పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనత సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధికసార్లు 200 పరుగులకు పైగా స్కోరు ఛేదించిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పంజాబ్ తానే బద్దలు కొట్టింది.
ఐపీఎల్-2026 టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన పంజాబ్ కింగ్స్.. రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.
209 పరుగులు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. ఆయుశ్ మాత్రే (73), శివం దూబే (45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (32) రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్‌లెట్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
పంజాబ్ బ్యాటర్ల ధనాధన్
ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 18.4 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. తద్వారా ఐదు వికెట్లతేడాతో జయకేతనం ఎగురవేసింది. ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (43), కూపర్ కన్నోలి (36), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు.
ప్రపంచంలోనే తొలి జట్టుగా పంజాబ్
పంజాబ్ కింగ్స్ 200కు పైగా పరుగుల స్కోరును ఛేదించడం ఇది తొమ్మిదోసారి. పొట్టి క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా పంజాబ్ నిలిచింది.
టీ20 క్రికెట్‌లో అత్యధికసార్లు 200కు పైగా పరుగుల స్కోరు ఛేదించిన జట్లు ఇవే
🏏పంజాబ్ కింగ్స్ (ఐపీఎల్)-తొమ్మిది సార్లు
🏏ఆస్ట్రేలియా- ఏడుసార్లు
🏏ముంబై ఇండియిన్స్ (ఐపీఎల్)- ఆరు సార్లు
🏏టీమిండియా- ఆరు సార్లు
🏏రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఐపీఎల్)- ఆరు సార్లు
🏏సౌతాఫ్రికా- ఆరుసార్లు
చదవండి: IPL 2026: అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్!
🔙 to 🔙 victories ✌️@PunjabKingsIPL complete the chase in an authoritative fashion ❤️
A win by 5⃣ wickets in Chennai 🥳
Updates ▶️ https://t.co/riWrE2EZiF#TATAIPL | #KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/S9EEawsaZk— IndianPremierLeague (@IPL) April 3, 2026


