభూతి. ఇది నా గౌరవాన్ని, బాధ్యతను పెంచింది. ఇన్నేళ్లుగా నాకు మద్దతిస్తూ అండగా నిలబడిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. టీ20 కెప్టెన్సీ ఇచ్చిన జోష్‌తో ఇవాళ ముంబై ఫాల్కన్స్ తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా జట్టును గెలిపించడం సంతోషంగా ఉంది. నిజంగా నాకు ఇది కేక్‌పై ఐసింగ్లాగా అనిపించింది. అయితే ఇవాళ మ్యాచ్‌లో నాకు ప్రత్యర్థిగా ఉన్న సూర్యకుమార్ దగ్గరికి వెళ్లి అతడిని ఆప్యాయంగా పలకరించాను. అతడు కూడా నాకు కెప్టెన్సీ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇది నా జోష్‌ను డబుల్ చేసింది.' అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. సూర్యకుమార్ సారథ్యంలోని ట్రంప్ నైట్స్ ఎంఎన్ఈ జట్టుపై శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ముంబై ఫాల్కన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రంప్ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (24 బంతుల్లో 48) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నూతన్ కుమార్ (34)పర్వాలేదనిపించాడు. ఫాల్కన్స్ బౌలర్లలో ప్రతమేశ్ డాకే 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఫాల్కన్స్ అయ్యర్ విజృంభణతో 16.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ట్రంప్ నైట్స్ బౌలర్లలో హితేశ్ కడమ్ 2 వికెట్లు తీశాడు.What a day for @ShreyasIyer15 😍Named #TeamIndia's T20I captain, then followed it up with a match-winning knock against Triumphs Knights MNE! 👏Watch #T20Mumbai on Star Sports & JioHotstar! pic.twitter.com/m6BeCZV1XW— Star Sports (@StarSportsIndia) June 7, 2026क्या शानदार पल है! मैच के दौरान वानखेड़े स्टेडियम में Suryakumar Yadavने Shreyas Iyer को गले लगाया। 🥹❤️मुंबई के लड़के एक-दूसरे का साथ देते हुए। 🫂❤️ pic.twitter.com/YiZmJmHaNR— 𝓢𝓸𝓷 𝓢𝓲𝓷𝓰𝓱 𝓨𝓪𝓭𝓪𝓿 (@SONSINGH_Ya) June 7, 2026చదవండి: టెస్టులో సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ! -
కెప్టెన్సీ తెచ్చిన జోష్.. శ్రేయస్ అయ్యర్ విధ్వంసం!
టీమిండియా టీ20 కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేసిన శ్రేయస్ అయ్యర్ టీ20 ముంబై లీగ్‌లో తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. మొదట మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ ఆ తర్వాత కెప్టెన్‌గా తన జట్టును గెలిపించడమే గాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. టోర్నీలో భాగంగా శనివారం సూర్యకుమార్ సారథ్యంలోని ట్రంప్ నైట్స్ ఎంఎన్ఈ జట్టుపై శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ముంబై ఫాల్కన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రంప్ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (24 బంతుల్లో 48) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నూతన్ కుమార్ (34) పర్వాలేదనిపించాడు. ఫాల్కన్స్ బౌలర్లలో ప్రతమేశ్ డాకే 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఫాల్కన్స్ అయ్యర్ విజృంభణతో 16.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ట్రంప్ నైట్స్ బౌలర్లలో హితేశ్ కడమ్ 2 వికెట్లు తీశాడు. మొత్తం మీద టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఎంపికైన రోజునే ముంబై టీ20లీగ్‌లోనూ శ్రేయస్ విజృంభించడం చూస్తుంటే కెప్టెన్సీ ఇచ్చిన ఆనందం రెట్టింపు అయింది. ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ సూర్యకుమార్‌ను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను అయ్యర్‌కు అప్పగించింది.ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన మూడు వేర్వేరు జట్లకు అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా మూడు జట్లలో చోటు సంపాదించి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. What a day for @ShreyasIyer15 😍Named #TeamIndia's T20I captain, then followed it up with a match-winning knock against Triumphs Knights MNE! 👏Watch #T20Mumbai on Star Sports & JioHotstar! pic.twitter.com/m6BeCZV1XW— Star Sports (@StarSportsIndia) June 7, 2026 View this post on Instagram A post shared by Sportskeeda Cricket (@sportskeedacricket)చదవండి: సూర్యను తొలగించడంపై రోహిత్ స్పందన! -
సూర్యను తొలగించడంపై రోహిత్ స్పందన!
టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయడంపై సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ స్పందించాడు. కెప్టెన్సీ అనేది అంత సులభంగా రాదని అయ్యర్‌ను చూస్తే తనకు స్పష్టంగా అర్థమవుతుందని తెలిపాడు. 2024లో కేకేఆర్‌కు టైటిల్ అందించిన అయ్యర్ మరుసటి ఏడాది పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా అతడి ప్రదర్శనలే ఇవాళ టీమిండియా టీ20 కెప్టెన్‌ను చేసిందని పేర్కొన్నాడు. అక్కడ నేర్చుకున్న విషయాలు ఇవాళ భారత కెప్టెన్సీకి అవసరమైన అనుభవాన్ని అందించనుందని తెలిపాడు. టీ20 ముంబై లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రోహిత్ శర్మ శనివారం మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘గత కొన్నేళ్లుగా శ్రేయస్ అయ్యర్ ఆటతీరు చూసుకుంటే అతడు కెప్టెన్‌గా అద్భుతాలు చేయబోతున్నాడనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ముంబై క్రికెటర్లకు ఏదీ సులభంగా రాదని, కెప్టెన్సీ అనే హోదాను కష్టపడి సంపాదించుకోవాలన్న విషయం శ్రేయస్‌కు తెలుసు.’అని వివరించాడు. సూర్యకుమార్‌ను టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించడంపై కూడా రోహిత్ స్పందించాడు. ‘టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ తనదైన ముద్ర వేశాడు. సూర్యకుమార్‌కు కెప్టెన్సీ అంత సులభంగా దక్కలేదన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే సూర్యకుమార్ జట్టులోకి వచ్చే సమయానికే అతడి వయసు 31 లేదా 32 ఉంటుంది. ఆ వయసులో ఫామ్‌లో ఉండడమే గొప్ప విషయం. కానీ సూర్య దానిని అధిగమించడమే కాదు టీ20 క్రికెట్లో ఆటగాడిగా, కెప్టెన్‌గా తనదైన ముద్ర వేశాడు. ఎల్లప్పుడూ పోరాడడంలో సూర్య ముందుండే వాడు. భారత్‌కు మూడో టీ20 ప్రపంచకప్ రావడంలో కెప్టెన్‌గా అతడి పాత్ర అమోఘం. తనకు వచ్చిన అవకాశాలను సూర్య రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. ఐదేళ్లలోనే అతడు టీమిండియాకు ఎంతో చేశాడు. ముంబై ఆటగాళ్లలోనే ఇది స్వతహాగా ఉన్న లక్షణం. ఏదీ ఊరికే రాదు, కష్టపడి సంపాదించుకోవాల్సిందే అన్న విషయం మా క్రికెటర్లకు తెలుసు.’ అని చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ గాయం కారణంగా అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడడం అనుమానమే. గాయంతో బాధపడుతున్న భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ ఈనెల 8న సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ (సీఓఈ)లో చేరనున్నాడు. బెంగళూరులోని ఈ సెంటర్లో అతడి ఫిట్నెస్ను పరీక్షించనున్నారు. మూడు రోజుల పాటు సీఓఈలో ఉండి, ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్ కోసం జట్టుతో చేరనున్నాడు.Rohit Sharma congraluating Shreyas Iyer for becoming the T20 Captain of India ❤️- The Mumbai Boys! pic.twitter.com/vcDf8yrPXW— Johns. (@CricCrazyJohns) June 6, 2026చదవండి: క్రీడాస్ఫూర్తిని మంటగలిపిన కేఎల్ రాహుల్! -
వైభవ్ వచ్చేశాడు...
టి20 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజేతగా నిలిపినా సరే... బ్యాటింగ్ ఫామ్ సూర్యకుమార్ యాదవ్‌కు ప్రతికూలంగా మారింది. ఊహించినట్లే సూర్యకుమార్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన సెలక్టర్లు అంతటితో ఆగకుండా జట్టునుంచే తీసేశారు. విన్నింగ్ టీమ్‌లో సభ్యులైన మరో ఇద్దరిపై కూడా వేటు పడగా... అసాధారణ బ్యాటింగ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తొలిసారి సీనియర్ టీమ్‌లోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్లో చక్కటి బ్యాటింగ్‌తో పాటు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన శ్రేయస్ కొత్త సారథిగా బాధ్యతలు చేపడుతుండగా... హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ వైస్ కెప్టెన్సీ ప్రమోషన్ సాధించాడు. ముంబై: టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న మూడు నెలల తర్వాత భారత క్రికెట్ జట్టు పలు మార్పులతో కొత్త సిరీస్‌కు సన్నద్ధమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో జరిగే టి20 సిరీస్‌ల కోసం 16 మంది సభ్యుల భారత జట్టును అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దీంతో పాటు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే 15 మంది సభ్యుల టీమ్‌ను కూడా సెలక్టర్లు ప్రకటించారు. జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్లో ఐర్లాండ్‌తో 2 టి20ల్లో తలపడిన అనంతరం భారత జట్టు జులై 2 నుంచి 11 మధ్య ఇంగ్లండ్‌తో 5 టి20లు ఆడుతుంది. శ్రేయస్‌పై నమ్మకం... టి20 ప్రపంచకప్ ప్రస్తుత విజేత 2028లో జరిగే తర్వాతి టోర్నీకి సిద్ధమయ్యేందుకు రెండేళ్లకు పైగా సమయం ఉంది. అదే ఏడాది లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కూడా భారత్ బరిలోకి దిగనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుంటూ టీమ్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ బృందంలో 31 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ నాయకుడిగా సరైన వ్యక్తి అని సెలక్టర్లు భావించారు. నిజానికి అయ్యర్ రెగ్యులర్‌గా టి20 జట్టులో సభ్యుడు కాదు. 2023 డిసెంబర్ తర్వాత అతను ఈ ఫార్మాట్లో భారత్‌కు ఆడలేదు. కానీ ఐపీఎల్ ప్రదర్శన అతడిని అందరికంటే ముందు నిలిపింది. మూడు వేర్వేరు టీమ్‌లు (ఢిల్లీ, కోల్‌తా, పంజాబ్)లను లీగ్‌లో ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌గా గుర్తింపు పొందిన శ్రేయస్ నాయకత్వంలో 2024లో కోల్‌కతా టైటిల్ నెగ్గింది. బ్యాటర్‌గా కూడా గత ఏడాది విధ్వంసకర ప్రదర్శన కనబర్చిన అతను ఈ సీజన్లో కూడా మెరుగ్గా ఆడాడు. బ్యాటర్‌గా సూర్యకుమార్‌కు బదులుగా నాలుగో స్థానానికి అతను సరిగ్గా సరిపోతాడు కూడా. తిలక్‌కు అరుదైన చాన్స్... భారత టి20 జట్టులో రెగ్యులర్‌గా మారిన తిలక్‌వర్మకు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వైస్ కెప్టెన్సీ పదవి దక్కింది. తిలక్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఎ టీమ్‌కు సారథిగా ఉన్నాడు. భారత్ తరఫున 49 మ్యాచ్‌లలో 145.54 స్టైక్‌రేట్‌తో 1390 పరుగులు సాధించిన తిలక్ ఖాతాలో 2 సెంచరీలు ఉన్నాయి. దీంతో పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున నిలకడైన ప్రదర్శన కూడా అతనికి తగినంత గుర్తింపు తెచి్చంది. అక్షర్ స్థానంలో అతను వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వైభవ్‌పై విశ్వాసం... అంచనాలకు తగినట్లుగానే కుర్రాడు వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు టీమ్‌లోకి ఎంపిక చేశారు. గత ఐపీఎల్ సీజన్లోనే ఆకట్టుకున్నా... ఈసారి మరింతగా విజృంభించి వైభవ్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా 237.30 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన వైభవ్‌ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయంగా అంతా భావించారు. అందుకే సెలక్టర్లు కూడా అతనిపై విశ్వాసం ఉంచారు. వైభవ్ ఐర్లాండ్‌తో తొలి టి20లో బరిలోకి దిగితే...భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో (15 ఏళ్ల 92 రోజులు) అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) రికార్డును బద్దలు కొడతాడు. స్థానం కోల్పోయిన రింకూ, కుల్దీప్... వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యులైనవారిలో సూర్యతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, బ్యాటర్ రింకూ సింగ్ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. రింకూ చాలా కాలంగా ఫామ్‌లో లేకపోగా... ఇటీవలి ఐపీఎల్ ఘోర వైఫల్యం కూడా కుల్దీప్పై వేటుకు ప్రధాన కారణం. ఆల్‌రౌండర్ హార్దిక్, పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్లనుంచి విశ్రాంతి కల్పించారు. నితీశ్ రెడ్డి పునరాగమనం... టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి టీమ్‌లోకి పునరాగమనం చేశాడు. అతను భారత్ తరఫున జనవరి, 2025లో ఆఖరి టి20 మ్యాచ్ ఆడాడు. ఇదే తరహాలో లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా మళ్లీ జట్టులోకి ఎంపికయ్యాడు. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఇప్పటికే ఎంపిక అయిన ఢిల్లీ పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు ఇప్పుడు టి20 టీమ్‌లో స్థానం లభించింది. ఆసియా క్రీడలకు బుమ్రా.... విశ్రాంతి అనంతరం పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియా క్రీడల్లో పాల్గొంటాడు. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రకటించిన 15 మంది టీమ్‌లో అతనికి స్థానం కల్పించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్లలో ఉన్న మొహమ్మద్ సిరాజ్ స్థానంలో బుమ్రా వస్తాడు. 16వ ఆటగాడు ప్రిన్స్‌కు కూడా ఆసియా క్రీడల టీమ్‌లో చోటు దక్కలేదు.పాపం సూర్యకుమార్!గత ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని అందించిన తర్వాత కూడా తర్వాతి సిరీస్‌కు రోహిత్ శర్మ తన వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు. రోహిత్‌తో పోలిస్తే సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఇంకా బాధాకరం. వరల్డ్ కప్ గెలిచాక కెప్టెన్సీతో పాటు అతనికి జట్టులో కూడా చోటు పోయింది. నిజానికి ప్రపంచ కప్‌కు ముందు చాలా కాలం పాటు అతని ఫామ్ పేలవంగా ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌పై మంచి ప్రదర్శనే ఇచ్చినా... ఆ తర్వాత మళ్లీ తడబాటు కనిపించింది. అయితే కీలకమైన టోర్నీకి ముందు కొత్త కెప్టెన్ వస్తే కష్టమని సెలక్టర్లు వెనక్కి తగ్గారు. మెగా టోర్నీలో అమెరికాపై మ్యాచ్ మినహా అతను అన్నింటా విఫలమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా అంతే స్థాయిలో మళ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. దాంతో సెలక్టర్లకు మరో ఆలోచన లేకపోయింది. పైగా 36 ఏళ్లకు చేరువవుతున్న ప్రస్తుత స్థితిలో మరో రెండేళ్ల తర్వాత జరిగే వరల్డ్ కప్‌కు కొనసాగించే అవకాశం ఎలాగూ లేదనేది వాస్తవం. ప్రపంచకప్, ఆసియా కప్‌లు గెలవడంతో పాటు తన సారథ్యంలో ఒక్క సిరీస్ కూడా కోల్పోని రికార్డు సూర్య సొంతం. టి20 క్రికెట్లో విధ్వంసక ఆటగాడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్ అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసినట్లే. ‘ఇది చాలా కఠిన నిర్ణయం. అతని పేలవ ఫామ్ కొంత కారణమే అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జట్టు అవసరాల కోసం తప్పలేదు. ప్రపంచ కప్‌ను గెలిపించిన తర్వాత జట్టునుంచి తప్పించడంపై చాలానే చర్చ జరిగింది. నేను కూడా అతనితో మాట్లాడి అంతా వివరించా’ అని అగార్కర్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టుశ్రేయస్ (కెప్టెన్), తిలక్ (వైస్ కెప్టెన్), అభిషేక్, సామ్సన్, వైభవ్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్, సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, సిరాజ్, అర్ష్ దీప్ , హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్. (ఆసియా క్రీడలకు సిరాజ్ స్థానంలో బుమ్రా ఎంపిక కాగా...ప్రిన్స్‌కు చోటు లేదు). -
కెప్టెన్సీ నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే 'స్కై' వీరంగం
భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను ఇవాళ (జూన్ 6) తొలగించారు. కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి కూడా అతడికి ఉద్వాసన పలికారు. కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పేరును ప్రకటించారు.త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను ఎంపిక చేశారు. ఈ మూడు జట్లలో స్కైకు చోటు లభించలేదు. తనపై వేటు పడిన తర్వాత కూడా హుందాగా వ్యవహరించి, కొత్తగా ఎంపికైన జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన స్కై.. వేటు పడిన గంటల వ్యవధిలో బ్యాట్‌తో ఫైరయ్యాడు. టీ20 ముంబై లీగ్‌లో భాగంగా సోబో ముంబై ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (రాత్రి) 24 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి (ట్రయంప్ నైట్స్ ఎంఎన్ఈ కెప్టెన్‌గా) వీరంగం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో స్కై ప్రత్యర్ది జట్టులో కొత్తగా ఎంపికై భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉండటం మరో విశేషం. మ్యాచ్‌కు ముందు స్కై శ్రేయస్‌ను హత్తుకొని వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ చూడచక్కని దృశ్యం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.ముంబై టీ20 లీగ్ మ్యాచ్ విషయానికొస్తే.. సూర్య ఔటయ్యాక అతడి జట్టు గాడి తప్పింది. 19 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. స్కై క్రీజ్‌లో ఉన్నంతసేపు అతడి జట్టు భారీ స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. తీరా చూస్తే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్ కూడా చేసేలా కనిపించడం లేదు. ప్రత్యర్ది జట్టు బౌలర్లలో ప్రథమేశ్ డాకే 3, యశ్ డిచోల్కర్ 2, సిద్దార్థ్ రౌత్, వేదాంత్ గోరే తలో వికెట్ తీసి స్కై జట్టును దెబ్బకొట్టారు. స్కై జట్టులో అతడితో పాటు అఖిల్ హెర్వాద్కర్ (12), నూతన్ కుమార్ గోయెల్ (34), మకరంద్ గిరీశ్ పాటిల్ (11) మాత్రమే అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
ఉద్వాసనకు గురైన తర్వాత సూర్య మొదటి రియాక్షన్ ఇదే..!
2026 టీ20 ప్రపంచకప్ గెలిపించిన తర్వాత కూడా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడింది. త్వరలో జరుగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్లలో అతనికి చోటు కూడా దక్కలేదు. కెప్టెన్‌గా ఉద్వాసన పలికినా, జట్టులో స్థానమైనా లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, సెలెక్టర్లు స్కైపై నిర్దయగా వ్యవహరించారు.ఇంత అవమానం జరిగినా స్కై చాలా హుందాగా వ్యవహరించాడు. తన ఉద్వాసన వార్త వెలువడిన గంటలోపే సోషల్‌మీడియా వేదికగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. "Wishing this highly skilled group all the best for challenges ahead" అంటూ పోస్ట్ చేశాడు.Suryakumar Yadav’s Instagram story. pic.twitter.com/7CGiqazniN— Mufaddal Vohra (@mufaddal_vohra) June 6, 2026స్కై పరిణితి, హుందాతనానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. తనపై వేటు పడినా జట్టుకు శుభాకాంక్షలు తెలపడం అతని గొప్పతనం అంటూ కొనియాడుతున్నారు. భారత కెప్టెన్‌గా స్కైకు మంచి ట్రాక్ రికార్డే ఉన్నప్పటికీ, వ్యక్తిగంతా ఇటీవలికాలంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ కారణంగా బీసీసీఐ అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించింది.అతడి స్థానంలో నూతన కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఎంపిక చేసింది. భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం భారత జట్లను ఇవాళ ప్రకటించాడు. ఈ మూడు జట్లకు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. అందరూ ఊహించిన విధంగానే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తొలిసారి సీనియర్ జట్టులో చోటు లభించింది. వైభవ్ మూడు జట్లలో చోటు దక్కించుకున్నాడు. తెలుగు ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ కూడా మూడు జట్లలో చోటు దక్కించుకున్నారు. తిలక్‌కు జాక్‌పాట్ కూడా తగిలింది. ఆసియా క్రీడల్లో అతడు శ్రేయస్ డిప్యూటీగా ఎంపికయ్యాడు.ఐర్లాండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణాఇంగ్లండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షియువం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఆసియా క్రీడలకు భారత టీ20 జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయి, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ -
అందుకే సూర్యను తప్పించాం: అగార్కర్
అందరూ ఊహించిందే జరిగింది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్ధానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. శ్రేయస్ గత మూడేళ్లగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి.. ఉన్నపళంగా అతడిని కెప్టెన్‌గా ప్రకటించడం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.ఐపీఎల్-2024లో కెప్టెన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిల్‌ను అందించిన శ్రేయస్.. ఆ తర్వాత సీజన్లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అంతకుముందు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కూడా అతడు విజయవంతమయ్యాడు. దేశవాళీ క్రికెట్లో సైతం ముంబై జట్టును నడిపించిన అనుభవం శ్రేయస్‌కు ఉంది.ఒక్క కెప్టెన్సీలోనే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనల పరంగా కూడా ఈ ముంబైకర్ రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత టీ20 జట్టు బాధ్యతలను అయ్యర్‌కు అప్పగించారు. ఇక శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించడంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. శ్రేయస్ ఒక లీడర్‌గానూ, బ్యాటర్‌గానూ నిలకడగా రాణిస్తున్నాడని, అందుకే అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించామని అగార్కర్ తెలిపాడు."శ్రేయస్ ఇప్పటికే కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. అతడు గత కొన్నేళ్లుగా వేర్వేరు ఫ్రాంచైజీలను (ఢిల్లీ, కోల్‌కతా, పంజాబ్ కింగ్స్) సమర్థవంతంగా నడిపించడం మనం చూశాము. అయ్యర్ కెప్టెన్సీలోనే కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచింది. వ్యక్తిగత ప్రదర్శనల పరంగా కూడా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. గత టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపికయ్యే రేసులో అతడు చివర వరకు ఉన్నాడు.కానీ టీమ్ కాంబినేషన్ కారణంగా అతడిని జట్టులోకి తీసుకోలేకపోయాము. భారత జట్టుకు వరల్డ్ కప్ అందించి, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఒక కెప్టెన్‌ను మార్చడం చాలా కష్టమైన నిర్ణయం. కానీ భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా సూర్యను తప్పించాల్సి వచ్చింది. రాబోయో రెండేళ్ల కాలం మాకు చాలా ముఖ్యం.సూర్యకుమార్‌తో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాము. అన్ని విషయాలను అతడికి వివరించాము. అందుకు అతడు సానుకూలంగా స్పందించారు. ఏదేమైనప్పటికి భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అన్ని రకాలగా శ్రేయస్ అర్హుడని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అజిత్ పేర్కొన్నాడు. -
సచిన్ రికార్డు బ్రేక్... టీమిండియాలోకి వైభవ్ అయ్యర్‌కు కెప్టెన్సీ
-
టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ ప్రకటన.. సూర్యవంశీకి ఛాన్స్
టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడి స్ధానంలో జట్టు పగ్గాలను మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌లకు జట్టు ఎంపిక సందర్భంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్‌కు డిప్యూటీగా హైదరాబాదీ తిలక్ వర్మను సెలక్టర్లు నియమించారు. వీటితో పాటు సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడలకు భారత జట్టును ప్రకటించారు. ఏషియన్ గేమ్స్‌లో కూడా టీమిండియా కెప్టెన్‌గా అయ్యర్ వ్యవహరించనున్నాడు.వైభవ్‌కు ఛాన్స్ఇక ఐపీఎల్-2026లో దుమ్ములేపిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీ20 జట్టులో చోటు కల్పించారు. దీంతో 15 ఏళ్ల సూర్యవంశీ.. భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయష్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 16 ఏళ్ల వయస్సులో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు.సూర్య ఖేల్ ఖతంఇక టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ ప్రస్ధానం ముగిసినట్లే. సారధిగా భారత్‌కు టీ20 ప్రపంచకప్-2026ను అందించినప్పటికి.. పేలవ ఫామ్, భవిష్యత్తు ప్రణాళికల కారణంగా అతడిపై వేటు వేశారు. కెప్టెన్‌గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే సూర్యను తొలగించారు. గత కొంత కాలంగా టీ20లకే పరిమితమైన సూర్యను, ఇకపై మరి భారత జెర్సీలో చూడకపోవచ్చు.ప్రిన్స్ యాదవ్‌కు చోటుమరోవైపు వైభవ్‌తో పాటు ఈ ఏడాది సీజన్లో అదరగొట్టిన లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌కు కూడా టీ20 జట్టులో చోటు దక్కింది. ప్రిన్స్ యాదవ్ ఇప్పటికే అఫ్గానిస్తాన్‌తో వన్డేలకు ఎంపికైన సంగతి తెలిసిందే.ఐర్లాండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణాఇంగ్లండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఆసియా క్రీడలకు భారత టీ20 జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయి, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ -
‘శ్రేయస్ నన్ను తిట్టాడు.. కావాలనే పదకొండో ఓవర్లో బౌలింగ్’
గతేడాది ఐపీఎల్లో సత్తా చాటిన టీమిండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్.. ఈసారి మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. పంజాబ్ కింగ్స్ తరఫున 2025లో 17 మ్యాచ్‌లలో కలిపి ఈ లెఫ్టార్మ్ పేసర్ 21 వికెట్లు కూల్చాడు.అయితే, ఐపీఎల్-2026లో మాత్రం పద్నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం 14 వికెట్లు మాత్రమే తీశాడు అర్ష్‌దీప్ సింగ్. దీంతో ఆటగాడిగా విమర్శలు మూటగట్టుకున్న అర్ష్.. వ్యక్తిగత ప్రవర్తనతోనూ వార్తల్లో నిలిచాడు.తిలక్ వర్మపై వివక్షపూరిత కామెంట్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ఆ జట్టు ఆటగాడు తిలక్ వర్మను ‘అంధేరీ (నల్లోడా అన్న అర్థంలో)’ అని పిలిచి విమర్శలపాలయ్యాడు అర్ష్‌దీప్ సింగ్. ఆ తర్వాత యజువేంద్ర చహల్ విమానంలో వేపింగ్ (ఇ- సిగరెట్ తాగడం) చేస్తున్నట్లుగా ఉన్న వీడియో పంచుకుని వివాదానికి కారణమయ్యాడు.మొత్తానికి ఈ సీజన్లో అర్ష్‌దీప్ సింగ్ ఏ రకంగానూ అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం అతడి పట్ల గుర్రుగా ఉన్నాడని, అతడిని తిట్టాడని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అర్ష్‌దీప్ సింగ్ తాజాగా ధ్రువీకరించాడు. పంజాబ్ కింగ్స్ తరఫున హర్లీన్ డియోల్ నిర్వహించే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ..అర్ష్.. అక్కడేం చేస్తున్నావు?‘‘ఓరోజు మ్యాచ్‌లో నేను బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచాలని సరదాగా చిందులు వేస్తున్నాను. అంతలోనే శ్రేయస్ అయ్యర్ నన్ను గట్టిగా పిలిచాడు. ‘అర్ష్.. అక్కడేం చేస్తున్నావు?’ అని కాస్త కోపంగానే అడిగాడు.కావాలనే పదకొండో ఓవర్లో బౌలింగ్వెంటనే నన్ను బౌలింగ్ చేసేందుకు రమ్మన్నాడు. సాధారణంగా నేను తొలి రెండు ఓవర్లు.. అదే విధంగా 17, 20వ ఓవర్లో మాత్రమే బౌలింగ్‌కు వస్తాను. కానీ ఆరోజు శ్రేయస్ నన్ను పదకొండో ఓవర్లో బౌలింగ్ చేసేందుకు పిలిచాడు.ఆ పరిణామంతో నేను షాకయ్యాను. ఆ తర్వాత నన్ను పిలిచి కాస్త గట్టిగానే మాట్లాడాడు. మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడమన్నాడు. దృష్టి మరల్చకుండా ఏకాగ్రతతో ఉండాలని చెప్పాడు. బాగా ఆడితే.. లేదంటే అందరూ చెప్పేవాళ్లేఒక ఓవర్ నువ్వు బాగా వేశావంటే అంతా బాగానే ఉంటుంది. లేదంటే.. తిట్లు తప్పవు. ప్రతి ఒక్కరు అప్పుడు మన ‘ఫోకస్’ గురించే మాట్లాడతారు’’ అని అర్ష్‌దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.కాగా గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్.. ఈసారి కూడా ఆరంభంలో అదరగొట్టింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోయింది. అయితే, ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. శ్రేయస్, అర్ష్ తదుపరి అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో కలిసి బరిలో దిగనున్నారు.చదవండి: ‘అతడు ఉంటే టీమిండియా వరల్డ్‌కప్ గెలవదు’🔴 SHREYAS IYER WAS UNHAPPY WITH MY BOUNDARY-LINE ENTERTAINMENT - ARSHDEEP SINGH 🤯🎙️: While I was fielding on the boundary and entertaining the crowd, Shreyas Iyer suddenly called out, ‘Arsh, what are you doing there?’ and asked me to come bowl. I usually bowl the 1st, 2nd,… pic.twitter.com/iS2bcGE7O9— Sam (@cricsam02) June 6, 2026 -
నేడే భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకు ఛాన్స్?
2026 టీ20 వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత్ తమ తర్వాతి సిరీస్‌కు సమాయత్తమవుతోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో జరిగే సిరీస్‌లలో తలపడే భారత జట్లను నేడు సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. జూన్ 26న ప్రారంభమయ్యే ఈ టూర్లో భాగంగా ముందుగా ఐర్లాండ్‌తో 2 టి20లు జరుగుతాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో 5 టి20లు, 3 వన్డేలు ఉంటాయి. వీటితో పాటు సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే టీమ్‌ను కూడా అజిత్ అగార్కర్ నాయకత్వంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. సూర్యకుమార్‌పై వేటు తప్పదా! రెండు ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుల ఎంపికను మినహాయిస్తే రెండు అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. టి20 కెపె్టన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తొలగించడం ఖాయమైపోయింది. అతని సారథ్యంలో వరల్డ్ కప్ గెలుచుకున్న వెంటనే ఇది చోటు చేసుకోనుండటం గమనార్హం. 2025లో ఐసీసీ టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకొని ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన తర్వాత కూడా రోహిత్ శర్మ తన కెపె్టన్సీని కోల్పోయాడు. సూర్య విషయంలో కూడా అదే జరుగుతోంది. అయితే రోహిత్ ఆటగాడిగా తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. కానీ సూర్య టీమ్‌లో కూడా చోటు కోల్పోనున్నాడు. వరల్డ్ కప్ నెగ్గినా సుదీర్ఘ కాలంగా అతని ఫామ్ పేలవంగా ఉంది. వరల్డ్ కప్‌లో 9 ఇన్నింగ్స్‌లలో కలిపి 242 పరుగులే చేసిన సూర్య... ఐపీఎల్‌లోనూ దానిని కొనసాగిస్తూ 13 ఇన్నింగ్స్‌లలో 270 పరుగులే చేయగలిగాడు. 2028 టీ20 వరల్డ్ కప్, అదే ఏడాది జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని టి20 టీమ్‌ను సిద్ధం చేస్తున్న సెలక్టర్లు 36 ఏళ్ల సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. సూర్య స్థానంలో మరో ముంబైకర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో అతని నాలుగో స్థానాన్ని కూడా భర్తీ చేయనున్నాడు. శ్రేయస్ 2023 డిసెంబర్లో భారత్ తరఫున చివరిసారిగా టి20 ఆడినా...ఐపీఎల్లో తన బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చిన అతని నాయకత్వంలో 2024లో కోల్‌కతా విజేతగా నిలవగా... 2020, 2025లో ఢిల్లీ, పంజాబ్‌కు రన్నరప్‌గా నిలిచాయి. లాంఛనమేనా! మరోవైపు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి రావడం లాంఛనమే కావచ్చు. అసాధారణ ఆటతో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న వైభవ్‌ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఐపీఎల్లో ఏకంగా 237.30 సగటుతో అతను 776 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే భారత టీ20 జట్టు టాప్–3 అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్లతో పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో వైభవ్‌ను ఆడించడం కష్టంగా అనిపిస్తున్నా... ఆసియా క్రీడలకు మాత్రం అతను ఎంపిక కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. -
టీమిండియా కెప్టెన్ గా శ్రేయాస్.. వైభవ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
-
సూర్యకు టైమ్ లేదు!.. టీ20 కొత్త కెప్టెన్ ఖరారు!
టీమిండియా టీ20 కెప్టెన్ మార్పు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్‌కు మరికొన్నాళ్లు సమయం ఇవ్వాలని తొలుత భావించినప్పటికీ.. ఇప్పుడు బోర్డు ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.అగ్రపథంలో నిలిపి.. ప్రపంచకప్ అందించికాగా గత రెండేళ్లుగా టీ20లలో సారథిగా భారత్‌ను అగ్రపథంలో నిలిపాడు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav). ఈ ఏడాది సొంతగడ్డపై ప్రపంచకప్ టోర్నీలో చాంపియన్‌గా నిలిపి.. దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. అయితే, ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. కెప్టెన్ అయిన తర్వాత పూర్తిగా తేలిపోయాడు.ఈ నేపథ్యంలో 35 ఏళ్లపై సూర్యను కెప్టెన్సీ నుంచి తొలగించేందుకు నాయకత్వ బృందం సిద్ధమైంది. అయితే, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో అతడి ప్రదర్శన చూసిన తర్వాతే తుది నిర్ణయానికి రావాలని భావించింది. తాజాగా ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం.ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన సూర్య దారుణ వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ సీజన్లో పదమూడు ఇన్నింగ్స్ ఆడిన సూర్య కేవలం 270 పరుగులే చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 60.ఐర్లాండ్ పర్యటన నుంచే కొత్త కెప్టెన్ఈ నేపథ్యంలో సూర్యను తక్షణమే కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయానికి వచ్చినట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో తెలిపింది. ఐర్లాండ్ పర్యటన నుంచే కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.ముంబైలో శనివారం జరిగే సెలక్షన్ ప్యానెల్ సమావేశంలో అతడి పేరును అధికారికంగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్ తర్వాత టీమిండియా యూకేకు పయనం కానుంది.యూకే టూర్ సాగుతుందిలా..ఇందులో భాగంగా తొలుత జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్ వేదికగా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. తదుపరి జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లలో పాల్గొంటుంది. అనంతరం సెప్టెంబరు- అక్టోబరు మధ్య జపాన్ వేదికగా ఆసియా క్రీడల్లో భాగమవుతుంది.వైస్ కెప్టెన్‌గా తిలక్!ఇదిలా ఉంటే.. సూర్యను కెప్టెన్‌గా తొలగించడంతో పాటు.. జట్టు నుంచి కూడా అతడిని తప్పించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు పీటీఐ బుధవారం వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్‌కు డిప్యూటీగా హైదరాబాదీ తిలక్ వర్మను నియమించనున్నట్లు పేర్కొంది. అదే విధంగా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో సెలక్టర్లు చోటు ఇవ్వనున్నట్లు సదరు వార్తా సంస్థ తెలిపింది.కెప్టెన్‌గా పునరాగమనం!కాగా 2023లో చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు శ్రేయస్ అయ్యర్. ఇక ఐపీఎల్-2024లో సారథిగా కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన ఈ ముంబైకర్.. 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అయితే, ఈ ఏడాది మాత్రం ప్లే ఆఫ్స్ వరకు కూడా తీసుకువెళ్లలేకపోయాడు. ఓవరాల్‌గా గత మూడేళ్లలో ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మద్దతుతో అతడు భారత టీ20 జట్టులో దాదాపు మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. ఏకంగా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం కావడం విశేషం.చదవండి: ‘ఇండియాలో లైఫ్ కోహ్లికి అస్సలు నచ్చదు’ -
BCCI సంచలన నిర్ణయం టీ20 కెప్టెన్సీ నుండి సూర్య ఔట్?
-
టీమిండియా టీ20 కెప్టెన్సీలో ఊహించని ట్విస్ట్!
టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తొలుత సూర్యకుమార్ యాదవ్ స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను సారథిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ అందుకు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ ఒప్పుకోలేదని, అతడికి బదులుగా సంజూ శాంసన్ పేరును సూచించాడని వార్తలు వచ్చాయి.అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మాత్రం అందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. లాంగ్ టర్మ్ కెప్టెన్‌గా శాంసన్‌ను ఇప్పుడే నమ్మడం తొందరపాటు అవుతుందని గంభీర్‌కు అగార్కర్ తెలియజేసినట్లు సమాచారం. దీంతో తన మనసు మార్చుకున్న గంభీర్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.మరోవైపు భారత టీ20 జట్టు కెప్టెన్ మాత్రమే కాదు వైస్ కెప్టెన్ కూడా మారబోతున్నాడు. ఇప్పటివరకు డిప్యూటీగా ఉన్న అక్షర్ పటేల్ స్థానంలో హైదరాబాదీ తిలక్ వర్మను కొత్త వైస్ కెప్టెన్‌గా నియమించబోతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. గురువారం జరగనున్నబీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.ఈ నెలఖారులో ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా కొత్త కెప్టెన్‌తో వెళ్లనుంది. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే తప్పించే యోచనలో బీసీసీఐ ఉంది. సూర్య టీ20 ప్రపంచకప్‌ను అందించినప్పటికి, అతడి పేలవ ఫామ్ కారణంగానే వేటు వేసేందుకు బోర్డు సిద్దమైంది. శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే.. చివరగా 2023లో భారత తరపున టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతడు కేవలం వన్డేలకు మాత్రం పరిమితమయ్యాడు. దీంతో అయ్యర్ భారత టీ20 జట్టులోకి తిరిగి రావడం కష్టమని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. శ్రేయస్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం అతడు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టును నడిపించిన అనుభవం కూడా ఉంది.చదవండి: ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది: సచిన్ -
టీ20 కొత్త కెప్టెన్‌గా అతడికే ఓటేసిన అగార్కర్!
టీమిండియా టీ20 కెప్టెన్ మార్పు అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. భారత్‌కు ఈ ఏడాది ప్రపంచకప్ టైటిల్ అందించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఆ రెండు కారణాల వల్ల..ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆటగాడిగా తేలిపోవడమే ఇందుకు కారణం. అంతేగాక టీ20 ప్రపంచకప్-2028 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలో 35 ఏళ్ల సూర్య వయసు కూడా ఓ అడ్డంకిగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి.పరిశీలనలో మూడు పేర్లుఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ కొత్త కెప్టెన్ విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వరల్డ్‌కప్ వీరుడు సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల వెల్లడించాయి.అయితే, తాజా సమాచారం ప్రకారం.. సంజూ, అక్షర్‌లను కాదని శ్రేయస్ అయ్యర్‌కే సెలక్షన్ కమిటీ ఓటేసినట్లు సమాచారం. ఇందులో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ..అతడికే ఓటేసిన అగార్కర్‘‘అజిత్ దృఢచిత్తం గల చీఫ్ సెలక్టర్. స్ట్రాంగెస్ట్ చీఫ్ సెలక్టర్లలో అతడు ముందు వరుసలో ఉంటాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అతడు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు.తన ప్యానెల్‌తో కలిసి కొత్త టీ20 కెప్టెన్ కోసం అగార్కర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే శ్రేయస్ అయ్యర్‌ను తొలుత వన్డేలకు వైస్ కెప్టెన్‌గా నియమించారు. టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందే శ్రేయస్ విషయంలో ఒక నిర్ణయమైతే జరిగిపోయింది’’ అని పేర్కొన్నాయి.గంభీర్ విముఖత!అయితే, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మాత్రం శ్రేయస్ అయ్యర్ విషయంలో అగార్కర్‌తో ఏకీభవించడం లేదని సమాచారం. ‘‘గంభీర్ మనసులో ఒకరు ఉండొచ్చు. సెలక్టర్లు వేరొకరి గురించి ఆలోచించవచ్చు. అయితే, అక్షర్ పటేల్ వరల్డ్‌కప్ టోర్నీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయాన్ని మర్చిపోవద్దు.రేసులో ఇషాన్ కూడా!ఇక ఇషాన్ కిషన్.. అతడి వయసు చిన్నదే. ఫామ్‌లో ఉన్నాడు. సారథిగానూ నిరూపించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ విషయంలో మాత్రం సెలక్టర్లు సంతృప్తిగా లేరు. అతడి నిలకడలేని ఆట తీరే ఇందుకు కారణం.కాబట్టి శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇషాన్, అక్షర్ కూడా రేసులో ఉన్నారని చెప్పవచ్చు. కానీ సంజూకు మాత్రం అవకాశం ఉండకపోవచ్చు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఏదేమైనా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన తర్వాత కొత్త టీ20 కెప్టెన్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.చదవండి: వైభవ్‌తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే! -
శ్రేయస్ అయ్యర్ విఫలం.. ఘోర పరాజయం
ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే శ్రేయస్ అయ్యర్ మరో టీ20 లీగ్ బరిలో దిగాడు. ముంబై టీ20 లీగ్‌లో SoBo ముంబై ఫాల్కన్స్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే, స్థానిక లీగ్‌లో తొలి మ్యాచ్‌లోనే శ్రేయస్ అయ్యర్‌కు చేదు అనుభవం ఎదురైంది.కాగా ఐపీఎల్లో గతేడాది పంజాబ్ కింగ్స్ తరఫున శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. పదిహేడు మ్యాచ్‌లలో కలిపి 604 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.ఈసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే..ఇక ఇదే జోరును కొనసాగిస్తూ ఐపీఎల్-2026లోనూ పంజాబ్ ఆరంభంలో వరుసగా ఆరు విజయాలు సాధించింది. అయితే, ఆ తర్వాత అంతా తలకిందులైపోయింది. వరుసగా ఆరు ఓటములతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న శ్రేయస్ సేన.. రాజస్తాన్ రాయల్స్‌తో పోటీలో వెనుకబడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.తాజా ఐపీఎల్ ఎడిషన్‌లో శ్రేయస్ అయ్యర్.. పద్నాలుగు మ్యాచ్‌లు ఆడి 498 పరుగులు చేయగలిగాడు. ఇందులో ఓ అజేయ శతకం (101) కూడా ఉంది. ఇక ఐపీఎల్ ముగిసిన వెంటనే ముంబై టీ20 లీగ్‌లో బ్యాట్ ఝులిపించేందుకు సిద్ధమయ్యాడు శ్రేయస్.శ్రేయస్ అయ్యర్ విఫలం శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్న SoBo ముంబై ఫాల్కన్స్ మంగళవారం ARCS అంధేరి జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ కేవలం ఐదు పరుగులే చేసి అవుటయ్యాడు. అంధేరి కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ శివం దూబే బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.ఘోర పరాజయంఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఫాల్కన్స్‌ను 126 పరుగులకే పరిమితం చేసిన అంధేరి జట్టు.. ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వికెట్లు తీయడంతో పాటు.. 16 పరుగులు చేసిన శివం దూబే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కాగా జూన్ 1 నుంచి 13 వరకు ముంబై టీ20 లీగ్ తాజా ఎడిషన్‌కు షెడ్యూల్ ఖరారైంది. ఈ లీగ్‌లో బాంద్రా బ్లాస్టర్స్, ఈగల్ థానే స్ట్రైకర్స్, ఆకాశ్ టైగర్స్ MWS, MSC మరాఠా రాయల్స్, నార్త్ ముంబై పాంథర్స్, ట్రిపుంహ్స్ నైట్స్ MNE, SoBo ముంబై ఫాల్కన్స్, ARCS అంధేరి జట్లు పాల్గొంటున్నాయి.ఈ లీగ్‌లో టీమిండియా స్టార్లు, ముంబైకర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, శివం దూబే, సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, యశస్వి జైస్వాల్, తుషార్ దేశ్ పాండే, అంగ్క్రిష్ రఘువంశీ తదితరులు పాల్గొంటున్నారు. వెటరన్ స్టార్ అజింక్య రహానే కూడా ఈ లీగ్‌లో భాగమయ్యాడు.చదవండి: కెప్టెన్‌గా శ్రేయస్.. భువీ రీఎంట్రీ!Dube get a wicket of shreyas iyer 😭😭😭😭 pic.twitter.com/xk5DSo1wdf— sabas csk (@saba9361) June 2, 2026 -
కెప్టెన్‌గా శ్రేయస్.. భువీ రీఎంట్రీ..!
భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలిసారి ద్వైపాక్షిక టీ20 సిరీస్ జరుగనుందన్న ఓ వార్త ఇవాళ (జూన్ 2) సోషల్‌మీడియాలో వైరలైంది. ఈ సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరుగనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చారిత్రక సిరీస్‌లో భారత జట్టు ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.ఈ సిరీస్ కోసం ఐపీఎల్ స్టార్లకు అధిక అవకాశాలు ఇవ్వవొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చు. వీరిద్దరూ ఇటీవలికాలంలో కెప్టెన్సీ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వర్తించడంతో పాటు వ్యక్తిగతంగానూ విశేషంగా రాణించారు.ఐపీఎల్ 2026 పెను సంచలనం, రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి ఈ జట్టులో చోటు దక్కడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే తాజా ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్లకు కూడా ఈ జట్టులో చోటు ఖాయమని అనుకుంటున్నారు.మిడిలార్డర్లో ఆర్సీబీకి రెండుసార్లు టైటిల్ అందించిన రజత్ పాటిదార్, ముంబై ఇండియన్స్ ఆటగాడు నమన్ ధిర్, ఢిల్లీ విధ్వంసకర బ్యాటర్ అశుతోష్ శర్మ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.ఆల్రౌండర్లుగా ఆర్సీబీ సంచలనాలు కృనాల్ పాండ్యా, రసిక్ సలాం దార్‌కు చోటు దక్కవచ్చని అంచనా.బౌలింగ్ విషయానికొస్తే.. ఆర్సీబీ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరు అందరి నోటా వినిపిస్తుంది. ఈ సిరీస్‌తో అతడు రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మిగతా పేసర్లుగా సీఎస్కే అన్షుల్ కంబోజ్, కేకేఆర్ కార్తీక్ త్యాగి, లక్నో ప్రిన్స్ యాదవ్‌లకు అవకాశం దక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి. స్పిన్ బాధ్యతలు రవి బిష్ణోయ్‌కు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతుంది.అంచనా భారత జట్టు:వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రజత్ పాటిదార్, ఇషాన్ కిషన్ (వైస్ కెప్టెన్), నమన్ ధిర్, ఆశుతోష్ శర్మ, కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్, అన్షుల్ కంబోజ్, కార్తిక్ త్యాగి, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్.ఇదిలా ఉంటే, ఈ జట్టు అధికారిక జట్టు కాదు. ఐపీఎల్ ప్రదర్శనలు, ప్రస్తుత ఫామ్, జట్టు అవసరాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన అంచనా జట్టు మాత్రమే. ఈ సిరీస్‌పై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన కూడా లేదు. ఇది కేవలం సోషల్‌మీడియాలో ప్రచారం మాత్రమే. ఈ సిరీస్ విషయాన్ని పక్కన పెడితే.. జూన్ 6 నుంచి భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించారు. -
కెప్టెన్ రేసు.. ఆ ముగ్గురిని సెలక్ట్ చేసిన బీసీసీఐ?!
సారథిగా టీమిండియాకు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. బ్యాటర్‌గా పేలవ ఫామ్, వయసురీత్యా అతడిని మున్ముందు టీ20 ఫార్మాట్లో పరిశీలించే అవకాశం లేదని సెలక్టర్లు పరోక్షంగా చెప్పేశారు. ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల కోసం 30 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను భారత ఒలింపిక్ సంఘానికి (IOA)కు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అందజేసింది. ఇందులో 35 ఏళ్ల సూర్యకుమార్ పేరు లేకపోవడమే ఇందుకు నిదర్శనం.ఆ సమావేశంలోనే నిర్ణయం!ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వారసుడు ఎవరన్న అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అఫ్గనిస్తాన్‌తో సిరీస్ ఆరంభానికి ముందు బీసీసీఐ సెలక్టర్లు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.ఆ మీటింగ్‌లోనే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు పంపే జట్ల గురించి చర్చించనున్నట్లు.. అదే విధంగా టీ20 కొత్త కెప్టెన్ గురించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ..ఆ ముగ్గురిలో ఒకరికి అవకాశం!‘‘సూర్యను సారథిగా తొలగించే ముందే కొత్త కెప్టెన్ ఎవరన్న అంశంపై సెలక్టర్లు సుదీర్ఘంగా చర్చించనున్నారు. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ ఈ రేసులో ముందున్నారు. వరల్డ్‌కప్ టోర్నీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్ పేరును కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారు.అయితే, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల రూపంలో సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సెలక్టర్లు సిద్ధంగానే ఉన్నారు. అతడు బ్యాటర్‌గా ఫామ్‌లోకి వస్తే అంతా బాగానే ఉంటుంది. లేదంటే మున్ముందు జట్టులో చోటు కష్టమే.నిజానికి మేనేజ్మెంట్ ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్-2027 సన్నాహకాల్లో ఉంది. అందుకే టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలకు ఎంపిక చేసే జట్టులో కొత్త ఆటగాళ్లకు చోటు ఇవ్వాలని భావించింది.సెప్టెంబరు 19 నుంచిఅయితే, ఒకవేళ భారత ప్రభుత్వం పూర్తిస్థాయి జట్టును ఆసియా క్రీడలకు పంపాలని ఆదేశిస్తే బీసీసీఐ అందుకు తగినట్లుగానే నిర్ణయం తీసుకుంటుంది’’ అని పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.అదే సమయంలో స్వదేశంలో వెస్టిండీస్‌తో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ నేపథ్యంలో వీటి కోసం రెండు వేర్వేరు జట్లను ఎంచుకునేందుకు వీలుగా 30 మందితో పెద్ద జాబితాను బోర్డు ప్రకటించింది. వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ జట్టును నడిపిస్తాడు కాబట్టి ఆసియా క్రీడల కోసం అతడి పేరును పరిశీలించలేదు.ఇక ప్రాబబుల్స్‌లోనే అయినా తొలిసారి భారత సీనియర్ టీమ్ బృందంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం విశేషం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత జూన్ 6 నుంచి టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఆసియా క్రీడల ప్రాబబుల్స్ జాబితా: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్ దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్. చదవండి: అది సెలక్టర్ల పని: సచిన్ -
శ్రేయస్ కాదు.. టీమిండియా కెప్టెన్సీ రేసులో ఊహించని ప్లేయర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ రెండో ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఐపీఎల్-2026లో ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి తమ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బెంగళూరు ఫైనల్‌కు చేరడంలో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్‌ది కీలక పాత్ర.గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-1లో పాటిదార్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. పాటిదార్ కేవలం 33 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనూ సీజన్ మొత్తం పాటిదార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.వ్యక్తిగత ప్రదర్శనతో పాటు కెప్టెన్సీ పరంగా కూడా అతడు వందకు వంద మార్క్‌లు కొట్టేశాడు. ఈ నేపథ్యంలో పాటిదార్ బ్యాటింగ్, కెప్టెన్సీ స్కిల్స్‌పై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 17 ఓవర్లో ఓవర్లో కగిసో రబాడా బౌలింగ్‌లో పాటిదార్ ఆడిన షాట్‌ను అశ్విన్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ మ్యాచ్‌లో పాటిదార్ 281.82 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు."కగిసో రబాడ వేసిన ఓ ఫాస్ట్ డెలివరీని రజత్ బ్యాక్‌ఫుట్‌పై వెళ్లి కొట్టిన సిక్స్.. “షాట్ ఆఫ్ ది డే” అని చెప్పవచ్చు. బహుశా టోర్నమెంట్‌లోనే అత్యుత్తమ షాట్‌గా ఇది నిలుస్తుంది. ఆ పొజిషన్ నుండి అతను అంత పవర్‌ను ఎలా జనరేట్ చేయగలిగాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.ఈ ఇన్నింగ్స్‌కు ముందు వరకు కెప్టెన్సీ, బ్యాటింగ్ పరంగా పాటిదార్ కంటే శ్రేయస్ అయ్యర్ కాస్త బెటర్‌గా కన్పించాడు. కానీ ఈ మ్యాచ్‌తో పాటిదార్ శ్రేయస్‌ను వెనక్కి నెట్టి ఆ స్ధానానికి చేరుకున్నాడు. పాటిదార్ స్పిన్‌కు బాగా ఆడుతాడని మనందరికీ తెలుసు. కానీ ఈ రోజు అతడు ఫాస్ట్ బౌలర్లను ఆడిన తీరు అద్భుతం.రషీద్ ఖాన్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌ను అతడు ఎదుర్కొన్న తీరు కూడా నన్ను ఆకట్టుకుంది. ఫ్రంట్‌ఫుట్‌పైకి వచ్చి, బంతి పిచ్‌ను అంచనా వేసి రషీద్‌ను ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్స్ కొట్టే బ్యాటర్లు చాలా అరుదుగా ఉంటారు" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా ఇంగ్లండ్ పర్యటన తర్వాత ప్రస్తుత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌ను టీమిండియా కెప్టెన్ చేయాలని పలువురు సూచించారు. ఇప్పుడు అనుహ్యంగా పాటిదార్ పేరు కూడా తెరపైకి వచ్చింది.చదవండి: '100 వికెట్లు తీసినా నో ఛాన్స్.. ఇక రంజీ ట్రోఫీని మూసేయండి' -
IPL 2026: శ్రేయస్ అయ్యర్ పోస్ట్ వైరల్!
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం విచిత్రంగా సాగింది. ఆరంభంలో వరుసగా ఏడు మ్యాచ్‌లలో ఓటమన్నదే ఎరుగని శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయింది.పంజాబ్‌కు తప్పని పరాభవంఫలితంగా ప్లే ఆఫ్స్ చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి.. ముంబై ఇండియన్స్‌పై ఆశలు పెట్టుకుంది. అయితే, రాజస్తాన్ రాయల్స్ చేతిలో ముంబై ఓడిపోవడంతో పంజాబ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.పైసా వసూల్ ప్రదర్శనఈ నేపథ్యంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై విమర్శలు వచ్చాయి. కాగా గతేడాది వేలంలో రూ. 26.75 కోట్ల భారీ ధరకు పంజాబ్ శ్రేయస్‌ను కొనుగోలు చేసి పగ్గాలు అప్పగించింది. అందుకు తగ్గట్లుగానే ఈ ముంబైకర్ పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.బ్యాటర్‌గా 604 పరుగులు సాధించిన అయ్యర్.. కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే, టైటిల్ పోరులో ఆర్సీబీ చేతిలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడిన పంజాబ్.. తొలిసారి ట్రోఫీని గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది.ఆరంభంలోనూ అదుర్స్ఇక గతేడాది మాదిరే ఐపీఎల్-2026లోనూ జోరు కొనసాగించిన పంజాబ్ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ ఫేవరెట్‌గా ముందుకు సాగింది. కానీ అనూహ్య రీతిలో డబుల్ హ్యాట్రిక్ ఓటములతో డీలా పడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.స్పందించిన శ్రేయస్ఈ నేపథ్యంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించాడు. ఇన్‌స్టా వేదికగా జట్టుతో ఉన్న దృశ్యాలను పంచుకుంటూ.. ‘‘ప్రతీ పరుగు.. ప్రతీ క్షణం.. ప్రతీ పోరాటం. ఈ అధ్యాయం కృతజ్ఞతతో ముగిసింది. ఆకలి, కసితో తదుపరి అధ్యాయం మొదలవుతుంది’’ అని శ్రేయస్ అయ్యర్ క్యాప్షన్ జతచేశాడు.తద్వారా 2027లో తాము రెట్టించిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో తిరిగి వస్తామని అయ్యర్ చెప్పకనే చెప్పాడు. కాగా ఈ సీజన్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 14 మ్యాచ్‌లలో కలిపి 498 పరుగులు సాధించాడు. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లక్నోపై శ్రేయస్ (101 నాటౌట్) శతక్కొట్టడం విశేషం.చదవండి: వాళ్లిద్దరు తేలిపోతే ఆర్సీబీకి కష్టమే: సెహ్వాగ్ View this post on Instagram A post shared by Shreyas Iyer (@shreyasiyer96) -
సూర్యపై వేటు తగదు.. కెప్టెన్లుగా ఆ నలుగురు సరైనోళ్లు!
భారత టీ20 జట్టుకు త్వరలోనే కొత్త కెప్టెన్ రానున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ పర్యటన తర్వాత యాజమాన్యం ఈ విషయమై నిర్ణయం తీసుకుంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు ఇటీవల వెల్లడించడం ఇందుకు కారణం.వేటు తప్పదనే సంకేతాలుటీమిండియాకు 2026లో కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్ అందించినప్పటికీ.. ఆటగాడిగా మాత్రం తేలిపోయాడు సూర్యకుమార్ యాదవ్. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అతడి బ్యాటింగ్‌లో పస లేకుండా పోయింది. ఇక ఐపీఎల్-2026లోనూ ఈ ముంబై ఇండియన్స్ బ్యాటర్ 13 ఇన్నింగ్స్‌లో కలిపి 270 పరుగులే చేయగలిగాడు.ఈ నేపథ్యంలో సూర్యపై వేటు పడటం దాదాపుగా ఖాయమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ మాత్రం భిన్నంగా స్పందించాడు. క్రిక్‌బజ్‌కు రాసిన కాలమ్‌లో..అత్యంత విలువైన ఆటగాడు‘‘ఆధునిక టీ20 క్రికెట్లో కేవలం టెక్నిక్ ద్వారానే మ్యాచ్‌లు గెలవలేము. భయం లేకుండా వినూత్న షాట్లు కొట్టడం, కొన్ని ఓవర్లలోనే మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉండటం అత్యంత ముఖ్యం. ఆ లక్షణాలన్నీ సూర్యకుమార్లో ఉన్నాయి.అందుకే భారత టీ20 క్రికెట్లో ఇప్పటికీ అతడు అత్యంత విలువైన ఆటగాడే. అతడి ఫామ్ గురించి ఆందోళనలు ఉన్న మాట వాస్తవమే. అయితే, భారత టీ20 జట్టు నుంచి సూర్యను తొలగిస్తే మాత్రం అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు.భవిష్య కెప్టెన్లుగా ఆ నలుగురు సరైనోళ్లు!ఇప్పటికీ టీమిండియాలో విభిన్న, అత్యంత ప్రత్యేకమైన బ్యాటర్ సూర్యనే. 360 డిగ్రీస్‌లో షాట్లు ఆడగల అతి కొద్దిమంది బ్యాటర్లలో అతడు ఒకడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతడిని ఆపడం కష్టం’’ అని ఎమ్ఎస్కే ప్రసాద్ పేర్కొన్నాడు.ఇక సూర్యను ఆటగాడిగా కొనసాగించాలన్న ఎమ్ఎస్కే ప్రసాద్.. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌లలో ఒకరిని తదుపరి కెప్టెన్‌గా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా వరల్డ్‌కప్-2026 తర్వాత 2028 ప్రపంచకప్ ఆడటమే తన లక్ష్యమని 35 ఏళ్ల సూర్య తెలిపిన సంగతి తెలిసిందే.చదవండి: కోహ్లికి షాక్.. వైభవ్‌కు చోటు! -
‘నాపై కక్ష కట్టారు’.. శ్రేయస్ అయ్యర్ సోదరి ఆవేదన!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం ఒక విషాదగాథ అని చెప్పొచ్చు. సీజన్ తొలి దశ పోటీల్లో ఓటమి ఎరుగని పంజాబ్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే రెండో దశ పోటీలకు వచ్చేసరికి పంజాబ్ కథ అడ్డం తిరిగింది. వరుసగా ఆరు పరాజయాలు ఆ జట్టును ఇవాళ ప్లేఆఫ్స్‌కు చేరకుండా అడ్డుకున్నాయి. చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచినప్పటికీ ముంబై ఇండియన్స్ఫై రాజస్తాన్ రాయల్స్ గెలవడంతో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ సంగతి పక్కనబెడితే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్ ఒక వీడియోను విడుదల చేసింది. శ్రేష్ట ఉన్నపళంగా వీడియో రిలీజ్ చేయడం వెనుక ఒక కారణముంది. అదేంటంటే.. సీజన్ ఆరంభంలో పంజాబ్, కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ సమయంలో అయ్యర్ సోదరి శ్రేష్ట పంజాబ్ జెర్సీ ధరించి ఒక వీడియో రిలీజ్ చేసింది. 'మేము పంజాబీలం. మా మనసు చాలా పెద్దది. అందుకే మీకు ఒక పాయింట్ ఇచ్చాము' అని సరదాగా కేకేఆర్‌ను ట్రోల్ చేసింది. అయితే శ్రేష్ట మాటలను సీరియస్‌గా తీసుకున్న కేకేఆర్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మొదలైన ట్రోలింగ్ యుద్ధం తనపై ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉందంటూ శ్రేష్ట అయ్యర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తనకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని, కేవలం సరదా కోసమే వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లు శ్రేష్ట తెలిపింది. 'నేను వీడియోలు పెట్టడం వెనుక అసలు ఉద్దేశం కేవలం ఫన్ మాత్రమే. నేను ఎవరిని ట్రోలింగ్ చేయాలనుకోవడం లేదు. ఎవరి మీద నాకు అలాంటి దురుద్దేశం లేదు. ప్రతీ క్రికెటర్‌ను గౌరవిస్తాను.. ఎందుకంటే నా సోదరుడు కూడా ఒక క్రికెటరే. కానీ మీరు మాత్రం నేను చేసిన చిన్న తప్పుకు నాపై కక్ష కట్టి వేధింపులకు దిగారు. ఆ దూషణల పర్వం నేను పనిచేసే చోటు వరకు రావడం బాధాకరం. నాకు ఫోన్ చేసి నన్ను, నా సహ ఉద్యోగులను, విద్యార్థులను, కుటుంబాన్ని అసభ్యంగా దూషిస్తున్నారు. ట్రోల్ చేయండి.. కానీ అవి కుటుంబాలను లక్ష్యం చేసుకునేలా ఉండకూడదు. ఇప్పటికైనా నన్ను టార్చర్ పెట్టడం ఆపండి' అని వీడియోలో శ్రేష్ట పేర్కొంది. View this post on Instagram A post shared by Shresta Iyer (@shrestaiyer29) చదవండి: IPL 2026: క్వాలిఫయర్-1 పోరు.. ఫైనల్ వెళ్లేదెవరు? -
25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా ట్రెండింగ్‌లో నిలిచిన పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న ఈ 15 ఏళ్ల చిన్నోడు బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన యూట్యూబ్ షోలో పాల్గొన్న వైభవ్ సూర్యవంశీ 25 బంతుల్లోనే సెంచరీ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విషయంలోకి వెళితే పీటర్సన్ తన యూట్యూబ్ చానెల్లో వైభవ్ సూర్యవంశీతో ఒక ప్రత్యేక ఎపిసోడ్ చేశాడు. ఆ ఎపిసోడ్‌లోనే పీటర్సన్ వైభవ్‌కు 50 బంతుల్లో 100 పరుగులు చేయాలంటూ సవాల్ విసిరాడు. కానీ వైభవ్ మాత్రం పీటర్సన్ విసిరిన సవాల్‌ను 25 బంతుల్లోనే అందుకోవడం విశేషం. బౌలింగ్ మెషిన్ నుంచి వచ్చిన బంతులను వైభవ్ భారీ సిక్సర్లుగా మలిచాడు. అయితే 25 బంతుల్లోనే శతకం సాధించినప్పటికీ ఇదే పీటర్సన్ షోలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లో సాధించిన వంద పరుగుల రికార్డును మాత్రం బద్దలుకొట్టలేకపోయాడు. మూడు బంతుల తేడాతో అయ్యర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాన్ని వైభవ్ కోల్పోయాడు. ఇక పీటర్సన్ షోలో అత్యంత వేగంగా సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ రెండో స్థానంలో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్, వైభవ్ తర్వాత నికోలస్ పూరన్ (28 బంతులు) మూడో స్థానంలో ఉన్నాడు. అంతకముందు ఏబీ డివిలియర్స్ 30 బంతుల్లో వంద పరుగులు సాధించాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో వంద పరుగులు సాధించడం గమనార్హం. ఇదే ఎపిసోడ్లో సూర్యవంశీ తన కోరికను వెల్లడించాడు. టీ20ల్లో డబుల్ సెంచరీ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. అయితే టీ20 క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (175 పరుగులు) పేరిట ఉంది. 2013 ఐపీఎల్ సీజన్లో గేల్ ఆర్సీబీ తరఫున 175 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. గేల్ రికార్డును బద్దలుకొట్టడంతో పాటు టీ20ల్లో డబుల్ సెంచరీ బాదడమే తన టార్గెట్ అని మరోసారి స్పష్టం చేశాడు.ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ముంబై ఇండియన్స్‌పై 30 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్తాన్ 16 పాయింట్లతో నాకౌట్ దశకు చేరుకుంది. బుధవారం (మే 27న) జరగనున్న ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్ను ఎదుర్కోనుంది. ఇక రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సీజన్లో 14 మ్యాచ్‌లాడి 583 పరుగులు సాధించాడు.చదవండి: మెస్సీకి గాయం.. ఫిఫా ప్రపంచకప్‌కు దూరం! -
పంజాబ్ చేజేతులా.. నిరీక్షణ ఇంకెన్నాళ్లు!
ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి కొనసాగుతున్న జట్లలో పంజాబ్ ఒకటి. మొదట కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌గా, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌గా 19 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతూ వస్తోంది. జట్టు పేరు మార్చినా, కెప్టెన్లు మారినా పంజాబ్ తలరాత మాత్రం మారడం లేదు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైంది. అయితే సీజన్ తొలి అంచె పోటీల్లో ఓటమి ఎరుగని పంజాబ్ రెండో అంచె పోటీల్లో అనవసర ఒత్తిడికి లోనైంది. తద్వారా వరుస పరాజయాలతో చేజేతులా ప్లేఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది. 19 సీజన్లుగా కప్పు కోసం నిరీక్షిస్తున్న పంజాబ్‌కు ఈ ఏడాది కూడా నిరాశనే మిగిల్చింది.ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008)లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన పంజాబ్ మళ్లీ 2014లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ తుదిమెట్టుపై బోల్తా పడింది. ఆ తర్వాత షరా మాములే అన్నట్లుగా వారి ఆటతీరు సాగింది. అయితే ఐపీఎల్ కెప్టెన్లలో లక్కీ కెప్టెన్‌గా పేరున్న శ్రేయస్ అయ్యర్ 2025 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా రావడంతో ఆ జట్టులో ఆశలు చిగురించాయి. జట్టు తనపై ఉంచిన నమ్మకా న్ని నిలబెట్టుకున్న శ్రేయస్ అయ్యర్ పదేళ్ల తర్వాత పంజాబ్‌ను మళ్లీ ఫైనల్ చేర్చాడు. అయితే తుదిపోరులో ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. గత సీజన్ ఇచ్చిన బూస్ట్‌తో ఈ సీజన్లో మంచి అంచనాలతోనే పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టుగానే తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు (ఒక మ్యాచ్ వర్షంతో రద్దు) సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇంకేముంది ఈసారి పంజాబ్ టైటిల్ కొడుతుందని అంతా భావించారు. కానీ రెండో అంచె పోటీలు మొదలవ్వగానే అంచనాలు తలకిందులయ్యాయి. రాజస్తాన్ రాయల్స్ చేతిలో మొదలైన ఓటముల పరంపర వరుసగా ఆరు మ్యాచ్‌ల వరకు కొనసాగింది. అయితే లక్నో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చి విజయం సాధించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, ఆరు ఓటములు, ఒక రద్దుతో 15 పాయింట్లతో ఉన్నప్పటికీ మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగాక రెండో అంచె పోటీల్లో లక్నోతో మ్యాచ్‌కు ముందు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క దానిలో విజయం సాధించినా ఇవాళ పంజాబ్ ప్లేఆఫ్ చేరుకునేది. కానీ అదృష్టం కంటే దురదృష్టంతో ప్రయాణం చేస్తున్న పంజాబ్‌కు ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షలానే మిగిలిపోయింది.వైఫల్యం వెనుక కారణాలెన్నో!ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ చేరకపోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో ప్రధాన కారణం బౌలింగ్ బలహీనంగా ఉండడం. తొలి అంచె పోటీల్లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధిస్తే అందులో నాలుగు మ్యాచ్‌ల్లో ఛేదనలో విజయాలు సాధించింది. ప్రత్యర్థి జట్లు ఎంత పెద్ద టార్గెట్ విధించినా పంజాబ్ సులువుగా ఆ లక్ష్యాన్ని అందుకునేది. అప్పుడు బౌలింగ్‌లో లోపాలు కనిపించలేదు. కానీ రెండో అంచె పోటీల్లో సీన్ రివర్స్ అయింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు బౌలింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయింది. దీనికి తోడు పేలవ ఫీల్డింగ్ కూడా పంజాబ్ కొంపముంచింది. చాలా మ్యాచ్‌ల్లో క్యాచ్‌లు జారవిడవడంపై హెడ్‌కోచ్ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు పంజాబ్ టైటిల్ సాధించే ఒక మంచి అవకాశాన్ని చేజేతులా కోల్పోయింది.🚨 PUNJAB KINGS KNOCKED OUT OF IPL 2026. 🚨- PBKS were unbeaten for the first 7 matches of the tournament. 🤯 pic.twitter.com/qmeXyFP0An— Mufaddal Vohra (@mufaddal_vohra) May 24, 2026చదవండి: రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు -
సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే
-
భారీ మైలురాయిని అధిగమించిన శ్రేయస్ అయ్యర్
లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న (మే 23) జరిగిన డు ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ భారీ మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో తన జట్టును గెలిపించిన అతడు.. టీ20ల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా కేఎల్ రాహుల్ (197 ఇన్నింగ్స్), విరాట్ కోహ్లి (212), శిఖర్ ధవన్ (246) తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్‌గా (247) రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్ 7000 రన్స్ రికార్డు పాక్ ఆటగాడు బాబర్ ఆజం (187) పేరిట ఉంది. బాబర్ తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (192), కేఎల్ రాహుల్ ఉన్నారు.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నోపై పంజాబ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 197 పరుగుల ఛేదనలో శ్రేయస్ సిక్సర్‌తో సెంచరీ (51 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) పూర్తి చేసుకోవడంతో పాటు జట్టును కూడా విజయతీరాలకు చేర్చాడు. అతడికి ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69) సహకరించాడు.ఈ గెలుపుతో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ ఇదివరకే బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. చివరి బెర్త్ కోసం పంజాబ్‌తో పాటు రాజస్థాన్, కేకేఆర్ పోటీపడుతున్నాయి.ఇవాళ మధ్యాహ్నం ముంబై, రాజస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఈ జట్టే దక్కించుకుంటుంది. పంజాబ్, కేకేఆర్ రేసు నుంచి నిష్క్రమిస్తాయి.ఒకవేళ ముంబై చేతిలో రాజస్థాన్ ఓడిందా.. రాత్రి కేకేఆర్-ఢిల్లీ మ్యాచ్ వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ముంబై చేతిలో ఓడితే రాజస్థాన్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు పోటీలో పంజాబ్, కేకేఆర్ ఉంటాయి.ఢిల్లీపై కేకేఆర్ గెలిస్తే నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. పంజాబ్, కేకేఆర్ జట్లలో ఏ జట్టుకు మెరుగైన రన్‌రేట్ ఉంటే, ఆ జట్టే ఎలిమినేటర్‌లో ఎస్ఆర్హెచ్తో పోటీకి సిద్దమవుతుంది.ఒకవేళ ఢిల్లీ చేతిలో కేకేఆర్ ఓడిందా పంజాబ్ దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మధ్యాహ్నం మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడాలి. రాత్రి మ్యాచ్‌లో కేకేఆర్ ఓడాలి. రాత్రి మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచినా భారీ తేడాతో గెలవకపోయినా పంజాబ్‌కే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.ఒకవేళ కేకేఆర్‌కు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కాలంటే ముంబై చేతిలో రాజస్థాన్ ఓడాలి. ఢిల్లీపై ఆ జట్టు భారీ తేడాతో గెలవాలి.రాజస్థాన్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ముంబైపై తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రాత్రి మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. -
శ్రేయస్ సూపర్ సెంచరీ.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
ఐపీఎల్-2026లో శనివారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ విజయంతో పంజాబ్(15) పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానానికి చేరుకుంది. అయితే పంజాబ్ ప్లే ఆఫ్స్ భవితవ్యం ఆదివారం జరిగే రాజస్తాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్, కేకేఆర్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడింది. ఈ రెండు మ్యాచ్‌లలో రాజస్తాన్, కేకేఆర్ ఓటమి పాలైతే పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది.ఒకవేళ ముంబైపై రాజస్తాన్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండగా రియాన్ పరాగ్ సేన 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతోంది. మరోవైపు రాజస్తాన్ ఓడి, ముంబైపై కేకేఆర్ భారీ విజయం సాధిస్తే పంజాబ్‌ను అధిగమించి రహానే టీమ్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతోంది. కేకేఆర్ ఖాతాలో ప్రస్తుతం 13 పాయింట్లు ఉన్నాయి.శ్రేయస్ సూపర్ సెంచరీఇక మ్యాచ్ విషయానికి వస్తే.. . లక్నో నిర్ధేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ అద్భుత విజయంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర. అయ్యర్ అజేయ సెంచరీతో సత్తాచాటాడు.కేవలం 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శ్రేయస్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. శ్రేయస్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు ప్రభ్సిమ్రాన్ సింగ్ (39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: గంభీర్ చేతుల్లో సూర్యకుమార్ భవితవ్యం! -
IPL 2026: లక్నోపై పంజాబ్ ఘన విజయం
ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్ధానానికి చేరుకుంది. తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.లక్నో నిర్ధేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ అద్భుత విజయంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర.అయ్యర్ అజేయ సెంచరీతో సత్తాచాటాడు. కేవలం 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శ్రేయస్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభ్సిమ్రాన్ సింగ్ (39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు, అర్జున్ టెండూల్కర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో జోష్ ఇంగ్లిష్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అయూశ్ బదోని(43), అబ్దుల్ సమద్(37) రాణించారు. పంజాబ్ బౌలర్లలో మార్కో జానెసన్, చాహల్ తలా రెండు వికెట్లు సాధించాడు.15 ఓవర్లలో 162/315 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ప్రబ్‌సిమ్రన్ (69) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది.నిలకడగా ఆడుతున్న పంజాబ్12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(48), ప్రభ్సిమ్రాన్ సింగ్(56) ఉన్నారు.8 ఓవర్లలో పంజాబ్ 79/28 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (28), ప్రబ్‌సిమ్రన్ సింగ్ (30) పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్లక్నోతో మ్యాచ్‌లో 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడింది. తొలి వికెట్‌గా ప్రియాన్ష్ ఆర్య గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇక 18 పరుగులు చేసిన కూపర్ కనోలీ షమీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అవడంతో పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్ (2), అయ్యర్ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు.పంజాబ్ టార్గెట్ 197 పరుగులుపంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్ జోస్ ఇంగ్లిస్ (44 బంతుల్లో 72) అర్థసెంచరీతో రాణించాడు. ఆయుశ్ బదోని (43), అబ్దుల్ సమద్ (20 బంతుల్లో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ బౌలర్లలో చాహల్, మార్కో జాన్సెన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన లక్నోలక్నో ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన జోస్ ఇంగ్లిస్ (72) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. శశాంక్ సింగ్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ దిశగా ఇంగ్లిస్ షాట్ ఆడినప్పటికీ అయ్యర్ చేతికి చిక్కాడు. 18 ఓవర్లో ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.మూడో వికెట్ కోల్పోయిన లక్నోధాటిగా ఆడుతున్న ఆయుశ్ బదోనీ (43) రూపంలో లక్నో సూపర్‌జెయింట్స్ 69 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి విఫలమైన బదోని కీపర్ ప్రబ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ఇంగ్లిస్ (24), పంత్ (6) పరుగులతో ఆడుతున్నారు.రెండు వికెట్లు కోల్పోయిన లక్నోపంజాబ్తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 2 పరుగులు చేసిన నికోలస్ పూరన్‌ను మార్కో జాన్సెన్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అంతకముందు ఓపెనర్ అర్షిన్ కులకర్ణి అజ్మతుల్లా ఒమర్జయ్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి లక్నో 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. బదోని (20), ఇంగ్లిస్ (18) పరుగులతో ఆడుతున్నారు.టాస్ గెలిచిన పంజాబ్టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పంజాబ్‌కు చావో రేవో లాంటిది. మ్యాచ్‌లో లక్నోపై విజయం సాధిస్తే పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. అదే సమయంలో ప్లేఆఫ్స్ పోటీలో ఉన్న కేకేఆర్, రాజస్తాన్‌లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ లక్నో చేతిలో పంజాబ్ ఓటమి చవిచూస్తే మాత్రం ఆ జట్టు ఇంటిబాట పట్టాల్సిందే. అప్పుడు కేకేఆర్, రాజస్తాన్‌లు ప్లేఆఫ్స్ పోటీలో ఉంటాయి.లక్నో సూపర్ జెయింట్స్: జోష్ ఇంగ్లిస్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, అర్జున్ టెండూల్కర్, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్.పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.🚨Toss update from Lucknow 🚨@PunjabKingsIPL won the toss and elected to bowl first against @LucknowIPLUpdates ▶️ https://t.co/2ADKr4dqhi#TATAIPL | #KhelBindaas | #LSGvPBKS pic.twitter.com/FZTDevYeis— IndianPremierLeague (@IPL) May 23, 2026 -
చావోరేవో.. పంజాబ్ కింగ్స్ ‘ప్లే ఆఫ్స్’ చేరాలంటే!
ఐపీఎల్-2026 ‘ప్లే ఆఫ్స్’లో నాలుగో బెర్తు కోసం నాలుగు జట్లు బరిలో ఉన్నాయి. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.టాప్-2లో ఉన్న ఆర్సీబీ- గుజరాత్ క్వాలిఫయర్-1లో తలపడనుండగా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడే జట్టు ఏదో ఆదివారం (మే 24) తేలిపోతుంది. ఇక ఈ బెర్తు కోసం రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రేసులో ఉన్నాయి.చావోరేవోఈ క్రమంలో పంజాబ్ శనివారం నాటి మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో నిలిచింది. నిజానికి సీజన్ ఆరంభంలో పంజాబ్ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ దిశగా దూసుకువచ్చింది. తొలి ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించి.. చాన్నాళ్లు టాపర్‌గా కొనసాగింది.కోల్‌కతాతో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైపోయింది. దీంతో ఓవరాల్‌గా పంజాబ్ ఖాతాలో 13 (12+1) పాయింట్లు చేరాయి. కానీ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ సేన దారుణంగా విఫలమైంది. వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది.అయితే, మిగతా జట్ల ఫలితాల కారణంగా పంజాబ్ ఇప్పటికీ అధికారికంగా రేసులో నిలవగలిగింది. ఈ నేపథ్యంలో లీగ్ దశలో మిగిలిన మ్యాచ్‌లో పంజాబ్ లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఏకనా స్టేడియం ఇందుకు వేదిక.పంజాబ్‌కు ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు కావాలంటే..లక్నోతో మ్యాచ్‌లో పంజాబ్ తప్పక గెలవాలి. తద్వారా పాయింట్ల సంఖ్య 15కు చేరుకుంది. అయితే, రాజస్తాన్ రాయల్స్ నుంచి పంజాబ్‌కు ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న రాజస్తాన్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. రాజస్తాన్ తప్పక ఓడిపోవాలికాబట్టి రాజస్తాన్ తమ ఆఖరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో తప్పక ఓడిపోతేనే.. పంజాబ్‌కు అవకాశాలు ఉంటాయి. మరోవైపు.. కేకేఆర్ కూడా పంజాబ్ మాదిరే 13 పాయింట్లు కలిగి ఉంది.ఒక్క పరుగు తేడాతో గెలిచినా.. అయితే, ప్రస్తుతం నెట్‌రన్‌రేటు పరంగా పంజాబ్ (+0.227).. కేకేఆర్ (+0.011) కంటే మెరుగైన స్థితిలో ఉండటం సానుకూలాంశం. ఈ నేపథ్యంలో పంజాబ్ లక్నోపై ఒక్క పరుగు తేడాతో గెలిచినా.. పైచేయి సాధించగలదు.అదే సమయంలో కేకేఆర్ ఢిల్లీపై గెలిస్తే పంజాబ్ మాదిరే 15 పాయింట్లు వస్తాయి. అప్పుడు నెట్‌రన్‌రేటు కీలకంగా మారుతుంది. కాబట్టి కేకేఆర్ ఢిల్లీని కనీసం 52 పరుగులతో ఓడించాల్సి ఉంటుంది. అలాకాని పక్షంలో మరోసారి పంజాబ్‌దే పైచైయి అవుతుంది.ఒకవేళ పంజాబ్ గనుక దురదృష్టశాత్తూ లక్నో చేతిలో ఓడిపోతే.. ఈ సమీకరణలతో సంబంధం లేకుండా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నాలుగో స్థానం కోసం పోటీలో ఉంటాయి.చదవండి: పక్కా ప్లాన్‌తోనే.. ఓడినా సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టిన ఆర్సీబీ! -
ఒంటరిగా డగౌట్లో రిక్కీ పాంటింగ్.. ఫొటో వైరల్
ఐపీఎల్-2026 టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత డీలా పడింది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఓటమి పాలై.. వరుసగా ఆరో పరాజయం నమోదు చేసింది. తద్వారా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక పంజాబ్ టాప్-4 చేరాలంటే మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్‌లో తప్పక గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.‘ప్లే ఆఫ్స్’లో ఆర్సీబీమరోవైపు.. ధర్మశాలలో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బెంగళూరు ఐపీఎల్ 19వ సీజన్లో ‘ప్లే ఆఫ్స్’కు దూసుకెళ్లింది. ఇరు జట్లకు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ (40 బంతుల్లో 73 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. దేవదత్ పడిక్కల్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశారు.పంజాబ్ ఆరో‘సారీ’అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రేయస్ అయ్యర్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితమైంది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి అంచనాలు పెంచిన పంజాబ్‌కిది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం.శశాంక్ సింగ్ (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకం సాధించగా... కూపర్ కనోలి (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్టొయినిస్ (25 బంతుల్లో 37; 5 ఫోర్లు), సూర్యాంశ్ షెడ్గే (22 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాస్త పోరాడారు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (0), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2)తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) విఫలమవడంతో పంజాబ్‌కు పరాజయం తప్పలేదు. భువనేశ్వర్ 2 వికెట్లు పడగొట్టగా... రసిఖ్ సలామ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఫొటో వైరల్ఇక ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్లు కనిపించింది. ఒంటరిగా.. డగౌట్లో ముందు కుర్చీపై తలవాల్చి ఉన్న పాంటింగ్ ఫొటో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అశూ ఏమన్నాడంటే...‘‘ఈరోజు టీవీలో ఓ శక్తిమంతమైన ఫొటో చూశాను. రిక్కీ పాంటింగ్ డగౌట్లో ఒక్కడే కూర్చుని కుర్చీ మీద ఒరిగిపోయాడు. తన మనసులో ఆందోళన చెలరేగుతూ ఉంటుంది. ఆరంభంలో వాళ్లు టేబుల్ టాపర్‌గా ఉన్నారు. కానీ ఆ తర్వాత సీన్ మొత్తంగా మారిపోయింది. అసలు తప్పు ఎక్కడ జరిగింది? సొంతమైదానం ముల్లన్‌పూర్‌లో వరుసగా మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్.. సెకండ్ హోం గ్రౌండ్ ధర్మశాలలో మాత్రం వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది.చిన్న తప్పిదాల వల్ల కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రిక్కీ పాంటింగ్, శ్రేయస్ అయ్యర్ తీవ్రమైన బాధలో ఉండి ఉంటారు. నాకూ బాధగానే ఉంది. అయినా నిజాన్ని అంగీకరించకతప్పదు’’ అని అశూ పేర్కొన్నాడు. కాగా పంజాబ్ లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మే 23న ఏకనా స్టేడియంలో తలపడనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది పాంటింగ్ మార్గనిర్దేశనం.. శ్రేయస్ సారథ్యంలో పంజాబ్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని -
ఆ తప్పిదమే మా కొంపముంచింది: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో పంజాబ్ పరాజయం పాలైంది. 222 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి నిర్ణీత 199 పరుగులు చేసింది.శశాంక్ సింగ్(56), స్టోయినిష్(37), సూర్యాంశ్ షెడ్గే(35) కాస్త దూకుడుగా ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. ముఖ్యంగా ప్రియాన్ష్ ఆర్య(0), ప్రభ్సిమ్రాన్ సింగ్(2), శ్రేయస్ అయ్యర్(1) దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో తమ పంజాబ్ కింగ్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందని అయ్యర్ చెప్పుకొచ్చాడు."ఆర్సీబీకి పవర్‌ప్లేలో అద్భుతమైన ఆరంభం లభించింది. ఆపై పవర్‌ప్లే ముగిసిన తర్వాత కూడా మా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 222 పరుగులు సాధించడం నిజంగా ప్రశంసనీయమైన ప్రదర్శన. మేం బౌలింగ్‌లో ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోయాం. మేము పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను చేజార్చుకున్నాము. అనంతరం బ్యాటింగ్‌లో కూడా మాకు మంచి ఆరంభం దక్కలేదు. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము. ఈ సీజన్లో మా జట్టులో ఎక్కువ పరుగులు చేసేది ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్ మాత్రమే. ప్రతి మ్యాచ్‌లో వారు పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి ఒక రిథమ్ సెట్ చేసేవారు. కానీ ఈ మ్యాచ్‌లో వారు ఆరంభ ఇవ్వలేకపోయారు. నేను కూడా క్రీజులోకి వచ్చిన వెంటనే ఔటయ్యాను. ఇది నన్ను చాలా నిరాశ కలిగించింది. కానీ మిడిలార్డర్లో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. మేము ఓవర్‌కు దాదాపు 10 పరుగులు సాధిస్తూ లక్ష్యాన్ని చేధించాలనుకున్నాము. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాము. భువీ, హాజిల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మా తదుపరి గెలిచేందుకు అన్ని విధాలగా ప్రయత్నిస్తాం. ఫలితాలతో సంబంధం లేకుండా నేను ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటాను. మ్యాచ్ ఫలితాలు నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు. నేను గతం గురించి మరీ ఎక్కువగా ఆలోచించే వ్యక్తిని కాదు. జరగాల్సింది జరిగిపోయింది. రేపు ఉదయం నేను మళ్ళీ కొత్త సూర్యోదయాన్ని చూస్తాను. చీకటి తర్వాత ఎప్పుడూ వెలుగు ఉంటుందని నేను నమ్ముతాను" పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శ్రేయస్ పేర్కొన్నాడు. -
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్లో కెప్టెన్సీ అంటే ఒత్తిడి, అంచనాలు, విమర్శలు కలగలిసిన బాధ్యత. ఒక్క తప్పిదం మ్యాచ్‌నే కాదు, కెప్టెన్ ప్రతిష్టనూ ప్రభావితం చేస్తుంది. ఇలాంటి హైప్రెషర్ లీగ్‌లో దీర్ఘకాలం జట్టును నడిపించడం చాలా కొద్దిమందికే సాధ్యమైంది. ఇప్పుడు ఈ అరుదైన జాబితాలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేరాడు. ఐపీఎల్లో 100 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాళ్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ సరసన నిలిచాడు.ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది ధోని. చెన్నై సూపర్ కింగ్స్‌ను తొలి సీజన్ నుంచే నడిపించిన అతను ఐపీఎల్లో మొత్తం 235 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో సీఎస్కే ఐదు టైటిళ్లు గెలుచుకుని లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. కెప్టెన్‌గా 136 విజయాలు సాధించిన ధోనికి 57.87 విజయశాతం ఉంది.రెండో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ చేపట్టిన రోహిత్, అదే ఏడాది జట్టుకు తొలి టైటిల్ అందించాడు. తర్వాత మరో నాలుగు సార్లు ట్రోఫీ గెలిపించి ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 158 మ్యాచ్‌ల్లో జట్టును నడిపిన అతను 87 విజయాలు సాధించాడు.మూడో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొమ్మిదేళ్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ, టైటిల్ గెలవలేకపోయినా జట్టును పలుమార్లు ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అతని నాయకత్వంలో ఆర్సీబీ 2016లో ఫైనల్ చేరింది. మొత్తం 143 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ 66 విజయాలు సాధించాడు.కేకేఆర్‌కు రెండు టైటిళ్లు అందించిన గౌతమ్ గంభీర్ 129 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని కెప్టెన్సీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ బలమైన జట్టుగా మారి ఐపీఎల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక జాబితాలోకి శ్రేయస్ అయ్యర్ కూడా చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో కెప్టెన్సీ ప్రయాణం ప్రారంభించిన అయ్యర్, ఆ జట్టును 2020లో ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మారి ఆ జట్టుకు టైటిల్ అందించాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌ను నడిపిస్తున్న అతను 100 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 54 విజయాలు నమోదు చేశాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 17) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రేయస్ ఈ అరుదైన ఘనత సాధించాడు. -
టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే!
టీమిండియా టీ20 కెప్టెన్సీ త్వరలోనే చేతులు మారనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్‌కు ఇటీవలే టీ20 ప్రపంచకప్ అందించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా పేరొందిన ఈ ముంబైకర్.. ఇటీవల ఫామ్‌లేమితో ఇబ్బంది పడటం ఇందుకు కారణం.కొత్త సారథి రావడం పక్కా!అంతేకాదు 35 ఏళ్ల సూర్యకు వయసు కూడా అడ్డంకిగా మారింది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత అతడిని తొలగించి.. కొత్త సారథిని నియమించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది.ప్రస్తుతం భారత టీ20 జట్టులో అయ్యర్‌కు చోటు లేకపోయినా.. త్వరలోనే అతడు రీఎంట్రీ ఇచ్చి పగ్గాలు చేపడతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతడితో పాటు ఇషాన్ కిషన్, టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.సంజూకే ఆ అర్హతఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్, భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్-2028 టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో టీమిండియా కొత్త కెప్టెన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ రెండేళ్లలో సూర్య ఏం చేస్తాడో చూడాలి.అయితే, సూర్య స్థానంలో కొత్త నాయకుడిగా సంజూ శాంసన్ ముందు వరుసలో ఉంటాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా అతడు అదరగొట్టాడు. టాపార్డర్‌లో విధ్వంసకర బ్యాటర్‌గా అతడు పేరొందాడు. వచ్చే రెండు, మూడేళ్లలో సంజూ నుంచి మనం మరిన్ని గొప్ప ఇన్నింగ్స్ చూడబోతున్నామని అనిపిస్తోంది.నిజానికి సంజూ గొప్ప ప్రతిభ ఉన్న ఆటగాడు. అయితే, తనకున్న టాలెంట్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాడనే విమర్శలు వచ్చేవి. టీ20 ప్రపంచకప్ సందర్భంగా వాటన్నింటికీ అతడు ఆటతోనే సమాధానం చెప్పాడు.ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడుకీలక నాకౌట్ మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. భారత్ మరోసారి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లలో సంజూ గొప్ప పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు.తాజా సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫునా రాణిస్తున్నాడు. టీమిండియా భవిష్య నాయకుడిగా సంజూ తనను తాను ముందు వరుసలో నిలుపుకొన్నాడు’’ అని రవిశాస్త్రి ‘ది ఐసీసీ రివ్యూ’లో పేర్కొన్నాడు.దుమ్ములేపిన సంజూకాగా టీ20 ప్రపంచకప్-2026లో నాకౌట్ మ్యాచ్‌లలో సంజూ 97*, 89, 89 పరుగులు సాధించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు గెలుచుకున్నాడు.ఇక ఐపీఎల్-2026 ఆరంభానికి ముందు రాజస్తాన్ నుంచి చెన్నైకి ట్రేడ్ అయిన సంజూ.. ఆరంభంలో తడబడ్డాడు. ఆ తర్వాత సెంచరీతో అదరగొట్టి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పటికి 11 మ్యాచ్‌లలో కలిపి 430 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి.చదవండి: Hardik Pandya: మౌనం వీడిన ముంబై ఇండియన్స్ -
ఇదేం పద్ధతి?.. శ్రేయస్ అయ్యర్‌పై మాజీ కెప్టెన్ ఫైర్
ఐపీఎల్-2026 సీజన్‌ను ఘనంగా ఆరంభించింది పంజాబ్ కింగ్స్. వరుసగా ఆరు మ్యాచ్‌లలో గెలిచి టేబుల్ టాపర్‌గా చాన్నాళ్లపాటు కొనసాగింది. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. వరుసగా నాలుగు ఓటములతో పంజాబ్ ప్రస్తుతం నాలుగో స్థానానికి పడిపోయింది.ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన మూడు లీగ్ మ్యాచ్‌లలో పంజాబ్ సత్తా చాటాల్సిందే. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడి ఓడిపోయిన పంజాబ్.. గురువారం ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీరును విమర్శించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో తమ ప్రధాన స్పిన్నర్ యజువేంద్ర చహల్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడాన్ని తప్పుబట్టాడు.అతడితో ఒక్క ఓవర్ కూడా వేయించరా?ఈ మేరకు.. ‘‘పంజాబ్ తమ స్పిన్నర్లు చహల్, హర్‌ప్రీత్ బ్రార్‌లను తప్పనిసరిగా ఆడించాల్సింది. ఇలాంటి సమయంలోనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ బౌలర్లపై నమ్మకం ఉంచాలి. చహల్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం ఏమిటి?ఇదేం ఆలోచనా విధానం? ఇదేం పద్ధతి?.. చెత్త కెప్టెన్సీ.. ధర్మశాలలో ఫ్లాట్ వికెట్‌పై ప్రధాన స్పిన్నర్‌తో కనీసం రెండు ఓవర్లు కూడా వేయించరా?.. చహల్ గతంలో ఆర్సీబీ తరఫున ఫ్లాట్ వికెట్ల మీద చక్కగా బౌలింగ్ చేసి ఆ జట్టును గెలిపించాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ శ్రేయస్ అయ్యర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్ల ప్రదర్శన ఇలాకాగా ధర్మశాలలో ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్ 210 పరుగులు సాధించింది. కానీ ఈ భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయి.. మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్ నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 55 పరుగులు ఇచ్చుకున్నాడు. అయితే, ఎట్టకేలకు రెండు వికెట్లు తీయగలిగాడు.ఇక మార్కో యాన్సెన్ 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. మిగిలిన వాళ్లలో బెన్ డ్వార్షుయిస్ నాలుగు ఓవర్లలో 51 రన్స్ ఇచ్చి ఒక వికెట్.. మార్కస్ స్టొయినిస్ 3 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగలిగారు. చహల్ తుదిజట్టులో ఉన్నా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. మరోవైపు హర్‌ప్రీత్ బ్రార్‌ను బెంచ్‌కు పరిమితం చేశారు.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు -
‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’
ఐపీఎల్ 2026 సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ తొలి అంచె పోటీలు ముగిసేసరికి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే రెండో అంచె పోటీల్లో మాత్రం పంజాబ్ తడబడుతూ వస్తోంది. వరుసగా నాలుగు పరాజయాలతో పంజాబ్ పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. బౌలింగ్‌లో విఫలమవ్వడంతో పాటు పేలవమైన ఫీల్డింగ్ ఆ జట్టు ప్రమాణాలను దెబ్బ తీస్తున్నాయి. పంజాబ్ ఆటగాళ్లు క్యాచ్ డ్రాప్‌లు ఎక్కువగా చేయడం కూడా ఆ జట్టు కొంపముంచుతోంది. మైదానంలో పరిస్థితి ఇలా ఉంటే బయట కూడా పంజాబ్ జట్టు చిక్కుల్లో పడింది. ఇటీవలే విమానంలో పంజాబ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ వేప్ (ఈ-సిగరేట్) పీల్చడం వివాదంగా మారింది. వేప్ను అందించిన అర్ష్‌దీప్‌తో పాటు చాహల్, మరికొంత మంది పంజాబ్ ఆటగాళ్లపై వేటు పడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు పంజాబ్ ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ బరువు పెరిగాడన్న వార్తలతో పాటు జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా స్పందించింది. ఎక్స్ వేదికగా ప్రీతి జింటా మాట్లాడుతూ..'మాటలు జాగ్రత్త. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది వాగొద్దని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు కథనాల వల్ల ఆటగాళ్లు, ఫ్రాంచైజీ ప్రతిష్టకు నష్టం కలుగుతోంది. విమర్శలకు, తప్పుడు కథనాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆటలో తప్పులకు సంబంధించి ఎలాంటి చర్చనైనా స్వాగతిస్తాం. కానీ వ్యక్తులకు, జట్టుకు, ఫ్రాంచైజీ బ్రాండ్‌కు నష్టం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తే ఎంతమాత్రం సహించము. వీటిని తేలికగా తీసుకోలేము. సమాచారాన్ని ప్రచారం చేసే ముందు వ్యక్తులు, మీడియా నిపుణులు, సోషల్ మీడియా ప్రతినిధులు వాస్తవాలు తెలుసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుతున్నా' అని పేర్కొంది. There’s a difference between criticism & calculated misinformation. Healthy debate around the game is welcome, but the deliberate spread of fake narratives to damage individuals, the team, or the brand should not & will not be taken lightly. I urge everyone including verified… https://t.co/yeqbsTwLBd— Preity G Zinta (@realpreityzinta) May 12, 2026ఇదే విషయమై పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ఎక్స్ వేదికగా స్పందించిది. 'విమర్శలు, సరదా సంభాషణలు, అభిప్రాయాలు క్రీడలో భాగమే. కానీ టీఆర్పీ, వ్యూస్ కోసం నకిలీ వార్తలు, కథనాలు రాయడం సరికాదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ముందు వాస్తవాలు ఏంటన్నది గ్రహించాలని మేము కోరుతున్నాము' అని తెలిపింది.Criticism, banter, and opinions are part of sport. Fake stories and made-up narratives for cheap engagement are not. We urge everyone to verify facts before spreading misinformation for attention or traction.— Punjab Kings (@PunjabKingsIPL) May 12, 2026చదవండి: హార్దిక్ నిజంగా గాయపడ్డాడా? -
‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. 200 పరుగులకు పైగా టార్గెట్ నిర్దేశించి కూడా పంజాబ్ ఓడిపోవడంపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే ధర్మశాల పిచ్‌పై పంజాబ్ కెప్టెన్ అయ్యర్ ఒక్క ఓవర్ కూడా స్పిన్నర్లతో వేయించకపోవడం ఆ జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. మరోవైపు ఢిల్లీ కూడా ఒక్క స్పిన్నర్తోనై బౌలింగ్ చేయించకపోవడం గమనార్హం. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. ‘ధర్మశాల వంటి ఫ్లాట్ పిచ్‌పై 210 పరుగుల లక్ష్యం చాలా ఎక్కువ. కానీ సీమర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై మరో 20 నుంచి 30 పరుగులు చేసి ఉంటే బాగుండేదేమో. చాహల్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం వెనుక ఒకటే కారణం. బంతి సీమర్లకు బాగా అనుకూలిస్తుందని భావించాను. కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు హార్డ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం ఉత్తమం. అక్కడ నిలకడగా బౌలింగ్ చేస్తే కనీసం ఒక్క బంతయినా మిస్-హిట్ అయ్యి వికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మా సీమర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసరడంలో విఫలమయ్యారు. మా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు ఫీల్డింగ్‌లో లోపాలు మా కొంపముంచాయి. మా ప్రణాళికలన్నీ ఆచరణలో దారుణంగా విఫలమయ్యాయి.’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఈ ఓటమితో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోగా, ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: ‘ఐసీసీ మాట వినలేదు.. మాకు ఇది జరగాల్సిందే’ -
IPL 2026: పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ విజయం
ఐపీఎల్ 19వ సీజన్లో సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) అర్థసెంచరీలతో ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆఖర్లో అశుతోశ్ శర్మ (24) , మాధవ్ తివారి (18 నాటౌట్), అకిబ్ నబీ (10 నాటౌట్) హిట్టింగ్తో విజయాన్ని అందించారు. అంతకముందు పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీఅర్థసెంచరీ సాధించిన అక్షర్ పటేల్ (56) మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో బెన్ ద్వార్సుస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 138 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (39), అశుతోశ్ శర్మ (7) పరుగులతో ఆడుతున్నారు.ఆశలు రేపుతున్న అక్షర్, మిల్లర్211 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 44, డేవిడ్ మిల్లర్ 26 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఇద్దరు 28 బంతుల్లోనే 50 పరుగులు జోడించి ఢిల్లీ శిబిరంలో ఆశలు పెంచుతున్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. 12 పరుగులు చేసిన స్టబ్స్ రనౌట్ కావడంతో ఢిల్లీ 74 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ 25 పరుగులతో ఆడుతున్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ211 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అభిషేక్ పొరేల్ (5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో పొరేల్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 2 ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది.ఢిల్లీ లక్ష్యం 211 పరుగులుఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. కూపర్ కన్నోలి (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.శ్రేయస్ అర్థశతకం17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 50), కన్నోలి (34) పరుగులతో ఆడుతున్నారు. హాఫ్ సెంచరీ బాది ప్రియాన్ష్ ఔట్పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యా ఔటయ్యాడు. 33 బంతుల్లో 6 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 56 పరుగులు బాదిన ప్రియాన్ష్ ఆ తర్వాత మాధవ్ తివారీ బౌలింగ్‌లో సాహిల్ పరాఖ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ (13), కూపర్ (5) ఉన్నారు. స్కోరు107-2 (10 ఓవర్లకు)గా ఉంది.ప్రభ్సిమ్రాన్ సింగ్ ఔట్పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఔక్విబ్ నబీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ప్రియాన్ష్ ఆర్యా (51), శ్రేయాస్ అయ్యర్ (0) ఉన్నారు. స్కోరు 7 ఓవర్లకు 78-1గా ఉంది.ప్రియాన్ష్ ఫిఫ్టీ.. పంజాబ్ 72/0ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఫిఫ్టీ మార్క్ సాధించాడు. 24 బంతుల్లో అర్థశతకం సాధించిన ప్రియాన్ష్ ఇన్నింగ్స్‌లో ఒక బౌండరీ సహా ఆరు సిక్సర్లు ఉండడం విశేషం. 6 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. మరో ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ 15 పరుగులతో ఆడుతున్నాడు.దంచుతున్న ప్రియాన్ష్.. 3 ఓవర్లలో 51/0ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టోకుండా 51 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్ (5) పరుగులతో ఆడుతున్నాడు.టాస్ ఓడిన పంజాబ్టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తరఫున బెన్ ద్వార్షుయిస్ ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మార్పులతో బరిలోకి దిగింది. అభిషేక్ పొరేల్, సాహిల్ పరాక్, డేవిడ్ మిల్లర్, అకిబ్ నబీ, మాధవ్ తివారి తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్‌లో గెలిచి పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్ అందుకోవాలని చూస్తోంది. మరోవైపు పంజాబ్‌తో మ్యాచ్ ఢిల్లీకి చావో రేవో లాంటిది. ప్రస్తుతం ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఢిల్లీకి ప్లేఆఫ్ అవకాశాలు మిగిలి ఉంటాయి. ఓడితే మాత్రం ముంబై, లక్నో తర్వాత ఎలిమినేట్ అవనున్న మూడో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలవనుంది. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్లతో విజయాన్ని అందుకుంది. మొదట ఢిల్లీ 264 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత పంజాబ్ 18.5 ఓవర్లలోనే 265 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 35 సార్లు తలడిపతే 18 సార్లు పంజాబ్, 17 సార్లు ఢిల్లీ నెగ్గింది. 2023 నుంచి చూసుకుంటే ఈ రికార్డు 3-2గా ఉంది. ఇక ధర్మశాలలో ఇరుజట్లు చెరో 2 విజయాలతో సమానంగా ఉన్నాయి.తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి ఎన్గిడి.పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, బెన్ ద్వార్షుయిస్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్‌లు: పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, త్రిపురాన విజయ్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: హర్‌ప్రీత్ బ్రార్, యష్ ఠాకూర్, జేవియర్ బార్ట్లెట్, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే🚨Toss update from Dharamshala 🚨@DelhiCapitals won the toss and elected to bowl first against @punjabkingsiplUpdates ▶️ https://t.co/wHhflKIvCR#TATAIPL | #KhelBindaas | #PBKSvDC pic.twitter.com/uia9sh01xL— IndianPremierLeague (@IPL) May 11, 2026 -
అయ్యర్ కు చెక్.. టీ20 కెప్టెన్ గా సంజు శాంసన్
-
అయ్యర్‌కు షాక్.. శాంసన్‌కు డబుల్ ప్రమోషన్!
టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌పై త్వరలో వేటు పడనుంది. ఈ మేరకు బీసీసీఐ కొత్త టీ20 కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. అయితే శ్రేయస్ అయ్యర్ తదుపరి భారత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటాడంటూ వార్తలు వస్తున్న వేళ.. తాజాగా కెప్టెన్సీ రేసులోకి అనూహ్యంగా సంజూ శాంసన్ పేరు తెరమీదకు రావడంతో పోటీ ఆసక్తిగా మారింది. ఎందుకంటే అయ్యర్ కెప్టెన్ అయితే సంజూ శాంసన్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఊహాగానాలు వ్యక్తమయిన వేళ శాంసన్ ఏకంగా కెప్టెన్ కుర్చీపై కర్చీఫ్ వేసి అయ్యర్‌కే ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ అయ్యర్‌కే అధిక ప్రాధన్యమిచ్చే అవకాశమున్నప్పటికీ శాంసన్ రేసులోకి వస్తే అతడిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. దీంతో కెప్టెన్ కావాలనుకున్న అయ్యర్‌కు ఇప్పుడు శాంసన్ రూపంలో పెద్ద గండం వచ్చి పడింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ నుంచి సీఎస్కేకు ట్రేడింగ్ అయిన సంజూ శాంసన్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం సీఎస్కేకు అతడు కెప్టెన్ కాకపోయినప్పటికీ గతంలో రాజస్తాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన అనుభవం శాంసన్‌కు ఉపయోగపడనుంది. అనుభవానికి తోడు కెప్టెన్‌గా రాజస్తాన్‌ను విజయవంతంగా నడిపించడమే శాంసన్‌ను కెప్టెన్సీ రేసులో నిలబెట్టినట్లు కనిపిస్తోంది. ఇక టీమిండియా వచ్చే జూన్, జూలై నెలల్లో ఇంగ్లండ్, ఐర్లాండ్‌లో వైట్‌బాల్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించి ఆటగాళ్ల ఎంపిక ఐపీఎల్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. ముంబై బ్యాటర్‌గా సూర్యకుమార్ దారుణ ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడు చోటు కోల్పోయే అవకాశముంది. ఇప్పటికే పరుగుల పరంగా శాంసన్, శ్రేయస్ అయ్యర్ టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు.శాంసన్ ఎందుకంటే?భారత తదుపరి టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో శాంసన్‌కు అనుకూలంగా ఉన్న అంశం ఏంటంటే.. అతను భారత టీ20 జట్టులో నిలకడగా ఉండటమే. 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి జట్టుతో పాటు కొనసాగుతున్న శాంసన్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. 62 మ్యాచ్‌లాడి మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలతో 1,399 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ టీ20 ప్రపంచ కప్ విజయంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో కెప్టెన్‌గా రాణిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా టీమిండియా ఆడే టీ20 జట్టులో ఇప్పటివరకు చోటు లేకపోవడం మైనస్‌గా మారింది. అయ్యర్ భారత్ తరఫున తన చివరి టీ20 మ్యాచ్‌ను 2023 డిసెంబర్ 3న ఆడాడు. ఒకవేళ అయ్యర్ పొట్టి ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇస్తే మాత్రం అతడికి బూస్టప్ అని చెప్పొచ్చు. దీనికి తోడు అతను టీ20 కెప్టెన్ అయితే అతని కెరీర్ గ్రాఫ్ కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20ల కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌నే కొనసాగించే అవకాశం ఉందని, అయితే మరోసారి పేలవ ఫామ్ కనబరిస్తే మాత్రం సూర్య స్థానంలో బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయనుంది.చదవండి: చిక్కుల్లో జైస్వాల్, షఫాలీ.. నిషేధం పడే అవకాశం! -
BCCI సంచలన నిర్ణయం.. సూర్య ఔట్.. టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్
-
శ్రేయస్ కెప్టెన్ అయితే వీళ్ల కెరీర్ ఖతం!
టీమిండియా ఇటీవలే 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ సారథ్యంలో భారత్ మూడోసారి పొట్టి కప్పును అందుకుంది. అయితే బీసీసీఐ మాత్రం అప్పుడే 2028 టీ20 ప్రపంచకప్ కోసం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో మెన్ ఇన్ బ్లూను సరికొత్తగా తయారు చేసేందుకు కసరత్తులు నిర్వహిస్తోంది. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ తర్వాత టీ20 ప్రపంచకప్ అందుకున్న మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ నిలిచాడు. అయితే బీసీసీఐ మాత్రం వచ్చే 2028 టీ20 ప్రపంచకప్ నాటికి సూర్యకుమార్ స్థానంలో కొత్త టీ20 కెప్టెన్‌ను ఎంపిక చేయాలనే యోచనలో ఉంది. ఇప్పటికే ఐపీఎల్లో తన కెప్టెన్సీతో అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు గిల్ కూడా రేసులో ఉన్నాడు. కానీ బీసీసీఐ మాత్రం శ్రేయస్ అయ్యర్‌వైపే మొగ్గుచూపే అవకాశముంది. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్లలో శ్రేయస్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్‌లో మంచి స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించడంతో పాటు ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్‌ను విజేతగా నిలిపాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌ను 2025లో ఫైనల్ చేర్చాడు. ఈ సీజన్లోనూ శ్రేయస్ కెప్టెన్‌గా సత్తా చాటుతూ పంజాబ్‌ను టైటిల్ దిశగా నడిపిస్తున్నాడు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ టీమిండియా టీ20 కెప్టెన్ అయితే మాత్రం ముగ్గురు ఆటగాళ్ల కెరీర్‌కు ముగింపు పడినట్లేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురే ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్, సంజూ శాంసన్, వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.సూర్యకుమార్ యాదవ్శ్రేయస్ అయ్యర్ టీమిండియా టీ20 కెప్టెన్ అయితే మాత్రం మొదట జట్టు నుంచి దూరమయ్యేది సూర్యకుమార్. టీ20 క్రికెట్లో సూర్యకుమార్‌కు ఘనమైన రికార్డు ఉంది. మిస్టర్ 360 డిగ్రీస్ పేరుతో అతడిని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. అయితే గత రెండేళ్లలో సూర్యకుమార్ ఆటతీరు దారుణంగా ఉంది. ముఖ్యంగా కెప్టెన్ అయిన తర్వాత అతడిలో మునుపటి ఆట కనిపించడం లేదు. ఇందుకు గణాంకాలే సాక్ష్యం. 2025 సీజన్లో టీమిండియా తరఫున 19 టీ20 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్ 218 పరుగులు సాధించాడు. ఇక ఈ ఏడాది 14 మ్యాచ్‌లాడిన సూర్య 484 పరుగులు సాధించాడు. గతంలో ఒకే ఏడాదిలో వెయ్యి పరుగులు అవలీలగా సాధించిన సూర్య క్రమంగా తన ఫామ్‌ను కోల్పోతూ వచ్చాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ సూర్యకుమార్ 136 స్ట్రైక్‌రేట్‌తో 242 పరుగులు మాత్రమే చేశాడు. కీలకమైన మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్లోనూ సూర్యకుమార్ బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు. మరో విషయం ఏంటంటే.. అయ్యర్ టీమిండియాలోకి వస్తే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. సూర్య కూడా అదే స్థానంలో బరిలోకి దిగుతుంటాడు. వయసు పరంగా చూసుకున్నా శ్రేయస్ (31 ఏళ్లు) కంటే సూర్యకుమార్(35 ఏళ్లు) నాలుగేండ్లు పెద్ద. ఏ లెక్కన చూసుకున్నా శ్రేయస్ టీమిండియా టీ20 జట్టులోకి ఎంట్రీ ఇస్తే మొదటి వికెట్ సూర్యకుమార్‌దే.సంజూ శాంసన్ఈ లిస్టులో సంజూ శాంసన్ పేరు ఉండడం కాస్త ఆశ్చర్యంగా అనిపించినా నమ్మక తప్పదు. ప్రస్తుతం టీమిండియా జట్టులో అభిషేక్‌తో కలిసి శాంసన్ ఓపెనింగ్ వస్తున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ సూపర్-8 దశ నుంచి ఫామ్ అందుకున్న శాంసన్ టీమిండియాకు టైటిల్ అందించడంతో పాటు ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఎగరేసుకుపోయాడు. అయితే శ్రేయస్ కెప్టెన్ అయితే అతడి మదిలో కొందరు యువ ఆటగాళ్లు పేర్లు మెదలడం ఖాయం. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న ప్రియాన్ష్ ఆర్య సహా రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పేర్లను బయటపెట్టే అవకాశముంది. ఈ లెక్కన వీరిద్దరిలో ఎవరు జట్టులోకి వచ్చినా సంజూ శాంసన్ డగౌట్‌కు పరిమితం అవ్వాల్సిందే. ఇప్పటికే గిల్, జైస్వాల్ రూపంలో ఓపెనింగ్ స్థానానికి పోటీ తీవ్రంగా ఉంది. దీంతో శాంసన్ ఫామ్ కోల్పోయి సరిగ్గా ఆడకుంటే మాత్రం కెరీర్ కూడా ప్రమాదంలో పడినట్లే.కుల్దీప్ యాదవ్కుల్దీప్ యాదవ్ టీమిండియాలో సీనియర్ బౌలర్‌గా ఉన్నాడు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న క్రికెటర్లలో కుల్దీప్ కూడా ఒకడు. అయినప్పటికీ శ్రేయస్ కెప్టెన్ అయితే కుల్దీప్ జట్టులో స్థానంలో కోల్పోవచ్చు. తనకంటూ స్ట్రాంగ్ బౌలర్లు కావాలని అయ్యర్ అనుకుంటే మాత్రం కుల్దీప్ స్థానంలో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్, యజ్వేంద్ర చాహల్ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ ఆడాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లోనూ కుల్దీప్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన కుల్దీప్ కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయినంత మాత్రానా వీళ్ల కెరీర్‌కు ఇప్పటికిప్పుడు ముప్పు లేకపోయినా భవిష్యత్తులో జరిగే అవకాశముంది. అయితే ఇదంతా కేవలం ఊహాగానాలు మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.చదవండి: దిగ్గజ క్రికెటర్ ఇంట్లో మాజీ అధికారి ఆత్మహత్య! -
భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
భారత టీ20 జట్టు కెప్టెన్సీ మార్పుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు సూర్యకుమార్ యాదవ్ నుంచి శ్రేయస్ అయ్యర్‌కు బదిలికానున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌కు మెసేజ్ కూడా పంపినట్లు తెలుస్తోంది.సూర్యకుమార్ నేతృత్వంలో భారత్ 2026 టీ20 వరల్డ్ కప్‌ను గెలిచినప్పటికీ, అతని ఇటీవలి బ్యాటింగ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. దీంతో బీసీసీఐ లాంగ్ టర్మ్ ప్లానింగ్‌తో (2028 టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని) కొత్త నాయకుడిని ఎంపిక చేయాలని భావిస్తోంది. వయసు మరియు జట్టులో యంగ్ కోర్‌ను బలోపేతం చేయాలనే ఆలోచన కూడా ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.శ్రేయస్సే ఎందుకు..? ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ ఐపీఎల్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్సీతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలతోనూ సెలెక్టర్లను మెప్పించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌లో 333 రన్స్ సాధించి 47.57 సగటు, 164.04 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ప్రశాంతంగా జట్టును నడిపించే విధానం శ్రేయస్ కెప్టెన్సీ కేసును బలపరిచాయి.శ్రేయస్‌కు గతంలో భారత టెస్ట్ మరియు వన్డే జట్లకు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది. అతని కామ్ అండ్ కూల్ అప్రోచ్, మెచ్యూర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ భారత టీ20 జట్టుకు కావాల్సిన లక్షణాలుగా పరిగణించబడుతున్నాయి.పేలవ ఫామ్‌లో సూర్యప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 195 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ (145.52) కూడా చాలా దారుణంగా ఉంది. ప్రస్తుత బ్యాటింగ్ ఫామ్ కారణంగా సూర్య టీమిండియా కెప్టెన్సీ స్థానం ప్రమాదంలో పడింది.కెప్టెన్సీ పోయినా జట్టులో ఉంటాడు..!సూర్య భారత టీ20 జట్టు కెప్టెన్సీ కోల్పోయినా, సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్లో ఇంకా కొన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. వాటిలో ఫామ్‌ను నిరూపించుకుంటే, తప్పక త్వరలో జరుగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఎంపిక కావచ్చు. -
శ్రేయస్ అయ్యర్ మరో టైటిల్ గెలిస్తే...
