శ్రేయస్ కాదు.. టీమిండియా కెప్టెన్సీ రేసులో ఊహించని ప్లేయర్‌ | Rajat Patidar Gets Ahead Of Shreyas Iyer For India Captaincy And Batting | Sakshi
Sakshi News home page

శ్రేయస్ కాదు.. టీమిండియా కెప్టెన్సీ రేసులో ఊహించని ప్లేయర్‌

May 27 2026 4:23 PM | Updated on May 27 2026 4:50 PM

Rajat Patidar Gets Ahead Of Shreyas Iyer For India Captaincy And Batting

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌మ రెండో ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఐపీఎల్‌-2026లో ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన‌ క్వాలిఫ‌య‌ర్-1లో గుజ‌రాత్ టైటాన్స్‌పై 92 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన ఆర్సీబీ.. వ‌రుసగా రెండోసారి త‌మ ఫైన‌ల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బెంగ‌ళూరు ఫైన‌ల్‌కు చేర‌డంలో ఆ జ‌ట్టు కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్‌ది కీల‌క పాత్ర‌.

గుజ‌రాత్ టైటాన్స్‌తో క్వాలిఫ‌య‌ర్‌-1లో పాటిదార్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. పాటిదార్ కేవలం 33 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనూ సీజ‌న్ మొత్తం పాటిదార్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు కెప్టెన్సీ ప‌రంగా కూడా అత‌డు వంద‌కు వంద మార్క్‌లు కొట్టేశాడు. ఈ నేప‌థ్యంలో పాటిదార్ బ్యాటింగ్‌, కెప్టెన్సీ స్కిల్స్‌పై భార‌త మాజీ స్పిన్న‌ర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించాడు. 17 ఓవ‌ర్‌లో ఓవర్‌లో కగిసో రబాడా బౌలింగ్‌లో పాటిదార్‌ ఆడిన షాట్‌ను అశ్విన్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ మ్యాచ్‌లో పాటిదార్ 281.82 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.

"కగిసో ర‌బాడ వేసిన ఓ ఫాస్ట్ డెలివరీని రజత్ బ్యాక్‌ఫుట్‌పై వెళ్లి కొట్టిన సిక్స్.. “షాట్ ఆఫ్ ది డే” అని చెప్పవచ్చు. బహుశా టోర్నమెంట్‌లోనే అత్యుత్తమ షాట్‌గా ఇది నిలుస్తుంది. ఆ పొజిషన్ నుండి అతను అంత పవర్‌ను ఎలా జనరేట్ చేయగలిగాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.

ఈ ఇన్నింగ్స్‌కు ముందు వరకు కెప్టెన్సీ, బ్యాటింగ్ పరంగా పాటిదార్ కంటే శ్రేయస్ అయ్యర్ కాస్త బెటర్‌గా కన్పించాడు. ​కానీ ఈ మ్యాచ్‌తో పాటిదార్‌ శ్రేయస్‌ను వెనక్కి నెట్టి ఆ స్ధానానికి చేరుకున్నాడు. పాటిదార్ స్పిన్‌కు బాగా ఆడుతాడని మనందరికీ తెలుసు. కానీ ఈ రోజు అతడు ఫాస్ట్ బౌలర్లను ఆడిన తీరు అద్భుతం.

రషీద్ ఖాన్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌ను అతడు ఎదుర్కొన్న తీరు కూడా నన్ను ఆకట్టుకుంది. ఫ్రంట్‌ఫుట్‌పైకి వచ్చి, బంతి పిచ్‌ను అంచనా వేసి రషీద్‌ను ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్స్ కొట్టే బ్యాటర్లు చాలా అరుదుగా ఉంటారు" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.

కాగా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ప్ర‌స్తుత భార‌త టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌పై వేటు ప‌డ‌నున్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను టీమిండియా కెప్టెన్ చేయాల‌ని పలువురు సూచించారు. ఇప్పుడు అనుహ్యంగా పాటిదార్ పేరు కూడా తెరపైకి వ‌చ్చింది.
చదవండి: '100 వికెట్లు తీసినా నో ఛాన్స్.. ఇక రంజీ ట్రోఫీని మూసేయండి'
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement