breaking news
china
-
30 ఏళ్ల నమ్మకం ఖరీదు రూ. 97 లక్షలు : నట్టేట ముంచేశాడు
‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ ఆ మాటల్ని అందరమూ మనస్ఫూర్తిగా నమ్ముతాం. త్రికరణ శుద్ధిగా ఆచరిస్తాం. కానీఆ నమ్మకాన్ని వమ్ముచేసిన ఒక కేటుగాడు, తన స్నేహితుడి నట్టే ముంచాడు. నమ్మకమున్న చోటే నమ్మకద్రోహం ఉంటుందని నిరూపించిన వైనమిది. ఏళ్ల తరబడి ఉన్న నమ్మకమే మోసపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. మనోడే కదా అని నమ్మిదే, ప్రశ్నించడం మానేస్తే, వారు చెప్పే అబద్ధాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతే మునిగిపోక తప్పదు.చైనాలో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.దాదాపు ముప్పై ఏళ్ల నాటి పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, ఒక ఖాళీ అపార్ట్‌మెంట్‌కు తాళం మార్చేసి, తనకు సంబంధం లేని ఆస్తిని స్నేహితులకు అమ్మేశాడు..చివరికి ఏం జరిగింది? తెలుసుకుందాం పదండి.సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్ మరియు సిన్మిన్ ఈవెనింగ్ న్యూస్ కథనాల ప్రకారం.. షాంఘైకి చెందిన ‘సన్’ అనే వ్యక్తి, దాదాపు 30 ఏళ్ల స్నేహానికి వెన్నుపోటు పొడిచాడు. కష్టకాలంలో తనకు అండగా ఉన్నారన్న కృతజ్ఞత లేకుండా, స్నేహితుడిని, అతని భార్యను మోసం చేసి, తనది కాని ఆస్తికి యజమానిగా నటించి వారి వద్ద నుండి సుమారు రూ. 97 లక్షలు కాజేశాడు.అసలేం జరిగింది?సన్ గతంలో రెండు రిటైల్ షాపులు నడిపేవాడు. కానీ అవి మూతపడ్డాయి. గతంలో కూడా అతను ఒక మోసం కేసులో జైలు శిక్ష అనుభవించి 2017లో విడుదలైయ్యాడు. జైలు నుండి వచ్చాక, అతను ముప్పై ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న వలస కూలీలైన దంపతులను ఆశ్రయించాడు. ఆ దంపతుల ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేకపోయినా, సన్‌కు కడుపునిండా భోజనం పెట్టి, అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూ మానసికంగా ఎంతో అండగా నిలిచారు.కాలక్రమేణా, సన్ వారి ముందు ఒక ఇమేజ్ను సృష్టించుకున్నాడు. తనకు షాంఘైలో ఆస్తులు ఉన్నాయని, విలేజ్ కమిటీకి చెందిన బంధువులతో బలమైన పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. దాంతో ఆ దంపతులు తమకు ఒక తక్కువ ధరలో ఇల్లు చూపెట్టమని సన్ను కోరారు. తనకున్న పరిచయాలతో తక్కువ ధరకే ఇల్లు ఇప్పిస్తానని సన్ నమ్మబలికాడు. అంతే కపటబుద్ధిని ప్రదర్శించడం మొదలెట్టాడు.2023లో షురూ2023 నుండి సన్ ఆ దంపతుల వద్ద నుండి అడ్వాన్స్ పేమెంట్లు, ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇన్స్టాల్మెంట్ల పేరుతో లక్షల రూపాయల డబ్బు వసూలు చేశాడు. 2025 నాటికి ఈ మోసం మరింత ముదిరింది. తనకు ఒక రీలోకేషన్ ఫ్లాట్ దొరికిందని, డీల్ ఫైనల్ చేయడానికి మరో 4,00,000 యువాన్లు (సుమారు రూ. 55.5 లక్షలు) కావాలని డిమాండ్ చేశాడు.కానీ, అసలు ఆ ఇల్లు అతనిది కాదు. సన్ ఒక రీసెటిల్మెంట్ హౌసింగ్ ఎస్టేట్‌లో నెలల తరబడి ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్‌ను గుర్తించాడు. వెంటనే ఒక తాళాలు తయారుచేసే వ్యక్తిని పిలిచి, తన తాళాలు పోయాయని అబద్ధం చెప్పి, ఎలాంటి యాజమాన్య పత్రాలు చూపించకుండానే ఆ ఇంటి తాళాన్ని మార్పించేశాడు. ఆ తర్వాత సన్ ఆ దంపతులను ఆ ఫ్లాట్‌కు తీసుకెళ్లి, కొత్త తాళం చెవులు వారి చేతిలో పెట్టి, ఒక నకిలీ సేల్స్ అగ్రిమెంట్‌పై సంతకాలు కూడా చేయించాడు.ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం పోయింది : నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్మోసం వెలుగులోకి వచ్చిందిలా..మోసం ఎన్నాళ్లో సాగదు కదా. పాపాల పుట్ట పగలక మానదు. కరెక్ట్‌గా అదే జరిగింది. ఆ ఫ్లాట్ అసలు యజమాని 'వాంగ్' తన ఇల్లు ఖాళీగా ఉండటంతో అద్దెకు ఇవ్వడం కోసం ఒక ఏజెంట్‌ను పురమాయించాడు. గత ఏడాది మేలో వాంగ్ ఒక అద్దెకు దిగే వ్యక్తిని తీసుకుని తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లినప్పుడు, అతని తాళం చెవి పని చేయలేదు. దాంతో అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, ఎవరో తాళం మార్చినట్లు తెలిసింది. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసుల దర్యాప్తులో ఈ మోసానికి పాల్పడింది సన్ అని తేలింది. వారు అతడిని అరెస్ట్ చేశారు. తాను వసూలు చేసిన డబ్బునంతా అప్పు తీర్చడానికి, తన సొంత ఖర్చులకు వాడేసినట్లు సన్ ఒప్పుకున్నాడు. బాధితులు ఇంకా చివరి పేమెంట్ చేయకముందే ఈ మోసం బయటపడింది, కానీ అప్పటికే వారు 97 లక్షల రూపాయల వరకు చెల్లించారు.కోర్టు తీర్పు: ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు, సన్‌కు మోసం కేసులో 10 ఏళ్ల 3 నెలల జైలు శిక్ష విధించడమే కాకుండా,సుమారు రూ. 13.8 లక్షలు జరిమానా కూడా విధించింది. ఇదీ చదవండి: తండ్రి చివరి కోరిక : వీడియో కాల్‌లోనే పెళ్లి, అంతలోనే..! -
బీజింగ్ లో 108 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన విమానం..
-
108 అంతస్తులు భవనాన్ని ఢీకొన్న విమానం.. వీడియో వైరల్
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత ఎత్తైన సిటిక్ టవర్ (చైనా జున్) భవనాన్ని ఓ చిన్న విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో భవనం పైభాగం దెబ్బతినగా, గాజు ముక్కలు, విమాన శకలాలు కింద రోడ్డుపై పడటంతో అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఫ్లైట్ ట్రాకింగ్ వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైనది రెండు సీట్లతో కూడిన తేలికపాటి Sunward SA60L Aurora విమానంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల అసలు కారణం ఏమిటి? పైలట్ పరిస్థితి ఎలా ఉంది? ఎవరైనా ప్రాణనష్టం లేదా గాయాలు జరిగాయా? అనే అంశాలపై చైనా అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.今天下午,一架型号为 B-12PP 的国产轻型通航小飞机,撞到了北京第一高楼 - 中国尊 pic.twitter.com/CobNs6fSBA— Sea (@Sea_Bitcoin) June 26, 2026ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశాయి. భవనంలోని కొంతమందిని సురక్షితంగా బయటకు తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, చైనాలో వాటి ప్రచారంపై ఆంక్షలు విధించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇదిలా ఉండగా.. చైనా రాజధాని బీజింగ్‌లోనే అతిపెద్దదైన ఈ భవనాన్ని ‘చైనా జున్’ (China Zun)గా పిలుస్తుంటారు. దీని ఎత్తు 528 మీటర్లు (1732 అడుగులు). పురాతన చైనీస్ వైన్ పాత్ర ఆకారంలో దీన్ని నిర్మించారు. ఈ భవనంలో 108 అంతస్తులు ఉన్నట్టు తెలిసింది. -
అప్పుడు పాక్.. ఇప్పుడు బంగ్లాదేశ్.. భారత్ అప్రమత్తం
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ ప్రస్తుతం చైనాలో అధికారిక పర్యటనలో ఉన్నారు. చైనా ప్రధానమంత్రి లీని, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలవనున్నారు. ఈ రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రధాన అంశంగా బంగ్లాదేశ్ జె-10సీఈ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదన, తుది చర్చలు వంటివి ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.పాకిస్థాన్ కూడా ఈ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌పై వీటిని ఉపయోగించినట్లు సమాచారం. ఆ సమయంలో భారత వైమానిక దళం పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాద ముప్పులను సమర్థంగా నిర్వీర్యం చేసింది.బంగ్లాదేశ్ 24 చైనా జె-10సీఈ యుద్ధ విమానాల కొనుగోలు ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ చైనా పర్యటనలో ఈ ఒప్పందం కీలక ఫలితంగా నిలవనుందని భావిస్తున్నారు.పలు నివేదికల ప్రకారం.. రక్షణ, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకుంటున్నాయి చైనా, పాకిస్థాన్. 2026 ఆగస్టు నాటికి యుద్ధ విమానాల కొనుగోలును ఖరారు చేయాలని బంగ్లాదేశ్ ఆశిస్తోంది. జె-10సీ అనేది చైనా వైమానిక దళం వినియోగించే యుద్ధ విమానం. జె-10సీఈ అనేది ఇతర దేశాలకు విక్రయించేందుకు రూపొందించిన వెర్షన్.ఈ కొనుగోలుతో పాకిస్థాన్ తర్వాత ఈ ప్రత్యేక విమానాన్ని వినియోగించే రెండో విదేశీ దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తుంది. ఒక్కో యుద్ధ విమానం విలువ సుమారు $40 మిలియన్లు ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన తుది వివరాలపై చైనా, బంగ్లాదేశ్ అధికారులు ఇంకా చర్చలు జరుపుతున్నట్లు సోర్సెస్ తెలిపాయి.బంగ్లాదేశ్ వైమానిక దళాన్ని ఆధునికీకరణ చేసుకోవాలనుకుంటోంది. జె-10సీఈ ఆ దేశ వైమానిక యుద్ధ సామర్థ్యాలను బాగా పెంచవచ్చు. అదే సమయంలో దక్షిణాసియాలో వ్యూహాత్మక ప్రభావాలు కూడా ఉంటాయి. ఇది బంగ్లాదేశ్-చైనా రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు బంగాళాఖాతంలో ప్రాంతీయ సమతౌల్యాన్ని ప్రభావితం చేయవచ్చు.ఎక్కడ మోహరిస్తారు? భారత్ విషయానికి వస్తే, మన దేశం రెండు పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఒప్పందం కుదిరి యుద్ధ విమానాలు బంగ్లాదేశ్‌కు చేరితే, వాటిని ఎక్కడ మోహరిస్తారన్నది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది.బంగ్లాదేశ్ ఇప్పటికే ఉత్తర బంగ్లాదేశ్‌లోని లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరం (బీఏఎఫ్ స్టేషన్ లాల్మొనిర్హాట్)ను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మిత్రదేశాల వైమానిక స్థావరంగా ఇది పనిచేసింది. ఈ స్థావరం భారత సరిహద్దుకు కేవలం 12-15 కి.మీ దూరంలో ఉంది. వ్యూహాత్మకంగా కీలకమైన సిలిగురి కారిడార్‌కు సమీపంలోనూ ఉంది. ఈ స్థావర పునరుద్ధరణకు చైనా సాయం చేసే అవకాశంపై చర్చలు జరిగాయి. ఈ బంగ్లాదేశ్ వైమానిక దళ కేంద్రంలో కొత్త యుద్ధ విమాన హ్యాంగర్లు నిర్మించే పనులు కూడా ఉన్నాయి.కేంద్ర సర్కారు ఏమన్నది? భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఈ స్థావరం ఉండటంతో భారత్‌లో భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2025 ఆగస్టు 8న లోక్‌సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్‌లోని లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరానికి సంబంధించిన నివేదికలను భారత ప్రభుత్వం గమనించింది. 2025 మే 26న బంగ్లాదేశ్ సైన్యం సైనిక కార్యకలాపాల సంచాలకుడు నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని కూడా గమనించింది. ప్రస్తుతం లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరాన్ని సైనిక అవసరాలకు వినియోగించే ప్రణాళికలు లేవని ఆయన చెప్పారు. జాతీయ భద్రతపై ప్రభావం చూపే అన్ని పరిణామాలను భారత ప్రభుత్వం గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోంది” అని తెలిపారు.పాకిస్థాన్ వైమానిక దళం ప్రస్తుతం 36 చైనా తయారీ చెంగ్డు జె-10సీఈ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. జె-10 విమానాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్న ఆగ్నేయాసియా దేశాల్లో ఇండోనేషియా కూడా ఒకటి. కనీసం 42 చెంగ్డు జె-10 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ఇండోనేషియా ప్రకటించింది. చైనా యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న నిర్ణయం ఇండోనేషియా రక్షణ కొనుగోలు విధానంలో మార్పును సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఆ దేశం రష్యా, అమెరికాపై ఆధారపడేది. -
అమెరికా–ఇరాన్ డీల్‌ను స్వాగతిస్తున్నాం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో శాంతి కోసం అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన డీల్‌ను భారత్ స్వాగతిస్తోందని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ అన్నారు. హార్మూజ్‌ను తిరిగి తెరవడం ద్వారా ప్రపంచ ఇంధన భద్రతతోపాటు ఇతర కీలక వస్తువులు, ఎరువుల సరఫరాలో సుస్థిరత నెలకొంటుందని చెప్పారు. బ్రిక్స్ దేశాల ఎన్ఎస్ఏల రెండు రోజుల సదస్సును మంగళవారం ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, రష్యా ఎన్ఎస్ఏ సెర్గీ షోయిగూ, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ ఘదిర్ నెజామిపౌర్, బ్రిక్స్ దేశాల ఇతర భద్రతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అజిత్ దోవల్.. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక ఒత్తిళ్ల వంటి సవాళ్లను పరిష్కరించడంలో కూటమి కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని భారత్ స్వాగతిస్తోందన్నారు. ఒప్పందం విజయవంతం అవుతుందని, ఇంధన భద్రతకు దోహదపడుతుందని ఆశిస్తున్నామన్నారు.హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం స్వాగతించదగిన పరిణామమన్నారు. ఇది సప్లయ్ చైన్‌లో అడ్డంకులను తొలగించడమే కాకుండా ఎరువులు, రసాయనాలు తదితరాల కొరతను కూడా తీరుస్తుందని ధోవల్ తెలిపారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం వివిధ రకాలైన సమస్యలను అనేక దేశాలు నేడు ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ వివాదాలను పరిష్కరించడానికి లేదా తగ్గించడానికి అవసరమైన వ్యవస్థాగతమైన యంత్రాంగాలు కూడా అంతగా అందుబాటులో ఉండటం లేదని చెప్పారు. అత్యంత ప్రత్యేక కూటమి బ్రిక్స్ బహుళధ్రువ ప్రపంచం క్రమంగా క్షీణీస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో బ్రిక్స్ కూటమి ప్రధానంగా వ్యవహరించాల్సి ఉందని ధోవల్ అభిప్రాయపడ్డారు. బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో, ఎదుగుతున్న ఆర్థిక శక్తుల ఒక అనధికారిక కూటమిగా బ్రిక్స్ రూపుదిద్దుకుందన్నారు. ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం, గ్లోబల్ సౌత్ స్వరాన్ని మరింత బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. శాంతి, ప్రగతి, అభివృద్ధి, పరస్పర సహకారాన్ని విశ్వసించే దేశాల అత్యంత ప్రత్యేక కూటమే బ్రిక్స్ అని ఆయన అభివర్ణించారు. ఇరాన్ అధికారి పోస్టర్ ఇరాన్ పక్షాన హాజరైన నెజామిపౌర్ ఈ భేటీలో అమెరికా జరిపిన వైమానికదాడిలో చనిపోయిన చిన్నారుల పోస్టర్‌ను ప్రదర్శించడం కలకలం రేపింది. మినాబ్‌లోని పాఠశాలపై జరిగిన దాడిలో వందలాదిగా చిన్నారులు బలయ్యారు. ఈ పాశవిక దాడులను యూఏఈ గడ్డపై నుంచే అమెరికా ప్రారంభించిందని ఆయన ఆరోపించారు. అమెరికా, దాని మిత్ర దేశాలు చేస్తున్న దురాక్రమణకు, హార్మూజ్ సంక్షోభానికి యావత్తు ప్రపంచం సాక్ష్యంగా నిలిచిందని చెప్పారు. ఈ దాడులను ఖండించడానికి బదులుగా, యూఏఈ ఈ దురాక్రమణలో పాలుపంచుకుందని, ఇరాన్లో పౌరు వసతులు, స్కూళ్లు, ఆస్పత్రులపై దాడులకు వేదికగా మారిందని ఆయన ఆరోపణలు చేశారు.భద్రతా సహకారంలో కీలకం: ప్రధాని మోదీ మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఉగ్రవాదం, సైబర్ భద్రత నుంచి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వరకు ఎదురవుతున్న ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడం, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడంలో బ్రిక్స్ కూటమి అత్యంత కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్ అధ్యక్ష పదవిలో ఉన్న భారత్.. ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యతలకు మద్దతు ఇవ్వడానికి తన వంతు సహకారాన్ని అందిస్తుందని మోదీ ఎక్స్‌లో చెప్పారు. బ్రిక్స్ దేశాల ఎన్ఎస్ఏలు, సీనియర్ అధికారులు తనను కలుసుకోవడం ఆనందంగా ఉన్నారు. -
అమెరికాపై చైనా ప్రతీకారం.. 46 కంపెనీలపై నిషేధం
బీజింగ్: ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి ముదిరింది. చైనా సైన్యానికి సహకరిస్తున్నాయనే ఆరోపణలతో 80 చైనీస్ కంపెనీలను అమెరికా ఇటీవల బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటూ, చైనా ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 46 అమెరికన్ కంపెనీలపై నిషేధాజ్ఞలు విధించింది. రక్షణ, కీలక ఖనిజాల మైనింగ్ రంగాలకు చెందిన యూఎస్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని బీజింగ్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.అమెరికా కంపెనీలపై ఆంక్షల పర్వంజాతీయ భద్రతను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త ఎగుమతి నియంత్రణలను విధిస్తున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అమెరికా రక్షణ విభాగంతో ఒప్పందాలు కలిగి ఉన్న ఓష్కోష్ డిఫెన్స్ (మిలిటరీ వాహనాల తయారీ సంస్థ), ఏవియాక్స్ వంటి 10 ప్రముఖ యూఎస్ కంపెనీలపై చైనా ఎగుమతి ఆంక్షలు విధించింది. వాషింగ్టన్ తీసుకున్న ‘చైనీస్ మిలిటరీ ఎంటర్ప్రైజ్ లిస్ట్’ నిర్ణయానికి ఇది ప్రత్యక్ష కౌంటర్ అని బీజింగ్ స్పష్టం చేసింది.ప్రభుత్వ కొనుగోళ్లపై పూర్తి నిషేధంమరోవైపు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ మరింత దూకుడుగా వ్యవహరిస్తూ, తమ ప్రభుత్వ ఏజెన్సీలు 46 అమెరికన్ కంపెనీల నుండి ఎలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదని ఆదేశించింది. ఈ నిషేధిత జాబితాలో లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్, బోయింగ్ రక్షణ విభాగాలు వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. సోమవారం నుంచే ఈ నిషేధం అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, చైనాలో అమెరికా పెట్టుబడులతో నడుస్తున్న కంపెనీలకు ఈ కొనుగోలు ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చారు.ముదిరిన వాణిజ్య వివాదంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో బీజింగ్‌లో భేటీ అయి, ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు చర్చలు జరిపిన కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల అమెరికా విధించిన బ్లాక్‌లిస్ట్‌లో చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజాలు అలీబాబా, బైదూలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బివైడి కూడా ఉన్నాయి. దీనికి ప్రతిచర్యగానే చైనా ఈ తాజా ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది.ఇది కూడా చదవండి: ఖతార్‌లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు -
కొన్ని గంటలపాటు గాల్లో ప్రాణాలు.. ఏకంగా 60 మీటర్ల ఎత్తులో
బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో బలమైన గాలుల వల్ల నియంత్రణ కోల్పోయిన ఓ పారాగ్లైడింగ్ పైలట్ 60 మీటర్ల ఎత్తైన టవర్ క్రేన్‌కు చిక్కుకుని నిలిచిపోయాడు. పారాగ్లైడర్‌తో అతడు నాన్చోంగ్ నగరం వైపు దిగుతున్న సమయంలో గ్లైడర్ తాళ్లు క్రేన్ జిబ్కు చిక్కుకున్నాయి. ఆ భయానక దృశ్యం కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో వీబో వంటి సోషల్ మీడియా వేదికల్లో, ఎక్స్‌లో వైరల్ అయింది.అత్యంత ఎత్తులో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ఎట్టకేలకు పారాగ్లైడర్‌ను సురక్షితంగా కాపాడారు. ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. పైలట్ కొన్ని గంటలసేపు చిక్కుకుపోయాడు. కొన్ని స్థానిక మీడియా సంస్థలు మాత్రం సహాయక చర్యలకు కొన్ని గంటలు పట్టాయని తెలిపాయి. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఈ ఘటన సాహస క్రీడల భద్రతపై పెరుగుతున్న ఆందోళనను స్పష్టం చేస్తోంది. పారాగ్లైడింగ్కు ముందస్తు అనుమతి తీసుకోవాలి. వాతావరణ పరిస్థితులు, గగనతల నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఊహించని విధంగా వీచే గాలులతో పాటు పట్టణ ప్రాంతాల్లోని భారీ నిర్మాణాలు కూడా ప్రమాదానికి దారితీయవచ్చని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.ఇటీవల ఆస్ట్రియా ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో మరో ఘటన కూడా ఈ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ చిన్న విమానం పారాగ్లైడర్‌ను ఢీకొట్టింది. ఆ దెబ్బకు పారాగ్లైడర్ వేగంగా తిరుగుతూ నేలవైపు దూసుకెళ్లింది. చివరి క్షణంలో ఆమె అత్యవసర పారాచూట్‌ను తెరిచి సురక్షితంగా దిగగలిగింది. ఆ ఘటన మే నెలలో ఉత్తర ఆస్ట్రియాలోని ష్మిట్టెన్‌హోహే పర్వతం సమీపంలో జరిగింది. ఈ ప్రాంతం పారాగ్లైడింగ్కు ప్రసిద్ధి పొందింది.🇨🇳 🚨 INCIDENT: In Nanchong, China, a paraglider reportedly became entangled in a tower crane on June 19.According to local reports, the individual was left hanging for approximately four hours before rescue operations could be completed.Authorities are said to have responded… pic.twitter.com/azXtI5orkm— 🇵🇸 Arabian (@Arabian__KGB) June 20, 2026 -
ప్రాణాంతక వ్యాధి లాస్ట్ స్టేజ్..ఐనా రోజుకు 12 గంటలు..!
ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మంచి పని కోసం తపించడం అంటే..మాటలకందని గొప్ప విషయం. అలా చేయాలంటే ఎంతో స్థైర్యం కావాలి. అంతేగాదు అతడు ఆ వ్యాధి చివరిదశలో ఉండి కూడా.. తనలా మరొకరు ఈ వ్యాధికి బలి కాకూడదని తపిస్తుండటం విశేషం. చిన్నపాటి కదలికలకు కూడా నలుగురు వ్యక్తులపై ఆధారపడాల్సిందే..ఐనా 12 గంటలు పనిచేస్తున్నాడు. అంతలా తగ్గేదేలా అంటూ మనోధైర్యంతో సాగుతున్న అతడి గుండె ధైర్యానికి చేతులెత్తి నమస్కరించాల్సిందే. అతడెవరంటే..ఆ వ్యక్తే ఈ కామర్స్ దిగ్గజం JD.com లో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన 48 ఏళ్ల కైలే. చైనాకు చెందిన కైలే ఏడేళ్లుగా మోటార్ న్యూరాన్ వ్యాధి (ALS) తో పోరాడుతున్నాడు. నయంకాని ఈ వ్యాధి అతడిని పూర్తిగా కదలలేని, మాట్లాడలేని స్థితికి తీసుకువచ్చింది. ప్రస్తుతం టైప్ చేయడానికి, మాట్లాడటానికి పూర్తిగా కంటి ట్రాకింగ్ టెక్నాలజీపై ఆధారపడిన కై, రోజుకు దాదాపు 12 గంటలు పనిచేస్తూ..ఏఎల్ఎస్ ఔషధాల తయారీకి తనను తాను అంకితం చేసుకుంటున్నాడు. తనలా మరెవ్వరూ ఈ వ్యాధికి బలికాకూడదని.. శాస్త్రవేత్తలు, వైద్యులతో కలసి నిర్విరామంగా పనిచేస్తున్నాడుమరణం ఒక్కటే నన్ను ఆపగలదు ఇంకేది కాదంటూ..ఆ స్థితిలో కూడా ఓపికతో పరిశోధనకు తన వంతు సహకారం అందిస్తున్న అతడిని శెభాష్ అని అభినందించకుండా ఉండలేరెవ్వరూ. కై ఇప్పుడు బీజింగ్ ఐసికాంగ్ మెడికల్ టెక్నాలజీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన మోటార్ న్యూరాన్ వ్యాధి (ALS) పరిశోధన కోసం దాదాపు రూ. 13 కోట్లు వరకు విరాళం ఇచ్చినట్లు సమాచారం. ఆయన ఈ వ్యాధికి అంకితమైన నాలుగు స్వచ్ఛంద సంస్థలను కూడా స్థాపించారు. అలాగే అనేక ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ శాస్త్రవేత్తలు, వైద్యులతో కలిసి పనిచేస్తున్నారు. బాధకరం ఏంటంటే ఏఎల్ఎస్ను తొలిసారి గుర్తించిన దాదాపు రెండు శతాబ్దాల తర్వాత కూడా ఏ ఔషధం కూడా దాని పురోగతిని ఆపలేకపోయింది. ఆయన బృందం ప్రస్తుతం 300కు పైగా ఔషధ కార్యక్రమాలను అభివృద్ధి చేస్తోంది. ఒక జన్యు-లక్షిత చికిత్స అనేక మంది రోగులను కాపాడినప్పటికీ, కైకిలా స్పోరాడిక్ ALS ఉన్న చాలా మందికి సహాయం చేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలో RAG-17 అనే ప్రయోగాత్మక ఔషధంతో ఒక పురోగతిని ప్రకటించారు. ట్రయల్స్‌లో కూడా చక్కటి ఫలితాలు వచ్చాయి. కాగా కై లే బృందం ఏజెన్సీ రుసుములు లేకుండా రోగులను నేరుగా సంరక్షకులతో అనుసంధానించే ఒక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను సృష్టించింది. స్వతహాగా ఫార్మసీ గ్రాడ్యుయేట్లు అయిన కై , అతని భార్య డువాన్ రుయ్లకు ఒక కుమారుడు ఉన్నాడు. భార్య డువాన్ తన "బ్రేకింగ్ ది ఐస్ స్టేషన్" అనే సోషల్ మీడియా ఖాతా ద్వారా పరిశోధన కోసం నిధులను సేకరిస్తుంది. కైకి ALS వ్యాధిపై పోరాటంలో సహాయం చేయడం కేవలం కుటుంబ జీవితాన్ని కాపాడుకోవడం కంటే ఎక్కువ అని, అతనితో గడిపే ప్రతి క్షణాన్ని తాను ఎంతో విలువైనదిగా భావిస్తానని కై భార్య చెప్పడం విశేషం. అంతేగాదు కై దృఢ సంకల్పానికి ఫిదా అవ్వతూ ప్రశంసలు వెల్లువెత్తాయి.(చదవండి: 25 వేల ఈకలు, నాలుగు లక్షల పూసలు..ఏకంగా రూ. 1,155 గంటల ఎంబ్రాయిడరీ!) -
చైనా ముప్పు మరింత పెరిగింది
వాషింగ్టన్: చైనా నుంచి బెడద తమకు మరింతగా పెరిగిందని తైవాన్ అంటోంది. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం తక్షణమే అమెరికా ఆయుధాలను అందించాలని కోరుతోంది. అదేసమయంలో, తమ విషయంలో అమెరికా విధానంలో మార్పు వచ్చినట్లుగా ఎటువంటి చాయలు కనిపించడం లేదని తెలిపింది. అమెరికాలోని తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ రిప్రజెంటేటివ్ కార్యాలయం చీఫ్ అలెగ్జాండర్ యుయి టాహ్ రే ఇటీవల వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. తైవాన్ విషయంలో గత ప్రభుత్వాల విధానాలకు భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. అమెరికా ప్రధాన భూభాగానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్ను రక్షించడం తమవల్ల కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో తైపీలోని నేతలు షాకయ్యారు. తైవాన్ రక్షణ బాధ్యత ఆ దేశ ప్రజలే చూసుకోవాలని కూడా అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎకనామిక్ అండ్ కల్చరల్ రిప్రజెంటేటివ్ కార్యాలయం చీఫ్ అలెగ్జాండర్ యుయి టాహ్ రే తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అమెరికా కోసం ఎదురు చూడలేం ‘ఆత్మరక్షణ కోసం మాకు ఆయుధాలు కావాలి. రక్షణ బడ్జెట్‌ను పెంచుకుంటున్నాం. సంక్షోభాన్ని తట్టుకుని, మమ్మల్ని మేం రక్షించుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం’అని అలెగ్జాండర్ చెప్పారు. ‘మా భద్రతకు మాదే బాధ్యత. అమెరికా సైన్యం వచ్చి మమ్మల్ని కాపాడుతుందని ఎదురు చూస్తూ ఉండలేం. ఆ దేశ సైన్యంపై ఆధారపడలేం. అందుకే మమ్మల్ని మేం మరింత బలోపేతం చేసుకోవ డానికి అమెరికా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’అని ఆయన అన్నారు. చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు స్థాయికి తగినట్లుగా ఆయుధాల విక్రయం ఉండాలన్న ఆయన.. ప్రస్తుతం చైనా నుంచి ముప్పు వాస్తవానికి చాలా ఎక్కువగానే ఉందని వ్యాఖ్యానించారు. ‘మేం దురాక్రమణదారులం కాదు. చైనా మాత్రమే నిరంతరం యుద్ధ విమానాలను, నౌకలను మా వైపునకు పంపుతూ కయ్యానికి కాలు దువ్వుతోంది. తైవాన్‌లో మాకున్న స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నది కూడా చైనాయే’అని ఆయన ఆరోపించారు.రుబియో చెప్పిందదే..తైవాన్ విషయంలో అమెరికా విధానంలో మార్పు వచ్చినట్లు తమకు కనిపించడం లేదని అలెగ్జాండర్ చెప్పారు. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కొన్ని ప్రకటనలను తమ ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. తమకు ఆయుధాల విక్రయం విషయంలో ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో కాంగ్రెస్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆయన ప్రస్తావించారు. తైవాన్‌కు ఆయుధాల విక్రయం అంశంపై చైనాతో సంప్రదింపులు, చర్చలు జరపలేదని రుబియో చెప్పారన్నారు. ఆయు ధాల ప్యాకేజీని నిలిపివేయలేదు, ఆయుధాల నిల్వలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్యాకేజీపై సమీక్ష మాత్రమే చేపట్టామని రుబియో తెలిపారని అలెగ్జాండర్ గుర్తు చేశారు. చైనా దాడి చేసిన పక్షంలో తైవాన్‌కు కాపాడేందుకు సైన్యాన్ని పంపేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు గత అధ్యక్షుడు జో బైడెన్ పలుమార్లు ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పసిఫిక్ సముద్రంలోని తైవాన్ తదితర ద్వీపాలపై చైనా పెత్తనాన్ని నిలువరించేందుకు రక్షణ వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేయాలని రక్షణ శాఖ నివేదిక సైతం పేర్కొంది.మాట మార్చిన ట్రంప్చైనాను నిలువరించేందుకు తైవాన్‌కు 1,400 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు ఉద్దేశించిన భారీ ప్యాకేజీపై ఈ ఏడాది ఆరంభంలో అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అప్పట్లో ట్రంప్ దీనిని ‘చైనాతో అత్యుత్తమమైన బేరసారాల చిప్’గా అభివర్ణించారు. కాగా, మేలో చైనా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్‌తో కుదిరిన ఒప్పందం మేరకు తైవాన్‌కు వాగ్దానం చేసిన 1,400 కోట్ల డాలర్ల ఆయుధ ప్యాకేజీని పక్కన బెడుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనిపై తైవాన్‌తోపాటు అమెరికా ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.తైవాన్‌పై తీవ్ర ఒత్తిడులుతైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా తాము కలిపేసుకుంటామని చైనా గట్టిగా చెబుతోంది. చైనా ఒత్తిళ్లతో అమెరికా సహా చాలా దేశాలు తైవాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. తైవాన్ సాధారణ దౌత్య సంబంధాలను కొనసాగించకుండా చైనా అడ్డుతగులుతోంది. అదే సమయంలో, అమెరికా ఆయుధాలను అందజేస్తూ గట్టి మద్దతుదారుగా ఉంటోంది. అలెగ్జాండర్ అధికారికంగా తైవాన్ రాయబారి కాదు, ఉన్నత స్థాయి ప్రతినిధి మాత్రమే . చైనా దురాక్రమణను నిరోధించేందుకు తైవాన్‌కు అవసరమైన ఆయుధాలను అందజేయాలన్నది అమెరికా విధానంగా ఉంటూ వస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో తైవాన్ చుట్టూ చైనా పలుమార్లు పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలను నిర్వహించింది. దాదాపు నిత్యం తైవాన్ సరిహద్దులకు సమీపంలోకి యుద్ధనౌకలను, సైనిక విమానాలను పంపుతోంది. -
చైనాకు కౌంటర్ : రూ. 1.5 లక్షల కోట్ల భారత్ సియాంగ్ ప్రాజెక్ట్
ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో, టిబెట్‌లోని యార్లంగ్ త్సాంగ్పో (Yarlung Tsangpo)నది దిగువ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ఆనకట్ట నిర్మాణాన్ని చైనా అధికారికంగా ప్రారంభించింది. దీంతో భారతదేశం డ్రాగన్ కంట్రీకి గట్టి కౌంటర్ ఇస్తోంది. చైనా టిబెట్ పరిధిలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌కు కౌంటర్‌గా భారత్ అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ నదిపై రూ. 1.5 లక్షల కోట్ల వ్యయంతో 11,000 మెగావాట్ల సామర్థ్యంతో మెగా జలవిద్యుత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వరంగ సంస్థ NHPC ఆధ్వర్యంలోప్రత్యేకంగా నిర్మించనున్న 'సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్' (SUMP) భారత దేశంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్‌గా నిలువనుందని అంచనా. ఇది ఏటా 47 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనా సృష్టించ బోయే కృత్రిమ వరదలు, నీటి కొరత ముప్పును ఎదుర్కొని, ఈశాన్య రాష్ట్రాల జల భద్రతను, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటమే భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ ద్వంద్వ ప్రయోజనం, ఇటు ఆర్థిక విలువతో పాటు అటు భౌగోళిక-రాజకీయ ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది.దీని రిజర్వాయర్ దాదాపు 9 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ ఉంచేలా సుమారు 300 మీటర్ల ఎత్తుతో డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. దీనివల్ల ఎగువన చైనా ఒకవేళ నీటిని అకస్మాత్తుగా వదిలినా లేదా ఆపివేసినా, ఈ రిజర్వాయర్ ఒక నియంత్రణ అవరోధంగా మారి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం పరివాహక ప్రాంతాలలో వరదలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంవివాదాస్పద నదిపై చైనాప్రతి కదలికను నిశితంగా గమనిస్తూనే, భారతదేశం ఇప్పుడు తన వ్యూహాత్మక ప్రతిస్పందనను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. లోక్‌సభకు ఇచ్చిన అధికారిక లిఖితపూర్వక సమాధానంలో, జలవిద్యుత్ వినియోగం కోసం చైనా ప్రణాళికలతో సహా, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని కేంద్రం ధృవీకరించింది. అలాగే, దిగువ ప్రాంతాల్లోని ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని కాపాడటానికి అవసరమైన నివారణ, సవరణ చర్యలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.ఇదీ చదవండి: రూ. 3,800 కోట్ల గిఫ్ట్ : మురిసిపోయిన డొనాల్డ్ ట్రంప్అయితే ప్రపంచంలోనే పెద్దదైన చైనా 60వేల మెగావాట్ల మెడాగ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఇప్పటికే నిర్మాణ పనులు చురుగ్గా సాగుతూ ఉండగా, SUMP నిర్మాణ పూర్వ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రీ-ఫీజిబిలిటీ (ప్రారంభ పరిశీలన) దశలో ఉంది. భారత్‌తో పోలిస్తే చైనా ప్రాజెక్ట్ సామర్థ్యం చాలా రెట్లు మించి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదీ చదవండి : రూ. 18 కోట్ల మేయర్ కిడ్నాప్ డ్రామా : సంచలన ఆరోపణలు -
యుద్ధం మొదలవుతుంది..!చైనా వాడు పాకిస్థాన్ ను కుక్కలా పెంచుకుంటున్నాడు..!
-
ఇది చైనా దోమ.. మీ ఇంట్లో కనిపిస్తే జాగ్రత్త..!
-
జపాన్ సంచలన నిర్ణయం.. 80 ఏళ్ల శాంతివాదానికి స్వస్తి?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతివాద విధానాలను అనుసరించిన జపాన్ ఇప్పుడు రక్షణ రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లు, చైనా సైనిక దూకుడు, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల నేపథ్యంలో రక్షణ సామర్థ్యాల పెంపు అత్యవసరమని జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి స్పష్టం చేశారు. యుద్ధాన్ని నివారించాలంటే ముందుగా దానిని అడ్డుకునే శక్తి ఉండాలని ఆయన పేర్కొనడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం జపాన్ చేపడుతున్న చర్యలు ఆసియా భద్రతా సమీకరణాల్లో కీలక మార్పులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు యుద్ధాన్ని పూర్తిగా తిరస్కరించిన దేశం ఇప్పుడు ఎందుకు సైనిక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం వచ్చిందనే ప్రశ్నకు ఈ వ్యాఖ్యలే సమాధానంగా కనిపిస్తున్నాయి.ఒకప్పుడు యుద్ధాన్ని పూర్తిగా త్యజించి శాంతివాద దేశంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన జపాన్.. ఇప్పుడు రక్షణ రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, చైనా సైనిక విస్తరణ, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో దేశ భద్రతకు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన.. యుద్ధాన్ని నివారించాలంటే ముందుగా దానిని అడ్డుకునే శక్తి ఉండాలి. శాంతిని కాపాడుకోవాలంటే ప్రత్యర్థి దాడి చేయాలనే ఆలోచనకే భయపడేంత శక్తి మన దగ్గర ఉండాలి. అందుకే జపాన్ తన రక్షణ రంగంలో భారీ మార్పులు తీసుకువస్తోందని ఆయన స్పష్టం చేశారు. దీంతో, ఆ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.జపాన్‌లో ఈ మార్పుకు కారణం?ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారింది. ముఖ్యంగా చైనా సైనిక శక్తి పెరుగుదల జపాన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత పదేళ్లలో చైనా తన నౌకాదళం, వైమానిక దళం, క్షిపణి వ్యవస్థలను విస్తృతంగా అభివృద్ధి చేసింది. తైవాన్ చుట్టూ తరచూ నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలు, తూర్పు చైనా సముద్రంలో జపాన్ నియంత్రణలో ఉన్న సేన్కాకు దీవుల సమీపంలో చైనా నౌకల సంచారం, దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ దూకుడు టోక్యోలో భద్రతా ఆందోళనలను పెంచుతున్నాయి.జపాన్‌కు కేవలం చైనా మాత్రమే కాదు. ఉత్తర కొరియా కూడా మరో పెద్ద సవాల్‌గా మారింది. తరచూ నిర్వహిస్తున్న బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు, అణ్వాయుధ కార్యక్రమాలు జపాన్ భద్రతకు నేరుగా ముప్పుగా భావిస్తున్నారు. ఉత్తర కొరియా ప్రయోగించిన కొన్ని క్షిపణులు జపాన్ గగనతలంపై నుంచి దూసుకెళ్లడం అక్కడ ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఇక ఉక్రెయిన్‌పై రష్యా దాడి కూడా జపాన్ విధానంలో పెద్ద మార్పునకు కారణమైంది. శాంతి కోసం ఒప్పందాలు సరిపోవు.. అవసరమైతే శక్తి కూడా ఉండాలి అనే భావన జపాన్ విధాన నిర్ణేతల్లో బలపడింది.శాంతివాద దేశం నుంచి సైనిక శక్తి వైపు..1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ రాజ్యాంగంలోని 9వ అధికరణం ప్రకారం యుద్ధాన్ని శాశ్వతంగా త్యజించింది. దాడి చేసే సైన్యాన్ని కాకుండా కేవలం రక్షణ కోసం మాత్రమే ‘సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్’ను ఏర్పాటు చేసింది. ఇలా దశాబ్దాల పాటు జపాన్ ప్రపంచానికి శాంతివాద దేశంగా నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచ భద్రతా సమీకరణాల్లో వచ్చిన మార్పులు జపాన్ను తన వ్యూహాన్ని పునఃపరిశీలించేలా చేశాయి.ఇటీవల జపాన్ ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని భారీగా పెంచే నిర్ణయం తీసుకుంది. గతంలో జీడీపీలో కేవలం 1 శాతం మాత్రమే రక్షణకు కేటాయించగా, ఇప్పుడు దాన్ని 2 శాతానికి పెంచుతోంది. ఇది జపాన్ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ విస్తరణగా భావిస్తున్నారు.జపాన్ ఏం చేస్తోంది ?జపాన్ ప్రస్తుతం పలు కీలక రక్షణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది.అమెరికా నుంచి అత్యాధునిక టోమాహాక్ క్షిపణుల కొనుగోలుదీర్ఘశ్రేణి దాడి సామర్థ్యం కలిగిన క్షిపణుల అభివృద్ధిసైబర్ యుద్ధ సామర్థ్యాల పెంపుకృత్రిమ మేధ (AI) ఆధారిత రక్షణ వ్యవస్థలుడ్రోన్ టెక్నాలజీ విస్తరణఅంతరిక్ష భద్రతా వ్యవస్థల బలోపేతంబ్రిటన్, ఇటలీలతో కలిసి ఆరో తరం యుద్ధ విమానాల అభివృద్ధిఇవన్నీ కేవలం రక్షణ కోసమేనని జపాన్ చెబుతున్నప్పటికీ, ఆసియా భద్రతా సమీకరణాల్లో ఇవి కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.చైనా స్పందన ఏంటి?జపాన్ చర్యలను చైనా తీవ్రంగా విమర్శిస్తోంది. జపాన్ మళ్లీ సైనికవాదం వైపు వెళ్తోందని బీజింగ్ ఆరోపిస్తోంది. అయితే, కోయిజుమి ఈ విమర్శలను ఖండించారు. అణ్వాయుధాలు లేని, ఇతర దేశాలపై దాడి చేసే విధానం లేని జపాన్ను సైనికవాద దేశంగా చిత్రీకరించడం సరైంది కాదన్నారు. నిజానికి ప్రాంతీయ అస్థిరతకు కారణం చైనా సైనిక విస్తరణేనని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.అమెరికా పాత్ర ఎంత కీలకం?జపాన్ భద్రతలో అమెరికా ప్రధాన భాగస్వామి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన భద్రతా ఒప్పందం ప్రకారం జపాన్‌పై దాడి జరిగితే అమెరికా రక్షణకు రావాల్సి ఉంటుంది. జపాన్‌లో దాదాపు 50 వేల మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాను సమతుల్యం చేయడంలో అమెరికా-జపాన్ భాగస్వామ్యం కీలకంగా మారింది. అందుకే జపాన్ రక్షణ సామర్థ్యాల పెంపు కేవలం టోక్యో నిర్ణయం మాత్రమే కాదు.. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు కూడా అనుగుణంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.జపాన్ పంపుతున్న సందేశం..జపాన్ తాజా వ్యూహం వెనుక ఒకే సందేశం ఉంది. శాంతి కోసం బలం అవసరం అని స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశం ఇప్పుడు యుద్ధాన్ని నివారించేందుకు సైనిక శక్తిని పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని జపాన్ చెబుతోంది. చైనా, ఉత్తర కొరియా, రష్యా వంటి భద్రతా సవాళ్ల మధ్య జపాన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఆసియా భవిష్యత్తు భద్రతా సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముంది. అయితే, జపాన్ ప్రస్తుతం చేపడుతున్న రక్షణ విస్తరణ కేవలం ఆయుధాల కొనుగోలు కాదు. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన శాంతివాద విధానానికి అతిపెద్ద మలుపు. రాబోయే దశాబ్దంలో జపాన్ ఆసియాలో మరింత ప్రభావవంతమైన సైనిక, వ్యూహాత్మక శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
తైవాన్ ‘సీక్రెట్’ వెబ్‌సైట్‌తో చైనాకు దడ!
బీజింగ్: చైనా, తైవాన్ మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. చైనా పౌరుల నుంచి ఆ దేశ అంతర్గత రహస్యాలు, నిఘా సమాచారాన్ని సేకరించేందుకు తైవాన్ ఒక ప్రత్యేక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ వ్యూహాత్మక చర్యపై బీజింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, దీనికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని చైనా హెచ్చరించింది. ఈ పరిణామంతో తైవాన్ జలసంధి ప్రాంతంలో సైనిక, రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.రహస్యాల సేకరణకు ‘డిజిటల్’ వ్యూహంతైవాన్కు చెందిన నేషనల్ సెక్యూరిటీ బ్యూరో (ఎన్ఎస్బీ) ఆదివారం ఈ నూతన ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను అధికారికంగా ప్రారంభించింది. చైనాలో ఉంటూ ప్రజాస్వామ్య విలువలను విశ్వసించే పౌరులు ఎవరైనా, బీజింగ్ ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని తమతో పంచుకోవచ్చని తైవాన్ ఇందులో పేర్కొంది. దీని కోసం ఒక నిమిషం నిడివి గల ఏఐ ప్రమోషనల్ వీడియోను కూడా విడుదల చేసింది. చైనా రాజకీయ వ్యవస్థలో ఉన్న భయాందోళనలు, అభద్రతాభావాలను ఎత్తిచూపేలా ఈ వీడియోను రూపొందించారు. చైనా గూఢచర్య చర్యలను, సైబర్ దాడులను తిప్పికొట్టడానికే ఈ సురక్షితమైన ఛానల్‌ను ఏర్పాటు చేసినట్లు తైవాన్ సమర్థించుకుంది.చట్టపరమైన చర్యలు తప్పవన్న బీజింగ్ఈ ఉదంతంపై చైనా తైవాన్ అఫైర్స్ ఆఫీస్ ప్రతినిధి చెన్ బిన్హువా తీవ్రంగా స్పందించారు. తైవాన్ అధికార పక్షమైన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ)ఉద్దేశపూర్వకంగానే సంబంధాలను చెడగొడుతోందని ఆరోపించారు. తైవాన్ ఏజెన్సీలకు సమాచారం అందించే చైనా పౌరులు, సంస్థలు ఎవరైనా సరే చైనా జాతీయ భద్రతా చట్టాల ప్రకారం కఠినమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దేశ భద్రతను కాపాడటం ప్రతి చైనా పౌరుడి బాధ్యత అని ఆయన గుర్తుచేశారు.పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలుఈ రాజకీయ వివాదం ఇలా ఉంటే, తైవాన్ సరిహద్దుల్లో చైనా సైనిక కదలికలు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం తైవాన్ ద్వీపం చుట్టుపక్కల ఆరు చైనా యుద్ధనౌకలు సంచరిస్తున్నట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తించి, వాటిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. మరోవైపు చైనా ఒత్తిడిని తట్టుకునేందుకు తైవాన్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే తైవాన్ స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన మొట్టమొదటి సబ్‌మెరైన్ కాహ్సియుంగ్ పోర్ట్ నుండి తొమ్మిదోసారి జలంతర్గామి నావిగేషన్ పరీక్షల కోసం సముద్రంలోకి వెళ్లింది. రెండు దేశాల మధ్య ఈ ప్రచ్ఛన్నయుద్ధం ఆసియా ప్రాంతంలో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.ఇది కూడా చదవండి: నిప్పును రాజేసింది అప్పుడే.. షాకిస్తున్న ఆవిష్కరణ! -
ప్రకృతి పిలుపు.. వరుస మారుతోంది!
టాయిలెట్ వస్తే ఏం చేస్తాం? అదేం ప్రశ్న.. వెళ్తాం అంటారా?ఇప్పటివరకు జరిగింది.. జరుగుతోంది ఇదే.. పేదోడి దగ్గర నుంచిపైసలున్నోడి వరకు ఎవరైనా సరే.. టాయిలెట్ వస్తే.. అది ఎక్కడుంటేఅక్కడకు వెళ్లాల్సిందే. కానీ ఇకపై ఆ అవసరం ఉండదు. టాయిలెట్ వస్తే.. మనం వెళ్లాల్సిన పనిలేదు. అదే మన దగ్గరకు వచ్చేస్తుంది. పనిపూర్తయ్యాక చక్కగా వెళ్లిపోతుంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి..బెడ్ నుంచి లేవలేని వృద్ధులు, పక్షవాతం వచ్చిన రోగుల కోసం చైనాకు చెందిన యుబాన్ అనే టెక్ కంపెనీ ఒక వినూత్నమైన అటానమస్ రోబో టాయిలెట్‌ను రూపొందించింది. దీనికి షాబాన్ అని పేరు పెట్టారు. షాంఘైలో జరిగిన అంతర్జాతీయ వృద్ధుల సంరక్షణ ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించగా.. అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. చక్రాల కుర్చీ తరహాలో ఉండే ఈ కమోడ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అత్యాధునిక సెన్సర్లతో పనిచేసే ఒక హైటెక్ రోబో. బెడ్‌పై పడుకున్న వ్యక్తి రిమోట్ కంట్రోల్ సాయంతో పిలిస్తే చాలు.. బాత్రూమ్లో డాకింగ్ స్టేషన్‌కు ఉన్న రోబో టాయిలెట్.. బెడ్ పక్కకు వచ్చేస్తుంది. ఇందులో అమర్చిన లైడార్, లేజర్ సెన్సర్ల వల్ల ఇంట్లోని గోడలను లేదా వస్తువులను గుద్దుకోదు. టాయిలెట్ బెడ్రూమ్లోకి వచ్చినా.. ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇందులో హై–డ్యూటీ ఫోమ్ షీల్డ్, యాక్టివేటెడ్ చార్కోల్ (బొగ్గు) ఫిల్టర్లను ఉపయోగించారు. అందువల్ల బెడ్రూమ్లో ఉన్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పని పూర్తయిన తర్వాత సైలెంట్‌గా బాత్రూమ్లోని తన డాకింగ్ స్టేషన్‌కు వెళ్లిపోతుంది. అక్కడ డ్రైనేజీ పైపుతో కనెక్ట్ అయ్యి.. లోపల ఉన్న వ్యర్థాలను ఒక సైలెంట్ గ్రైండర్ ద్వారా నలిపేసి ఫ్లష్ చేస్తుంది. ఆ తర్వాత తనను తాను 360 డిగ్రీల కోణంలో పూర్తిగా శానిటైజ్ చేసుకుంటుంది. చివరిగా మళ్లీ తన వాటర్ ట్యాంక్‌ను నింపుకొని, బ్యాటరీ చార్జ్ చేసుకుని తదుపరి పిలుపు కోసం సిద్ధంగా ఉంటుంది. అంతా బానే ఉంది.. ధర ఎంత అంటారా? చైనా మార్కెట్లో దీని ధర 28,999 యువాన్లు.. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.11 లక్షలు. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, వృద్ధులు, రోగులకు ఇది ఒక గొప్ప వరమని నిపుణులు చెబుతున్నారు. వయసు పైబడిన వారు లేదా అనారోగ్యంతో ఉన్నవారు ప్రతి చిన్న అవసరానికి, ముఖ్యంగా ప్రకృతి పిలుపు కోసం ఇతరులపై ఆధారపడాల్సి వచ్చినప్పుడు తీవ్ర మానసిక వేదనకు గురవుతుంటారు. కేర్టేకర్లకు కూడా ఇది శారీరకంగా పెద్ద శ్రమ. ఈ రోబో వల్ల రోగులు ఎవరి సహాయం లేకుండా తమ పని తాము చేసుకోగలుగుతారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడటమే ఈ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు ప్రకృతి మనల్ని పిలిచేది..ఇకపై మనమే ప్రకృతిని పిలవొచ్చు అన్నమాట!! -
గొంతు విప్పకముందే నొక్కేస్తుంది!
ప్రభుత్వంలో జరుగుతున్నఅవినీతి మీద ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారా? వానలతో దెబ్బతిన్న నగర రోడ్ల గురించిఅధికారులను విమర్శిస్తూ ‘ఎక్స్’లో కోపంతోఏదైనా కామెంట్ చేశారా?వాట్సాప్ గ్రూపులో దేశ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారా?అయితే జాగ్రత్త..మీ కామెంట్లు, పోస్టుల ఆధారంగా రేపు మీరు ఏమనుకుంటారో, ఎవరిని విమర్శిస్తారో, ఏ నిరసనలో పాల్గొంటారో కూడా కృత్రిమ మేధ (ఏఐ) ముందే ఊహించి మీ పేరుతో ఒక ’రిస్క్ స్కోర్’ను రూపొందించే రోజులు వస్తున్నాయి. చైనాలో వెలుగులోకి వచ్చిన ఏఐ ఆధారిత నిఘా ప్రాజెక్టు, సాంకేతికత వివరాలు బయటకు పొక్కడంతో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, భవిష్యత్తుపై కొత్త ఆందోళనతలెత్తుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ముందే గుర్తించి నియంత్రణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు.. భవిష్యత్తులో వారు పూర్తిస్థాయిలో ప్రభుత్వ విమర్శకులుగా మారే అవకాశముందేమో ముందుగానే గుర్తించి నిషేధించే ఏఐ వ్యవస్థ చైనాలో తయారవుతోంది. చైనాకు చెందిన జీఎడ్జ్ నెట్వర్క్స్ అనే సంస్థ అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా పోస్టులు, ఫోన్ డేటా, లొకేషన్ ఆధారంగా పౌరుల ప్రవర్తనను విశ్లేషించి వారిపై నిఘా పెట్టే ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతున్నట్లు వెల్లడైంది. భవిష్యత్తులో ప్రభుత్వ విమర్శకులుగా మారే వారిని ముందుగానే గుర్తించి నియంత్రించడానికి ఈ వ్యవస్థను తయారు చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అమెరికా విధించిన చిప్ ఆంక్షలతో ఈ ప్రాజెక్టుకు కొంత బ్రేకులు పడినా.. పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ప్రజలు అసమ్మతి వ్యక్తం చేయకముందే వారి గొంతు నొక్కేసే చర్యలకు ప్రభుత్వాలు దిగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.చైనా పౌరుల సమగ్ర ప్రొఫైళ్ల రూపకల్పనలో జీఎడ్జ్అమెరికాకు చెందిన వాండర్బిల్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీకి చెందిన పరిశోధకులు.. జీఎడ్జ్ సంస్థ తన ప్రభుత్వ మద్దతు ఉన్న పరిశోధనా విభాగం మెసా ల్యాబ్‌తో కలిసి చైనా పౌరుల సమగ్ర ప్రొఫైళ్లు రూపొందించే పనిలో ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రొఫైళ్ల ఆధారంగా రాజకీయంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న వ్యక్తులను ఏఐ సహాయంతో ముందే గుర్తించే టెక్నాలజీని కంపెనీ అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడైంది. అయితే అధునాతన చిప్‌ల ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలు ఈ ప్రాజెక్టు పురోగతిని కొంతవరకు దెబ్బతీశాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో విధించిన ఆంక్షలు కొంత అడ్డుకున్నాయని అంటున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం కొన్ని పరిమితులను సడలించినప్పటికీ, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఏఐ చిప్‌లను రూపొందించే ఎన్విడియా తయారీ అత్యాధునిక ప్రాసెసర్లపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో అమెరికా చిప్‌లపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు స్వదేశీ ఏఐ చిప్‌ల అభివృద్ధిపై చైనా దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం జీఎడ్జ్ వద్ద ఉన్న గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు) ప్రస్తుత ఉత్పత్తులకు సరిపోతున్నప్పటికీ, మరింత శక్తివంతమైన అంచనా వ్యవస్థను రూపొందించాలంటే చైనాకు అత్యాధునిక చిప్‌లు అవసరమవుతాయని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షకు పైగా పత్రాల లీక్ చైనా అమలు చేస్తున్న గ్రేట్ ఫైర్‌వాల్ తరహా ఇంటర్నెట్ పర్యవేక్షణ, సెన్సార్షిప్ సాఫ్ట్‌వేర్‌ను జీఎడ్జ్ నెట్వర్క్స్ అనేక దేశాలకు వాణిజ్యపరంగా విక్రయిస్తోంది. ఈ సాంకేతికత ద్వారా అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం, సెన్సార్షిప్ను తప్పించుకునేందుకు పౌరులు చేసే ప్రయత్నాలను గుర్తించడం, ప్రజల ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా పెట్టడం వంటి చర్యలు చేపడుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో జీఎడ్జ్ కు సంబంధించిన లక్షకు పైగా పత్రాలు లీక్ కావడంతో ఈ నిఘా వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పత్రాలను విశ్లేషించిన వైర్డ్ సహా పలు మీడియా సంస్థలు, జీఎడ్జ్ తన నెట్వర్క్ భద్రతా సాఫ్ట్‌వేర్‌ను ఇథియోపియా, కజకిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్ వంటి దేశాలకు ఎగుమతి చేసి అక్కడ మొబైల్ నెట్‌వర్క్‌లపై భారీ స్థాయి నిఘా నిర్వహించేందుకు సహకరించినట్లు వెల్లడించాయి. తాజాగా జీఎడ్జ్ ఇంజనీర్లు ప్రజల మొబైల్ సమాచారం, సోషల్ మీడియా కార్యకలాపాలు, లొకేషన్ డేటా ఆధారంగా వ్యక్తుల ప్రవర్తనా నమూనాలను రూపొందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. గోప్యత, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలు ప్రశ్నార్థకం? కృత్రిమ మేధ సహాయంతో పౌరుల రాజకీయ అభిప్రాయాలను ముందుగానే అంచనా వేసే దిశగా చైనా చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా గోప్యత, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై కొత్త చర్చకు తెరలేపాయి. ఈ రోజు మీ మొబైల్లో చేసిన సెర్చ్, సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్, వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసిన మెసేజ్ కేవలం డేటానే కావచ్చు. కానీ రేపు అదే డేటా ఆధారంగా మీరు ముందు ముందు ఒక నిరసనకారుడు, ప్రభుత్వ విమర్శకుడు అయ్యే అవకాశముందని ఏఐ ముద్ర వేస్తే? చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త తరం నిఘా సాంకేతికత ప్రస్తుతం భారత్ సహా ఇతర దేశాలకు అందుబాటులో లేదనుకున్నా, డిజిటల్ పాలన వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత ప్రపంచంలో అది పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కేవలం చైనా కథ కాదని, డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడి భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరిక అని అంటున్నారు.మాస్ సర్వైలెన్స్ (భారీ స్థాయి నిఘా వ్యవస్థ)కు కృత్రిమ మేధ జత అయితే జరిగేది ఇదే. ఒక వ్యక్తి ప్రభుత్వం వ్యతిరేకిగా మారకముందే అతడిని గుర్తించి పర్యవేక్షించే స్థాయికి ఈ టెక్నాలజీ తీసుకెళ్లే ప్రమాదం ఉంది. – బ్రెట్ జే. గోల్డ్‌స్టీన్, వికెడ్ ప్రాబ్లమ్స్ ల్యాబ్ డైరెక్టర్ ప్రజలు ఏం చేస్తున్నారన్నది మాత్రమే కాదు.. భవిష్యత్తులో వారు ఏం చేయచ్చో ముందే అంచనా వేసే వ్యవస్థలను నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇది నిఘా వ్యవస్థల్లో కొత్త దశ. – అమెరికా భద్రతా వర్గాల విశ్లేషణ -
ఏఐ దెబ్బకు 12 వేల కోర్సులు ఔట్.. చదివిన డిగ్రీలు చెత్తబుట్టలోకి?
ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం దాదాపు ఖాయం అన్న భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాంకేతిక విప్లవ వేగం పెరగటంతో నిన్నటి నైపుణ్యాలు ఈ రోజు పనికిరాని స్థితికి చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులకు భవిష్యత్తులో అవసరమయ్యే సామర్థ్యాలు ఏమిటన్న దానిపై దేశాలు మళ్లీ ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తీసుకున్న తాజా నిర్ణయాలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో ప్రపంచ ఉద్యోగ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ.. చైనా ఉన్నత విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా... కాలం చెల్లినట్లు భావిస్తున్న వేలాది డిగ్రీ కోర్సులను విశ్వవిద్యాలయాలు తొలగిస్తున్నాయి. చైనా ఉన్నత విద్యా సంస్థలు తమ విద్యా కోర్సుల్లో పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడుతున్నాయి. దేశాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నత విద్యను మరింత దగ్గరచేసే ప్రయత్నంలో భాగంగా వేల సంఖ్యలో కాలం చెల్లినట్లు భావిస్తున్న డిగ్రీలను తొలగించి, వాటి స్థానంలో కొత్త సాంకేతికత ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతున్నాయి.10,200 కొత్త కోర్సులు పరిశ్రమల్లో ప్రపంచ నాయకత్వం సాధించాలనే లక్ష్యాన్ని చైనా పెట్టుకుంది. అలాగే, చైనాలో లక్షలాది యువతకు ఉపాధి దొరకడం లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కొనే ప్రయత్నంలో చైనా ఈ చర్యలు చేపడుతోంది. 2021 నుంచి 2025 మధ్య చైనా ఉన్నత విద్యా సంస్థలు 12,200 అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను రద్దు చేశాయి. అదే సమయంలో 10,200 కొత్త కోర్సులను ప్రారంభించాయి. దీంతో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయ కోర్సుల్లో 30%కి పైగా మార్పులు చోటుచేసుకున్నాయి.ఈ విభాగాల్లో కోర్సులు ఔట్ ఈ తొలగింపులు ప్రధానంగా కళలు, మానవీయ శాస్త్రాలు, విదేశీ భాషలు, నిర్వహణ విద్య విభాగాల్లో జరిగాయి. చైనాలో యువత విషయంలో నిరుద్యోగం 16% కి పైగా ఉండటం, ఉద్యోగ రంగం కృత్రిమ మేధ ప్రభావంతో వేగంగా మారిపోవటం వల్ల ఈ విభాగాలను కాలం చెల్లినవిగా భావిస్తున్నారు.ఇక కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులు చైనా ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలకు దగ్గరగా ఉన్నాయి. ఉదాహరణకు, 9 విశ్వవిద్యాలయాలు "ఎంబాడీడ్ ఇంటెలిజెన్స్"ని ప్రారంభించాయి. ఎంబాడీడ్ ఇంటెలిజెన్స్ అంటే భౌతిక యంత్రాలు లేదా రోబోట్లు పరిసరాలను గుర్తించి స్వయంగా నిర్ణయాలు తీసుకునే కృత్రిమ మేధ విధానం.పనికిరాని కోర్సులు ఎందుకు? తదుపరి తరం కృత్రిమ మేధను వాస్తవ ఆర్థిక వ్యవస్థలో వేగంగా కలపాలనే జాతీయ లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా మారిపోతుండటంతో విశ్వవిద్యాలయాలపై మార్పులు చేపట్టాలనే ఒత్తిడి పెరిగింది. పట్టభద్రుల సంఖ్య రికార్డు స్థాయికి చేరినా, చాలామందికి వారి డిగ్రీలు ఉద్యోగాలు సంపాదించటంలో పెద్దగా ఉపయోగపడటం లేదు.ఉదాహరణకు, షాంఘై సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ఈ ఏడాది తన ఉత్పత్తి రూపకల్పన కోర్సులో ప్రవేశాలను నిలిపివేసింది. ఆ కోర్సు వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటమే ఈ నిర్ణయానికి ఒక కారణం. మోడలింగ్, రెండరింగ్ వంటి అనేక ప్రధాన పనులను ఇప్పుడు కృత్రిమ మేధే నిర్వహిస్తోంది.మాధ్యమ విద్యపై దృష్టి సారించిన బీజింగ్‌లోని ప్రతిష్ఠాత్మక కమ్యూనికేషన్ యూనివర్సిటీ ఆఫ్ చైనా కూడా పలు కోర్సులను పునర్వ్యవస్థీకరించింది. ఇందులో సినిమాటోగ్రఫీ కోర్సును ఫిల్మ్ అండ్ టెలివిజన్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ కోర్సుతో విలీనం చేసింది.పూర్వ విద్యార్థులు ఏమంటున్నారు? ఈ మార్పు సాంకేతిక, మార్కెట్ పరిణామాలకు సహజ ప్రతిస్పందన అని విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. 2012లో సినిమాటోగ్రఫీ కోర్సు పూర్తి చేసిన వీడియోగ్రాఫర్ సాంగ్ సాంగ్ మాట్లాడుతూ.. తాను చదివిన కాలంలో ఫిల్మ్ నుంచి డిజిటల్ సాంకేతికత వైపు మార్పు జరిగిందని చెప్పాడు.“ప్రత్యక్ష ప్రసారాలు, చిన్న వీడియోలు పెరగటంతో కెమెరామెన్ నైపుణ్య అవసరాలు సంప్రదాయ టెలివిజన్ వార్తల చిత్రీకరణతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి” అని సాంగ్ అన్నాడు. విద్యలో మార్పులు తప్పనిసరి అని తెలిపాడు.అయితే ఒక కోర్సు స్థానంలో మరో కోర్సును ప్రవేశపెట్టటం తాత్కాలిక పరిష్కారమే అవుతుందని, వేగంగా మారుతున్న సాంకేతిక యుగానికి అనుగుణంగా ఉన్నత విద్యలో మరిన్ని మార్పులు అవసరమని జాతీయ విద్యా శాస్త్రాల సంస్థ సీనియర్ పరిశోధకుడు చు జావోహుయ్ హెచ్చరించారు.విశ్వవిద్యాలయాలు తొలగించిన అనేక కోర్సులు కొన్నేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయని చు పేర్కొన్నారు. అందువల్ల అభివృద్ధి చెందటానికి తగిన సమయం కూడా వాటికి దొరకలేదని తెలిపారు.ఒక ప్రధానాంశం స్థానంలో మరొకటి మార్చటం కన్నా, విద్యార్థులకు తమ కోర్సులను తామే ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఇచ్చే సౌకర్యవంతమైన విధానాన్ని విశ్వవిద్యాలయాలు అవలంబించాలని చు సూచించారు.“దీంతో విద్యార్థులు తమ ఆసక్తులు, ప్రత్యేక సామర్థ్యాలు, భిన్న వృత్తి మార్గాల అవసరాలకు అనుగుణంగా కోర్సులను ఎంచుకుని, తమకంటూ ప్రత్యేక మేధో స్వరూపాన్ని నిర్మించుకుంటారు” అని చు అన్నారు. ఉద్యోగ విపణి మరింత అనిశ్చితంగా మారుతున్న వేళ చైనాలో చాలామంది అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీని అంతిమ గమ్యంగా కాకుండా తొలి మెట్టుగా చూడటం ప్రారంభించారు. -
ఈ రోబో ఏం చేస్తుందో తెలిస్తే.. షాక్ అవాల్సిందే!
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. మనుషుల ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాగేసుకుంటుందనే భయాందోళనలు ఒకవైపు ఉంటే.. ఇప్పుడు రోబోలు ఏకంగా రోడ్లపైకి వచ్చి భిక్షాటన చేయడం మొదలుపెట్టాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల చైనాకు సంబంధించిన ఓ హ్యూమనాయిడ్ రోబో రోడ్డు పక్కన మోకాళ్లపై కూర్చుని.. అటుగా వెళ్తున్న బాటసారులను డబ్బులు కోసం యాచన చేస్తూ.. కనిపిస్తోంది.ఈ రోబోకు ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ చేశారు. దారినపోయే నేరుగా నగదు ఇవ్వక్కర్లేదు.. రోబో ముందు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ రూపంలో నగదు పంపేలా డిజైన్ చేశారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సరదాగా తీసుకుంటే.. మరికొందరు మాత్రం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఇక ఏ ఉద్యోగమూ సేఫ్ కాదు బాబోయ్.. హ్యూమనాయిడ్ రోబోలు అప్పుడే రోడ్లెక్కి మరీ అడుక్కోవడం మొదలుపెట్టేశాయి అంటూ ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది.ఈ రోబో ప్రవర్తన సాధారణంగా పరిశ్రమలు, సేవారంగం, గృహ సహాయకులుగా కనిపించే హ్యూమనాయిడ్ రోబోట్ల పాత్రలకు భిన్నంగా ఉంది. ఇప్పుడు రోబోలు కూడా అడుక్కుంటున్నాయా? ఇలాంటి పనులు యంత్రాలు అనుకరించే దిశగా సాంకేతికత అభివృద్ధి చెందుతోందా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల చెన్నైలో ఓ గృహిణి ఇంటి పనులను వీడియోల రూపంలో చిత్రీకరించి.. రోబోల శిక్షణకు సహకరించడం కూడా ఇదే తరహా చర్చకు దారితీసింది.Poor beggar, he is begging for the cost of charging.😅😅Buy a robot to make money. pic.twitter.com/7jBKZJG12b— Sharing Travel (@TripInChina) June 13, 2026సాంకేతికత సాయంతో మనుషుల శ్రమను తగ్గించాల్సింది పోయి.. ఇలాంటి పనులకు కూడా రోబోలను వాడుతుండటం ఐటీ రంగంతో పాటు సాధారణ పౌరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే, ఈ ప్రోగ్రామ్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ ప్రదర్శన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఉత్పాదకత, లాజిస్టిక్స్, రీటైల్, ప్రజా సేవల కోసం తక్కువ ఖర్చుతో కూడిన యంత్రాలను తయారు చేయడంతో.. హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధిలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలలో ఒకటిగా ఎదిగింది.తయారీ, లాజిస్టిక్స్, రిటైల్, ప్రజా సేవలు వంటి రంగాల్లో రోబోట్ల వినియోగం విస్తరిస్తోంది. కొన్ని సందర్భాల్లో రోబోట్లు యుద్ధకళలు ప్రదర్శించడం, కస్టమర్ సేవలు అందించడం వంటి పనులు కూడా చేస్తున్నాయి. అయితే, బహిరంగ ప్రదేశాల్లో హ్యూమనాయిడ్ రోబోట్ల వినియోగం పెరిగితే భద్రత, నైతికత, సామాజిక ప్రభావాలపై కొత్త నియమావళి అవసరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇరాన్లో తగ్గి క్యూబాలో నెగ్గేనా?
మెరుపు దాడిలో వెనిజులా అధ్యక్షుడిని బంధించిన తరువాత యూఎస్ అధ్యక్షుడి తరువాతి లక్ష్యం క్యూబా అని అందరూ భావించారు. అనుకోని పరిస్థితులలో ఇరాన్ యుద్ధం క్యూబాను వెనక్కు నెట్టే సింది. ఇరాన్ ఎదురు దెబ్బల నేపథ్యంలో యూఎస్ పక్కా ప్రణాళికతో క్యూబా పథకాన్ని రచిస్తున్నట్లుగా విశదమవుతు న్నది. మే నెల చివరలో యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిమిట్జ్‌ను కరేబియన్ సముద్రంలోకి పంపించటంతో యుద్ధమేఘాలు కమ్ముకోవటం ప్రారంభమైంది. క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రోపై యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ హత్యానేర అభియోగాలను మోపటం క్యూబాపై దాడికి యూఎస్ పావులు కదుపుతున్నట్లుగా అర్థమవుతున్నది. క్షేత్ర స్థాయిలో క్యూబా కూడా దాడికి సన్నద్ధమవుతున్న వార్త లొస్తున్నాయి. ‘ప్రజలందరి యుద్ధం’ డాక్ట్రిన్‌ను క్యూబా పాటించ బోతున్నది. ఈ సిద్ధాంతం ప్రకారం అమెరికా దాడిని క్యూబా సైన్యమే కాకుండా, క్యూబా పౌరులందరూ ప్రతిఘటిస్తారు. కమ్యూ నిస్టు పార్టీ వ్యవస్థ, విప్లవ చరిత్ర కలిగిన క్యూబాను దారికి తేవడం యూఎస్‌కు తేలిక కాదు. కానీ ఇరాన్ వైఫల్యాల నుండి ప్రజలదృష్టిని మరలించటానికి ట్రంప్‌కు క్యూబాపై విజయం కీలకం.గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నంకరేబియన్ సముద్రంలో అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉన్న క్యూబా దీవి వ్యూహాత్మకంగా భౌగోళిక ఉనికిని కలిగి ఉన్నది. క్యూబాలో విదేశీ శక్తులు తిష్టవేస్తే ఫ్లోరిడా జలసంధిని దిగ్బంధించి యూఎస్‌ను కట్టడి చేయవచ్చు. అందుకే 200 ఏళ్ళ క్రితమే మన్రో డాక్ట్రిన్‌లో భాగంగా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండా లను యూఎస్ తన వ్యూహాత్మక ప్రాంతాలుగా ప్రకటించింది. 1898లో స్పెయిన్‌ను యూఎస్ ఓడించటంతో క్యూబాకు వలస పాలన నుండి విముక్తి లభించింది. కానీ 1901 ప్లాట్ సవరణ చట్టం ద్వారా క్యూబాను యూఎస్ తన నియంత్రణలో ఉంచుకొన్నది. 1934లో ఈ చట్టాన్ని రద్దు పరచినప్పటికీ క్యూబా ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నది. యూఎస్ పెత్తనాన్ని ఎదిరించి ఫిడెల్ కాస్ట్రో 1959లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పరచి క్యూబాలోని యూఎస్ వ్యాపారాలను, ఆస్తులను జాతీయీకరణం చేశాడు. 1960లో క్యూబాపై అమెరికా ఆంక్షలు విధించింది. 1961లో యూఎస్‌లోని క్యూబా ప్రవాసుల ద్వారా ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సీఐఏ ప్రయత్నించి విఫలమైంది. దీనిని ‘బే ఆఫ్ పిగ్స్ తిరుగుబాటు’గా పిలుస్తారు. యూఎస్‌ను ఎదు ర్కోవటానికి కాస్ట్రో సోవియట్ రష్యా పంచన చేరాడు. 1962లో సోవియట్ యూనియన్ క్యూబాలో అణుక్షిపణులను మోహరించ టంతో అగ్ర రాజ్యాలు అణుయుద్ధపు అంచులకు చేరాయి. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమవటంతో క్యూబాకు దిక్కుతోచలేదు. కాస్ట్రో ఒకవైపు ఉక్కు పిడికిలితో క్యూబాను పాలిస్తూనే కమ్యూనిజంను లాటిన్ అమెరికా అంతటా వ్యాప్తి చేయటానికి ప్రయత్నించాడు. అంగోలా, ఇథియోపియాలలో కూడా క్యూబన్ గెరిల్లా సైనికులు సేవలందించారు.సంబంధాలు కొంత మెరుగైనా...రావుల్ కాస్ట్రో 2008లో క్యూబా పగ్గాలు చేపట్టాక యూఎస్‌తో కొంత సుహృద్భావ వైఖరిని ప్రదర్శించాడు. ఒబామా హయాంలో యూఎస్–క్యూబా సంబంధాలు కొంత గాడిన పడ్డాయి. 2015లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ జరిగింది. 2016లో క్యూబా పర్యటనలో భాగంగా క్యూబాను టెర్రరిజంను ప్రోత్సహించే దేశాల లిస్టు నుండి తొలగించారు. ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ట్రంప్ 2017లో అధికారంలోకి రావటంతోనే మళ్లీ ఘర్షణ వాతావరణం పునఃస్థాపితమైంది. బైడెన్ కూడా క్యూబాపై ఆంక్షలను చాలావరకు కొనసాగించాడు. వెనిజులాపై దాడి తరువాత తన తదుపరి లక్ష్యం క్యూబా అని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు. ఆరు దశాబ్దాలుగా కొనసాగు తున్న ఆర్థిక–వాణిజ్య ఆంక్షలు చాలవన్నట్లు ఈ ఏడాది జనవరిలో ట్రంప్ చమురు దిగ్బంధనాన్ని (ఆయిల్ ఎంబార్గో) ప్రకటించాడు. క్యూబాకు చమురు సరఫరా కాకుండా యూఎస్ నౌకాబలం అడ్డు కుంటున్నది. ముఖ్యంగా వెనిజులా నుండి చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. క్యూబా తన శక్తి అవసరాలకు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నది. దీనితో క్యూబాలో శక్తి సంక్షోభం ఏర్పడింది. ప్రతిరోజు 20–22 గంటల కరెంటు కోతలు సాధారణ మైనాయి. రవాణా స్తంభించింది. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెత్త రవాణాకు కూడా వాహనాలకు ఇంధనం లేక పోవటంతో హవానాతో సహా పలు పట్టణాలలో వీధులలో చెత్త పేరుకుపోయింది. ఆసుపత్రులలో కరెంటు కొరతతో పలు వైద్య సేవలు స్తంభించాయి. పాఠశాలలు, యూనివర్సిటీలు మూత పడ్డాయి. కోవిడ్ తరువాత కోలుకుంటున్న పర్యాటక రంగం కుదేల యింది. అమెరికా పథకం ప్రకారమే క్యూబా సమాజాన్ని ఒత్తిడి లోనికి నెట్టి వేసింది. క్యూబాతో వాణిజ్యం చేసే దేశాలు, సంస్థలపై ద్వితీయ శ్రేణి ఆంక్షలకూ సిద్ధమైంది. ఈ సంక్షోభం నుండి క్యూబా సమాజంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్యుద్ధం, తిరుగుబాటు కోసం యూఎస్ వేచి చూస్తుండవచ్చు.మూడు శక్తులు ‘ఒక్కటైతే’?నాణ్యమైన విద్య, వైద్యాన్ని చౌకగా అందించటంలో విజయం సాధించిన క్యూబా ఈ ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కోవటం కష్టమే. రష్యా, చైనా ఆర్థికంగా, సైనికపరంగా ప్రత్యక్షంగా క్యూబాకు దన్నుగా ఉండటం సందేహాస్పదమే. చైనా సౌర విద్యుత్ పలకల సరఫరా ద్వారా క్యూబా విద్యుత్ గ్రిడ్‌ను స్థిరీకరించటానికి ప్రయత్ని స్తున్నది. దీర్ఘకాలంలో మాత్రమే క్యూబా ఈ రంగంలో విజయం సాధించగలుగుతుంది. కానీ క్యూబాకు అంత సమయం లేదు. మెక్సికో లాంటి పొరుగు దేశాలు ఆహారం, మందులు, మానవతా సహాయం చేస్తున్నా, అవి యూఎస్‌ను ఎదిరించి క్యూబాకు సహాయ పడే సాహసం చేయలేవు. రష్యా ప్రస్తుత దృష్టి ఉక్రెయిన్‌పై, నాటోపై ఉన్నది. చైనా దృష్టి తైవాన్‌పై ఉన్నది. తైవాన్, ఉక్రెయిన్ విషయంలో అమెరికా మెతక వైఖరికి సిద్ధపడితే, ప్రతిగా రష్యా, చైనా మధ్య ప్రాచ్యం, కరేబియన్ ప్రాంతాల నుండి తమ దృష్టిని పూర్తిగా మరల్చ టానికి సిద్ధపడవచ్చును. దీనినే ‘గ్రేట్ పవర్స్ బార్గెయిన్’ అని పిలుస్తారు.బహుశా రష్యా, చైనాలతో లోపాయికారీ అంగీకారంతో క్యూబాపై ట్రంప్ పూర్తి స్థాయిలో దాడి చేయవచ్చు. కానీ క్యూబా గెరిల్లా పోరాట సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. పెద్ద మొత్తంలో రక్తపాతం సంభవిస్తుంది. క్యూబా నుండి పెద్ద మొత్తంలో యూఎస్‌కు వలసలు జరగవచ్చు. యూఎస్ ఈ రెండు పరిణా మాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో క్యూబన్ సంతతికి చెందినవాడు. ఈ పరిణామాలపై పూర్తి అవగాహన ఉండి ఉంటుంది. క్యూబాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి రావుల్ కాస్ట్రో అంగీకరిస్తే సమస్యకు శాంతియుత పరిష్కారం లభించినట్లవుతుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ ఐపీఓకు రికార్డు స్పందన
ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో(IPO)గా నిలిచిన ‘స్పేస్ఎక్స్’ (SpaceX) షేర్ల విక్రయానికి మదుపరుల నుంచి భారీ స్పందన లభించింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ రాకెట్, శాటిలైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐపీఓలో రిటైల్ పెట్టుబడిదారులు ఒక్కరే 100 బిలియన్ డాలర్లకు పైగా కొనుగోలు ఆర్డర్లు సమర్పించినట్లు బ్లూమ్‌బర్గ్, రాయిటర్స్ నివేదికలు వెల్లడించాయి.స్పేస్ఎక్స్ షేర్లు ఒక్కొక్కటి 135 డాలర్ల ధరకు విక్రయించగా, మొత్తం 555.6 మిలియన్ షేర్ల ద్వారా సుమారు 75 బిలియన్ డాలర్లు సమీకరించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 1.75 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించింది...కానీ అందరికీ షేర్లు దక్కవుస్పేస్ఎక్స్ ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కనీసం 20 శాతం షేర్లను కేటాయించినప్పటికీ, వచ్చిన డిమాండ్ ఆ కేటాయింపును అనేక రెట్లు మించి ఉంది. సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి కూడా భారీగా ఆర్డర్లు రావడంతో చాలా మంది చిన్న మదుపరులకు పూర్తి కేటాయింపు దక్కే అవకాశాలు తగ్గాయి. మొత్తం పెట్టుబడిదారుల డిమాండ్ 250 బిలియన్ డాలర్లను దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి.చైనా ఇన్వెస్టర్లకు నో!అమెరికా సాంకేతిక ఎగుమతి పరిమితుల కారణంగా చైనా ప్రధాన భూభాగం, హాంకాంగ్‌కు చెందిన ఇన్వెస్టర్ల ఆర్డర్లను స్పేస్ఎక్స్ ఐపీఓలో అంగీకరించలేదు. రాకెట్, ఉపగ్రహ, కృత్రిమ మేధస్సు రంగాలకు సంబంధించిన కీలక సాంకేతికత కారణంగా ఈ పరిమితులు అమల్లోకి వచ్చాయి.మస్క్‌కు మరో మైలురాయిస్పేస్ఎక్స్ ఐపీఓ విజయంతో ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యానికి మరో కీలక మైలురాయి చేరింది. అయితే కంపెనీ భారీ విలువ, ఇంకా లాభదాయకత సాధించని వ్యాపార నమూనా, భవిష్యత్ వృద్ధి అంచనాలపై మార్కెట్లో చర్చ కొనసాగుతోంది. అయినప్పటికీ, స్పేస్ఎక్స్ ఐపీఓ ప్రపంచ మూలధన మార్కెట్ల చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలవడం ఖాయం.చైనా, హాంకాంగ్ ఐపీఓల ముందు చిన్నదే!స్పేస్ఎక్స్ ఐపీఓకు వచ్చిన స్పందన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైనప్పటికీ, చైనా, హాంకాంగ్ మార్కెట్లలో కొన్ని ఐపీఓలు ఇంకా పెద్ద స్థాయిలో రిటైల్ ఆసక్తిని ఆకర్షించాయి. 2025లో షాంఘైలో చిప్ తయారీ సంస్థ మెటాఎక్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐపీవోకు సుమారు 3 ట్రిలియన్ యువాన్లు (దాదాపు 444 బిలియన్ డాలర్లు) విలువైన రిటైల్ బిడ్లు వచ్చినట్లు మార్కెట్ డేటా సూచిస్తోంది. అదే విధంగా హాంకాంగ్‌లో బబుల్-టీ దిగ్గజం మిక్సు గ్రూప్ ఐపీవోకు దాదాపు 1.8 ట్రిలియన్ హాంకాంగ్ డాలర్లు (సుమారు 230 బిలియన్ యూఎస్ డాలర్లు) ఆర్డర్లు నమోదయ్యాయి.చైనాలో ఐపీఓలకు అంత క్రేజ్ ఎందుకు?చైనా ప్రధాన భూభాగంలో కొత్తగా లిస్ట్ అయ్యే కంపెనీల షేర్లు మొదటి రోజే భారీ లాభాలు ఇవ్వడం సాధారణం. నియంత్రణ సంస్థలు ప్రారంభ ధరలను తక్కువగా ఉంచడం వల్ల ఇన్వెస్టర్లకు తొలి రోజు లాభాలపై అధిక నమ్మకం ఏర్పడింది. దీంతో లక్షలాది మంది చిన్న మదుపరులు ఐపీఓలను ఒకరకమైన "లాటరీ అవకాశం"గా భావిస్తూ దరఖాస్తు చేస్తుంటారు.హాంకాంగ్‌లో అయితే బ్రోకరేజీలు సులభంగా మార్జిన్ రుణాలు ఇవ్వడం వల్ల పెట్టుబడిదారులు పెద్ద మొత్తాల్లో అప్పు తీసుకుని కూడా ఐపీఓలకు దరఖాస్తు చేస్తుంటారు. తదుపరి టెక్ దిగ్గజాన్ని కోల్పోతామనే భయం (FOMO) కూడా ఈ ఉత్సాహానికి కారణమవుతోంది. -
‘డ్రాగన్ మిలిటరీతో వీటికి సంబంధం ఉంది’
ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో దూసుకుపోతున్న చైనా కంపెనీలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. చైనా సైన్యానికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా సహకరిస్తున్నాయనే అనుమానంతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఎనర్జీ, బ్యాటరీ తయారీ సంస్థలతో పాటు ప్రముఖ టెక్ దిగ్గజాలను అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తన ‘మిలిటరీ లింక్డ్ కంపెనీ’ల బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఇటీవల విడుదల చేసిన ఈ తాజా జాబితా అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చకు దారితీసింది.బ్లాక్‌లిస్ట్‌లోకి చేరిన ప్రముఖ కంపెనీలుఅమెరికా రక్షణ శాఖ ఆంక్షల పరిధిలోకి తెచ్చిన చైనా కంపెనీల్లో గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తున్న టాప్ బ్రాండ్లు ఉన్నాయి. సోలార్ ఎనర్జీ విభాగంలో.. అతిపెద్ద సోలార్ ప్యానెల్ తయారీదారులైన ట్రినా సోలార్, జేఏ సోలార్ టెక్నాలజీ ఉన్నాయి. ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో గ్లోబల్ లీడర్లుగా ఉన్న ఈవ్ ఎనర్జీ, సీఏఎల్‌బీ గ్రూప్ సంస్థలున్నాయి. చైనా ఈ-కామర్స్‌లో కీలకంగా ఉన్న అలీబాబా, ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ప్రొవైడర్ బైడు, బయోటెక్నాలజీ సంస్థ వుజి యాప్ టెక్ ఉన్నాయి.అమెరికా చట్టం ఏం చెబుతోంది?పెంటగాన్ నిబంధనల ప్రకారం, ఈ మిలిటరీ లింక్డ్ జాబితాలో చేరిన కంపెనీలపై అమెరికా కఠినమైన ఆంక్షలు విధిస్తుంది. అమెరికా రక్షణ శాఖ ఈ కంపెనీలతో నేరుగా ఎలాంటి వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. 2027 నాటికి థర్డ్ పార్టీల ద్వారా కూడా ఈ కంపెనీల ఉత్పత్తులను లేదా సేవలను కొనుగోలు చేయకుండా పూర్తిస్థాయిలో పరిమితులు అమల్లోకి వస్తాయి.కంపెనీలు ఏం చేయబోతున్నాయి?అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా కంపెనీలు తీవ్రంగా స్పందించాయి. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నాయి. దీనిపై ట్రినా సోలార్ స్పందిస్తూ.. తాము ఎలాంటి సైనిక సంబంధిత కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదని ట్రినా సోలార్ స్పష్టం చేసింది. అమెరికా నిర్ణయం పూర్తిగా నిరాధారమైనదని కొట్టిపారేసింది. ‘అమెరికా ప్రభుత్వం వెంటనే ఈ పొరపాటు నిర్ణయాన్ని సరిదిద్దుకోవాలి. అంతర్జాతీయంగా న్యాయమైన, సమానమైన, వివక్ష లేని వ్యాపార వాతావరణాన్ని కల్పించాలి. దీన్ని సవాలు చేస్తూ ఇప్పటికే చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాం’ అని ట్రినా సోలార్ ఒక అధికారిక ప్రకటనలో డిమాండ్ చేసింది.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త
భార్య వైద్య అవసరాల కోసం నానా పాట్లు డుతోంటే భర్త ఏకంగా రూ. 19 కోట్లను దాచిపెట్టి, తనకు కనీసం 35 వేలు ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టాడని ఒక మహిళ వాపోయిన వైనం సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక ప్రకారం,తన భర్త తనకు తెలియకుండా ఇన్నాళ్లుగా సుమారు 14 మిలియన్ యువాన్లను (దాదాపు రూ.19 కోట్లు) రహస్యంగా ఉంచాడని చైనాకు చెందిన 53 ఏళ్ల మహిళ గుర్తించింది. ఒక పక్క తాను దాదాపు రూ. 95వేల వైద్య బిల్లులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండగా, ఆయన మాత్రం విలాసంగా జీవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త ఆస్తులన్నింటినీ రహస్యంగా ఉంచాడనిఆరోపించింది. విడాకుల ప్రక్రియ సమయంలో ఆర్థిక రికార్డులను పరిశీలించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది. తన ఆదాయాన్నిగానీ, ఆస్తులను గానీ ఎపుడూ వెల్లడించలేదని వాపోయింది. ఇంతకాలం అవగాహన లేక అతని ఆస్తిపాస్తులపై పట్టించుకోలేదని వాపోయింది.వైద్య ఖర్చులకు ఇబ్బందులుఇంత సంపద దాచిపెట్టినప్పటికీ, తన భర్త కనీస ఆర్థిక సాయం చేయడానికి కూడా నిరాకరించాడని వాంగ్ ఆరోపించింది. తనకు నెలకు ఇవ్వాల్సిన 2,500 యువాన్ల (సుమారు రూ.35,000) అలవెన్స్‌ను ఇచ్చేందుకు నిరాకరించాడని, అలాగే తన వైద్య చికిత్సకు ఒక్క రూపాయికూడా సహాయం చేయలేదని ఆమె పేర్కొంది. బీజింగ్‌లో చికిత్స పొందుతున్న సమయంలో చాలా పొదుపుగా జీవించాల్సి వచ్చిందని. అద్దె తక్కువ ఇంట్లో ఉంటూ, చౌక ధరల బట్టలు ధరిస్తూ , వైద్య ఖర్చులు భరించే స్తోమత లేక ఇబ్బందులు పడ్డాడని వెల్లడించింది. ఈ సమయంలో తన భర్త మాత్రం బ్రాండెడ్ వస్తువులు, కాస్మెటిక్ ట్రీట్మెంట్ల కోసం విపరీతంగా ఖర్చు చేసేవాడని ఆమె ఆరోపించింది.గృహహింస, శారీరక దాడి ఈ కేసులో తీవ్రమైన గృహహింస ఆరోపణలు మరో ముఖ్యమైన అంశం. భర్త చేతిలో పదేళ్ల పాటు శారీరక హింసను భరించింది. ఆమె కొట్టిన దెబ్బలు పక్కటెముకలు విరగడమే కాకుండా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించిన 100 కి పైగా ఫోటోలను ఆమె ఆధారాలుగా చూపించింది. ఈ శారీరక హింస , ఆర్థిక నియంత్రణ వల్లే తాను తీవ్రమైన డిప్రెషన్‌కు, ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
అంతరిక్షంలో దాయాది దొంగ దెబ్బ.. భారత్‌కు సవాల్!
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తుపాకులు తాత్కాలికంగా శాంతించినప్పటికీ, తెరవెనుక దాయాది దేశం భారత్‌ను దెబ్బతీయడానికి భారీ వ్యూహాన్ని రచిస్తోంది. అంతరిక్షంలో సరికొత్త గూఢచారి ఉపగ్రహాల నెట్‌వర్క్‌ను నిర్మిస్తూ, భారత్‌పై నిరంతర నిఘా పెడుతోంది. ‘ది ప్రింట్’ పరిశోధనాత్మక కథనం ప్రకారం.. గత 16 నెలల వ్యవధిలోనే (జనవరి 2025 నుండి జూన్ 2026 మధ్య) పాకిస్తాన్ ఏకంగా 6 ఎర్త్-అబ్జర్వేషన్ (భూ-నిఘా) ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ ఉపగ్రహాలన్నీ భారత భూభాగాన్ని ప్రతి రెండు రోజులకు ఒకసారి క్షుణ్ణంగా మ్యాపింగ్ చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చైనా వెన్నుదన్ను.. అసాధారణ వేగంపాకిస్తాన్ అంతరిక్ష సంస్థ ‘సుపార్కో’ (SUPARCO) 1961లో ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటివరకు కేవలం 15 ఉపగ్రహాలను ప్రయోగిస్తే, అందులో 6 ఉపగ్రహాలను కేవలం ఈ 16 నెలల్లోనే ప్రయోగించడం గమనార్హం. చైనా సాంకేతిక, లాంచ్ మద్దతుతోనే పాక్ ఈ అసాధారణ వేగాన్ని అందుకోగలిగింది. జనవరి 2025లో 'PAUSAT-1', 'PRSC-EO1' ప్రయోగాలతో మొదలైన ఈ సిరీస్, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 'PRSC-EO3' వరకు చేరింది. ఒకప్పుడు నత్తనడకన సాగిన పాక్ స్పేస్ ప్రోగ్రామ్, ఉన్నట్టుండి ఉసేన్ బోల్ట్ వేగంతో దూసుకుపోవడం వెనుక చైనా హస్తం స్పష్టంగా కనిపిస్తోందని మాజీ ఇస్రో అధికారులు అభిప్రాయపడుతున్నారు.కశ్మీర్ లక్ష్యంగా ప్రత్యేక కక్ష్యసాధారణంగా నిఘా ఉపగ్రహాలను సన్-సింక్రోనస్ కక్ష్యల్లో ఉంచుతారు. అయితే, పాకిస్తాన్ ఇటీవల ప్రయోగించిన 'PRSC-EO3' ఉపగ్రహాన్ని అమెరికాకు చెందిన స్పేస్ సంస్థ 'COMSPOC' విశ్లేషించింది. ఇది సాధారణ కక్ష్యలో కాకుండా 38 డిగ్రీల వంపు (Inclined Orbit) ఉన్న ప్రత్యేక కక్ష్యలో తిరుగుతోంది. దీనివల్ల గ్లోబల్ కవరేజ్ తగ్గినప్పటికీ, భారత్, కశ్మీర్ ప్రాంతాలపై ఈ ఉపగ్రహం రోజుకు పలుమార్లు ప్రయాణిస్తూ అత్యంత నిశితమైన నిఘా వేయడానికి వీలవుతుంది. ఈ హైపర్‌స్పెక్ట్రల్ ఉపగ్రహాల వల్ల భూమిపై ఆర్మీ కదలికలు, దాచి ఉంచిన ఆయుధ సంపత్తిని కూడా పాక్ సులువుగా గుర్తించగలదు.భారత్‌కు పెరుగుతున్న సవాళ్లుఒకవైపు పాకిస్తాన్ అంతరిక్ష నిఘాను పటిష్టం చేసుకుంటుంటే, మరోవైపు గత ఏడాది కాలంలో భారత్ మూడు వ్యూహాత్మక ఉపగ్రహ మిషన్లలో (EOS-N1, EOS-09, NavIC NVS-02) వైఫల్యాలను ఎదుర్కొంది. సరిహద్దుల్లో సైనిక కదలికలు, హిందూ మహాసముద్రంలో నౌకాదళ ఆస్తులను కాపాడుకోవడానికి భారత్ తన సొంత అంతరిక్ష నిఘా సామర్థ్యాన్ని తక్షణమే పెంచుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
కృత్రిమ మాయలో మనిషి
‘కృత్రిమ మేధ’గా మనం చెప్పుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ‘కపటి’ అనే అర్థంలో నిజంగానే కృత్రిమంగా మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తెలుగులో ‘నకిలీ తెలివి’ లాంటి మాటల్ని వెతుక్కునే లోపలే అది నకిలీ విన్యాసాలలో చిత్రవిచిత్రమైన లోతులు చూస్తోంది. ఒక చేత్తో సానుకూలపు పూల బాణాలనూ, ఇంకోచేత్తో ప్రతికూలపు వాడిబాణాలనూ ప్రయోగిస్తూ జనాన్ని ఏకకాలంలో మోహపారవశ్యంలోనూ, భయవిభ్రమాల్లోనూ ముంచెత్తుతోంది. అనుకూల ఫలితాలపై ఆశపడుతూనే, ప్రతికూల ప్రభావాలనుంచి తప్పించుకునే మార్గాల వేటలో ప్రపంచం తలమునకలవుతోంది. భారత్, చైనా, రష్యా సహా పది దేశాలు సభ్యులుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి కృత్రిమ మేధో వినియోగంలో, అభివృద్ధిలో, దానితో ముడిపడిన నైతిక సమస్యల నివారణలో, మేధో హక్కులూ, డేటా పరిరక్షణలో కలసి పనిచేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా, సాంస్కృతిక రంగంలో కృత్రిమ మేధో దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుపుతోంది; ఒక సమావేశానికి ప్రపంచ పురాతన నగరాలలో ఒకటైన వారణాసి వేదిక కాబోతోంది. కృత్రిమ మేధ ఏం చేస్తోందంటే, ఒక సాంకేతిక మహాద్భుతంగా మాయామేయ మాంత్రిక జగత్తును సృష్టిస్తూ పురాణ, ఇతిహాస, జానపద కథల కాలంలోకి తీసుకెడుతోంది. రామాయణంలో భర్త శాపానికి గురై అహల్య శిలగా మారిపోవడం, రాముని పాదాలు తాకగానే పూర్వరూపం తెచ్చుకోవడం గురించి చదివాం; ‘జగదేకవీరుని కథ’ సినిమాలో జలక్రీడలాడుతున్న దేవకన్యలను చూసిన పాపానికి వారి శాపానికి ఎరై కథానాయకుడు శిలగా మారిపోవడం, ఒక వృద్ధ మహిళ అతనికి శాపవిముక్తి కలిగించడం చూశాం. త్రిశంకుని స్వర్గానికి పంపించే ప్రయత్నంలో అతణ్ణి మధ్యలోనే స్తంభింపజేసి ‘త్రిశంకు స్వర్గా’న్ని సృష్టించిన విశ్వామిత్రుని పునఃసృష్టి పాటవాన్ని కథల్లో దర్శించాం. రామాయణంలో ఇంద్రజిత్తు చేసే మబ్బుచాటు మాయావి యుద్ధాన్నీ, మహాభారతంలో సైంధవుని వధ సందర్భంలో కృష్ణుడు చక్రం అడ్డేసి కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టించడాన్నీ తిలకించాం. తన అర్ధాంగి పార్వతి అభ్యంగన స్నానానికి వెడుతూ నలుగుపిండి నుంచి సృష్టించి కాపలాపెట్టిన బాలుడు తనను అడ్డగించినందుకు శివుడు ఆగ్రహించి అతని శిరస్సును ఖండించడం; నిజం తెలిసి అతనికి ఏనుగు తలను అతికించి, బతికించడం గురించి విన్నాం. తలలు తీసి తలలు పెట్టడంతో సహా కృత్రిమ మేధ ఇలాంటి చిత్రవిచిత్ర సన్నివేశాలను అవలీలగా సృష్టించగలుగుతోంది. అవి కపటత్వపు అంచులు తాకుతూ ప్రసిద్ధ వ్యక్తుల శీలహననానికి పాల్పడుతూ వివాదాస్పదమవుతున్నాయి; నిజమో, అబద్ధమో తెలియని త్రిశంకు స్థితికి జనాన్ని నెడుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీనటులతో సహా ప్రముఖుల రూపాలనూ, గొంతులనూ వాడుకుంటూ అభ్యంతరకర సన్నివేశాలను సృష్టించడం, వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తున్నాం. పూర్తి సాంకేతిక నైపుణ్యాలూ, సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడుకోవాలనే స్పృహ లేనివారికి కూడా కృత్రిమ మేధ అందుబాటులోకి రావడం వల్ల తలెత్తే ఇలాంటి వైపరీత్యాలతో కూడా పురాణ, ఇతిహాస కథలతో పోలిక కుదరడం మరో వైచిత్రి. ఉదాహరణకు, మహాభారతంలోని అశ్వత్థామతో ముడిపడిన ఒక ఉదంతాన్నే చూస్తే, కురుక్షేత్ర యుద్ధాంతంలో అతను ఉపపాండవులను వధించి పారిపోయినప్పుడు అతణ్ణి పట్టుకోవడానికి భీముడు బయలుదేరివెడతాడు; అశ్వత్థామ క్రూరుడనీ, చపలచిత్తుడనీ; అతని దగ్గర ‘బ్రహ్మశిరోనామక’మనే దివ్యాస్త్రం ఉందనీ, దాని ప్రయోగమే తప్ప ఉపసంహారం అతనికి తెలియదనీ కృష్ణుడు అర్జునుడితో చెప్పి భీముని కాపాడుకోవడానికి తక్షణమే వెళ్ళాలంటాడు; ఊహించినట్టే అశ్వత్థామ దానిని ప్రయోగించడం, ప్రయోగోపసంహారాలు రెండూ తెలిసిన అర్జునుడు అదే అస్త్రంతో దానిని శాంతింపచేయబోవడం చూస్తాం. మనిషి– తన మేధ సృష్టించిన కృత్రిమ మేధముందు తనే చిత్తవుతున్నాడు. మాంత్రికతనుంచి వాస్తవికతవైపు వెడుతున్న భ్రమలో ఉన్న మనిషిని కృత్రిమ మేధ తిరిగి మాంత్రికతవైపు మళ్ళిస్తూ పైచేయిని చాటుకుంటోంది. తను సృష్టించిన సాంకేతికత చేతిలో తనే ఓడి దిక్కులు చూసే పరిస్థితిని తెచ్చుకోవడం మనిషిని తొలినుంచి వెంటాడుతున్న శాపం. -
తైవాన్ నేర్పే ఆర్థిక పాఠాలు
కేవలం ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆది లాబాద్ జిల్లాలను కలిపినంత భూభాగం; జనాభా పరంగా ఇంచుమించు మన దేశంలోని ఓ పెద్ద మహానగరంతో సమానం (2.3 కోట్లు) – అదే దశాబ్దాలుగా చైనా నుంచి తీవ్రమైన ఒత్తిడి నెదుర్కొంటున్న తైవాన్ దేశం. కానీ గత మే నెలలో ఈ చిన్న ద్వీపదేశం స్టాక్ మార్కెట్ సంపద విలువ ఏకంగా 4.95 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకి, 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశ స్టాక్ మార్కెట్‌ను స్వల్పంగా అధిగమించింది. దాంతో తైవాన్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించడం ప్రపంచాన్ని విస్మయపరిచింది. ఆ ఒక్క కంపెనీఒకప్పుడు వ్యవసాయం, పశుపోషణ, చేపలవేట వంటి మౌలిక వృత్తులపై ఆధారపడిన తైవాన్ – 70వ దశకంలో ఆర్థిక మంత్రి కేటీ లీ వంటి దీర్ఘదృష్టి గల నాయకుల సారథ్యంలో సాంకేతికత వైపు మళ్లింది. అప్పట్లో మైక్రోచిప్స్ రంగం అమెరికా, జపాన్ బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యంలో ఉండేది. అందులో పొంచి ఉన్న అవకా శాన్ని పసిగట్టిన తైవాన్, అమెరికాలో అప్పటికే విశేషానుభవం గడించిన మోరిస్ చాంగ్ అనే స్వదేశీయుణ్ణి ప్రోత్సహించింది. ఆ నేపథ్యంలో 1987లో సాధారణ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ప్రారంభ మైన టీఎస్ఎంసీ (తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ), నేడు అంతర్జాతీయ కాంట్రాక్ట్ చిప్ తయారీ రంగంలో దాదాపు 70% వాటాతో ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసిస్తోంది. 80,000 మందికి పైగా అత్యున్నత నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలను కలిగి ఉన్న టీఎస్ఎంసీ, తైవాన్ స్టాక్ మార్కెట్ సంపదలో సుమారు 42–44% వాటా కలిగి ఉంది.ప్రపంచం నేడు స్మార్ట్ఫోన్ల నుండి కృత్రిమ మేధ ఆధారిత సూపర్ కంప్యూటర్ల వరకు అవసరమైన చిప్స్ కోసం తైవాన్‌పై ఆధారపడుతోంది. దాంతో ఈ చిన్న చిప్లే చైనా వంటి శక్తిమంత మైన దేశంతో నిరంతర ప్రమాదం పొంచివుండే ఆ దేశానికి, అదృశ్య రక్షణ కవచంగా మారాయి. తైవాన్ దాడికి గురైతే, ఈ చిప్‌ల సరఫరాకు అంతరాయం ఏర్పడి తమ ఆర్థిక వ్యవస్థలకు ముప్పు తప్పదనే భయంతో పాశ్చాత్య దేశాలు, కూటములు తైవాన్ రక్షణకు బాసటగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయంగా, తైవాన్ పొందే ఈ రక్షణ ‘సిలికాన్ షీల్డ్’ (సిలికాన్ రక్షణ కవచం)గా పేరొందింది. ప్రభుత్వ–ప్రైవేట్–విదేశీ సహకారం2016లో తైవాన్ మార్కెట్ విలువ 820 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా, భారత్ 1.45 ట్రిలియన్ డాలర్లతో ముందుంది. గత పదేళ్లలో భారత్ గణనీయంగా వృద్ధి చెందినా, తైవాన్ మరింత వేగంగా పరుగులు తీసింది. భారత్ బ్యాంకింగ్, ఐటీ సేవలు, విని యోగ వస్తువులు, ఇంధనం వంటి వివిధ రంగాలపై దృష్టి సారిస్తే; తైవాన్ తన శక్తియుక్తులను చిప్ తయారీ వంటి హార్డ్‌వేర్ రంగంపై కేంద్రీకరించడం దీనికి ప్రధాన కారణం. మన వ్యవస్థలు ఎక్కువగా దేశీయ వినియోగంపై ఆధారపడి నడుస్తుంటే; తైవాన్ మాత్రం ప్రపంచ దేశాల సాంకేతికావసరాలను తీర్చుతూ అంతర్జాతీయ పెట్టుబడులను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. అయితే, 143 కోట్ల జనాభా వినియోగావసరాలను తీర్చడానికి మన దేశం ప్రాధాన్యత నివ్వడం కూడా ఆక్షేపణీయం కాదు.తైవాన్ విజయం వెనుక టీఎస్ఎంసీ ఒక్కటే కాదు– ఆ దేశ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న పారిశ్రామిక క్లస్టర్ల విధానం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. సిన్చు సైన్ ్స పార్క్‌లో చిప్ డిజైన్ కంపెనీలు, తైచుంగ్ ఇండస్ట్రియల్ పార్క్‌లో రోబోటిక్స్, కచ్చిత యంత్రాల తయారీ పరిశ్రమలు... వనరులు, సాంకేతికత మార్పిడి వంటి అంశాల్లో పరస్పరం అనుసంధానమై పని చేస్తు న్నాయి. ప్రభుత్వ–ప్రైవేట్–విదేశీ సంస్థల మధ్య సహకారం, ఫిలిప్స్ వంటి దిగ్గజాల నుండి సాంకేతికత సరఫరా, అమెరికా విపణులతో సంబంధాలు ఈ వ్యవస్థను పటిష్ఠపరిచాయి. దీనికి తోడు, విద్యావిధానాన్ని పరిశ్రమల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, విశ్వవిద్యాలయాలను నైపు ణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చారు. అమెరికా సిలికాన్ వ్యాలీలో స్థిరపడిన తైవాన్ మేధావులను తిరిగి రప్పించడానికి పన్ను మినహా యింపులు, పరిశోధనా నిధులు వంటి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో, ఆ మానవ వనరులు దేశాభివృద్ధికి పునరంకితమయ్యాయి.అయినప్పటికీ ఈ నమూనా బలహీనతలకు అతీతం కాదు. ఒకే కంపెనీపై గణనీయంగా ఆధారపడ్డ సెమీకండక్టర్ రంగం తైవాన్ జీడీపీలో సుమారు 18–20% వాటా కలిగి ఉంది. ఈ పరిణామం ‘డచ్ డిసీజ్’ లాంటి సంక్షోభం తెచ్చిపెట్టే ప్రమాదం పొంచి ఉంది. 1960ల కాలంలో నెదర్లాండ్స్ (డచ్) అప్పుడప్పుడే అన్వేషించ బడుతున్న సహజ వనరులపైనే పూర్తి దృష్టిని కేంద్రీకరించడంతో, ఇతర రంగాలు బలహీనపడ్డాయి. అలా ఏదైనా ఒక రంగంపై దేశం అధికంగా ఆధారపడితే వచ్చే దుష్పరిణామాలను సూచించడానికి ఈ పదం వాడతారు. చిప్‌లకు ప్రత్యామ్నాయాలు ఆవిర్భవించినా లేదా అమెరికా, దక్షిణ కొరియా, భారత్ వంటి కొత్త పోటీదారులు పుంజుకున్నా దేశ ఆర్థిక, పారిశ్రామిక రంగాలు చిక్కుల్లో పడతాయి. అంతేకాకుండా పరిమిత వనరులు కలిగిన ఆ దేశం విద్యుత్ సర ఫరాలో అంతరాయాలు, నీటి ఎద్దడి, వృద్ధాప్యానికి చేరువవుతున్న జనాభా, నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత వంటి సవాళ్లను ఎదు ర్కొంటోంది. అన్నింటికంటే పెద్ద ముప్పు – దేశ సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేయగలిగిన చైనా సైనిక–రాజకీయ ఒత్తిడి. పారిశ్రా మికాభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చిన తైవాన్, తొలినాళ్ళలో వీటిపై దృష్టి సారించలేదు. మనమేం చేయొచ్చు?సవాళ్లను అధిగమిస్తూ తైవాన్ సాధిస్తున్న విజయాలు వర్ధమాన దేశాలకు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. భారతదేశం, ముఖ్యంగా సెమీకండక్టర్ రంగంలో ముందుకు సాగుతున్న తెలుగు రాష్ట్రాలు, తైవాన్ పురోగతిని నిశితంగా పరిశీలించాలి. భారత్ ప్రభుత్వం ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ ద్వారా వేల కోట్లు పెట్టుబడి పెట్టడం, ప్రస్తుత కృత్రిమ మేధ యుగంలో సరైన ముందడుగే. కానీ కేవలం భారీ ఉత్పత్తి సామర్థ్యాలు సమకూర్చుకోవడంతో పాటుగా, తైవాన్ తరహా సమగ్రమైన సరఫరా శృంఖలలను సృష్టించగలగాలి. నైపుణ్యాలను పెంపొందించే విద్యా విధానం, వ్యతిరేక దిశలో మేధో వలసలు, పారిశ్రామిక సముదాయాలు, విడిభాగాల ఉత్పత్తికేంద్రాలు, సాంకేతికత మార్పిడి, మార్కెటింగ్ అనుసంధానం– ఇవన్నీ అందులో అంతర్భాగాలు కావాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో ప్రతిభ చూపుతున్న మన తెలుగు యువత – తమ నైపుణ్యాలను హార్డ్‌వేర్ రూపకల్పన, చిప్ తయారీ, సరఫరా గొలుసుల కూర్పు వైపు కూడా విస్తరించాలి. ఇందుకోసం మన తెలుగు రాష్ట్రాలు కేవలం ఐటీ సేవలకే పరిమితం కాకుండా, ప్రత్యేక ఎలక్ట్రానిక్స్ రూపకల్పన, ఉత్పత్తి పారిశ్రామిక వాడలను నిర్మించాలి. విద్యారంగాన్ని సరిహద్దులు దాటించి, అంతర్జాతీయ చిప్ సంస్థలతో ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధనలు, తైవాన్ లాంటి దేశాల సందర్శనలు వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలి. ఏఐ వల్ల సాఫ్ట్వేర్ రంగం ప్రభావితమవ్వబోతోందన్న ఆందోళనకు ఇదో చక్కటి పరిష్కారం కూడా!పల్లపోతు కృష్ణబాలాజివ్యాసకర్త విశ్రాంత ఉన్నతాధికారి, ఎస్.బి.ఐ. -
భారత్‌లోకి జెటూర్ టీ2.. ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ!
ఆటోమొబైల్ మార్కెట్లో బలమైన స్థానం సంపాదించాలనే లక్ష్యంతో జేఎస్‌డబ్ల్యు మోటార్స్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ చెరీ ఆటోమొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. త్వరలో ఈ రెండు కంపెనీల తొలి ఉత్పత్తిగా 'జెటూర్ టీ2' (Jetour T2) ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్ చేయనున్నాయి.జెటూర్ టీ2 కారు ఇండియన్ మార్కెట్లో 2026 దీపావళి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిని మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జేఎస్‌డబ్ల్యు ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌లో అసెంబుల్ చేయనున్నారు. ఈ కారు ధర రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.జెటూర్ టీ2 ఇండియన్ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ మెజెస్టర్, స్కోడా కోడియాక్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ కారు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టం పొందుతుంది. కాబట్టి మైలేజ్ గణనీయంగా పెరుగుతుంది.అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతున్న జెటూర్ టీ2లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 26.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. సింగిల్ మోటార్ ఫ్రంట్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ అనే రెండు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీతో ఈ వాహనం కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 139 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది.ఫీచర్ల విషయానికి వస్తే.. జెటూర్ టీ2లో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 12 స్పీకర్ల సోనీ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. అదనంగా లెవల్-2 ఏడీఏఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.గ్లోబల్ మార్కెట్లలో జెటూర్ టీ2 మోడల్ ఎలక్ట్రిక్ వెర్షన్లో కూడా లభిస్తున్నప్పటికీ, భారతదేశంలో మాత్రం ప్రారంభ దశలో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌ను మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే.. ఈ కారు లేటెస్ట్ టెక్నాలజీ, మెరుగైన ఇంధన సామర్థ్యం, ప్రీమియం ఫీచర్లతో ఎస్యూవీ విభాగంలో గట్టి పోటీ ఇస్తుందని పలువురు భావిస్తున్నారు. -
చైనా దాచిన నిజాలు.. 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి!