న్యూఢిల్లీ: ఐపీఎల్లో సారథిగా శ్రేయస్ అయ్యర్ రెండో టైటిల్‌ను గెలవగలిగితే అతను దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేరతాడని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. జియో స్టార్ ‘అవుట్ ఆర్ నాటౌట్’ కార్యక్రమంలో అయ్యర్ నాయకత్వ లక్షణాలను అతను ప్రశంసించాడు. ‘శ్రేయస్ అయ్యర్ మరో సీజన్లో తన టీమ్‌ను సమర్థంగా నడిపిస్తున్నాడు. అతను ఢిల్లీ, కోల్‌కతా, పంజాబ్... ఎక్కడ కెప్టెన్‌గా చేసినా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ప్రదర్శించాడు. తన ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచుతాడు. ప్రశాంతంగా తనకు కావాల్సింది రాబట్టగల సామర్థ్యం అతనికి ఉంది. మరో ట్రోఫీ గెలిస్తే ధోని, రోహిత్, గంభీర్ల సరసన శ్రేయస్ చేరతాడు’ అని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు. -
‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్‌ను శ్రేయస్ సాధిస్తాడు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్‌లు విజయవంతమైన కెప్టెన్లుగా ముద్రపడ్డారు. ఇందులో ధోని, రోహిత్‌లు ఐదేసి సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకోగా.. గంభీర్ సారథ్యంలో కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందుకుంది. తాజాగా వీరి సరసన చేరేందుకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిద్ధమవుతున్నాడు. 2024లో కేకేఆర్‌కు మూడోసారి టైటిల్ అందించిన శ్రేయస్ లక్కీ కెప్టెన్‌గా మారిపోయాడు. జట్లు మారినప్పటికీ తన కెప్టెన్సీ, ఆటతీరుతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అయ్యర్ పేరు సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్‌ను అయ్యర్ విజేతగా నిలబెడితే ధోని, రోహిత్ శర్మను కూడా అధిగమిస్తాడని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. జియో హాట్‌స్టార్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన పఠాన్ మాట్లాడుతూ.. 'ధోని, రోహిత్, గంభీర్ వంటి అత్యుత్తమ ఐపీఎల్ కెప్టెన్లను దాటుకొని మరీ తొలి స్థానంలో నిలుస్తాడు. ఎందుకంటే ధోని, రోహిత్, గంభీర్‌లు ఒకే జట్టుకు టైటిల్స్ అందించారు. కానీ అయ్యర్ మాత్రం ఇప్పటికే కేకేఆర్‌కు టైటిల్ అందించాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు కూడా టైటిల్ అందిస్తే వేర్వేరు జట్లకు టైటిల్స్ అందించిన తొలి కెప్టెన్‌గా అయ్యర్ నిలవనున్నాడు. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ ఇలా మూడు వేర్వేరు జట్లను కూడా ఐపీఎల్లో ఫైనల్ చేర్చిన ఘనత అయ్యర్ సొంతం. ఒకవేళ అయ్యర్ ఈ సీజన్లో అది సాధిస్తే మాత్రం అతడి రికార్డు చెరిగిపోనిదిగా మిగిలిపోతుంది' అని పఠాన్ పేర్కొన్నాడు.ఇక ఐపీఎల్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న అయ్యర్ 2020 సీజన్లో ఆ జట్టును రన్నరప్‌గా నిలిపాడు. ఆ తర్వాత కేకేఆర్‌కు మారిన శ్రేయస్ అయ్యర్ 2024 సీజన్లో ఆ జట్టును చాంపియన్‌గా నిలిపాడు. 2025 సీజన్లో పంజాబ్‌ను ఫైనల్ చేర్చిన అయ్యర్ 2026 సీజన్లోనూ ఆ జట్టును టైటిల్ దిశగా అడుగులు వేయిస్తున్నాడు. పంజాబ్ తరఫున 33 మ్యాచ్‌లు, ఢిల్లీ తరఫున 41 మ్యాచ్‌లు, కేకేఆర్ తరఫున 29 మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా పనిచేశాడు. అతని సక్సెస్ రేటు 90 శాతం ఉండడం గమనార్హం.చదవండి: ‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ!’ -
IPL 2026: పంజాబ్‌పై ఎస్ఆర్హెచ్ గెలుపు
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. కూపర్ కన్నోలీ (107 నాటౌట్) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, శివాంగ్‌లు రెండు వికెట్లు తీయగా.. నితీశ్‌కుమార్, మలింగ, సాకిబ్ హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సూర్యాంశ్ కమిన్స్ బౌలింగ్‌లో అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 114 పరుగులుచేసింది.నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో పంజాబ్ కష్టాల్లో పడింది. 28 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.శ్రేయస్ (5) ఔట్.. మూడో వికెట్ డౌన్భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. 5 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో ఔట్ అవ్వడంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది.పంజాబ్‌కు షాక్.. ఓపెనర్లిద్దరు ఔట్236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కమిన్స్ బౌలింగ్‌లో ఒక్క పరుగు చేసిన ప్రియాన్ష్ ఆర్య మలింగకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్ తొలి బంతికే నితీశ్ కుమార్ బౌలింగ్ ప్రబ్‌సిమ్రన్ (3) ఔట్ అయ్యాడు.పంజాబ్ టార్గెట్ 236 పరుగులుఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు.అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్‌కుమార్‌లు తలా ఒక వికెట్ తీశారు.క్లాసెన్ అర్థసెంచరీ.. ఎస్ఆర్హెచ్ 212-3పంజాబ్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 18 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. క్లాసెన్ అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. నితీశ్‌కుమార్ (26) పరుగులతో ఆడుతున్నాడు.అర్ధ శతకం బాది ఇషాన్ ఔట్ ఇషాన్ కిషన్ అర్ధ శతకం బాది ఔటయ్యాడు. 32 బంతుల్లో 4 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. క్రీజులోకి నితీశ్ కుమార్ రెడ్డి వచ్చాడు. స్కోరు 174-3 (15 ఓవర్లలో)గా ఉంది.9 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 107-2పంజాబ్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 8వ ఓవర్లో వంద పరుగుల మార్క్‌ను దాటింది. 9 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఇషాన్ (17), క్లాసెన్ (14) పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్పంజాబ్తో మ్యాచ్‌లో ధాటిగా ఆడుతున్న హెడ్ (38) చాహల్ బౌలింగ్‌లో మార్కో జాన్సెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 84 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.దంచికొడుతున్న హెడ్6 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (35) పంజాబ్ బౌలర్లను ఉతికారేస్తున్నాడు. ఇషాన్ కిషన్ (7) పరుగులతో ఆడుతున్నాడు.అభిషేక్ శర్మ (35) ఔట్పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 54 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 13 బంతుల్లో 35 పరుగులతో దూకుడు ప్రదర్శించిన అభిషేక్ శర్మ ఫెర్గూసన్ బౌలింగ్‌లో అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.టాస్ పంజాబ్దేటాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. ఎస్ఆర్హెచ్ జట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డి రీఎంట్రీ ఇవ్వగా.. పంజాబ్ జట్టులోకి శశాంక్ సింగ్ తిరిగి వచ్చాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో ఎస్ఆర్హెచ్పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి ఎస్ఆర్హెచ్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 25 సార్లు తలపడితే ఎస్ఆర్హెచ్ 17 సార్లు, పంజాబ్ 8 సార్లు నెగ్గింది. ఇక హైదరాబాద్‌లో పంజాబ్‌తో ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ 9 సార్లు నెగ్గితే.. పంజాబ్ ఒకసారి మాత్రమే గెలిచింది.తుదిజట్లు:పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రియాంష్ ఆర్య, హర్‌ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్సన్రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్‌లు: అనికేత్ వర్మ, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్ -
మళ్లీ విజయం వేటలో..ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ (ఫొటోలు)
-
ఇక్కడ ఓడినా.. SRHపై గెలుస్తాం: శ్రేయస్ అయ్యర్
గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయంపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటర్లకు ఆరంభంలో అంతగా అనుకూలించకపోయినా.. తాము మెరుగైన స్కోరు సాధించడం సంతోషమన్నాడు. ఏదేమైనా క్రెడిట్ గుజరాత్ బౌలర్లకు దక్కుతుందని.. వాళ్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. 163 పరుగులుసొంతమైదానంలో ఆదివారం జరిగిన పోరులో మాజీ చాంపియన్ గుజరాత్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. సీజన్ ఆరంభంలో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో పరాజయం ఎరగకుండా సాగిన పంజాబ్‌కిది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది.టాపార్డర్ విఫలం కాగా... సూర్యాంశ్ (29 బంతుల్లో 57; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... స్టొయినిస్ (31 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) విలువైన పరుగులు చేశాడు. 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో ఈ జంట ఆరో వికెట్‌కు 44 బంతుల్లో 79 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హోల్డర్ 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... సిరాజ్, రబాడ చెరో 2 వికెట్లు తీశారు.సాయి సుదర్శన్ అర్ధశతకంఅనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (41 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో ఆకట్టుకోగా... వాషింగ్టన్ సుందర్ (23 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, వైశాక్ చెరో 2 వికెట్లు తీశారు.సిరాజ్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు... ఈ సీజన్లో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న హైదరాబాదీ పేసర్ సిరాజ్... తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో పంజాబ్ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికి బతికిపోయిన ప్రియాన్ష్ ఆర్య (2) రెండో బంతికి అవుట్ కాగా... తదుపరి బంతికి కూపర్ (0) పెవిలియన్ బాట పట్టాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (15) ఎక్కువసేపు నిలవలేకపోగా... నేహల్ వధేరా (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (19) కూడా అవుటవ్వడంతో పంజాబ్ జట్టు 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో స్టొయినిస్‌తో కలిసి సూర్యాంశ్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మానవ్ సుతార్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో సూర్యాంశ్ వరుసగా 6, 6, 4, 4, 6 కొట్టడంతో 27 పరుగులు వచ్చాయి.ఇక కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో మరోసారి గుజరాత్ బౌలర్లు విజృంభించడంతో పంజాబ్ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆశించిన స్కోరు సాధించలేకపోయింది. స్టొయినిస్, బార్ట్లెట్ (0)ను వరుస బంతుల్లో అవుట్ చేసిన హోల్డర్ పంజాబ్‌ను కట్టడి చేశాడు.చక్కగా ఉపయోగించుకున్నారుఈ నేపథ్యంలో పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వికెట్ మీద మేము ఈ మేరకు స్కోరు చేయడం వ్యక్తిగతంగా గొప్ప విషయంగానే భావిస్తున్నా. ముఖ్యంగా కొత్త బంతితో వాళ్లు అటాక్ చేస్తున్న వేళ మేము మెరుగైన ఆరంభమే అందుకున్నాం. అయితే, గుజరాత్ బౌలర్లు ఈ వికెట్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు.సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు సంధించారు. పవర్ ప్లేలో మేము వరుసగా వికెట్లు కోల్పోయాము. అయినా పుంజుకోగలిగాము. మా బౌలర్లు కూడా మెరుగ్గా ఆడారు. కానీ ఈరోజు మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయాము. గెలవాలనే ఇక్కడికి వచ్చాము. అయితే, పని పూర్తి చేయలేకపోయాము.SRHపై గెలుస్తాంతదుపరి ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం. కచ్చితంగా ఆ జట్టుపై గెలిచి మరో రెండు పాయింట్లు మా ఖాతాలో జమ చేసుకుంటాము’’ అని పేర్కొన్నాడు. కాగా పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ వేదికగా బుధవారం సన్‌రైజర్స్‌తో తలపడనుంది. కాగా పంజాబ్ ఇప్పటికి తొమ్మిదింట ఏడు విజయాలతో పట్టికలో టాప్‌లో ఉండగా.. సన్‌రైజర్స్ పదింట ఆరు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో తొలి ముఖాముఖి పోరులో పంజాబ్ సన్‌రైజర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.చదవండి: నా వల్లే ఓటమి.. భారీ మూల్యమే చెల్లించాం: కమిన్స్ -
శ్రేయస్ కాదు!.. భారత టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ భవితవ్యం త్వరలోనే తేలనుంది. ఇంగ్లండ్ పర్యటనలో అతడి ప్రదర్శన ఆధారంగానే అతడిని కొనసాగించాలా? లేదా? అన్న అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.కాగా సూర్య ఇటీవలే భారత్‌కు టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించాడు. కెప్టెన్‌గా సూపర్ హిట్ అయినా.. బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మరోవైపు.. టీమిండియా 2028లో టీ20 ప్రపంచకప్‌తో పాటు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ఆడాల్సి ఉంది.యువ నాయకుడి సారథ్యంలోఇలాంటి తరుణంలో 35 ఏళ్ల సూర్యకు స్వస్తి పలికి.. యువ నాయకుడి సారథ్యంలో జట్టును తీర్చిదిద్దాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ప్రత్యామ్నాయంగా శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) పేర్లు తెరమీదకు వచ్చాయి.అయితే, గిల్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా పేలవంగా ఆడి వరల్డ్‌కప్ జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ అయినప్పటికీ సెలక్టర్లు అతడిపై వేటు వేసేందుకు ఏమాత్రం వెనకాడలేదు. కాబట్టి ఇప్పట్లో అతడికి టీ20 జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించకపోవచ్చు.రేసులో ఈ ఐదుగురుమరోవైపు.. రోహిత్ శర్మ (Rohit Sharma) తర్వాత హార్దిక్ పాండ్యానే టీ20 జట్టు కెప్టెన్ కావాల్సి ఉండగా.. బీసీసీఐ అనూహ్యంగా సూర్యకు పగ్గాలు అప్పగించింది. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నైపుణ్యాలున్న హార్దిక్‌పై అధిక భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ఇక సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌లకు మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వడం దాదాపు అసాధ్యమే. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ 2023, డిసెంబరు తర్వాత ఇంత వరకు టీ20 జట్టులో పునరాగమనమే చేయలేదు. అయితే, దేశవాళీ, ఐపీఎల్లో టీ20 కెప్టెన్‌గా, బ్యాటర్‌గా సత్తా చాటడం శ్రేయస్‌కు సానుకూలాంశం.ఈ నేపథ్యంలో సూర్య స్థానాన్ని శ్రేయస్ అయ్యర్‌తోనే భర్తీ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా క్రిక్‌బ్లాగర్ మాత్రం ఇందుకు భిన్నమైన కథనం అందించింది. ‘‘మెజారిటీ మంది మాజీ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌ను చేయాలని సూచిస్తున్నారు.తెరమీదకు ఊహించని పేరుకానీ సెలక్టర్లు మాత్రం ఇందుకు సుముఖంగా లేరు. జాతీయ టీ20 జట్టు, వరల్డ్‌కప్ జట్టులో స్థానమే లేని ఆటగాడిని ఏకంగా కెప్టెన్‌ను చేసేందుకు వారు సిద్ధంగా లేరు. ఏదేమైనా శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ కంటే.. టీ20 కెప్టెన్సీ రేసులో ఇషాన్ కిషన్ ముందు వరుసలో ఉన్నాడు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సదరు కథనం పేర్కొంది.కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ2025-26 సీజన్లో జార్ఖండ్ కెప్టెన్, బ్యాటర్‌గా రాణించి ఇషాన్ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. ఈ క్రమంలోనే భారత టీ20 జట్టులో పునరాగమనం చేసి.. వరల్డ్‌కప్-2026లో అదరగొట్టాడు. అదేవిధంగా.. ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో ఇషాన్ చుట్టూ యువ జట్టును తీర్చిదిద్దాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.చదవండి: రియాన్ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు -
అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ పరాజయం పాలైంది. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఈ కొండంత లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో ఊదిపడేసింది.రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (51), డోనోవన్ ఫెరీరా ( 26 బంతుల్లో 52*), వైభవ్ సూర్యవంశీ(43), శుభమ్ దూబే(12 బంతుల్లో 31) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. తమకు ఎదురైన తొలి పరాజయంపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయామని అయ్యర్ చెప్పుకొచ్చాడు."ఈ వికెట్‌పై 222 పరుగులు చేయడం చాలా గొప్ప విషయం. పిచ్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికి మా బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కచ్చితంగా వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. అయినప్పటికి ఈ భారీ స్కోర్‌ను డిఫెండ్ చేసుకోలేకపోవడం నిరాశ కలిగించింది. బౌలింగ్‌లో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. మేము ఎక్కువగా స్లో బాల్స్, యార్కర్లు వేయాలని ప్లాన్ చేసుకున్నాం.కానీ మేము అనుకున్నది చేయలేకపోయాము. మిడిల్ ఓవర్లలో రాజస్తాన్ బ్యాటర్లు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా ఫెరీరా, శుభమ్ దుబే చివరి ఓవర్లలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వారిద్దరి మధ్య నెలకొన్ని భాగస్వామ్యమే మ్యాచ్‌ను మా నుంచి దూరం చేసింది. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో బ్యాటర్లు మొదటి బంతి నుంచే విరుచుకుపడుతున్నారు.కాబట్టి బౌలర్లు పక్కా ప్లాన్‌తో రావడం కష్టమైన పని. ఈ రోజు మాకు బౌలింగ్‌లో కలిసిరాలేదు అంతే. ఇక నిరంతర ప్రయాణాలు, మ్యాచ్‌ల వల్ల మేము కాస్త అలిసిపోయాము. కానీ దాన్ని సాకుగా చెప్పలేము. మా తదుపరి మ్యాచ్‌కు కాస్త విరామం దొరికింది. మళ్లీ మా ప్రణాళికలు సిద్దం చేసుకుని బలంగా తిరిగి వస్తాం.ఈ సీజన్లో మాకు ఇది తొలి ఓటమి. ఈ ఓటమి నుచి చాలా పాఠాలు నేర్చుకున్నాము. మేము ఇప్పటికే 200 పరుగులకు పైగా ఛేజ్ చేశాం, అదే టార్గెట్‌ను డిఫెండ్ కూడా చేశాం. కాబట్టి ఈ మ్యాచ్ ఫలితం గురుంచి పెద్దగా ఆలోచించం. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో మా స్పిన్నర్లు హర్‌ప్రీత్ బ్రార్, చాహల్ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా హర్‌ప్రీత్‌కు ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. అయినప్పటికి అతడు తన 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు ఇచ్చి మా టీమ్‌లో బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు"అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అయ్యర్ పేర్కొన్నాడు. పంజాబ్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 3న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.చదవండి: IPL 2026: జైలుకు రియాన్ పరాగ్? -
‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2026 సీజన్లో దుమ్మురేపుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వైవిధ్యమైన ఆటతో శ్రేయస్ తన ముద్ర ఎప్పుడో వేశాడు. టీమిండియా తరఫున వన్డేల్లో నిలకడగా మారుపేరుగా నిలిచిన శ్రేయస్ టీ20ల్లో మాత్రం ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్లో మాత్రం అదే టీ20ల్లో తన కెరీర్ బెస్ట్ ఫామ్ కనబరుస్తున్నాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు అతనొక కెప్టెన్ మాత్రమే కాదు.. బ్యాటర్‌గా, ఫినిషర్‌గానూ సత్తా చాటుతూ అన్ని పాత్రలను సమర్థంగా పోషిస్తున్నాడు. అయితే ఈ మార్పు వెనుక తనను చికాకు పెట్టేలా కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తన మైండ్‌లో ఉన్నట్లు శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఆ వ్యాఖ్యలతో తనను రెచ్చగొట్టారని, జనాలు అనుకుంటున్నది తప్పు అని నిరూపించాలని నిర్ణయించుకున్నట్లు అయ్యర్ తెలిపాడు. జియో హాట్‌స్టార్ నిర్వహించిన బిలీవ్ కార్యక్రమానికి హాజరైన అయ్యర్ మాట్లాడాడు. ముఖ్యంగా షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో తనకు బలహీనత ఉందన్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. ఆ కసి ఎంతలా ఉందంటే, ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్రీత్ బుమ్రా వేసిన బౌన్సర్ ను అద్భుతమైన సిక్సర్‌గా మలచి తన విమర్శకుల నోళ్లు మూయించాడు.అయ్యర్ మాట్లాడుతూ.. ‘నీ వల్ల కాదు, ఈ పరిస్థితిలో నువ్వు రాణించలేవు అని ఎవరైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను. అత్యున్నత స్థాయిలో ఆడుతున్న ఒక క్రికెటర్‌గా దానిని ఏమాత్రం అంగీకరించలేను. అందుకే నన్ను విమర్శించే వారు తప్పు అని నిరూపించాలని బలంగా నిర్ణయించుకున్నా’ అని తెలిపాడు.ఇక వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు కూడా తనపై వచ్చిన ప్రతికూల వ్యాఖ్యలపై కూడా అయ్యర్ స్పందించాడు. ‘గాయం తర్వాత అయ్యర్ మునుపటిలా ఆడలేడు అన్న మాటలు బాగా వినిపించాయి. అయితే గాయం తర్వాత మన ఆలోచనా విధానం ఎలా ఉంది అనేదే ముఖ్యమని, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, వేటిని విస్మరించాలి అనే విషయంలో నాకు స్పష్టత ఉంది. షార్ట్ బాల్ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రవీణ్ ఆమ్రే, అభిషేక్ నాయర్ వంటి కోచ్‌ల సలహాలు తీసుకుంటూ కఠోరంగా శ్రమించాను. గతంలో షార్ట్ బాల్ వస్తే సింగిల్ తీయడానికో లేదా డిఫెన్స్ ఆడడానికో ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు నా మైండ్‌సెట్ పూర్తిగా మారింది. నా జోన్లోకి షార్ట్ బాల్ వస్తే కచ్చితంగా సిక్సర్ కొట్టాలనే లక్ష్యంతో ఆడుతున్నా. దాదాపు 300లకు పైగా బంతులను ఎదుర్కొంటాను. సైడ్ ఆర్మ్ త్రోల కంటే కూడా అసలైన బౌలర్లను ఎదుర్కోవడానికే మొగ్గు చూపుతాను. బౌలర్ బంతిని వదిలే ముందే సరైన పొజిషన్లోకి రావడం (రిథమ్‌ను) నేర్చుకున్నాను. ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలలో కనిపించే ఆ రిథమ్‌ను నేను కూడా అలవర్చుకున్నాను’ అని అయ్యర్ తన నిలకడైన ఆటతీరు వెనుక ఉన్న రహస్యాలను వివరించాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గి 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే పంజాబ్ కింగ్స్ మొదట ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోనుంది. ఇక అయ్యర్ ఏడు మ్యాచ్‌ల్లో 186 స్ట్రైక్‌రేట్‌తో 279 పరుగులు సాధించాడు.చదవండి: చెత్త ఆటలోనూ మిల్లర్ అరుదైన రికార్డు -
‘అందుకే శ్రేయస్ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేశాం’
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దుమ్ములేపుతోంది. గతేడాది ఫైనల్‌కు చేరిన ఈ జట్టు.. ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఇందులో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా.. మిగిలిన ఆరింటిలోనూ గెలిచి జైత్రయాత్ర కొనసాగిస్తోంది.రెండేళ్లుగా పంజాబ్ అద్భుత విజయాలు సాధించడంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ది కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడి రాకతో జట్టు రాతే మారిపోయింది. ఒకప్పుడు పసలేని జట్టుగా ఉన్న పంజాబ్‌కు ఇప్పుడు అమితమైన క్రేజ్ ఏర్పడింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నీరాజనాలు అందుకుంటోంది.రూ. 26.75 కోట్ల భారీ ధరకుకాగా 2024లో కెప్టెన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను.. అనూహ్యంగా ఆ ఫ్రాంఛైజీ వదిలేసుకుంది. ఈ క్రమంలో 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్ల భారీ ధరకు అయ్యర్‌ను కొనుగోలు చేసింది. పంజాబ్ కోచ్ రిక్కీ పాంటింగ్ పట్టుబట్టి మరీ ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా శ్రేయస్‌ను ఏరికోరి కొనుగోలు చేయించాడు.పైసా వసూల్ ప్రదర్శనపాంటింగ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శ్రేయస్ అయ్యర్ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడిన పంజాబ్.. 265 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనను సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (36 బంతుల్లో 71 నాటౌట్)తో మెరిశాడు.అందుకే శ్రేయస్ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేశాంఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ శ్రేయస్ అయ్యర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఐపీఎల్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడొక గొప్ప వ్యక్తి. అందుకే వేలంలో అతడి కోసం ఎంత ఖర్చైనా పర్లేదని నేను కఠినంగా ముందుకు వెళ్తూనే ఉన్నాను.శ్రేయస్ ఒక గొప్ప నాయకుడు. పంజాబ్ జట్టును అతడు పునర్నిర్మిస్తాడని నేను గట్టిగా నమ్మాను. శ్రేయస్ ఆఖరి వరకు క్రీజులో ఉన్నాడంటే లక్ష్యం ఎంత పెద్దదైనా ఛేదించగలమని నాకు తెలుసు. ఇప్పుడు కూడా అతడు అద్భుతం చేశాడు. ‘నువ్వు ఆఖరి వరకు నిలబడ్డావంటే ఈ మ్యాచ్ మనం కచ్చితంగా గెలుస్తామని చెప్పాను’. అన్నట్లుగానే అతడు పని పూర్తి చేశాడు’’ అని రిక్కీ పాంటింగ్ శ్రేయస్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా గతేడాది 604 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఈ సీజన్లో ఇప్పటికి ఆరు ఇన్నింగ్స్ ఆడి 279 పరుగులు పూర్తి చేసుకున్నాడు.చదవండి: Vaibhav Sooryavanshi: పర్సనల్‌గా అంటే నచ్చదు.. అందుకే చితక్కొట్టాWho would have thought chasing 264 in T20 Cricket. 🤷- Shreyas Iyer led PBKS chased down 264 runs in 18.5 overs against DC. pic.twitter.com/iith1lLgiW— Kashif (@KashifNdmCric) April 25, 2026 -
పంజాబ్ కింగ్స్ మరో చరిత్ర
