ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా మూడో టైటిల్‌ను అందించిన శ్రేయస్ అయ్యర్.. గతేడాది పంజాబ్ కింగ్స్‌ను రన్నరప్‌గా నిలిచాడు. ఐపీఎల్-2026లో కూడా పంజాబ్‌ను అయ్యర్ విజయపథంలో నడిపిస్తున్నాడు.
ఈ ఏడాది సీజన్‌లో పంజాబ్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలను నమోదు చేసింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌పై ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2019 నుండి జట్టుతో ఉన్న ప్రభ్‌సిమ్రాన్.. గత ఏడేళ్లలో శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ వంటి దిగ్గజ కెప్టెన్ల నాయకత్వంలో ఆడాడు. కానీ తన ఫేవరేట్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ప్రభ్‌సిమ్రాన్ ఎంచుకున్నాడు.
శ్రేయస్ అయ్యర్ నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటాడు. నేను కొన్ని మ్యాచ్‌లలో సరిగ్గా ఆడకపోయినప్పటికి, శ్రేయస్ నా దగ్గరకు వచ్చి ఎలాంటి ఒత్తిడి తీసుకోవద్దని చెప్పేవాడు. నా ఆట నన్ను ఆడమని మద్దతు ఇచ్చేవాడు. అందుకే నా దృష్టిలో అతడే బెస్ట్ కెప్టెన్. అయ్యర్ నన్ను ఒక సీనియర్ ప్లేయర్‌గా చూశేవాడు. జట్టు వ్యూహాల్లో భాగం చేయడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ప్రభ్‌సిమ్రాన్ పేర్కొన్నాడు.
చదవండి: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’