ప్రజాస్వామ్యం కోసం వీధుల్లోకి వచ్చిన వేలాది మంది యువత.. ట్యాంకులతో వారిపై విరుచుకుపడిన సైన్యం.. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన 1989 టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ ఇప్పటికీ చైనా చరిత్రలో చెరగని మచ్చగానే మిగిలింది. ఈ ఘటనకు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా నాటి ఉద్యమానికి సంబంధించిన మరికొన్ని అరుదైన చిత్రాలు వెలుగులోకి రావడంతో ప్రపంచ దృష్టి మరోసారి ఆ రక్తచరిత్రపైకి మళ్లింది.ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకని ఘటనల్లో టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ ఒకటి. ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం వేలాది మంది విద్యార్థులు, యువకులు వీధుల్లోకి రావడం.. ఆ ఉద్యమాన్ని చైనా ప్రభుత్వం ట్యాంకులు, సైన్యంతో అణచివేయడం.. వందల మంది, మరికొందరి అంచనాల ప్రకారం వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం.. ఇవన్నీ చైనా చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోయాయి.1980ల చివర్లో చైనా వేగంగా ఆర్థిక సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, రాజకీయ స్వేచ్ఛలు మాత్రం కఠిన నియంత్రణలోనే ఉండేవి. అవినీతి పెరుగుతోందన్న విమర్శలు, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు, ప్రజాస్వామ్య సంస్కరణలపై యువతలో పెరుగుతున్న ఆకాంక్షలు దేశవ్యాప్తంగా అసంతృప్తికి దారితీశాయి. ఈ నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన సంస్కరణవాది నేత హు యాబాంగ్ మరణం ఉద్యమానికి నాంది పలికింది.హు యాబాంగ్ను విద్యార్థులు, మేధావులు మార్పుకు ప్రతీకగా భావించేవారు. ఆయన మరణం తర్వాత 1989 ఏప్రిల్‌లో వేలాది మంది విద్యార్థులు బీజింగ్‌లోని టియానన్మెన్ స్క్వేర్‌కు చేరుకున్నారు. మొదట ఇది కేవలం సంతాప సభగానే ప్రారంభమైనప్పటికీ, క్రమంగా అవినీతి వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య సంస్కరణలు, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం భారీ ఉద్యమంగా రూపాంతరం చెందింది.రోజులు గడిచేకొద్దీ నిరసనల తీవ్రత పెరిగింది. విద్యార్థులతో పాటు కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ పౌరులు కూడా ఉద్యమంలో చేరారు. లక్షలాది మంది స్క్వేర్‌లో గుమికూడడంతో బీజింగ్ అంతర్జాతీయ మీడియా దృష్టిలోకి వచ్చింది. ఒక దశలో ఈ ఉద్యమం చైనా కమ్యూనిస్టు పాలనకే సవాలుగా మారిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన ప్రభుత్వం మే నెలలో మార్షల్ లా ప్రకటించింది. ఆ తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జూన్ 3 రాత్రి నుంచి జూన్ 4 తెల్లవారుజామున వరకు సైన్యం ట్యాంకులు, సాయుధ బలగాలతో బీజింగ్‌లోకి ప్రవేశించి నిరసనలను అణచివేసింది. ఆ రాత్రి ఏం జరిగిందన్నది ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా లేకపోయినా, ప్రత్యక్ష సాక్షులు మరియు అంతర్జాతీయ మీడియా నివేదికలు వందల నుంచి వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని సూచిస్తున్నాయి. చైనా ప్రభుత్వం మాత్రం అధికారిక మరణాల సంఖ్యను ఇప్పటికీ వెల్లడించలేదు.ఈ ఘటనలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దృశ్యం “ట్యాంక్ మ్యాన్”. ట్యాంకుల వరుస ముందు ఒంటరిగా నిలబడి వాటిని అడ్డుకున్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికీ తెలియదు. కానీ ఆ చిత్రం ప్రభుత్వ శక్తికి ఎదురుగా వ్యక్తి ధైర్యానికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయింది.ఇప్పుడు 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన కొత్త చిత్రాలు ఆ రోజుల్లోని ఉద్రిక్త వాతావరణాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. స్క్వేర్‌లో గుమికూడిన విద్యార్థులు, తాత్కాలిక శిబిరాలు, ప్రజల రద్దీ, సైనిక కదలికలు, ఆందోళనల మధ్య నెలకొన్న ఉద్విగ్న పరిస్థితులు ఈ ఫొటోల ద్వారా మరోసారి ప్రపంచం ముందు ప్రత్యక్షమవుతున్నాయి. చరిత్రలో నమోదు కాని కొన్ని క్షణాలను కూడా ఇవి వెలుగులోకి తీసుకొస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.టియానన్మెన్ ఘటనలో కీలక పాత్ర పోషించిన హు యాబాంగ్ చైనా కమ్యూనిస్టు పార్టీలో సంస్కరణవాది నేతగా గుర్తింపు పొందారు. సాంస్కృతిక విప్లవ సమయంలో అన్యాయానికి గురైన వారికి పునరావాసం కల్పించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఆయనను ప్రజల్లో మరింత గౌరవనీయుడిగా మార్చాయి. 1987లో ఆయన పదవి నుంచి తప్పించబడ్డారు. 1989 ఏప్రిల్‌లో ఆయన మరణించడంతో విద్యార్థులు నివాళుల కోసం స్క్వేర్‌కు చేరుకోవడం చివరికి పెద్ద ఉద్యమంగా మారింది.ఈ ఘటనపై చైనాలో ఇప్పటికీ బహిరంగ చర్చలు పరిమితంగానే ఉన్నాయి. పాఠ్యపుస్తకాలు, మీడియా, సోషల్ మీడియా వేదికలపై కఠిన నియంత్రణ కొనసాగుతోంది. అయినప్పటికీ విదేశాల్లోని చరిత్రకారులు, మానవ హక్కుల సంస్థలు ప్రతి సంవత్సరం ఈ సంఘటనను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అణచివేత వల్ల ఈ ఉద్యమం లక్ష్యాన్ని సాధించకపోయినా, ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన చర్చల్లో అది ఒక శాశ్వత గుర్తుగా మిగిలిపోయింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ కొత్త చిత్రాలు ఆ పోరాటంలో నిలిచిన వేలాది యువత ఆశలు, భయాలు, ధైర్యానికి మరోసారి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
చైనా వినాశనం మొదలైంది! డ్రాగన్ కు ఊహించని షాక్!
-
చైనాలో ఘోరం.. 15 లక్షలు ఫాలోవర్స్ ఉన్న కుక్క 'చుటౌ'ను చంపేశారు
-
Viral: బాలుడి కడుపులో తన్నిన రోబో కుప్పకూలిన బుడ్డాడు
-
రోబో ఎంత పనిచేసిందంటే.. వీడియో వైరల్
చైనాలోని ఓ రోబో కలకలం రేపింది. షింజియాగ్లోని ఉర్మికి బొటానికల్ గార్డెన్లో బాలుడిపై రోబో దాడి చేసింది. బాలుడి పొట్టలో తన్నడంతో ఆ బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నేపథ్యంలో రోబోలపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలుడు తన కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి బొటానికల్ గార్డెన్‌కు వెళ్లాడు. అక్కడ హ్యూమనాయిడ్ రోబో ప్రదర్శనను చూడటానికి మిగతా ప్రేక్షకులతో కలిసి నిలబడటంతో అంతా బాగానే సాగుతోంది. కానీ అంతలోనే అనూహ్య మలుపు చోటుచేసుకుంది.ఆ రోబో హఠాత్తుగా ఆ చిన్న బాలుడి పొట్టలో తన్నింది. ఈ వీడియో ఈ క్షణాల్లో వైరల్ కావడంతో.. రోబోల చుట్టూ ఉండాల్సిన భద్రతా ప్రమాణాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ వీడియో క్లిప్‌లో కనిపించినట్లుగా.. ఆఫ్రో-స్టైల్ విగ్ ధరించిన ఆ హ్యూమనాయిడ్ రోబో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన చేస్తోంది. పిల్లలు, పెద్దలు ఆ వినూత్న ప్రదర్శనను ఆసక్తిగా చూస్తూ.. రికార్డ్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఆ రోబో ఫైటింగ్ స్టాన్స్‌లో ముందుకు అడుగు వేసి చుట్టూ తిరుగుతూ రౌండ్‌హౌస్ కిక్ ఇచ్చింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కాకపోయినప్పటికీ.. ఆ ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా చూస్తున్న పింక్ కలర్ టీ-షర్ట్, జీన్స్ ధరించిన ఓ బాలుడి పొట్టకు నేరుగా తగిలింది.A robot kicked a little boy in the stomachWe're officially one software update away from Terminatorpic.twitter.com/iO9jv2qUuf— Mario Nawfal (@MarioNawfal) June 4, 2026ఆ బాలుడు నొప్పితో విలవిలలాడుతుండగా.. పక్కనే ఉన్న మరో బాలుడు అతడిని రోబోకు దూరంగా వెనక్కి లాగాడు. అక్కడున్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, ఆ బాలుడికి తీవ్రమైన గాయాలేమీ కాలేదని తర్వాత ఓ వార్తా సంస్థ తెలిపింది. యంత్రం తప్పు చేసినప్పుడు బాధ్యత ఎవరిది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రోబో ఆ బాలుడిని తన్నినా.. జనాలు ఇంకా ఆ రోబో వైపే చూస్తున్నారా? బాలుడి వైపు దృష్టి సారించి.. అతడు బాగున్నాడా? లేదా? అని చూసే మానవత్వం మనలో ఎటుపోయింది? ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు."ఇది 'టెర్మినేటర్' సినిమా కాదు.. ఇక్కడ యంత్రాలు కావాలని హింసను ఎంచుకోవడం లేదు. అసలైన ప్రమాదం ఎక్కడ ఉందంటే.. హార్డ్‌వేర్ డెవలపర్లు భద్రతా ప్రమాణాలను పక్కనబెట్టి.. బహిరంగ కార్యక్రమాలలో యంత్రాలను అమాయకపు ఆటబొమ్మల్లా వదిలేస్తున్నారంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇది కేవలం ఒక ప్రమాదంగానే భావిస్తున్నా.. ఆ రోబో కావాలని ఆ చిన్నారిని తన్నలేదు. అది మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తున్నప్పుడు ఆ పిల్లాడు దాని దారికి అడ్డంగా వచ్చాడు.. అందుకే ఈ ఘటన జరిగిందని మరొకరు వ్యాఖ్యానించారు. -
భారత్‌ను దెబ్బకొట్టే ప్లాన్.. పాక్ కొత్త వ్యూహం!
ఇస్లామాబాద్: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ తన వైమానిక రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి కొత్త ఆయుధాలను సమీకరించాలనే వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చైనా తయారీ క్షిపణులు, టర్కీ డ్రోన్లపై మరింత ఆధారపడాలని పాకిస్థాన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పలు కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యూహం ద్వారా భారత్‌తో భవిష్యత్తులో జరిగే వైమానిక ఉద్రిక్తతలకు ఎదురుదెబ్బ ఇవ్వగల సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నది పాకిస్థాన్ ఉద్దేశంగా విశ్లేషకులు చెబుతున్నారు.కాగా, భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు దక్షిణాసియా భద్రతా సమీకరణాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. పాకిస్థాన్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి కొత్త సైనిక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా చైనా తయారీ క్షిపణులు మరియు టర్కీ డ్రోన్ టెక్నాలజీపై ఆధారపడే దిశగా అడుగులు వేస్తోంది. అయితే, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వినియోగించిన బహుళ-స్థాయి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, డ్రోన్ డిటెక్షన్ నెట్‌వర్క్‌లు మరియు రియల్ టైమ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసినట్లు రక్షణ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పరిణామం పాకిస్థాన్ సైనిక వ్యూహకర్తలకు తమ ప్రస్తుత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించేందుకు దారి తీసిందని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో భవిష్యత్ వైమానిక ఉద్రిక్తతలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవడం పాకిస్థాన్‌కు అత్యవసరంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా నివేదికల ప్రకారం, పాకిస్థాన్ తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో చైనా పాత్రను మరింత పెంచాలని యోచిస్తోంది. ఇప్పటికే పలు రకాల చైనా తయారీ రాడార్ వ్యవస్థలు మరియు క్షిపణులను ఉపయోగిస్తున్న పాకిస్థాన్, ఇప్పుడు మరింత అధునాతన సర్ఫేస్-టు-ఎయిర్ మరియు ఎయిర్-టు-ఎయిర్ మిసైల్ సిస్టమ్స్‌ను పొందేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వీటి ద్వారా శత్రు వైమానిక దాడులను ముందుగానే గుర్తించి అడ్డుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.టర్కీ డ్రోన్ టెక్నాలజీపై ఫోకస్ఇక, టర్కీతో ఉన్న రక్షణ సహకారాన్ని మరింత విస్తరించాలనే దిశలో పాకిస్థాన్ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా యుద్ధ డ్రోన్లు, కమికాజ్ డ్రోన్లు, లాంగ్-రేంజ్ UAVలు మరియు స్వార్మ్ డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ డ్రోన్లను భవిష్యత్ యుద్ధ పరిస్థితుల్లో రికానైసెన్స్ (గూఢచర్యం), లక్ష్య నిర్ధారణ మరియు దాడి సామర్థ్యాల కోసం ఉపయోగించాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.ఆయుధ పోటీ?విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చూపిన సామర్థ్యం పాకిస్థాన్ వ్యూహాత్మక ప్రణాళికలో మార్పులకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. డ్రోన్లు మరియు క్షిపణి దాడులు అనుకున్న స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో, రక్షణ మరియు దాడి సామర్థ్యాలను రెండింటినీ సమానంగా మెరుగుపరచాల్సిన అవసరం ఏర్పడిందని అంటున్నారు. ఈ కొత్త వ్యూహం అమలులోకి వస్తే దక్షిణాసియాలో ఆయుధ పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
నేపాల్ సరిహద్దులో చైనా జోక్యం..? భారత్ రియాక్షన్
న్యూఢిల్లీ: నేపాల్- భారత్ సరిహద్దు వివాదంలో నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఈ ద్వైపాక్షిక అంశంలో మూడో పక్షం ప్రమేయం అవసరం లేదని తేల్చిచెప్పింది. నిన్న (మంగళవారం) ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యల చేశారు.ఇటీవల నేపాల్ ప్రధాని బాలేంద్రషా కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాల్- భారత్ సరిహాద్దు వివాదంలో చైనా, బ్రిటన్లు జోక్యం చేసుకోవాలని కోరారు. తాజాగా భారత్ దీనిపై స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ "సరిహద్దు విషయాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించడానికి మేము ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నాము. భారత్-నేపాల్ మధ్య ఉన్న ఈ ద్వైపాక్షిక అంశంలో మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదనే విషయం సంబంధిత వర్గాలన్నింటికీ స్పష్టంగా అర్థం కావాలి" అని జైస్వాల్ పేర్కొన్నారు.సరిహద్దు సమస్యకు గల కారణాలుగండక్ నది మార్గం మారడం: 98% సరిహద్దు గుర్తింపు పూర్తయినప్పటికీ, గండక్ నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల కొన్ని ప్రాంతాలలో ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.గుర్తించబడిన సరిహద్దు ప్రాంతాలలో సరిహద్దు దాటి ఆక్రమణలు జరిగిన కేసులు ఉన్నాయి, ప్రస్తుతం వీటిని ఇరుదేశాలు కలిసి ఉమ్మడిగా మ్యాపింగ్ చేస్తున్నాయని పేర్కొన్నారు. కైలాష్ మానససరోవర్ యాత్ర వివాదంలిపులేఖ్ పాస్ ద్వారా భారత్ నిర్వహించ తలపెట్టిన కైలాష్ మానససరోవర్ యాత్రపై నేపాల్ గత నెలలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆ ప్రాంతం ఉత్తరాఖండ్‌లో భాగమని భారతదేశం ఎప్పటినుంచో స్పష్టం చేస్తోంది. మే 3న దీనిపై స్పందించిన భారత్, నేపాల్ ఏకపక్షంగా సరిహద్దులను పెంచి చూపిస్తోందని దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని కొట్టిపారేసింది. -
భారత్‌పై చైనా దొంగదెబ్బ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఒక నిశ్శబ్దమైన, కానీ అత్యంత ప్రభావవంతమైన మార్పు జరుగుతోంది. ఒకప్పుడు చమురు నిల్వలు ప్రపంచ రాజ కీయాలను ప్రభావితం చేశాయి. తర్వాత సాంకేతికత, డిజిటల్ ఆధిపత్యం ప్రపంచ శక్తి సమీ కరణాలను మార్చాయి. ఇప్పుడు ఆ స్థానాన్ని అరుదైన ఖనిజాలు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ సరఫరా గొలుసులు ఆక్రమిస్తున్నాయి. ఈ కొత్త యుగంలో ఎవరైతే ముడి పదార్థాలు, వాటి శుద్ధీకరణ, ఉత్పత్తినియంత్రణను తమ చేతుల్లో ఉంచుకుంటారో వారే భవి ష్యత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయ గలుగుతారు.ఇలాంటి సమయంలో చైనా తీసుకుంటున్న తాజా ఎగుమతి నియంత్రణ చర్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షి స్తున్నాయి. అమెరికా–చైనా వ్యూహాత్మక పోటీ తీవ్రమవు తున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడి చైనా పర్యటన ముగిసిన కొద్ది రోజులకే చైనా తన కీలక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, అరుదైన ఖనిజాలు, అధునాతన పరిశ్రమలకు అవసరమైన సరఫరాలపై నియంత్రణలను కఠినతరం చేస్తూ, రాజ్య ఆదేశాలు 834, 835 విడుదల చేసింది. ఈ చర్యలు ప్రపంచానికి ఒక సందేశం ఇస్తున్నాయి – తయారీ కేంద్రంగా మాత్రమే కాదు, సరఫరా నియంత్రణ కేంద్రంగా కూడా చైనా తన స్థానం బలపరచుకోవాలని చూస్తోంది.ఇలాంటి చట్టాలు యూరోప్, ఆమెరికాలలో ఉన్నా, అవి, అత్యున్నత సాంకేతిక కలిగిన ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పటి వరకు అమెరికా సెమీకండక్టర్ టెక్నా లజీ, అధునాతన చిప్‌ల ఎగుమతిపై నియంత్రణలు విధిస్తూ వచ్చింది. ఇప్పుడు చైనా తనకు ఉన్న బలాన్ని– రేర్ ఎర్త్ శుద్ధీకరణ, ఎలక్ట్రానిక్ సరఫరా వ్యవస్థ, ముడి పదార్థాల ఆధిపత్యాన్ని వ్యూహాత్మక సాధనంగా ఉపయో గించడానికి ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలపైనే కాదు; చైనా సరఫరా గొలుసులపై అధికంగా ఆధారపడిన భారతదేశంపైనా పడే అవకాశం ఉంది. భారతదేశ ఎలక్ట్రానిక్ దిగు మతులు 80 శాతానికి పైగా చైనా నుండే అని గమనించాలి. చైనా ఒత్తిడితోనే, ఫాక్స్‌కాన్, టెస్లా లాంటి సంస్థలు, తమ ఉత్పత్తులను భారతదేశం బయటే చేయాలని నిర్ణయించు కొన్నాయి.ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ రంగాలపై ప్రభావం భారతదేశం ఒక అసౌకర్యకరమైన వాస్తవాన్ని అంగీకరించాలి. మనం తయారీ కేంద్రంగా ఎదుగుతున్న ప్పటికీ, ఆ తయారీకి అవసరమైన కీలక భాగాలు, అరుదైన ఖనిజాలు, చిప్ భాగాలు, పరిశ్రమల సరఫరా వ్యవస్థల విషయంలో ఇంకా విదేశాలపై ఆధారపడి ఉన్నాం. ప్రత్యేకంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి ఖనిజాల విషయంలో భారత స్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఇవే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ వ్యవస్థలు, బ్యాటరీ నిల్వలు, అంతరిక్ష సాంకేతికత, డిజిటల్ పరికరాలకు ప్రాణాధారం. ఈ రంగాల్లో సరఫరా అంతరాయం అంటే కేవలం పరిశ్రమల సమస్య కాదు; అది దేశ ఆర్థిక భద్రత సమస్యగా మారుతుంది.ప్రపంచ అరుదైన ఖనిజాల ప్రధాన కేంద్రంగా ఆఫ్రికా ఎదిగింది. కాంగోలో కోబాల్ట్, జింబాబ్వేలో లిథియం, నమీబియాలో యురేనియం, దక్షిణాఫ్రికాలో కీలక లోహ సంపద– ఇవన్నీ ఇప్పుడు కొత్త భౌగోళిక రాజకీయ పోటీకి కేంద్రంగా మారాయి. చైనా ఇప్పటికే ఈ పోటీలో చాలా ముందుంది. ఇదే సమయంలో యూరప్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంది. ముడి పదార్థాల కొనుగోలుతో ఆగకుండా, స్థానిక ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తి వ్యవస్థల వైపు అడుగులు వేస్తోంది. సరఫరా భద్రతను ఇప్పుడు జాతీయ భద్రతలో భాగంగా చూస్తోంది.సమగ్ర ప్రణాళిక అవసరం!భారత్ కూడా ప్రయత్నాలు చేయడం లేదని చెప్పలేం. విదేశీ ఖనిజ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, లిథియం బ్లాక్‌ల అన్వేషణ, ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం వంటి చర్యలు ప్రారంభమయ్యాయి. కానీ ఇవి ఇప్పటికీ ఒక సమగ్ర జాతీయ వ్యూహంగా మారలేదు. ముఖ్యంగా మైనింగ్ తరువాత జరిగే శుద్ధీకరణ, ప్రాసెసింగ్, అధు నాతన మెటీరియల్ తయారీ రంగాల్లో మన సామర్థ్యం పరిమితంగానే ఉంది. అందుకే చైనా చర్యలు భారత్‌కు ఒక హెచ్చరిక, ఒక అవకాశం కూడా.చదవండి: చైనాలో అలా.. ఇక్కడ ఇలా!భారత్ ఇప్పుడు మూడు విషయాలను అత్యవసరంగా చేయాలి – ఖనిజ భద్రతను జాతీయ భద్రతలో భాగంగా చూడాలి; విదేశీ భాగస్వామ్యాలను ముడి పదార్థాల నుంచి ప్రాసెసింగ్ వరకు విస్తరించాలి; దేశీయ పరిశోధన–ఆవిష్కరణ వ్యవస్థపై దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలి.ఎందుకంటే భవిష్యత్తులో పోటీ కేవలం ఉత్పత్తుల మధ్య ఉండదు. ఎవరి చేతిలో ముడి పదార్థాలు ఉంటాయి? ఎవరు వాటిని శుద్ధి చేస్తారు? ఎవరు సాంకే తికతను నియంత్రిస్తారు? – ఈ ప్రశ్నలే రేపటి ప్రపంచ శక్తిని నిర్ణయిస్తాయి. భారత్ ఇప్పటికైనా మేల్కొనాలి. లేకపోతే అభివృద్ధి లక్ష్యాలు కొనసాగినా, వాటి పునాది ఇతర దేశాల చేతుల్లో ఉండే ప్రమాదం ఉంది.- సి.హెచ్.వి. ప్రభాకర్ రావుసీనియర్ జర్నలిస్ట్ -
చైనాకు నిద్రపట్టనివ్వని తైవాన్.. అందుకే అమెరికాతో ఇలా..
సుంకాలు కాదు, పశ్చిమాసియా యుద్ధం కాదు.. అమెరికాతో సంబంధాల్లో తైవాన్ ‘అత్యంత ముఖ్యమైన అంశం’ అని చైనా ఎందుకు చెబుతోంది? ప్రత్యేకించి అమెరికాతో సంబంధాల్లో తైవాన్‌కు చైనా ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమేంటి? తైవాన్‌పై సైనిక చర్యకు అవకాశం ఉందని సూచించేలా చేస్తున్న ఇలాంటి ప్రకటనలు ఏమి చెబుతున్నాయి?తైవాన్ ప్రాదేశిక జలాల చుట్టూ చాలా కాలంగా చైనా యుద్ధ విమానాలు, నౌకలు సంచరిస్తూ కలకలం రేపుతున్నాయి. అవి తమ ఉత్తర, మధ్య, నైరుతి, తూర్పు భాగాల ఏడీఐజెడ్ (ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్)లోకి ప్రవేశించాయని రెండు రోజుల క్రితం కూడా తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజింగ్‌లో ఇటీవలే ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఇందులో వాణిజ్యం, పశ్చిమాసియా యుద్ధం కంటే.. తైవాన్ అంశానికే చైనా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ప్రకటనలో.. “అమెరికా-చైనా సంబంధాల్లో తైవాన్ అత్యంత ముఖ్యమైన అంశమని షీ జిన్‌పింగ్ చెప్పారు. దీనిని సరిగ్గా నిర్వహిస్తే ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా ఉంటాయి. లేకపోతే ఇరు దేశాల మధ్య ఘర్షణలు, చివరకు సంఘర్షణలు కూడా తలెత్తవచ్చు. తైవాన్ స్వాతంత్ర్యం, జలసంధి, ఇరుప్రాంతాల శాంతి అనేవి అగ్ని, నీటిలా కలిసిరాని అంశాలు. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటం అమెరికా, చైనా మధ్య ఉన్న అతిపెద్ద ఉమ్మడి అంశం. తైవాన్ విషయంలో అమెరికా అత్యంత జాగ్రత్త వహించాలి” అని తెలిపింది.తైవాన్‌పై చైనా హక్కుల వాదనతైవాన్ అనేది ఆగ్నేయ చైనా తీరానికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వీపం. ఇది తైవాన్ జలసంధి ద్వారా చైనా నుంచి వేరుపడింది. ఇది చైనా చివరి సామ్రాజ్య వంశం క్వింగ్ పాలనలో ఉండేది. అయితే, 1895లో జపాన్ అధీనంలోకి వెళ్లింది. రెండో ప్రపంచ యుద్ధంలో (1939-45) జపాన్ ఓటమి తర్వాత రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్వోసీ) తైవాన్‌పై నియంత్రణ సాధించింది.ఆ సమయంలో జాతీయవాద పార్టీ నాయకుడు చియాంగ్ కై-షెక్ దేశానికి నాయకత్వం వహించారు. అయితే మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టులు ఆయన పాలనను సవాలు చేశారు.రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రారంభమైన అంతర్యుద్ధం, జపాన్‌పై పోరాటం కారణంగా తాత్కాలికంగా ఆగింది. అనంతరం కమ్యూనిస్టులు విజయం సాధించి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ)ను స్థాపించారు.చియాంగ్, ఆయన మద్దతుదారులు తైవాన్‌కు వెళ్లి ఆర్వోసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పీఆర్సీ, ఆర్వోసీ రెండూ భూభాగం, ద్వీపం కలిసిన ఏకైక చైనా తమదేనని ప్రకటించాయి. అయితే దానిపై తమ నియంత్రణ ఉండాలని కోరుకున్నాయి.సోవియట్ యూనియన్ పీఆర్సీకి మద్దతు సోవియట్ యూనియన్ పీఆర్సీకి మద్దతు ఇచ్చింది. అమెరికా ఆర్వోసీకి మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా ఆసియాలో కమ్యూనిజం వ్యాప్తిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కాలక్రమేణా పరిస్థితి పూర్తిగా మారింది. 1960 దశకం ప్రారంభంలో సోవియట్ యూనియన్, చైనా మధ్య విభేదాలు వచ్చిన తర్వాత సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా చైనా మిత్రదేశంగా ఉపయోగపడుతుందని అమెరికా భావించింది.మరోవైపు, 1969లో అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రెండు రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఒక నోట్లో ఇలా రాశారు. “800 మిలియన్ల మంది చైనా కమ్యూనిస్టులు ఒంటరిగా జీవించాలని మేము కోరుకోవడం లేదు. మాకు వారితో సత్సంబంధాలు కావాలి. అంతర్జాతీయ సమాజంలో భాగస్వామిగా, పసిఫిక్ సమాజంలో సభ్యదేశంగా చైనా ఉండాలని కోరుకుంటున్నాం” అన్నారు.మాజీ విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిసింజర్ రహస్య సమావేశాలు నిర్వహించడం, పాకిస్థాన్, రొమేనియా ప్రభుత్వాల సహకారం లభించడం వల్ల 1979లో అమెరికా, చైనా దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాయి. చైనాకు కొత్త నాయకుడు డెంగ్ షియావోపింగ్ ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవస్థను ఆధునికీకరించడం, స్వేచ్ఛాయుత విధానాలు అమలు చేయాలని నిర్ణయించుకుంది. అందులో అమెరికా సహకారం కీలకమైంది.అతిపెద్ద సవాలు తైవానే.. అయితే తైవాన్ మొదటి నుంచే ప్రధాన వివాదాస్పద అంశంగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఓ సారి స్పందిస్తూ.. “మొత్తం చర్చల కాలంలో మాకు ఎదురైన అతిపెద్ద సవాలు తైవానే. చైనాకు తైవాన్ అంశం అంతర్గత వ్యవహారమని మేము గుర్తించాము. అయినప్పటికీ అమెరికా ప్రజలకు తైవాన్ ప్రజలతో సుదీర్ఘ, సన్నిహిత, స్నేహపూర్వక అనుబంధం ఉంది. అది ప్రభుత్వేతర మార్గాల ద్వారా కొనసాగడం ముఖ్యం” అన్నారు. 1979లో ప్రచురితమైన ది వైట్ హౌస్ ఇయర్స్ గ్రంథంలో కిసింజర్ ఇలా రాశారు. “మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. తైవాన్‌లోని 17 మిలియన్ల మంది ముఖ్యమా, లేక భూభాగంలోని 800 మిలియన్ల మంది ముఖ్యమా అన్నది నిర్ణయించాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు. అప్పటి నుంచి అమెరికా “వన్ చైనా” విధానాన్ని కొనసాగిస్తోంది.వన్ చైనా విధానంచైనా ఒక్కటే దేశమని, తైవాన్ దానిలో భాగమని గుర్తించే అమెరికా విధానం ఇది. అదే సమయంలో తైవాన్‌తో అనధికారిక సంబంధాలు కొనసాగిస్తోంది. దీనిని వ్యూహాత్మక అస్పష్టతగా పిలుస్తారు. ప్రత్యేకించి అమెరికా నుంచి తైవాన్‌కు ఆయుధాల విక్రయం చైనాకు అభ్యంతరకర అంశంగా మారింది.బీజింగ్ ఎప్పుడూ తైవాన్ను స్వతంత్ర రాజకీయ వ్యవస్థగా గుర్తించలేదు. మరోవైపు, తైవాన్ తాము కమ్యూనిస్టు చైనాలో ఎప్పుడూ భాగం కాలేదని చెబుతోంది. చైనా చారిత్రక హక్కుల వాదనను సవాలు చేస్తోంది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, చైనా-తైవాన్ మధ్య ఆర్థిక సంబంధాలు చారిత్రకంగా బలంగా ఉన్నాయి. తైవాన్‌కు చెందిన అనేక మంది చైనాలో పని చేస్తున్నారు. చైనా పెట్టుబడులు కూడా తైవాన్‌లో ఉన్నాయి. 2012 నుంచి అధికారంలో ఉన్న షీ జిన్‌పింగ్.. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్, షింజియాంగ్, టిబెట్ వంటి ప్రాంతాలపై నియంత్రణ సాధించడాన్ని “జాతీయ పునరుజ్జీవనం” లక్ష్యంలో భాగంగా చిత్రీకరించారు. జాతీయ పునరుజ్జీవనం అంటే చైనా గత వైభవాన్ని తిరిగి సాధించాలనే రాజకీయ లక్ష్యం. ఇందులో తైవాన్ను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యం వల్ల చైనాకు నిద్రపట్టట్లేదు. ఎందుకంటే యుద్ధం మొదలైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. యుద్ధం చేయకుండా తైవాన్ను చైనా స్వాధీనం చేసుకోలేదు.ఆధునిక చరిత్రలో పాశ్చాత్య శక్తులు, జపాన్ చేతిలో చైనా ఎదుర్కొన్న అవమానాలను బీజింగ్ తరచుగా ప్రస్తావిస్తోంది. సైన్యాన్ని బలోపేతం చేయడం, జాతీయ ఐక్యతను పెంపొందించడం, కమ్యూనిస్టు పార్టీ పట్ల విధేయత పెంచడం అవసరమని చెబుతోంది. మరోవైపు, 2016 నుంచి తైవాన్‌లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తోంది.ప్రస్తుత అధ్యక్షుడు లై చింగ్-టే సహా ఆ పార్టీ నాయకులు, తైవాన్ ఇప్పటికే స్వతంత్రంగా పనిచేస్తోందని, ప్రజలు తమను చైనీయులుగా కాకుండా తైవానీయులుగా గుర్తించుకుంటున్నారని చెబుతున్నారు. సర్వేలు కూడా చైనాతో ఏకీకరణకు ప్రజా మద్దతు తక్కువగా ఉందని చూపించాయి. చాలా మంది ప్రస్తుత పరిస్థితి కొనసాగాలని కోరుకుంటున్నారు. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత, దూర ప్రాంతాల్లో జరిగే యుద్ధాల్లో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోవచ్చనే అభిప్రాయం బలపడింది. 2027 సంవత్సరం కీలక మైలురాయిగా ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే అది చైనా ప్రజా విమోచన సైన్యం స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయ్యే సంవత్సరం. 2021లో అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ మాజీ అధిపతి ఫిల్ డేవిడ్సన్, ఈ దశాబ్దం ముగిసేలోపు దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ స్పష్టత లేదు.చైనా, తైవాన్ యుద్ధం జరిగితే?విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. తైవాన్‌పై దాడి జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పశ్చిమాసియా యుద్ధం కంటే తీవ్రంగా ఉండొచ్చు. మొదటిగా, ఆగ్నేయ ఆసియాలోని మలక్కా జలసంధి చైనా, వియత్నాం వంటి ప్రధాన ఎగుమతి దేశాలను ప్రపంచంతో కలుపుతోంది. యుద్ధం విస్తరితే నౌకల రాకపోకలు ప్రభావితమవుతాయి. రెండో అంశం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్ ఆధిపత్యం ఉంది. “సిలికాన్ షీల్డ్” సిద్ధాంతం ప్రకారం, ఈ విలువైన పరిశ్రమ కారణంగా పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో తైవాన్ను రక్షించడానికి అమెరికాకు ఇదే బలమైన కారణంగా నిలుస్తుంది. సిలికాన్ షీల్డ్ సిద్ధాంతం అంటే చిప్‌ల తయారీలో తైవాన్ ప్రాధాన్యం కారణంగా దానిపై దాడి చేయడానికి దేశాలు వెనుకాడతాయనే భావన. -
నేపాల్-భారత్ వివాదంలోకి చైనా..?
ఖట్ట్మాండు: నేపాల్ ప్రధాని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో ఉన్న దీర్ఘకాలిక సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో చైనా, బ్రిటన్ దేశాలు జోక్యం చేసుకోవాలని కోరారు. నేపాల్ పార్లమెంట్లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విధంగా మాట్లాడారు. ఇటీవలే నేపాల్ ప్రధానిగా ఎన్నికైనా బాలేంద్ర షా ఆదివారం నేపాల్ పార్లమెంటులో మాట్లాడుతూ "కేవలం భారత్ మాత్రమే నేపాల్ భూభాగాలను ఆక్రమించలేదు. నేపాల్ కూడా భారత్‌కు చెందిన పలు ప్రాంతాలను ఆక్రమించింది. ఈ అంశంపై ఇరు దేశాలు దీనిపై చర్చించుకోవాలి." అని అన్నారు.ఈ సరిహద్దు వివాదం 'బ్రిటిష్ ఇండియా' కాలం నాటిదని, అందుకే ఈ సమస్య పరిష్కారంలో ఇంగ్లాండ్ (బ్రిటన్) కూడా పాలుపంచుకోవాలని నేపాల్ భావిస్తోందని షా పేర్కొన్నారు.వివాదం ఏంటి? లింపియాధురా, లిపులేఖ్ మరియు కాలాపానీ ప్రాంతాలపై నేపాల్ హక్కులు కోరుతోంది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత, జూన్ మొదటి వారం నుండి లిపులేఖ్ కనుమ ద్వారా భారత్-చైనాలు సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించబోతున్నాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దౌత్యపరమైన నోట్ పంపింది.అయితే దీనిపై చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భారత్ ప్రత్యుత్తరం ఇచ్చినట్లు నేపాల్ ప్రధాని పేర్కొన్నారు.భారత ప్రభుత్వం స్పందననేపాల్ చేస్తున్న భూభాగాల వాదనలకు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఏకపక్షంగా సరిహద్దులను పెంచుకుంటూ పోవడం చెల్లదని, అయితే ఈ సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. -
భవనంలో భారీ పేలుడు.. 45 మంది మృతి.. 70 మందికి గాయాలు
బ్యాంకాక్: ఈశాన్య మయన్మార్‌లో ఆదివారం మధ్యాహ్నం ఓ భవనంలో ఘోర పేలుడు ప్రమాదం సంభవించింది. గనుల తవ్వకాల కోసం నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘోర ప్రమాదంలో మరో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది, స్థానిక మీడియా వెల్లడించాయి. చైనా సరిహద్దుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామ్‌ఖామ్ పరిధిలోని ‘కౌంగ్‌టుప్’ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల సమయంలో ఈ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రాంతం ప్రస్తుతం మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ‘తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ’ అనే సాయుధ తిరుగుబాటు ముఠా ఆధీనంలో ఉంది.వందకు పైగా ఇళ్లు ధ్వంసం ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. పేలుడు ధాటికి ఆకాశంలోకి దట్టమైన పొగ మేఘాలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్.. ఆదివారం సాయంత్రానికి ఆరుగురు చిన్న పిల్లల మృతదేహాలతో సహా మొత్తం 46 మృతదేహాలను వెలికితీసి అంత్యక్రియల కోసం తరలించారు. గాయపడిన మరో 74 మందిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు తీవ్రత వల్ల చుట్టుపక్కల ఉన్న దాదాపు 100కు పైగా నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంపై తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ తమ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా స్పందించింది. గనులు, క్వారీ తవ్వకాల కోసం తమ ఎకనామిక్ డిపార్ట్మెంట్ ఈ భవనంలో ‘జెలిగ్నైట్’ అనే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిందని స్పష్టం చేసింది.సాధారణంగా జెలిగ్నైట్‌ను రాళ్లు బద్దలు కొట్టడానికి వాడతారు. అయితే దీనిని ఎక్కువ కాలం పాటు సరిగ్గా నిల్వ చేయకపోతే ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతం ఈ పేలుడు ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు స్థానిక యంత్రాంగం వైద్య సహాయం, పునరావాస చర్యలను అందిస్తోంది.🇲🇲: At least 55 people were killed and over 60 injured in a massive explosion at a gelignite explosives warehouse in Kaungtup village, Namhkam township, Shan State, Myanmar, on May 31, 2026.The blast, at a site controlled by the Ta'ang National Liberation Army for mining use,… https://t.co/x42YI8XkRw— World In Last 24hr (@world24x7hr) May 31, 2026 -
చైనాకు చెక్.. AUKUS కూటమి భారీ వ్యూహం!
ప్రపంచ భద్రతా సమీకరణాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లకు ఎదుర్కొనేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి అత్యాధునిక అండర్‌వాటర్ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాయి. AUKUS రక్షణ కూటమి కింద చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సముద్ర గర్భంలో పనిచేసే మానవరహిత అత్యాధునిక అండర్‌వాటర్ డ్రోన్లను రూపొందించనున్నారు. ఇందులో భాగంగా తొలి దశ సామర్థ్యాలను 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రకటించారు.సింగపూర్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక షాంగ్రి-లా డైలాగ్ సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. AUKUS “పిల్లర్-2” కింద ప్రకటించిన తొలి ప్రధాన ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. కాగా, ఈ అండర్‌వాటర్ డ్రోన్లు కేవలం నిఘా కోసమే కాకుండా.. శత్రు జలాంతర్గాములను గుర్తించడం, సముద్ర గర్భంలోని మైన్లను నిర్వీర్యం చేయడం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సముద్ర యుద్ధ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. అవసరమైతే లక్ష్యాలపై దాడులు చేయగల సామర్థ్యాన్ని కూడా వీటికి కల్పించనున్నారు.2021లో ఏర్పడిన AUKUS కూటమి రెండు ప్రధాన భాగాలుగా పనిచేస్తోంది. “పిల్లర్-1” కింద ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే జలాంతర్గాముల సాంకేతికత అందిస్తుండగా, “పిల్లర్-2” కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్సోనిక్ ఆయుధాలు, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ టెక్నాలజీ, అండర్‌సీ వార్ఫేర్ వంటి అత్యాధునిక రక్షణ సాంకేతికతలను సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు.⚡️ US, UK and Australia ANNOUNCE UNDERWATER DRONES projectDeveloped under their military alliance known as AUKUS, technology is expected to be ready by next year pic.twitter.com/yW4pmf3RKc— RT (@RT_com) May 30, 2026ప్రస్తుతం ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో దాదాపు 95 శాతం సముద్ర గర్భంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే జరుగుతోంది. అలాగే అనేక దేశాల గ్యాస్, ఇంధన సరఫరా వ్యవస్థలు కూడా సముద్ర అడుగునే ఉన్నాయి. ఇటీవల బాల్టిక్ సముద్రం, తైవాన్ సముద్ర జలసంధి ప్రాంతాల్లో అండర్‌సీ కేబుళ్లు దెబ్బతిన్న ఘటనలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో కీలక మౌలిక వసతుల రక్షణ కోసం అండర్‌వాటర్ డ్రోన్లను ఉపయోగించాలని AUKUS దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర గర్భం ఇప్పుడు కొత్త యుద్ధ రంగంగా మారుతోందని, అక్కడి ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ టెక్నాలజీ కీలకమని వారు పేర్కొన్నారు.అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ ద్వారా డ్రోన్లలో ఉపయోగించే సెన్సర్లు, నావిగేషన్ వ్యవస్థలు, AI ఆధారిత నిర్ణయ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు వంటి కీలక టెక్నాలజీలను కూడా మూడు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. జీపీఎస్ అందుబాటులో లేని సముద్ర గర్భంలో కూడా స్వతంత్రంగా ప్రయాణించే సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ మొత్తం వ్యూహం వెనుక ప్రధాన కారణం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న నౌకాదళ శక్తి. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ పరిసర ప్రాంతాల్లో బీజింగ్ దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని మిత్రదేశాలు సముద్ర ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, ఇది ప్రాంతీయ ఆయుధ పోటీని మరింత పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. -
చైనా ఆధిపత్యాన్ని అడ్డుకుంటాం
సింగపూర్: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడం ఇప్పటికీ తమ లక్ష్యంగానే ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. అదేవిధంగా, పసిఫిక్ సముద్ర ప్రాంత దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉంటామన్నారు. అమెరికా భద్రతకు వికాసానికి ఈ ప్రాంతం చాలా కీలకమైందని చెప్పారు. పసిఫిక్ రీజియన్‌లో సుస్థిరమైన, సానుకూల అధికార సమతుల్యతను సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. సింగపూర్‌లో జరుగుతున్న షాంగ్రి–లా రక్షణ సదస్సులో శనివారం హెగ్సెత్ మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా చైనా సైనిక పాటవాన్ని పెంచుకుంటుండటంపై ఈ ప్రాంతంలోనే కాదు మిగతా దేశాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారను. ఇక్కడి భద్రతా వాతావరణంపై తమకు స్పష్టమైన అంచనా ఉందన్నారు. పసిఫిక్ ప్రాంతం ఏదో ఒక దేశం ఆధిపత్యంలోకి వెళ్తే అది ప్రాంతీయ శక్తి సమతుల్యతను దెబ్బతీస్తుందని, మనం పరరిక్షించుకోవాలని ప్రయత్నిస్తున్న సమతుల్యత ప్రమాదంలో పడుతుందన్న విషయం తమకు తెలుసునని హెగ్సెత్ పేర్కొన్నారు. అందుకే, చైనాయే కాదు, మరే దేశమూ ఈ ప్రాంతంపై ఆధిపత్యం నెలకొల్పుకునే అవకాశం తాము ఇవ్వబోమని స్పష్టం చేశారు. అదే సమయంలో చైనాతో తాము ఘర్షణాత్మక వైఖరిని ఆవలంభించబోమని చెప్పారు. ఇటీవల ట్రంప్, జిన్ పింగ్ మధ్య జరిగిన భేటీని ప్రస్తావిస్తూ హెగ్సెత్..అమెరికా, చైనాలు తమ ప్రయోజనాలను కాపాడుకుంటూనే పరస్పర ప్రయోజనాల విషయంలో ఆచరణాత్మకమైన ఒప్పందాలను కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. న్యాయబద్ధమైన, పరస్పర సహకారంతో కూడిన వ్యూహాత్మక, నిర్మాణాత్మక సంబంధాలను నెలకొల్పుకునేందుకు అంగీకరించారని చెప్పారు. మిత్ర దేశాలు రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందంటూ ఆయన..ఈ విషయంలో పలు ఆసియా దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కొనియాడారు. కేవలం ఆదర్శప్రాయమైన సిద్ధాంతాలను కాకుండా దేశ ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. అదే సమయంలో యూరప్ దేశాల వైఖరిని హెగ్సెత్ తప్పుబట్టారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్(ఐఐఎస్ఎస్) ఆధ్వర్యంలోని సింగపూర్‌లోని షాంగ్రి–లా హోటల్లో 2002 నుంచి జరుగుతున్న ఈ సదస్సుకు భారత్ సహా 30కిపైగా దేశాల నుంచి అగ్ర నేతలు, దౌత్యవేత్తలు, రక్షణ శాఖల అధికారులు హాజరవుతారు.భారత్–పాక్ ఘర్షణను ట్రంప్ ఆపారుగతేడాది భారత్, పాకిస్తాన్ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతోనే సమసిపోయాయని హెగ్సెత్ పేర్కొన్నారు. అణు సామర్థ్యం ఉన్న ఈ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో ట్రంప్ చేసిన కృషి అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. భారత్, పాక్‌ల నాలుగు రోజుల సంక్షోభాన్ని తానే నివారించానంటూ ట్రంప్ గతంలో పలుమార్లు ప్రకటించుకోగా, భారత్ ఖండించడం తెల్సిందే. -
షాకింగ్: అమెరికాను ముందే దెబ్బ కొట్టే వ్యూహమా?
శాటిలైట్‌కు చిక్కిన ఆ నిర్మాణం.. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుతోంది. ఎడారి మధ్యలో కనిపిస్తున్న ఆ నిర్మాణాలు సాధారణ సైనిక బేస్‌లు కావు… ఉపగ్రహ కళ్లలో అవి ఇప్పుడు ఒక భారీ “అణు కోట వ్యవస్థ”గా మారాయి. అమెరికా మొదట దాడి చేసినా తమ అణు శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయలేని విధంగా చైనా రూపొందిస్తున్న రహస్య “డిఫెన్స్ వెబ్” అంతర్జాతీయ భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.రాయిటర్స్ పరిశీలించిన తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం, చైనా జిన్జియాంగ్ ఎడారి ప్రాంతంలో తన దీర్ఘశ్రేణి అణు క్షిపణుల (ICBM) చుట్టూ విస్తారమైన మిలిటరీ మౌలిక వసతులను వేగంగా నిర్మిస్తోంది. ఈ నిర్మాణాలు కేవలం రక్షణ కోసం మాత్రమే కాకుండా, ప్రతిదాడి సామర్థ్యాన్ని పెంపొందించేలా రూపొందించినట్లు భద్రతా నిపుణులు భావిస్తున్నారు.జిన్జియాంగ్ ఎడారిలో బయటపడిన ఈ వ్యవస్థలో 80కి పైగా కొత్త లాంచ్ ప్యాడ్లు, భూగర్భ బంకర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు నిర్మాణంలో ఉన్నట్లు అంచనా. ఇవి చైనా అణు వ్యూహంలో కీలక మార్పును సూచిస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న సాంప్రదాయ సైలో ఆధారిత వ్యవస్థను మరింత విస్తరించి, మొబైల్ లాంచ్ సామర్థ్యంతో కలిపిన సమగ్ర రక్షణ–దాడి నెట్‌వర్క్‌గా అభివృద్ధి చేస్తున్నారు.అందుకోసమేనా?ఈ పరిణామం అమెరికా–చైనా మధ్య కొనసాగుతున్న అణు పోటీలో కొత్త దశను సూచిస్తోంది. తైవాన్ అంశంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, చైనా తన “సెకండ్ స్ట్రైక్ కెపబిలిటీ”ను మరింత బలపరచుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే, తొలి దాడి జరిగినా తిరిగి ప్రతిదాడి చేయగల సామర్థ్యాన్ని నిలుపుకోవడం.ఇక శాటిలైట్ చిత్రాల్లో వెలుగులోకి వచ్చిన మరో కీలక అంశం జిన్జియాంగ్ ప్రాంతంలోని రెండు భారీ ఆక్టాగాన్ ఆకార సైనిక సముదాయాలు. ఇవి కేవలం బేస్‌లు మాత్రమే కాకుండా, విస్తృత మిలిటరీ నెట్‌వర్క్‌కు కేంద్రాలుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీటి చుట్టూ సైనిక వాహనాల శిబిరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు, ఎయిర్‌బేస్‌లు, రైల్వే కనెక్టివిటీతో పాటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసినట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మొత్తం నిర్మాణం ఒక క్లిష్టమైన రోడ్డు వ్యవస్థ, భూగర్భ మార్గాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లతో అనుసంధానమై ఉండటం. ఇది కేవలం ఒక బేస్ కాకుండా, పూర్తి స్థాయి వ్యూహాత్మక యుద్ధ యంత్రాంగంగా రూపుదిద్దుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. ఎడారి అంతటా విస్తరించిన ఈ నెట్వర్క్, అవసరమైనప్పుడు వేగంగా కదిలే అణు దళాలకు సహకరించేలా రూపొందించినట్లు భావిస్తున్నారు.అమెరికా డిఫెన్స్ అంచనాల ప్రకారం, చైనా 2030 నాటికి తన అణు సామర్థ్యాన్ని గణనీయంగా పెంచి సుమారు 1,000 వార్హెడ్లను సిద్ధం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే వందకు పైగా ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లు (ICBMలు) వివిధ సైలోల్లో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.అణు వ్యూహ నిపుణులు ఈ విస్తరణను “అసాధారణం”గా అభివర్ణిస్తున్నారు. ఇంత వేగంగా, ఇంత భారీ స్థాయిలో ఎడారి ప్రాంతంలో మిలిటరీ మౌలిక వసతులు అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారి అని వారు చెబుతున్నారు. ఇది చైనా వ్యూహాత్మక అణు సామర్థ్యాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లే పరిణామమని అంచనా వేస్తున్నారు.ప్రపంచ భద్రతా దృష్టిలో చూస్తే, ఈ పరిణామం కొత్త ఒత్తిడిని తీసుకువస్తోంది. అమెరికా, రష్యా వంటి అగ్రదేశాలతో పోలిస్తే చైనా ఇప్పుడు తన అణు వ్యూహాన్ని మరింత విస్తృతంగా, రహస్యంగా, బలంగా రూపుదిద్దుకుంటోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది భవిష్యత్‌లో ప్రపంచ అణు సమతుల్యతను మార్చే కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. -
చైనాలో పంది మాంసం సంక్షోభం.. 16 ఏళ్ల కష్టం వృధా..
-
ప్రియురాలి భర్త సడన్ ఎంట్రీ! పదో అంతస్తు నుంచి పట్టుతప్పి..
వివాహేతర సంబంధాలు అనైతిక బంధాలుగా సమాజంలో తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. కొన్నిసార్లు నమ్మకాన్ని, కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి సంబంధాల్లో చిక్కుకున్న కొంతమంది వ్యక్తులు నిజాన్ని దాచేందుకు మోసం, తప్పించుకోవడం వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో భయంతో కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక ఫిట్నెస్ ట్రైనర్–ఓ మహిళ మధ్య అల్లుకున్న ప్రేమ (అనైతిక) బంధం అనూహ్యంగా ముగిసింది. ఆ మహిళ భర్త అనుకోకుండా పనినుంచి ముందుగానే ఇంటికి చేరుకున్నాడు. నమ్మకం అనే గోడలు కూలిపోతున్న ఆ క్షణంలో.. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. భయంతో అతను భవనం వెలుపల బాల్కనీ అంచున వేలాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ఉద్వేగభరిత క్షణాల ఒత్తిడిని తట్టుకోలేక చివరికి అదుపు తప్పి కిందకు జారిపోయి తన ప్రాణాలను కోల్పోయాడు. ప్రేమ పేరుతో మొదలైన ఆ కథ, చివరికి నిశ్శబ్ద విషాదంగా ముగిసింది.. సోషల్ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా ఓ వీడియో భారీగా వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి భవనం కిటికీ బయట వేలాడుతూ కనిపించడం, కొద్దిసేపటి తర్వాత కిందపడిపోవడం, ఆ సమయంలో రికార్డింగ్ చేస్తున్న కొందరు హాహాకారాలు చేయడం అందులో కనిపిస్తోంది. అతని పేరు "హువాంగ్ మావో". అతనొక చైనా జిమ్ ట్రైనర్. తన క్లయింట్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, భర్త అకస్మాత్తుగా ఇంటికి రావడంతో కిటికీ మార్గంలో తప్పించుకునే ప్రయత్నంలో 10 అంతస్తుల ఎత్తు నుంచి జారిపడి మృతి చెందాడని.. ఆ వైరల్ పోస్టుల సారాంశం. A forbidden love affair between a fitness trainer and a woman ended in tragedy. When the woman's husband returned home early from work, Huang Mao, who was hanging from a balcony outside the building, fell to his death. pic.twitter.com/Q4xjNfRD9J— MOSCOW NEWS 🇷🇺 (@MOSCOW_EN) May 28, 2026Fitness coach Huang Mao has an affair, the male homeowner returns,crouching on the window ledge he accidentally falls off the building, dying on the spot. pic.twitter.com/FiB0O3GUXv— Josh Blaq (@Josh_korn1) May 28, 2026 ప్రస్తుతం ఎక్స్, టిక్‌టాక్ తదితర వేదికల్లో వైరల్ అవుతూ ఈ స్టోరీ తీవ్ర చర్చకు దారి తీసింది. కొందరు దానిని ఏఐ వీడియో అంటే.. మరొకొందరు తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేశారు. కొన్ని మీడియా సంస్థలు కూడా అత్యుత్సాహంతో ముందు వెనకా చూడకుండా ఆ ప్రచారాన్ని యధాతథంగా వార్తగా ఇచ్చేస్తున్నాయి. అయితే.. సాక్షి.కామ్ ఫ్యాక్ట్ చెక్ కోసం ప్రయత్నించి అసలు విషయం రాబట్టగలింది. ఆ వీడియో మీద ప్రచారం అవుతున్న విషయంలో ఎలాంటి నిజం లేదని తేల్చేసింది. కిటీకి పట్టుకుని వేలాడి కింద పడిపోయిన ఆ ఘటన.. 2023 ఏప్రిల్‌లో చైనాలోని చెంగ్డూలో జరిగిన ఘటనది. వ్యక్తి మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యల కారణంగా భవనం కిటికీ నుంచి వేలాడిన ఆ వ్యక్తి.. ఆత్మహత్య చేసుకునే క్రమంలోనే కింద పడిపోయాడు. పైగా అతడు జిమ్ ట్రైనర్ అని, అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని నిర్ధారించే విశ్వసనీయ ఆధారాలు ఎక్కడా లభించలేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. వైరల్ పోస్టుల్లో పేర్కొంటున్న "హువాంగ్ మావో" అనేది ఆ వ్యక్తి అసలు పేరు కూడా కాదు. చైనా భాషలో "హువాంగ్ మావో" అంటే "పసుపు రంగు జుట్టు ఉన్న వ్యక్తి" అనే అర్థం. ఒకప్పుడు అలా జుట్టుకు రంగులు వేసే వ్యక్తుల కోసం ముద్దు పేరుగా సోషల్ మీడియాలో ఆ పదం వాడారు. ఇప్పుడు ఆ పేరునే వైరల్ వీడియోలో వాడేసి కట్టుకథ అల్లారు. సో.. వీడియో పాతదైనా, దానికి కొత్త కథను జోడించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని పరిశీలనలో తేలింది. జిమ్ ట్రైనర్, అక్రమ సంబంధం, భర్త నుంచి తప్పించుకునే ప్రయత్నం వంటి అంశాలకు ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేవు. -
చైనా షాడో గేమ్‌లో పాక్.. కశ్మీర్‌పై హైవోల్టేజ్ డ్రామా!