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 265 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్య ఛేదన ఐపీఎల్‌లోనే కాకుండా యావత్ పొట్టి క్రికెట్లోనే అత్యధికం. ఈ మ్యాచ్‌కు ముందు వరకు కూడా ఈ రికార్డు పంజాబ్ పేరిటే ఉండేది. 2024 ఎడిషన్‌లో ఈ జట్టు కేకేఆర్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.టీ20 చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్‌లు ఇవేపంజాబ్ కింగ్స్- 265/4- ప్రత్యర్ధి- ఢిల్లీ క్యాపిటల్స్‌పంజాబ్ కింగ్స్-262/2- ప్రత్యర్ధి-కేకేఆర్‌సౌతాఫ్రికా- 259/4- ప్రత్యర్ధి- వెస్టిండీస్‌బ్రిస్బేన్ హీట్-258/2- ప్రత్యర్ధి- పెర్త్ స్కార్చర్స్ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో పంజాబ్ మరో భారీ రికార్డు కూడా నెలకొల్పింది. ఇప్పటివరకు తలో ఐదు సార్లు ఛాంపియన్లైన సీఎస్కే, ముంబై ఇండియన్స్ కూడా సాధించలేని ఘనతను సాధించింది.శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న ఈ జట్టు.. తొలి ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు నమోదు చేయగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఏడు లీగ్ మ్యాచ్‌ల అనంతరం 13 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఈ గణాంకాల ద్వారానే పంజాబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది.ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టూ తొలి ఏడు మ్యాచ్‌ల తర్వాత 13 పాయింట్లు సాధించలేదు. 12 పాయింట్లు మాత్రమే గరిష్టంగా ఉండేది. ఆ ఘనతను ముంబై, చెన్నై, గుజరాత్, రాజస్థాన్ వంటి పలు జట్లు సాధించాయి. ఇప్పుడు పంజాబ్ ఆ రికార్డును చెరిపేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.Most points in an #ipl after 7 games13 - PBKS (2026)12 - MI (2010), CSK (2014), PBKS (2014), CSK (2015), GL (2016), MI (2017), CSK (2019), GT (2022), RR (2024) pic.twitter.com/8EK78fGVzR— Erika Morris (@ErikaMorris79) April 25, 2026కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి ఢిల్లీ.. కేఎల్ రాహుల్ (152 నాటౌట్), నితీశ్ రాణా (91) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పంజాబ్ ఆది నుంచే కరిగించుకుంటూ వచ్చింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (43), ప్రభ్‌సిమ్రన్ (76) తమ సహజ శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్) నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా పంజాబ్ ఈ సీజన్లో తమ జైత్రయాత్రను కొనసాగించింది. -
వాళ్లు కొట్టినప్పుడు, మేమూ కొడతామనుకున్నా: శ్రేయస్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 265 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో ఏడు బంతులు మిగిలుండగానే సునాయాసంగా ఊదేసింది. ఈ గెలుపు అనంతరం పంజాబ్ కింగ్స్ సారధి శ్రేయస్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని అన్నాడు. శ్రేయస్ మాటల్లో..నిజంగా చెప్పాలంటే, మాటలు రావడం లేదు. మైదానంలో తీవ్ర ఎండ, మరోవైపు బౌలర్లు వరుసగా బౌండరీలు, సిక్సర్లు ఇస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మాకు తెలుసు.పిచ్ స్పిన్‌కు సహకరిస్తుందని ముందుగా భావించినప్పటికీ, ఆశించినంత మలుపు లభించలేదు. చహల్ బౌలింగ్‌కు వచ్చిన తర్వాత మాత్రమే బంతి కొద్దిగా ఆగినట్లు అనిపించింది.కేఎల్ రాహుల్ ఆడిన తీరు అద్భుతం. అతని షాట్లు కళ్లకు పండుగలా అనిపించాయి. అతను ఎలాంటి ఒత్తిడిలోనూ లేనట్లు కనిపించాడు.భారీ లక్ష్యాన్ని ఛేదించే ముందు నా ఆలోచన ఒక్కటే. వాళ్లు ఎంత చేసినా, మనం ఒక్క పరుగు ఎక్కువ చేయాలి. వాళ్లు కొట్టగలిగినప్పుడు, మేమూ కొడతామనుకున్నా. ఆ సమయంలో అదే నా మైండ్‌సెట్.డ్రెస్సింగ్‌రూమ్‌లో కూడా ఇదే చర్చ జరిగింది. గత మ్యాచ్‌ల్లో 220కి పైగా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన అనుభవం మాకు ధైర్యాన్నిచ్చింది.ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్ పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడి బలమైన పునాది వేశారు. వారి ఆరంభాన్ని మిగతా బ్యాటర్లు కొనసాగించారు.బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో ఇంకా మెరుగుదల అవసరమని అంగీకరించిన అయ్యర్, ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నామని అన్నాడు.కాగా, చారిత్రక గెలుపు తర్వాత పంజాబ్‌ను చూసి మిగతా జట్లంతా వణికిపోతున్నాయి. వీరికి ఎంత లక్ష్యమైతే సరిపోతుందని లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ మునుపెన్నడూ లేనంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతే ఏకైక అజేయ జట్టుగా చలామణి అవుతుంది. మున్ముందు కూడా పంజాబ్ ఇదే జోరును కొనసాగిస్తే, ఈసారి టైటిల్ గెలవకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. గత సీజన్లో ఇదే శ్రేయస్ నేతృత్వంలో పంజాబ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. -
రిటైన్ ప్లేయర్ల జాబితా ప్రకటన
ప్రతిష్టాత్మక టీ20 ముంబై లీగ్ 2026 సీజన్‌కు సంబంధించిన రిటైన్ ఆటగాళ్ల జాబితాను ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఈసారి కూడా భారత స్టార్ క్రికెటర్లు లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ వంటి స్టార్లు తమ తమ ఫ్రాంచైజీలతో కొనసాగుతున్నారు.మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు తలా ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. అనుభవజ్ఞులైన అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభకు కూడా సముచిత ప్రాధాన్యం లభించింది.Triumph Knights Mumbai North East జట్టు సూర్యకుమార్ యాదవ్‌ను ఐకాన్ ప్లేయర్‌గా కొనసాగించింది. యువ సంచలనం ఆయుష్ మాత్రే, సూర్యాంశ్ షెడ్గే కూడా జట్టులో నిలిచారు.గత సీజన్ రన్నరప్ SoBo Mumbai Falcons తమ ఐకాన్ ప్లేయర్‌గా శ్రేయస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది. అంగ్క్రిష్ రఘువంశీ, హర్ష్ అఘవ్ కూడా జట్టులో కొనసాగుతున్నారు.డిఫెండింగ్ ఛాంపియన్ Mumbai South Central Maratha Royals తుషార్ దేశ్‌పాండేను ఐకాన్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. సిద్ధేశ్ లాడ్, రోహన్ రాజే కూడా కొనసాగనున్నారు.Bandra Blasters తరఫున యశస్వి జైస్వాల్ ఐకాన్ ప్లేయర్‌గా నిలిచాడు. సువేద్ పార్కర్, ధృమిల్ మట్కర్ జట్టులో కొనసాగుతున్నారు.ARCS Andheri శివమ్ దూబేను రిటైన్ చేయగా, ప్రగ్నేష్ కన్పిల్లేవార్, దీపక్ శెట్టి కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.Aakash Tigers Mumbai Western Suburbs సర్ఫరాజ్ ఖాన్‌ను ఐకాన్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. షమ్స్ ములానీ, జే బిస్తా కూడా జట్టులో ఉన్నారు.North Mumbai Panthers అజింక్య రహానేను రిటైన్ చేసుకోగా, అభిజ్ఞాన్ కుందు, తనుష్ కోటియన్ జట్టులో కొనసాగుతున్నారు.Eagle Thane Strikers శార్దూల్ ఠాకూర్‌ను ఐకాన్ ప్లేయర్‌గా నిలబెట్టుకుంది. అథర్వ అంకోలేకర్, సాయిరాజ్ పాటిల్ కూడా జట్టులో ఉన్నారు.ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ మాట్లాడుతూ, ఈ రిటెన్షన్లు లీగ్ స్థాయిని మరింత పెంచుతాయని అన్నారు. యువ ఆటగాళ్లకు స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం లభించడం వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.2018లో ప్రారంభమైన ఈ లీగ్ ఇప్పటికే అనేక మంది యువ ఆటగాళ్లకు జాతీయ స్థాయికి వెళ్లే వేదికగా నిలిచింది. ఇప్పుడు అందరి దృష్టి త్వరలో జరగనున్న వేలంపై ఉంది. -
‘అందుకే శ్రేయస్ అయ్యర్‌ను వదులుకున్నాం’
భారత దేశీ క్రికెట్లో కోచ్‌గా చంద్రకాంత్ పండిట్‌కు మంచి పేరుంది. అతడి మార్గదర్శనంలోనే మధ్యప్రదేశ్ తొలి రంజీ టైటిల్ అందుకుంది. రంజీ 2021-22 సీజన్లో చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ హెడ్‌కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ బాధ్యతలు చేపట్టాడు.చంద్రకాంత్ మార్గ నిర్దేశనం, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీలో కేకేఆర్ 2024లో చాంపియన్‌గా అవతరించింది. అయితే, వీరి కంటే నాటి మెంటార్ గౌతం గంభీర్‌కే క్రెడిట్ ఎక్కువగా వచ్చింది. ఇక 2024 తర్వాత కేకేఆర్ శ్రేయస్‌ను వదిలేసుకుంది. ఈ క్రమంలో 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది.ఏకంగా ఫైనల్కుఅందుకు తగినట్లుగానే శ్రేయస్ అయ్యర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించి పంజాబ్‌ను గతేడాది ఫైనల్‌కు చేర్చాడు. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలో పంజాబ్ ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు.. శ్రేయస్‌ను వదులుకున్న కేకేఆర్ వరుస పరాజయాలతో డీలా పడి.. విమర్శలు మూటగట్టుకుంటోంది.ఈ నేపథ్యంలో కేకేఆర్ మాజీ హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్ శ్రేయస్ అయ్యర్‌ను వదులుకోవడంపై తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ ఆరోజు మేము అతడి సేవలు కోల్పోయాము. శ్రేయస్ అద్భుతమైన ఆటగాడు. కెప్టెన్‌గా కేకేఆర్‌కు ట్రోఫీ అందించాడు.అతడు జట్టును నడిపించే విధానానికి నేను అభిమానిని. అయితే, కొన్నిసార్లు దీర్ఘకాల ప్రయోజనాలు, వ్యూహాల దృష్ట్యా కొంతమంది ప్లేయర్లను వదులుకోవాల్సి వస్తుంది. నిజానికి ఆరోజు కేకేఆర్ కోచ్‌గా నేను ఈ విషయంలో చాలా బాధపడ్డాను.అందుకే అతడిని వదులుకున్నాముఅయితే, కావాలని మేము అతడిని వదులుకోలేదు. అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. శ్రేయస్ ఒక్కడినే కాదు.. ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లను కూడా మేము వదిలేశాము. ఏదేమైనా కోచ్‌గా ఉన్న సమయంలో కేకేఆర్ యజమానులు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతా, సీఈఓ వెంకీ మైసూర్ నాకు అండగా ఉన్నారు’’ అని చంద్రకాంత్ పండిట్ రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు.కాగా 2025 సీజన్ తర్వాత చంద్రకాంత్ పండిట్‌కు ఉద్వాసన పలికిన కేకేఆర్.. 2026కు గానూ అభిషేక్ నాయర్‌ను హెడ్‌కోచ్‌గా ప్రకటించింది. గతేడాది అజింక్య రహానే కెప్టెన్సీలో పద్నాలుగింట కేవలం ఐదు గెలిచిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికి ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచి అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. చదవండి: ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు? -
అతడిని ఎంత పొగిడినా తక్కువే.. కచ్చితంగా స్టార్ అవుతాడు: శ్రేయస్
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా వైభవ్ బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు.ఓవరాల్‌గా ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 236.54 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు చేశాడు. కాగా ఈ యంగ్ కిడ్ బ్యాటింగ్‌కు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫిదా అయిపోయాడు. వైభవ్ ఒక ఫ్యూచర్ స్టార్ అని శ్రేయస్ కొనియాడాడు.వైభవ్ సూర్యవంశీ ఒక భిన్నమైన ఆటగాడు. అతడి వద్ద అద్బుతమైన టాలెంట్ ఉంది. అతడిని ఎంత పొగిడినా తక్కువే. అతడి బ్యాట్ ఫ్లో, బంతి పడకముందే అతను సృష్టించుకునే రిథమ్, మొమెంటం అద్భుతం. కచ్చితంగా అతడు కచ్చితంగా భవిష్యత్ స్టార్ అవుతాడనే చెప్పాలి" అని జియోస్టార్ నిర్వహించిన 'బిలీవ్' కార్యక్రమంలో అయ్యర్ పేర్కొన్నాడు.ఇక ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్, బ్యాటర్‌గా అదరగొడుతున్నాడు. శ్రేయస్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 208 పరుగులు సాధించాడు. అతడి కెప్టెన్సీలో పంజాబ్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.చదవండి: NZ vs BAN 2nd ODI: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్ -
‘రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి’
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు అభిమానులు గోయెంకాకు కృతజ్ఞతలు చెప్పిన తీరు వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్లో 2022లో చేరిన లక్నో జట్టు కేఎల్ రాహుల్ సారథ్యంలో ప్లే ఆఫ్స్ చేరింది.రూ. 27 కోట్ల భారీ ధరకుఅయితే, సంజీవ్ గోయెంకా వైఖరితో విసిగిపోయిన కేఎల్ రాహుల్ (KL Rahul).. 2025 వేలానికి ముందు లక్నోను వీడాడు. గౌరవం లేని చోట తాను ఉండలేనని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో టీమిండియా మరో స్టార్ రిషభ్ పంత్‌ను కొనుగోలు చేసింది.రూ. 26.75 కోట్లకు పంజాబ్ సొంతంమరోవైపు.. 2024లో తమ జట్టుకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను కోల్‌కతా నైట్ రైడర్స్ వదిలేసింది. ఈ క్రమంలో అయ్యర్ కోసం కూడా ఫ్రాంఛైజీలు ఎగబడగా.. పంజాబ్ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పంత్, శ్రేయస్ ఖరీదైన ఆటగాళ్లుగా నిలవగా.. ఇద్దరికీ తమ ఫ్రాంఛైజీలు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాయి.కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా సూపర్ హిట్.. పంత్ విఫలంఅయితే, శ్రేయస్ ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా సూపర్ హిట్ అయ్యాడు. గతేడాది 604 పరుగులు చేసిన ఈ ముంబైకర్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు.. పంత్ మాత్రం దారుణంగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. గతేడాది కేవలం 269 పరుగులు చేసిన పంత్.. కెప్టెన్‌గానూ ఫెయిలై జట్టును ఏడోస్థానంలో నిలిపాడు.ఇక తాజాగా ఐపీఎల్-2026లోనూ పంజాబ్ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా.. లక్నో వరుస వైఫల్యాలతో సతమతమవుతూ ఉంది. ముల్లన్‌పూర్‌లో ఆదివారం ఇరుజట్లు తలపడగా.. పంజాబ్ లక్నోను 54 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న సంజీవ్ గోయెంకాకు పంజాబ్ అభిమాని దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి‘‘గోయెంకా సాబ్! పంత్‌ను మీ జట్టులోకి తీసుకున్నందు వేలవేల దండాలు భాయ్.. అతడు పంజాబ్ కెప్టెన్‌గా రానందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఒకవేళ తదుపరి వేలంలో రూ. 32 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా దయచేసి పంత్‌ను మీతోనే ఉంచుకోండి’’ అని సదరు అభిమాని గట్టిగా అరిచాడు.అయితే, ఇందుకు గోయెంకా మాత్రం థాంక్యూ అన్నట్లుగా నవ్వుతూ అభివాదం చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసిన తర్వాత రిషభ్ పంత్ చేసిన వ్యాఖ్యలే.. ఇప్పుడు ఒక రకంగా గోయెంకాకు ఎదురైన అవమానానికి కారణం.PBKS fan: Goenka sahab! Thank you for taking Pant, paaji many, many thanks! Shukar hai captain saadi Punjab team ch nahi aaya!Paaji, even if you have to give 32 crores, don't let Pant go, keep him with you!😭Meanwhile,blud Sanjeev Goenka laughing and giving a thumbs up🤣🙏 pic.twitter.com/dKB7s8ouIt— Rohan💫 (@rohann__45) April 20, 2026ఆరోజు పంత్ అన్న మాటనే తిప్పి కొట్టి..వేలం సందర్భంగా.. ‘‘నాకు ఒకటే టెన్షన్.. పంజాబ్‌కు మాత్రం అస్సలు వెళ్లకూడదు అని మొక్కుకున్నా.. నేను ఆడకూడదనుకునే ఒకే ఒక్క టీమ్ అది’’ అని పంత్ వ్యాఖ్యానించాడు. దీంతో అప్పటి నుంచి పంజాబ్ జట్టు ఫ్యాన్స్ అతడిపై గుర్రుగా ఉన్నారు. అందుకే ఇప్పుడు పంజాబ్‌లో పంజాబ్ చేతిలో పంత్ సేన ఓడిన తర్వాత గోయెంకాకు ఇలా పంత్ గురించి సలహా ఇచ్చారు.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్! -
పంజాబ్ విజయ రహస్యం 'సర్పంచ్ సాబ్'
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ జట్టు ఫేట్ మారిపోయింది. గత సీజన్లో పగ్గాలు చేపట్టిన అతను.. తొలి ప్రయత్నంలోనే పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. దురదృషవశాత్తు ఫైనల్లో ఓడింది కానీ, టైటిల్‌కు పూర్తిగా అర్హమైన జట్టు అని అందరిచే ప్రశంసలందుకుంది.గత సీజన్లో తృటిలో చేజారిన టైటిల్‌ను పంజాబ్ ఈ సీజన్లో ఎలాగైనా సాధించాలని పట్టుదలగా ఉంది. మరోసారి శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో తమ తొలి టైటిల్ దిశగా దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో (ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది) పాయింట్ల పట్టకలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టు ఏదైనా ఉందా అంటే అది పంజాబ్ మాత్రమే. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు భారీ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో 254 పరుగులు చేసి, ఆతర్వాత ఆ స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ చేసిన స్కోర్ సీజన్లోనే అత్యధికం.వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ విజయ రహస్యం ఏంటా అని పరిశీలిస్తే, అది వారి కెప్టెనేనని తెలుస్తుంది. శ్రేయస్ ఈ సీజన్లో మునుపెన్నడూ లేనంత పట్టుదలగా ఉన్నాడు. కెప్టెన్‌గా ఎంతో పరిణితి ప్రదర్శిస్తూ జట్టు విజయాలకు ప్రధాన కారకుడిగా నిలుస్తున్నాడు.శ్రేయస్ కెప్టెన్సీ శైలి ఇతర నాయకులతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా, వారికి స్వేచ్ఛ ఇచ్చి ఆడేలా చేయడం అతని ప్రత్యేకత. ప్రతి ఆటగాడి వ్యక్తిగత శైలి, రొటీన్‌ను గౌరవించడం ద్వారా జట్టులో విశ్వాసాన్ని పెంచాడు. ఈ విధానం కారణంగా బ్యాటర్లు నిర్భయంగా ఆడుతూ, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని పెంచగలుగుతున్నారు.పంజాబ్ విజయాల్లో బ్యాటింగ్ విభాగం వారి ప్రధాన బలం. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ వరకు దూకుడైన ఆట కనిపిస్తోంది. ముఖ్యంగా సిక్సర్లు కొట్టడంపై ఆ జట్టు ప్రత్యేక దృష్టి పెట్టింది. శ్రేయస్ ఆటగాళ్ల మధ్య సిక్సర్ల పోటీ పెట్టి, జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. ఇది కేవలం వినోదాత్మక అంశంగా కాకుండా, మ్యాచ్‌లలో స్కోరింగ్ రేట్ పెంచడానికి దోహదపడుతోంది. ఫలితంగా, పంజాబ్ జట్టు భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతోంది.బౌలింగ్ విభాగంలోనూ పంజాబ్ సమతుల్యంగా ఉంది. అంతర్జాతీయ స్థాయి అనుభవం కలిగిన బౌలర్లు జట్టుకు బలం చేకూరుస్తున్నారు. మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి ఆటగాళ్లపై ప్రత్యేక వ్యూహాలు రూపొందించి, వాటిని కచ్చితంగా అమలు చేయడంలో బౌలర్లు విజయవంతమవుతున్నారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకోవడం పంజాబ్ ప్రత్యేకతగా మారింది.ఫీల్డింగ్‌లో కూడా జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. కీలక సమయాల్లో క్యాచ్‌లు పట్టడం, రనౌట్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వంటి అంశాలు మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమగ్ర ప్రదర్శన వల్లే పంజాబ్ కింగ్స్ ఓటమి లేకుండా ముందుకు సాగుతోంది.శ్రేయస్ కేవలం కెప్టెన్‌గానే కాకుండా, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సత్తా చాటుతూ తన సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పంజాబ్ అభిమానులు ముద్దుగా 'సర్పంచ్ సాబ్' అని పిలుచుకునే శ్రేయస్.. ఈ సీజన్లో బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్బుత ప్రదర్శనలు కనబరుస్తున్నాడు. ఇటీవల శ్రేయస్ పట్టిన ఓ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైన క్యాచ్లలో ఒకటిగా చెప్పవచ్చు. మొత్తంగా, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో టైటిల్ ఫేవరెట్‌గా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ప్రదర్శించిన జోరును ఇకపై కూడా కొనసాగిస్తే, పంజాబ్ తమ తొలి టైటిల్ సొంతం చేసుకోవడం ఖాయం. -
శశాంక్ సింగ్ పరువు తీసిన శ్రేయస్ అయ్యర్!
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో గతేడాది ఫైనల్ చేరిన పంజాబ్.. ఈసారి కూడా ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ శ్రేయస్ సేన దుమ్ములేపింది.సొంత వేదిక ముల్లన్‌పూర్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 254 పరుగులు సాధించింది. ప్రియాన్ష్ ఆర్య (37 బంతుల్లో 93) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. కూపర్ కన్నోలి (46 బంతుల్లో 87) మరోసారి ఆకట్టుకున్నాడు.రాణించిన బౌలర్లుఇక లక్ష్య ఛేదనలో లక్నోను పంజాబ్ 200 పరుగులకే పరిమితం చేసింది. మార్కో యాన్సెన్ రెండు, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, యజువేంద్ర చహల్ తలా ఒక వికెట్ తీసి పంత్ సేనను కట్టడి చేశారు. ఫలితంగా పంజాబ్ 54 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.మూడు క్యాచ్‌లు జారవిడిచాడుఅయితే, పంజాబ్ స్టార్ శశాంక్ సింగ్ లక్నోతో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు క్యాచ్‌లు జారవిడిచాడు. ముఖ్యంగా లక్నో ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్లో పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బంతితో రంగంలోకి దిగగా.. ఐడెన్ మార్క్రమ్ భారీ షాట్ ఆడాడు.A brainfade moment for Shashank Singh. 😄 pic.twitter.com/AxJEiBOie7— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2026ఈ క్రమంలో స్వీపర్ కవర్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శశాంక్ సింగ్ బంతిని అందుకునేందుకు పరిగెత్తుకు వచ్చాడు. ఆల్మోస్ట్ క్యాచ్ పడతాడని భావించగా.. అక్కడే అలా నిలుచుండిపోయాడు. దీంతో మార్క్రమ్ ఖాతాలో సిక్సర్ చేరగా.. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు డగౌట్లో ఉన్న హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.మార్క్రమ్తో పాటు ముకుల్ చౌదరీతో పాటు నికోలస్ పూరన్‌ల క్యాచ్‌లను శశాంక్ జారవిడిచాడు. ఈ ముగ్గరూ డేంజరస్ ప్లేయర్లే. అయితే, పంజాబ్ బౌలర్లను వాళ్లను సరిగ్గా కుదురుకోనివ్వలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఫలితంపై ప్రభావం పడేది. ఈ నేపథ్యంలో శశాంక్ సింగ్‌పై విమర్శల వర్షం కురుస్తుండగా.. మ్యాచ్ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన పని నెటిజన్లను ఆకర్షిస్తోంది.ఇదిగో ఈ క్యాప్ అడ్డుపెట్టుకోవిజయం తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలోశ్రేయస్ శశాంక్‌ను ఆటపట్టించాడు. సరదాగా శశాంక్ భుజంపై చెయ్యి వేసిన శ్రేయస్ అయ్యర్... ‘‘మన జట్టు సభ్యులకు నీ ముఖం చూపించలేవులే.. మనోళ్లను కదిలించేంత దమ్ము ఇపుడు లేకపోవచ్చు... ఇదిగో ఈ క్యాప్ అడ్డుపెట్టుకో’’ అన్నట్లుగా క్యాప్ అతడి ముఖానికి అడ్డుపెట్టి నడిపించాడు. పాంటింగ్ సైతం శశాంక్ భుజం తట్టి నవ్వులు చిందించాడు. ఈ నేపథ్యంలో.. ‘‘శ్రేయస్ భయ్యా పాపం శశాంక్ పరువు తీసేశావుగా!.. ఏదేమైనా ఈరోజు శశాంక్ అదృష్టం బాగుంది’’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా శశాంక్ ఈ మ్యాచ్‌లో ఆరు బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్ ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఒకటి వర్షం వల్ల రద్దుకాగా.. మిగిలిన ఐదూ గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉంది.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్𝘼𝙡𝙡'𝙨 𝙬𝙚𝙡𝙡 𝙩𝙝𝙖𝙩 𝙚𝙣𝙙𝙨 𝙬𝙚𝙡𝙡 😃Only smiles on the faces of skipper Shreyas Iyer, coach Ricky Ponting and.. Shashank Singh! #TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/SQU5z3zNdy— IndianPremierLeague (@IPL) April 19, 2026 -
BCCI బిగ్‌ప్లాన్.. 35 మంది ప్లేయర్లు.. కెప్టెన్‌గా అతడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా నుంచి.. వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే వరకు ఈ జాబితాలో ఉన్నారు.ఇక ఈ టోర్నీలో ఓవైపు సీనియర్లు ఫామ్ కొనసాగిస్తుండగా.. యువ ఆటగాళ్లు సైతం దుమ్మురేపుతున్నారు. దీంతో టీమిండియా సెలక్టర్లకు తల నొప్పులు తప్పడంలేదు. ఇదిలా ఉంటే.. టీమిండియా షెడ్యూల్ ఎంతగా కిక్కిరిసిపోయి ఉంటుందో తెలిసిందే. ఏడాదంతా భారత పురుషుల జట్టు బిజీబిజీగా గడుపుతుంది.పూర్తిస్థాయిలో రెండు జట్లు!ఇటీవలే అదనంగా ముందుగా షెడ్యూల్లో లేని ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు.. ఆసియా క్రీడలు- 2026 (Asian Games) టోర్నీకి కూడా జట్టును పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ రెండు టీ20 జట్లను తయారు చేస్తున్నట్లు సమాచారం.సెలక్టర్ల రాడార్‌లో 30-35 మంది ఆటగాళ్లుఅంతర్జాతీయ షెడ్యూల్‌తో ఆసియా క్రీడల షెడ్యూల్ క్లాష్ అవుతున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఒకే సమయంలో ఆసియా క్రీడలు, వెస్టిండీస్ సిరీస్‌కు జట్లను పంపాల్సి ఉంది. కాబట్టి ఈసారి కూడా రెండు జట్లను సిద్ధం చేస్తున్నాం.అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపిక చేసే క్రమంలో 30-35 మంది ఆటగాళ్ల పేర్లను పరిగణనలోకి తీసుకునే యోచనలో ఉన్నాము. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆసియా క్రీడల దాకా ఈ విధానం కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు. గతంలో ఇలా..కాగా 2023 ఆసియా క్రీడల్లో భాగంగా తొలిసారి బీసీసీఐ తమ పురుష, మహిళా జట్లను చైనాకు పంపింది. టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఈ ఈవెంట్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో పురుషుల జట్టు.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా జట్టు పసిడి పతకాలు గెలిచాయి. అప్పుడు టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీగా ఉండగా.. రుతు కెప్టెన్సీలో ద్వితీయశ్రేణి జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొని గోల్డ్ మెడల్ గెలిచింది.రేసుగుర్రాలుకాగా ఈసారి నయా సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్, ప్రియాన్ష్ ఆర్య, అంగ్క్రిష్ రఘువన్షీ ఆసియా క్రీడల నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించనున్నారు. రజత్ పాటిదార్, ఆయుశ్ బదోని, అనుకుల్ రాయ్, ఖలీల్ అహ్మద్, కార్తిక్ త్యాగి తదితరులు కూడా రేసులో ఉన్నారు.కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!ఈసారి ఆసియా క్రీడల జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అతడు టీ20 ఫార్మాట్లో దుమ్ములేపుతున్నాడు. 2024 ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన ఈ ముంబైకర్.. గతేడాది కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. తాజా ఎడిషన్‌లోనూ సారథి, బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ హవా కొనసాగుతోంది. కాగా 2023 డిసెంబరులో చివరగా అయ్యర్ టీమిండియా తరఫున టీ20లు ఆడాడు. అయితే, ఈసారి ఆసియా క్రీడల ద్వారా రీఎంట్రీ ఇచ్చి తనను తాను మరోసారి నిరూపించుకుంటే.. టీమిండియా కెప్టెన్‌గానూ సూర్యకుమార్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదన్నది విశ్లేషకుల మాట.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్ -
లక్నోను మట్టికరిపించిన అనంతరం శ్రేయస్ వ్యాఖ్యలివే..!
