ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్ధానానికి చేరుకుంది. తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
లక్నో నిర్ధేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ అద్భుత విజయంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర.
అయ్యర్ అజేయ సెంచరీతో సత్తాచాటాడు. కేవలం 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శ్రేయస్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు, అర్జున్ టెండూల్కర్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో జోష్ ఇంగ్లిష్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అయూశ్ బదోని(43), అబ్దుల్ సమద్(37) రాణించారు. పంజాబ్ బౌలర్లలో మార్కో జానెసన్, చాహల్ తలా రెండు వికెట్లు సాధించాడు.
15 ఓవర్లలో 162/3
15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ప్రబ్‌సిమ్రన్ (69) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది.
నిలకడగా ఆడుతున్న పంజాబ్
12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(48), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(56) ఉన్నారు.
8 ఓవర్లలో పంజాబ్ 79/2
8 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (28), ప్రబ్‌సిమ్రన్ సింగ్ (30) పరుగులతో ఆడుతున్నారు.
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్
లక్నోతో మ్యాచ్‌లో 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడింది. తొలి వికెట్‌గా ప్రియాన్ష్ ఆర్య గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇక 18 పరుగులు చేసిన కూపర్ కనోలీ షమీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అవడంతో పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్ (2), అయ్యర్ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు.
పంజాబ్ టార్గెట్ 197 పరుగులు
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్ జోస్ ఇంగ్లిస్ (44 బంతుల్లో 72) అర్థసెంచరీతో రాణించాడు. ఆయుశ్ బదోని (43), అబ్దుల్ సమద్ (20 బంతుల్లో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ బౌలర్లలో చాహల్, మార్కో జాన్సెన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఐదో వికెట్ కోల్పోయిన లక్నో
లక్నో ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన జోస్ ఇంగ్లిస్ (72) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. శశాంక్ సింగ్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ దిశగా ఇంగ్లిస్ షాట్ ఆడినప్పటికీ అయ్యర్ చేతికి చిక్కాడు. 18 ఓవర్లో ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
మూడో వికెట్ కోల్పోయిన లక్నో
ధాటిగా ఆడుతున్న ఆయుశ్ బదోనీ (43) రూపంలో లక్నో సూపర్‌జెయింట్స్ 69 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి విఫలమైన బదోని కీపర్ ప్రబ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ఇంగ్లిస్ (24), పంత్ (6) పరుగులతో ఆడుతున్నారు.
రెండు వికెట్లు కోల్పోయిన లక్నో
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 2 పరుగులు చేసిన నికోలస్ పూరన్‌ను మార్కో జాన్సెన్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అంతకముందు ఓపెనర్ అర్షిన్ కులకర్ణి అజ్మతుల్లా ఒమర్‌జయ్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి లక్నో 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. బదోని (20), ఇంగ్లిస్ (18) పరుగులతో ఆడుతున్నారు.
టాస్ గెలిచిన పంజాబ్
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పంజాబ్‌కు చావో రేవో లాంటిది. మ్యాచ్‌లో లక్నోపై విజయం సాధిస్తే పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. అదే సమయంలో ప్లేఆఫ్స్ పోటీలో ఉన్న కేకేఆర్, రాజస్తాన్‌లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ లక్నో చేతిలో పంజాబ్ ఓటమి చవిచూస్తే మాత్రం ఆ జట్టు ఇంటిబాట పట్టాల్సిందే. అప్పుడు కేకేఆర్, రాజస్తాన్‌లు ప్లేఆఫ్స్ పోటీలో ఉంటాయి.
లక్నో సూపర్ జెయింట్స్: జోష్ ఇంగ్లిస్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, అర్జున్ టెండూల్కర్, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్.
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
🚨Toss update from Lucknow 🚨@PunjabKingsIPL won the toss and elected to bowl first against @LucknowIPL
Updates ▶️ https://t.co/2ADKr4dqhi#TATAIPL | #KhelBindaas | #LSGvPBKS pic.twitter.com/FZTDevYeis— IndianPremierLeague (@IPL) May 23, 2026