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా పర్యటన తర్వాత మళ్లీ కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. పాక్, చైనా కశ్మీర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించాయి. ‘చరిత్రలో మిగిలిన సమస్య(left over from history)’ అంటూ UN తీర్మానాల ప్రకారం పరిష్కారం కావాలని పేర్కొన్నాయి. అయితే, షరీఫ్.. చైనా పర్యటనలో ఏం జరిగిందనే అంశాలపై చర్చ మొదలైంది. భారత్‌పై కుట్రతో రెండు దేశాలు ఏం ప్లాన్ చేశాయనే చర్చ జోరందుకుంది. మరోవైపు.. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జమ్ముకశ్మీర్, లడఖ్ భారత్‌లో అంతర్భాగాలని స్పష్టం చేసింది.పాక్ పీఎం షరీఫ్ నాలుగు రోజుల చైనా పర్యటనలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పాటు ఉన్నతాధికారులతో విస్తృత చర్చలు జరిపారు. అధికారికంగా ఈ భేటీల్లో CPEC (చైనా–పాకిస్థాన్ ఆర్థిక కారిడార్) విస్తరణ, గ్వాదర్ పోర్ట్‌ను ప్రాంతీయ ట్రేడ్ హబ్‌గా అభివృద్ధి చేయడం, రక్షణ సహకారం, ఆర్థిక పెట్టుబడులు ప్రధాన అంశాలుగా ఉన్నప్పటికీ అసలు వ్యూహాత్మక చర్చలు భిన్నంగా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రకటనలో కశ్మీర్‌ను మళ్లీ ప్రస్తావించడం వెనుక చైనా–పాక్ ఉమ్మడి వ్యూహం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్ దీర్ఘకాలంగా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. చైనా మద్దతుతో ఆ ప్రయత్నానికి కొత్త ఊపొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా భారత్ పెరుగుతున్న ఆర్థిక, సైనిక ప్రభావాన్ని కట్టడి చేయడం ఈ వ్యూహంలో ఒక భాగంగా కనిపిస్తోంది.ఇక చైనా వైపు నుంచి చూస్తే, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో కీలక భాగమైన CPEC భద్రత అత్యంత ప్రాధాన్యం. గిల్గిట్–బాల్టిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లే ఈ కారిడార్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ బీజింగ్ ఆ ప్రాంతాల్లో పెట్టుబడులు పెంచుతూ, గ్వాదర్ పోర్ట్‌ను అరేబియా సముద్రంలో వ్యూహాత్మక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ పరిణామాల వెనుక “కనిపించని ఒత్తిడి వ్యూహం” ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కశ్మీర్ అంశాన్ని మళ్లీ మళ్లీ లేవనెత్తడం ద్వారా భారత్‌పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచడం, అంతర్జాతీయ వేదికల్లో చర్చను కొనసాగించడం పాక్ లక్ష్యంగా కనిపిస్తోంది. చైనా ఈ అంశాన్ని నేరుగా రాజకీయంగా కాకుండా, వ్యూహాత్మక భాగస్వామ్యం రూపంలో ఉపయోగిస్తోందని భావిస్తున్నారు.India has firmly rejected Pakistan-China references on Jammu & Kashmir. 🇮🇳“No other country has the locus standi to comment.”MEA makes it crystal clear: Jammu & Kashmir and Ladakh “have been, are and will always remain integral and inalienable parts of India.” https://t.co/NTzHeyiCGh pic.twitter.com/ZJs2lpnW15— India First Post (@ifpost47) May 26, 2026అయితే, భారత్ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా తిరస్కరించింది. జమ్ము కశ్మీర్, లడఖ్ దేశానికి అంతర్భాగాలని స్పష్టం చేస్తూ, ఇతర దేశాలు ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి ఎలాంటి హక్కు లేదని విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. అంతేకాకుండా CPEC ప్రాజెక్ట్‌ను భారత సార్వభౌమాధికారానికి విరుద్ధంగా పేర్కొంటూ దీర్ఘకాల అభ్యంతరాన్ని పునరుద్ఘాటించింది. మొత్తం పరిణామాన్ని పరిశీలిస్తే, ఇది కేవలం ప్రకటన స్థాయిలో జరిగిన వ్యాఖ్యల కంటే ఎక్కువగా చైనా–పాక్ వ్యూహాత్మక సమన్వయాన్ని సూచిస్తోందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఆర్థిక కారిడార్ విస్తరణ, మరోవైపు దౌత్య వేదికలపై కశ్మీర్ ప్రస్తావన ద్వారా భారత్‌పై “డబుల్ ప్రెషర్ స్ట్రాటజీ” అమలు చేస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉందని, భారత్–చైనా–పాక్ మధ్య సంబంధాలు మరింత సంక్లిష్ట దశలోకి వెళ్లినట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.UN తీర్మానాల చరిత్ర👉1948లో UNSC Resolution 47 ద్వారా కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికపైకి తీసుకువచ్చారు. ఆ తీర్మానం ప్రకారం, పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి, భారత్ సైన్యం తగ్గించుకోవాలి. తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ (plebiscite) జరగాలి. కానీ, అమలు జరగలేదు. అప్పటి నుంచి కాశ్మీర్ అంశం UNలో పునరావృతమవుతూ వస్తోంది.భారత్ ఆందోళనలు👉China–Pakistan Economic Corridor (CPEC) ప్రాజెక్టులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మీదుగా వెళ్తున్నాయి. భారత్ దీన్ని సార్వభౌమత్వానికి విరుద్ధంగా భావిస్తోంది. గ్వాదర్ పోర్ట్ అభివృద్ధి, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు అన్నీ చైనా–పాకిస్తాన్ సంబంధాలను బలపరుస్తున్నాయి. దీని వల్ల భారత్‌కి వ్యూహాత్మకంగా ఒత్తిడి పెరుగుతోంది. చైనా–పాకిస్తాన్ కశ్మీర్‌ను అంతర్జాతీయ వేదికల్లో మళ్లీ ప్రస్తావించడం భారత్‌ను ఇరకాటంలో పడేస్తోంది.ఎందుకు మళ్లీ కశ్మీర్?పాకిస్తాన్ లాభం: చైనా సంయుక్త ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావన రావడం పాకిస్తాన్‌కి దేశీయంగా చూపించుకునే రాజకీయ విజయంగా ఉంటుంది.చైనా వ్యూహం: పాకిస్తాన్ One China Policy (తైవాన్, హాంకాంగ్, జిన్జియాంగ్)కి మద్దతు ఇస్తుంది.CPEC (China–Pakistan Economic Corridor), గ్వాదర్ పోర్ట్ అభివృద్ధి వంటి ప్రాజెక్టులకు పాకిస్తాన్ సహకారం కొనసాగుతుంది.కశ్మీర్ ప్రస్తావన చైనాకు తక్కువ ఖర్చుతో పాకిస్తాన్ అనుకూలతను పొందే మార్గం.ఈ భాగస్వామ్యం భారత్‌కి భౌగోళిక–రాజకీయ సవాలుగా మారింది.చైనా వ్యూహం ఏంటి?భారత్ ఎదుగుదలను అడ్డుకోవడమే డ్రాగన్ అసలు లక్ష్యంCPEC ద్వారా అరేబియా సముద్రానికి ప్రత్యక్ష మార్గం పొందాలని ప్లాన్గ్వాదర్ పోర్ట్‌ను మిలిటరీ & ట్రేడ్ హబ్‌గా మార్చే ప్రయత్నంభారత్ను రెండు వైపులా ఒత్తిడిలో పెట్టేందుకు పాక్‌కు మద్దతుక్వాడ్, ఇండో–పసిఫిక్ కూటములకు కౌంటర్‌గా దక్షిణాసియాలో ప్రభావం పెంపు -
ఖనిజ సహకారంతో చైనాకు చెక్!
న్యూఢిల్లీ: అరుదైన ఖనిజాల ఉత్పత్తి, ఎగుమతుల విషయంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి నాలుగు దేశాల క్వాడ్ కూటమి ‘కీలక ఖనిజాల సహకార కార్యక్రమాన్ని’ప్రారంభించింది. అరుదైన ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 20 బిలియన్ డాలర్ల (1.91 లక్షల కోట్లు) వరకు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ ప్రాంతంలో సముద్ర నిఘా, ఓడరేవుల మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని క్వాడ్ విదేశాంగ మంత్రులు తీర్మానించారు.అలాగే ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. మంగళవారం ఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో అమెరికా, ఆ్రస్టేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, పెన్నీ వాంగ్, తోషిమిత్సు మొతేగి పాల్గొన్నారు. నాలుగు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు.‘కీలక ఖనిజాల సహకార కార్యక్రమాన్ని’ఖరారు చేశారు. సమావేశం అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. దేశాలు తమ సొంత మార్గాలను నిర్ణయించుకోవడానికి, సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి వీలు కల్పించే స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో–పసిఫిక్‌కు మద్దతును పునరుద్ఘాటిస్తున్నామని పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి స్పష్టమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని, నిర్దిష్టమైన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. అక్కడ ఏకపక్ష చర్యలు వద్దు హార్మూజ్ జలసంధి గుండా ప్రపంచ వాణిజ్యం నిరాటంకంగా సాగాలని విదేశాంగ మంత్రులు స్పష్టంచేశారు. అక్కడ వాణిజ్య నౌకలపై ఇరాన్ సుంకాలు విధించడాన్ని తప్పుపట్టారు. అలాగే తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ శాంతి, స్థిరత్వానికి ముప్పు కలిగించే, బలప్రయోగంతో అస్థిరపరిచే లేదా ఏకపక్ష చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పారు.చైనా తీరుపై మండిపడ్డారు. సముద్ర వనరుల అభివృద్ధిలో జోక్యం చేసుకోవడం, నౌకాయానం, విమానయాన స్వేచ్ఛకు పదేపదే ఆటంకం కలిగించడం సరైంది కాదన్నారు. ఆ ప్రాంతంలో ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మానుకోవాలని చైనాకు తేల్చిచెప్పారు. తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో శాంతి, స్థిరత్వాన్ని భగ్నం చేసే చర్యలు మానుకోవాలని చైనాను పరోక్షంగా హెచ్చరించారు. చట్టాలను పాటించాల్సిందే: జైశంకర్ క్వాడ్ ఎజెండాలో భాగంగా కీలక, అరుదైన ఖనిజాల ఒప్పందం, ఇండో–పసిఫిక్ ఇంధన భద్రతా కార్యక్రమాన్ని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. చర్చలు, ద్వైపాక్షిక సంప్రదింపుల్లో ఎక్కువ భాగం ప్రపంచ ప్రస్తుత పరిస్థితిపైనే జరిగాయని చెప్పారు. సహజంగానే, చర్చల ప్రధాన ఉద్దేశం ఇండో–పసిఫిక్‌కు సంబంధించిన అంశాలేనని అన్నారు.సురక్షితమైన, నిరాటంకమైన సముద్ర వాణిజ్యంపై చర్చించామని, ఎవరైనా సరే అంతర్జాతీయ చట్టాలను కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో–పసిఫిక్‌కు అనేక కోణాలు, పార్శా్వలు ఉన్నాయని, వాటిలో సాధించిన పురోగతిని క్వాడ్ సమావేశం సమీక్షించిందని జైశంకర్ ఉద్ఘాటించారు. నాలుగు దేశాల మధ్య ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించాలని, సప్లై చైన్లను బలోపేతం చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. సముద్ర భద్రతకు చర్యలు: రూబియో ఇండో–పసిఫిక్ సముద్ర నిఘా సహకార కార్యక్రమాన్ని ప్రారంభించాలని క్వాడ్ సమావేశం నిర్ణయించిందని మార్కో రూబియో తెలిపారు. ఇది ఇండో–పసిఫిక్‌లో మన నాలుగు దేశాల సముద్ర నిఘా సామర్థ్యాలను వినియోగించుకుంటుందని అన్నారు. క్వాడ్ దేశాల మధ్య ఇండో–పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. పసిఫిక్ దీవుల్లో ఓడరేవు మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి క్వాడ్ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 60 శాతం ఇండో–పసిఫిక్ గుండానే సాగుతోందని గుర్తుచేశారు. అందుకే సముద్ర భద్రతకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవద్దు: చైనా బీజింగ్: క్వాడ్‌పై తన అక్కసును చైనా మరోసారి వెళ్లగక్కింది. కొన్నిదేశాలు కలిసి ప్రత్యేక కూటములు ఏర్పాటు చేసుకోవడం, ఇతర దేశాలతో ఘర్షణలకు దిగడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంగళవారం పేర్కొంది. క్వాడ్ విషయంలో తమ వైఖరిని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ చెప్పారు. దేశాల మధ్య సహకారం ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదపడాలని అన్నారు. అంతేతప్ప మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. కూటముల పేరిట మరో దేశంతో ఘర్షణ పడొద్దని చెప్పారు. -
తైవాన్‌పై ఉభయుల చదరంగం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల రెండవ వారంలో చైనాను సందర్శించిన సందర్భంగా తైవాన్ విషయమై అన్న మాటలు కొన్ని అపోహలను కలిగించాయి. తన వ్యాఖ్యలను కొందరు స్థూల దృష్టితో చూసి నిజమని నమ్ముతున్నారు కూడా. తైవాన్‌కు సంబంధించి ఆయన ఇక చేతులు ఎత్తివేసినట్లేననే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్త వమో జాగ్రత్తగా పరిశీలించటం అవసరం.మార్పున్నట్టా? లేనట్టా?రెండు దేశాల అధ్యక్షుల మధ్య తొలి సమావేశం మే 14న జరిగినపుడు షీ జిన్‌పింగ్ తైవాన్ ప్రస్తావన చేస్తూ, తమ ప్రయోజ నాలకు ముఖ్యమైన అంశాలలోకెల్లా అతిముఖ్యమైనది తైవాన్ అనీ, అందుకోసం తాము అమెరికాతో ఘర్షణకైనా సిద్ధమనీ చెప్పారు. ఈ ప్రస్తావన సాగినంత కాలం ట్రంప్ ముఖకవళికలు బరువుగా కనిపించాయి. స్పందనలేవీ లేవు. మరునాడు స్వదేశానికి తిరిగి వెళుతుండగా విమానంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన నుంచి మూడు మాటలు వినిపించాయి. అమెరికా నుంచి 9,500 మైళ్ల (15 వేల కిలోమీటర్ల) దూరంగల తైవాన్ కోసం తాము శక్తిమంతమైన చైనాతో యుద్ధం చేయలే మన్నది ఒకటి. స్వతంత్రాన్ని ప్రకటించ వద్దంటూ తాను తైవాన్ నాయకత్వానికి చెప్పానన్నది రెండు. తైవాన్‌కు విక్రయించదలచిన ఆయుధాల విషయమై తుది నిర్ణయ మేదీ తీసుకోలేదన్నది మూడు. పోతే, చైనాకు బయలుదేరే ముందు రోజున అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, తైవాన్ విధానంలో మార్పేమీ ‘ప్రస్తుతానికి’ లేదన్నారు. చైనా అధ్యక్షుడు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన హెచ్చరికలు ముఖాముఖిన చేయటం, అందుకు అమెరికా వైపు నుంచి ఎన్నడూ లేనంత జాగ్రత్తతో కూడిన స్పందనలు రావటంపై సహజంగానే విస్తృతమైన చర్చలు, ఊహాగానాలు మొదలయ్యాయి. తైవాన్, జపాన్ కలవరపడగా, అమెరికాలోని మితవాద లాబీలు విమర్శించాయి. ఇంతకూ అమెరికా తన చిరకాలపు విధానాన్ని మార్చుకునే దిశలో ఉన్నట్లా? చేతులు ఎత్తివేస్తున్నట్లా?యుద్ధానికి దూరంతో ఏం పని?అందుకోసం మొదట అమెరికా అధ్యక్షుని మూడు మాటలను, ఆయన విదేశాంగ మంత్రి మాటను తిరిగి చూడాలి. చైనాతో యుద్ధం చేయదలిస్తే అమెరికన్లు 15,000 కి.మీ.లు ప్రయాణించ వలసిన అవసరమే లేదు. వారికి చైనాకు పొరుగున గల జపాన్‌లో 4, దక్షిణ కొరియాలో 2, గువామ్‌లో 2 బలమైన సైనిక స్థావరాలున్నాయి. ఫిలిప్ఫైన్స్లో సైనిక వెసులుబాట్లున్నాయి. స్థావరాలతో సరిపోల్చగల అత్యాధునిక విమాన వాహక నౌకాదళాలను, అణ్వాయుధాలనైనా ప్రయోగించగల జలాంతర్గములను చైనా సమీపాన మోహరించగలరు. దీర్ఘశ్రేణి క్షిపణులూ ఉండనే ఉన్నాయి. అందువల్ల వేల కిలోమీటర్ల దూరమన్నది అర్థం లేని మాట. ఏమి చేస్తారన్నది రాజకీయ నిర్ణయం మాత్రమే. పైన పేర్కొన్న స్థావరాలు, నౌకా బలంతో, తైవాన్‌కు ఇప్పటికే సమకూర్చిన ఆయుధ సంపత్తితో, చైనీయులు తైవాన్‌పై దాడి చేసినట్లయితే తాము కూడా సైనిక జోక్యం చేసు కోగలమంటున్న జపాన్, ఫిలిప్ఫైన్స్ల ప్రకటనలతో, చైనాను ఓడించగలరా లేదా అన్నది వేరే ప్రశ్న. కానీ, తమకు తైవాన్ అత్యంత ముఖ్యమంటున్న చైనాతో యుద్ధానికి సిద్ధపడటమన్నది రాజకీయ నిర్ణయం. ఆ నిర్ణయం మునుముందు అనేక పరిస్థితులపై ఆధార పడి ఉంటుంది. కనుక ప్రస్తుతం ట్రంప్ అన్నది తుది వాక్యం కాదు. రెండవ మాటకు వస్తే, ‘స్వాతంత్య్రం ప్రకటించవద్దని’ తైవాన్‌కు సూచించటం ఇది కొత్త కాదు. తమది ‘వ్యూహాత్మక అస్పష్టత’ అన్న మాట అమెరికా ఉపయోగిస్తున్నదే. స్వాతంత్య్రం ప్రకటించు కొండి అనరు, అసలు ప్రకటించకుండా ఒకే చైనా విధానం ప్రకారం చైనాలో విలీనమైపొండి అని కూడా అనరు. సూత్ర రీత్యా తైవాన్ చైనాలో భాగమే అయినా ఆ పని బలవంతంగా జరిగితే ఒప్పుకో బోమంటారు. తైవాన్ సంరక్షణ చట్టమంటూ చేసి వారికి ఆయు ధాలు అమ్మే విచిత్రమైన విధానాన్ని అనుసరిస్తుంటారు. అందువల్ల, తాను తైవాన్‌కు స్వాతంత్య్రం ప్రకటించవద్దంటూ చెప్పానన్న ట్రంప్ మాట కూడా అర్థం లేనిదే.మూడవది పెండింగ్‌లో ఉన్న ఆయుధాల విక్రయం. వాటి విలువ 14 బిలియన్ల డాలర్లు. అమెరికా అధ్యక్షుడు అన్నది ఆ విష యమై ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తైవాన్ నాయకత్వంతో మాట్లాడుతాను’ అని. అంతే తప్ప అమ్మబోము అనలేదు. ట్రంప్ ఆ మాత్రపు మాట అన్న వెంటనే ఒకవైపు తైవాన్ నుంచి, మరొకవైపు రిపబ్లికన్లతో పాటు డెమోక్రటిక్ సెనేటర్ల నుంచి ఒత్తిడులు మొద లయ్యాయి. చైనా వ్యతిరేకించినా ఆయుధాల విక్రయం జరుగు తూనే వస్తున్నది గనుక, ఈసారి కూడా కొంత వ్యవధి తర్వాత అదే జరిగితే ఆశ్చర్యపడనక్కర లేదు. ఎందుకంటే, చైనా విషయంలో, మొత్తం పసిఫిక్ విషయంలో అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలలో, వ్యూహాలలో మార్పు లేదు గనుక. కాకపోతే, ప్రస్తుత పరిస్థితులలో చైనాతో కొంత మెత్తగా వ్యవహరించాలన్నది ఒక ఎత్తుగడ అయినందున ఈ విధంగా మాట్లాడతారు.వ్యూహం ఉండనే ఉంది!ఆ ప్రయోజనాలు, వ్యూహాలు ఏమిటో, అందులో భాగంగా చైనాను నియంత్రించటం ఎట్లానో, అందుకు తైవాన్ అవసరం ఏమిటో 2022లో బైడెన్, తర్వాత 2025, 2026లో ట్రంప్ స్వయంగా తమ వ్యూహపత్రాలలో వివరించి చెప్పారు. వారిద్దరి కన్నా ముందే ఒబామా– ఇరాక్, అఫ్గాన్ పరాభవాల దరిమిలా ఇక తమ దృష్టి పసిఫిక్ వైపు, చైనా వైపు మళ్లటం అవసరమని ప్రతిపా దించి పోయారు. ఇదంతా లాటిన్ అమెరికా నుంచి పశ్చిమాసియా మీదుగా తూర్పు ఆసియా వరకు అమెరికా ప్రయోజనాలను, ఆధిప త్యాన్ని సుస్థిరపరచుకునే విస్తృతమైన, దీర్ఘకాలికమైన ప్రణాళికలో భాగం. అందుకోసం తైవాన్ను తమ ప్రభావం కింద ఉంచుకోవ టమే కాదు, ఇంకా అనేకం చేయవలసి ఉంటుంది. ఆ వివరాలు కూడా కొన్ని పైన పేర్కొన్న వ్యూహ పత్రాలలో పేర్కొన్నారు.అందువల్ల, తైవాన్ గురించి ఇపుడు ట్రంప్ ఏమన్నారో చూసి ఆయన చేతులు ఎత్తేశారంటూ అపోహ పడటం పొరపాటు అవు తుంది. చారిత్రకంగా తమ దేశంలో భాగమైన తైవాన్ను ఎప్పటికైనా నయానో భయానో విలీనం చేసుకోవటం చైనా లక్ష్యం. హాంకాంగ్, మకావూ వలెనే తైవాన్లోనూ ఒక దేశం రెండు వ్యవస్థల పద్ధతిని అనుసరించేందుకు సిద్ధమని చైనా గతంలోనే ప్రకటించింది. ఆ విధంగా ‘శాంతియుత విలీనానికి’ అడ్డంకులు కల్పించరాదని అమె రికాను కోరుతున్నది. అందుకు తైవాన్ ప్రతిపక్షం సుముఖత చూపు తుండగా, అధికారపక్షం నిరాకరిస్తున్నది. ఆ పార్టీకి అమెరికా ప్రోత్సాహం ఉంది. ఈ మొత్తం పరిస్థితులు ఎట్లా పరిణమించేదీ భవిష్యత్తులో చైనా, అమెరికాల ఆర్థిక, సైనిక, రాజకీయ బలాబలాలు ఎట్లా మారుతూ పోగలవన్న దానిపైనే ఆధారపడి ఉండవచ్చు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అమెరికా డాలర్‌కు చావేనా? ఇరాన్ ఏం చేసిందంటే..
ప్రముఖ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంలో రాబోయే ఒక భారీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అమెరికా డాలర్‌కు పొంచి ఉందంటూ ఆయన హెచ్చరించారు.ఇరాన్ దేశం తన చమురు విక్రయాల కోసం అమెరికా డాలర్ స్థానంలో చైనా కరెన్సీ 'యువాన్' (Yuan)లో చెల్లింపులను స్వీకరించడం ప్రారంభించిందని, ఇది "పెట్రో డాలర్" (Petro-dollar) వ్యవస్థ అంతానికి నాంది కానుందని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు.'పెట్రో డాలర్'కు మరణ శాసనం?రాబర్ట్ కియోసాకి తన ట్వీట్లో ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన పరిణామమని అభివర్ణించారు."ఇరాన్ చమురు కోసం చైనా యువాన్‌ను అంగీకరించడం ప్రారంభించింది. దీని అర్థం ఏమిటి? మీ భవిష్యత్తుపై, అమెరికా డాలర్ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇరాన్‌తో యుద్ధం కంటే ఇది అత్యంత ఘోరమైన పరిస్థితి. అమెరికా డాలర్ అంతం కాబోతోందా?" అని కియోసాకి ప్రశ్నించారు.ఈ అంతర్జాతీయ మార్పుల వల్ల సామాన్యులు నష్టపోకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కనీసం ఒక గంట సమయాన్ని కేటాయించాలని ఆయన కోరారు. మన పాఠశాలల్లో ఇలాంటి ముఖ్యమైన విషయాలను ఎప్పటికీ నేర్పరని ఆయన గుర్తుచేశారు.ప్రస్తుతం జరుగుతున్న ఈ భారీ ఆర్థిక సంక్షోభం గురించి ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ రే డాలియో (Ray Dalio) మాత్రమే స్పష్టంగా వివరిస్తున్నారని కియోసాకి పేర్కొన్నారు. రే డాలియో నిర్వహించిన “ఇరాన్ జస్ట్ కిల్డ్ ది పెట్రో డాలర్” అనే పాడ్‌కాస్ట్‌ను తప్పకుండా వినాలని కియోసాకి ప్రజలకు సూచించారు."మీ జీవితంలో మీరు పెట్టే అత్యుత్తమ పెట్టుబడి... మీ ఆర్థిక విద్యపై పెట్టే పెట్టుబడే" అని కియోసాకి ట్వీట్లో స్పష్టం చేశారు.అసలు ఏమిటీ పెట్రో డాలర్ సంక్షోభం?గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాపారం అంతా అమెరికా డాలర్లలోనే సాగుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు తిరుగులేని ఆధిక్యత లభించింది. అయితే, ఇటీవల కాలంలో అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్, రష్యా వంటి దేశాలతో పాటు చైనా కూడా డాలర్ రహిత వ్యాపారానికి (De-dollarization) తెరలేపాయి. చమురు వ్యాపారంలో చైనా యువాన్ వాడకం పెరిగితే, అది అమెరికా డాలర్ పతనానికి దారితీస్తుందనే ఆందోళనలు ప్రపంచ ఆర్థిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ ఆందోళనలనే రాబర్ట్ కియోసాకి తాజాగా తన ట్వీట్ ద్వారా మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు.WORSE THAN WAR in IRANDeath of the US Dollar?Iran began accepting payment for oil in Chinese Yuan. What does that mean to you and your future and the future of the US dollar?I strongly encourage you to invest about and hour in your financial education. I strongly…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 24, 2026 -
‘తాయ్ చి’ వాకింగ్ ట్రెండ్..! ఇది పెద్దలకు మంచిదా?
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తాయ్ చి వాకింగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ప్రజలు కూడా ఈ వాకింగ్ చేసేందుకు అమితమైన ఆసక్తికనబరుస్తుండటం విశేషం. ఈ వాకింగ్ పొట్లలోని కొవ్వుని అమాంతం కరిగించేస్తుందని, బరువు తగ్గిపోతారంటూ తెగ ఊదరగొట్టేస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు. ముఖ్యంగా పెద్దలకు, వృద్ధులకు చాలామంచిదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి తాయ్ చి వాకింగ్..?, దీని వల్ల నిజంగా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.ఈ తాయ్ చి వాకింగ్ గురించి ముంబైకి చెందిన తాయ్ చి గురువు సెన్సాయి సందీప్ దేశాయ్ ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా సవివరంగా వెల్లడించారు. ఇది ఎలా చేస్తారు. దీని వల్ల కలిగే లాభలు ఏంటి వంటి వాటి గురించి తెలిపారు. తాయ్ చి వాకింగ్ అంటే..తాయ్ చి వాకింగ్ అనేది శరీరాన్ని నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా కదిలించే ఒక విధమైన నడక పద్ధతి. దీనిలో సమతుల్యత, శరీర భంగిమ, సమన్వయం, కీళ్లపై అధిక భారం పడకుండా నియంత్రిత బరువు మార్పిడిపై ఫోకస్ పెడతూ చేసే వాకింగ్ అని చెప్పుకొచ్చారు సందీప్ దేశాయ్. తాయ్‌గా ఈ పిలిచే ఈ వర్కౌట్ యుద్ధ కళల సాధనలో ఒక భాగం అని అన్నారు. ఇది పూర్తిగా కదలికపై దృష్టి సారించే ఒక వ్యాయామం అని చెప్పారు. ఇటీవల కాలంలో దీనికి అమిత ఆదరణ పెరిగిందన్నారు. అయితే ఈ తాయ్ చి అనేది వేల సంవత్సరాల చైనా చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంతర్గత యుద్ధ కళ, ఆరోగ్య వ్యాయామం కూడా. భారత్‌కి యోగా ఎలాగో అక్కడ చైనాలో ఈ తాయ్ చి అలా అని సందీప్ దేశాయ్ అన్నారు.ఎలా చేస్తారంటే..సరైన విధంగా నేర్చుకోవడం అనేది అత్యంత కీలకం. ఇది శరీర బరువుని మారుస్తూ జాగ్రత్తగా చేసే వ్యాయామం. ఒక కాలుపై శరీరం బరువు మోపుతూ నిదానంగా మరోక కాలు ఎత్తాలి. ఆ తర్వాత మెల్లగా గాల్లో ఉన్న ఆ పాదాన్ని మడంపై ఆనించి నెమ్మదిగా భూమిపై పూర్తిగా ఆనాలి. ఆ తర్వాత మరో కాలుని నెమ్మదిగా ఎత్తి ఈ పాదంపై శరీర బరువుని మోపాతూ.. కంటిన్యూ చేయాలి.వృద్ధులకు ఇది ఎందుకు మంచిదంటే..ఈ వాకింగ్ కాళ్లపై చాలా తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. సాధారణంగా వృద్ధులకు మోకాళ్ల నొప్పి, బిగువు లేదా నడుమునొప్పితో బాధపడేవారికి చాలా ముఖ్యం. శరీర బరువుని ఒక కాలు నుంచి మారుస్తూ తనను తాను మెరుగ్గా స్థిరపరుచుకునే ట్రైన్ చేస్తుంది. అలాగే స్లిప్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరాన్ని నిటారుగా వంచడంలో ఉపకరిస్తుంది. పైగా ఇది మనస్సు, శరీరంపై ధ్యాస పెట్టి చేయాల్సిన వర్కౌట్కావడంతో ఏకాగ్రత మెరుగుపడుతుంది. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..హృదయ సంబంధ వ్యాధుల పరంగా చూస్తే, ఇది రక్త ప్రసరణ, శ్వాస, ఊపిరితిత్తుల పనితీరు తోడ్పడే తేలికపాటి ఏరోబిక్ కదలికలా పనిచేస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు, నాడీ సంబంధిత సమస్యలు ఉన్న రోగులకు ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఇది సమతుల్యమైన నడకను ప్రోత్సహిస్తుంది. అలాగే శరీరం-మనస్సు సమన్వయాన్ని మెరుగుపరుస్తుందని డాక్టర్ పటేల్ నొక్కి చెప్పారు.ఇది అనారోగ్యం లేదా గాయం నుంచి కోలుకోవడాన్ని కూడా వేగవంతం చేస్తుంది. చాలా మంది అథ్లెట్లు, క్రీడాకారులు, యోగా సాధకులు, మార్షల్ ఆర్టిస్టులు మెరుగ్గా ఉండేలా, గాయాల బారి నుంచి రక్షించుకోవడానికి ఈ తాయ్ చి వాకింగ్ని చేస్తారని సెన్సాయి సందీప్ అన్నారు. అంతేగాదు శారీరక శ్రమకు దూరంగా ఉన్నవారికి ఫిట్‌నెస్‌లోకి తిరిగి రావడానికి ఇది ఒక మంచి మార్గంగా పనిచేస్తుంది.బరువు తగ్గిస్తుందా అంటే..కేవలం ఏడు నిమిషాల తాయ్ చి మాత్రమే పొట్టలోని కొవ్వును అద్భుతంగా కరిగించకపోవచ్చు. పరుగు లేదా తీవ్రమైన కార్డియో వ్యాయామం లాగా ఇది అధిక కేలరీలను దహించే వ్యాయామం కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీనిని బరువు తగ్గడానికి ఒక షార్ట్‌కట్‌గా భావించడం సరైనది కాదని అంటున్నారు. కానీ పొట్టలోని కొవ్వును తగ్గించడానికి, కోర్ స్ట్రెంగ్తెనింగ్ వ్యాయామాలు, అధిక తీవ్రతతో కూడిన వర్కౌట్లు, నియంత్రిత కార్బోహైడ్రేట్లతో కూడిన సమతుల్యత, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం కలయికతోనే బరువు తగ్గడం సాధ్యమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.తప్పక తెలుసుకోవాల్సినవి..తాయ్ చి వాకింగ్ని సరైన మార్గదర్శకత్వంలోనే చేయాలి లేదంటే కీళ అమరిక, జాయింట్ల మధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే కీళ్లవాతం లేదా వెన్నుముక సమస్యలు ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో చేయడమే ఉత్తమం. View this post on Instagram A post shared by Sensei Sandeep Desai (@taichiyogiindia)(చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!) -
చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..!
మోడు వారిని భూమిని కొంచెం మనసుపెట్టి, శ్రమించి పచ్చదనంతో కళకళలాడేలా చేయొచ్చు. అదే ఎడారిలో అంత ఈజీకాదు. చాలామటుకు అసాధ్యమనే చెప్పొచ్చు. ఎడారిలో అడవిని పెంచడం మాటల్లో చెప్పినంత సులభం అస్సలు కాదు. ఒక వేళ పెంచినా.. మనుగడ సాధించగలడంమనేది ప్రశ్నార్థకమే. అలాంటిది సుసాధ్యం చేసి చూపించింది ఓ మహిళ. ఆనాడు ఆ చేస్తున్న పనికి సాయం అందిస్తూ కూడా..ఎడారిలో పచ్చదనం వస్తుందా అన్న ప్రశ్న ఎదురైన వెరవక ముందుకు సాగిన పచ్చని తల్లి ఆమె.అంతర మంగోలియాలోని మావోవుసు ఎడారిలో ఎడారీకరణను ఎదుర్కోవడానికి దశాబ్దాలుగా చెట్లను నాటుతోంది చైనాకు చెందిన 60 ఏళ్ల యుజెన్. 1980లలో వివాహం అనంతరం భర్తతో కలిసి మంగోలియాలోని మావోసు ఎడారికి వెళ్లింది. ఆ ప్రదేశం బలమైన గాలులు, కరువుతో సహా తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. అలాంటి వాతావరణంలో నివశిస్తూ..ఎడారి వ్యాప్తిని ఆపేలా చెట్లను నాటే ప్రయత్నం చేశారు ఆ దంపతులు. ఆ పని అత్యంతకష్టమైనప్పటికీ ఆ జంట ఏళ్ల తరబడి ఆ ప్రయత్నం కొనసాగించింది. 1996లో ఆమె కథ చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీలో ప్రసారమైంది. దాంతో ఒక్కసారిగా యుజెన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆమె అంకిత భావానికి స్ఫూర్తి పొందిన రోనాల్డ్ సకోల్స్కీ అనే అమెరికన్ ఉపాధ్యాయుడు ఆమె లక్ష్యానికి మద్దతుగా సుమారు రూ. 4,80,000 ఇచ్చాడు. అంత పెద్ద మొత్తం చూసి ఆశ్చర్యపోయిన యుజెన్..ఆ డబ్బులు మొత్తం మొక్కలు నాటేందుకే వినియోగించింది. సకోల్స్కీ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ స్కూల్లో పనిచేస్తుండేవారు. ఆయన ఒక రోజు ఎడారిలో మొక్కలు నాటుతున్న యుజెన్‌ను చూసి అబ్బురపడ్డారు. కానీ ఆమె ప్రయత్నం సాధ్యమవుతందా? లేక నిరర్థకం అవుతుందో? తెలియదు గానీ..తన వంతుగా మద్దతు అంటూ అంత సొమ్ము ఇచ్చారాయన. కాలక్రమేణ ఎడారిలో 50 వేలకు పైగా చెట్లు పెరిగి బీడు వారిని ఎడారి కాస్తా పచ్చని భూమిలా కనువిందు చేయడం ప్రారంభించింది. ఆ అడవిని ఎలాగైనా.. ఆ ఉపాధ్యాయుడు సకోల్స్కీకి చూపించాలని యుజెన్ ఎంతో ప్రయాసపడి సదరు స్కూల్ సాయంతో అతడి ఆచూకిని తెలుసుకుని మరి ఆ అడవిని చూసేందుకు ఆహ్వానించింది. అతను ఆ ఆహ్వానానికి ఉబ్బితబ్బిబవ్వుతూ..ఆ ఫలితాన్ని చూడాలని ఎంతో కుతూహలంగా ఉందని చెప్పాడు. ఈ కథ చైనాలోని ప్రతిఒక్కరిని కదలించింది. యుజెన్ ప్రయత్నమే అభినందనీయం అనుకుంటే.. ఆయన ఆమె ప్రయత్నానికి మద్దుతివ్వడం మరింత విశేషం. పైగా చాలామంది దీనిని సరిహద్దులు దాటి చూపిన దయ, నమ్మకం, సహకారానికి సంబంధించి..హృదయాన్ని తాకే కథగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పర్యావరణ ప్రయత్నాల ద్వారా ఇటీవల సంవత్సరాలలో ఎడారీకరణకు గురైన భూమిని తగ్గించడంలో చైనా గణనీయమైన పురోగతి సాధించిందని అధికారులు కూడా పేర్కొన్నారు.(చదవండి: ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్‌కట్, నో స్ట్రిక్ట్ డైట్) -
చైనా గనిలో భారీ పేలుడు90 మంది మృతి
బీజింగ్: చైనాలోని ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడులో 90 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. షాంగ్జి ప్రావిన్స్‌లోని క్విన్యువాన్ కౌంటీలో ఉన్న లియుòÙన్యు బొగ్గు గనిలో శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీ కారణంగానే ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో గనిలో 247 మంది వరకు కార్మీకులున్నారన్నారు. ఇప్పటి వరకు 201 మంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఘటన నేపథ్యంలో అధ్యక్షుడు జిన్ పింగ్ యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీ చేశారు. రక్షణ, సహాయక చర్యలను పక్కాగా చేపట్టాలన్నారు. దర్యాప్తు జరిపి, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కాగా, చైనాలో తవ్వే బొగ్గులో మూడో వంతు షాంగ్జి ప్రావిన్స్‌లోని గనుల నుంచే లభిస్తుంది. భారీ ప్రమాదాల చరిత్ర చైనాలోని గనుల్లో భారీ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. 2023లో ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని ఓ గని కుప్పకూలి 53 మంది సజీవ సమాధి అయ్యారు. 2009లో హెయిలొంగ్ జియాంగ్ ప్రావిన్స్‌లో గ్యాస్ పేలుడుతో 108 గని కార్మీకులు మృతి చెందారు. 2005లో ఇదే ప్రావిన్స్‌లోని మరో గనిలో పేలుడుతో 171 మంది ప్రాణాలు కోల్పోయారు. 2005లోనే లియావోనింగ్ ప్రావిన్స్‌లోని సుంజియావన్ గనిలో గ్యాస్ లీకేజీ పేలుడు కారణంగా 214 మంది అసువులు బాశారు. 2004లో షాంగ్జి ప్రావిన్స్‌లోని చెంజియాషన్ గనిలో పేలుడుతో 166 మంది, హెనాన్ ప్రావిన్స్‌లోని డాపింగ్ గనిలో గ్యాస్ లీకేజీ పేలుడు కారణంగా మరో 148 మంది చనిపోయారు.2000లో గుయిఝౌ ప్రావిన్స్ లోని ముచోంగౌ గనిలో పేలుడుతో 162 మంది కార్మీకులు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ పై చైనా గూఢచర్యం!
బీజింగ్: తమ దేశానికి అధికారిక పర్యటనకు వచ్చిన విశిష్ట అతిథులపై డ్రాగన్ దేశం నిఘా పెట్టిందా? వారి కదలికలు తెలుసుకోవడానికి, రహస్యాలు రాబట్టడానికి సైనికాధికారులను మారువేషాల్లో రంగంలోకి దించిందా? గూఢచర్యం సాగించిందా?.. ఇదంతా నిజమేనని స్వతంత్ర బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ చెబుతున్నారు. విదేశీ ప్రముఖులపై గూఢచర్యం చేయడం చైనాకు కొత్తేమీ కాదని అంటున్నారు. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన బృందంతో కలిసి చైనాలో పర్యటించారు. ఆయన వెంట ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తోపాటు అమెరికా పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ నిపుణులు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. ట్రంప్ గౌరవార్థం ఆయన బృందానికి చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) విందు ఇచ్చింది. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ పక్కన ఎర్రరంగు దుస్తుల్లో ఉన్న ఓ మహిళ చాలాసేపు నిలబడి ఉండడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆమె వెయిటర్‌గా వ్యవహరించారు. నిజానికి సదరు మహిళ వెయిటర్ కాదని, చైనా మిలటరీ ఆఫీసర్ అని జెన్నిఫర్ జెంగ్ తేల్చిచెప్పారు. ఈ మేరకు రెండు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఒక ఫొటోలో వెయిటర్ దుస్తుల్లో ఉన్న మహిళ మరో ఫొటోలో మిలటరీ యూనిఫామ్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ దుస్తుల కింద తుపాకీ! విదేశాలపై చైనా ప్రభుత్వం గూఢచర్యం చేస్తోందని, అనేక కుట్రలకు పాల్పడుతోందని జెన్నిఫర్ జెంగ్ గతంలోనూ పలు సందర్భాల్లో ఆరోపణలు గుప్పించారు. 2023లో కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని అంతం చేసి పరారయ్యారు. అయితే, హత్య వెనుక చైనా కమ్యూనిస్టు పార్టీ హస్తం ఉన్నట్లు జెన్నిఫర్ జెంగ్ తేల్చిచెప్పారు. నిజ్జర్‌ను చంపేసి, ఈ నిందను భారత్‌పైకి నెట్టేశారని తెలిపారు. తద్వారా భారత్‌కు, పచ్చిమ దేశాలకు మధ్య విభేదాలు సృష్టించడం, దూరం పెంచడమే చైనా అసలు కుతంత్రమని స్పష్టంచేశారు. తాజాగా ఎలాన్ మస్క్ పై నిఘా పెట్టిన సైనికాధికారి పేరు జనరల్ చెంగ్ చెంగ్ అని వెల్లడించారు. ఆమె బెటాలియన్ కమాండర్‌గా పని చేస్తున్నారని తెలిపారు. చైనా ప్రభుత్వమే ఆమెను మారువేషంలో వెయిటర్‌గా నియమించిందని పేర్కొన్నారు. ‘‘చెంగ్ చెంగ్ తన ఎర్రటి దుస్తుల కింద తుపాకీ లేదా అలాంటి ఆయుధమేదో దాచి ఉంచిందని నేను భావిస్తున్నాను’’అని సోషల్ మీడియాలో పోస్టులో జెన్నిఫర్ జెంగ్ వివరించారు. అయితే, జెంగ్ ఆరోపణలపై చైనా ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. పాశ్చాత్య దేశాలకు సంబంధించిన లక్ష్యాలపై, ప్రముఖులపై చైనా ప్రభుత్వం రహస్యంగా గూఢచారులను మోహరించిన చరిత్ర ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కార్పొరేట్ టెక్నాలజీ రంగాల్లోకి, దౌత్య వర్గాల్లోకి చైనా ప్రభుత్వ ఏజెంట్లు మారుపేర్లు, మారువేషాల్లో చొరబడుతున్నారని, రహస్యాలు కాజేసే ప్రయత్నాలు సాగిస్తున్నారని పశ్చిమ దేశాల నిఘా సంస్థలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. పచ్చిమ దేశాలు అప్రమత్తంగా వ్యవహరించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చని చెబుతున్నాయి. చైనాను సులభంగా నమ్మకూడదని అంటున్నాయి. -
వాట్ యాన్ ఐడియా..! తల్లిదండ్రుల కష్టం తెలియాలని ..
శిశువులను సరిగ్గా ఎత్తుకోవడం నుంచి వారి ఆలనాపాలన వరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. ‘అది చెబితే అర్థమయ్యే కష్టం కాదు. స్వయంగా తెలుసుకోవాలి’ అంటూ తూర్పు చైనాలోని యువాన్జోంగ్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ వినూత్నమైన ప్రయోగం చేసింది. శిశువులను చూసుకోవడంలో తల్లిదండ్రులకు ఎదురయ్యే సవాళ్ల గురించి విద్యార్థులకు బోధించే ప్రయత్నంలో భాగంగా రోజంతా బొమ్మ శిశువును చూసుకోవాలని అసైన్మెంట్ ఇచ్చింది. అల్లరి పనులు చేసే, గేమింగ్ వ్యసనానికి బానిసైన, చదువుపై ఆసక్తి లేని విద్యార్థులను సరిౖయెన దారిలోకి తీసుకురావడం ఈ పాఠశాల ప్రత్యేకత.స్కూల్లో విద్యార్థులు బొమ్మ శిశువులను తమ వీపుపై మోస్తారు. మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు కూడా వాటిని పట్టుకొని ఉంటారు. నిజమైన శిశువులలాగే వాటిని చూసుకోవాలని ఉపాధ్యాయులు ఆదేశించారు. శిశువులకు సంబంధించి తల్లిదండ్రులు ఎదుర్కొనే శారీరక శ్రమను విద్యార్థులకు అర్థం చేయించడానికి ఒక్కొక్కరికి 2.5 కిలోల బరువు ఉన్న బొమ్మ ఇచ్చారు. ‘ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్యార్థులు తమ తల్లిదండ్రులను గౌరవించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం’ అంటున్నారు యువాన్ జోంగ్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ ప్రిన్సిపల్.(చదవండి: ఆ భారతీయ విలువలను తప్పక నేర్చుకోవాలి..! వైరల్‌గా విదేశీ మహిళ పోస్ట్) -
అమెరికా దెబ్బలన్నీ చూసేశాం.. ఇక ఆట మాదే!
ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపు చూసేవి.. ఇప్పుడు మాత్రం మెల్లగా తమవైపు తిరుగుతున్నాయని చైనా నమ్ముతోంది. అమెరికా వేసిన ఆర్థిక దెబ్బలు, సాంకేతిక ఆంక్షలు, ఒత్తిడులన్నింటినీ తట్టుకుని మరింత బలపడిపోయామని బీజింగ్ భావిస్తోంది. అంతేకాదు.. “ఇప్పటి నుంచి ఆటను నడిపేది మేమే” అనే సంకేతాలు కూడా పంపిస్తోంది. ట్రంప్ పర్యటన తర్వాత మారిన చైనా వైఖరి ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.రాజకీయ విశ్లేషకుడు ఆర్నాడ్ బెర్ట్రాండ్ వెల్లడించిన వివరాలు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. చైనా ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే ఒక పరిశోధనా సంస్థ తయారుచేసిన నివేదిక ఆధారంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “అమెరికా-చైనా సహజీవనం దిశగా ప్రపంచంలో జరుగుతున్న మహా మార్పు” అనే అంశంపై రూపొందిన ఈ నివేదికలో.. ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న భారీ మార్పులను చైనా ఎలా చూస్తోందో వివరించారు.ఈ నివేదిక ప్రకారం.. చైనా ఇప్పుడు అమెరికాను “అడ్డుకోలేని మహాశక్తి”గా చూడటం లేదట. గత కొన్నేళ్లుగా అమెరికా చేసిన ఆర్థిక ఒత్తిడులు, దిగుమతి సుంకాలు, సాంకేతిక ఆంక్షలు, ప్రపంచ దేశాలను చైనా నుంచి దూరం పెట్టే ప్రయత్నాలు.. ఇవన్నీ జరిగినా కూడా చైనా ఎదుగుదలేం ఆగలేదని బీజింగ్ బలంగా భావిస్తోంది. అందుకే “అమెరికా తన బలమైన దెబ్బ ఇప్పటికే కొట్టేసింది.. ఇక చైనాను పూర్తిగా ఆపడం సాధ్యం కాదు” అనే నమ్మకం అక్కడ బలపడిందని చెబుతున్నారు.ఈ ఆలోచనకు చైనా మాజీ కమ్యూనిస్టు నాయకుడు మావో జెడాంగ్ చెప్పిన “దీర్ఘకాల పోరాట సిద్ధాంతం”ను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం.. మొదట బలహీనంగా ఉన్న దేశం శక్తివంతమైన దేశం ఒత్తిడిని తట్టుకుంటుంది. తర్వాత మెల్లగా ఆర్థికంగా, సాంకేతికంగా, వ్యూహాత్మకంగా బలపడుతూ చివరకు ప్రత్యర్థిని మించిపోతుంది. ప్రస్తుతం చైనా అదే దశలో ఉందని ఆ నివేదిక చెబుతోంది.బలప్రయోగం కాదు, కానీ..ప్రపంచ తయారీ రంగం, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధస్సు, పర్యావరణ హిత ఇంధన సాంకేతికత, బ్యాటరీ తయారీ వంటి రంగాల్లో చైనా వేగంగా ఆధిపత్యం పెంచుకుంటోందని నివేదిక పేర్కొంది. అంటే కేవలం డబ్బు పరంగా మాత్రమే కాదు.. భవిష్యత్తు ప్రపంచాన్ని నడిపించే రంగాల్లో కూడా చైనా ముందుకు దూసుకెళ్తోందన్న మాట. ఇంకో కీలక అంశం ఏమిటంటే.. ప్రపంచ క్రమం కూడా మారుతోందని చైనా భావిస్తోంది. ఒకప్పుడు అమెరికా చుట్టూ తిరిగిన ప్రపంచం.. ఇప్పుడు అనేక శక్తి కేంద్రాలుగా విడిపోతుందని, అందులో తామే ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నామని బీజింగ్ అంచనా వేస్తోంది. అయితే ఈ మార్పు యుద్ధాల ద్వారా కాదని.. ఆర్థిక బలం, పరిశ్రమల శక్తి, సాంకేతిక ఆధిపత్యం, ప్రపంచ వాణిజ్య సంబంధాల ద్వారా వస్తోందని నివేదిక చెబుతోంది. అంటే చైనా ప్రపంచాన్ని బలవంతంగా జయించాలని కాదు.. ప్రపంచ దేశాలు స్వయంగా చైనాపై ఆధారపడే పరిస్థితి వస్తోందని భావిస్తోందన్నమాట.ఇప్పటివరకు చైనా వ్యూహాత్మక పత్రాల్లో కనిపించిన “అమెరికా భయం” ఈసారి కనిపించలేదని బెర్ట్రాండ్ వ్యాఖ్యానించారు. గతంలో అమెరికాను పెద్ద ముప్పుగా చిత్రీకరించిన చైనా.. ఇప్పుడు మాత్రం దాన్ని మేనేజ్ చేయగలిగే అంశంగా మాత్రమే చూస్తోందట. అంటే అమెరికా ఇబ్బందులు కలిగించగలదు కానీ.. చైనా ఎదుగుదలను పూర్తిగా అడ్డుకోలేదనే నమ్మకం అక్కడ పెరిగిపోయిందన్నమాట.తగ్గేదే లే!అయితే చైనా నేరుగా యుద్ధ దారిలో వెళ్లాలని అనుకోవడం లేదని కూడా ఈ నివేదిక చెబుతోంది. అమెరికాతో పరస్పర గౌరవం, సహజీవనం అవసరమని సూచించింది. రెండు దేశాల మధ్య నేరుగా ఘర్షణలు జరగకుండా సంభాషణలు కొనసాగించాలని, కృత్రిమ మేధస్సు నియంత్రణ, వాతావరణ మార్పులు, మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి అంశాల్లో కలిసి పనిచేయాలని సూచించింది. అదేసమయంలో తైవాన్ విషయంలో మాత్రం చైనా తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. తైవాన్ చివరకు చైనాతో కలవాల్సిందేనని, అమెరికా అక్కడ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ట్రంప్ ‘తైవాన్ సుదూర’ వ్యాఖ్య చేసి ఉంటాడనే విశ్లేషణ నడుస్తోంది. మొత్తంగా ఈ నివేదిక ద్వారా.. ప్రపంచ భవిష్యత్తు నాయకత్వం తమదేనని చైనా ఇప్పుడు గట్టిగా నమ్ముతోందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా ప్రభావం మెల్లగా తగ్గిపోతుందని.. తమ ప్రభావం పెరుగుతుందని బీజింగ్ భావిస్తోంది. అయితే అది యుద్ధాలతో కాదు.. ఆర్థిక బలం, సాంకేతిక ఆధిపత్యం, ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడడం పెరుగుతున్న నేపథ్యాలతో సాధ్యమవుతుందని చైనా అంచనా వేస్తోంది. -
పాక్ ప్రధాని చైనా పర్యటన.. మతలబు ఏంటి?
బీజింగ్: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ సమయంలో ఆయన బీజింగ్‌లో అధ్యక్షుడు జిన్ పింగ్, ప్రధానమంత్రి లి క్వియాంగ్తో భేటీ అవుతారు. చైనా విదేశాంగ శాఖ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా వెళ్లిన కొద్ది రోజులకే పాక్ ప్రధాని అక్కడి వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, లి క్వియాంగ్ ఆహ్వానం మేరకు షెహబాజ్ ఈ పర్యటన చేపడుతున్నారని తెలిపింది. ఉమ్మడి ప్రయోజనాలు, ప్రాంతీయ శాంతి సుస్థిరతల సాధన, అభివృద్ధికోసం రెండు దేశాలు కీలకమైన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై సన్నిహితంగా, సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొంది. అలాగే, 75 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాల సందర్భంగా ఆర్థిక, రాజకీయ, భద్రతా అంశాలపై చర్చలు జరుపనున్నారు.పర్యటన ప్రాముఖ్యతఆర్థిక సహకారం: చైనా పెట్టుబడులు పాకిస్తాన్లో విద్యుత్ లోటు తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.రాజకీయ సంకేతం: బహుళ పార్టీ పార్లమెంటరీ ప్రతినిధి బృందం కూడా పాల్గొనడం, పాకిస్తాన్లో విస్తృత రాజకీయ మద్దతు ఉందని సూచిస్తుంది.ప్రాంతీయ భద్రత: రెండు దేశాలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం సమన్వయం కొనసాగిస్తున్నాయి.CPEC ప్రాజెక్టుల ప్రభావం: China–Pakistan Economic Corridor (CPEC) పాకిస్తాన్లో ఆర్థిక, మౌలిక సదుపాయ, సామాజిక రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. ఇది చైనా నిర్మిస్తున్న Belt and Road Initiative (BRI)లో అత్యంత కీలక భాగం.మౌలిక సదుపాయాల అభివృద్ధి: రహదారులు, రైల్వేలు, పోర్టులు (గ్వాదర్ పోర్ట్) నిర్మాణం ద్వారా పాకిస్తాన్లో రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. -
ట్రంప్ పర్యటన ముగిసిన కొన్ని గంటల్లోనే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన కొద్ది గంటల్లోనే చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియా రూపొందించిన అధునాతన గేమింగ్ చిప్‌పై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్విడియా ఫ్లాగ్షిప్ గేమింగ్ జీపీయూకు చెందిన చైనా-ఫ్రెండ్లీ వెర్షన్ ‘RTX 5090D V2’ గ్రాఫిక్స్ కార్డే లక్ష్యంగా బీజింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 15న చైనాలో తన అధికారిక పర్యటనను ముగించారు. ఈ పర్యటనలో ఆయన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పర్యటనలో ట్రంప్ వెంట ఎన్విడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెన్సెన్ హువాంగ్‌తో సహా పలువురు సీనియర్ యూఎస్ వ్యాపార దిగ్గజాలు కూడా ఉన్నారు. అయితే, ఈ హై-ప్రొఫైల్ పర్యటన ముగిసిన వెంటనే చైనా ఈ నిషేధాస్త్రాన్ని ప్రయోగించడం చర్చకు దారితీసింది.RTX 5090D V2 ప్రత్యేకత ఏంటి?అమెరికా విధించిన కఠినమైన ఎగుమతి పరిమితులకు లోబడి చైనా మార్కెట్ కోసమే ఎన్విడియా ప్రత్యేకంగా రూపొందించిన మోడల్ ఈ RTX 5090D V2. ఇది కంపెనీకి చెందిన టాప్-ఎండ్ RTX 5090 సవరించిన వెర్షన్. అమెరికా నిబంధనలకు అనుగుణంగా దీని మెమరీ, బ్యాండ్‌విడ్త్ సామర్థ్యాలను తగ్గించారు. ప్రాథమికంగా ఇది చైనీస్ గేమర్స్, డిజిటల్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినప్పటికీ ఎన్విడియా శక్తివంతమైన బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ దీనికి అనుసంధానమై ఉండటంతో చైనా పరిశోధకులు దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి కూడా ఉపయోగిస్తున్నారు. సెమీకండక్టర్ టెక్నాలజీ పరంగా అమెరికాపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకోవాలనే చైనా వ్యూహంలో భాగంగానే ఈ చిప్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.అలీబాబా కొత్త ఏఐ చిప్ఇదే తరుణంలో అమెరికాకు గట్టి కౌంటర్ ఇస్తూ చైనా టెక్ దిగ్గజం అలీబాబా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ ‘జెన్వు ఎమ్890’ను ఆవిష్కరించింది. ఈ కొత్త చిప్ తన మునుపటి మోడల్ కంటే ఏకంగా మూడు రెట్లు మెరుగైన పనితీరును కనబరుస్తుందని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది. జెన్వు సిరీస్‌లో భాగంగా కంపెనీ ఇప్పటికే 5,60,000 కంటే ఎక్కువ చిప్‌లను సరఫరా చేసినట్లు వెల్లడించింది. చైనా మార్కెట్లో ఎన్విడియా భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలోనే అలీబాబా ఈ ప్రకటన చేయడం చాలా కచ్చితమైన వ్యూహం అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు! -
కష్టాలే... గెలుపు పాఠాలై!
‘కష్టపడేవారిని అదృష్టం ఇష్టపడుతుంది’ అనేది సామెత. చైనాకు చెందిన జౌక్విన్ ఫేయ్ని ‘అదృష్టవంతురాలు’ అంటారు చాలామంది. అయితే ఆమె కష్టమే ఆమెను అదృష్టవంతురాలిని చేసింది. చదువు మధ్యలో మానేసి పొట్టకూటి కోసం వాచ్ లెన్స్ కంపెనీలో పనిచేసిన జౌక్విన్ ఫేయ్ నేడు ప్రపంచ ప్రసిద్ధ ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీ యజమానురాలు...అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన విందులో ఆపిల్ సీఈవో టిమ్ కుక్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌ల మధ్య కూర్చున్న మహిళ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆమె పేరు... జౌక్విన్ ఫేయ్.అదిగో... అవకాశంగ్రామీణ హునాన్ ప్రావిన్స్‌లో జౌక్విన్ ఒక ఫ్యాక్టరీలో సాధారణ కార్మికురాలిగా పనిచేసేది. స్మార్ట్ఫోన్ల విశ్వరూపాన్ని ప్రపంచం చూడని రోజుల్లోనే గ్లాస్ ్రపొడక్షన్లో నైపుణ్యం సాధిస్తుండేది. పదహారేళ్ల వయసులో చదువుకు దూరమైన జౌ పని వెదుక్కుంటూ షెన్జెన్కు వెళ్లింది. ఎంతోమంది వలస కార్మికులలాగే సుదీర్ఘమైన షిఫ్టులు, ఒత్తిడితో కూడిన వాతావరణంలో పనిచేసింది. 1993లో వాచ్గ్లాస్పై స్క్రీన్ ప్రింటింగ్‌కు సంబంధించి చిన్న వర్క్‌షాప్‌ను ప్రారంభించింది.తొలిరోజుల్లో వర్క్‌షాప్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ఆ రోజుల్లోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలు గుర్తించని ఒక అవకాశాన్ని జౌ గుర్తించింది. ‘ఎలక్ట్రానిక్స్ పలుచగా, తేలికగా, అధునాతనంగా మారేకొద్దీ గాజు తయారీకి విలువ అంతకంతకూ పెరుగుతుంది’ అనేది ఆమె గుర్తించిన విషయం. ఈ ముందుచూపు జౌను ఎక్కడికో తీసుకెళ్లింది. ఆమె చిన్న సంస్థ ‘లెన్స్ టెక్నాలజీ’ అనే అతి పెద్ద కంపెనీగా మారింది. ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగించే అధునాతన కవర్గ్లాస్, టచ్–స్క్రీన్ భాగాలను సరఫరా చేసే కీలకసంస్థగా అవతరించింది. స్మార్ట్‌ఫోన్, ఏఐ హార్డ్‌వేర్, స్మార్ట్ వెహికిల్స్, కాక్‌పిట్ వ్యవస్థలు, రోబోటిక్స్ పార్ట్స్ నుండి ఏరోస్పేస్ సంబంధిత తయారీ రంగం వరకు విస్తరించింది.స్పీడ్ స్పీడ్‌గా...టిమ్ కుక్, ఎలాన్ మస్క్‌లాంటి దిగ్గజాల మధ్య జౌ కూర్చోవడం అనేది ఆమెకు సంబంధించిన విశేషమే కాదు, అనేక పరిశ్రమలలో పెరుగుతున్న లెన్స్ టెక్నాలజీకి ప్రతీకాత్మక చిత్రం. ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీకి స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల నుండి అధిక ఆదాయం వస్తున్నప్పటికీ, ఏఐ గ్లాసెస్, ఇంటెలిజెంట్ వెహికిల్స్, ఫ్లెక్సిబుల్ గ్లాస్ టెక్నాలజీ, ఏరో స్సేస్ ఉత్పత్తుల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలోకి వేగంగా విస్తరించింది.‘చైనా మాన్యుఫాక్టరింగ్’ అంటే చాలా తక్కువ ఖర్చు అనే అభి్రపాయం ఉంది. ‘లెన్స్ టెక్నాలజీ’ లాంటి సంస్థలు ఇప్పుడు ఆ అభి్రపాయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. అదే... విజయ రహస్యంనా కష్టాలు చిన్న వయసులోనే మొదలయ్యాయి. ఒక ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో నాన్న కంటిచూపు కోల్పోయాడు. అయిదేళ్ల వయసులో అమ్మ చని΄ోయింది. ‘తర్వాతి భోజనం ఎక్కడ దొరుకుతుంది? దాన్ని ఎలా సంపాదించుకోవాలి?’ అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. పదహారేళ్ల వయసులో ఒక వాచ్ లెన్స్ ఫ్యాక్టరీలో అసెంబ్లీ వర్కర్‌గా చేరాను. రాత్రిపూట అకౌంటింగ్ క్లాస్‌లకు హాజరయ్యేదాన్ని. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కలలు కనేదాన్ని. వ్యాపారవేత్తగా నా ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. అయినా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. వెనకడుగు వేసి ఉంటే ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీ ఉండేది కాదు. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు చాలామందిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా పట్టుదలతో ముందుకు సాగడమే అసలు సిసలు విజయం.– జౌక్విన్ ఫేయ్ -
పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్‌కు రహస్యంగా..
పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ ఏం చేసినా భారత్‌ను దృష్టిలో పెట్టుకునే చేస్తుంది. భారత్ త్రివిధ దళాల వద్ద ఉన్న విధ్వంసకర ఆయుధాలను చూసి పాక్ భయపడుతుంది. భారత్‌లో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో, ఎలాంటి అణ్వాయుధ వ్యవస్థలు ఉన్నాయో అటువంటివి అభివృద్ధి చేసుకోవాలని భావిస్తుంది. కానీ, అగ్ర దేశాల వద్ద అప్పులు అడుక్కునే పాక్ ఎన్నో రకాల ఆయుధాలను తన అమ్ములపొదిలో చేర్చుకోలేకపోయింది. ప్రపంచంలో 6 దేశాలకు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉంది. అవే.. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, భారత్. ఇక ఇజ్రాయెల్ వద్ద క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద అణు బాలిస్టిక్ క్షిపణిని మోసే ఒక సంప్రదాయ జలాంతర్గామి ఉంది. భారత్‌కు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉండడంతో తమకూ కావాలని పాక్ ప్రయత్నాలు జరిపింది.చైనా నౌకాదళం తమ గ్వాదర్ పోర్ట్‌ను శాశ్వతంగా వినియోగించుకునే అవకాశం ఇస్తామని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి ప్రతిఫలంగా అణుదాడి చేయగల సామర్థ్యం ఉన్న జలాంతర్గాములు లేదా అణు ఆయుధ వ్యవస్థను ఇవ్వాలని చైనాను పాక్ కోరిందని అమెరికాకు చెందిన ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ పేర్కొంది. శత్రుదేశం ముందుగా అణుదాడి చేసినా.. జలాంతర్గాముల నుంచి తిరిగి అణుదాడి చేసే శక్తిని పొందాలని పాక్ భావిస్తోంది. దీన్ని అణు నిరోధక వ్యవస్థలో అత్యంత కీలక భాగంగా భావిస్తారు.పాక్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించి.. పాకిస్థాన్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించామని, దాని ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నామని ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ తెలిపింది. 2024లో పాకిస్థాన్ సైన్యం-చైనా ద్వైపాక్షిక చర్చల్లో ఈ డిమాండ్ వచ్చిందని పేర్కొంది. ఆ సమయంలో పాకిస్థాన్ సైన్యానికి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ నాయకత్వం వహించాడు. 2024 ఆరంభంలో గ్వాదర్‌ను చైనా సైన్యానికి శాశ్వత స్థావరంగా మార్చేందుకు అనుమతి ఇస్తామని చైనాకు పాకిస్థాన్ రహస్యంగా హామీ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు ఇవ్వాలని చైనాను కోరింది. దీంతో ఇప్పటికే పాక్ వద్ద ఉన్న గగనతల, భూతల అణ్వాయుధాల ద్వంద్వ వ్యవస్థను సముద్ర వ్యూహాత్మక ఆయుధాలతో కూడిన త్రివిధ వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిమాండ్ అసంబద్ధమని చైనా భావించడంతో చర్చలు నిలిచిపోయాయి.ఇమ్రాన్ ఖాన్‌ను అధికారంలో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేటివ్‌లోని కీలక అధికారి రహస్య కేబుల్ వివరాలు కూడా ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ వెల్లడించింది. దీంతో, అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్.. అటు చైనా, ఇటు అమెరికాతో చర్చోపచర్చలు జరిపినట్టు స్పష్టమైంది. గత ఐదేళ్లలో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలను మలిచిన పరిణామాలను ఈ కథనం వివరించింది. అమెరికాతో సన్నిహితంగా ఉంటూనే.. వ్యూహాత్మక ఆయుధాలు ఇవ్వాలని చైనాతోనూ పాకిస్థాన్ బేరసారాలు జరిపింది.అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు 3 రకాలుగా ఉంటాయి.. అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు, బాలిస్టిక్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు.ఈ మూడింట్లో పాకిస్థాన్ దేన్ని కోరిందో పాకిస్థాన్ కథనంలో స్పష్టత లేదు. 1970 చివర, 1980 ఆరంభంలో చైనా సహకారంతో పాకిస్థాన్ అణుబాంబు తయారుచేసింది. రహస్య అణు సాంకేతిక బదిలీల్లో ఇదే తొలి ఉదాహరణగా భావిస్తున్నారు. అధిక సాంద్రత యురేనియం సరఫరాతో పాటు, 1960లలో పరీక్షించిన 12 కిలోటన్నుల సామర్థ్యమున్న సీహెచ్ఐసీ-4 అణు విస్ఫోటక రూపకల్పనను కూడా పాకిస్థాన్‌కు చైనా ఇచ్చింది. 1990లలో అణ్వాయుధాలను ప్రయోగించే ఎం-11 మధ్యదూర బాలిస్టిక్ క్షిపణులను కూడా పాకిస్థాన్‌కు చైనా విక్రయించింది.ఈ ఆయుధాలతో గగనతలం, భూమి నుంచి ప్రయోగించే ద్వంద్వ అణు వ్యవస్థను పాకిస్థాన్ తయారుచేసుకుంది. కానీ త్రివిధ వ్యవస్థలో మూడో భాగమైన సముద్ర ఆధారిత అణ్వాయుధ సామర్థ్యం మాత్రం సాంకేతిక, ఆర్థిక పరిమితుల వల్ల సాధ్యం కాలేదు.సముద్రం అడుగునుంచి ప్రయోగించే అణ్వాయుధాను అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా భావిస్తారు. శత్రువు తొలి అణుదాడి చేసినా, తీవ్ర నష్టం జరిగిన తర్వాత కూడా ప్రతిదాడి చేయొచ్చు. 2017లో 450 కిలోమీటర్ల పరిధితో జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించి త్రివిధ అణు వ్యవస్థ పూర్తి చేశామని పాకిస్థాన్ ప్రకటించింది. కానీ పాకిస్థాన్ వద్ద కేవలం 5 క్రియాశీల సంప్రదాయ జలాంతర్గాములు మాత్రమే ఉండటం, క్షిపణి పరిధి తక్కువగా ఉండటం వల్ల ఇది ప్రాథమిక స్థాయి సముద్ర అణు నిరోధక వ్యవస్థగానే మిగిలింది. -
చైనాలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు
గ్వాంగ్సీ : చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతాన్ని భయంకరమైన ప్రకృతి విపత్తు వణికించింది. సోమవారం తెల్లవారుజామున సంభవించిన 5.2 తీవ్రత గల భారీ భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ప్రాణభయంతో ఒక్కసారిగా ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీశారు. కళ్ల ముందే క్షణాల వ్యవధిలోనే పలు బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇద్దరు మృత్యువాత గ్వాంగ్సీ పరిధిలోని లియోజౌ నగరం, అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాలను ఈ భూకంపం అత్యంత తీవ్రంగా కుదిపేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరొకరు గల్లంతైనట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా, సీసీటీవీ తమ కథనాల్లో వెల్లడించాయి. ఈ విపత్తులో గాయపడిన మరో నలుగురు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని ఉన్నతాధికారులు తెలిపారు.నేలమట్టమైన 13 భవనాలుభారీ ప్రకంపనల ధాటికి ఆ ప్రాంతంలో ఏకంగా 13 భవనాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయని అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా ప్రాణనష్టాన్ని నివారించే ఉద్దేశ్యంతో ప్రభావిత ప్రాంతాల నుంచి ఏకంగా 7,000 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర ప్రతిస్పందన బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక, పునరావాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రైల్వే వ్యవస్థపై ప్రభావంభూకంపం దెబ్బకు రైల్వే వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. రైల్వే మౌలిక సదుపాయాలకు వాటిల్లిన నష్టాన్ని, భద్రతా పరిస్థితులను అంచనా వేసేందుకు నిపుణుల బృందాలు విస్తృత తనిఖీలు ప్రారంభించాయి. ఈ క్రమంలో రైళ్ల రాకపోకలకు, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఆఫ్టర్ షాక్స్ (మరిన్ని ప్రకంపనలు) వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో, అదనపు నష్టం జరగకుండా నివారించేందుకు అత్యవసర సహాయక సిబ్బందిని భారీ సంఖ్యలో మోహరించారు. -
ఇటు అంగీకారాలు, అటు హెచ్చరికలు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల చర్చలు ఇరువురూ కోరుకున్నట్లే సాగాయి. బీజింగ్ ప్రయాణానికి ముందు ట్రంప్ మాట్లాడుతూ, తమకు ‘అన్నింటికన్న వాణిజ్యం ముఖ్య’మన్నారు. షీ చెప్పిన ప్రధానమైన లక్ష్యాలు, ‘అమెరికాతో నిర్మాణాత్మకమైన సంబంధాలు, వ్యూహాత్మకమైన స్థిరత్వం’. నాయకులిద్దరి మధ్య మే 14, 15 తేదీలలో రెండు విడతల సమావేశం తర్వాత, అంతా సజావుగా జరిగిందన్నది ఉభయుల సంతృప్తి. అదే సమయంలో చైనా అధ్యక్షుడు తైవాన్ విషయమై అమెరికాకు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన హెచ్చరికలు చేసి ఆశ్చర్యపరిచారు. ట్రంప్ నుంచి మౌనమే సమాధానమైంది.‘ఒకే చైనా’కు ఒప్పుకొంటారా?మిగిలినదంతా సవ్యంగానే జరిగినందున, అపశృతిగా మారిన తైవాన్ అంశంపై జరిగిందేమిటో ముందు చూడాలి. చారిత్రకంగా చూసినా, అంతర్జాతీయ చట్టాల ప్రకారమైనా తైవాన్ దీవి చైనాలో భాగం. అమెరికా సహా ప్రపంచమంతా ‘ఒకే చైనా’ సూత్రాన్ని అంగీ కరిస్తున్నాయి. తైవాన్‌తో దౌత్య సంబంధాలు లేవు. అదే సమయంలో గమనించదగ్గదేమంటే... అమెరికా, దాని మిత్ర దేశాలు కేవలం తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం తైవాన్‌కు భారీ ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తూ, పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తైవాన్ చైనాదేననీ, కానీ వారికి ఇష్టం లేకుండా చైనాలో విలీనం చేసుకునేందుకు అంగీకరించ బోమనీ విచిత్రమైన వాదన చేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాను సాధారణ దౌత్య మార్గంలో ఒప్పించేందుకు ప్రయత్నిస్తూ వచ్చిన చైనా అధ్యక్షుడు, అమెరికా ‘సవ్యంగా వ్యవహరించని పక్షంలోరెండు దేశాల మధ్య విభేదాలు, చివరకు ఘర్షణ తప్పక పోవచ్చు’ నని ట్రంప్‌ను హెచ్చరించారు.విషయ తీవ్రత దృష్ట్యా ఇందు గురించి మరికొన్ని వివరాలు చూద్దాము: ఒకవైపు ‘ఒకే చైనా’ సూత్రాన్ని అంగీకరిస్తూనే, మరొక వైపు తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా, తన ద్వంద్వ నీతికి ‘వ్యూహాత్మక అస్పష్టత’ (స్ట్రాటెజిక్ ఆంబిగ్విటీ) అనే పేరు తానే పెట్టింది. తైవాన్ను కాపాడటం తమ లక్ష్యమంటూ చట్టమే చేసింది. ఒకవేళ తైవాన్ను చైనా స్వాధీనపరచుకొనజూస్తే తాను తైవాన్‌కు సహాయం మాత్రమే చేస్తుందా లేక స్వయంగా యుద్ధంలో పాల్గొంటుందా అనే ప్రశ్నకు అవుననిగానీ, కాదనిగానీ స్పష్టం చేయటం లేదు. మరొకవైపు బైడెన్ ప్రభుత్వం ప్రకటించిన ఇండో– పసిఫిక్ స్ట్రాటెజీ (2022), ట్రంప్ తన రెండవ హయాంలో ప్రకటించిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటెజీ (2025), నేషనల్ డిఫెన్స్ స్ట్రాటెజీ (2026) పత్రాలను పరిశీలించినప్పుడు, తైవాన్ను ఉపయోగించు కుని చైనాను నియంత్రించటం వారి ఉద్దేశమని లిఖితపూర్వకంగా, బహిరంగంగా ప్రకటించటం కనిపిస్తుంది.మౌనం ప్రస్తుతానికేనా?ఈ దిశలో అమెరికా ఇంకా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్న పరిస్థితిలోనే చైనా అధ్యక్షుడు, బహుశా విసుగెత్తి కావచ్చు, గతంలో ఎన్నడూ లేని రీతిలో పై విధమైన హెచ్చరికను ముఖాముఖీగా చేశారు. సమావేశాల సమయంలో, అంతకుముందూ ఇంకా ఏమేమి మాటలు వినిపించాయో గమనించాలి. తక్కిన విషయాలన్నీ ఎట్లున్నా, చైనాకు గల ‘ముఖ్యమైన ప్రయోజనాలలో అతి ముఖ్యమైన ప్రయోజనం’ తైవాన్ అన్నారాయన. ఈ అంశం సవ్యంగా తేలనట్లయితే ‘అత్యంత తీవ్రమైన ప్రమాదకర పరిస్థితికి’ దారి తీయగలదన్నారు. అమెరికా– చైనా సంబంధాలు యావత్తు ప్రమాదకరమవుతాయని హెచ్చరించారు. తైవాన్ స్వాతంత్య్రం, ఆ ప్రాంతంలో శాంతి అన్న రెండు మాటలు నీళ్లు–నిప్పు వంటివనీ, రెండింటికి పొసిగే ప్రసక్తి లేదనీ అన్నారు.తైవాన్ గురించి ఇంతింత చెప్పుకోవటం ఎందుకంటే, 1949లో చైనాలో కమ్యూనిస్టు విప్లవం రావటానికి ముందు, వారికి చెందిన తైవాన్ దీవిని జపాన్ సైనికంగా ఆక్రమించింది. తర్వాత, మావోతో ఓడిపోయిన చాంగ్ కై షేక్ వర్గం తైవాన్‌కు పారిపోగా, ఆ వర్గాన్ని అమెరికా కూటమి, జపాన్ మద్దతిచ్చి నిలబెట్టాయి. మొదటి నుంచి చైనాకు చెందిన ఆ దీవిని తిరిగి తమ దేశంలో విలీనం చేసుకోవటం చైనా నాయకత్వానికి ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ లక్ష్యంగా మారింది. ఇపుడు ట్రంప్‌తో చర్చల సందర్భంగా చైనా అధ్యక్షుడు ఈ విషయమై ఎన్నడూ లేనంత తీవ్రంగా మాట్లాడటానికి వెనుక ఈ సుదీర్ఘ నేపథ్యం ఉంది. విషయం అమెరికా పక్షానికి తెలియనిది కాదు. పరిస్థితి శాంతియుతంగా తేలనట్లయితే ఎప్పటికైనా సరే తైవాన్ను బలప్రయోగం ద్వారానైనా విలీనం చేసుకోగలమన్నది కూడా చైనా చెప్తున్న మాటే. జిన్‌పింగ్ హెచ్చరికలకు 14వ తేదీన ట్రంప్ స్పందించలేదు. కానీ ముందు రోజున ఆయన విదేశాంగ మంత్రి మార్కో రూబియో ‘మా విధానంలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పు లేదు. చైనా సైనిక చర్యకు పాల్పడితే అది పొరపాటు అవుతుంది’ అని మాత్రం అన్నారు. కొద్ది నెలల క్రితం ట్రంప్ ఒక ప్రశ్నకు జవాబిస్తూ, ‘చైనా అభిప్రాయాలు తెలుసు. వారు తైవాన్ విషయమై పట్టుదలగా ఉన్నారు. కనీసం నా అధ్యక్ష కాలంలో సైనిక చర్య తీసుకోబోదని ఆశిస్తాను’ అన్నారాయన. గమనించవలసింది ఏమంటే, అధికారంలో ఉన్నది రిపబ్లికన్లా, డెమోక్రాట్లా అన్న దానితో నిమిత్తం లేకుండా, పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రయోజ నాలకు, చైనాను కట్టడి చేసేందుకు తైవాన్ తమ పలుకుబడిలో ఉండాలన్నది అమెరికా వ్యూహం. ఇపుడు చైనా అధ్యక్షుని హెచ్చరిక ప్రభావం ఎట్లుండవచ్చునన్నది వేచి చూడవలసిన విషయం.ట్రాప్‌లో పడొద్దు!చర్చల వివరాలను ఇతరత్రా గమనించినప్పుడు, ప్రధానమై నది పరస్పర ఆర్థిక సంబంధాలు. వాణిజ్యపరంగా ‘గొప్ప ఒప్పందాలు’ జరిగినట్లు ట్రంప్ ప్రకటించారు. ఆయన వెంట సుమారు 30 అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలను తీసుకువెళ్లటంలోని ఉద్దేశమూ అదే. అమెరికాలోనూ అదే పద్ధతిలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశ మిస్తామన్నారు. అభివృద్ధి విషయంలో అమెరికా, చైనాలు భాగస్వా ములుగా పరస్పరం సహకరించుకోవాలి తప్ప పోటీదారులు కారా దనీ, ఇరువురి సంబంధాలు స్థిరమైన విధంగా సాగాలనీ షీ అన్న మాటలు ట్రంప్‌కు నచ్చినట్లే కనిపించాయి. తమ సంబంధాలు ‘గతంలో ఎన్నడూ లేనంతగా’ ముందుకు పోగలవన్నారాయన.చైనా అధ్యక్షుడు తన పరస్పర సహకార సూచనలకు మద్దతుగా, క్రీస్తు పూర్వం అయిదవ శతాబ్దంలో స్పార్టా, ఏథెన్స్ల మధ్య జరిగిన ఒక యుద్ధాన్ని ఉదహరించారు. అగ్రస్థానంలో ఉండిన స్పార్టా, రెండవ స్థానంలో ఉండిన ఏథెన్స్ తనను మించి పోగదలనే భయంతో ముందస్తు యుద్ధం వంటిది చేస్తుంది. అట్లా భయంలో చిక్కుకోవటాన్ని తుసిడిడీస్ అనే చరిత్రకారుడు విశ్లేషించి చెప్పాడు. అప్పటినుంచి ఆ భయాందోళనల స్థితిని ‘తుసిడిడీస్ ట్రాప్’ అంటున్నారు. అమెరికా, చైనా అటువంటి ట్రాప్‌లో చిక్కు కోకుండా పరస్పర సహకారంతో అభివృద్ధి చెందాలని జిన్‌పింగ్ సూచించగా, అటువంటి సహకారం గతంలో ఎన్నడూ లేనంతగా ఉండగలదన్నది ట్రంప్ ఇవ్వబూనిన భరోసా!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
60 ఏళ్లకు గర్భం దాల్చి తల్లి అయ్యి.. 76 ఏళ్ల వయసులోనేమో..
బీజింగ్: చైనాలో 16 ఏళ్ల క్రితం 60 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చింది ఓ బామ్మ. గర్భం దాల్చిన అత్యధిక వయసున్న మహిళగా అప్పట్లో వార్తల్లో నిలిచిన ఆ మహిళకు ఇప్పుడు 76 ఏళ్లు. వ్యక్తిగతంగా ఎన్నో విషాదాలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఆమె ఈ వయసులో సోషల్ మీడియా ద్వారా తనను తాను నిరూపించుకుంది.ఆ బామ్మ పేరు షెంగ్ హైలిన్. ఆమె జీవిత ప్రయాణాన్ని చూపించిన ఫోటో సిరీస్ అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచింది. గత కొన్ని ఏళ్లుగా కష్టపడి షెంగ్ చైనా సోషల్ మీడియా వేదికల్లో దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించింది. సోషల్ మీడియాలో ఆమె పేరెంటింగ్ సలహాలు, వంట వీడియోలు, ప్రేరణాత్మక విషయాలు పంచుకుంటోంది.60 ఏళ్ల వయసులో పిల్లలు ఎందుకు? షెంగ్ ఏకైక కుమార్తె టింగ్టింగ్, అల్లుడు పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే 2009లో కార్బన్ మోనాక్సైడ్ విష ప్రభావంతో మృతి చెందారు. ఆ విషాదం, ఒంటరితనంతో తీవ్రంగా కలత చెందిన షెంగ్, 60 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ చికిత్స చేయించుకోవాలని నిర్ణయించింది. అప్పట్లో ఈ విషయం చైనాలో సంచలనం రేపింది.గర్భధారణ సమయంలో తీవ్రమైన వాపులు, రక్తస్రావం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా, షెంగ్ 2010లో జిజి, హుయ్‌హుయ్ అనే కవల పాపలకు జన్మనిచ్చింది. ఈ ప్రసవం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. షెంగ్, ఆమె భర్త జీవితాల్లో ఆ కవల పిల్లలు కొత్త ఆశ నింపినా వృద్ధాప్యంలో పిల్లలను పెంచడం సవాలుగా మారింది. షెంగ్ పదవీ విరమణకు ముందు ఆసుపత్రి డైరెక్టర్‌గా పని చేసింది. ఆమె భర్త యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. అయినా పిల్లల సంరక్షణ, విద్య, రోజువారీ ఖర్చులు కుటుంబంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి.కుటుంబాన్ని పోషించడం కోసం షెంగ్ చైనా అంతటా తిరుగుతూ ఆరోగ్యం, పోషకాహారం అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చింది. తన కుమార్తెలకు నాణ్యమైన విద్యతో పాటు పియానో, డ్యాన్స్ వంటి శిక్షణ అందించేందుకు ఆమె నిరంతరం శ్రమించింది.అయితే, 2016లో షెంగ్ భర్తకు పక్షవాతం రావడంతో కుటుంబం మరో భారీ విషాదాన్ని ఎదుర్కొంది. అనంతరం గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన 2022లో మృతి చెందారు. అదే సమయంలో నకిలీ పెట్టుబడి మోసంలో షెంగ్ 20 లక్షల యువాన్లకుపైగా డబ్బు కోల్పోయిందని సమాచారం.షెంగ్ ఆన్లైన్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. 73 ఏళ్ల వయసులో లైవ్‌స్ట్రీమింగ్, షార్ట్ వీడియోలను ప్రారంభించింది. కుమార్తెల భవిష్యత్తు కోసం సంపాదించడం కొనసాగించింది. ఇప్పుడు ఆమెకు 76 ఏళ్లు. ప్రస్తుతం ఆమె తరచుగా లైవ్‌స్ట్రీమ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ పేరెంటింగ్, వృద్ధాప్యం, రోజువారీ జీవితం గురించి మాట్లాడుతోంది. ఇంటి సామగ్రి, ఆరోగ్య సంబంధిత వస్తువులు కూడా విక్రయిస్తోంది. ఆన్లైన్లో “మదర్ షెంగ్” పేరుతో ప్రసిద్ధి చెందిన ఆమె అనేక మంది తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలిచింది. -
సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..
అందరు చేసే వంటకమే కానీ దాన్ని సర్వ్ చేసే విధానం లేదా వండే విధానంలో ప్రత్యేకత ఉంటేనే కథ ఏ ఫుడ్ స్టాల్ అయినా క్లిక్ అయ్యేది. ప్రజాదరణ పెరిగేది. బహుశా దాన్నే క్యాచ్ చేశాడు ఈ టీనేజ్ యువకుడు. అలా ఇలా ఆలోచించలేదు ఈ యువకుడు. వంట చేసే విధానంలో సరికొత్తగా ఫ్యాషన్ జోడించడంతో అతడ ఫుడ్ స్టాల్ మూడు పువ్వులు ఆరు కాయల్లా దినదినాభివృద్ధితో దూసుకుపోతోంది. ఇంతకీ స్టైలిష్‌గా వంట చేయడం ఎలాగంటే..చైనాకు చెందిన ఒక యువకుడు ఒక సాధారణ ఫ్రైడ్ రైస్ దుకాణాన్ని తన క్రియేటివిటీతో కొత్త లుక్‌ని అందించడమే కాదు లాభాల బాట పట్టేలా చేశాడు. అందరిలా వండటం కంటే.. ప్రత్యేకంగా విభిన్నంగా వంట చేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా అతడి వద్దకు వచ్చేవాళ్లు తినడాని కంటే..అతడు చేసే విధానం అతడి ఆహార్యం చూసి నివ్వెరపోతూ ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తిగా వస్తూ..ఇక అక్కడే తింటుండటం విశేషం. 19 ఏళ్ల లూ షాన్డాంగ్ ఈనే యువకుడు కుటుంబ దుకాణాన్ని చాలా విభన్నంగా నడిపిస్తున్నాడు. ఎవరైన వంట చేయాడానికి వచ్చే వాళ్లు కుక్ డ్రెస్ లాంటది వేసుకుంటారు. కానీ ఇక్కడ లూ ఫ్యాషన్‌గా ఉంటాడు. ఆయన ఆఫీస్‌కి వెళ్లే వ్యక్తిలా సూటు బూటు వేసుకుని కనిపించడం విశేషం. చైనాలోని ఓ సాదారణ ఫ్రైడ్ రైస్ స్టాల్ రెస్టారెంట్‌కు మించి క్రేజ్ సంపాదించుకుంది. అందుకు ప్రధాన కారణం అతడు వండే విధానమే. లీ చాలా స్టైలిష్‌గా వండుతున్న విధానం అందర్నీ ఆకర్షించి ఆ స్టాల్‌కి జనాలు క్యూకట్టేలా ప్రజాదరణ పొందింది. అంతేకాదండోయ్ ఎంతో రుచిగా క్షణాల్లో వేడివేడిగా వడ్డిస్తాడు. అతడు ఎంత బిజీలో అయినా ఫ్రైడ్ రైస్‌ని జస్ట్ మూడు నిమిషాల్లో తయారు చేస్తాడు. ఇక ఫైడ్‌రైస్ ఒక ప్లేటు రూ. 1401లు అట. అతడి ఖర్చులు పోగా నెలకు సుమారుగా రూ. 7లక్షలుపైనే ఆర్జిస్తున్నట్లు తెలిపాడు. క్రియేటివిటీకి నైపుణ్యం తోడైతే అద్భుతాలు జరగుతాయి అంటే ఇదేగదా..!. లూ నవ్వు మామలు గ్రేట్ కాదు..సూపరో సూపర్..!. కాగా, ఈ స్టాల్ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈమేరకు లూ మాట్లాడుతూ..ఏదో సరదాగా కస్టమర్ల ముఖంలో నువ్వులు విరబూయించేందుకు ఇలా సూటు వేసుకుని వంట చేశాను. కానీ వాళ్ల నుంచి ఈ స్ధాయిలో స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదని సంతోషంగా చెబుతున్నాడు లూ. View this post on Instagram A post shared by Mothership (@mothershipsg) (చదవండి: కోడిగుడ్డంత పుచ్చకాయలు) -
చైనా కంత్రీ వేషాలు.. తైవాన్ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చేతులెత్తేశారు. తైవాన్‌కు అండగా నిలుస్తామని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చిన ట్రంప్.. చైనా పర్యటన అనంతరం తైవాన్‌కు భారీ షాకిచ్చారు. చైనా నుంచి తైవాన్ను రక్షించలేమని నాలుక మడతేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌నకు తైవాన్ విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. తైవాన్ ఎప్పటికీ చైనాకు లోబడి ఉండదని తేల్చిచెప్పింది.అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల అనంతరం, తైవాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. తమది పూర్తి సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం కలిగిన ‘స్వతంత్ర’ దేశమని స్పష్టం చేసింది. తైవాన్ ఎప్పటికీ చైనాకు లోబడి ఉండదని తేల్చిచెప్పింది. అమెరికా నుంచి తాము కొనుగోలు చేసే ఆయుధాలు, ఉభయ దేశాల మధ్య ఉన్న 'తైవాన్ రిలేషన్స్ యాక్ట్' భద్రతా ఒప్పందంలో భాగమేనని సమర్థించుకుంది. మరోవైపు, తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టే కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ను సార్వభౌమ దేశంగా చూస్తామని ప్రకటించారు. తైవాన్ ప్రజాస్వామ్యాన్ని, స్వతంత్రతను కాపాడుకోవడమే తమ లక్ష్యం అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు చైనా-అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతను మరింత పెంచాయి. కాగా, అమెరికా, చైనా ఒత్తిడుల మధ్య తైవాన్ తన స్వీయ గుర్తింపును నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.ఇదిలా ఉండగా.. చైనా పర్యటన తర్వాత తైవాన్ విషయమై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో దూరంగా ఉన్న తైవాన్ కోసం అత్యంత బలీయమైన చైనాను ఢీకొట్టలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఎవరో(తైవాన్) స్వతంత్రంగా ఉండాలని తాను ఆకాంక్షించడం లేదన్నారు. చైనా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొనే ఆలోచన మానుకోవాలని తైవాన్‌కు సూచించారు. ‘‘మనం యుద్ధం చేయడానికి 15,289 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. నేను అది కోరుకోవడం లేదు. చైనాకు తైవాన్ ద్వీపం కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్లు(తైవాన్, చైనా) సహనం వహించాలని కోరుతున్నాను. ఉద్రిక్తతలకు దూరంగా ఉండాలి. తైవాన్ ద్వీపం గురించి నేను, జిన్‌పింగ్ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అయితే, తైవాన్ను అమెరికా రక్షిస్తుందా? లేదా అనేదానిపై చర్చించడానికి నేను నిరాకరించా. తైవాన్ విషయంలో జిన్‌పింగ్‌కు స్పష్టమైన, బలమైన ఉద్దేశాలు ఉన్నాయి. తైవాన్ స్వాతంత్య్ర పోరాటం ఆయనకు ఎంతమాత్రం ఇష్టంలేదు’’అని స్పష్టంచేశారు. తైవాన్ విషయంలో ఇకపై జోక్యం చేసుకునే ఆలోచన లేదని సంకేతాలిచ్చారు. చైనా–తైవాన్ సమస్య ప్రధానంగా “సార్వభౌమాధికార” (sovereignty) పై వివాదం. చైనా తైవాన్ను తన ప్రావిన్స్‌గా భావిస్తే, తైవాన్ ప్రజాస్వామ్యంగా స్వతంత్ర దేశంలా పనిచేస్తోంది. ఈ విభేదం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన ఘర్షణకు కారణమవుతోంది. ఇక, తైవాన్‌లో అమెరికా పాత్ర ప్రధానంగా రక్షణ, వాణిజ్యం, మరియు రాజకీయ మద్దతు చుట్టూ తిరుగుతుంది. 1979లో చైనాతో అధికారిక సంబంధాలు ఏర్పరచుకున్నప్పటికీ, అమెరికా Taiwan Relations Act ద్వారా తైవాన్‌కు ఆయుధాలు, రక్షణ సహాయం అందిస్తోంది. ఇది చైనా-అమెరికా సంబంధాల్లో అత్యంత ఉద్రిక్తకర అంశం.చరిత్రాత్మక నేపథ్యం1895: షిమోనోసేకి ఒప్పందం ప్రకారం తైవాన్ జపాన్‌కు అప్పగించబడింది.1945: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తైవాన్ను రిపబ్లిక్ ఆఫ్ చైనా (ROC)కు అప్పగించారు.1949: చైనా అంతర్గత యుద్ధంలో కమ్యూనిస్టులు విజయం సాధించగా, నేషనలిస్టులు తైవాన్‌కు పారిపోయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.1971: ఐక్యరాజ్యసమితిలో చైనా స్థానాన్ని బీజింగ్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) స్వీకరించింది. తైవాన్ అంతర్జాతీయంగా ఒంటరైంది.చైనా తైవాన్ను “విభిన్న ప్రావిన్స్”గా భావిస్తుంది.ఒక దేశం, రెండు వ్యవస్థలు (హాంకాంగ్ మోడల్) ప్రతిపాదించింది కానీ తైవాన్‌లో ప్రధాన పార్టీలు దీనిని తిరస్కరించాయి.బలప్రయోగం ద్వారా అయినా తైవాన్ను కలుపుకోవాలని హెచ్చరిస్తోంది.తైవాన్‌లో ప్రజాస్వామ్య ఎన్నికల ప్రభుత్వం ఉంది, సుమారు 2.3 కోట్ల జనాభా.ఎక్కువ మంది ప్రజలు ప్రస్తుత స్థితి (status quo) కొనసాగాలని కోరుకుంటున్నారు. అంటే పూర్తిగా స్వతంత్రత ప్రకటించకుండా, చైనాకు లోబడకుండా ఉండాలనుకుంటున్నారు.అంతర్జాతీయ ప్రభావంఅమెరికా: తైవాన్‌కు ఆయుధాలు, రక్షణ సహాయం అందిస్తోంది.ఐక్యరాజ్యసమితి: తైవాన్ సభ్యత్వం లేదు; కేవలం 12 చిన్న దేశాలు మాత్రమే అధికారికంగా గుర్తిస్తున్నాయి.ప్రాంతీయ భద్రత: తైవాన్‌పై దాడి జరిగితే, అమెరికా-చైనా మధ్య యుద్ధం జరిగే ప్రమాదం ఉంది. -
మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్: చైనా బారి నుంచి తమ మిత్రదేశం తైవాన్ను రక్షించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారు. తైవాన్‌కు అండగా నిలుస్తామని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని ఇన్నాళ్లూ ప్రకటించిన ట్రంప్ చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో భేటీ తర్వాత మాట మార్చేశారు. ఎక్కడో దూరంగా ఉన్న తైవాన్ కోసం అత్యంత బలీయమైన చైనాను ఢీకొట్టలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఎవరో(తైవాన్) స్వతంత్రంగా ఉండాలని తాను ఆకాంక్షించడం లేదన్నారు. చైనా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొనే ఆలోచన మానుకోవాలని తైవాన్‌కు సూచించారు. శుక్రవారం ఫాక్స్‌న్యూస్‌తో ట్రంప్ మాట్లాడారు. ‘‘మనం యుద్ధం చేయడానికి 15,289 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. నేను అది కోరుకోవడం లేదు. చైనాకు తైవాన్ ద్వీపం కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్లు(తైవాన్, చైనా) సహనం వహించాలని కోరుతున్నాను. ఉద్రిక్తతలకు దూరంగా ఉండాలి. తైవాన్ ద్వీపం గురించి నేను, జిన్‌పింగ్ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అయితే, తైవాన్ను అమెరికా రక్షిస్తుందా? లేదా అనేదానిపై చర్చించడానికి నేను నిరాకరించా. తైవాన్ విషయంలో జిన్‌పింగ్‌కు స్పష్టమైన, బలమైన ఉద్దేశాలు ఉన్నాయి. తైవాన్ స్వాతంత్య్ర పోరాటం ఆయనకు ఎంతమాత్రం ఇష్టంలేదు’’అని ట్రంప్ స్పష్టంచేశారు. తైవాన్ విషయంలో ఇకపై జోక్యం చేసుకొనే ఆలోచన లేదని సంకేతాలిచ్చారు. అమెరికా, చైనా.. జి–2 డొనాల్డ్ ట్రంప్ చైనాలో మూడు రోజుల పర్యటన పూర్తిచేసుకొని శుక్రవారం సాయంత్రం స్వదేశానికి తిరిగివచ్చారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో జరిగిన చర్చలను రెండు గొప్ప దేశాల నాయకుల సమావేశంగా అభివర్ణించారు. అమెరికా వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చే ఒప్పందాలతో సహా ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలను చైనాతో కుదుర్చుకున్నట్లు చెప్పారు. ‘‘అమెరికా చైనాలు గొప్ప దేశాలు. నేను దీన్ని జి–2 అని పిలుస్తాను’’ అని అభివర్ణించారు.చైనా బహుమతులు బుట్టదాఖలు బీజింగ్: కీలకమైన ఒప్పందాల కోసం తన బృందంతో కలిసి చైనా పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరకు ఉత్తచేతులతోనే వెనక్కి వెళ్లిపోయారు. కొన్ని ఒప్పందాలు కుదిరాయని ట్రంప్ చెప్పినప్పటికీ వాటి వివరాలు బహిర్గతం చేయలేదు. ఒక దేశాధినేత మరో దేశానికి అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు బహుమతులతో సత్కరించడం ఆనవాయితీ. పుస్తకాలు కూడా బహూకరిస్తుంటారు. అధినేత బృందంలోని సభ్యులకు కూడా బహుమతులు లభిస్తాయి. వాటిని స్వదేశానికి తీసుకెళ్తుంటారు. అధ్యక్షుడికి వచ్చినవి ప్రభుత్వ ఆస్తి. వాటిని వేలం వేయడమో లేదా మ్యూజియంలో భద్రపర్చడమో చేస్తుంటారు. కానీ.. ట్రంప్, ఆయన బృందం మాత్రం చైనా నుంచి ఏమీ తీసుకెళ్లకుండా తిరిగి వెళ్లిపోయారు. శుక్రవారం బీజింగ్‌లో ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం సమీపంలో ఏర్పాటు చేసిన చెత్తకుండిలో వాటిని వదిలేశారు. చైనా వస్తువులేవీ తమ దగ్గర ఉండకుండా జాగ్రత్తపడ్డారు. ట్రంప్ ప్రతినిధి బృందం, వైట్‌హౌస్ సిబ్బంది, ఆఖరికి అమెరికా జర్నలిస్టులు కూడా చైనా బహుమతులను ఇక్కడే విడిచిపెట్టారు. చైనా పర్యటనకు వచ్చినప్పుడు అమెరికా సిబ్బంది ఇలా చేయడం మొదటిసారి కాదు. కానీ, బహిరంగంగా అందరూ చూస్తుండగా బహుమతులను పక్కనపారేయడం మాత్రం ఇదే తొలిసారి. అమెరికా నుంచి వచ్చిన సిబ్బందికి చైనా అధికారులు ఫోన్లు, ఎల్రక్టానిక్ పరికరాలు, బ్యాడ్జ్‌లు, జ్ఞాపికలను గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ, అవన్నీ చైనాలోనే చెత్తకుండి పాలయ్యాయి. తమపై చైనా ప్రభుత్వం నిఘా పెడుతుందన్న భయంతోనే బహుమతులను వదిలేశారని తెలుస్తోంది. -
వైమానిక దాడులకు ట్రంప్ ప్లాన్..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య సీజ్ఫైర్ నడుస్తోంది. దీంతో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా మీడియా ప్రచురించింది. టెహ్రాన్‌పై మరోసారి వైమానిక దాడులకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.ట్రంప్ చైనా పర్యటన ముగించుకొని ప్రయాణంలో ఇరాన్ ప్రతిపాదించిన శాంతియుత ఒప్పందాని ఆయన తోసిపడేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. "నేను దానిని చూశాను, మొదటి వాక్యం నచ్చకపోతే నేను దానిని పక్కన పడేస్తాను" అని ఆయన అన్నట్లు తెలిపాయి.పశ్చిమాసియాలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు ఈ విషయమై మీడియాతో మాట్లాడారాని అమెరికా- ఇజ్రాయెల్ బలగాలు మరోసారి సంయుక్తంగా అమెరికాపై దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయనితెలిపినట్లు పేర్కొన్నాయి. కాగా ఇరాన్ అణ్వాయుధ రహిత దేశంగా ఉండాలని అమెరికా, చైనా సంయుక్తంగా అంగీకరించాయిని ఎట్టిపరిస్థితుల్లో ఇరాన్ హర్ముజ్ జలసంధిని తెరవాలని సంయుక్త ప్రకటన చేసినట్లు ANI నివేదిక పేర్కొంది.చైనా రాగం పాడిన ట్రంప్చైనా పర్యటన తిరుగు ప్రయాణంలో ట్రంప్ చైనా రాగం పాడారు. "మేము అక్కడ చాలా బాగా గడిపాము అది ఒక అద్భుతమైన కాలం. అధ్యక్షుడు షీ ఒక అద్భుతమైన వ్యక్తి. జిన్‌పింగ్, తాను తైవాన్ గురించి చాలా మాట్లాడుకున్నాము అన్నారు. అదే విధంగా ఇరాన్ గురించి చాలా చర్చించాము ఈ రెండు విషయాలపై మాకు చాలా మంచి అవగాహన ఉందని నేను భావిస్తున్నాను". అన్నారు.కాగా ఇరు దేశాల చర్చలలో చైనాకు తైవాన్ అత్యంత ముఖ్యమైన అంశంగా నిలిచింది. బీజింగ్ తన భూభాగంగా చెప్పుకుంటున్న ఈ స్వయం పరిపాలన ద్వీపం విషయంలో ఉన్న విభేదాలు అమెరికా, చైనాల మధ్య ఘర్షణలకు లేదా సంఘర్షణలకు దారితీయవచ్చని జిన్‌పింగ్ వ్యక్తిగతంగా ట్రంప్‌ను హెచ్చరించినట్లు రాయిటర్స్ నివేదించింది. -
మీకు తిక్కుంటే.. వాళ్లు తొక్క తీసి లెక్క తేలుస్తారు!
చిన్నపాటి అసహనం పలు సందర్బాల్లో తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని అంటారు కదా.. అలాగే, ఘటనే ఒకటి థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. ఆవేశం, అసహనంతో ఓ చైనా టూరిస్ట్ చేసిన తప్పిందం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకునే వరకు వెళ్లింది. అలాగే, సదరు చైనా టూరిస్ట్ మరోసారి తమ దేశంలోకి రాకుండా జీవిత కాల నిషేధం కూడా విధించారు. ఇక, అతడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ చైనా టూరిస్ట్ ఏం చేశాడంటే.. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. చైనాకు చెందిన జెంగ్ లివేయ్(30) తన భార్యతో కలిసి థాయ్‌లాండ్ పర్యటనకు వచ్చాడు. అనంతరం, బుధవారం మధ్యాహ్నం చైనాకు తిరిగి వెళ్లే విమానం కోసం బ్యాంకాంక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుండగా విమానాశ్రయంలో ఆటోమేటెడ్ పాస్‌పోర్ట్ నియంత్రణ వ్యవస్థను ఉపయోగిస్తున్నప్పుడు అసహనానికి గురయ్యాడు. చెక్ పాయింట్ వద్ద ఆటోమేటెడ్ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను సరిగ్గా పూర్తి చేయలేదు. దీంతో, ప్రయాణ పత్రాన్ని స్కానర్‌కు పదేపదే విసిరి, ఆటోమేటిక్ అడ్డంకులను తన్ని, గేట్ల గుండా బలవంతంగా వెళ్లాడు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.అనంతరం, క్లియరెన్స్ తీసుకోకుండా అతను చెక్‌పాయింట్ దాటిన తర్వాత ఇమ్మిగ్రేషన్ అధికారులు జోక్యం చేసుకున్నట్లు సమాచారం. థాయ్ వార్తాపత్రిక 'ది నేషన్' ప్రకారం, ఆ తర్వాత జెంగ్ చైనీస్ భాషలో అధికారులను దూషించి, వారి వైపు వెళ్ళడానికి ప్రయత్నించగా, అతని భార్య అతన్ని నిలువరించింది. దీంతో, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం, విధుల్లో ఉన్న అధికారులను అవమానించడం, అనుమతి లేకుండా ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్ దాటడం వంటి ఆరోపణలతో అధికారులు అతనిపై పలు ఫిర్యాదులు నమోదు చేశారు.🚨🇹🇭 Thai police arrested a Chinese traveler named Zheng Liwei for allegedly kicking and damaging two automated passport control gates at Suvarnabhumi Airport. The disturbance in the terminal resulted in charges being filed against him.The consequences:- The suspect agreed to… pic.twitter.com/oZbfkgyXh5— Jeab (@Jeab1030599) May 14, 2026అంతేకాకుండా.. జెంగ్ కారణంగా ఆటోమేటెడ్ గేట్లకు సుమారు 4,80,000 బాత్(భారత కరెన్సీలో దాదాపు రూ.14 లక్షలు) నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనలో రెండు పాస్‌పోర్ట్ కంట్రోల్ గేట్లు దెబ్బతిన్నాయని నివేదికలు తెలిపాయి. అనంతరం, థాయ్ అధికారులు అప్పటి నుండి జెంగ్ వీసాను రద్దు చేసి, అతడిని జీవితకాల బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. దీనివల్ల భవిష్యత్తులో అతను థాయ్‌లాండ్‌లోకి తిరిగి ప్రవేశించకుండా సమర్థవంతంగా నిరోధించబడ్డాడు. SCMP నివేదిక ప్రకారం చట్టపరమైన విచారణలు పూర్తయిన తర్వాత అతడిని దేశం నుండి బహిష్కరిస్తారు.నిఘా కఠినతరం..మరోవైపు.. థాయ్‌లాండ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో పర్యాటకుల దుష్ప్రవర్తనపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, థాయ్ అధికారులు విదేశీ సందర్శకులపై నిఘాను కఠినతరం చేస్తున్నారు. ఈ తరుణంలో జెంగ్ ఘటన వెలుగుచూసింది. దీంతో, ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా థాయ్‌లాండ్ 93 దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు వీసా రహిత బసను 60 రోజుల నుండి 30 రోజులకు తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. విదేశాంగ మంత్రి సిహాసక్ ఫువాంగ్కెట్కియో ప్రకారం.. నేర కార్యకలాపాలను అరికట్టడం మరియు దీర్ఘకాలిక బసల దుర్వినియోగాన్ని నివారించడం ఈ చర్య యొక్క లక్ష్యం.ఇదిలా ఉండగా.. పలు దేశాల్లో టూరిస్ట్‌లు అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకునే విధంగా నిబంధనలు ఉన్నాయి. ఇతర దేశాల్లో పర్యాటకులు విమానాశ్రయ ఆస్తులను ధ్వంసం చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటూ, జరిమానాలు, జైలు శిక్షలు, లేదా జీవితకాల నిషేధాలు విధిస్తున్నారు.ఇతర దేశాల్లో జరిగిన సంఘటనలుస్పెయిన్ (2025): రయనైర్ విమానంలో అగ్ని ప్రమాదం సమయంలో పర్యాటకులు అత్యవసర గేట్లను బలవంతంగా తెరిచి, విమానాశ్రయ భద్రతా పరికరాలను ధ్వంసం చేశారు. దీనిపై జరిమానాలు విధించారు.యూరప్ (వివిధ దేశాలు): పర్యాటకుల అసభ్య ప్రవర్తనపై పెరుగుతున్న ఆందోళనల కారణంగా, విమానాశ్రయాల్లో ఆస్తి ధ్వంసం, భద్రతా సిబ్బందిపై దాడులు వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని దేశాలు అమెరికన్ పర్యాటకులపై ప్రత్యేకంగా విమర్శలు చేస్తున్నాయి.శిక్షలు ఇలా.. జరిమానాలు: నష్టం విలువ ఆధారంగా భారీ జరిమానాలు.జైలు శిక్ష: ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, అధికారులపై దాడి వంటి కేసుల్లో 1–3 సంవత్సరాల జైలు శిక్ష.వీసా రద్దు: వీసా తక్షణమే రద్దు చేసి, దేశం నుంచి డిపోర్ట్ చేస్తారు.జీవితకాల నిషేధం: తిరిగి ఆ దేశంలోకి ప్రవేశించకుండా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం.జరిమానాలు: వెనిస్లో కాలువల్లో ఈత కొట్టడం, చెత్త వేయడం వంటి చర్యలకు ₹50,000 వరకు జరిమానా.డిపోర్ట్మెంట్: బాలి (ఇండోనేషియా)లో వీసా ఉల్లంఘనలు, పవిత్ర స్థలాల్లో అసభ్య ప్రవర్తనకు విదేశీయులను డిపోర్ట్ చేస్తున్నారు.జైలు శిక్షలు: UAE, సింగపూర్‌లో మత్తులో అసభ్య ప్రవర్తనకు జైలు శిక్షలు.వీసా రద్దు/నిషేధం: థాయ్‌లాండ్‌లో విమానాశ్రయ ఆస్తి ధ్వంసం చేసిన చైనా పర్యాటకుడికి జీవితకాల ప్రవేశ నిషేధం విధించారు.యూరప్‌లో పర్యాటకుల జరిమానాలుస్పెయిన్ (మాలాగా, మయోర్కా):చెత్త వేయడం, శబ్దం చేయడం, సరైన దుస్తులు లేకుండా తిరగడం.జరిమానా: €750 (₹70,000 సుమారు).పోర్చుగల్ (అల్బుఫీరా, ఆల్గార్వే):ప్రజా ప్రదేశాల్లో ఉమ్మివేయడం, మూత్ర విసర్జన, అసభ్య ప్రవర్తన.జరిమానా: €150–€1,800 (₹13,000–₹1.6 లక్షలు).ఫ్రాన్స్ (పారిస్, బీచ్ ప్రాంతాలు):మద్యం తాగి ప్రజా ప్రదేశాల్లో తిరగడం.జరిమానా: €38–€135. -
చైనా ఇచ్చినవి చెత్తబుట్టలో పడేసి మరీ వెళ్లారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో స్నేహపూర్వకంగా మెలిగిన ట్రంప్.. మూడురోజులపాటు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల ఒప్పందాల మొదలు తైవాన్, ఇరాన్ యుద్ధం-హర్ముజ్ జలసంధి లాంటి సంక్లిష్టమైన అంశాలపైనా ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. అయితే.. పర్యటన ముగింపు వేళ జరిగిన ఓ పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ పర్యటన ముగిసి.. మొత్తం బృందం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కే సమయంలో భద్రతా సిబ్బంది నుంచి మైక్ ద్వారా ఓ ఆదేశం వచ్చింది. అందులో.. Nothing from China allowed on the plane అని చెప్పారు. అంటే చైనా నుంచి ఏ వస్తువును తాము విమానంలోకి అనుమతించబోమని. అలా సిబ్బంది వాళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. వాటిని సేకరించి అక్కడే ఏర్పాటు చేసిన చెత్తబుట్టలో పడేశారు. అలా పడేసిన వాటిల్లో.. ప్రెస్ పాస్‌లు, వైట్‌హౌస్ సిబ్బందికి ఇచ్చిన బర్నర్ ఫోన్లు, ప్రతినిధుల గుర్తింపు పిన్లు ఉన్నాయట. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రెస్ పూల్ ధృవీకరించింది.‘‘చైనా అధికారులు ఇచ్చిన ప్రతిదాన్ని అమెరికా సిబ్బంది సేకరించి, ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కే ముందు చెత్తబుట్టలో వేసేశారు. చైనాలో ఇచ్చిన ఏ వస్తువూ విమానంలోకి రాకూడదని ఆ సమయంలో వాళ్లు స్పష్టం చేశారు’’ అని న్యూయార్క్ పోస్ట్ వైట్‌హౌజ్ ప్రతినిధి ఎమిలీ గూడిన్ తెలిపారు. అయితే ట్రంప్‌నకు చైనా నుంచి ఏమైనా కానుకలు వచ్చాయా? వస్తే వాటిని అనుమతించారా? లేదంటే చెత్త బుట్టలోనే పడేశారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుల విషయంలోనే కాదు.. రష్యా, ఫ్రాన్స్, నార్త్ కొరియా ఇలా చాలా దేశాల అధినేతల విషయంలో సిబ్బంది కట్టుదిట్టమైన నిబంధనలు పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే విదేశీ పర్యటనల్లో భద్రతా కారణాల వల్ల కొన్ని వస్తువులను(ఎలక్ట్రానిక్ పరికరాలు, గుర్తింపు వస్తువులు) వాడకూడదనే నియమాలు ఉంటాయి. ఒకవేళ వాడినా.. క్షుణ్ణంగా తనిఖీలు చేశాకే అనుమతిస్తారు. అలాగే కానుకల విషయంలోనూ అంతే. పరిస్థితిని బట్టి వాటిని అనుమతించకపోవడం ఉంటుందేమోగానీ.. మునుపెన్నడూ లేని రీతిలో చైనా పర్యటనలో అమెరికా అధ్యక్ష భద్రతా సిబ్బంది చెత్త బుట్టలో పడేయడం గమనార్హం. ట్రంప్ చైనా పర్యటనలో జరిగింది.. ఇంతదాకా ఏ అధినేత విషయంలో జరగలేదు. బహుశా చైనా ఇచ్చిన వస్తువులతో సర్వైలెన్స్ లేదంటే స్పైవేర్ ప్రమాదం ఉండొచ్చని అమెరికా భద్రతా బృందం భావించి ఉండొచ్చు. అమెరికా–చైనా సంబంధాల్లో ఉన్న అనుమానాలు, గూఢచర్య భయాలు కారణంగా తీసుకున్న నిర్ణయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మారని ఆంక్షలు..ఈ పర్యటనలో ఇరు దేశాల అధ్యక్షుల సమావేశాలు స్నేహపూర్వకంగా కనిపించినా.. భద్రతా, ప్రెస్ బృందాల మధ్య ఉద్రిక్తతలు స్పష్టంగా కనిపించాయి. టెంపుల్ ఆఫ్ హెవెన్ వద్ద ట్రంప్–షీ సమావేశం సమయంలోనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కి ఆయుధం కారణంగా ప్రవేశం నిరాకరించడం చర్చనీయాంశమైంది. అలాగే అధ్యక్షుడు వెంట ప్రెస్ పూల్‌కి మోటర్కేడులోకి చైనా సిబ్బంది అనుమతించలేదు. దీంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి అమెరికా సిబ్బంది ఒత్తిడి చేసి వారిని లోపలికి తీసుకెళ్లారు. 2016 అప్పటి అధ్యక్షుడు ఒబామా పర్యటన (హాంగ్జౌ, G20 సదస్సు సందర్భంగా)లో అమెరికా–చైనా సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరిగాయి. “ఇది మా దేశం, మా విమానాశ్రయం” అంటూ ఓ చైనా అధికారి చెప్పిన మాట.. ఆ సమయంలో చాలా పాపులర్ అయ్యింది. -
ట్రంప్, జిన్‌పింగ్ భేటీపై వివాదం.. గీతా గోపీనాథ్ విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ట్రంప్, జిన్‌పింగ్ మధ్య వరుస కీలక భేటీ జరిగాయి. ఈ భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకోకుండా నిరోధించడం వంటి వాటిపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరాన్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు అందకూడదని ఇరువురు నేతలు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చారు. చైనాలో అమెరికన్ ఉత్పత్తులకు మార్కెట్‌ను విస్తరించడం, యూఎస్ పరిశ్రమల్లో చైనా పెట్టుబడులను పెంచడం సహా ఆర్థిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపైనా ఇరువురు చర్చించుకున్నారు.ఈ సమావేశంలో ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అమెరికాలోకి మాదకద్రవ్యాల(ఫెంటానిల్) ప్రవాహాన్ని అరికట్టడంలో సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అదే సమయంలో చైనాలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచాలని ట్రంప్, జిన్‌పింగ్ నొక్కిచెప్పారు. హార్మూజ్ స్వేచ్ఛాయుత నౌకాయానానికి అవకాశం ఉండాలని పేర్కొన్నారు. జలసంధి సైనికీకరణకు, వినియోగానికి సుంకం విధించే ఏ ప్రయత్నానికైనా చైనా వ్యతిరేకమని జిన్‌పింగ్ స్పష్టంచేశారు.భవిష్యత్తులో హార్మూజ్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, అమెరికా నుంచి మరింత చమురును కొనుగోలు చేయడానికి ఆయన ఆసక్తి వ్యక్తంచేశారు. 2026 సంవత్సరం చైనా–అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే చరిత్రాత్మక సంవత్సరం అవుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరుపక్షాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని ట్రంప్ అన్నారు. చర్చలు ముగిసిన తర్వాత ట్రంప్, జిన్‌పింగ్ బీజింగ్ సిటీలోని ప్రఖ్యాత టెంపుల్ ఆఫ్ హెవెన్ను సందర్శించారు.మీటింగ్ వివాదం.. బీజింగ్‌లో జరిగిన ట్రంప్-జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమావేశంలో మహిళల గైర్హాజరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో పూర్తిగా పురుషులే ఉండటం విమర్శలకు దారితీసింది. గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో జరిగిన ఈ సమావేశంలో ట్రంప్, జిన్‌పింగ్‌తో పాటు ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సమావేశ టేబుల్ వద్ద ఒక్క మహిళ కూడా లేకపోవడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్రవేత్త గీతా గోపీనాథ్ ఈ ఘటనను “మెరిటోక్రసీ ముగింపు చిత్రపటం”గా అభివర్ణించారు.మరోవైపు.. కొందరు విశ్లేషకులు కూడా స్పందించి లింగ సమానత్వం లోపం స్పష్టంగా కనిపించిందని వ్యాఖ్యానించారు. అమెరికా–చైనా వంటి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు మహిళల ప్రాతినిధ్యం లేకుండా సమావేశం జరపడం ప్రతీకాత్మకంగా ప్రతికూల సంకేతం అని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ సంఘటన అంతర్జాతీయ దౌత్యంలో మహిళల పాత్రపై కొత్త చర్చలకు దారితీసింది.🚨JUST IN: The White House has just released new details from President Trump’s bilateral sit-down with Xi JinpingSeveral major wins are already being highlighted:- Cracking down on the flow of fentanyl precursors from China into the United States - Pushing China to buy… pic.twitter.com/8Y1Sgr81cF— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) May 14, 2026భేటీ సందర్భంగా ప్రధానాంశాలుసైబర్ భద్రతా హెచ్చరికలు: అమెరికా ప్రతినిధులకు చైనాలో కమ్యూనికేషన్లు పర్యవేక్షణలో ఉండవచ్చని హెచ్చరించారు. అందుకే బర్నర్ ఫోన్లు, కొత్త పరికరాలు వాడారు.ఇరాన్‌పై చర్య సంకేతాలు: ట్రంప్ “to be continued!” అంటూ ఇరాన్‌పై సైనిక చర్యలు కొనసాగవచ్చని సూచించారు.తైవాన్ ఉద్రిక్తతలు: తైవాన్ సమస్యను తప్పుగా నిర్వహిస్తే అమెరికా–చైనా సంబంధాలు “ప్రమాదకర స్థితి”లోకి వెళ్తాయని షీ హెచ్చరించారు.ఆర్థిక ఒప్పందాలు: చైనా 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి అంగీకరించింది.థూసిడైడ్స్ ట్రాప్: షీ, అమెరికా “థూసిడైడ్స్ ట్రాప్”ను అధిగమించాలి అని సూచించారు.ఇరాన్ మధ్యవర్తిత్వం: షీ, ఇరాన్ ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధమని తెలిపారు.ప్రధాన ఆర్థిక ఒప్పందాలుబోయింగ్ విమానాల కొనుగోలుచైనా 200 బోయింగ్ జెట్లు కొనుగోలు చేయడానికి అంగీకరించింది.ఇది దాదాపు దశాబ్దం తర్వాత అమెరికా విమానాలపై చైనా చేసిన మొదటి పెద్ద ఆర్డర్.వ్యవసాయ ఉత్పత్తులుఅమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు పెంచడానికి చైనా అంగీకరించింది.ఇది అమెరికా రైతులకు పెద్ద మార్కెట్ అవకాశాన్ని కల్పిస్తుంది.అమెరికా చమురు కొనుగోలుచైనా అమెరికా నుండి మరిన్ని క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది.దీని లక్ష్యం హార్ముజ్ జలసంధిపై ఆధారాన్ని తగ్గించడం.మార్కెట్ యాక్సెస్అమెరికా కంపెనీలకు చైనా మార్కెట్లలో విస్తృత యాక్సెస్ ఇవ్వబడింది.ఇది టెక్నాలజీ, ఎనర్జీ, మరియు తయారీ రంగాలకు కొత్త అవకాశాలు తెస్తుంది.చైనా పెట్టుబడులుఅమెరికాలో పెట్టుబడులు పెంచడానికి చైనా అంగీకరించింది.ఇది ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. -
పిల్లాడు కదా అని ఆఫీసుకి తీసుకెళ్తే, కొంప ముంచేశాడు!
చైనాలోని నింగ్బో నగరంలో 12 ఏళ్ల బాలుడు చేసిన చిన్న పొరపాటు భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. తన తల్లిదండ్రుల ఆఫీసులో లైటర్‌తో ఆడుకుంటూ అతను పొరపాటున నిప్పు పెట్టడంతో కార్యాలయం చాలా వరకు దగ్ధమైంది.ఈ సంఘటన గత నెల 30వ తేదీన, తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని నింగ్బో నగరంలో జరిగినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.పిల్లాడిని ఇంట్లో ఒంటరిగా ఎందుకు, తమ మధ్య అనుబంధం పెరుగుతుందని భావించిన తల్లిదండ్రులు తమ 12 ఏళ్ల కొడుకును ఆఫీసుకి తీసుకెళ్లారు. ఆఫీసులో అందరూ పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ బాలుడిని పెద్దగా పట్టించుకోలేదు. దీంటో ఒంటరిగా ఉన్నవాడికి పిల్లవాడికి కాసేపటికి బోర్ కొట్టడంతో, అక్కడే ఉన్న ఒక లైటర్‌ను తీసుకుని టిష్యూ పేపర్లను కాల్చడం అనే ఆటను సరదాగా మొదలు పెట్టాడు. కానీ చూస్తుండగానే మంటలు ఆఫీసు అంతటా వేగంగా వ్యాపిస్తాయనీ గానీ, పెను ప్రమాదం ముంచు కొస్తుందని గానీ ఆ పిల్లగాడు ఊహించలేదు.టిష్యూ పేపర్ల నుండి వచ్చిన నిప్పురవ్వలు డెస్క్ పక్కన ఉన్న చెత్తకు అంటుకున్నాయి. బాలుడు భయంతో తన తండ్రికి చెప్పాడు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చేలోపే అక్కడున్న ఉద్యోగులతో కలిసి బాలుడి తల్లిదండ్రులు ఫైర్ ఎక్స్టింగ్యూషర్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కానీ, ఆఫీసు సామాగ్రి భారీగా దెబ్బతింది.ఆస్తి నష్టం సుమారు వేల యువాన్లలో (సుమారు రూ.1,41,118) ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పిన తర్వాత, అక్కడి ఫైర్ ఫైటర్ ఒకరు ఉద్యోగులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లో ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది, కానీ వారికి భద్రత పట్ల అవగాహన ఉండదు. తల్లిదండ్రులే వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఒక చిన్న నిప్పురవ్వ పెద్ద విపత్తుకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనలో తల్లిదండ్రులకు ఎలాంటి శిక్ష విధిస్తారు. వారి పనిచేస్తున్న కంపెనీ ఏంటి అనే విషయాన్ని వెల్లడించలేదు.నెటిజన్ల స్పందనలుఈ ఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లాడు క్షేమంగా ఉన్నందుకు సంతోషం అని కొందరంటే.. వాడు మూడు నాలుగేళ్ల పిల్లాడు కాదు, 12 ఏళ్ల వయసులో కూడా ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడంటే ఇంట్లో బాగా గారాబం ఎక్కువై ఉంటుంది అని ఒకరు విమర్శించారు. ఇకపై ఏ బాస్ కూడా తన ఉద్యోగులను పిల్లల్ని ఆఫీసుకి తీసుకురావడానికి అనుమతించరు" అని మరొకరు ఎద్దేవా చేశారు. చైనాలో ఇలా పిల్లల వల్ల అగ్నిప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ తాజా ఘటన తల్లిదండ్రుల పర్యవేక్షణ మరియు అగ్నిప్రమాదాల పట్ల అవగాహన ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. -
మీరు గొప్ప వ్యక్తి.. బంగారు భవిష్యత్తు నిర్మిద్దాం: ట్రంప్
తొమ్మిదేళ్ల తర్వాత తమ దేశంలో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చైనా ఘన స్వాగతం పలికింది. రెడ్‌కార్పెట్ పరిచి సైనిక గౌరవ వందనం సమర్పించింది. అనంతరం గ్రేట్ హాల్ పీపుల్ వద్ద ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కరచలనం చేశారు. ఈ ఇద్దరూ హాల్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆపై మీడియా ముఖంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు గొప్ప వ్యక్తి. మీకు స్నేహితుడిని కావడం.. మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది. మనం కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించబోతున్నాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే తనతో పాటు ప్రపంచంలోని అగ్రశ్రేణి వ్యాపార నాయకులను చూపిస్తూ.. “మీకు గౌరవం తెలిపేందుకు మాత్రమే అత్యుత్తమ వ్యక్తులు ఇక్కడికి తరలి వచ్చారు” అని ట్రంప్ జిన్‌పింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మనవి కామన్ ఇంట్రెస్టులు.. స్వల్ప విబేధాలు. ఇప్పటిదాకా.. సమస్యలు వచ్చినప్పుడు మీరు నన్ను సంప్రదించేవారు, నేను మిమ్మల్ని సంప్రదించేవాడిని. చాలా త్వరగా పరిష్కారం కనుగొనగలిగాం. ఇక నుంచి మనం రైవల్స్‌గా ఉండకూదు అంటూ ట్రంప్ జిన్‌పింగ్‌ను ఆకాశానికెత్తారు. చైనా-అమెరికా ద్వైపాక్షిక చర్చల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా.. మన మధ్య జరగబోయే సమావేశం ఎంతో గొప్పది. ప్రపంచంలోని బెస్ట్ బిజినెస్ లీడర్స్‌ను తీసుకొచ్చా. రండి.. బంగారు భవిష్యత్తు నిర్మించుకుందాం అని ట్రంప్ ఉద్ఘాటించారు."It's an honor to be with you, it's an honor to be your friend, and the relationship between China and the USA is going to be better than ever before." - President Donald J. Trump 🇺🇸 pic.twitter.com/WZkoGeVqhv— The White House (@WhiteHouse) May 14, 2026అనంతరం.. జీ జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ‘‘ట్రంప్‌నకు, అమెరికన్లను ముందస్తుగా 250 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచం ఇప్పుడు క్రాస్ రోడ్లో ఉంది. పాత ట్రాప్స్నుంచి బయటకు వద్దాం. ప్రపంచ సవాళ్లను కలిసి ఎదుర్కొందాం. ఇరాన్‌పై ఒత్తిడి పెంచి.. హర్ముజ్ తెరిపిస్తా’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చైనా పర్యటనలో ట్రంప్‌తో పాటు అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌తో సహా 16 మంది సీఈవోలు వెళ్లారు. నేడు, రేపు ఈ ఇద్దరు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి సారించినప్పటికీ, టారిఫ్స్, టెక్నాలజీ, ట్రేడ్‌తో పాటుగా తైవాన్‌పై అమెరికా వైఖరి, ఇరాన్ యుద్ధం వంటి అంశాలపైనా చర్చలు జరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ట్రంప్ ఈ విషయాల జోలికి రాకండి..!
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు చైనా పర్యటనకు శ్రీకారం చుట్టారు. కొద్ది సేపటి క్రితమే బీజింగ్‌కు బయిలుదేరారు. అయితే ఈ పర్యటనలో ఏ విషయాలపై ఒప్పంద జరగనుందా అని ప్రపంచమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ ఎట్టిపరిస్థితుల్లో తమ దేశానికి సంబంధించిన నాలుగు అంశాల జోలికి వెళ్లద్దని వార్నింగ్ ఇస్తూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.చైనా- అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే టాఫ్ ఎకానమీ కలిగిన దేశాలు కావడంతో అధిపత్యం కోసం పరస్పరం పోటీ పడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే మిడిల్ ఈస్ట్ యుద్ధంలో సైతం చైనా పరోక్షంగా ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. వీటిని చైనా కొట్టిపడేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ చైనా పర్యటనకు బయిలుదేరారు. ఆ నేపథ్యంలో ట్రంప్ అస్సలు.. ఈ రెడ్‌లైన్ అంశాలు చర్చించకూడదని చైనా పేర్కొంది. నాలుగు ప్రధానమైన అంశాలుతైవాన్ అంశం ఇది చైనాకు అత్యంత కీలకం.ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కులు వీటి పేరుతో చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.దేశ రాజకీయ వ్యవస్థ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలోని సోషలిస్ట్ వ్యవస్థను గౌరవించాలి.చైనా అభివృద్ధి హక్కు చైనా ఆర్థిక, సాంకేతిక వృద్ధిని అడ్డుకోకూడదు.తైవాన్ వివాదం అనేది ప్రస్తుతం చైనా అమెరికా మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. తైవాన్‌కు అమెరికా ఆయుధాలను విక్రయించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తైవాన్‌కు 11 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ప్యాకేజీని ప్రకటించింది, ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఒప్పందం. దీనిపై చైనా మండిపడుతుంది.తైవాన్ తమ భూభాగంలో భాగమని, ఇది పూర్తిగా తమ అంతర్గత విషయమని ఈ విషయంతో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. కాగా 2017 తర్వాత ట్రంప్ చైనాను సందర్శించడం ఇదే మొదటిసారి. ట్రంప్ గతంలో ప్రకటించిన అధిక పన్నుల యుద్దం తర్వాత ఆయన చైనాకు వెళుతున్నారు. దీంతో ఏం జరగనుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. -
NEET వివాదం: చైనా మోడల్‌తో ఏ లీకులు ఉండవ్!
భారతదేశపు పోటీ పరీక్షల్లో తరచూ పేపర్ లీకులు, అవకతవకలు వెలుగులోకి రావడం చూస్తున్నదే. తాజాగా నీట్-యూజీ 2026 రద్దు ఈ సమస్య తీవ్రతను మరోసారి స్పష్టం చేసింది. అయితే.. విద్యార్థుల భవిష్యత్తు, వారి మనోధైర్యం దెబ్బతింటున్న ఈ పరిస్థితుల్లో కఠిన చర్యలపై దృష్టిసారించడం అవసరమని నిపుణులు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా.. చైనా మోడల్ తెర మీదకు తెచ్చారు. భారత్‌లో ప్రవేశ పరీక్షల సమగ్రతను కాపాడాలంటే చైనా మాదిరి కఠిన చర్యలు అవసరమని ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ చెబుతున్నారు. ఈ మోడల్లో భాగంగా.. చైనా తన జాతీయ ప్రవేశ పరీక్ష గావ్కావో కోసం విస్తృతమైన చర్యలు తీసుకుందని.. అంతకంటే ముందు విద్యా సంస్కరణల్లో డబుల్ రిడక్షన్ విధానంతో సమూల మార్పులు చేసిందని గుర్తు చేస్తున్నారాయన. చైనా 2001లో తెచ్చిన ఈ విధానం (Double Reduction Policy) ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులపై ఉన్న అధిక హోంవర్క్ భారాన్ని తగ్గించడం. అలాగే ప్రైవేట్ ట్యూషన్ల ఒత్తిడిని తగ్గించడం, కుటుంబాల ఖర్చులను ఆదా చేయడం, పాఠశాల విద్యను అందరికీ సమానంగా అందించడం. ఇందులో భాగంగా ప్రైవేట్ ట్యూషన్లపై డ్రాగన్ కంట్రీ కఠిన నియంత్రణలు విధించింది. వారాంతాలు, సెలవుల్లో కోచింగ్ క్లాసులను నిషేధించింది. అదే సమయంలో.. అవకతవకలపై జరగకుండా కఠిన చర్యలు అవలంభించింది. ప్రశ్నాపత్రాల ముద్రణ నుంచి పరీక్ష నిర్వహణ వరకు అధునాతన భద్రతా సాంకేతికతలు పాటించింది. ఈ మధ్యకాలంలో ఏఐ ఆధారిత పర్యవేక్షణ అమలు చేసింది. ఆపై.. నకిలీ సీట్లు, అవకతవకల అడ్మిషన్లను అరికట్టేందుకు కఠిన పరిశీలన చేపట్టింది. సమాన అవకాశాల పేరిట గ్రామీణ, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక కోటాలు కల్పించింది.ఏంటీ గావ్కావో (Gaokao)? గావ్కావో అనేది చైనాలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(National College Entrance Examination). దానర్థం “ఉన్నత పరీక్ష”. ఇది చైనాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అండర్గ్రాడ్యుయేట్ అడ్మిషన్ కోసం తప్పనిసరి. 1952లో ఈ ఎంట్రెన్స్ టెస్ట్ మొదటిసారి నిర్వహించారు. ప్రతీ ఏడాది జూన్‌లో ఈ పరీక్ష జరుగుతుంటుంది. 2025లో సుమారు 1.3 కోట్ల విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.ఈ ఎంట్రెన్స్‌లో ఒక్క మార్కు తేడా కూడా విద్యార్థి చేరే విశ్వవిద్యాలయాన్ని నిర్ణయిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక స్థానం అన్నీ ఈ పరీక్ష ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే చైనా సమాజంలో గావ్కావోను “జీవితాన్ని తీర్చిదిద్దే పరీక్ష”గా భావిస్తుంటుంది. అందుకే కఠోర నియంత్రణలు, భద్రతా చర్యలు, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా చైనా ఈ పరీక్ష సమగ్రతను కాపాడుకుంటోంది. అయితే..అందుకే భారత్‌కు అవసరం!భారతదేశంలో చైనాలోలాగా ఒకే ఎంట్రెన్స్ ఉండదు. NEET, JEE ఇలా వివిధ రకాల పోటీ పరీక్షలు ఉంటాయి. ఇవి లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కానీ పేపర్ లీకులు, “గెస్ పేపర్లు” వంటి అవకతవకలు ప్రజల నమ్మకాన్ని.. విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వస్తున్నాయి. అందుకే చైనా మోడల్‌ను భారత్ ఓ పాఠంగా నేర్వాలని ఆనంద్ కుమార్ లాంటి వాళ్లు చెబుతున్నారు. మోషన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు నితిన్ విజయ్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. చైనా మోడల్ చెప్పేది ఏంటంటే.. కఠిన నియంత్రణలు, పారదర్శకత, సమాన అవకాశాలు. ఇవి ఉంటేనే పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలుస్తుంది. చైనా మాదిరిగా భారత్‌లోనూ కోచింగ్ పరిశ్రమపై కఠిన నియంత్రణలు అవసరమని.. ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణలో అధునాతన సాంకేతికతలు వినియోగించాలని.. అదనంగా గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అప్పుడే విద్యార్థుల భవిష్యత్తు సురక్షితమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
గల్ప్ దేశాల సీక్రెట్ ఆపరేషన్.. ప్లాన్ బీ?
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. తాజాగా గల్ఫ్‌లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ మద్య రహస్య దాడుల అంశం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. కువైట్ దీవిని ఆక్రమించేందుకు ఇరాన్ యత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీక్రెట్ దాడులు, ప్రతిదాడుల కారణంగా ఆందోళన నెలకొంది. గల్ప్ దేశాలు ఇలా రహస్య దాడులు చేయడంతో ప్రపంచమే షాకైంది.ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు సమయంలో ఇరాన్.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి భయంకర దాడులు చేసింది. దీంతో, గల్ప్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ఇరాన్‌పై గల్ప్ దేశాలు ప్రతి దాడులు చేశాయి. అయితే, ఇదంతా రహ్యసంగా జరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ దాడులకు సౌదీ అరేబియా కూడా ప్రతీకార దాడులు చేసినట్లు బయటకొచ్చింది. మార్చి నెలాఖరులో సౌదీ వైమానిక దళం ఈ రహస్య దాడులకు పాల్పడినట్లు తాజాగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే వేటిని లక్ష్యంగా ఈ దాడులు జరిగాయనే దానిపై స్పష్టత లేదు. దీనిపై సౌదీ గానీ.. ఇరాన్ గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. యూఏఈ కూడా ఇరాన్‌పై రహస్య దాడులకు పాల్పడినట్లు వార్తలు వెలువడ్డాయి.ఇదిలా ఉండగా.. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన ప్రకటన గల్ఫ్ దేశాల్లో ఆందోళనలను మరింత పెంచింది. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడి, బుబియాన్ ద్వీపాన్ని ఆక్రమించేందుకు ఇరాన్ ప్రయత్నించిందని ఆరోపించింది. కానీ, ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. కాగా, కువైట్‌లోని బుబియాన్ అతిపెద్ద ద్వీపం . ఇందులో ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు, సబ్స్టేషన్లతో సహా ప్రధాన పౌర, సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ నెల ఆరంభంలో చేపల పడవల్లో సముద్ర మార్గం ద్వారా ప్రయాణించి దీనిలోకి చొరబడేందుకు ఇరాన్‌లోని ఐఆర్జీసీ నేవీకి చెందిన ఆరుగురు సిబ్బంది ప్రయత్నించారని కువైట్ ప్రభుత్వం పేర్కొంది. వారు తమ భూభాగంలో దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించారని ఆరోపించింది. అయితే ఈ చొరబాటును తమ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించింది.🇸🇦🇮🇷Reuters Exclusive: SAUDI ARABIA secretly launched strikes against IRAN in retaliation for attacksSaudi Arabia carried out multiple airstrikes on Iran in late March in retaliation for missile and drone attacks against the Kingdom, according to Reuters, citing Western and… pic.twitter.com/kVpUuAcgcQ— Global Surveillance (@Globalsurv) May 12, 2026ప్రధాన పరిణామాలు..యూఏఈ దాడులు:ఏప్రిల్ 2026లో ఇరాన్‌లోని లావాన్ దీవి చమురు శుద్ధి కేంద్రంపై దాడి.ఈ దాడి వల్ల పెద్ద అగ్ని ప్రమాదం జరిగి, శుద్ధి కేంద్రం తాత్కాలికంగా నిలిచిపోయింది.ఇరాన్ ప్రతీకారంగా యూఏఈ, కువైట్‌పై 2,800 క్షిపణులు, డ్రోన్ల దాడులు చేసింది.సౌదీ దాడులు:మార్చి చివరలో సౌదీ వైమానిక దళం ఇరాన్‌పై "tit-for-tat" దాడులు చేసింది.లక్ష్యాలు స్పష్టంగా వెల్లడించకపోయినా, ఇరాన్‌పై ప్రతీకార చర్యగా ఈ దాడులు జరిగాయి.అనంతరం రియాద్–తెహ్రాన్ మధ్య దౌత్య చర్చలు జరిగి, ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవగాహన కుదిరింది.చైనా పాత్ర.. ఇదిలా ఉండగా.. చైనా గల్ఫ్ దేశాలకు నేరుగా సైనిక అండ ఇవ్వలేదు. కానీ ఇరాన్ యుద్ధంలో దౌత్యపరమైన మధ్యవర్తిత్వం, ఆర్థిక సహకారం, సాంకేతిక మద్దతు ద్వారా పరోక్షంగా ప్రభావం చూపుతోంది. చమురు సరఫరా భద్రత, హార్మూజ్ జలసంధి స్థిరత్వం చైనాకు ప్రధాన ప్రాధాన్యం. చైనా పాత్రను మూడు కోణాల్లో చూడవచ్చు. ఇరాన్‌కు సాంకేతిక సహాయం, గల్ఫ్ దేశాలతో ఆర్థిక ఒప్పందాలు, అమెరికా–చైనా పోటీ ప్రభావం.BREAKING: According to reports, the UAE has launched heavy airstrikes on Iran following Iran’s blockade of the Strait of Hormuz, escalating tensions across West Asia.The Strait of Hormuz remains one of the world’s most critical oil shipping routes, and the latest developments… pic.twitter.com/cHani8lAU8— Diplomat Times (@diplomattimes) May 13, 20261. ఇరాన్‌కు సాంకేతిక సహాయంచైనా ఇరాన్‌కు రాడార్ వ్యవస్థలు, నావిగేషన్ టెక్నాలజీ, మరియు మిసైల్ భాగాలు వంటి ద్వంద్వ వినియోగ సాంకేతికతను అందించింది.ఈ సహాయం ఇరాన్ రక్షణ సామర్థ్యాన్ని పెంచి, అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందించే శక్తిని ఇచ్చింది.అమెరికా దీనిపై ఆంక్షలు విధించి, చైనా కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది.చైనా ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, చమురు దిగుమతుల్లో కీలకం.2. గల్ఫ్ దేశాలతో ఆర్థిక ఒప్పందాలుUAE, సౌదీ అరేబియాతో చైనా మౌలిక వసతులు, ఎనర్జీ ప్రాజెక్టులు, మరియు డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది.2023లో చైనా మధ్యవర్తిత్వంతో సౌదీ–ఇరాన్ మధ్య సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి.యుద్ధ సమయంలో కూడా చైనా గల్ఫ్ దేశాలతో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ, “శాంతి అవసరం” అని మాత్రమే పేర్కొంది.3. అమెరికా–చైనా పోటీ ప్రభావంఅమెరికా గల్ఫ్ ప్రాంతంలో సైనిక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తుండగా, చైనా ఆర్థిక భాగస్వామిగా ఎదుగుతోంది.గల్ఫ్ దేశాలు అమెరికాపై ఆధారపడటం ప్రమాదకరమని భావించి, చైనాతో సంబంధాలను బలోపేతం చేస్తున్నాయి.ఇది భారతదేశానికి కూడా వ్యూహాత్మకంగా కీలకం, ఎందుకంటే అమెరికా–చైనా పోటీ మధ్య ప్రాచ్యంలో భౌగోళిక సమీకరణాన్ని మార్చుతోంది.భారత్‌కు ప్రాధాన్యంఎనర్జీ భద్రత: చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.వాణిజ్య మార్గాలు: హార్మూజ్ జలసంధి స్థిరత్వం భారత వాణిజ్యానికి కీలకం.విదేశాంగ వ్యూహం: అమెరికా–చైనా పోటీ, గల్ఫ్ దేశాల మారుతున్న సంబంధాలు భారత విదేశాంగ విధానంపై ప్రభావం చూపుతాయి.ప్రభావం..అమెరికా–చైనా పోటీ: గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం, అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించగా, చైనా “ప్రత్యామ్నాయ భాగస్వామి”గా నిలబడే అవకాశం పెరిగింది.గల్ఫ్ దేశాల వ్యూహం: అమెరికా ఆధారపడటం ప్రమాదకరమని భావించి, గల్ఫ్ దేశాలు చైనాతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. -
చైనా పర్యటనకు ట్రంప్.. ఇరాన్‌పై కొత్త వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, ప్రపంచ చమురు మార్కెట్ ఆందోళనలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఇరాన్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గురించి చైనాతో మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఇరాన్ ఇంకా తమ కంట్రోల్‌నే ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే, ముఖ్యంగా తైవాన్, రష్యా, వాణిజ్య సంబంధాలపై ట్రంప్, జిన్‌పింగ్ మధ్య కీలక సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బలహీనమైన వాణిజ్య సంబంధాల కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపేందుకు ట్రంప్ మంగళవారం వైట్‌హౌస్ నుండి చైనా పర్యటనకు బయలుదేరారు. మూడు రోజుల పాటు ట్రంప్.. చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్బంగా తీవ్రమవుతున్న భౌగోళిక, రాజకీయ, వాణిజ్యపరమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ అంతటా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా-చైనా సంబంధాలలో ఒక కీలక ఘట్టంగా పరిగణించబడుతోంది.ఇక, ఈ పర్యటన సందర్భంగా ఇరాన్ వివాదం ప్రాముఖ్యతను తగ్గించి చూపడానికి అమెరికా అధికారులు ఇటీవలి రోజుల్లో ప్రయత్నిస్తుండగా, జిన్‌పింగ్‌తో తన చర్చలలో ఈ అంశం ఎంత ప్రముఖంగా ఉంటుందనే దానిపై ట్రంప్ మిశ్రమ సంకేతాలు ఇచ్చారు. బీజింగ్‌కు వెళ్లేందుకు మెరైన్ వన్ హెలికాప్టర్ ఎక్కే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ట్రంప్..‘మేము చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే, ఇరాన్ వాటిలో ఒకటి అని నేను చెప్పను. ఎందుకంటే ఇరాన్ చాలా వరకు మా అదుపులోనే ఉంది. ఇరాన్ విషయంలో మాకు ఎలాంటి సహాయం అవసరమని నేను అనుకోవడం లేదు. శాంతియుతంగానైనా లేదా మరే విధంగానైనా, మేము దీనిని గెలుస్తాము. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం సహా మొత్తం యుద్ధ యంత్రాంగం పూర్తిగా ధ్వంసమైంది. వాళ్లు సరైన నిర్ణయం తీసుకుంటారు.. లేకపోతే మేం మిగతా పని పూర్తి చేస్తాం. దిగ్బంధనం 100 శాతం ప్రభావవంతంగా ఉంది. ఏదో ఒక విధంగా ఇది అమెరికాకు చాలా అనుకూలంగా మారుతుంది. ప్రపంచంలో ఎన్నడూ లేనంతగా చమురు ఉత్పత్తి పెరుగుతుంది' అని ట్రంప్ తెలిపారు.నాటోపై ట్రంప్ అసంతృప్తిఈ సందర్భంగా నాటోపై కూడా ట్రంప్ విమర్శలు చేశారు. 'నాటో నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. మాకు అవసరమైన సమయంలో నాటో మాతో లేదు. నిజానికి మాకు నాటో అవసరం లేదు. కానీ అవసరమైతే కూడా వాళ్లు ముందుకు రాలేదు” అని వ్యాఖ్యానించారు. మరోవైపు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే మాత్రం కూటమి భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరాన్ సంక్షోభం ప్రపంచ భద్రతా వ్యవస్థలో కీలక అంశంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధానంగా సముద్ర భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై చర్చలు సాగుతున్నాయని తెలిపారు.President Donald J. Trump departs Washington D.C. for a historic visit to China! pic.twitter.com/8Qok0Xcqcd— The White House (@WhiteHouse) May 12, 2026చైనా పర్యటనలో ట్రంప్‌తో మస్క్, టిమ్ కుక్.. బీజింగ్‌తో కొత్త వ్యాపార ఒప్పందాల కోసం తన ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో, ట్రంప్ ఈ పర్యటనకు ఎలాన్ మస్క్, టిమ్ కుక్‌తో సహా పలువురు అగ్రశ్రేణి అమెరికన్ వ్యాపార నాయకులను తీసుకువచ్చారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో బోయింగ్ విమానాలు, అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధన సరఫరాలకు సంబంధించిన కొనుగోళ్లను కూడా చైనా ప్రకటించే అవకాశం ఉంది. సుమారు 500 బోయింగ్ 737 మ్యాక్స్ జెట్లు, డజన్ల కొద్దీ జీఈ-పవర్డ్ వైడ్‌బాడీ విమానాల కోసం ఒప్పందంపై బోయింగ్, చైనా అధికారులు చర్చిస్తున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇది ఖరారైతే, 2017 తర్వాత చైనాకు ఇది మొదటి ప్రధాన బోయింగ్ ఆర్డర్ అవుతుంది. అలాగే విమానయాన చరిత్రలోనే అతిపెద్ద విమాన ఒప్పందంగా నిలిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చైనా నుండి అమెరికాకు అరుదైన ఖనిజాల రవాణాను అనుమతిస్తున్న వాణిజ్య సంధిని పొడిగించడంపై కూడా ఇరుపక్షాలు చర్చించే అవకాశం ఉంది. అయితే, ఈ పర్యటనలో పొడిగింపునకు అంగీకారం కుదురుతుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు.తైవాన్, అమెరికా సంబంధాలపై.. ఇక, అంతకుముందు.. తైవాన్, ఇరాన్, రష్యా, వాణిజ్య సంబంధాలపై అమెరికా అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ విషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. తైవాన్ అంశం ట్రంప్, జిన్‌పింగ్ మధ్య గత కొన్ని సమావేశాల్లో కూడా చర్చకు వచ్చిన విషయమేనని తెలిపారు. అయినప్పటికీ అమెరికా పాలసీలో మార్పు చోటుచేసుకోలేదని, ఇకముందూ అలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. తైవాన్‌కు ఆయుధాల విక్రయాల విషయంలో కూడా అమెరికా తన మద్దతును కొనసాగిస్తోందని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వ తొలి ఏడాదిలోనే గత ప్రభుత్వ నాలుగేళ్ల కాలంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో తైవాన్‌కు రక్షణ సామగ్రి విక్రయాలకు ఆమోదం లభించిందని వెల్లడించారు.ఇటీవల తైవాన్ ప్రభుత్వం అమెరికా సైనిక పరికరాల కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. దాదాపు 780 బిలియన్ తైవాన్ డాలర్ల వ్యయ పరిమితితో ఈ బిల్లును ఆమోదించినట్లు సమాచారం. అయితే ఇందులో కొన్ని కీలక రక్షణ అంశాలకు నిధులు కేటాయించకపోవడం నిరాశ కలిగించిందని అమెరికా అధికారులు వ్యాఖ్యానించారు. మొదట ప్రతిపాదించిన పూర్తి ప్యాకేజీకి నిధులు కేటాయించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. -
జిన్‌పింగ్ ఆహ్వానం.. రంగంలోకి ట్రంప్.. టార్గెట్ ఏంటి?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు సిద్ధమయ్యారు. అత్యంత ఆసక్తి రేపుతున్న ఈ పర్యటన మే 13 నుంచి 15 వరకు జరగనుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు బీజింగ్ వెళ్తున్న ట్రంప్.. పశ్చిమాసియా సంక్షోభం, వాణిజ్య సంబంధాలతో పాటు పలు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరపనున్నారు.ఇరాన్, రష్యా కేంద్రంగా వ్యూహాలుఈ చారిత్రక భేటీలో ప్రధానంగా ఇరాన్, రష్యా అంశాలు కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఆ రెండు దేశాలకు చైనా అందిస్తున్న ఆర్థిక సహకారం, విడిభాగాలు, ఆయుధ ఎగుమతుల సామర్థ్యంపై ఉభయ దేశాల అధినేతలు ఇప్పటికే పలుమార్లు చర్చించినట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఈ పర్యటనలో అమెరికా-చైనా బోర్డ్ ఆఫ్ ట్రేడ్, బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనల్లో పురోగతిపై చర్చలు జరగనున్నాయి. ఏరోస్పేస్, వ్యవసాయం, ఇంధన రంగాలకు సంబంధించిన కీలక ఒప్పందాలకు ప్రాధాన్యత దక్కనుంది. వాణిజ్యంలో ఉమ్మడి ప్రాధాన్యతలను గుర్తించడమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈ పర్యటన అనంతరం ఈ ఏడాది చివర్లో షీ జిన్‌పింగ్ దంపతులకు వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.తైవాన్, ఇరాన్ ఆంక్షల వేళ ఉత్కంఠఈ అగ్ర దేశాల చర్చల్లో తైవాన్ అంశం ప్రస్తావనకు రానున్నప్పటికీ, అమెరికా విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ ఇంధన, ఆర్థిక రంగాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా ఇటీవల విధించిన తాజా ఆంక్షలు టెహ్రాన్, చైనా వాణిజ్య నెట్‌వర్క్‌లపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. ‘ఎకనామిక్ ఫ్యూరీ’ పేరుతో ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రకటించిన ఈ కఠిన ఆంక్షల నడుమ ట్రంప్ పర్యటన అత్యంత ఉత్కంఠ రేపుతోంది.ఇది కూడా చదవండి: ‘యూపీఐ పేమెంట్’తో సువేందు పీఏ హంతకుల పట్టివేత -
సంతోషపు లెక్కల్లో పాశ్చాత్యుల పొరపాటు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లేదా చైనాలను ‘నరక కూపాలు’ అని పిలిచినప్పుడు అందరికీ కోపం రావడం సహజం. కానీ ఒక శాస్త్రవేత్తగా నాకు అది కేవలం అమర్యాదగా మాత్రమే అనిపించలేదు, ఇదొక కొలమాన లోపం అనిపించింది. వాషింగ్టన్ ఇప్పటికీ 1950ల నాటి పాత ఆలోచనలతోనే ప్రపంచాన్ని చూస్తోంది. తాను ఎంత విద్యుత్తును వాడుతున్నాను అనే దానినే గొప్పగా భావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసలైన తృప్తిని అర్థం చేసుకోవడంలో పొరబడుతోంది. నేను 1982లో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి పీహెచ్డీ పూర్తి చేసి జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి వెళ్ళాను. కొన్ని దశాబ్దాలుగా నేను జీవితంలోని రెండు వేర్వేరు ‘ఆపరేటింగ్ సిస్టమ్స్‘ను గమనిస్తున్నాను. వాషింగ్టన్ చూసే కోణం కేవలం ఆర్థిక గణాంకాల చుట్టూనే తిరుగుతుంది తప్ప, మనిషి అనుభవాన్ని నిర్దేశించే అసలైన విషయాలను పట్టించుకోదు. ప్రపంచాన్ని ‘ఆనందపు సామర్థ్యం’ అనే కోణం నుండి చూస్తే, ఆనందం అనేది డబ్బు (జీడీపీ) వల్ల మాత్రమే రాదని అర్థమవుతుంది. అది ఒక సామాజిక నిర్మాణం. ఈ కోణంలో చూసి నప్పుడు, బయటకు ‘నరక కూపం’లా కనిపించే దేశాలే మనిషి సంతోషంగా ఉండటానికి అనువైన ప్రదేశాలుగా కనిపిస్తాయి.ప్రమాణాల్లో తేడా నెల్లూరు జిల్లాలోని అల్లూరు మా స్వగ్రామం. 1980లో బెంగళూరులో నా పీహెచ్డీ స్టైపెండ్ నెలకు ‘50 డాలర్లు’(400 రూపాయలు). అమెరికా లెక్కల ప్రకారం ఇది పేదరికం. కానీ అప్పట్లో వాస్తవం వేరేలా ఉండేది. నా గది అద్దె 4 డాలర్లు, మరో 16 డాలర్లతో రోజుకు నాలుగు పూటలా మంచి భోజనం దొరికేది. వైద్యం అందరికీ అందుబాటులో ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా, నా సొంత పనుల కోసం నేను ఎప్పుడూ శారీరక శ్రమ చేయలేదు. మధ్యతరగతి జీవితాల్లో పనివారు అనే వ్యవస్థ తక్కువ ఖర్చుతో కూడిన, ఒక ముఖ్యమైన భాగం. నేను అమెరికా వెళ్ళాక ఒక వింత పరిస్థితి చూశాను. చికెన్, గుడ్లు, కూల్ డ్రింక్స్ వంటివి చాలా చౌకగా దొరికేవి. కానీ నా ‘జీవన ప్రమాణం‘లో ఒక లోటు వచ్చింది. నా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవడం వల్ల నేను ఒక కూలీలా మారిపోయాను. వంట, ఇల్లు ఊడ్వడం, బట్టలు ఉతకడం వంటి పనులకు మనుషులు దొరకరు, దొరికినా చాలా ఖరీదు. భారత్‌లో మధ్యతరగతి మనిషి మేధస్సు ఇటువంటి పనుల నుండి విముక్తి పొంది ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో సంపద ఉండవచ్చు కానీ, అక్కడ ‘సమయం, సామాజిక లోటు’ ఎక్కువ.2026 నాటికి, ఒక సగటు అమెరికన్ ఒక భారతీయుడి కంటే 12 రెట్లు ఎక్కువ కరెంటు వాడుతున్నాడు. ఇంత కరెంటు వాడినంత మాత్రాన 12 రెట్లు ఎక్కువ ఆనందం వస్తుందా? నేను 1986లో కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాను. నా అపార్ట్మెంట్ మేనేజర్, ఒక మైలు దూరంలో మంచి షాపు ఉన్నా కూడా, ఐదు మైళ్ల దూరంలో ఉన్న ‘మరింత శుభ్రమైన‘ షాపుకు నన్ను కారులో తీసుకెళ్లాడు. అమెరికాలో పెట్రోల్, కరెంటు చౌకగా దొరుకుతాయి కాబట్టి, ఆనందాన్ని ఇవ్వని చిన్న చిన్న సౌకర్యాల కోసం వాటిని వృథా చేస్తారు. కానీ ఇండియాలో మనం సామీ ప్యతకు, సమాజానికి విలువ ఇస్తాం. మనకు సంతోషం మన దగ్గర్లోనే దొరుకుతుంది. తక్కువ వనరులను వాడుతూ ఎక్కువ ఆనందాన్ని పొందడంలో భారతీయులు ముందున్నారు.వలసల వెనుక అసలు నిజంవలసల మీద విమర్శలు చేసేవారు ఒక విషయం మర్చి పోతున్నారు: గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి దిగ్గజాలను నడిపిస్తున్నది ఈ దేశాల మేధావులే. అమెరికా తన బయోమెడికల్ రంగం కోసం, టెక్నాలజీ కోసం ఈ దేశాల శాస్త్రవేత్తలపై ఆధార పడుతోంది. ఇవేమీ ‘లూప్‌హోల్’ వలసలు కాదు. ఇది వ్యూహాత్మక వనరుల సముపార్జన. వై2కే సంక్షోభ సమయంలో, డిజిటల్ మౌలిక సదుపాయాలు కుప్పకూలకుండా కాపాడుకోవడానికి అమెరికాకు భారతీయ ప్రతిభావంతులే అక్కరకొచ్చారు. అలాంటప్పుడు వాటిని ‘నరక కూపాలు’ అనడం అమెరికా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడమే అవుతుంది.అమెరికా నేర్చుకోవాల్సింది ఎంతో!సైన్స్ పరంగా చూస్తే, నిరంతరం సౌకర్యాల మధ్య ఉండటం వల్ల అమెరికన్లలో ‘హెడోనిక్ నంబ్నెస్‘ (ఆనందాన్ని ఫీల్ అవ్వలేని తనం) ఏర్పడుతోంది. ఏసీలు, కార్లు ఎప్పుడూ అందుబాటులో ఉండటం వల్ల వాటి వల్ల వచ్చే కిక్ (డోపమైన్, సెరోటోనిన్) తగ్గిపోతుంది. కానీ వనరులు తక్కువగా ఉన్న చోట ఆనందం ఎక్కువగా ఉంటుంది. 25 షర్టులు ఉన్నవాడికి 26వ షర్టు వల్ల వచ్చే ఆనందం కంటే, 5 షర్టులు ఉన్నవాడికి 6వ షర్టు వల్ల వచ్చే ఉత్సాహం చాలా ఎక్కువ. అలాగే అమెరికన్ మధ్యతరగతి మనిషి భారీ ‘ఆందోళన పన్ను‘ (యాంగై్జటీ ట్యాక్స్) కడుతున్నాడు. లక్ష డాలర్ల జీతం వచ్చినా, ఇన్సూరెన్స్ బిల్లులు, ఇతర సేవల కోసం అది ఖర్చయిపోయి చేతిలో ఏమీ మిగలదు. ఇండియాలో మనకు కుటుంబం అనే భావోద్వేగ అండ ఉంటుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఖరీదైన వ్యవస్థల కంటే, పక్కనే ఉండే కుటుంబ సభ్యులు మనకు ధైర్యాన్ని ఇస్తారు.ప్రపంచాన్ని కేవలం ఒకే కోణం నుండి చూడటం ఆపాలి. ఇల్లు ఎంత పెద్దది, ఎంత వాడుతున్నాం అనే లెక్కలతో చూస్తే భారత్, చైనాలు పేదవిగా కనిపించవచ్చు. కానీ వాటి దగ్గర లెక్కించలేని సంపద ఉంది– అదే ఆపదలను తట్టుకునే శక్తి, సామాజిక ఐక్యత.ఏ దేశాన్నయినా తక్కువ చేసి చూసే ముందు, సంతోషం అనేది ఆయా దేశాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. ఈ దేశాల నుండి పాశ్చాత్య దేశాలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాషింగ్టన్ ప్రపంచానికి నాయకత్వం వహించాలనుకుంటే, ముందు ఈ అహంకారాన్ని విడిచిపెట్టి, ప్రపంచం నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.మేడా పరమేశ్వర రెడ్డివ్యాసకర్త రిటైర్డ్ ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్త; రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్ డైరెక్టర్ -
భారత్‌పై చైనా బండారం బట్టబయలు.. పాక్‌కు సాయం
బీజింగ్: గతేడాది భారత్‌తో జరిగిన నాలుగు రోజుల యుద్ధంలో పాకిస్తాన్‌కు సైనికపరమైన సాంకేతిక సాయం అందజేసిన విషయాన్ని చైనా ధ్రువీకరించింది. ఆ దేశం ఇలా ఒప్పుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఏవీఐసీ) సంస్థ అధీనంలోని చెంగ్దు ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ అధికారి ఝాంగ్ హెంగ్ తాజాగా అధికార చైనా టీవీకిచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయం వెల్లడించారు. ఈ సంస్థ చైనా అత్యాధునిక యుద్ధ విమానాలను, డ్రోన్ల డిజైన్లను రూపొందిస్తుంటుంది. గతేడాది మేలో ఆపరేషన్ సిందూర్ ప్రకటించిన భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలతోపాటు వైమానిక, సైనిక స్థావరాలపైనా దాడులు చేసి, తీవ్రంగా దెబ్బతీయడం తెలిసిందే. ఆ నాలుగు రోజుల యుద్ధం సమయంలో పాకిస్తాన్‌కు సాంకేతిక మద్దతిచ్చామని ఝాంగ్ తాజాగా వెల్లడించారు. పాకిస్తాన్ వద్దనున్న జె–10సీఈ యుద్ధ విమానాలు ఏవీఐసీ అనుబంధ సంస్థ తయారు చేసినవే కావడం గమనార్హం. ‘ఆ నాలుగు రోజులపాటు జెట్ విమానాల శబ్ధాలు, హెచ్చరిక సైరన్ల మోతలతోపాటు ఉదయం వేళలోనే 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో పనిచేయడం మాకు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా పెద్ద పరీక్షగా అనిపించింది. అయితే, మేం తయారు చేసిన జె10సీఈ యుద్ధ విమానాలు సామర్థ్యానికి తగ్గట్లుగా పనిచేసేలా చూడటం మా బాధ్యత’అని ఝాంగ్ వివరించారు. భారత్‌తో నాలుగు రోజుల యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు సాయం అందించారన్న ఆరోపణలపై చైనా విదేశాంగ శాఖ, సైనికాధికారులు ఇప్పటికీ సూటిగా సమాధానం ఇవ్వకపోకవడం గమనార్హం. -
ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే..
సాధారణ చెవుడు, బ్రహ్మ చెవుడు వంటివి వాటి గురించి విన్నాం. కానీ కేవలం పురుషుల మాటలు మాత్రం చెవికి వినపడని అరుదైన వైద్య పరిస్థితి గురించి విన్నారా..!?. ఔను అలాంటి వింత అనారోగ్య పరిస్థితితో బాధపడుతోంది ఈ మహిళ. పాపం తన ప్రియుడి మాటలు తనకు వినిపించడం లేదని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తోందామె. ఇదేం చెవుడు రా బాబు అనిపిస్తోంది కదూ. మరి ఆ కథా కమామీషు ఏంటో చూసేద్దామా..!.చైనాలోని జియామెన్‌లో ఒక మహిళ అక్షరాలా పురుషుల మాటలు వినలేదట. ఆమెకు మగవాళ్లంటే నచ్చక ఇలానేమో అనుకోకండి. చైనాలోని జియమోమెన్లో నివశించే మహిళ తన ప్రియుడు మాటలు వినపించడం లేదని తెలుసుకుంటుంది. అన్ని పెద్ద పెద్ద శబ్దాలు వినగలిగినా..తన లవర్ మాటలే తనకు ఎందుకు వినిపించడం లేదని వైద్యులను ఆశ్రయిస్తే అసలు విషయం బయటపడింది. ఆమె రివర్స్ స్లోప్ హియరింగ్ లాస్‌తో బాధపడుత్నుట్లు గుర్తించారు. ఈ అరుదైన వ్యాధి కారణంగానే ఆమె మగవాళ్ల గొంతుని వినలేదట. అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోవడంగా చెప్పొచ్చు. ధ్వని వర్ణపలంలో చాలా వరకు పురుషుల గొంతులు కచ్చితంగా తక్కువ ఫ్రీక్వెన్సీలోనే ఉంటాయట. కానీ ఈ బాధిత మహిళ అధిక స్థాయి శబ్దాలను, గొంతులను స్పష్టంగా వినగలుగుతుంది కానీ తక్కువ శ్రేణి లేదా ఓ మోస్తారు మీడియం శబ్దంలో వచ్చే మాటలు అస్సలు వినలేదని తేల్చి చెప్పారు వైద్యులు. ఆ హియరింగ్ లాస్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే..రోగి వినికిడిని మ్యాప్ చేయడానికి వైద్యులు ఉపయోగించే ఆడియోగ్రామ్ అనే చార్ట్‌పై ఈ వ్యాధి ఏర్పరిచే ఆకారం నుంచే దానికి ఆ పేరొచ్చిందంట. చాలా వరకు వినికిడి లోపం చార్ట్‌పై క్రిందకి వాలి ఉంటుందని, ఇది అధిక ఫ్రీక్వెన్సీల నష్టాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ ఆ మహిళ విషయంలో మాత్రం..అందుకు విరుద్ధంగా ఉంటుందని వివరించారు వైద్యులు. ఇలా కేవలం పురుషుల గొంతులకే పరిమితం కాదు, తక్కువ స్థాయిలో మాట్లాడే మహిళల స్వరాలను సైతం వినలేకపోవచ్చని కూడా అన్నారు. అదే సమయంలో అధిక స్థాయిలో మాట్లాడే పురుషుల మాటలు వినపడే అవకాశం ఉందని కూడా చెప్పారు. అంతేగాదు తక్కువ పౌనఃపున్య శబ్దాలు మానవ మాటలకు మించి విస్తరించి ఉంటాయని కూడా చెప్పారు. ఈ వ్యాధిని అంత తేలిగ్గా గుర్తించలేం..ఈ పరిస్థితిని అంత సులభంగా ఎవ్వరూ గుర్తించలేరని అంటున్నారు వైద్యులు. ఎందుకంటే చెవులు చిల్లులుపడే శబ్దాలను వినపడకపోవడాన్ని సులభంగా గుర్తించగలిగినంత ఈజీ కాదని చెప్పుకొచ్చారు. పాపం కొందరు ఈ అరుదైన వైద్య పరిస్థితి గురించి తెలియక ఏళ్లతరబడి గడిపేస్తుంటారని కూడా అన్నారు. మెనియర్స్ వ్యాధి, వైరల్ ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్ సంబంధిత సమస్యల వల్ల ఈ పరిస్థితి కారణం కావొచ్చని అన్నారు. అలాంటి బాధితులకు కొంత వరకు వినికిడి పరికరాలు కాస్త ఉపశమనం అందిస్తాయని అన్నారు. అలాగే ఆ మహిళ ప్రియుడికి దీన్ని వ్యక్తిగతంగా తీసుకుని ఇబ్బంది పెట్టడం వంటివి చేయకూడదని వైద్యులు సూచించారు కూడా. (చదవండి: బెల్స్ పాల్సీ వ్యాధి బారిన టెకీ..! కట్‌చేస్తే..) -
భారత్‌కు బిగ్ షాకిచ్చిన బంగ్లాదేశ్
బీజింగ్: తారిఖ్ రహ్మన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌తో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయం తీసుకుంది. తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టులో చైనా సాయం కోరింది. తీస్తా రివర్ కాంప్రెహెన్సివ్ మేనేజ్మెంట్ అండ్ రిస్టోరేషన్ ప్రాజెక్టు(టీఆర్‌సీఎంఆర్‌పీ)కి సంబంధించిన అంశాలపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి కలీలుర్ రహ్మన్ బుధవారం చైనాలో ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయి చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో సాయం అందించేందుకు వాంగ్ యీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వెల్లడించాయి. చైనా సంస్థలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కూడా మంత్రి రహ్మన్ కోరినట్లు తెలిపాయి. తూర్పు హిమాలయాల్లో పుట్టిన తీస్తా నది సిక్కిం, పశ్చిమబెంగాల్ గుండా ప్రవహించి, బంగ్లాదేశ్‌లో సముద్రంలో కలుస్తుంది. ఈ నది బంగ్లాదేశ్‌లో సాగుకు, కోట్లాదిమంది జీవనోపాధికి ఎంతో కీలకంగా ఉంది. కాగా.. భారత, బంగ్లాదేశ్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఈ నదీ జలాల పంపకం కీలకంగా మారింది. ఈ పరిణామం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న దశాబ్దాల నాటి తీస్తా జలాల వివాదానికి మరోసారి తెరలేపింది.చైనా బిగ్ ప్లాన్?మరోవైపు.. భారత్-బంగ్లాదేశ్ మధ్య తీస్తా జలాల పంపిణీపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. ఇటువంటి సమయంలో చైనా జోక్యం చేసుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అంతేకాదు దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించి, తన పట్టును పెంచుకోవాలని చూస్తున్న చైనాకు ఈ ప్రాజెక్ట్ ఒక మంచి అవకాశంగా మారే అవకాశాలున్నాయి. అయితే, తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి, నది ఎగువ భాగంలో ఉన్న దేశంగా భారత్‌కు ఈ ప్రాజెక్టుపై పూర్తి హక్కులు ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా సహాయం కోరడం ద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.భారత్ భద్రతకు ముప్పు.. ఇదిలా ఉండగా.. తీస్తా నది బంగ్లాదేశ్‌లోని ఉత్తర ప్రాంతాలకు ప్రధాన నీటి వనరు. వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరదల సమస్యను పరిష్కరించడానికి బంగ్లాదేశ్ ఈ భారీ ప్రాజెక్టును తలపెట్టింది. దీనికోసం చైనా నుండి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని బంగ్లాదేశ్ ఆశిస్తోంది. ఇందులో భాగంగా తీస్తా ప్రాజెక్టులో చైనా పెట్టుబడులు పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో చైనా భాగస్వామ్యం కావడం భారత్‌కు వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. తీస్తా నది ప్రవహించే ప్రాంతం భారత్‌లోని అత్యంత సున్నితమైన సిలిగురి కారిడార్‌కు అతి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు, అధికారుల కదలికలు పెరిగితే, అది భారత రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో, ఈ పరిణామాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
చైనా మాజీ రక్షణ మంత్రులకు మరణ శిక్ష
బీజింగ్: అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు చైనా మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. వీ ఫెంఘ్, లి షాంగ్ఫులకు ఈ శిక్ష రెండేళ్ల తర్వాత అమలుకానుందని అధికార వార్తా సంస్థ జిన్హుమా గురువారం వెల్లడించింది. ఈ కాలంలో వీరి ప్రవర్తనను బట్టి, మరణ శిక్షను యావజ్జీవంగా మార్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 2018–23 సంవత్సరాల్లో వీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆయన తర్వాత కొన్ని నెలలపాటు లి రక్షణ శాఖ బాధ్యతలు తీసుకున్నారు. వీ ఫెంఘ్పై లంచాలు తీసుకున్న ఆరోపణలు, లి షాంగ్ఫుపై లంచాలు తీసుకోవడంతోపాటు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో, 2024లో వీరిద్దరినీ అధ్యక్షుడు జిన్‌పింగ్ పదవి నుంచి, అధికార కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తొలగించారు. జిన్ పింగ్ సారథ్యంలో పనిచేసే సెంట్రల్ మిలటరీ కమిషన్ నుంచి కూడా ఉద్వాసన పలికారు. అంతకుముందు, వీరిద్దరూ చైనా ఆర్మీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ముఖ్యమైన రాకెట్ ఫోర్స్‌కు చీఫ్‌గా ఉన్నారు. కాగా, జిన్‌పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక అమలు చేసిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో పలువురు సైనిక జనరళ్లు సహా కనీసం 10 లక్షల మంది అధికారులు శిక్షలకు గురవడం గమనార్హం. -
అదుపుతప్పిన రోబో.. భయపడ్డ విద్యార్థులు (వీడియో)
చైనాలోని జిన్జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్‌లోని ఒక పాఠశాలలో క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక రోబో అదుపుతప్పి.. విద్యార్థులను భయబ్రాంతులకు గురించి చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.విద్యార్థులను అలరించడానికి ఏర్పాటు చేసిన రోబో అకస్మాత్తుగా కిందపడిపోయింది. ఆ తరువాత అక్కడున్న ప్రదర్శనకారులపై కుంగ్-ఫూ కిక్‌లు విసరడం ప్రారంభించింది. దిక్కుతోచని విధంగా.. అడ్డదిడ్డంగా పరుగులు పెట్టింది. మైదానంలో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు.పరిస్థితిని అర్థం చేసుకుని, దానిని కంట్రోల్ చేసే వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి రోబోట్‌ను పట్టుకున్నాడు. ఆ తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే మైదానంలోని విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు.ఇదే మొదటిసారి కాదురోబోలు తడబడటం ఇదే మొదటిసారి కాదు. 2026 మార్చి నెలలో.. చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో జరిగిన ఒక బహిరంగ నృత్య ప్రదర్శనలో, ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ప్రమాదవశాత్తు ఒక చిన్న బాలుడి ముఖానికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన.. సిబ్బంది ఆ రోబోను పక్కకు లాగడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ.. అది రింగ్ మధ్యలో తన ప్రోగ్రామ్ ప్రదర్శించింది.Reported on Telegram 🤣The robot went berserk and almost attacked the dancers at a festival in China: the Unitree android malfunctioned severely and started swinging its "iron" in the style of Bruce LeeFortunately, it was quickly shut down — a full-blown "fight" didn't… pic.twitter.com/FH38FFrjZV— Beefeater (@Beefeater_Fella) May 3, 2026రష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని 2025 నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.కంపెనీలకు సూచనలురోబర్స్ తయారీ లేదా వినియోగం అనేది మంచి చర్య. అయితే వాటికి భావాలు అర్థం చేసుకోవడం, ప్రవర్తించిన విధానం పూర్తిగా తెలిసి ఉండదు. ఇలాంటి సమయంలో రోబోల వల్ల ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి వస్తుంది. కాబట్టి సంస్థలు దీనిని దృష్టిలో ఉంచుకుని రోబోట్స్ తయారు చేయాలి. అంతే కాకుండా..పూర్తిగా టెస్ట్ చేసిన తరువాత వినియోగానికి ఉపయోగించడం మంచిది. లేకుంటే.. ప్రజలకు ఇబ్బంది, తద్వారా కంపెనీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
చైనాలో భారీ పేలుడు: 21 మంది మృతి
హునాన్: చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. యాంగ్ నగరంలో సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక బాణసంచా కర్మాగారంలో అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించింది. గ్వాండు టౌన్‌షిప్‌లోని ‘లియుయాంగ్ హువాషెంగ్ ఫైర్వర్క్స్ మాన్యుఫ్యాక్చరింగ్’కు చెందిన ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 21 మంది మరణించగా, 60 మందికి పైగా జనం తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా, భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం -
చైనాదే థామస్ కప్ టైటిల్
హోర్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో చైనా జట్టు 12వసారి విజేతగా నిలిచింది. తొలిసారి ఫైనల్ చేరిన ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చైనా 3–1తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ షి యుకీ 85 నిమిషాల్లో 21–16, 16–21, 21–17తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ను ఓడించి చైనాకు 1–0 ఆధిక్యం అందించాడు.రెండో మ్యాచ్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్ లీ షి ఫెంగ్ 43 నిమిషాల్లో 13–21, 10–21తో ప్రపంచ పదో ర్యాంకర్ అలెక్స్ లానియర్ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. 96 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మూడో మ్యాచ్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ 22–20, 20–22, 21–19తో ప్రపంచ 17వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్‌పై గెలిచి చైనాను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. నాలుగో మ్యాచ్‌లో హీ జి టింగ్–రెన్ జియాంగ్ యు ద్వయం 38 నిమిషాల్లో 21–13, 21–16తో ఎలోయ్ ఆడమ్–లియో రోసీ జోడీని ఓడించి చైనాకు 3–1తో విజయాన్ని అందించింది. సెమీఫైనల్లో ఓడిన భారత్, డెన్మార్క్ జట్లకు కాంస్య పతకాలు లభించాయి.12: థామస్ కప్ టైటిల్‌ను చైనా జట్టు ఇప్పటి వరకు 12 సార్లు గెల్చుకుంది. 1982, 1986, 1988, 1990, 2004, 2006, 2008, 2010, 2012, 2018, 2024, 2026లలో చైనా టైటిల్స్ సాధించింది. అత్యధిక సార్లు థామస్ కప్ నెగ్గిన జట్టుగా ఇండోనేసియా (14 సార్లు) అగ్రస్థానంలో ఉంది. మలేసియా (5 సార్లు) మూడో స్థానంలో ఉంది. భారత్, డెన్మార్క్, జపాన్ ఒక్కోసారి థామస్ కప్ టైటిల్‌ను సాధించాయి. -
చైనా గుట్టు రట్టయ్యిందా?
