గంభీర్ చేతుల్లో సూర్యకుమార్‌ భవితవ్యం! | Gambhir To Take Final Call-Sacking Suryakumar Yadav India Captian | Sakshi
Sakshi News home page

గంభీర్ చేతుల్లో సూర్యకుమార్‌ భవితవ్యం!

May 23 2026 10:34 PM | Updated on May 23 2026 10:43 PM

Gambhir To Take Final Call-Sacking Suryakumar Yadav India Captian

టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ స్థానంలో వేరొకరిని ఎంపిక చేసే యోచనలో బీసీసీఐ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దీనికి సంబంధించి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. కెప్టెన్సీ పదవి పోయినప్పటికీ సూర్యకుమార్ బ్యాటర్‌గా తుదిజట్టులో కొనసాగుతాడని బీసీసీఐ పేర్కొంది. 

అయితే తాజాగా ఐపీఎల్ 2026 సీజన్‌లో బ్యాటర్‌గా పూర్తిగా విఫలమైన సూర్యకుమార్ తుది జట్టు నుంచే తప్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లో సూర్యకుమార్ భవితవ్యం ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యకుమార్‌ను తుదిజట్టులో ఆడించాలా వద్దా అనేది గంభీర్‌తో పాటు సెలెక్షన్ కమిటీ సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు సమాచారం. 

ఫామ్‌లేమి దృశ్యా సూర్యకుమార్‌ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ, గంభీర్‌తో సూర్యకు ఉన్న సఖ్యత కారణంగా అదంత సులువు కాదనిపిస్తోంది. ఎందుకంటే సూర్య సారథ్యంలో టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆసియాకప్‌ను గెలుచుకుంది.

అయితే దాదాపు ఏడాదిగా భారత క్రికెట్ జట్టులో సూర్యకుమార్ స్థానంపై తీవ్రమైన పరిశీలన కొనసాగుతోంది, ఐదుగురు సెలెక్టర్లు కూడా అతడిని తుది జట్టులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. గత రెండేళ్లుగా కెప్టెన్‌గా సూర్యకుమార్ జట్టును విజయపథంలో నడిపించినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం రాణించడంలో విఫలమయ్యాడు. 

అయితే భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సూర్యకుమార్‌ను జట్టు నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తే సూర్యకుమార్‌కు చివరి చాన్స్ ఇద్దామని బీసీసీఐ భావించింది. కానీ సూర్యకుమార్ ఐపీఎల్ 2026 సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబరచ‌డంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. 

ప్రస్తుతం, గంభీర్ నాయకత్వంలోని ఈ పరివర్తన దశలో భవిష్యత్ ప్రణాళిక, అధికార సమీకరణాలు మారుతుండటంతో భారత క్రికెట్ ఒక సంధి దశలో నిలబడి ఉంది. గణాంకాలు సూర్యకుమార్‌కు అనుకూలంగా లేనప్పటికీ, గౌతమ్ గంభీర్‌కు అతనిపై ఉన్న విశ్వాసం, అతనితో ఉన్న సంబంధం భారత టీ20 కెప్టెన్సీ భవిష్యత్తును తీర్చిదిద్దవచ్చు.

చదవండి: ఆర్సీబీకి షాక్‌.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ ఆటగాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement