ఐపీఎల్-2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా వైభవ్ బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు.
ఓవరాల్‌గా ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 236.54 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు చేశాడు. కాగా ఈ యంగ్ కిడ్ బ్యాటింగ్‌కు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫిదా అయిపోయాడు. వైభవ్ ఒక ఫ్యూచర్ స్టార్ అని శ్రేయస్ కొనియాడాడు.
వైభవ్ సూర్యవంశీ ఒక భిన్నమైన ఆటగాడు. అతడి వద్ద అద్బుతమైన టాలెంట్ ఉంది. అతడిని ఎంత పొగిడినా తక్కువే. అతడి బ్యాట్ ఫ్లో, బంతి పడకముందే అతను సృష్టించుకునే రిథమ్, మొమెంటం అద్భుతం. కచ్చితంగా అతడు కచ్చితంగా భవిష్యత్ స్టార్ అవుతాడనే చెప్పాలి" అని జియోస్టార్ నిర్వహించిన 'బిలీవ్' కార్యక్రమంలో అయ్యర్ పేర్కొన్నాడు.
ఇక ఈ ఏడాది సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్, బ్యాటర్‌గా అదరగొడుతున్నాడు. శ్రేయస్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 208 పరుగులు సాధించాడు. అతడి కెప్టెన్సీలో పంజాబ్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: NZ vs BAN 2nd ODI: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్