కరోనా పుట్టుక విషయంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలకు దిగింది. అయితే వుహాన్ ల్యాబ్‌లోనే వైరస్ పుట్టిందన్న దానికి తగిన ఆధారాలు మాత్రం చూపెట్టలేకపోయింది. ఈ తరుణంలో ఇప్పుడు మరో అంశంపైనా డ్రాగన్ కంట్రీ గోప్యత ప్రదర్శిస్తోందని.. ఆ గుట్టు ఇప్పుడు రట్టయ్యిందని డాటాను రిలీజ్ చేసింది.2022 మార్చి 21న చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ విమానం (MU5735) గ్వాంగ్సీ ప్రాంతంలోని పర్వతాల్లో కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 132 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. విమానం 49 వేల ముక్కలు కావడంతో.. వాటి సేకరణకు భారీ సిబ్బందిని వినియోగించారు. చైనాలో గత కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఇది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను చైనా ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి వెల్లడించలేదు.ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత.. అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఒక సంచలన నివేదిక ఇచ్చింది. ఆ ప్రమాదం సహజసిద్ధంగా జరగలేదని.. కాక్‌పిట్‌లో ఎవరో ఉద్దేశపూర్వకంగా ఇంధన సరఫరా నిలిపివేశారని తెలిపింది.ఫ్లైట్ డేటా రికార్డర్ (బ్లాక్‌బాక్స్) విశ్లేషణలో.. 29,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు రెండు ఇంజిన్లకు ఇంధన స్విచ్‌లు ఒకేసారి “రన్” స్థితి నుండి “కట్ఆఫ్” స్థితికి మార్చబడ్డాయి. దీని తర్వాత ఇంజిన్ వేగం తగ్గి, విమానం వేగంగా కిందికి పడిపోయింది. ఒకవేళ అది పొరపాటుగా జరిగి ఉంటే.. పైలట్లు అప్రమత్తం అయ్యేవాళ్లు. వెంటనే తప్పును సరి చేసుకునేవారు. కానీ, అలాంటి ప్రయత్నం జరగలేదు అని డేవిడ్ సౌసీ అనే నిపుణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) బ్యాటరీ బ్యాకప్‌తో చివరి క్షణాలను రికార్డు చేసినప్పటికీ.. ఆ ఆడియో ఫైళ్లను అమెరికా అధికారులు చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (CAAC)కి పంపారు. అయితే, సీఏఏసీ ఇప్పటిదాకా ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకమని అంగీకరించలేదు. 2024లో రిలీజ్ చేసిన నివేదికలో మాత్రం అంతా సవ్యంగానే ఉందని పేర్కొంది. గతంలో..2022లో వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక కూడా ‘‘విమానం కాక్‌పిట్‌లో ఎవరో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూలిపోయింది’’ అని సంచలనాత్మక కథనం ఇచ్చింది. ఇది పైలట్ ఆత్మహత్య చర్యనా? లేదంటే మరెవరైనా కాక్‌పిట్‌లోకి చొరబడి చేసిన చర్యా? అన్న ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. అసలు బ్లాక్‌బాక్స్ డేటాను చైనా ఎందుకు బయటపెట్టడం లేదన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. -
చైనా, రష్యా, కొరియాతో తలపడాల్సి వస్తే.. అమెరికా పరిస్థితి
-
చైనాలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్
చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం (China Real Estate Crash) ముదురుతోంది. ఒకప్పుడు దేశ జీడీపీలో పావు వంతు (25%) వాటా కలిగిన ఈ రంగం, ప్రస్తుతం కుప్పకూలుతోంది. గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా ఆస్తి విలువలు పడిపోవడంతో అటు ఇన్వెస్టర్లు, ఇటు సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇదే తరహా ‘రియల్’ ప్రకంపనలు భారతదేశంలోనూ వచ్చే అవకాశం ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.గణాంకాలు ఏం చెబుతున్నాయి?బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) డేటా ప్రకారం, చైనాలో రియల్ ఎస్టేట్ పతనం "స్లో మోషన్ క్రాష్"ను తలపిస్తోంది. 2021లో 113 పాయింట్లుగా ఉన్న గృహ ధరల సూచిక, 2025 చివరి నాటికి 86.79కి పడిపోయింది. అంటే నాలుగేళ్లలో దాదాపు 25% సంపద ఆవిరైపోయింది. చైనాలో ప్రస్తుతం 391 మిలియన్ చదరపు మీటర్ల మేర ఇళ్లు అమ్ముడుపోకుండా ఖాళీగా ఉన్నాయి. ఇది 2021తో పోలిస్తే 72% ఎక్కువ. 2025 మొదటి పది నెలల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 14.7% క్షీణించాయి.దిగ్గజ సంస్థల పతనంచైనాలో రియల్ ఎస్టేట్ దిగ్గజాలుగా పేరుగాంచిన సంస్థలు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఎవర్‌గ్రాండే (Evergrande) 300 బిలియన డాటర్లకు పైగా అప్పులతో కుప్పకూలి, ఆగస్టు 2025లో స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి వైదొలిగింది. అత్యంత స్థిరమైన సంస్థగా పేరున్న వాంకే (Vanke), 2024లో రికార్డు స్థాయిలో 6.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించి షాక్ ఇచ్చింది. కంట్రీ గార్డెన్ సంస్థ కూడా తన బకాయిలను చెల్లించలేక డిఫాల్టర్‌గా నిలిచింది.భారత్‌లో ఆందోళన అవసరమా?చైనా మార్కెట్ పతనాన్ని చూసి భారతీయ కొనుగోలుదారులు కూడా అయోమయానికి గురవుతున్నారు. రూపాయి విలువ పతనం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, AI కారణంగా ఉద్యోగ అనిశ్చితి వంటి కారణాలతో భారత్‌లోనూ ధరలు తగ్గుతాయేమోనని కొందరు భావిస్తున్నారు. అయితే, ఆర్థిక విశ్లేషకులు మాత్రం చైనాకు, భారత్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెబుతున్నారు.భారత మార్కెట్ బలంగా ఉండటానికి కారణాలుచైనాలో ఇళ్లు మిగిలిపోతుంటే (Over supply), భారత్‌లో ఇంకా గృహాల కొరత ఉంది. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల డిమాండ్ నిలకడగా ఉంది.భారత్‌లో పెట్టుబడిదారుల కంటే, సొంత ఇల్లు కొనుక్కునే వారి సంఖ్య (End users) ఎక్కువ. ఇది మార్కెట్‌కు స్థిరత్వాన్ని ఇస్తుంది.చైనాలోలాగా కేవలం ఊహాజనిత పెట్టుబడులతో కాకుండా, భారత్‌లో జనాభా అవసరాలకు అనుగుణంగా మార్కెట్ విస్తరిస్తోంది. -
ఇరాన్‌కు ముచ్చెమటలు.. ట్రంప్ బ్లాక్‌బస్టర్ వ్యూహం
అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్‌కు చుక్కలు చూపిస్తోంది. మొన్నటి వరకు ఇరాన్‌పై దాడులతో విరుచుకుపడిన అమెరికా.. ఇప్పుడు ప్లాన్ మార్చి వ్యూహాత్మకంగా ఇరాన్‌ను దెబ్బతీస్తోంది. ఇరాన్‌పై కఠిన ఆర్థిక చర్యలకు దిగింది. తాజాగా అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) రంగంలోకి దిగింది. ఇరాన్‌కు చెందిన 35 సంస్థలు, వ్యక్తులపై.. ‘షాడో బ్యాంకింగ్’ నెట్వర్క్ ద్వారా ఇరాన్ ఆయుధాలు, క్షిపణి ప్రోగ్రామ్‌లు, ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చుతున్నాయని ఆరోపిస్తూ వీరిని బ్లాక్‌లిస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్, అమెరికా యుద్ధంలో రోజురోజుకు పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇరాన్‌పై ట్రంప్ కఠిన ఆర్థిక చర్యలకు దిగారు. ఇరాన్‌పై ‘ఎకనామిక్ ఫ్యూరీ’ పేరుతో కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిడి కార్యక్రమంలో భాగంగా ఇరాన్‌కు చెందిన 35 సంస్థలు(కొన్ని బ్యాంకులు కూడా), వ్యక్తులపై ఓఎఫ్ఏసీ ఆంక్షలు విధించింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరాన్ రహస్యంగా నిర్వహిస్తున్న షాడో బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా భారీ మొత్తంలో డబ్బు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చలామణి అవుతోంది. ఈ నిధులు ఇరాన్ సైన్యం, క్షిపణి కార్యక్రమాలు, ప్రాంతీయ ఉగ్రవాద అనుబంధ సంస్థలకు చేరుతున్నాయి. ఇరాన్ సైనిక వ్యవస్థకు ఈ రహస్య బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక జీవనాధారంగా పనిచేస్తుంది. ఈ నెట్‌వర్క్‌కు సహకరించే ఏ ఆర్థిక సంస్థ అయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సంస్థలు, ఆంక్షలకు గురైన సంస్థలకు అంతర్జాతీయ ఆర్థిక రంగంలోకి అక్రమ ప్రవేశం కల్పించడానికి విదేశీ అధికార పరిధిలోని షెల్ ఖాతాలను ఉపయోగిస్తున్నాయి’ అని ఆరోపించారు.ఆర్థిక వ్యవస్థపై ప్రభావం.. ఇదిలా ఉండగా.. ఇరాన్ టార్గెట్ అమెరికా.. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇరాన్‌కు సంబంధించి దాదాపు వెయ్యి సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించినట్లు సమాచారం. తాజా చర్యలతో అమెరికాలో ఉన్న సంబంధిత సంస్థల ఆస్తులన్నీ స్తంభించిపోయే అవకాశం ఉంది. అలాగే వీరితో లావాదేవీలు కొనసాగించే విదేశీ బ్యాంకులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు దూరమయ్యే ప్రమాదం ఉంది.బ్యాంకులకు ఝలక్.. మరోవైపు.. అమెరికా విధించిన ఆంక్షలకు గురైన సంస్థల్లో బ్యాంక్ సెపాత్ అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాంక్ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూర్చుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అలాగే బ్యాంక్ సినా సుప్రీం లీడర్ నియంత్రణలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. పార్సియన్ బ్యాంక్‌లతో సంబంధాలు ఉన్న కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకుంది. అయితే, తాజా చర్యలు ఇరానియన్ ఆయిల్ కంపెనీలకు నిధులను తరలించే వాటిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌కు చెందిన షుకున్ లిమిటెడ్ సంస్థ, 2024లో ఇరాన్ చమురు లావాదేవీల కోసం 70 మిలియన్ డాలర్లకు పైగా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.చైనా రిఫైనరీలకు హెచ్చరిక..ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న “టీపాట్ రిఫైనరీలు” (ప్రధానంగా షాండాంగ్ ప్రావిన్స్‌లో)తో వ్యాపారం చేసే బ్యాంకులు కూడా ఆంక్షలకు గురవుతాయని OFAC హెచ్చరించింది. ఇవి చిన్న, స్వతంత్ర రిఫైనరీలు. ప్రధానంగా చైనా షాండాంగ్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. పెద్ద ప్రభుత్వ రిఫైనరీలతో పోలిస్తే, వీటికి అంతర్జాతీయ నియంత్రణలు తక్కువగా ఉంటాయి. ఇరాన్ చమురు కొనుగోలు చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న ఈ రిఫైనరీలతో వ్యాపారం చేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఆంక్షలకు గురవుతాయి అని అమెరికా స్పష్టం చేసింది. అంటే, ఈ రిఫైనరీలకు ఫైనాన్స్, ఇన్సూరెన్స్, షిప్పింగ్ సర్వీసులు అందించే సంస్థలు కూడా బ్లాక్‌లిస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. -
వాటర్ మిలన్ క్యాపిటల్ ఏది ? ఈ షాకింగ్ విషయాలు తెలుసా?
'ప్రపంచ పుచ్చకాయల రాజధాని'గా ఏ నగరాన్ని పిలుస్తారో మీకు తెలుసా? ఈ నగరం, ఏటా లక్షల పౌండ్ల పుచ్చకాయలను ఎగుమతి చేస్తుంది. 77 ఏళ్ల సంప్రదాయం, భారీ ఎగుమతి గణాంకాలతో, ఈ రసవంతమైన బిరుదు వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకుందాం.పుచ్చకాయలు వేసవిలో తప్పక తినే ఒక అద్భుతమైన పండు. ఇవి వెచ్చని, ఎండ ఉన్న ప్రదేశాలలో, ముఖ్యంగా 24°C నుండి 30°C మధ్య ఉష్ణోగ్రతలు ఉండే చోట బాగా పెరుగుతాయి. ప్రజలు సాధారణంగా వసంతకాలం చివరలో విత్తనాలు నాటుతారు. కానీ ఇటీవలి కాలంలో దాదాపు 365 రోజులు అందుబాటులో ఉంటున్నాయి.ప్రపంచంలోనే పుచ్చకాయల (Watermelon)ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనా. అయితే క్రిస్ప్ కౌంటీలో ఉన్న జార్జియాలోని కార్డెల్, అధికారికంగా "ప్రపంచ పుచ్చ కాయల రాజధాని"గా గుర్తింపు పొందింది. దేశంలోని మరే ఇతర ప్రాంతం కంటే ఎక్కువగా పుచ్చకాయలను పండించి, ఎగుమతి చేయడం వల్ల దీనికి ఈ హోదా లభించింది. 2026లో, ఈ నగరం తన అత్యాధునిక రైతు బజారు మరియు 1949 నుండి విజయవంతంగా కొనసాగుతున్న వార్షిక పుచ్చకాయల దినోత్సవాల పండుగ మద్దతుతో ఈ పరిశ్రమలో అగ్రగామిగా నిలిచింది.పుచ్చకాయకు ఏ దేశం ప్రసిద్ధి చెందింది?ప్రపంచ పరిశ్రమలో అగ్రగామిగా నిలుస్తూ, పుచ్చకాయలకు చైనా అత్యంత ప్రసిద్ధి చెందిన దేశం. 2026లో, ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో సుమారు 60-63శాతం వాటాతో, 63 మిలియన్ టన్నులకు పైగా పంటను చైనా పండించింది. ఈ పండు చైనీస్ సంస్కృతిలో ముఖ్యమైన భాగం. ఆతిథ్యానికి చిహ్నంగా ఉపయోగిస్తారట.పుచ్చకాయను ఏ దేశం ఎక్కువగా ఇష్టపడుతుంది?మొత్తం మీద ఏ దేశంతో పోల్చినా చైనానే అత్యధికంగా పుచ్చకాయలను తింటుంది, కానీ అల్జీరియా ప్రజలు తలసరి అత్యధికంగా, సంవత్సరానికి దాదాపు 49 కిలోలు తింటారు. టర్కీ కూడా అధిక తలసరి వినియోగానికి ప్రసిద్ధి చెందింది, అక్కడ తలసరి 37 కిలోలు తింటారు. ఈ ప్రదేశాలలో, వేడిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి పుచ్చకాయ ఒక ప్రసిద్ధ మార్గం, ఎందుకంటే ఇందులో 92% నీరు ఉంటుంది. చాలా చవకైనది.పుచ్చకాయ అసలు ఏ దేశానికి చెందినది?పుచ్చకాయ మొదటగా ఈశాన్య ఆఫ్రికాలో, ప్రస్తుతం సూడాన్‌గా పిలవబడే ప్రాంతంలో పెరిగింది. 4,000 సంవత్సరాల కంటే ముందే ప్రాచీన ఈజిప్షియన్లు పుచ్చకాయలను పండించేవారని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారి సమాధులలో ఈ పండు చిత్రాలు కనిపిస్తాయి. తొలితరం పుచ్చకాయలు తరచుగా చేదుగా ఉండేవి, కానీ నైలు లోయలోని రైతులు క్రమంగా వాటిని మనం ఈ రోజు తినే వాటిలాగా తీపిగా , ఎర్రగా ఉండేలా అభివృద్ధి చేశారు.పుచ్చకాయను అత్యధికంగా ఎగుమతి చేసే దేశం ఏది?పుచ్చకాయ ఎగుమతులలో స్పెయిన్ మరియు మెక్సికో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నాయి. స్పెయిన్ యూరోపియన్ మార్కెట్‌కు అధిక భాగాన్ని సరఫరా చేస్తుంది, ప్రతి సంవత్సరం సుమారు 790,000 టన్నులను ఎగుమతి చేస్తుంది. మెక్సికో ప్రధానంగా అమెరికాకు ఎగుమతి చ్తేఉంది. అది తన అవసరాలను తీర్చుకోవడానికి 800,000 టన్నులకు పైగా దిగుమతి చేసుకుంటుంది. ఈ వాణిజ్య మార్గాలు చల్లని ప్రాంతాల ప్రజలు ఏడాది పొడవునా పుచ్చకాయలను ఆస్వాదించేందుకు తోడ్పడతాయి.ఇదీ చదవండి: ‘బోష్’ మహిళా ఉద్యోగిని అనుమానాస్పద మరణంప్రపంచంలో అత్యంత తీయని పుచ్చకాయ ఎక్కడ దొరుకుతుంది?డెన్సుకే. ఇది దాని ప్రత్యేకమైన తియ్యని, విలాసవంతమైన రుచికి ప్రసిద్ధి చెందింది. నల్లని తొక్క కలిగిన ఈ అరుదైన పుచ్చకాయలలో, సాధారణ పుచ్చకాయల కంటే చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పుచ్చకాయను జపాన్‌లోని ఉత్తర ద్వీపమైన హొక్కైడోలో మాత్రమే పండిస్తారు. ఇవి దొరకడం కష్టం కావడం వల్ల రుచిలో అత్యంత మధురంగా ఉండటం వల్ల, వీటికి ఎంతో విలువ ఉంటుంది; వీటిలో అత్యుత్తమమైనవి తరచుగా 6,000డాలర్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతుంటాయి.ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో పుచ్చ : ఎన్ని లాభాలో తెలుసా? కానీ బహుపరాక్! -
భారత్‌కు తప్పని చైనా గండం!
ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్‌లో భారత్ ఆట ముగిసింది. భారత మహిళల నంబర్‌వన్ షట్లర్ పీవీ సింధు చైనా గండాన్ని దాటి ముందుకెళ్లలేక చతికిలపడింది. విషయంలోకి వెళితే ఉబెర్ కప్‌లో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో చైనాతో తలపడింది. అయితే చైనా చేతిలో 5-0తో పరాజయం చవిచూసిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే నిర్ణయాత్మక సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 16-21, 21-19, 19-21తో వాంగ్ జియి చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో డబుల్స్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో ప్రియా కొన్‌జెంగమ్-శ్రుతి మిశ్రా జంట చైనా జంట చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత మరో డబుల్స్‌లో ట్రిసా జాలీ-కవిప్రియ సెల్వమ్ జోడి కూడా ఓటమి పాలవ్వడంతో భారత్ ఓటమి ఖరారైంది. ఈ నేపథ్యంలో రివర్స్ సింగిల్స్‌లో ఇషారాణి బరుహా తొలి గేమ్‌ను గెలిచినప్పటికీ ఆ తర్వాత వరుసగా రెండు గేముల్లో ఓటమిపాలైంది. ఇక థామస్ కప్‌లో భాగంగా పరుషుల విభాగంలో భారత జట్టు బుధవారం చైనాతో తలపడనుంది.చదవండి: పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు! -
కుక్కలు, పిల్లులు కాదు.. చైనాలో వింత ట్రెండ్!
ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ సరికొత్త టెక్నాలజీతో, ఆర్థిక విషయాలతో ఆశ్చర్యపరిచే చైనా.. ఇప్పుడు ఓ విచిత్రమైన ట్రెండ్‌తో వార్తల్లో నిలిచింది. ఇన్నాళ్లూ కేవలం వంటకాలకే పరిమితమైన కోళ్లు ఇప్పుడు అక్కడి ప్రధాన నగరాల్లో ముద్దులొలికే పెంపుడు జంతువులుగా మారిపోయాయి. ఏకంగా డైపర్లు వేసుకుని, వీధుల్లో షికారు చేస్తూ, ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారుతున్నాయి.అగ్వాయ్ ‘ఫీనిక్స్ ఫెయిరీస్’గువాంగ్డాంగ్ లాంటి ప్రాంతాల్లో కోడి కనిపిస్తే అది వంటకంలో ఉండాల్సిందే అన్న సామెత ఉంది. కానీ, అగ్వాయ్ అనే మహిళ తనకు బంధువులు ఇచ్చిన మూడు గుడ్లను పొదిగించి, ఆ కోడిపిల్లలను వండుకోకుండా ముద్దుగా పెంచుకుంటోంది. ఇవి అరుదైన, ఖరీదైన ‘తైహే బ్లాక్-బోన్డ్ సిల్కీ ఫౌల్’ జాతికి చెందినవి. మంచు లాంటి తెల్లటి ఈకలతో ఆకట్టుకునే వీటిని ‘ఫీనిక్స్ ఫెయిరీస్’ అని ముద్దుగా పిలుస్తారు. వీటి నిర్వహణ చాలా సులభమని, నెలకు కేవలం 30 యువాన్లు (సుమారు రూ. 450) మాత్రమే ఆహారం కోసం ఖర్చవుతుందని ఆమె తెలిపింది.కుక్కలు, పిల్లుల కంటే ఇవే బెటర్కోళ్లు చాలా తెలివైనవని, వాటికి ఎమోషన్స్ ఉంటాయని యజమానులు చెబుతున్నారు. జియాంగ్సు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన కోడిపుంజు మనుషులతో భావోద్వేగాలను పంచుకుంటుందని, కళ్లతోనే కమ్యూనికేట్ చేస్తుందని తెలిపాడు. చిలుకలు, కుక్కలు, పిల్లులను పెంచిన అలిన్ అనే మరో యజమాని.. వాటన్నింటికంటే కోళ్లే మనుషులతో త్వరగా కనెక్ట్ అవుతాయని అంటోంది. సాధారణ పెంపుడు జంతువులకు అయ్యే ఖర్చు, వాటికి కేటాయించాల్సిన సమయం కంటే.. కోళ్ల నిర్వహణ చాలా సులభమని ఆమె అభిప్రాయపడింది.ఎక్కడి నుంచి వస్తున్నాయి?పెంపుడు జంతువులుగా మారుతున్న ఈ కోళ్లన్నీ ఎక్కువగా ఫారాల నుంచి వస్తున్నవే. గుడ్లు పెట్టలేని పుంజులు, మాంసం కోసం పెంచే బ్రాయిలర్ కోళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. కొన్ని సూపర్ మార్కెట్లు ఎగ్స్, పెరుగు కొన్నవారికి ఆఫర్ల రూపంలో ఈ కోడిపిల్లలను ఉచితంగా ఇస్తుండగా.. రైతులు సిటీ పార్కుల్లో ఒకటి నుంచి మూడు యువాన్లకే అతి చవకగా విక్రయిస్తున్నారు. ఇది నగరవాసులను, ముఖ్యంగా పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తోంది. చైనీయుల జీవనశైలిలో కోళ్లు కొత్త ఫ్యామిలీ మెంబర్స్‌గా మారిపోయాయి.ఇది కూడా చదవండి: ‘22 నిమిషాల్లో శత్రువుల వెన్నువిరిచేశాం’ -
అక్కడ రైలులో ప్రయాణించాలంటే ఆక్సిజన్ మాస్క్ తప్పనిసరి..!
ఎన్నో రైళ్ల జర్నీలు చేసి ఉంటారు. కానీ చైనాలో ఆ ప్రదేశంలోని రైలు జర్నీ ఓ ప్రత్యేక అనుభూతి మాత్రమే కాదు, ఆస్ప్రతిలో ఉన్నామా అనే భావన వస్తుంది. ఆ రైలు ఎక్కిన ప్రతి ఒక్కరు ఆక్సిజన్ మాస్క్ ధరించి తీరాల్సిందే. లేదంటే కష్టం. ఎందుకంటే..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గమైన చైనా క్వింగ్హై-టిబెట్ రైల్వేలో కచ్చితంగా ఆక్సిజన్ మాస్క్ ధరించి ప్రయాణించాలి. ఆ రైలు "ఆసుపత్రి తరహా" ఏర్పాటుతో వస్తుంది. ఈ అసాధారణ ప్రయాణం మిమ్మల్ని టిబెట్ రాజధాని అయిన లాసా వరకు తీసుకువెళుతుంది. దాదాపు వెయ్యి కిలోమీటర్ల పైగా పొడవైన ఈ రైలు మార్గంలో అధిక భాగం సముద్ర మట్టానికి సుమారు 4 వేల మీటర్ల (13,123 అడుగులు) ఎత్తులో ప్రయాణిస్తుంది. దీనిలోని అత్యంత ఎత్తైన ప్రదేశం టాంగ్గులా కనుమ వద్ద 5,072 మీటర్ల(16,640 అడుగులు) ఎత్తుకు చేరుకుంటుంది. ఈ ఎత్తులో, సముద్ర మట్టంతో పోలిస్తే గాలిలో సుమారు 40 శాతం తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ప్రయాణాన్ని మరింత సురక్షితంగా సునాయాసంగా చేయడానికి, అలాగే అధిక ఎత్తులో ప్రయాణించేలా సహాయం చేయడానికి రెండు ప్రధాన ఆక్సిజన్ వ్యవస్థలను రూపొందించారు.మొదటిది డిస్పర్షన్ ఆక్సిజన్ సిస్టమ్. ఈ వ్యవస్థ రైలులోని ఎయిర్ కండిషనింగ్‌లో అదనపు ఆక్సిజన్‌ను కలుపుతుంది, తద్వారా ప్రతి కోచ్ లోపల మొత్తం ఆక్సిజన్ స్థాయి సుమారు 23.5 శాతానికి పెరుగుతుంది. రైలు సాధారణంగా గోల్ముద్ (2,829 మీ) చేరుకున్న తర్వాత ఈ వ్యవస్థను ప్రారంభిస్తుంది.రెండవది డైరెక్ట్ ఆక్సిజన్ అవుట్లెట్ సిస్టమ్. ఇది ప్రయాణికులు తమ సీట్ల దగ్గర ఉన్న అవుట్లెట్లకు అనుసంధానించబడిన చిన్న పైపుల ద్వారా ఆక్సిజన్‌ను పీల్చుకోవడానికి అనుమతిస్తుంది. హార్డ్ స్లీపర్ కంపార్ట్మెంట్లలో, ప్రతి బెర్త్‌కు దాని పక్క గోడల వెంబడి ఆక్సిజన్ అవుట్లెట్లు అమర్చబడి ఉంటాయి.హార్డ్ సీట్ కోచ్‌లలో, ఆక్సిజన్ అవుట్లెట్లు క్యారేజీ గోడల వెంబడి క్రమమైన విరామాలలో లేదా కొన్నిసార్లు సీట్ల కిందకూడా అమర్చబడి ఉంటాయి. ప్రతి అవుట్‌లెట్‌ను సుమారు 4 నుంచి 6 మంది ప్రయాణికులు పంచుకుంటారు. సాఫ్ట్ స్లీపర్ కంపార్ట్మెంట్లలో, ప్రతి బెర్త్‌కు మంచం దగ్గర దాని స్వంత ఆక్సిజన్ అవుట్లెట్ ఉంటుంది.ఈ రైలు మార్గం ప్రకృతి సౌందర్యానికి నెలవు..కింగ్హై-టిబెట్ రైలు ద్వారా లాసా చేరుకునే ప్రయాణం చాలా అందమైనది, ప్రత్యేకమైనది. ఈ రైలు బీజింగ్, షాంఘై, చెంగ్డూ, షినింగ్ వంటి నగరాల నుంచి టిబెట్‌లోని లాసా వరకు వెళుతుంది.ఈ ప్రయాణంలో, ప్రయాణికులు మార్గం పొడవునా ఉత్కంఠభరితమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. వారు విశాలమైన నీలి ఆకాశాన్ని,తెల్లని మేఘాలను చూస్తారు. గాడిదలు, గొర్రెల మందలతో కూడిన విశాలమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ఈ రైలు కున్లూన్ పర్వత శ్రేణితో సహా మంచుతో కప్పబడిన పర్వతాలు, యాంగ్జీ వంటి ప్రధాన నదుల గుండా కూడా వెళుతుంది. ఈ ప్రయాణం హోహ్ షిల్ నేషనల్ నేచర్ రిజర్వ్ వంటి మారుమూల సహజ ప్రాంతాల గుండా సాగుతుంది.సాఫ్ట్ స్లీపర్, హార్డ్ స్లీపర్, హార్డ్ సీట్ల కోసం ఢిల్లీ నుంmr లాసాకు ప్రయాణిస్తుంటే, బీజింగ్ మీదుగా విమానంలో వెళ్లవలసి ఉంటుంది. దీనికి సుమారుగా రూ. 55,000 ఖర్చవుతుంది. బీజింగ్ నుంచి లాసాకు రైలులో వెళ్లాలి. ధర మీరు ఎంచుకునే సీటు రకంపై ఆధారపడి ఉంటుంది.మూడు రకాల సీట్లు ఉన్నాయి. సాఫ్ట్ స్లీపర్ అత్యంత సౌకర్యవంతమైన ఎంపిక, దీనిలోని ప్రతి క్యాబిన్లో నాలుగు బెర్త్‌లు ఉంటాయి. కంపార్ట్మెంట్లు విశాలంగా ఉంటాయి. లాక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. టేబుల్, టీవీ స్క్రీన్, లగేజీ పెట్టుకునే స్థలం, ఆక్సిజన్ అవుట్లెట్ల వంటి సౌకర్యాలను కలిగి ఉంటాయి. పై బర్త్‌కు సుమారుగా రూ. 675, కింది బంక్‌కు రూ. 700 ఖర్చవుతుంది.తరువాతది హార్డ్ స్లీపర్. ప్రతి కంపార్ట్మెంట్లో ఆరు బెర్త్‌లు ఉంటాయి, దిండ్లు, దుప్పట్లు అందించబడతాయి. గోప్యత కోసం తలుపు ఉండదు, మరియు స్థలం ఇరుకుగా ఉంటుంది. ధరలు పై బర్త్‌కు రూ. 425 మధ్య బర్త్ రూ. 440, కింది బంక్‌కు రూ. 450 నుంచి ప్రారంభమవుతాయి.హార్డ్ సీట్లు అత్యంత చౌకైన సుదీర్ఘ ప్రయాణానికి మాత్రమే సాధారణ సీటింగ్‌ను అందిస్తాయి. దీనికి సుమారుగా రూ. 212 ఖర్చవుతుంది. View this post on Instagram A post shared by marina guaragna (@marinaguaragna) (చదవండి: బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!) -
చైనా చమురు దిగ్గజంపై ట్రంప్ ఆంక్షలు
ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇరాన్ నుంచి అక్రమంగా చమురు దిగుమతి చేసుకుంటున్న చైనాకు చెందిన ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం ‘హెంగ్లీ పెట్రోకెమికల్’పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. దీనితో పాటు ఇరాన్ చమురు రవాణాలో పాలుపంచుకుంటున్న సుమారు 40 షిప్పింగ్ కంపెనీలు, ట్యాంకర్లపై కూడా వేటు వేసింది.ఆంక్షల వెనుక ప్రధాన ఉద్దేశంఇరాన్ సైన్యానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవడమే ఈ నిర్ణయం ఉద్దేశం. తాజా చర్యతో ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, కంపెనీలపై సెకండరీ ఆంక్షలు విధిస్తామన్న తన హెచ్చరికను ట్రంప్ ప్రభుత్వం అమలు చేసి చూపింది. దాంతో చైనాలోని డాలియన్ నగరంలో ఉన్న హెంగ్లీ పెట్రోకెమికల్ సదుపాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. రోజుకు సుమారు 4,00,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఈ పెసిలిటీ ఉత్పాదకత తగ్గిపోయే ప్రమాదముంది. అయితే, 2023 నుంచి ఈ సంస్థ ఇరాన్ ముడి చమురును స్వీకరిస్తూ తమ సైన్యానికి వందల మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని చేకూర్చినట్లు అమెరికా ట్రెజరీ విభాగం నిర్ధారించింది.ప్రపంచ ఇంధన మార్కెట్లో అలజడిఒకవైపు ఆర్థిక ఆంక్షలు విధిస్తూనే మరోవైపు భౌగోళికంగా కూడా అమెరికా ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనాన్ని విధించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడం, చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో ప్రపంచ ఇంధన వాణిజ్యం ప్రస్తుతం గందరగోళంలో ఉంది.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
చైనాకు షాకిచ్చిన అమెరికా!
ఇరాన్‌తో వ్యాపారం చేసే కంపెనీలు, దేశాలపై ఆంక్షలు విధిస్తానని ట్రంప్ హెచ్చరికలు చేసిన గంటల వ్యవధిలోనే అమెరికా ఆచరణలోకి తీసుకొచ్చింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం చైనాలోని హెంగ్లీ పెట్రో కెమికల్ రిఫైనరీ సహా ఇరాన్ చమురుతో సంబంధం ఉన్న సుమారు 40 షిప్పింగ్ సంస్థలు, ట్యాంకర్లపై కఠిన ఆంక్షలు విధించింది. ఇరాన్‌కు కీలక ఆదాయ వనరుగా ఉన్న చమురు ఎగుమతులను నిలిపేయడానికి ట్రంప్ చేసిన ఎత్తుగడలో ఇదొక భాగమని చెప్పొచ్చు. అంతేకాదు ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలకమైన పర్షియన్ గల్ఫ్ జలమార్గమైన హర్మూజ్‌జలసంధిని అమెరికా దిగ్భంధనం చేసిన సంగతి తెలిసిందే. కాగా చైనాకు చెందిన హెంగ్లీ పెట్రో కెమికల్ రిఫైనరీలో రోజుకు సుమారు 400,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉంటుంది. ఇది చైనాలోనే అతిపెద్ద స్వతంత్ర రిఫైనరీల్లో ఒకటిగా నిలిచింది. ఇక 2023 నుంచి హెంగ్లీ రిఫైనరీ ఇరాన్ నుంచి ముడి చమురును సరఫరా చేసుకుంటూ ఇరాన్ సైన్యానికి వందల మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నట్లు సమాచారం. ప్రపంచ మార్కెట్లకు చమురును తరలించడానికి ఇరాన్ ఆధారపడే నౌకలు, మధ్యవర్తులు, కొనుగోలుదారుల నెట్‌వర్క్‌ను మరింత కఠినతరం చేస్తామని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు. అంతేకాదు ఏప్రిల్ మొదటివారంలో ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్న చైనా, హాంగ్ కాంగ్, యూఏఈ, ఒమన్‌లోని ఆర్థిక సంస్థలను హెచ్చరిస్తూ ఆంక్షలు విధిస్తామని లేఖలు పంపించింది. కాగా మరికొన్ని వారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన కీలక రిఫైనరీపై ఆంక్షలు విధించడం ఎలాంటి చర్చకు దారి తీస్తుందనేది ఆసక్తిగా మారింది. -
యుద్ద సంక్షోభాన్ని ముందే పసిగట్టిన చైనా..?
డ్రాగన్ కంట్రీ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన స్వార్థం కోసం ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి సిద్ధం కానీ తను మాత్రం ఎన్నడూ ఇబ్బందులకు గురి కాదు.ప్రస్తుతం ఇదే విషయం మరోసారి రుజువైంది. ఇరాన్- అమెరికా యుద్ధం వస్తుందని ముందే ఉహించిన చైనా ఆ దేశంలో భారీగా చమురు నిల్వలు ఉంచుకుందట.. అవీ ఏకంగా IEA అంతర్జాతీయ ఇంధన సంస్థ నిల్వల కంటే కూడా అధికంగా ఉన్నాయని సర్వేలు తెలిపాయి.ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్దంతో ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రధాన అంశం చమురు. ఆయిల్ రవాణాకు ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. అయితే ఈ సంక్షోభాన్ని ముందే ఉహించిన చైనా తమ దేశానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా భారీగా చమురునిల్వలు ఉంచుకుందట.. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాలు ఈ వివరాలే చెబుతున్నాయి.ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం చైనా వద్ద సుమారుగా 1.4 బిలియన్ బారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి.అయితే ఇది అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) లోని 32 సభ్య దేశాల మొత్తం నిల్వలు (1.2 బిలియన్ బారెళ్లు) కంటే అధికమని సర్వేలు చెబుతున్నాయి. అదే అమెరికా వద్ద ప్రస్తుతం 405 మిలియన్ బారెళ్ల నిల్వలు మాత్రమే ఉన్నాయని.. యుద్ధం కారణంగా పెరిగిన ధరలను తగ్గించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే 172 మిలియన్ బారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించారని పేర్కొన్నాయి..అయితే యుద్దం అంచనాని ముందే పసిగట్టిన చైనా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో చైనా తన చమురు దిగుమతులను ఏకంగా 15.8% పెంచుకుందని సర్వే చెబుతుంది. ఈ నేపథ్యంలోనే చైనా ప్రస్తుతం యుద్దం నేపథ్యంలో చమురు సంక్షోభాన్ని పెద్దగా పట్టించుకోనట్లు తెలుస్తోంది. అందుకే ఇది వరకూ ప్రపంచ దేశాలు చమురు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా చైనా మాత్రం ఎటువంటి ఆందోళన చెందలేదు. -
'రణక్షేత్రం' ఇండో పసిఫిక్‌కు మారేనా?
ప్రపంచ దేశాల దృష్టి ఇరాన్ యుద్ధం, హార్మూజ్ జలసంధిపై ఉన్న ప్రస్తుత తరుణంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిశ్శబ్దంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇరుక్కుపోకుండా ఉండాలని యూఎస్ అధ్యక్షుడు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ఇదే అదనుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇండో– పసిఫిక్‌లో పావులు కదుపుతున్నాడు. తైవాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ (కేఎమ్‌టీ) నాయకురాలు చెంగ్–లీ–వున్కు చైనా పర్యటనలో ఘన స్వాగతం లభించింది. ఏప్రిల్ 10న జిన్‌పింగ్ కేఎమ్‌టీ నాయకురాలితో సమావేశమవటం చైనా కొత్త ఎత్తుగడను సూచిస్తున్నది. తైవాన్ విలీనమే చైనా లక్ష్యంతైవాన్ అధికార పార్టీ డీపీపీతో చైనా 2016 నుండి అధికారికంగా తెగదెంపులు చేసుకున్నది. ఆగస్టు 2022లో యూఎస్ఏ పార్ల మెంట్ స్పీకర్ నాన్సీ పొలేసి అధికారికంగా తైవాన్ను పర్యటించటంతో ఇండో–పసిఫిక్‌లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ‘వ్యూహా త్మక సందిగ్ధత’ సిద్ధాంతం నుండి దూరంగా జరిగి ఈ పర్యటన ద్వారా యూఎస్ఏ తైవాన్‌కు బహిరంగంగా మద్దతిచ్చినట్లయింది. వెంటనే చైనా పెద్ద మొత్తంలో సైనిక విన్యాసాల రూపంలో బలప్రద ర్శనకు దిగింది. ఇటీవల కొత్తగా ఎన్నికయిన జపాన్ ప్రధాని సానయి తకాయిచి తైవాన్‌పై చైనా దాడి చేస్తే దానిని జపాన్ అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తామని ప్రకటించటం ద్వారా పసిఫిక్ యుద్ధంలో జపాన్ చూస్తూ ఊరుకోదని బహిరంగంగా హెచ్చరించింది. రానున్న దశాబ్దాలలో ప్రపంచ రాజకీయ చదరంగానికి ఇండో పసిఫిక్నే అడ్డా!రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమితో 1945లో తైవాన్ దీవులను జపాన్ నుండి చైనా హస్తగతం చేసుకున్నది. 1949లో చైనాలో అంతర్యుద్ధం సందర్భంగా చైనాలోని ఒక వర్గం తైవాన్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్ఓసీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చైనా ప్రధాన భూభాగంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ) ప్రభుత్వం ఏర్పడింది. 1950 నుండి 1970 వరకు పీఆర్సీ– ఆర్‌ఓసీల మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి. ఐక్యరాజ్య సమితి 1971లో పీఆర్సీని చైనా ప్రభుత్వంగా గుర్తించింది. 1979లో యూఎస్ఏ కూడా గుర్తించింది. తైవాన్ను ప్రపంచ సమాజం ఒక స్వతంత్ర దేశంగా గుర్తించనప్పటికీ, అది యూఎస్ఏ మద్దతుతో ఒక ప్రబలమైన ఆర్థిక శక్తిగా రూపొంది స్వయంపాలిత దీవిగా ఎదిగింది. ప్రపంచ సెమీ కండక్టర్ పరిశ్రమకు రాజధానిగా రూపుదిద్దుకున్నది. ప్రపంచ సెమీ కండక్టర్ ఉత్పత్తులలో తైవాన్ వాటా 60 శాతం. అధునాతన ఏఐ రంగంలో వాడే అత్యాధునిక చిప్స్ తయారీలో తైవాన్ వాటా 90 శాతానికి పైగా ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థ, ఉదార విధానాలకు ప్రతీకగా ఉన్న తైవాన్ను విలీనం చేసుకోవాలనేదే చైనా విధానం. నేరుగా అమెరికాకు సవాలు!1997లో హాంకాంగ్ దీవి చైనాలో విలీనం అయాక, ఒకే దేశం – రెండు వ్యవస్థలు విధానాన్ని తైవాన్‌కు కూడా వర్తింపజేయాలని చైనా ప్రతిపాదిస్తున్నది. 2014లో హాంకాంగ్‌లో చైనా నియంతృత్వ, ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధంగా గొడుగుల ఉద్యమం (అంబ్రెల్లా మూవ్మెంట్) జరిగింది. అప్పుడు తైవాన్‌లో అధికారంలో ఉన్న కేఎమ్‌టీ పార్టీ, చైనాతో ఉదార వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీనికి వ్యతిరేకంగా పొద్దు తిరుగుడు ఉద్యమం (సన్‌ఫ్లవర్ మూవ్మెంట్) జరిగింది. హాంకాంగ్ విలీనం తర్వాత క్రమంగా అక్కడ పత్రికా స్వేచ్ఛ, పౌర హక్కులను చైనా అణచి వేసింది. ‘నిన్న హాంకాంగ్ – రేపు తైవాన్’ నినాదం కింద తైవాన్‌కూ హాంకాంగ్ గతి పడుతుందని తైవాన్ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఉత్తర పసిఫిక్ మహా సముద్రం చైనా, రష్యాలను – యూఎస్ఏను విభజిస్తుంది. ఈ ప్రధాన శక్తులు భౌగోళికంగా ఉత్తర పసిఫిక్ మహా సముద్రానికి ఇరువైపులా మోహరించి ఉన్నాయి. భారతదేశం వరకు విస్తరించిన ఇండో పసిఫిక్ ప్రాంతంలో యూఎస్ఏ, చైనా, రష్యా, జపాన్, భారత్‌ల మధ్య జియో పొలిటి కల్ యుద్ధం ప్రారంభమయింది. ఈ శతాబ్దంలో ప్రపంచ ఆధిప త్యాన్ని ఇండో పసిఫిక్ శాసిస్తుందని జియో పొలిటికల్ శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. వేగంగా వృద్ధి చెందుతున్న చైనా సాయుధ శక్తి, తిరిగి పుంజుకున్న రష్యా ఆర్థిక వ్యవస్థ, జిన్‌పింగ్ నాయకత్వంలో ప్రపంచాన్ని శాసించాలనే చైనా ఆశలు– వేగంగా బలోపేతమవు తున్న భారత్, యూఎస్ఏకు సవాలు విసురుతున్నాయి.1945 నుండి గత 75 సంవత్సరాలుగా యూఎస్ఏ ప్రపంచాన్ని శాసిస్తూ వస్తున్నది. యూఎస్ఏను నేరుగా ఎదుర్కొనే శక్తి చైనా– రష్యాలకు మాత్రమే ఉన్నది. ఈ ఘర్షణ తైవాన్‌తో ప్రారంభమ వటానికి అవకాశాలు హెచ్చు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ‘ఈ తరంలోనే తైవాన్ విలీనం’ అని ప్రకటించటం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది. జిన్‌పింగ్ మూడవ పదవీ కాలం 2028లో ముగియ నున్నది. బహుశా 2027 లోపు తైవాన్ను చైనా ఆక్రమించవచ్చని వ్యూహకర్తలు అనుమానిస్తున్నారు. తైవాన్‌పై చైనా దాడి చేస్తే, దాన్ని నేరుగా యూఎస్ఏకు సవాలుగా పరిగణించాల్సి ఉంటుంది. భారత నౌకాశక్తి కీలకంసైనిక వ్యూహ పరిభాషలో ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ద్వీప సమూహాలను యూఎస్ఏ తన ‘రక్షణ శ్రేణులు’గా పరిగణిస్తుంది. మొదటి రక్షణ శ్రేణి – కుర్లీ దీవులు, ర్యుకూ దీవులు, తైవాన్ దీవులు. జపాన్ దీవులు, బానిన్స్, గువామ్, పలావు దీవులు– రెండవ రక్షణ శ్రేణి. అల్యూషియన్ దీవులు, హవాయి దీవులు, సమోవా దీవులను మూడవ రక్షణ గోడగా పరిగణిస్తారు. ఈ మూడు శ్రేణులు దాటితే అమెరికా ప్రధాన భూభాగాన్ని చైనా చేరుకోవచ్చు. అందుకే ఈ దీవు లపై చైనా పెత్తనాన్ని అమెరికా సహించదు. దానివల్ల జలసంధులు, జలరవాణా మార్గాల రక్షణ కీలకం కాబోతున్నది.మొదటి రక్షణ శ్రేణిలోని మియాకో, తైవాన్, లూజాన్, సుండా జలసంధులను రక్షించటానికి ఒకినావో (జపాన్), ఫిలిప్ఫైన్స్లలో యూఎస్ఏ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. గువామ్‌లోని అమెరికా సైనిక స్థావరం రెండవ వలయానికి రక్షణ కల్పిస్తున్నది. హవాయిలో సైనిక స్థావరం మూడో వలయానికి కేంద్రకం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా–రష్యాలను నియంత్రించడానికి అమెరికా ఇతర సైనిక శక్తులతో చేతులు కలిపింది. ఆస్ట్రేలియా, భారత్, యూఎస్ఏ, జపాన్ సభ్యులుగా 2004లో క్వాడ్ ఏర్పడింది. క్వాడ్‌ను ఆసియా నాటోగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియా, యూఎస్ఏ, యూకే సభ్యులుగా ఆకస్ కూటమి పనిచేస్తున్నది.ఉత్తర పసిఫిక్ ప్రాంతాన్ని ఆసియా–ఐరోపాలతో అనుసంధానం చేసే కీలక ప్రాంతంలో భారతదేశం ఉన్నది. ఈ ప్రాంతంలోని అండమాన్ నికోబార్ దీవులు, మలేషియా, సింగపూర్లను నాలుగవ రక్షణ శ్రేణిగా యూఎస్ఏ పరిగణిస్తుంది. ఇండో పసిఫిక్‌కు ముఖద్వారంలో భారతదేశం కొలువై ఉన్నది. చైనా ప్రపంచాన్ని భయపెట్టాలన్నా, ప్రపంచం చైనాను అదుపు చేయాలన్నా మలక్కా, తైవాన్ జలసంధులు కీలకం. మలక్కా, తైవాన్ జలసంధుల వద్ద సమీప భవిష్యత్తులో హార్మూజ్ ముఖచిత్రం ఆవిష్కృతం కావొచ్చు. తైవాన్ జలసంధిని చైనా అదుపులోకి తీసుకొంటే, ప్రతిగా మలక్కా జలసంధిని మూసివేయటానికి యూఎస్ఏ–జపాన్ ప్రయత్ని స్తాయి. ఇక్కడ భారత్ పాత్ర కీలకమవుతుంది. భారత్ తోడ్పాటు లేకుండా ఏ నౌకాశక్తి మలక్కాపై పెత్తనం చలాయించలేదు.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
భారత్‌పై మరోసారి విషం కక్కిన ట్రంప్
వాషింగ్టన్: వలసల విషయంలో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్‌ను నరకంతో పోల్చిన ఓ లెటర్‌ను ట్రంప్ షేర్చేశారు. ఇండియా, చైనా దేశాలను అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్.. నరకకూపాలతో పోల్చగా.. ఆయన రాసిన ఓ లేఖను ట్రంప్ తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు. జన్మహక్కు పౌరసత్వం గురించి మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థిస్తూ ఆ పోస్టు షేర్ చేశారు.ఇండియా, చైనా దేశాలను నరకకూపాలు అభివర్ణిస్తూ.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రజలు.. అమెరికాలో 9 నెలల్లో ఓ బిడ్డను కనేస్తారు. ఇక చట్టం ప్రకారం వాళ్లు తక్షణమే అమెరికా పౌరులు అవుతారంటూ సావేజ్ తన లేఖలో విమర్శలు గుప్పించారు. ఆ జాత్యహంకార లేఖను ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై చేస్తున్న వాదనలను విమర్శిస్తూ సావేజ్ రాసిన లేఖతో పాటు వీడియోను కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పంచుకున్నారు.ఇక్కడ జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం ఇచ్చే విధానంపై సావేజ్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో కోర్టులకు వదిలేయకుండా జాతీయ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆయన కోరారు. అంతేకాకుండా భారత్, చైనా వలసదారులు ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు.. వీళ్లు మనల్ని దోచుకున్నారు. ఈ గ్యాంగ్స్టర్లు అమెరికాలో పుట్టిన తమ బిడ్డల ద్వారా పౌరసత్వం పొంది.. మొత్తం కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. మనల్ని రెండో తరగతి పౌరులుగా చూశారు’’ అంటూ సావేజ్ రాసుకొచ్చారు. అమెరికా జెండాను భారతీయులు తొక్కేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
చైనా మాస్టర్ ప్లాన్, ఇండియాలో ఎండలు పెరగడానికి చైనానే కారణమా?
-
హర్ముజ్ తొలిసారిగా జిన్‌పింగ్ స్పందన
ప్రస్తుతం హర్ముజ్ విషయంలో తీవ్ర ప్రతిష్టంభన నడుస్తోంది. అమెరికా, ఇరాన్ రెండు దేశాలు పట్టు వదలకుండా భీష్మించుకొని కూర్చువడంతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. హర్ముజ్ జలసంధిలో రవాణాను పునరుద్ధరించాలని ఇరు దేశాలు యుద్ధాన్ని వీడి శాంతి బాట పట్టాలని హితవు పలికారు.ప్రస్తుతం యుద్ధం విషయంలో చైనాపై అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. యూఎస్ఏ నిఘా ఏజెన్సీలు ఇరాన్‌కు చైనా ఆయుధాల తరలింపు చేస్తోందని సమాచారం అందించాయి. వాటిలోనూ మ్యాన్‌పాడ్ (భుజంపై మోసుకెళ్లగలిగే ఆయుధాలు) తరలింపు చేపడుతుందని వీటితోనే అమెరికా క్షిపణులపై ఇరాన్ దాడి చేయగలిగిందని పేర్కొన్నాయి. అయితే దీనిని చైనా ఖండించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారిగా హర్ముజ్ విషయంలో స్పందించారు.ఈ మేరకు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఫోన్లో సంభాషించారు. ఇరు దేశాలు శాంతి కోసం వివాదాలను, రాజకీయ మరియు దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని, తక్షణమే సమగ్ర కాల్పుల విరమణ జరగాలని జిన్‌పింగ్ కోరినట్లు బీజింగ్ కథనాలు వెల్లడించాయి. హర్ముజ్ జలసంధి తెరిచి ఉండటం అంతర్జాతీయ సమాజంతో పాటు ఎంతో ప్రయోజనకరమని కోరినట్లు తెలుస్తోంది.ఈనేపథ్యంలో జిన్‌పింగ్ మధ్యప్రాచ్య కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్య దేశాలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని జిన్‌పింగ్ అన్నట్లు తెలుస్తోంది. దీంతో పరోక్షంగా భద్రత కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే సూచించినట్లుగా సమాచారం. అయితే యుద్ధం ప్రారంభమై దాదాపు 50 రోజులు గడుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు స్పందించడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అత్యధికంగా సహజ వాయువును (LNG) దిగుమతి చేసుకునే చైనాకు ఈ జలసంధి అత్యంత కీలకం.హర్ముజ్ చైనాకు కీలకంఅయితే ప్రపంచంలోనే చైనా అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. తన చమురుఅవసరాల్లో దాదాపు 70 శాతం దిగుమతులు ద్వారానే సమకూర్చుకుంటుంది. దిగుమతుల్లో రష్యా తొలిస్థానంలో ఉండగా తదుపరి సౌదీ అరేబియా ఉంది. అయితే యుద్ధం కారణంగా మార్చి నెలలో ఆ ప్రాంతానికి చైనా ఎగుమతులు 43 శాతం పడిపోయాయని కథనాలు పేర్కొన్నాయి. -
ఇరాన్‌కు సీక్రెట్ సాయం.. చైనా దొరికిపోయిందా?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రికత్తల వేళ పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యుద్ధంలో ఇరాన్‌కు చైనా సాయం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. ఇలాంటి తరుణంలో అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన భారతీయ మూలాల నాయకురాలు నిక్కీ హేలీ దీనికి సంబంధించిన విషయాన్ని బహిర్గతం చేశారు. దీంతో, చైనా అడ్డంగా బుక్కైనట్టు నీక్కి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చైనాను అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే చాన్స్ ఉంది. పశ్చిమాసియా ఘర్షణల్లో చైనా ఇరాన్‌కు రహస్యంగా సాయం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చైనా టెహ్రాన్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మనిషి భుజం మీద పెట్టుకొని క్షిపణులను ప్రయోగించే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్లను, ఇతర క్షిపణి వ్యవస్థలను టెహ్రాన్‌కు సరఫరా చేయడానికి బీజింగ్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపాయి. తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు చైనా ఈ ఆయుధాలను ఇతర దేశాల మీదుగా పంపుతున్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు పట్టుబడిన ఇరాన్ నౌక టౌస్కా అనే కంటైనర్ చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణకు ఆజ్యం పోసింది.దొరికిపోయినట్టేనా? కాగా, ఇటీవలే అమెరికా నౌకాదళం హార్మూజ్ సముద్ర మార్గంలో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న Touska అనే కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకుంది. ఈ నౌక ఇరాన్ షిప్పింగ్ లైన్స్ (IRISL)కు చెందినది. IRISLపై అమెరికా 2019లోనే ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఇది ఇరాన్ క్షిపణి కార్యక్రమానికి అవసరమైన వస్తువులను తరలిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నిక్కీ హేలీ.. ఈ నౌక చైనా నుండి ఇరాన్‌కు వస్తూ, క్షిపణుల తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలను తీసుకెళ్తోందని ఆరోపించారు. నౌకలను ఆపాలని అమెరికా పదేపదే ఆదేశాలు ఇచ్చినా ఇరాన్ మాత్రం దీన్ని ఆపలేదు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో, యుద్ధంలో ఇరాన్‌కు చైనా సహాయం చేస్తోంది అనే వెల్లడి అయ్యింది. ఇది విస్మరించలేని వాస్తవం’ అని ఆమె పేర్కొన్నారు.The ship the U.S. seized in the Strait of Hormuz this weekend was headed from China to Iran and is linked to chemical shipments for missiles. It refused repeated orders to stop. Another reminder that China is helping prop up Iran’s regime—a reality that can’t be ignored.— Nikki Haley (@NikkiHaley) April 20, 2026మరోవైపు.. నిక్కీ హేలీ ఆరోపణలపై ఇరాన్ గట్టిగానే సమాధానం ఇచ్చింది. నౌక విషయంలో అమెరికా చర్యను సాయుధ దోపిడీగా అభివర్ణించింది. ఆ నౌక చైనా నుంచి ప్రయాణిస్తోందని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఈ సమయంలో అమెరికా బలగాలను తాము ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నప్పటికీ నౌకలో సిబ్బంది కుటుంబ సభ్యులు ఉన్నందున తక్షణ ప్రతిస్పందన ఇవ్వలేకపోయామని తెలిపింది.ఇదిలా ఉండగా, ఆసియా నుంచి ప్రయాణం తర్వాత ఆ నౌక ద్వంద్వ ప్రయోజన వస్తువులను తీసుకువచ్చే అవకాశం ఉందని తమ ప్రాథమిక అంచనాలని అమెరికా భద్రతా వర్గాలు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపాయి. ఆ నౌక గతంలో కూడా ద్వంద్వ ప్రయోజన వస్తువులుగా భావించే వాటిని రవాణా చేసిందని ఆ వర్గాల్లో ఒకరు తెలిపారు. అయితే, ఆ వస్తువుల వివరాలను మాత్రం ఆయా వర్గాలు వెల్లడించలేదు. అయితే, సైనిక, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే అవకాశం ఉన్న లోహాలు, పైపులు, ఎలక్ట్రానిక్ విడిభాగాలతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) పేర్కొంది. 🚨 HOLY CRAP! The Iranian-flagged ship Touska, which the US military seized yesterday, was in-bound from China “loaded with dual-use chemicals used to manufacture ballistic missiles,” per WPUS Marines are now searching 5,000 containers on board.No wonder they tried to run the… pic.twitter.com/Vjl5Z1ynLR— Nick Sortor (@nicksortor) April 21, 2026 చైనాకు కష్టమే.. మొత్తంగా Touska నౌక స్వాధీనం అమెరికా–ఇరాన్–చైనా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇది హార్మూజ్ సముద్ర మార్గం ఎంత సున్నితమైన జియోపాలిటికల్ ప్రాంతమో మరోసారి చూపించింది. దీంతో, చైనా–అమెరికా సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షలు కఠినతరం కావడం, చైనా–ఇరాన్ వాణిజ్యం అంతర్జాతీయ పరిశీలనకు గురవడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా చైనాపై మరిన్ని ఆంక్షలు లేదా వాణిజ్య పరిమితులు విధించే అవకాశం ఉంది. ఇది చైనా–అమెరికా మధ్య ఉన్న ట్రేడ్ వార్‌ను మరింత కఠినతరం చేస్తుంది. -
ఇరాన్‌కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
ఇరాన్, అమెరికా యుద్ధంలో నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాల దృష్టి హార్మూజ్ జలసంధిపైనే ఉంది. జలసంధిని తెరిచి నౌకల రాకపోకలు జరగాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. కానీ, ఇరాన్ మాత్రం.. హార్మూజ్ అంతర్జాతీయ జలమార్గం కాదని.. అది తమ భూభాగానికి చెందిన సముద్ర ప్రాంతమంటూ కొత్త పలుకు ఎత్తుకుంది. అందువల్ల నౌకలు వెళ్లడానికి ఇరాన్ అనుమతి అవసరమని, అలాగే టోల్ వసూలు చేసే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. ఇలాంటి తరుణంలో మొట్టమొదటి సారిగా హార్మూజ్ అంశంపై ఇరాన్ మిత్ర దేశం చైనా స్పందించింది. ఇరాన్‌కు షాక్ ఇచ్చే విధంగా జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.హార్మూజ్‌పై ఇరాన్ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్.. హర్మూజ్‌ను అంతర్జాతీయ జలమార్గంగా అభివర్ణించారు. హార్మూజ్ జలసంధిని సాధారణ రాకపోకలకు తెరిచి ఉంచాలి. వెంటనే జలసంధిని తెరవాలని ఇరాన్‌కు సూచించారు. ఇది ప్రాంతీయ దేశాలు, అంతర్జాతీయ సమాజ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. తక్షణ, సమగ్ర కాల్పుల విరమణను చైనా సమర్థిస్తుందన్నారు. శాంతిని పునరుద్ధరించడానికి దోహదపడే అన్ని ప్రయత్నాలకు చైనా మద్దతు ఇస్తుంది. రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచిస్తోందని పేర్కొన్నారు. కాగా, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం, ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన తర్వాత చైనా అధ్యక్షుడు తొలిసారిగా ప్రకటన చేయడం విశేషం.అయితే, హార్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియాలో తీవ్రమైన ఇంధన కొరతకు దారితీసింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇరాన్ చమురును ప్రధానంగా దిగుమతి చేసుకునే చైనా, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది.నౌకపై దాడులు.. చైనా ఆందోళనమరోవైపు అమెరికా నావికా దిగ్బంధాన్ని ధిక్కరిస్తూ, చైనా నుంచి ఇరాన్ ఓడరేవుకు వెళ్తున్న ఒక సరకు రవాణా నౌకపై అమెరికా నేవీ కాల్పులు జరపడంపైనా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటాయని, ఘర్షణలను రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలను పెంచడం వంటివి మానుకుంటాయని భావిస్తున్నాం. అలాగే హార్మూజ్ జలసంధిలో సాధారణ నౌకాయానాన్ని పునఃప్రారంభించడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాయని మేము ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.హార్మూజ్ మూసివేతతో చైనాకు నష్టాలు👉ఎనర్జీ సరఫరా అంతరాయం: చైనా క్రూడ్ ఆయిల్లో సుమారు 50% గల్ఫ్ దేశాల నుండి వస్తుంది. హార్మూజ్ మూసివేయడం లేదా దాడులు పెరిగితే, చైనాకు రోజుకు లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా ఆగిపోతుంది.👉ఆర్థిక ప్రభావం: ఇంధన ధరలు పెరగడం వల్ల చైనా పరిశ్రమలు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. ఇది GDP వృద్ధిని మందగింపజేస్తుంది. చైనా ఆర్థిక వృద్ధి 0.5–1% వరకు తగ్గే అవకాశం ఉంది.👉వాణిజ్య నష్టం: ఇరాన్, గల్ఫ్ దేశాలతో చైనా వాణిజ్యం 40–50% వరకు తగ్గింది. ఇది చైనా ఎగుమతులు, దిగుమతులపై నేరుగా ప్రభావం చూపుతోంది. వాణిజ్యం తగ్గడం వల్ల చైనాకు బిలియన్ల డాలర్ల నష్టం జరుగుతుంది.👉జియోపాలిటికల్ ఒత్తిడి: అమెరికా-ఇరాన్ ఘర్షణల కారణంగా హార్మూజ్ అస్థిరత పెరిగింది. చైనా తన నౌకలు, వాణిజ్య మార్గాలను రక్షించుకోవడానికి అదనపు ఖర్చు పెట్టాలి.చైనా ప్రధాన ప్రత్యామ్నాయ మార్గాలు..1. పైప్లైన్లురష్యా–చైనా పైప్లైన్లు: సైబీరియా నుండి చైనాకు నేరుగా ఆయిల్, గ్యాస్ సరఫరా.మధ్య ఆసియా పైప్లైన్లు: కజకిస్తాన్, టుర్క్‌మెనిస్తాన్ నుండి గ్యాస్ సరఫరా. ఇవి హార్మూజ్ మీద ఆధారాన్ని తగ్గిస్తాయి.2. ఆర్కిటిక్ సముద్ర మార్గంరష్యా "నార్తర్న్ సీ రూట్" ద్వారా చైనాకు ఆయిల్, LNG సరఫరా పెరుగుతోంది. ఈ మార్గం హార్మూజ్, మలక్కా వంటి "చోక్పాయింట్"లను తప్పించగలదు.3. స్ట్రాటజిక్ రిజర్వులుచైనా వద్ద 90 రోజులకు సరిపడే ఆయిల్ రిజర్వులు ఉన్నాయి. హార్మూజ్ మూసివేత వంటి తక్షణ షాక్‌లను ఎదుర్కోవడానికి వీటిని ఉపయోగిస్తోంది.4. ఎనర్జీ డైవర్సిఫికేషన్పునరుత్పాదక శక్తి (సోలార్, విండ్)లో భారీ పెట్టుబడులు.సూపర్‌గ్రిడ్ ప్రాజెక్ట్: దేశీయ విద్యుత్ ఉత్పత్తి పెంచి, ఆయిల్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటోంది. -
చైనాలో రివర్స్ మైగ్రేషన్..