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లోనూ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. గత సీజన్లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఈ జట్టు ఈ సీజన్లో ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో అగ్రపీఠంపై తిష్ట వేసింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి.. ప్రియాంశ్ ఆర్య (93), కూపర్ కన్నోల్లీ (87) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్య ఛేదనలో లక్నో చేతులెత్తేసింది. ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగుల వద్ద ఆగిపోయింది. మార్ష్ (40), బదోని (35), పంత్ (43), మార్క్రమ్ (42) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. జన్సెన్ (4-0-37-2), విజయ్‌కుమార్ వైశాఖ్ (4-0-30-1), చహల్ (4-0-36-1) లక్నో బ్యాటర్లకు పగ్గాలు వేశారు.మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. తమ బ్యాటర్లు, బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.అతని మాటల్లోనే.. ఆ భాగస్వామ్యం అసాధారణంగా ఉంది. కొన్ని షాట్లు చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఫాస్ట్ బౌలర్లను బ్యాక్ ఫుట్‌పై స్ట్రైట్‌గా ఆడటం, స్పిన్నర్లపై కూడా అదే ధైర్యంతో దాడి చేయడం గొప్ప నైపుణ్యం. ముఖ్యంగా మధ్య ఓవర్లలో ఆ భాగస్వామ్యం జట్టుకు బలమైన పునాది వేసింది. ఆ సమయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఆటగాళ్లు చూపిన ధైర్యం, స్థిరత్వం ప్రశంసనీయం.జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఒక సరదా పోటీ పెట్టుకున్నాం. జట్టులో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడితే వారికి నా బ్యాట్ బహుమతిగా ఇస్తానని చెప్పాను. ఇది పెద్ద బహుమతి కాకపోయినా, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచి, స్వేచ్ఛగా ఆడేలా చేస్తుంది. ఆటగాళ్లను ఎక్కువగా నియంత్రించకుండా స్వేచ్ఛ ఇస్తే వారు తమ ప్రతిభను మెరుగ్గా ప్రదర్శిస్తారన్నది నా అభిప్రాయం.బౌలింగ్ విభాగంపై కూడా అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. జట్టులోని బౌలర్లు అంతర్జాతీయ స్థాయి అనుభవం కలిగిన వారని, వారు ఇప్పటికే తమ దేశాల తరఫున అద్భుత ప్రదర్శనలు ఇచ్చారని గుర్తుచేశారు. మ్యాచ్‌కు ముందు వ్యూహాలు చర్చించి, వాటిని అమలు చేయడమే ముఖ్యమని అన్నారు. ఈ సీజన్ మొత్తం బౌలర్లు స్థిరంగా రాణిస్తున్నారని, అదే ఫామ్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఇక న్యూ చండీగఢ్ మైదానాన్ని “కంచుకోట”గా మార్చడంపై కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత సీజన్లో ఎదురైన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని, ఈసారి పిచ్ తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సహకరించేలా మైదానాన్ని రూపొందించామని, ఇప్పటివరకు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. -
ప్రియాన్ష్, కూపర్ విధ్వంసం.. పంజాబ్‌కు ఐదో విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్పూర్ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్ (42 ), రిషబ్ పంత్ (43), మార్ష్ (40) పరుగులు సాధించారు. అయితే ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో లక్నో చేతులెత్తేసింది. పంజాబ్‌బౌలర్లలో మార్కో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు పంజాబ్ యువ బ్యాటర్లు ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోలీ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రియాన్ష్ (93), కన్నోలి (87) తమ కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో స్టోయినిస్ 29 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్,మణిమరన్ సిద్ధార్థ్ చెరో 2 వికెట్లు తీశాడు. లక్నోతో మ్యాచ్ ద్వారా ఈ సీజన్లో అత్యధిక స్కోరు చేసిన పంజాబ్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి (వర్షంతో ఒక మ్యాచ్ రద్దు) 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.𝘼𝙡𝙡'𝙨 𝙬𝙚𝙡𝙡 𝙩𝙝𝙖𝙩 𝙚𝙣𝙙𝙨 𝙬𝙚𝙡𝙡 😃Only smiles on the faces of skipper Shreyas Iyer, coach Ricky Ponting and.. Shashank Singh! #TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/SQU5z3zNdy— IndianPremierLeague (@IPL) April 19, 2026 -
IPL 2026: లక్నోపై పంజాబ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్పూర్ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్ (42 ), రిషబ్ పంత్ (43), మార్ష్ (40) పరుగులు సాధించారు. అంతకముందు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ (93), కూపర్ (87) పరుగులు చేశారు. 18 ఓవర్లలో లక్నో 179/418 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. మార్కరమ్ 28, ముకుల్ 16 పరుగులతో ఆడుతున్నారు.పంత్ (43) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన లక్నోపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 128 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన పంత్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ప్రబ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లలో లక్నో 89/18 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. మార్ష్ (35), పంత్ (18) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లక్నోపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన ఆయుశ్ బదోని విజయ్ కుమార్ బౌలింగ్‌లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది.255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఛేదనను ధాటిగానే ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. మార్ష్ 23, ఆయుశ్ బదోని 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.లక్నో ముంగిట 255 పరుగుల లక్ష్యంఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ అత్యధిక స్కోరు సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కన్నోలి (87) విధ్వంసం సృష్టించారు. చివర్లో స్టోయినిస్ (29) కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. పంజాబ్ బ్యాటర్ల ధాటికి లక్నో బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రిన్స్ యాదవ్, మనిమరన్ సిద్దార్థ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్లో పంజాబ్‌దే అత్యధిక స్కోరు. ఇంతకముందు ఇదే సీజన్లో సీఎస్కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ 250 పరుగులు చేసింది.18 ఓవర్లలో పంజాబ్ 230/518 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. స్టోయినిస్ 19 పరుగులు, శశాంక్ సింగ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.శ్రేయస్ అయ్యర్ (5) రూపంలో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అంతకముందు 93 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య సిద్దార్థ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. దీంతో పంజాబ్ 187 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కూపర్ (87) ఔట్పంజాబ్ కింగ్స్ 185 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కూపర్ 46 బంతుల్లో 7 సిక్సులు 8 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో మణిమరన్ సిర్థార్థ్కు క్యాచ్ ఇచ్చుకున్నాడు.9 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 19 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. కన్నోలి 40 పరుగులతో ఆడుతున్నాడు.ప్రియాన్ష్ మెరుపులు.. పంజాబ్ 63/1పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రియాన్ష్ 40, కూపర్ కన్నోలి 23 పరుగులతో ఆడుతున్నారు.5 ఓవర్లలో పంజాబ్ 43/15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. కూపర్ కన్నోలి 15, ప్రియాన్ష్ ఆర్య 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.ప్రబ్‌సిమ్రన్ డకౌట్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ సింగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నోఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం ముల్లన్పూర్ వేదికగా 29వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లక్నో సూపర్‌జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పంజాబ్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగింది. మరోవైపు లక్నో ఒక మార్పు చేసింది. దిగ్వేశ్ రాఠీ స్థానంలో సిద్దార్థ్ మణిరమన్ జట్టులోకి వచ్చాడు.పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.లక్నో సూపర్‌జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, మొహ్సిన్ ఖాన్ -
సూర్యకుమార్‌పై వేటు..! టీమిండియా కెప్టెన్‌గా విధ్వంసకర ప్లేయర్?
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడనుందా? అంటే అవునానే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. సారథిగా టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించిన సూర్య.. బ్యాటర్‌గా మాత్రం అతడి ప్రదర్శన రోజు రోజుకు దిగజారుతోంది. దాదాపు ఏడాది పాటు టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్ కొనసాగిన సూర్యకుమార్.. ఇప్పుడు రెండెంకెల స్కోర్ చేయడానికి కూడా కష్టపడుతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక మాత్రం బ్యాటర్‌గా అతడు విఫలమవవుతున్నాడు.గతేడాది దాదాపు 25కు పైగా టీ20లు ఆడిన సూర్య కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. కెప్టెన్సీ భారం అతడి బ్యాటింగ్‌పై పడుతున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028తో పాటు తదుపరి రెండు టీ20 ప్రపంచకప్‌లను దృష్టిలో ఉంచుకొని బోర్డు జట్టును సిద్దం చేయాలనే ఆలోచనలో ఉంది. దీంతో సూర్య స్ధానంలో మరో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించేందుకు భారత క్రికెట్ బోర్డు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ20ల్లో నంబర్ 4 స్థానానికి అయ్యర్ సరైన ప్రత్యామ్నాయమని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.శ్రేయస్ అయ్యర్‌కు బంపరాఫర్!శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు జాతీయ జట్టుకు సారథ్యం వహించనప్పటికి.. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో కెప్టెన్‌గా అతడికి అనుభవం ఉంది. శ్రేయస్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అంతకుముందు ఐపీఎల్-2024 సీజన్లో కేకేఆర్‌ను అయ్యర్ ఛాంపియన్‌గా నిలిపాడు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చాడు. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలోని పంజాబ్ జట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతుంది. అంతేకాకుండా శ్రేయస్ డొమాస్టిక్ క్రికెట్లో కూడా ముంబై జట్టుకు ఎన్నో సంచలన విజయాలను అయ్యర్ అందించాడు. దీంతో అయ్యర్‌కు జాతీయ జట్టును నడిపించే సత్తా కూడా ఉందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.అయ్యర్ చివరిసారిగా 2023లో టీ20 మ్యాచ్ ఆడాడు. ప్రస్తుత టీ20 సెటప్‌లో అతడు లేడు. కానీ అతడిని తిరిగి తీసుకొచ్చి నేరుగా కెప్టెన్సీ ఇచ్చే అవకాశముందని బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాయి.అయ్యర్ ప్రస్తుతం కేవలం వన్డే జట్టులో మాత్రమే భాగంగా ఉన్నాడు. అయితే శ్రేయస్ పొట్టి క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. కాబట్టి అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. -
సర్పంచ్ సాబ్!.. అర్థమేంటో తెలియదు: శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకుంటోంది. ఐపీఎల్-2025లో ఫైనల్‌కు చేరిన పంజాబ్.. ఈ ఏడాది వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా.. ఇందులో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా.. మిగిలిన నాలుగూ గెలిచింది.అగ్రస్థానంలోతద్వారా తొమ్మిది పాయింట్లు సాధించి.. ప్రస్తుతానికి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా శ్రేయస్ అయ్యర్ జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 2024లో టైటిల్ అందించిన శ్రేయస్.. 2025లో పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.కేవలం కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు శ్రేయస్ అయ్యర్. గతేడాది 604 పరుగులు సాధించిన ఈ ముంబైకర్.. ఈ ఏడాది ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 203 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రేయస్ పంజాబ్ ఫ్రాంఛైజీతో చేరిననాటి నుంచి ఆ జట్టు అభిమానులు తమ కెప్టెన్‌ను ముద్దుగా సర్పంచ్ సాబ్ అని పిలుచుకుంటున్నారు.అర్థం ఏమిటో తెలియదుఅయితే, ఫ్యాన్స్ తనను అలా ఎందుకు పిలిచేవారో ముందుగా అర్థం కాలేదన్నాడు శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత జట్టు సభ్యులను అడిగితే అసలు విషయం తెలిసిందన్నాడు. జియోస్టార్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆ పిలుపు నాకెంతగానో నచ్చింది. అయితే, పంజాబ్ కింగ్స్‌తో ప్రయాణం మొదలుపెట్టినపుడు సర్పంచ్ సాబ్ అంటే అర్థం ఏమిటో నాకు తెలియదు.అప్పడు నా సహచర ఆటగాళ్లను అడుగగా.. ‘సర్పంచ్ అంటే.. ఇంటి పెద్ద లేదంటే ఓ సమూహానికి పెద్ద అని అర్థం.. జిల్లా పెద్దను ఇలాగే పిలుస్తారు’ అని చెప్పారు. అప్పటి నుంచి ఈ బిరుదును మరింత ఎక్కువగా ఆస్వాదిస్తున్నాను’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. చదవండి: ‘విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’ -
కెలికి మరి చితకొట్టించుకున్నారు, ముంబైను చీల్చిచెండాడిన శ్రీయస్ అయ్యర్..
-
శ్రీయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్, ముంబై ఫ్యాన్స్ కు ఇచ్చిపడేసాడు
-
‘అతడిని ఎంపిక చేయకపోతే టీమిండియాకే నష్టం’
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని శ్రేయస్ సేన.. తాజాగా ముంబై ఇండియన్స్‌పై జయభేరి మోగించింది. వాంఖడే వేదికగా ముంబైని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి నాలుగో విజయం నమోదు చేసింది.పంజాబ్ గెలుపులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ది కీలక పాత్ర. ముంబై విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 35 బంతుల్లో 66 పరుగులతో రాణించాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి శ్రేయస్ అయ్యర్ 203 పరుగులు సాధించాడు.సారథిగా, బ్యాటర్‌గా సూపర్హిట్గతేడాది కూడా పంజాబ్ కెప్టెన్, బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తంగా పదిహేడు మ్యాచ్‌లలో కలిపి 604 రన్స్ చేయడంతో పాటు.. జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అంతకు ముందు దేశీ క్రికెట్లో ముంబై తరఫునా అదరగొట్టాడు. అయినప్పటికీ 2023 తర్వాత మళ్లీ అతడికి భారత టీ20 జట్టులో చోటు దక్కలేదు.ఆటతోనే అందరికీ సమాధానంఈ పరిణామాల నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్ అయ్యర్‌ను టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే నష్టపోయేది టీమిండియానే అని అన్నాడు. ఈ మేరకు.. ‘‘శ్రేయస్ తన ఆటతోనే అందరికీ సమాధానం చెబుతున్నాడు. అతడి ప్రతిభ ఏమిటో ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు.అతడు షార్ట్ బాల్‌ను సరిగ్గా ఎదుర్కోలేడంటూ తరచూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే, ముంబైతో మ్యాచ్‌లో అతడు జస్ప్రీత్ బుమ్రాను ఎలా ఎదుర్కొన్నాడో అందరూ చూశారు కదా!.. షార్ట్ బాల్నే మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. అంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో రాణించాడు.ఇంకెన్నిసార్లుఇంకెన్నిసార్లు అతడు తనను తాను నిరూపించుకోవాలి? శ్రేయస్ లాంటి క్రికెటర్లను చూస్తే నాకెంతో ఆదర్శంగా ఉంటుంది. స్పిన్ బౌలింగ్‌లో హిట్టింగ్ ఆడుతున్నాడు. షార్ట్ బాల్ బలహీనతను అధిగమించాడు. గత రెండేళ్లుగా అతడి స్ట్రైక్‌రేటు కూడా 170కి పైగా ఉంది.He is HIM! He is Shreyas Iyer 🫡🎥 Here's how the #PBKS skipper took on the best to reach his FIFTY 👏Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/oG9HFySe8o— IndianPremierLeague (@IPL) April 16, 2026ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌లో 300కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబడుతున్నాడు. మంచి బంతి కోసం ఎదురుచూడటం కాదు.. వాళ్లపై అటాకింగ్‌కు దిగుతూ పైచేయి సాధిస్తున్నాడు. అత్యద్భుతంగా ఆడినా సరే అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదు?టీమిండియాకే నష్టంశ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లను పక్కనపెట్టడం వల్ల.. అతడి కంటే జట్టుకే ఎక్కువ నష్టం. అతడిని నాయకత్వ బృందంలో భాగం చేయకపోవడం కచ్చితంగా జట్టుకు నష్టదాయకం’’ అని అశ్విన్ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీరును విమర్శించాడు. కాగా ఆసియా కప్-2025కి ముందు అయ్యర్ గురించి మాట్లాడుతూ... జట్టులో ఖాళీ లేనందు వల్లే అతడిని పక్కనపెట్టామని అగార్కర్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్ ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని నాలుగింట గెలిచి అగ్రస్థానానికి దూసుకువచ్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ మాత్రం వర్షం వల్ల రద్దైపోయింది.చదవండి: ‘ఓటములకు ఆ ఒక్కడినే బాధ్యుడిని చేయలేము’ -
గర్జించిన శ్రేయస్, ప్రబ్‌సిమ్రన్.. పంజాబ్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో జోరు కనబరుస్తోంది. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ (80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారం చేయడంతో 196 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ఒక దశలో డికాక్, నమన్ ధిర్‌ల జోరుతో ముంబై ఇండియన్స్ 200 ప్లస్ పరుగులు చేస్తుందనిపించింది. కానీ నమన్ ధిర్ ఔటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 పరుగుల వద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇక ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ప్రబ్‌సిమ్రన్, శ్రేయస్ అయ్యర్ పోటీపడి మరీ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. పంజాబ్ దూకుడు ముందు ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముంబై బౌలర్లలో బుమ్రా సహా అందరూ దారాళంగా పరుగు లిచ్చుకున్నారు. సీజన్లో పంజాబ్ వరుసగా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలతో 9వ స్థానంలో కొనసాగుతోంది.The winning momentum refuses to stop 🌪️A flawless record remains perfectly intact 🛡️Punjab Kings conquer the Wankhede to climb up to the top spot in the table! ❤️Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/LUuZx5nlbf— IndianPremierLeague (@IPL) April 16, 2026 -
శ్రేయస్ స్టన్నింగ్ క్యాచ్.. షాకైన రోహిత్, సూర్య!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. గురువారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద అయ్యర్ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. అతని స్టన్నింగ్ క్యాచ్‌ను కళ్లారా చూసిన ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆశ్చర్యపోయారు. మార్కో యాన్సెన్ వేసిన 18వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్ బాదిన హార్దిక్ రెండో బంతిని డాట్ చేశాడు. మూడో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. సిక్సర్‌గా దూసుకొచ్చిన బంతిని బౌండరీ లైన్‌పై అయ్యర్ అద్భుతంగా అందుకొని చాకచక్యంగా లోపలికి విసిరేసాడు. అక్కడే ఉన్న బార్ట్లెట్ ఏ తప్పిదం చేయకుండా అందుకున్నాడు. ఎడమవైపు గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకోవడంతో పాటు అంతే సమర్థవంతంగా అయ్యర్ లోపలికి విసిరేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. క్యాచ్ పూర్తయిన వెంటనే శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు అరవండంటూ ప్రేక్షకులను ఉద్దేశించి సైగలు చేశాడు. అప్పటి వరకు అరిచిన ముంబై ఫ్యాన్స్.. ఈ క్యాచ్‌తో మౌనం వహించారు. దాంతో వారిని ఇంకా గట్టిగా అరవాలంటూ అయ్యర్ కోరాడు. అయితే అయ్యర్ పట్టిన క్యాచ్‌కు డగౌట్లో ఉన్న రోహిత్, సూర్యకుమార్‌లు ఫిదా అయ్యారు. వాట్ ఏ క్యాచ్ అని రోహిత్ సూర్యతో చెబుతున్నట్లు కెమెరాల్లో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.SHREYAS IYER, WHAT HAVE YOU DONE!! 🤯🎥 One of the best catches you would see in the #TATAIPL history 🔥🔥Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6EKgHR82cL— IndianPremierLeague (@IPL) April 16, 2026SKY & ROHIT COULDN'T BELIEVE IT - SHREYAS IYER YOU BEAUTY 😍 pic.twitter.com/lo0McmMaJh— Johns. (@CricCrazyJohns) April 16, 2026 -
IPL 2026: పంజాబ్ కింగ్స్ ఘన విజయం
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సీజన్లో పంజాబ్‌కు ఇది నాలుగో విజయం. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ (80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారంతో 196 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించడం విశేషం. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ప్రబ్‌సిమ్రన్ హాఫ్ సెంచరీముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం దిశగా సాగుతుంది. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ అర్థసెంచరీతో చెలరేగగా, అయ్యర్ (34) దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం పంజాబ్ 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. శ్రేయస్ (12), ప్రబ్‌సిమ్రన్ (16) క్రీజులో ఉన్నారు. అంతకముందు కూపర్ కన్నోలి (17) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య గజన్ఫర్ బౌలింగ్‌లో దీపక్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. అంతకముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్లో పంజాబ్ 21 పరుగులు పిండుకోవడం విశేషం.పంజాబ్ టార్గెట్ 196 పరుగులుపంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ఒక దశలో డికాక్, నమన్ ధిర్‌ల జోరుతో ముంబై ఇండియన్స్ 200 ప్లస్ పరుగులు చేస్తుందనిపించింది. కానీ నమన్ ధిర్ ఔటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 పరుగుల వద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు.బార్ట్లెట్ కళ్లు చెదిరే క్యాచ్.. పాండ్యా (14)ఔట్14 పరుగులు చేసిన పాండ్యా మార్కో యాన్సెస్ బౌలింగ్‌లో గ్జేవియర్ బార్ట్లెట్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. డికాక్ సెంచరీపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ బాదాడు. 53 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న డికాక్‌కు ఐపీఎల్లో ఇది మూడో సెంచరీ. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.నమన్ ధిర్ ఔట్.. మూడో వికెట్ డౌన్పంజాబ్తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. అర్థసెంచరీ సాధించిన నమన్ ధిర్ శశాంక్ సింగ్ బౌలింగ్‌లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. డికాక్ (82), పాండ్యా (3) క్రీజులో ఉన్నారు.7 ఓవర్లలో ముంబై 67/2ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. నమన్ ధిర్ (34), డికాక్ (25) క్రీజులో ఉన్నారు.సూర్యకుమార్ గోల్డెన్ డక్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. సూర్యకుమార్ యాదవ్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చిన అర్షదీప్ సింగ్ అంతకముందు రియాన్ రికెల్టన్ను ఔట్ చేశాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది.బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం వాంఖడే వేదికగా 24వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్ శర్మ, మిచెల్ సాంట్నర్ స్థానం డికాక్, మయాంక్ రావత్ తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.ముఖాముఖి పోరులో ఇరుజట్లు 35 సార్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ 17 సార్లు, పంజాబ్ కింగ్స్ 17 సార్లు నెగ్గాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక వాంఖడే స్టేడియంలో మాత్రం పంజాబ్ కింగ్స్ రికార్డు మెరుగ్గా ఉంది. వాంఖడేలో పంజాబ్ ముంబై పై 5 సార్లు గెలిచింది. గత ఐదు మ్యాచ్‌ల్లో ముంబై మూడింటింలో, పంజాబ్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచాయి.ముంబై ఇండియన్స్ తుదిజట్టు: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా( కెప్టెన్), రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మయాంక్ రావత్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.పంజాబ్ కింగ్స్ తుదిజట్టు: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), కూపర్ కొన్నోలీ, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్. -
సూర్యకు బైబై!.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?!
సొంతగడ్డపై టీమిండియాకు ఇటీవల టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అయితే, అతడి భవితవ్యంపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా సారథిగా సూపర్ హిట్ అవుతున్నా.. బ్యాటర్‌గా మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు.ఈ నేపథ్యంలో సెలక్టర్లు సైతం సూర్యను కొనసాగించాలా వద్దా? అన్న అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ ముగిసిన వెంటనే జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీస్‌లలో అతడి ప్రదర్శనను పరిశీలించిన అనంతరమే వారు అంతిమ నిర్ణయానికి రానున్నారు.వచ్చే రెండేళ్లలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ (2028)తో పాటు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (2028) జరగనున్నాయి. వీటికి సూర్యకుమార్ సారథ్యంలోనే సిద్ధం కావాలా లేక కొత్త నాయకుడిని ఎంపిక చేయాలా అనే విషయంపై సెలక్టర్లు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనతో ఒక అవగాహనకు రానున్నారు.విషమ పరీక్షఈ టూర్లో అటు సారథిగా, ఇటు ప్లేయర్‌గా సూర్యకుమార్‌కు విషమ పరీక్ష కానుంది. గౌతమ్ గంభీర్ 2028 ఒలింపిక్స్ వరకు టీమిండియా హెడ్‌కోచ్‌గా కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో... సూర్యకుమార్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం 35వ పడిలో ఉన్న సూర్యకుమార్ ఒలింపిక్స్ సమయానికి ఫిట్‌గా ఉంటాడా అనేది అనుమానమే.‘సూర్యకుమార్ ప్రస్తుతం జట్టును నడిపిస్తున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు అతడే కెప్టెన్ అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది అందులో అతడి ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.గతేడాది పేలవ ఆటతీరు కనబర్చిన సూర్యకుమార్ కనీసం ఒక్క హాఫ్‌సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ ఏడాది ఫర్వాలేదినిపించిన ఈ ముంబైకర్... వరల్డ్‌కప్ ఆరంభంలో ఆకట్టుకున్నా... కీలక మ్యాచ్‌ల్లో మాత్రం విఫలమయ్యాడు. సౌతాఫ్రికాపై 18 పరుగులు, వెస్టిండీస్‌పై 18 పరుగులు, ఇంగ్లండ్‌పై 11 పరుగులు చేసిన సూర్యకుమార్... న్యూజిలాండ్‌తో ఫైనల్లో డకౌటయ్యాడు. ఒకవేళ సూర్యను సెలక్టర్లు తప్పిస్తే.. అతడి స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్ కాగల అర్హత ఉన్న టాప్-5 ఆటగాళ్లు ఎవరో తెలుసా?శుబ్‌మన్ గిల్ఇప్పటికే టీమిండియా టెస్టు, వన్డే పగ్గాలు చేపట్టాడు శుబ్‌మన్ గిల్. అయితే, టీ20 జట్టు కెప్టెన్సీ విషయంలో మాత్రం బీసీసీఐ గిల్ గురించి వెంటనే నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఆసియా కప్-2025తో టీ20 జట్టులో పునరాగమనం చేసిన అతడు వరుసగా విఫలం కావడం ఇందుకు కారణం.అయితే, ఐపీఎల్-2026లో గనుక బ్యాటర్‌గా గిల్ సత్తా చాటితే అతడి ఎంపిక లాంఛనమే అవుతుంది. కాగా ఫామ్‌లేమి కారణంగా గిల్‌ను టీ20 ప్రపంచకప్-2026 జట్టు నుంచి సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే.హార్దిక్ పాండ్యానిజానికి 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కెప్టెన్ కావాల్సింది హార్దిక్ పాండ్యానే. అయితే, అనూహ్యంగా యాజమాన్యం సూర్యకు పగ్గాలు అప్పగించింది.ఆ సమయంలో.. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాపై అధిక భారం పడకుండా.. తాము ఈ నిర్ణయం తీసుకున్నటుట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. కాబట్టి సూర్య స్థానంలో హార్దిక్‌ను సారథిగా ఎంపిక చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశం. ఐపీఎల్లో కెప్టెన్‌గా అతడికి అనుభవం ఉంది.సంజూ శాంసన్జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయిన సంజూ శాంసన్... టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించి హీరో అయ్యాడు. సూపర్-8 నాకౌట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ కేరళ వికెట్ బ్యాటర్.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 రన్స్‌తో దుమ్ములేపాడు.ఇక ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు సుదీర్ఘకాలం కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం సంజూకు ఉంది. కేరళ జట్టుకు కూడా గతంలో అతడు సారథ్యం వహించాడు.అక్షర్ పటేల్టీ20 వరల్డ్‌కప్-2026లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున సారథిగానూ అతడు సత్తా చాటుతున్నాడు. సూర్య వారసుడిగా అక్షర్ ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు.శ్రేయస్ అయ్యర్ముంబై సారథిగా, ఐపీఎల్లో వివిధ జట్ల కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు అపార అనుభవం ఉంది. 2024లో అతడి సారథ్యంలోనే కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలిచింది. గతేడాది పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఇరగదీసి ఫైనల్‌కు చేర్చాడు. అయితే, 2023 డిసెంబరు తర్వాత ఇంత వరకు అతడు భారత టీ20 జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా త్వరలోనే జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్ క్రికెటర్ -
సూర్యకుమార్ యాదవ్‌పై వేటు!
టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా భారత క్రికెట్ చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. సొంతగడ్డపై అతడి సారథ్యంలో ఈ ఏడాది భారత్ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా మొత్తంగా మూడుసార్లు.. వరుసగా రెండుసార్లు.. స్వదేశంలో తొలిసారి పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది.ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యంఇక ఈ టోర్నీకి ఆరంభం ముందు నుంచే సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీ గురించి వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. సారథిగా టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించినప్పటికీ.. బ్యాటర్‌గా అతడి ప్రదర్శన దిగజారడం ఇందుకు కారణం. అయితే, సూర్య వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కావడంతో ఇక అతడికి తిరుగులేదని అభిమానులు భావిస్తున్నారు.సూర్య సైతం తాను ఇప్పట్లో రిటైర్ కాబోనని.. ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యమని తెలిపాడు. అయితే, టీమిండియా యాజమాన్యం ప్రణాళికలు మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత సూర్యను కెప్టెన్‌గా తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.స్ట్రైక్‌రేటు మరీ దారుణంకాగా ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన సూర్యకుమార్.. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఆటగాడిగా విఫలమవుతున్నాడు. గతేడాది అతడి స్ట్రైక్‌రేటు మరీ దారుణంగా 120లోపు పడిపోగా.. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు.ఇక 2026లో మొత్తంగా నాలుగు అర్ధ శతకాలు బాదిన సూర్య.. టీ20 ప్రపంచకప్‌లో అమెరికాపై సత్తా చాటాడు. అయితే పెద్ద జట్లైన సౌతాఫ్రికాపై 18, వెస్టిండీస్‌పై 18, సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 11, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 0 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు.. తదుపరి పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో సూర్య బ్యాటింగ్ ప్రదర్శనపైనే అతడి భవితవ్యం ఆధారపడి ఉందని తెలుస్తోంది.ఇంగ్లండ్‌లో విఫలమతే అంతే సంగతులుఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘సూర్యనే కెప్టెన్. అయితే, బ్యాటర్‌గా అతడు నిలకడగా రాణించాల్సి ఉంది. ఈ విషయంలో సెలక్టర్లకు నమ్మకం కలిగించాలి. ఇంగ్లండ్ టూర్లో అతడే కెప్టెన్.అయితే, 2028 నాటికి అతడు జట్టుతో కొనసాగాలంటే కచ్చితంగా మంచి ప్రదర్శనలు ఇవ్వాల్సిందే’’ అని పేర్కొన్నాయి. కాగా వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే వంటి చిచ్చరపిడుగులు టీమిండియా టీ20 జట్టు వైపు దూసుకువస్తున్నారు. వీరితో పాటు ఇప్పటికే ఎంతో మంది తమను తాము నిరూపించుకున్నారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా టీ20 ఫార్మాట్లో దుమ్ములేపుతున్నాడు. ఇలాంటి తరుణంలో సూర్య ఇకనైనా తన బ్యాటింగ్‌పై మరింతగా దృష్టి పెడితేనే జట్టులో కొనసాగే అవకాశం ఉంటుంది.చదవండి: రాయల్స్ వైఖరిపై అసంతృప్తిలో వైభవ్ -
‘టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతా’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో శ్రేయస్ అయ్యర్ హవా కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్, బ్యాటర్‌గా ఈ టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు అదరగొడుతున్నాడు. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సారథిగా టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్.. గతేడాది పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.అంతేకాదు 2025లో 17 మ్యాచ్‌లలో కలిపి 604 పరుగులు సాధించాడు అయ్యర్. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికి పంజాబ్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచింది. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ నాలుగు మ్యాచ్‌లలో కలిపి 137 పరుగులు చేశాడు.శ్రేయస్ అయ్యర్ దుమ్ములేపుతున్నా..ఇదిలా ఉంటే.. దేశీ టీ20 ఫార్మాట్, ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ దుమ్ములేపుతున్నా.. భారత టీ20 జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు. ప్రస్తుతం జట్టులో ఖాళీ లేనందునే ఈ ముంబైకర్‌ను పక్కనపెట్టాల్సి వస్తోందని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గతంలో పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి శ్రేయస్ అయ్యర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంత చేసినా అయ్యర్‌ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే తాను నిరసనకు దిగుతానన్నాడు. ‘‘అతడు గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడు.టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతాఅయినా సరే సెలక్టర్లు గనుక అతడిని జాతీయ టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే.. నాతో పాటు మిగిలిన వాళ్లు కూడా వచ్చి నిరసనకు దిగాలి. అతడి కోసం మనం ఫైట్ చేయాలి. జట్టులో చోటుకు అతడు అర్హుడు. ఇప్పటికే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు.ఇలాంటి సమయంలో శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడు జట్టులోకి వస్తే ఉపయోగకరం. అతడు జట్టులో ఉంటే టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవగలదు’’ అని మనోజ్ తివారి పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్ విషయంలో సెలక్టర్లతో మాటల యుద్ధం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే? -
'ఎంత మంది వచ్చినా అతడే నా ఫేవరేట్ కెప్టెన్'
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా మూడో టైటిల్‌ను అందించిన శ్రేయస్ అయ్యర్.. గతేడాది పంజాబ్ కింగ్స్‌ను రన్నరప్‌గా నిలిచాడు. ఐపీఎల్-2026లో కూడా పంజాబ్‌ను అయ్యర్ విజయపథంలో నడిపిస్తున్నాడు.ఈ ఏడాది సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలను నమోదు చేసింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌పై ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2019 నుండి జట్టుతో ఉన్న ప్రభ్సిమ్రాన్.. గత ఏడేళ్లలో శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ వంటి దిగ్గజ కెప్టెన్ల నాయకత్వంలో ఆడాడు. కానీ తన ఫేవరేట్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ప్రభ్సిమ్రాన్ ఎంచుకున్నాడు.శ్రేయస్ అయ్యర్ నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటాడు. నేను కొన్ని మ్యాచ్‌లలో సరిగ్గా ఆడకపోయినప్పటికి, శ్రేయస్ నా దగ్గరకు వచ్చి ఎలాంటి ఒత్తిడి తీసుకోవద్దని చెప్పేవాడు. నా ఆట నన్ను ఆడమని మద్దతు ఇచ్చేవాడు. అందుకే నా దృష్టిలో అతడే బెస్ట్ కెప్టెన్. అయ్యర్ నన్ను ఒక సీనియర్ ప్లేయర్‌గా చూశేవాడు. జట్టు వ్యూహాల్లో భాగం చేయడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ప్రభ్సిమ్రాన్ పేర్కొన్నాడు.చదవండి: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’ -
కేకేఆర్ ఫ్యాన్స్ ఫైర్.. స్పందించిన అయ్యర్ సోదరి
-
కేకేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం.. దిగొచ్చిన అయ్యర్ సోదరి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కేకేఆర్‌కు ఘనమైన రికార్డు ఉంది. మూడుసార్లు చాంపియన్ అయిన కేకేఆర్ ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకసారి భారీ స్కోరు చేసి కూడా గెలవకపోవడం, మరొకసారి తక్కువ స్కోరుకే ఆలౌటయ్యి పరాజయం మూటగట్టుకుంది. ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనైనా గెలిచి శుభారంభం చేయాలనుకున్న కేకేఆర్ ఆశలపై వరుణుడు అమాంతం నీళ్లు చల్లాడు. సీజన్లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ వర్షంతో రద్దయిన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఒక బంతి కూడా పడకుండానే రద్దవ్వడంతో ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. అయితే మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన కేకేఆర్‌ను ఉద్దేశించి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ పెట్టిన పోస్టు వివాదాస్పదంగా మారింది. కేకేఆర్, పంజాబ్ మ్యాచ్ రద్దయిన కాసేపటికే ఇన్స్టాగ్రామ్ వేదికగా శ్రేష్ట్ అయ్యర్ ఒక వీడియోను షేర్ చేసింది. 'మా పంజాబీల మనసు చాలా పెద్దది. అందుకే కేకేఆర్‌కు ఒక పాయింట్ ఇచ్చేశాం. బతికి బట్టకట్టండి’ అని పంజాబీలో వ్యాఖ్యానిస్తూ డ్యాన్సులు చేసింది. అయితే శ్రేష్ఠ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రేష్ఠ వ్యాఖ్యలపై కేకేఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ అన్న కెప్టెన్సీలోనే కేకేఆర్ విజేతగా నిలిచిందన్న సంగతి మరిచిపోయారా! అంటూ ట్రోల్ చేశారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను విజేతగా నిలబెట్టాడు. కానీ ఈ క్రెడిట్ పూర్తిగా గౌతమ్ గంభీర్‌కు పోయింది. దాంతో అతను ఆ జట్టును వదిలి పంజాబ్ కింగ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొనే శ్రేష్ట అయ్యర్ కేకేఆర్‌ను ట్రోల్ చేసినట్లు అర్థమవుతుంది.తాజాగా శ్రేష్ఠ అయ్యర్ తనపై వచ్చిన విమర్శలకు బదులిచ్చింది. ‘నేను ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టలేదు. ఫన్నీ తరహాలోనే పెట్టాను. ఆటను ఆటగానే చూడండి. నాకు ఏ జట్టుపైన ద్వేషం లేదు. ప్రతి ఒక్కరు దీనిని క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలి. ఎవరినీ ట్రోల్ చేయాలనుకోలేదు. ఇంత చిన్న విషయాన్ని మీరు భూతద్ధంలో నుంచి చూస్తున్నారు. దయచేసి శాంతించండి’ అని పేర్కొన్నారు.కానీ గతేడాది కూడా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షంతో తుడుచు కుపెట్టుకుపోయింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పూర్తవ్వగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం అంతరాయం కలిగించింది. కానీ తాజా మ్యాచ్‌లో 36.2 ఓవర్ల ఆటను వరణుడు మింగేసాడు. View this post on Instagram A post shared by Shresta Iyer (@shrestaiyer29)చదవండి: ఒక్క మ్యాచ్‌తో ఇన్ని రికార్డులా.. మాములోడివి కాదు! -
‘త్వరలోనే టీమిండియా టీ20 కెప్టెన్ అవుతాడు’
టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా పరుగుల వరద పారిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ సారథిగా వ్యవహరించిన ఈ ముంబైకర్.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఇక గతేడాది వేలంలో రూ. 26.75 కోట్లు పైగా వెచ్చించి పంజాబ్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.పైసా వసూల్ ప్రదర్శనఈ క్రమంలో ఐపీఎల్-2025లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా పంజాబ్‌కు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer). మొత్తంగా 17 మ్యాచ్‌లలో 604 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. సారథిగా పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.ఇక ఐపీఎల్-2026 టోర్నీని కూడా శ్రేయస్ అయ్యర్ ఘనంగా ఆరంభించాడు. ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌లలో జట్టును గెలిపించుకున్నాడు. బ్యాటర్‌గా రెండు మ్యాచ్‌లలో కలిపి 68 పరుగులు రాబట్టాడు. ఇదిలా ఉంటే.. గతేడాది దేశీ క్రికెట్లోనూ ముంబై తరఫున అయ్యర్ అదరగొట్టాడు.అయినప్పటికీ భారత టీ20 జట్టుకు సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోనే లేదు. అయితే, పంజాబ్ కింగ్స్ పేసర్ వైశాఖ్ విజయ్‌కుమార్ మాత్రం శ్రేయస్ అయ్యర్ తప్పక టీమిండియా టీ20 కెప్టెన్ అవుతాడని అంచనా వేశాడు. సారథి అయ్యేందుకు అతడికి అన్ని అర్హతలు ఉన్నాయని కొనియాడాడు.త్వరలోనే టీమిండియా కెప్టెన్ అవుతాడుఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘జట్టులోని ప్రతి బౌలర్, ప్రతి ఆటగాడికి అతడు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తాడు. బాగా ఆడినా.. ఆడకపోయినా వారికి అండగానే ఉంటాడు. ఆటగాళ్లకు కావాల్సింది ఇలాంటి కెప్టెనే.టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా అతడు అత్యద్భుతంగా ఆడుతున్నాడు. కచ్చితంగా అతడు త్వరలోనే టీమిండియా కెప్టెన్ అవుతాడు’’ అని వైశాఖ్ విజయ్‌కుమార్ పేర్కొన్నాడు. కాగా వైశాఖ్ పంజాబ్ తరపున ఇప్పటికి రెండు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. కాగా శ్రేయస్ అయ్యర్ 2023, డిసెంబరులో చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు.చదవండి: CSKకు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు! -
అయ్యర్ కు మ్యాచ్ గెలిచిన ఆ సంతోషం దక్కలేదు..!
-
IPL 2026: చరిత్ర సృష్టించిన సర్పంచ్ సాబ్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ భారీ ఐపీఎల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. లీగ్ చరిత్రలో హేమాహేమీలను కాదని అత్యధిక విజయాల శాతం (59.80) నమోదు చేసిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 3) సీఎస్కేపై గెలుపుతో ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ గెలుపుతో శ్రేయస్ హార్దిక్ పాండ్యాను (59.01) అధిగమించి టాప్ ప్లేస్‌కు చేరాడు. ఈ విభాగంలో శ్రేయస్, హార్దిక్ తర్వాతి స్థానాల్లో సచిన్ టెండూల్కర్ (58.82), ఎంఎస్ ధోని (58.36), షేన్ వార్న్ (56.36), రోహిత్ శర్మ (56.32) ఉన్నారు.ధోని, రోహిత్ కూడా సాధించలేని ఘనత ఐపీఎల్ చరిత్ర అత్యంత విజయవంతమైన కెప్టెన్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ కూడా సాధించిన లేని ఘనతను శ్రేయస్ అయ్యర్ సాధించాడు. ధోని, రోహిత్ తలో 5 ఐపీఎల్ ట్రోఫీలు సాధించినా నమోదు చేయలేని అత్యధిక విజయాల శాతాన్ని శ్రేయస్ కేవలం ఒకే ఒక ట్రోఫీ ద్వారానే సాధించాడు. ఐపీఎల్ కెప్టెన్‌గా శ్రేయస్‌కు మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్ అతను మాత్రమే. 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్.. 2020లో ఢిల్లీని, 2025లో పంజాబ్‌ను రన్నరప్‌గా నిలిపాడు.శ్రేయస్ సారథ్యంలో పంజాబ్ ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. రన్నరప్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కూర్చుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందిన పంజాబ్.. తాజాగా సీఎస్కేను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. సీఎస్కేపై గెలుపులో శ్రేయస్ వ్యక్తిగతంగానూ కీలకపాత్ర పోషించాడు. 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసి గెలుపుకు ప్రధాన కారకుడయ్యాడు. -
పంజాబ్ సిక్సర్ల మోత వెనుక రహస్యమిదే!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ దూకుడు మీద ఉంది. బలమైన బ్యాటింగ్ శక్తితో లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లోనూ అదే జోరును ప్రదర్శిస్తోంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్ శుక్రవారం చెన్నై సూపర్‌కింగ్స్‌ను మట్టికరిపించింది. రెండు మ్యాచ్‌లు కలిపి పంజాబ్ మొత్తం 23 సిక్సర్లు బాదింది. ఇందులో గుజరాత్‌పై 14, చెన్నైపై 9 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు అన్ని సీజన్లు కలిపి 1,686 సిక్సర్లు బాదింది. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లను భయపెడుతున్న పంజాబ్ ఇంత బలంగా తయారవ్వడం వెనుక దాగున్న రహస్యాన్ని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బయటపెట్టాడు. పంజాబ్ వరుస విజయాల్లో జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందేనన్నాడు. పవర్ హిట్టింగ్ కోసం పాంటింగ్ ఉపయోగించిన స్క్వాష్ బాల్ టెక్నిక్ ఇప్పుడు పంజాబ్ బ్యాటర్లకు వరంగా మారిందని తెలిపాడు. పాంటింగ్ కోచ్‌గా వచ్చిన తర్వాత పంజాబ్ బ్యాటింగ్‌లో బలం పెరిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రబ్‌సిమ్రన్ సింగ్‌లు సిక్సర్లు కొట్టడంలో మరింత రాటుదేలారు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘పాంటింగ్‌తో ఉన్న అనుబంధం గురించి ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా. నేను ముంబై ఇండియన్స్‌కు ఆడినప్పుడు అతడు మా కోచ్‌గా ఉన్నాడు. నా హిట్టింగ్ స్పీడ్‌ను పెంచేందుకు పాంటింగ్ కొత్త పద్దతిని ఉపయోగించాడు. ప్రాక్టీస్ సమయంలో పాంటింగ్ నా చేతి గ్లోవ్స్ మధ్యలో స్క్వాష్బాల్ను ఉంచేవాడు. దీనివల్ల చేతి కింది భాగంలో బ్యాట్‌ను గట్టిగా పట్టుకోవడానికి ఆస్కారముండదు. దీంతో మన హిట్టింగ్‌లో స్పీడ్ పెరుగుతుంది. ఈ టెక్నిక్ వల్లే అప్పట్లో నేను చాలా మ్యాచ్‌ల్లో సులువుగా సిక్సర్లు కొట్టేవాడిని. తాజాగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఈజీగా సిక్సర్లు కొట్టడం నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే అక్కడ పాంటింగ్ హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. వాస్తవానికి ఎవరైనా సిక్సర్లు కొడతారు. కానీ స్వ్కాష్బాల్ టెక్నిక్ వల్ల బ్యాట్ స్పీడ్ పెరిగి బంతి ఎంత వేగంగా వచ్చినా సులువుగా సిక్సర్లు బాదేందుకు ఇది ఉపయోగపడుతుంది.’ అని చెప్పుకొచ్చాడు.ఏమిటీ స్క్వాష్‌బాల్ టెక్నిక్?పాంటింగ్ ఉపయోగించే స్క్వాష్‌బాల్ టెక్నిక్‌లో స్వ్కాష్ బంతిని బ్యాటర్ చేతి గ్లోవ్స్ మధ్య ఉంచుతారు. దీనివల్ల చేతి కింది బాగంలో ఖాళీ ఏర్పడి బ్యాట్ గట్టిగా పట్టుకోలేము. దీనివల్ల బ్యాట్‌కు గ్రిప్ రావడంతో పాటు హిట్టింగ్ స్పీడ్ పెరుగుతుంది. 2007 వన్డే ప్రపంచకప్ సమయంలో అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ సహా ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లు వారి కోచ్ బాబ్ మ్యూల్మన్ సలహా మేరకు ఇలాంటి టెక్నిక్‌ను ఉపయోగించే అలవోకగా సిక్సర్లు బాదడం నేర్చుకున్నారు. ఇప్పుడదే టెక్నిక్‌ను పాంటింగ్ పంజాబ్ బ్యాటర్లపై ప్రయోగించి విజయవంతమయ్యాడు.చదవండి: ‘ఏదీ కలిసిరావడం లేదు.. ఓటమికి అదే కారణం’ -
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచ రికార్డు
పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనత సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధికసార్లు 200 పరుగులకు పైగా స్కోరు ఛేదించిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పంజాబ్ తానే బద్దలు కొట్టింది.ఐపీఎల్-2026 టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన పంజాబ్ కింగ్స్.. రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.209 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. ఆయుశ్ మాత్రే (73), శివం దూబే (45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (32) రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్లెట్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.పంజాబ్ బ్యాటర్ల ధనాధన్‌ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 18.4 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. తద్వారా ఐదు వికెట్లతేడాతో జయకేతనం ఎగురవేసింది. ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (43), కూపర్ కన్నోలి (36), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు.ప్రపంచంలోనే తొలి జట్టుగా పంజాబ్పంజాబ్ కింగ్స్ 200కు పైగా పరుగుల స్కోరును ఛేదించడం ఇది తొమ్మిదోసారి. పొట్టి క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా పంజాబ్ నిలిచింది. టీ20 క్రికెట్లో అత్యధికసార్లు 200కు పైగా పరుగుల స్కోరు ఛేదించిన జట్లు ఇవే🏏పంజాబ్ కింగ్స్ (ఐపీఎల్)-తొమ్మిది సార్లు🏏ఆస్ట్రేలియా- ఏడుసార్లు🏏ముంబై ఇండియిన్స్ (ఐపీఎల్)- ఆరు సార్లు🏏టీమిండియా- ఆరు సార్లు🏏రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఐపీఎల్)- ఆరు సార్లు🏏సౌతాఫ్రికా- ఆరుసార్లు చదవండి: IPL 2026: అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్!🔙 to 🔙 victories ✌️@PunjabKingsIPL complete the chase in an authoritative fashion ❤️A win by 5⃣ wickets in Chennai 🥳Updates ▶️ https://t.co/riWrE2EZiF#TATAIPL | #KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/S9EEawsaZk— IndianPremierLeague (@IPL) April 3, 2026 -
ఎంతపని చేశావ్ అయ్యర్.. పంజాబ్ జట్టుకు షాక్!
ఐపీఎల్ 19వ సీజన్లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండు విజయాలతో జోష్ మీదున్న పంజాబ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. తాజాగా చెన్నైతో మ్యాచ్‌లో మరోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో ఈసారి కెప్టెన్‌తో పాటు జట్టు ఆటగాళ్లు సహా ఇంపాక్ట్ ప్లేయర్ మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్ కౌన్సిల్ మాట్లాడుతూ..‘చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్) ఆర్టికల్ 2.22 ప్రకారం స్లో ఓవర్ రేట్ నమోదు చేసి నిబంధనలు ఉల్లంఘించిన పంజాబ్ జట్టుపై చర్యలు తీసుకుంటున్నాం. అయితే కెప్టెన్ అయ్యర్‌కు ఇది0 రెండో స్లో ఓవర్‌రేట్ కావడంతో అతని మ్యాచ్ ఫీజులో రూ. 24 లక్షలు కోత విధిస్తున్నాం. అంతేకాదు జట్టులోని 11 మంది ఆటగాళ్లు సహా ఇంపాక్ట్ ప్లేయర్ నుంచి ఆరు లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజుల్లో 25 శాతం జరిమానా విధిస్తున్నాం.’ అని ఐపీఎల్ కౌన్సిల్ తన ప్రకటనలో వెల్లడించింది.మళ్ళీ తప్పు చేస్తే నిషేధం!ఈ సీజన్లో పంజాబ్ జట్టు మూడోసారి కూడా స్లో ఓవర్ రేటును నమోదు చేస్తే అప్పుడు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అప్పుడు కెప్టెన్ కు 30లక్షల జరిమానా విధించబడుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని ఆటగాళ్లకు తలా 12 లక్షలు లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం రెండింటిలో ఏది తక్కువ అయితే అది జరిమానా విధించబడుతుంది. అంతేకాదు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొనే అవకాశముంది.మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే 73 పరుగులతో రాణించాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.చదవండి: అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్! -
పంజాబ్ బల్లే బల్లే...
చెన్నై సూపర్‌కింగ్స్‌కి కోట లాంటి చెపాక్ మైదానంలో ఒక్క పంజాబ్‌కు మాత్రమే చెన్నైని ఎక్కువ సార్లు ఓడించిన ఘనమైన రికార్డు ఉంది. గత మూడు సీజన్లలో ఇక్కడ సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించిన పంజాబ్ ఈసారీ దానిని కొనసాగించింది. ముందుగా చెన్నై 209 పరుగుల భారీ స్కోరు చేసినా... మరో 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ గెలుపు సొంతం చేసుకుంది. స్పిన్నర్ చహల్ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి స్కోరును నియంత్రించగా, ఛేదనలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీతో పంజాబ్ కింగ్స్ జట్టును విజయం దిశగా నడిపించాడు. చెన్నై: గత ఏడాది ఐపీఎల్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (43 బంతుల్లో 73; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా...శివమ్ దూబే (22 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) సర్ఫరాజ్ ఖాన్ (12 బంతుల్లో 32; 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. అనంతరం పంజాబ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా... ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కూపర్ కనోలీ (22 బంతుల్లో 36; 6 ఫోర్లు) మెరిపించారు. సర్ఫరాజ్ జోరు... వరల్డ్ కప్ హీరో సామ్సన్ (7) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్రభావం చూపకపోగా... కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు) విఫలమయ్యాడు. అయితే మరోవైపు ఆయుశ్ మాత్రే జోరుతో స్కోరు దూసుకుపోయింది. పవర్‌ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. మాత్రేతో రెండో వికెట్‌కు రుతురాజ్ గైక్వాడ్ 55 బంతుల్లో 96 పరుగులు జోడించగా... అతని వాటా 22 పరుగులు మాత్రమే! ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మాత్రే, కార్తీక్ (1) అవుట్ కాగా, అర్ష్ దీప్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతోసర్ఫరాజ్ చెలరేగాడు. ఆ తర్వాత వైశాక్ ఓవర్లో వరుసగా 4, 4, 4 కొట్టిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. అర్ష్ దీప్ వేసిన ఆఖరి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి దూబే జట్టు స్కోరును 200 దాటించాడు. సమష్టి ప్రదర్శన... ఛేదనలో పంజాబ్ టాప్–4 తమ వంతు పాత్ర పోషించారు. తాను ఆడిన తొలి 6 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్‌లతో ప్రియాన్ష్ దూకుడుగా మొదలుపెట్టగా, కంబోజ్ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 3 ఫోర్లు బాదాడు. పవర్‌ప్లేలో స్కోరు 68 పరుగులకు చేరింది. ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కనోలీ, శ్రేయస్ అదే ధాటిని కొనసాగించారు. చహర్ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన శ్రేయస్... హెన్రీ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. 26 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 24 పరుగుల దూరంలో అతను అవుటైనా, ఇతర బ్యాటర్లు లాంఛనం పూర్తి చేశారు. ప్రశాంత్ వీర్ అరంగేట్రం... గత మ్యాచ్‌లో రూ.14.20 కోట్ల విలువైన ఆటగాడు కార్తీక్ శర్మతో అరంగేట్రం చేయించిన చెన్నై... ఈ మ్యాచ్‌లో మరో రూ.14.20 కోట్ల ప్లేయర్ ప్రశాంత్ వీర్‌కు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చింది. ప్రధానంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన 20 ఏళ్ల ప్రశాంత్ లోయర్ ఆర్డర్లో భారీ షాట్లు ఆడగల సమర్థుడు. బీసీసీఐ అండర్–23 టోర్నీతో పాటు సీఎస్కే ట్రయల్స్‌లో ఆకట్టుకోవడంతో రవీంద్ర జడేజా తరహా ఆటగాడైన వీర్‌ను జట్టు ఎంచుకుంది. యూపీ టి20 లీగ్‌లో 155 స్ట్రయిక్‌రేట్‌లో 320 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీసి ప్రశాంత్ అందరి దృష్టినీ ఆకర్షించాడు.6-చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అత్యధికసార్లు (6) ఓడించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ గుర్తింపు పొందింది. ముంబై ఇండియన్స్ (21 సార్లు) తర్వాత ఐపీఎల్లో చెన్నై జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టు పంజాబ్ (17 సార్లు). బెంగళూరు (16 సార్లు) మూడో స్థానానికి వెళ్లింది. 36-ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యధికసార్లు 200 పరుగులకు పైగా స్కోరు చేసిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించింది. ఇప్పటి వరకు చెన్నై జట్టు 36 సార్లు 200 మార్క్‌ను దాటింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 35 సార్లు... పంజాబ్ కింగ్స్ 33 సార్లు, ముంబై ఇండియన్స్ 32 సార్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ 30 సార్లు ఈ ఘనత సాధించాయి. స్కోరు వివరాలుచెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) బార్ట్లెట్ 7; రుతురాజ్ (సి) వధేరా (బి) చహల్ 28; ఆయుశ్ (సి) మాత్రమే (బి) వైశాక్ 73; దూబే (నాటౌట్) 45; కార్తీక్ (ఎల్బీ) (బి) యాన్సెన్ 1; సర్ఫరాజ్ (సి) వధేరా (బి) వైశాక్ 32; ప్రశాంత్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–14, 2–110, 3–123, 4–130, 5–168. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–41–0, బార్ట్లెట్ 4–0–48–1, యాన్సెన్ 4–0–43–1, వైశాక్ 4–0–38–2, చహల్ 3–0–21–1, స్టొయినిస్ 1–0–17–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (బి) హెన్రీ 39; ప్రభ్‌సిమ్రన్ (రనౌట్) 43; కనోలీ (సి) హెన్రీ (బి) కంబోజ్ 36; శ్రేయస్ (సి) చహర్ (బి) కంబోజ్ 50; వధేరా (సి) నూర్ (బి) హెన్రీ 10; శశాంక్ (నాటౌట్) 14; స్టొయినిస్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–61, 2–95, 3–127, 4–186, 5–186. బౌలింగ్: ఖలీల్ 3–0–28–0, హెన్రీ 4–0–54–2, కంబోజ్ 3.4–0–43–2, నూర్ 4–0–38–0, రాహుల్ చహర్ 4–0–46–0. -
సత్తా చాటిన శ్రేయస్.. పంజాబ్ ఖాతాలో వరుసగా రెండో విజయం
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేపై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసింది. సీఎస్కే విషయానికొస్తే.. ఈ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి, తాజాగా పంజాబ్ చేతిలో పరాజయంపాలైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (73) అర్ద సెంచరీతో సత్తా చాటగా.. శివమ్ దూబే (45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (32) రాణించారు. రుతురాజ్ గైక్వాడ్ (28) పర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్ (7), కార్తీక్ శర్మ (1) నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ 2, చహల్, జన్సెన్, బార్ట్లెట్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను ధాటిగా ప్రారంభించిన పంజాబ్ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆదిలో ప్రియాంశ్ ఆర్య (39) విధ్వంసం సృష్టించి ఔట్ కాగా.. ప్రభ్‌సిమ్రన్ (43), కూపర్ కన్నోల్లీ (36), శ్రేయస్ అయ్యర్ (50) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి గెలుపుకు పునాది వేశారు. ఆఖర్లో శశాంక్ సింగ్ (14 నాటౌట్), స్టోయినిస్ (9 నాటౌట్) ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పంజాబ్‌ను గెలుపు తీరాలు దాటించారు. సీఎస్కే బౌలర్లలో మ్యాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ తలో 2 వికెట్లు తీశారు. సీఎస్కే సొంతగడ్డపై భారీ స్కోర్ చేసినా, దాన్ని కాపాడుకోలేకపోయింది.


