కెప్టెన్‌ అయ్యాక శ్రేయస్‌ అయ్యర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Shreyas Iyer Sends Warning To Gautam Gambhir After Becoming India T20I Captain | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ అయ్యాక శ్రేయస్‌ అయ్యర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Jun 7 2026 7:14 PM | Updated on Jun 7 2026 7:31 PM

Shreyas Iyer Sends Warning To Gautam Gambhir After Becoming India T20I Captain

భారత టీ20 కెప్టెన్‌గా నియమితుడయ్యాక శ్రేయస్‌ అయ్యర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రధాన కోచ్ గౌతమ్‌ గంభీర్‌తో కలిసి పనిచేయబోతున్న నేపథ్యంలో, తన నాయకత్వ శైలిని మార్చుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.

ప్రస్తుతం ముంబై టీ20 లీగ్ ఆడుతున్న అయ్యర్‌ ఓ సందర్భంగా మాట్లాడుతూ.. భారత జట్టు కెప్టెన్సీ పెద్ద సవాలే కానీ, దాని కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఇంతకుముందు ఎలా ఉన్నానో, ఇకపై కూడా అలాగే ఉంటానని అన్నాడు. ఈ వ్యాఖ్యలను కొందరు గంభీర్‌కు పరోక్ష సందేశంగా అభివర్ణిస్తున్నారు.

గంభీర్‌-అయ్యర్‌ గతంలో ఐపీఎల్‌లో కలిసి పని చేశారు. 2024లో వీరిద్దరి కాంబినేషన్‌లో (మెంటార్‌-కెప్టెన్‌) కేకేఆర్‌ టైటిల్‌ గెలిచింది. అంతకుముందు ఇద్దరూ ఆటగాళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడారు.

అయ్యర్ శైలి ప్రత్యేకం
అయ్యర్‌ నాయకత్వంలో ప్రధానంగా కనిపించే అంశం ఆటగాళ్లపై నమ్మకం. ఒకసారి ఆటగాడికి అవకాశం ఇస్తే అతడికి పూర్తి మద్దతు ఇవ్వడం అయ్యర్ శైలిగా గుర్తింపు పొందింది.

ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడిన ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ అభివృద్ధిలో అయ్యర్ పాత్ర కీలకమని పలుమార్లు ప్రశంసలు వచ్చాయి. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవడం, ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం అయ్యర్ బలంగా భావిస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement