టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు | Shreyas Iyer Worst Record As Indian Captain Losing Maiden T20I Game | Sakshi
Sakshi News home page

టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు

Jun 26 2026 10:49 PM | Updated on Jun 26 2026 10:53 PM

Shreyas Iyer Worst Record As Indian Captain Losing Maiden T20I Game

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్‌లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో అయ్యర్ చోటు సంపాదించాడు. గతంలో విరాట్ కోహ్లీ (2017లో ఇంగ్లండ్‌పై), రిషబ్ పంత్ (2022లో సౌతాఫ్రికాపై), శుబ్‌మన్ గిల్ (2024లో జింబాబ్వేపై) కెప్టెన్లుగా తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూశారు. తాజాగా వీరి సరసన శ్రేయస్ అయ్యర్ నిలిచాడు.

👉2024 జనవరి నుంచి టీమిండియా ఒక్క టీ20 సిరీస్‌ను కోల్పోవడం జరగలేదు. 2023లో సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 1-1తో డ్రా చేసుకుంది. అప్పటినుంచి టీమిండియా వరుసగా 12 సిరీస్‌లు గెలుచుకోవడం గమనార్హం.

👉ఇక ఐర్లాండ్ 12సార్లు (అన్ని ఫార్మాట్లు) టీమిండియాతో తలపడింది. ఇందులో 9 టీ20లు, మూడు వన్డేలున్నాయి. కాగా ఐర్లాండ్‌కు టీమిండియాపై ఇదే తొలి విజయం కావడం విశేషం.

👉అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ను ఓడించిన 11వ జట్టుగా ఐర్లాండ్ నిలిచింది. ఇక ఐర్లాండ్ చేతిలో ఓటమి చవిచూసిన 8వ దేశంగా భారత్ నిలిచింది. ఇక ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ మాత్రమే మిగిలి ఉన్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement