శ్రేయస్‌ సూపర్‌ సెంచరీ.. పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం | IPL 2026: Shreyas hits ton as Punjab win big, stay alive in competition | Sakshi
Sakshi News home page

IPL 2026: శ్రేయస్‌ సూపర్‌ సెంచరీ.. పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

May 23 2026 11:40 PM | Updated on May 23 2026 11:43 PM

IPL 2026: Shreyas hits ton as Punjab win big, stay alive in competition

ఐపీఎల్‌-2026లో శనివారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో పంజాబ్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ విజయంతో పంజాబ్(15) పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానానికి చేరుకుంది. 

అయితే పంజాబ్ ప్లే ఆఫ్స్ భవితవ్యం ఆదివారం జరిగే రాజస్తాన్ రాయల్స్‌-ముంబై ఇండియన్స్‌, కేకేఆర్‌-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడింది. ఈ రెండు మ్యాచ్‌లలో రాజస్తాన్‌, కేకేఆర్ ఓటమి పాలైతే పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది.

ఒకవేళ ముంబైపై రాజస్తాన్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండగా రియాన్ పరాగ్ సేన 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతోంది. మరోవైపు రాజస్తాన్ ఓడి, ముంబైపై కేకేఆర్ భారీ విజయం సాధిస్తే పంజాబ్‌ను అధిగమించి రహానే టీమ్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతోంది. కేకేఆర్ ఖాతాలో ప్రస్తుతం 13 పాయింట్లు ఉన్నాయి.

శ్రేయస్ సూపర్ సెంచరీ
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. . ల‌క్నో నిర్ధేశించిన 197 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. ఈ అద్భుత విజ‌యంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ది కీల‌క పాత్ర. అయ్య‌ర్ అజేయ సెంచ‌రీతో స‌త్తాచాటాడు.

కేవలం 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శ్రేయస్‌.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. శ్రేయస్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: గంభీర్ చేతుల్లో సూర్యకుమార్‌ భవితవ్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement