ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండో టీ20లో ఓటమి పాలైన భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం విజయం సాధించి ఆధిక్యంలో నిలవాలని ఉవ్విళ్లూరుతోంది.
ఈ మ్యాచ్‌కు టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. రవి బిష్ణోయి స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి రాగా.. ఇంగ్లండ్ జట్టు ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండో టీ20లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌పై విజయాన్ని అందుకుంది.
అయితే మ్యాచ్ ఆరంభానికి ముందే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఫీట్ సాధించాడు. భారత టీ20 కెప్టెన్‌గా అయ్యర్ టాస్ గెలవడం ఇది ఐదోసారి. ఈ నేపథ్యంలో అంతర్ర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్లలో అత్యధికసార్లు టాస్ నెగ్గిన జాబితాలో శ్రేయస్ అయ్యర్ రోహిత్ శర్మ, ధోనిలతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరికంటే ముందు ఎంఎస్ ధోని ఏడుసార్లు (మే 2010 నుంచి ఫిబ్రవరి 2012 వరకు), విరాట్ కోహ్లి ఆరుసార్లు (ఆగస్టు 2019 నుంచి డిసెంబర్ 2019 వరకు), తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్
భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to bowl first at Trent Bridge.
Updates ▶️ https://t.co/jan4S8zsaV#ENGvIND pic.twitter.com/ptcxBFxRP5— BCCI (@BCCI) July 7, 2026
చదవండి: సెమీస్‌కు దూసుకెళ్లిన గాఫ్.. పిన్న వయస్కురాలిగా చరిత్ర