దశాబ్దాలుగా చైనా ఆర్థిక శక్తిగా ఎదగడంలో కీలకంగా నిలిచిన వలస కార్మిక వ్యవస్థ ఇప్పుడు అనూహ్య మలుపు తిరుగుతోంది. నగరాల్లోని ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగాల్లో పనిచేస్తూ దేశ వృద్ధిని పరుగులు పెట్టించిన కోట్లాది మంది కార్మికులు ఇప్పుడు తిరుగుముఖం పడుతున్నారు. ఇది కేవలం ఒక సామాజిక మార్పు మాత్రమే కాదు, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో వస్తున్న భారీ నిర్మాణాత్మక సంక్షోభానికి సంకేతమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎందుకు ఈ తిరుగు ప్రయాణం?చైనాలో సుమారు 300 మిలియన్ల (30 కోట్లు) వలస కార్మికులు ఉన్నారు. గతంలో గ్రామాల నుంచి నగరాలకు వెళ్లడం, ఎక్కువ సంపాదించి ఇంటికి డబ్బు పంపడం ఒక నిరంతర ప్రక్రియగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమూనా బీటలు వారుతోంది. దీనికి ప్రధాన కారణాలు..చైనా జీడీపీలో దాదాపు 25-30% వాటా కలిగిన స్థిరాస్తి రంగం కుప్పకూలడం నిర్మాణ కార్మికుల ఉపాధిని దెబ్బతీసింది. పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోవడంతో వేలాది మందికి పనుల్లేకుండా పోయాయి.అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం, అమెరికా వంటి దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతల వల్ల చైనా ఫ్యాక్టరీలలో నియామకాలు భారీగా తగ్గాయి.నగరాల్లో జీవన వ్యయం పెరగడం, దానికి తగ్గట్టుగా వేతనాలు పెరగకపోవడంతో వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.నైపుణ్యం లేని వారికి ముప్పుచైనా ఇప్పుడు తన ఆర్థిక వ్యవస్థలో సాంకేతికతను అమలు చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, హై-టెక్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. ‘పాత పద్ధతుల్లో పనిచేసే కార్మికులకు కొత్త టెక్నాలజీ రంగంలో అవకాశాలు దొరకడం లేదు. ముఖ్యంగా వృద్ధ కార్మికులు ఈ మార్పునకు తట్టుకోలేక తిరిగి వ్యవసాయం వైపు లేదా అసంఘటిత రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు’ అని నిపుణులు చెబుతున్నారు.సవాళ్లు.. ఆందోళనచైనా ప్రభుత్వం గతంలో రవాణా రాయితీలు, నగరాల్లో నివాస అనుమతులు సడలించడం వంటి చర్యలు చేపట్టింది. కానీ, సమస్య ఇప్పుడు రవాణా కాదు, ఉద్యోగాల కల్పన. పరిశ్రమల్లో నిత్యం మార్పులొస్తున్నాయి. కానీ శ్రామిక శక్తి పాత నైపుణ్యాలతోనే ఉంది. ఈ స్కిల్ గ్యాప్ (నైపుణ్యాల అంతరం)ను పూరించడం ఇప్పుడు పెను సవాలుగా మారింది. ఒకవేళ ఈ మిలియన్ల కొద్దీ ప్రజలకు సరైన ఉపాధి లభించకపోతే అది కేవలం ఆర్థిక మందగమనానికే కాదు, రాజకీయ అస్థిరతకు కూడా దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా! -
రాడార్లకు చిక్కకుండా ఇరాన్‌కు చైనా విమానాలు..?
ఇటీవల అమెరికా సీక్రెట్ ఏజెన్సీలు చైనాపై సంచలన ఆరోపణలు చేశాయి. ఇరాన్‌కు యుద్ధంలో చైనా సహకరిస్తోందని ఆ దేశానికి పరోక్షంగా ఆయుధాలు అందజేస్తుందన్నాయి. అయితే ఈ ఆరోపణల్ని చైనా ఖండించింది. తాజాగా మధ్యప్రాచ్యంలో నాలుగు చైనా కార్గో విమానాలు రాడార్లకు చిక్కకుండా అదృశ్యమయ్యాయని నివేదికలు తెలిపాయి. ఈ ఆరోపణలు ఇప్పుడు ఆందోళనకరంగా మారాయి. కొద్దిరోజుల క్రితం అమెరికా నిఘా వర్గాలు ఇరాన్‌కు చైనా భారీగా మ్యాన్‌పాడ్ ఆయుధాలను తరలిస్తోందని ఆరోపించాయి. మ్యాన్‌పాడ్ అంటే భుజంపై ఎక్కడికైనా మోసుకెళ్లగల ఆయుధాలు. వీటిసాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను సులభంగా కూల్చివేయవచ్చు. ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఇవి ఎంతో కీలకంగా పనిచేశాయి. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని నివేదికలు అమెరికా సీక్రెట్ ఏజెన్సీల సర్వేలకు మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.చైనా కార్గో విమానాలుకొన్నిరోజుల క్రితం.. కేవలం 48 గంటల వ్యవధిలో నాలుగు చైనా కార్గో విమానాలు తమ ట్రాన్స్పాండర్లను ఆపివేసి చైనా భూభాగంలో దిగాయని పలు నివేదికలు కథనాలు ప్రచురించాయి. ట్రాన్స్‌పాండర్ అనేది సాధారణంగా విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది. ఎంత వేగంతో వెళుతుంది అనే వివరాలని ప్రసారం చేసే ఒక పరికరం. దీనిని ఉద్దేశపూర్వకంగా ఆపివేయడాన్ని డార్క్ ఫ్లైట్ అంటారు. సాధారణంగా వెళ్లే గమ్యం వెల్లడించకుండా ఉండడానికి సైనిక కార్యకలాపాలు, రహస్య లావాదేవీల సమయంలో ఇటువంటి పద్దతులను ఉపయోగిస్తారు.ఆయుధాల తరలింపు?అయితే కొన్ని సామాజిక మాధ్యమాల కథనాల ప్రకారం.. ఆ విమానాలు ఇరాన్‌కు ఆయుధాలు తరలించడానికి ఉద్దేశించినవని అందులో మందుగుండు సామాగ్రితో పాటు ఇతర ఆయుధాలు తరలిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను చైనా ఖండించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే చైనా, అమెరికా ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తమ దేశం బాధ్యతాయుతమైన దేశమని యుద్ధాన్ని ప్రోత్సహించే ఏ పనులు తాము చేయమని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ నివేదికలు రావడం ఆందోళన కలిగించే అంశం.అయితే ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరో దఫా చర్చలకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా ఈ రకమైన నివేదికలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. -
మొగుడుపై అలిగి, రూ. కోటిన్నర నోట్లను బాల్కనీలోంచి విసిరేసింది!
చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రాంతం, శాంతౌ (Shantou) నగరంలో జరిగిన ఈ విస్తుపోయే సంఘటన ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఒక చిన్న గొడవ రోడ్డు మీద ఉన్న సామాన్యులకు కాసుల వర్షం కురిపించి నంత పని చేసింది. అతి పెద్ద విలాసవంతమైన భవనం ఫ్లాట్‌నుంచి ఉన్నట్టుండి నోట్ల వర్షం కురిసింది. శాంతౌలోని లాంగ్‌హు జిల్లాలో ఉన్న 'స్టార్ లేక్ సిటీ' అనే నివాస సముదాయంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఎక్కడిదీ నగదు? వీటిని ఎవరు విసిరేశారు? హై రేంజ్ భవనం బాల్కనీ నుంచి అనూహ్యంగా రూ. 1.5 కోట్లను విసిరి పారేసిందో మహిళ. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవే దీనికి కారణమని సమాచారం. అంతే ఆ కోపంతో ఆమె ఇంట్లోని డబ్బును బయటకు విసిరేసింది. సుమారు 1.5 కోట్ల రూపాయల విలువైన (సుమారు 162,000డాలర్లు) హాంకాంగ్ డాలర్ నోట్లను కిందకు విసిరేసింది.గాల్లోంచి నోట్లు ఎగిరి పడటంతో ఒక్కసారి జనం పోగయ్యారు. ఆ నగదును దక్కించుకునేందుకు ఎగబడటంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నగదును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రాపర్టీ మేనేజ్మెంట్ కార్యాలయం ఆ నోట్లు అసలైనవేనని ధృవీకరించింది. డబ్బు తీసుకున్న వారు తిరిగి ఇచ్చేయాలని కోరింది. కొందరు నివాసితులు ఇప్పటికే ఆ నగదును తిరిగి అప్పగించారు.ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిThis Chinese woman is going viral after she threw over $162,000 out onto the streets from her balcony after an argument with her husband. 🙆♂️ pic.twitter.com/rWiLFu9Rrj— Erimus (@HeDontMakeNoise) April 15, 2026నెటిజన్ల స్పందన ఈవీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు "మనం కష్టపడి సంపాదించిన డబ్బును పన్నుల నుండి కాపాడు కోవడానికి పోరాడుతుంటే, ఈమె ఇలా గాలిలో కలిపేస్తోంది"అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నా మనేది చూసుకోవడం అవసరం. ఇదే అతిపెద్ద ఆర్థిక సలహా" అంటూ మరొకరు చురకలు వేశారు. "గాలిలో ఆనందాన్ని (డబ్బు) విసరడం గురించి ఊహించలేక పోతున్నాను" అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: మీటింగ్‌లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు -
అందుకు చైనా అంగీకరించింది.. ట్రంప్ ఆసక్తికర పోస్ట్
హర్మూజ్ జలసంధి దిగ్బంధనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్‌ను శాశ్వతంగా తెరిచి ఉంచుతాం.. దీంతో చైనాతో పాటు ప్రపంచమంతా లాభపడుతుంది. మా నిర్ణయం పట్ల చైనా సంతోషంగా ఉంది. ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వబోమని చైనా చెప్పింది.’’ అంటూ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఈ కీలకమైన జలసంధి ఇకపై ఎన్నడూ మూతపడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అయితే, తాము ఇరాన్‌కు ఎలాంటి సైనిక సహకారం అందించడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గత కొన్ని రోజులుగా పదేపదే ఖండిస్తోన్న సంగతి తెలిసిందే. చైనా చాలా కాలంగా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌కు మద్దతు ఇస్తోందని.. క్షిపణుల తయారీలో ఉపయోగపడే ద్వంద్వ-వినియోగ పారిశ్రామిక భాగాలను సరఫరా చేయడం ద్వారా ఇరాన్‌ను ప్రోత్సహిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా దౌత్యపరమైన జోక్యాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రతిపాదన చేసింది.మరోవైపు, రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని.. త్వరలోనే ముగుస్తుందని నేను భావిస్తున్నాన్నారు. అయితే, ఇరాన్‌తో సంఘర్షణలో అమెరికా పని ఇంకా ముగియలేదు...కానీ, యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. నేను వెళ్లిపోతే ఇరాన్ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు సమయం పడుతుంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే వారిని సర్ అని పిలవాల్సి వచ్చేంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. -
అమెరికా చమురు దిగ్బంధంపై చైనా వార్నింగ్
-
అదే జరిగితే.. భారత్‌కు ఫ్లస్, చైనాకు చుక్కలే!
పశ్చిమాసియా యుద్ధంలో హర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. జలసంధిని పూర్తిగా తమ కంట్రోల్లో ఉండాలని.. టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. అయితే హర్ముజ్‌లో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని అమెరికా సహా పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో హర్ముజ్‌ను ఇరాన్ మూసివేయగా.. దిగ్బంధనంతో వచ్చిపోయే నౌకలకు చుక్కలు చూపిస్తోంది అమెరికా. ఇదిలా ఉండగానే.. మరో జలసంధిపై డొనాల్డ్ ట్రంప్ కన్నేసినట్లు చర్చ మొదలైంది.దక్షిణాసియా వర్తకానికి కీలకమైన మలక్కా జలసంధిపై అమెరికా దృష్టిసారించినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల ఇండోనేషియాతో అగ్రరాజ్యం చేసుకున్న రక్షణ ఒప్పందం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభించనుంది. దీని ద్వారా మలకా జలసంధిపై కూడా అమెరికా పర్యవేక్షణ, ఆపరేషనల్ సామర్థ్యం పెరగనుంది..మలక్కా జలసంధి (Strait of Malacca) అనేది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, వ్యూహాత్మకంగా కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటి. హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతూ.. ఇండోనేషియా సుమత్రా దీవి పశ్చిమ భాగం, మలేషియా ద్వీపకల్పం తూర్పు భాగం మధ్య సుమారు 930 కిలోమీటర్లు పొడవున విస్తరించి ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఇది ఆసియా–పసిఫిక్ వాణిజ్యానికి ప్రధాన ద్వారం.చైనాకు..మలక్కా జలసంధి ప్రపంచ వాణిజ్యంలో కీలక మార్గం. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 25 నుంచి 40 శాతం దాకా సరుకు రవాణా ఈ మార్గం ద్వారా జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ నుంచి తూర్పు ఆసియా దేశాలకు వెళ్లే చమురు, గ్యాస్‌లో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా చేరుతుంది. చమురు, గ్యాస్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, పరిశ్రమ ఉత్పత్తులు, తయారీ సరుకులు ఈ మార్గం ద్వారా తరలించబడతాయి. ముఖ్యంగా చైనా వంటి తూర్పు ఆసియా దేశాలు ఈ మార్గంపై అధికంగా ఆధారపడుతున్నాయి.మలక్కా డైలమాచైనా తన చమురు, గ్యాస్, ముడి పదార్థాల దిగుమతులలో ఎక్కువ భాగాన్ని మలక్కా జలసంధి ద్వారా పొందుతుంది. ఈ మార్గం ఆగిపోతే లేదంటే అడ్డంకులు ఎదురైతే చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. చైనా తన ఇంధన అవసరాల కోసం మలక్కా జలసంధిపై అధికంగా ఆధారపడటం.. తద్వారా ఏర్పడిన బలహీనత వల్ల మలక్కా డైలమా అనే పేరు ముద్రపడింది. 2003లో అప్పటి చైనా అధ్యక్షుడు హు జింటావో నోటి నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది.చైనాకు చుక్కలేఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురు సరఫరాలో సుమారు 80 శాతం మలకా జలసంధి ద్వారా చైనాకు చేరుతుంది. కాబట్టి ఈ జల సంధిపై అమెరికా తన ఆధిపత్యం పెంచుకుంటే మాత్రం చైనాకు చుక్కలు గ్యారెంటీ. అలాగే.. మలక్కా జలసంధి కొన్ని ప్రాంతాల్లో వెడల్పు కేవలం 3 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఈ చోక్ పాయింట్లను గనుక ఏదైనా దేశం నియంత్రించినా.. చైనాకు కష్టమే. ఈ మార్గం ఆగిపోతే చైనాకు ఇంధన సంక్షోభం తలెత్తుతుంది.భారత్‌కు ఫ్లస్భారతదేశ వాణిజ్యంలో మలక్కా జల సంధి కీలక పాత్రే పోషిస్తోంది. మలక్కా జలసంధి పశ్చిమ ప్రవేశద్వారం దగ్గరే భారత అండమాన్–నికోబార్ దీవులు ఉన్నాయి. క్యాంప్‌బెల్ బేలోని భారత వాయుసేన స్థావరం, నౌకాదళ గస్తీ సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేస్తోంది. కాబట్టి ఈ జల సంధిలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్ సహకారం అవసరం. ఇది ఇండో–పసిఫిక్ రీజియన్‌లో భారత్ ప్రాధాన్యాన్ని పెంచడంతో పాటు చైనా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు భారత్‌కు ఓ మంచి అవకాశం కల్పిస్తుంది. అంత వీజీ కాదుమలక్కా జలసంధిపై అమెరికా ఆధిపత్యం ప్రదర్శించడం అంత సలువేం కాదు. నిజానికి ఈ ప్రయత్నం కొత్త కూడా కాదు. గతంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అమెరికా చాలా ప్రయత్నాలే చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం.. ఇరాన్‌కు చైనా మద్దతు.. ఇరాన్‌కు చైనా ఆయుధాల సరఫరా.. ఇవన్నీ ట్రంప్‌కు కోపం తెప్పించాయి. అయితే.. మలక్కాపై ఆధిపత్యానికి అమెరికాకు ప్రాంతీయ సవాళ్లు ఎదురు కావొచ్చు. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ కలిసి మలక్కా జలసంధిని నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సింగపూర్ పోర్టు మౌలిక సదుపాయాలు, గ్లోబల్ షిప్పింగ్ సేవలలో ఆధిపత్యం కారణంగా ఈ మార్గం స్థిరత్వం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం. పలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్నందున అమెరికా విస్తృత పాత్రకు ఆటంకాలు ఏర్పడొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా చైనాను భవిష్యత్తులోనైనా ఇరకాటంలో పడేసే అంశమే. -
అమెరికాకు చైనా వార్నింగ్ : నాలుగు కీలక ప్రతిపాదనలు
పశ్చిమ ఆసియా (Middle East) సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా దౌత్యపరమైన జోక్యాలను ముమ్మరం చేసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను (Four-point framework) ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో,ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రతిపాదన చేసింది. చైనా నాలుగు సూత్రాల ప్రణాళిక,కీలక అంశాలుజిన్హువా వార్త నివేదిక ప్రకారం అమెరికా నేతృత్వంలోని జోక్యాలకు భిన్నంగా, పశ్చిమ ఆసియాలో తన దౌత్యపరమైన ఉనికిని విస్తరించుకోవడానికి చైనా చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు ఈ ప్రతిపాదనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. యుఏఈ నాయకుడు ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో జరిగిన సమావేశంలో జిన్‌పింగ్ ఈ ప్రణాళికను సమర్పించారు.శాంతియుత సహజీవనం , సంయమనంసార్వభౌమాధికారానికి గౌరవం ఇవ్వడం మరో కీలకమైన స్తంభమని పేర్కొంది. దేశాలు ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని ఈ ప్రతిపాదన నొక్కి చెబుతోంది. ప్రాంతీయ శక్తులన్నీ శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని చైనా కోరుతోంది. గొడవలను పక్కన పెట్టి దేశాల మధ్య పరస్పర అవగాహన పెరగాలని సూచించింది.సార్వభౌమాధికారానికి గౌరవంఏ దేశం కూడా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని చైనా నొక్కి చెప్పింది. ప్రతి దేశం స్వయంప్రతిపత్తిని గౌరవించాలని ఈ ప్రణాళికలో చైనా పేర్కొందిభద్రతతో కూడిన ఆర్థిక అభివృద్ధిసుస్థిరమైన శాంతి కావాలంటే ఆర్థిక వృద్ధి కూడా అంతే ముఖ్యమనిజిన్పింగ్ అభిప్రాయపడ్డారు. భద్రత మరియు ఆర్థిక అభివృద్ధిని కలిపి ముందుకు తీసుకెళ్లాలని, దీనికోసం దేశాల మధ్య సహకారం పెరగాలని ఆయన పిలుపునిచ్చారు.అంతర్జాతీయ చట్టాల అమలుచివరి అంశం అంతర్జాతీయ చట్టంపై కేంద్రీకృతమై ఉంది. అంతర్జాతీయ నిబంధనలను అందరూ సమానంగా పాటించాలని చైనా స్పష్టం చేసింది. ప్రపంచ నిబంధనలనుఎంపిక చేసుకుని పాటించడంపై జిన్‌పింగ్ హెచ్చరించారు. వాటిని అమలు చేయడంలో స్థిరత్వం పాటించాలని పిలుపు నిచ్చారు. "అంతర్జాతీయ చట్ట పాలనను కాపాడాలి. 'మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వాడుకోవడం, లేనప్పుడు వదిలేయడం' కుదరదని చైనా స్పష్టం చేసింది. ప్రపంచం తిరిగి అరాచక చట్టాల వైపు మళ్లడానికి అనుమతించలేం అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్‌నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!అదే సమయంలో, హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిణామాలపై చైనా తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ వ్యూహాత్మక జలమార్గంలో ఆంక్షలు విధించవద్దని చైనా అమెరికాను గట్టిగానే హెచ్చరించింది. ఇరాన్‌తో తమ సంబంధాలలో జోక్యం చేసుకోవద్దని, ఇరాన్‌తో తమకు ఉన్న వాణిజ్య, ఇంధన సంబంధాలను కొనసాగిస్తామని చైనా రక్షణ మంత్రి స్పష్టం చేశారు.పశ్చిమాసియా నుండి వచ్చే ఇంధనంపై చైనా ఎక్కువగా ఆధారపడుతుంది. అందుకే ఆ ప్రాంతంలో స్థిరత్వం ఉండటం చైనా ఆర్థిక ప్రయోజనాలకు అత్యవసరం.అమెరికా నాయకత్వంలోని దౌత్యం విఫలమవుతున్న తరుణంలో, తాము ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని చైనా ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిపాదనలకు ఆదరణ లభిస్తుందా ? ఇతర దేశాల నుండి ఎలాంటి మద్దతు లభిస్తుందో వేచి చూడాలి. ఇదీ చదవండి: పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో పెళ్లి కారు ముస్తాబు : నెటిజన్లు షాక్ -
చైనా చరిత్రలో చూడని అతి పెద్ద హ్యాకింగ్ దేశ రహస్యాలు లీక్..?
-
హర్ముజ్ బ్లాకేడ్.. అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరికలు
ఇరాన్ పోర్టులకు నౌకలు చేరకుండా హర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించింది. సముద్రంలో భారీ నౌకలను మోహరించి పహారా కాస్తోంది. ఒకవైపు అమెరికా సైన్యం.. మరోవైపు ఇరాన్ సైన్యం మోహరింపుతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొన్నాయి. అయితే ఈ పరిణామం మరోవైపు అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. జలసంధిపై అమెరికా నేవీ బ్లాకేడ్ ప్రారంభించడంతో చైనా తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌తో తప్ప ఒప్పందాలను అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ‘‘మాకు ఇరాన్‌తో వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయి. మా వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దని మేము ఆశిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు మరోలా ఉంటాయి’’ అని హెచ్చరించారు. అయితే అమెరికా చర్యను వ్యతిరేకించిన ఆయన.. హర్ముజ్ చైనాకు తెరిచే ఉంటుందని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం బ్లాకేడ్ ప్రకటన చేశారు. ఇరాన్ పోర్టులకు వచ్చే–వెళ్లే అన్ని నౌకలను అమెరికా సెంట్కామ్ తనిఖీ చేస్తుందని.. అనుమతి లేకుండా ప్రవేశించే నౌకలను అడ్డుకోవడం, దారి మళ్లించడం, స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నుంచే హర్ముజ్ దిగ్బంధనం ప్రారంభమైంది. అయితే ఈ బ్లాకేడ్ చైనీస్ యువాన్(కరెన్సీ) వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కూడా ఉండి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హర్ముజ్ జలసంధి ద్వారా చైనాకు 40 శాతం చమురు, 30 శాతం ఎల్ఎన్జీ సరఫరా జరుగుతోంది. అందుకే హర్ముజ్ గూండా నిర్బంధం లేని రవాణా అంతర్జాతీయ సమాజానికి అవసరమని చైనా మొదటి నుంచి చెబుతోంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు మద్దతు కూడా ప్రకటించింది. అమెరికా, చైనా ఇరాన్‌పై విభిన్న వైఖరులు అవలంబిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ జరిపిన దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఈ దాడుల్ని చైనా ఖండించింది. అయితే రహస్యంగా ఈ యుద్ధంలో చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా అవుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 50% టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. చైనా మాత్రం తాము ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయడం లేదని మొత్తుకుంటోంది. -
'అలా చేస్తే చైనాకు సమస్యలు వస్తాయి': ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల చైనాతో తమకు ఉన్న సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రత్యక్షంగా మాట్లాడలేదని.. అయినప్పటికీ, అమెరికా - చైనా మధ్య చాలా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పశ్చిమాసియా ఆసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలో ఉన్న ఉద్రిక్తతలు త్వరగా ముగియాలని షీ జిన్‌పింగ్ కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇది చైనా కూడా శాంతి స్థాపనకు ఆసక్తి చూపుతున్నదని సూచిస్తుంది.చైనా ఇరాన్‌కు సైనిక సహాయం అందిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. “అలా చేస్తే చైనాకు పెద్ద సమస్యలు వస్తాయి” అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అమెరికా-చైనా మధ్య ఎలాంటి సంబంధం ఉందో స్పష్టం చేస్తుంది.ట్రూత్ సోషల్‌లో ఒక వివరణాత్మక పోస్ట్‌లో, ట్రంప్ సవరించిన షెడ్యూల్‌ను ధృవీకరించి, వాషింగ్టన్ - బీజింగ్ మధ్య పరస్పర దౌత్య సంబంధాల ప్రణాళికలను వివరించారు. "ఇరాన్లో మా సైనిక చర్య కారణంగా మొదట వాయిదా పడిన కారణంగా, జిన్‌పింగ్‌తో నా సమావేశం తిరిగి షెడ్యూల్ చేయడం జరిగిందని.. ఇది మే 14, 15 తేదీలలో బీజింగ్‌లో జరుగుతుందని అన్నారు''.ఈ సందర్భంగా ఆయన తన భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి చైనాకు వెళ్లనున్నారు. అలాగే భవిష్యత్తులో షీ జిన్‌పింగ్ దంపతులను అమెరికాలో ఆతిథ్యం ఇవ్వాలని కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సైనిక చర్యల కారణంగా ఈ సమావేశం ఆలస్యమైందని ఆమె తెలిపారు. ఈ పరిస్థితిని షీ జిన్‌పింగ్ అర్థం చేసుకున్నారని చెప్పారు. -
ఇరాన్‌కు మద్దతిస్తున్న దేశాలకు ట్రంప్ వార్నింగ్!
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌కు అయుధ సాయం చేస్తే 50 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో టారిఫ్ విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. త్వరలో ఇరాన్‌కు చైనా పెద్దమొత్తంలో ఆయుధ సాయం చేయనుందంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. చైనా అందించే క్షిపణులతో ఇరాన్ తన శత్రు దేశాల విమానాలను కూల్చేందుకు, ట్యాంకులను ధ్వంసం చేసేందుకు ఉపయోగించనుందని కథనాలు హైలెట్ చేశాయి.ఈ క్రమంలో ఫాక్స్ న్యూస్ రిపోర్టర్ మరియా సారా బార్టిరోమోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పత్రికా కథనాలపై ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు ఆయుధ సాయం చేసే దేశాల జాబితాలో చైనా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారని రిపోర్టర్ మరియా ట్రంప్‌ను ప్రశ్నించారు. అందుకు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌కు ఆయుధ చేసే దేశాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధిస్తుంది. చైనా-ఇరాన ఆయుధ ఒప్పందంపై వెలుగులోకి వచ్చిన మీడియా కథనాల్లో వాస్తవం ఉండకపోవచ్చు. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. అదే నిజమైతే చైనాతో పాటు ఇతర దేశాలపై 50 అంతకంటే ఎక్కువ శాతం సుంకం విధిస్తాం. మీరన్నట్లు ఇరాన్‌కు చైనా ఆయుధ సాయం చేసే సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే చైనాకు మాకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. కాబట్టి వారు అలా చేస్తారని నేను అనుకోను. అలా చేయరు కూడా. బహుశా యుద్ధం ప్రారంభంలో తక్కువ మొత్తంలో పంపిస్తే.. పంపించి ఉండొచ్చు. కానీ ఇకపై అలా చేస్తారని నేను అనుకోను. ఆయుధ సాయం చేస్తూ దొరికిపోతే వారిపై 50 శాతం సుంకం విధిస్తాం’ అని స్పష్టం చేశారు.అనంతరం చైనా చమురు కొనుగోళ్ల కోసం అమెరికాకు, వెనుజువెలాకు షిప్పులు పంపుకోవచ్చు. వెనెజువెలా నుంచి చమురు కొనుక్కోమని మేమే చెప్పాం. మన దగ్గర అవసరానికి మించి ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మేమే వారికి వెనెజువెలా అమ్మే ధరకంటే తక్కువ ధరకే అమ్ముతాము’అని ట్రంప్ అన్నారు. -
అరుణాచల్ ప్రాంతాలకు కల్పిత పేర్లా: భారత్ ఫైర్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్యను దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.ఇదే సమయంలో ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బ తీసే చర్యలకు దూరంగా ఉండాలని హితవు పలికింది. ‘‘తప్పుడు వాదనలు, నిరాధార కథనాల సృష్టిని చైనా మానుకోవాలి. అరుణాచల్ సహా ఈ ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో భాగంగానే ఉంటాయి. చైనా చర్యలు ఈ వాస్తవాన్ని ఎప్పటికీ, ఏమాత్రమూ మార్చలేవు’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. -
ఇరాన్ యుద్ధం.. చైనాకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు ఓవైపు పాకిస్తాన్లో ఇరాన్, అమెరికా చర్చలు జరుగుతున్న వేళ చైనాకు అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు చైనా ఆయుధ సాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. చైనా ఇరాన్‌కు ఆయుధాలు పంపితే, పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాగా, ట్రంప్.. మియామీ ప్రయాణానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.అయితే, ఇరాన్‌కు మిత్రదేశం చైనా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలను రహస్యంగా తెప్పించుకుంటోందని అమెరికా నిఘా వర్గాలు తాజాగా ఆరోపించాయి. ఈ మేరకు సీఎన్ఎన్ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. భుజంపై మోస్తూ సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లగల మ్యాన్‌ప్యాడ్ ఆయుధాలను ఇరాన్‌కు చైనా తరలిస్తోందని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. మ్యాన్‌ప్యాడ్ సాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేయవచ్చు. హెలికాప్టర్ల ఇంజిన్లు, డ్రోన్ల వేడిమిని గుర్తించే ‘హీట్–సీకింగ్’సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. అమెరికా ఎఫ్–15ఇ యుద్ధ విమానం, బ్లాక్‌హాక్ హెలికాప్టర్లను ఇరాన్ ఇటీవల ఇవే యాంటీ–ఎయిర్–మిస్సైళ్ల వ్యవస్థలతో నేలకూల్చిందని కథనాలు వెలువడ్డాయి.#WATCH | On reports of China shipping weapons to Iran, US President Donald Trump says, "If China does that, China is going to have big problems." (Source: US Network Pool Via Reuters) pic.twitter.com/YiSlLe3TI6— ANI (@ANI) April 12, 2026నేరుగా పంపకుండా వేరే దేశానికి వీటిని విక్రయించి ఆ దేశం నుంచి ఇరాన్ కొనుగోలుచేసేలా వ్యూహం రచించిందని సమాచారం. చైనా అంతర్జాతీయ ఆంక్షల కొరడా దెబ్బల నుంచి తప్పించుకుంటోందని అమెరికా ఆరోపించింది. రష్యా నుంచి సైతం ఇలాగే పనిచేసే వెర్బా అనే యాంటీ–ఎయిర్ మిస్సైళ్ల వ్యవస్థలను ఇరాన్ కొనుగోలుచేస్తోందని వార్తలొచ్చాయి. ఘన రాకెట్ ఇంధనం తయారీవాడే ముడిపదార్థం సోడియం పర్క్లోరేట్తో నిండిన రెండు సరుకు రవాణా నౌకలను ఇప్పటికే ఇరాన్‌కు చైనా పంపిందని తెలుస్తోంది.మరోవైపు.. ట్రంప్ హెచ్చరికలపై చైనా స్పందించింది. ఈ ఆరోపణలను చైనా ఖండించింది. ఈ సందర్బంగా వాషింగ్టన్‌లోని చైనా రాయబారి కార్యాలయం స్పందిస్తూ.. “మేము ఎప్పుడూ యుద్ధంలో ఉన్న ఏ పక్షానికీ ఆయుధాలు ఇవ్వలేదు” అని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్‌కు చైనా, రష్యా ప్రధాన వ్యూహాత్మక భాగస్వాములు. పాశ్చాత్య ఆంక్షల మధ్య వీరి మద్దతు ఇరాన్‌కు కీలకంగా మారింది. అమెరికా మాత్రం ఈ సహకారాన్ని పెద్ద తప్పుగా పరిగణిస్తోంది. -
ఇరాన్‌కు చైనా ఆయుధాలు
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు ఓవైపు పాకిస్తాన్లో అమెరికాతో చర్చలు జరిపేందుకు ప్రతినిధి బృందాన్ని పంపిన ఇరాన్ మరోవైపు ఆయుధాల సమీకరణలో బిజీగా మారిందన్న వార్త చర్చనీయాంశమైంది. మిత్రదేశం చైనా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలను రహస్యంగా తెప్పించుకుంటోందని అమెరికా నిఘా వర్గాలు తాజాగా ఆరోపించాయి. ఈ మేరకు సీఎన్ఎన్ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. భుజంపై మోస్తూ సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లగల మ్యాన్‌ప్యాడ్ ఆయుధాలను ఇరాన్‌కు చైనా తరలిస్తోందని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. మ్యాన్‌ప్యాడ్ సాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేయవచ్చు. హెలికాప్టర్ల ఇంజిన్లు, డ్రోన్ల వేడిమిని గుర్తించే ‘హీట్–సీకింగ్’సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. అమెరికా ఎఫ్–15ఇ యుద్ధ విమానం, బ్లాక్‌హాక్ హెలికాప్టర్లను ఇరాన్ ఇటీవల ఇవే యాంటీ–ఎయిర్–మిస్సైళ్ల వ్యవస్థలతో నేలకూల్చిందని కథనాలు వెలువడ్డాయి. నేరుగా పంపకుండా వేరే దేశానికి వీటిని విక్రయించి ఆ దేశం నుంచి ఇరాన్ కొనుగోలుచేసేలా వ్యూహం రచించిందని సమాచారం. ఇ చైనా అంతర్జాతీయ ఆంక్షల కొరడా దెబ్బల నుంచి తప్పించుకుంటోందని అమెరికా ఆరోపించింది. రష్యా నుంచి సైతం ఇలాగే పనిచేసే వెర్బా అనే యాంటీ–ఎయిర్ మిస్సైళ్ల వ్యవస్థలను ఇరాన్ కొనుగోలుచేస్తోందని వార్తలొచ్చాయి. ఘన రాకెట్ ఇంధనం తయారీవాడే ముడిపదార్థం సోడియం పర్క్లోరేట్తో నిండిన రెండు సరుకు రవాణా నౌకలను ఇప్పటికే ఇరాన్‌కు చైనా పంపిందని తెలుస్తోంది. -
ఆలుమగల స్ఫూర్తి గాథ.. జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!
జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!.. ఇదొక శీర్షిక మాత్రమే కాదు.. ఆలుమగలకు ఆదర్శమైన ప్రధాన విషయం. ప్రస్తుత రోజుల్లో భార్యా భర్తల సంబంధాల్లో ప్రేమలు ఎంతవరకూ ఉంటున్నాయనే దానికి ఈ తరహా ఘటనలు ప్రేరణగా నిలుస్తాయి. ఒకరికోసం ఒకరు జీవించే క్షణాలు చాలా అల్పమై స్వల్పమైపోయిన ఈ రోజుల్లో నిజంగా ఇదొక స్ఫూర్తిగానే నిలుస్తుంది. ఏదో యాంత్రిక జీవితంలో ముందుకు సాగుతూ.. ఏదో బ్రతికేస్తున్నాం అని కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలుస్తేనే ఆ దాంపత్యానికి అర్ధం ఉంటుందనేది తాజా ఎపిసోడ్ చెప్పకనే చెప్పేసింది. ఇలా ఒకరికోసం ఒకరు అనే జంట ఉండటమే ఇప్పుడు వార్త అయ్యింది. వార్తా వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన డెంగ్ యుకై అనే మహిళకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. నడవలేని స్థితి. బెడ్‌కే పరిమితమై కృంగిపోయింది. తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా భర్తను ప్రాధేయ పడింది. భర్తకు తనవల్ల కష్టం రాకూడదని ఆమె చనిపోవాలని అనుకుంది. తాను చనిపోతే భర్త సుఖంగా ఉంటాడని భావించింది. భర్త నో అన్నాడు. ‘నేను ఉండగా నీకేం కాదు’ అన్నాడు,. భార్యకు అండగా నిలబడ్డాడు. విధితో పోరాడాడు. తన సంకల్పం ఎంత గట్టిదో చూపించాడు. భార్యను పూర్వపు స్థితికి తీసుకురావడానికి సుమారు రూ. 2 కోట్ల వరకూ ఖర్చు పెట్టాడు. అదే సమయంలో ప్రతీ రోజూ ప్రతీ క్షణం భార్య అలా బెడ్‌కే పరిమితమైన భార్య ముందు డ్యాన్స్‌లు చేస్తూ నవ్వించే యత్నం చేశాడు. చివరకు ఆమె కోలుకుంది. మళ్లీ తన పాత రోజుల్లోకి వచ్చేసింది. ప్రేమ శక్తితో భార్య తిరిగి జీవం పోసుకుంది.. లౌకిక జీవితాన్ని మళ్లీ చూడసాగింది. View this post on Instagram A post shared by History Facts & Stories (@howhistorylooks) Crazy what having someone who won't give up on you can do for you. This is will forever be a beautiful story https://t.co/UH7Jzd0TEL— Bhuti Olishayayo Ikhekhe (@BantuMthabela_) April 11, 2026 -
వహ్ చైనా.. వాట్ ఏ డబుల్ గేమ్!
పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ వినిపిస్తున్నాయి. లెబనాన్‌ను కాల్పుల విరమణ పరిధిలోకి తేకపోవడమే ఇందుకు కారణం. ఈ తరుణంలో ఇస్లామాబాద్ చర్చలు తేడా కొడితే.. అంతర్జాతీయంగా ఆ దేశం పరువు పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అమెరికా-ఇరాన్‌ను శాంతి చర్చలకు ఒప్పించి సైలెంట్‌గా క్రెడిట్ కొట్టేసిన చైనా.. డబుల్ గేమ్‌కి తెర తీసినట్లు తెలుస్తోంది.రెండు వారాల యుద్ధ విరమణలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీర్ఘకాలిక శాంతి స్థాపనే ధ్యేయంగా ఇరు వైపులా చేసిన ప్రతిపాదనలపై చర్చించబోతున్నారు. అయితే ట్రంప్ వార్నింగ్‌ను బట్టి ఒప్పందం కుదరకపోతే మాత్రం యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు. ఈ తరుణంలో.. ఇరాన్‌కు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేసేందుకు చైనా సిద్ధమవుతున్నట్లు అమెరికా గూఢచార సంస్థలు నివేదికలు ఇచ్చాయి!.సీఎన్ఎన్ కథనాల ప్రకారం.. ‘‘చైనా త్వరలో ఇరాన్‌కు కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను పంపేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా మాన్పాడ్స్ (MANPADs.. భుజంపై మోసుకెళ్లే యాంటీ-ఎయిర్ మిసైల్ వ్యవస్థ)లను రహస్యంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రవాణా నేరుగా కాకుండా ఇరు దేశాలకు నమ్మకంగా ఉన్న మూడో దేశం ద్వారా జరగొచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం’’ అని పేర్కొంది.ఎందుకిలా..ఒకవైపు ఇరాన్–అమెరికా మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ శాంతి చర్చలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తూనే.. మరోవైపు ఇరాన్‌కు సీక్రెట్‌గా ఆయుధాల్ని సరఫరా చేయాల్సిన అవసరం చైనాకు ఎందుకు?.. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ విషయంలో చైనా ద్వంద్వ వ్యూహాన్ని సూచిస్తోంది.ఇరాన్ చమురు చైనాకు అవసరం. కాబట్టే శాంతి చర్చల ద్వారా చమురు సరఫరా స్థిరంగా ఉండేలా చూడాలనుకుంది. అలాగే అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ప్రపంచ శాంతి దూతగా తనను చూపించుకోవాలని.. తన ప్రతిష్టను పెంచుకోవాలని ప్రయత్నించింది. వీటన్నింటి కంటే హర్ముజ్ జలసంధి చైనాకు ఎంతో కీలకం. అందుకే మధ్యవర్తిత్వం జరిపింది. అదే సమయంలో..అమెరికా ఆంక్షల మధ్య ఇరాన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా.. ఆ ఆధిపత్యాన్ని ప్రశ్నించినట్లైంది. అదే సమయంలో చైనా తన “Axis of Autocracy (అమెరికా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేసే ధోరణి.. రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి) భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటోంది.అందుకే.. బహిరంగంగా శాంతి ప్రయత్నాలు చేస్తూ, రహస్యంగా ఇరాన్‌కు మిలిటరీ సహాయం అందిస్తూ.. రెండు వైపులా లాభం పొందాలని ప్రయత్నిస్తోందన్నది విశ్లేషకుల మాట. అంతర్జాతీయంగా ఆందోళనలు కలిగిస్తున్న సీఎన్ఎన్ కథనంపై అమెరికా విదేశాంగ శాఖ, వైట్ హౌస్, వాషింగ్టన్‌లోని చైనా దౌత్య కార్యాలయం ఇంకా స్పందించలేదు. చైనా యుద్ధం మొదలైనప్పటి నుంచి బహిరంగంగానే ‘‘మేము ఎవరికి ఆయుధాలు ఇవ్వడం లేదు’’ అని చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ప్రచారాలను కూడా తోసిపుచ్చే అవకాశం లేకపోలేదు. -
ఆమె రైల్లో రక్తం కక్కుకుంది : రూ. 4 కోట్లు వచ్చాయ్!
చైనాలో అనారోగ్యంతో ఉన్న ఒక మహిళ, అనూహ్య పరిస్థితిలో రైలులో రక్త వాంతి చేసుకుంది. అయితేతన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదని ఆమె చేసిన పని లక్షలాది మంది మనసులను గెలుచుకుంది. అంతేకాదు ఆమె పరిస్థితి వారిని కదిలించి, కోట్ల రూపాయలను భారీ విరాళాలను ఆమెకు అందించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగింది? స్థానిక మీడియా కథనం ప్రకారం చైనాకు చెందిన హు జిన్యావో (Hu Xinyao) అనే 23 ఏళ్ల యువతికి చిన్న వయసులోనే ANCA-అసోసియేటెడ్ వాస్కులైటిస్' (ANCA-associated vasculitis) అనే అరుదైన రక్తనాళాల వ్యాధితో బాధపడుతోంది. ఇంజెక్షన్ తీసుకోవడానికి హు జిన్యావో ఆసుపత్రికి వెళ్తుండగా జీర్ణవ్యవస్థలో అంతర్గత రక్తస్రావం జరగడం వల్ల అనుకోకుండా రక్తం కక్కుకుంది. దీంతో వెంటనే తోటి ప్రయాణీకులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తన కోట్‌తోనే నెమ్మదిగా ఆ రక్తాన్ని శుభ్రపర్చింది. ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ ఆమె బాధ్యతాయుతమైన ప్రవర్తనకు నెటిజన్లు ఫిదా అయ్యారు.జియుపాయ్ న్యూస్ ప్రకారం, మార్చి 23న, చాంగ్కింగ్లోని మెట్రో రైలులో ఒక ప్రయాణికుడు ఆ మహిళను చిత్రీకరించగా, ఆ వీడియో చైనాలోని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమె వైద్యం కోసం భారీగా విరాళాలు అందాయి. సుమారు 4,00,000 యువాన్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 4.7 కోట్లు విరాళాలు సమకూరాయి.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!నెటిజనుల రియాక్షన్స్"ఆమె మనసు చాలా మంచిది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుందాం" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, "నేను ధన వంతుడ్ని కాకపోయినా, ఆమె చికిత్స కోసం నా వంతు సాయం చేస్తాను" అని మరొకరు తన వంతు సాయం చేశారు. ఇలా వారంలోపే ఆమెకు భారీగా విరాళాలు అందాయి. ఎంతలా అంటే, ఆమె సోషల్ మీడియా ఖాతాకు విరాళాలు వెల్లువెత్తడంతో ప్లాట్‌ఫారమ్ తాత్కాలికంగా ఆ ఖాతాను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో స్పందించిన ప్రతీ ఒక్కరికీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. "నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరి పేరు, వారు పంపిన మొత్తాన్ని నేను నోట్ చేసుకున్నాను. ప్రజలు నాపై చూపిన ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. భవిష్యత్తులో వారు కష్టాల్లో ఉన్నప్పుడు నేను కూడా సాయం చేయాలని ఆశిస్తున్నాను," అని హు భావోద్వేగంతో చెప్పింది. ఎవరీ హు హు ఒక సాధారణ గ్రామీణ కుటుంబం నుండి వచ్చింది. 2018లో స్కూల్లో ఉన్నప్పుడే ఆమెకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఫలితంగా వైద్య ఖర్చులు భరించలేక చదువు మధ్యలోనే ఆపేసింది. ఆపై రోడ్డు పక్కన ఆరెంజ్ జ్యూస్ అమ్ముతూ జీవనం సాగించింది. Hu కుటుంబం ఆమె అనారోగ్య చికిత్స కోసం లక్షల కొద్దీ ఖర్చుపెడుతోంది. గత ఏడాది కాలంలోనే ఆమెకు ఆసుపత్రి నుండి 20 సార్లు 'క్రిటికల్ ఇల్నెస్' (ప్రాణాపాయ స్థితి) నోటీసులు వచ్చాయి. అయినా జీవితాన్ని నెట్టుకొస్తూ ప్రస్తుతం ఆన్లైన్ నవలలు రాస్తూ నెలకు 5,000 నుండి 6,000 యువాన్లు సంపాదిస్తుండటం గమనార్హం.ప్రియుడితో బ్రేకప్ ఇలాగత సెప్టెంబర్‌లో ఆమె మాజీ ప్రియుడు 'సియావో' ప్యాంక్రియాటైటిస్‌తో మరణిస్తూ, తన దగ్గర ఉన్న 50,000 యువాన్ల పొదుపు మొత్తాన్ని హు చికిత్స కోసం ఇచ్చి వెళ్ళాడు. తమ బంధం కేవలం రెండు నెలలే అయినప్పటికీ, తన అనారోగ్యం వల్ల అతడి జీవితం పాడవకూడదని హు అంతకుముందే అతడికి బ్రేకప్ చెప్పింది. వారి మధ్య ఉన్న ఆ నిస్వార్థమైన బంధం కూడా ప్రజలను ఎంతగానో కదిలించింది.గొప్పమనసుపెద్ద నగరాల్లో వైద్య చికిత్స పొందుతున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నవారు ,వారి బంధువులు బస చేయడానికి వీలుగా ఒక "రోగుల గృహం" నిర్మించడానికి తాను తీవ్రంగా కృషి చేస్తున్నానని హు మీడియాకు తెలిపింది. ఇటీవల ఆమె పరిస్థితి కిడ్నీ వైఫల్యానికి దారితీసింది. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవచ్చో లేదో తెలుసుకోవడానికి ఆమె ఏప్రిల్ ప్రారంభంలో తూర్పు జియాంగ్సు ప్రావిన్స్‌లోని నాన్జింగ్లో ఉన్న ఒక ప్రధాన ఆసుపత్రిని సందర్శించాలని యోచిస్తోంది. -
ఆ చమురు నౌక చైనాకు మళ్లింది!
న్యూఢిల్లీ: 6 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురుతో భారత్‌కేసి బయల్దేరిన పింగ్ షున్ అనే నౌక తన ప్రయాణ దిశను ఉన్నట్టుండి చైనా వైపు మార్చుకుంది! ముందుగా నిర్దేశించిన మేరకు ఈ చమురు నౌక గుజరాత్‌లోని వదినార్ రేవుకు చేరాల్సి ఉంది. మూడు రోజులుగా నౌక ప్రయాణం వదినార్ వైపే సాగింది. అక్కడికి కొద్ది దూరంలో ఉండగా శుక్రవారం ఉన్నట్టుండి చైనాలోని డోంగ్యింగ్ కేసి మళ్లినట్టు నౌకల ప్రయాణాన్ని గమనించే ‘కోలా డేటా’పేర్కొంది. పింగ్ షున్ తాజాగా తన గమ్యస్థానాన్ని డోంగ్యింగ్గానే చూపుతున్నట్టు తెలిపింది. ఈ నౌక గనక భారత్ చేరితే ఏడేళ్ల అనంతరం ఇరాన్ నుంచి మన దేశానికి తొలిసారి చమురు దిగుమతి జరిగేది. ఈ నౌకలోని చమురు తాలూకు క్రయ, విక్రయదార్ల వివరాలు వెల్లడి కాలేదు. ఎస్వాతిని దేశపు జెండాతో కూడిన ఈ చమురు నౌక ఈ వారం మొదట్లో భారత్‌కు బయల్దేరింది. ఇప్పుడిలా సముద్ర మధ్యంలో ఉన్నట్టుండి చైనా వైపు ఎందుకు మళ్లిందన్నది తెలియాల్సి ఉంది. బహుశా చెల్లింపుల అంశమే దీనికి ప్రధాన కారణమై ఉంటుందని కోలా అభిప్రాయపడింది. ‘‘చమురు చెల్లింపులకు సరఫరా కంపెనీలు గతంలో కనీసం 30 నుంచి 60 రోజుల గడువిచ్చేవి. కానీ పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు సరఫరా పూర్తిగా అడుగంటి డిమాండ్ చుక్కలనంటింది. దాంతో కంపెనీలు తక్షణ చెల్లింపులను డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ముందుకొచ్చే దేశాలకే పెద్దపీట వేస్తున్నాయి’’అని పేర్కొంది. ఇరాన్ చము రును సరఫరా చేస్తోందంటూ పింగ్ షున్ నౌకపై 2025లో అమెరికా నిషేధం విధించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు ఎత్తేయడం తెలిసిందే. దాంతో ఇప్పటికే సముద్రంలో ఉన్న ఇరాన్ చమురు నౌకలపై మన చమురు కంపెనీలన్నీ జల్లెడ పడుతున్నాయి. ఆ క్రమంలోనే పింగ్ షున్ ఇరాన్ చమురుతో భారత్‌కేసి బయల్దేరి తాజాగా ఉన్నట్టుండి చైనా బాట పట్టింది. అయితే, చెల్లింపు సంబంధిత అంశాలు కొలిక్కి వచ్చే పక్షంలో ఈ నౌక భారత్‌కే వచ్చే అవకాశాలూ లేకపోలేదని ‘కోలా’లో ప్రధాన పరిశోధకునిగా పని చేస్తున్న సుమిత్ రిటోలియా చెప్పుకొచ్చారు. చమురు కొనుగోళ్ల కోసం ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ముమ్మర పోటీకి ఈ ఉదంతం తాజా నిదర్శనమన్నారు. 2018 వరకు భారత్‌కు అతి పెద్ద చమురు ఎగుమతిదారుల్లో ఇరాన్ కూడా ఉండేది. మన చమురు దిగుమతుల్లో ఇరాన్ వాటా 11.5 శాతం దాకా ఉండేది. 2019లో ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలు కఠినతరం చేసింది. దాంతో ఇరాన్ చమురు కొనుగోళ్లను భారత్ నిలిపేసింది. -
చైనా భారీ రాకెట్ ప్రయోగం విఫలం
చైనా తాజాగా చేసిన భారీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈరోజు(శుక్రవారం, ఏప్రిల్ 3వ తేదీ) గోబీ ఎడారిలోని జియుక్వాన్ సెంటర్ నుంచి ప్రయోగించిన టియాన్‌లాంగ్-3 రాకెట్ మధ్యలో లోపం రావడంతో మిషన్ విఫలమైంది. ఇది స్పేస్ ఎక్స్ (SpaceX Falcon 9) స్టార్‌లింక్‌కు పోటీగా పోటీగా అభివృద్ధి చేసిన చైనాలోని అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగం ఇది. అయితే ఈ ప్రయోగం విఫలమైంది. చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం విఫలం కావడాన్ని ధృవీకరించింది. తాము ప్రయోగించిన టియాన్‌లాంగ్-3 రాకెట్ ప్రయోగం విఫలమైందని పేర్కొంది.టియాన్‌లాంగ్-3ను చైనా Starlink వంటి ఇంటర్నెట్ శాటిలైట్ మెగా-కాన్స్టెల్లేషన్లను ఏర్పాటు చేయడానికి కీలకంగా భావించింది. SpaceX Falcon 9కి ప్రత్యామ్నాయంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఇది విఫలం కావడం చైనాలోని ప్రైవేట్ స్పేస్ రంగానికి పెద్ద దెబ్బ, ముఖ్యంగా శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టులలో ఆలస్యం అవుతుంది.ప్రయోగం వివరాలురాకెట్ పేరు: టియాన్‌లాంగ్-3అభివృద్ధి సంస్థ: బీజింగ్ ఆధారిత స్టార్టప్ స్పేస్ పయినీర్ప్రయోగ స్థలం: జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్, గోబీ ఎడారిప్రయోగ సమయం: ఏప్రిల్ 3, 2026, మధ్యాహ్నం 12:17 (స్థానిక సమయం)లోపం: మధ్యలో “flight anomaly” కారణంగా రాకెట్ విఫలమైంది -
ఆమెకు 55, అతడికి 25 : రూ 60 కోట్లు, లగ్జరీకార్లు
చైనాకు చెందిన వ్యాపారవేత్త యు వెన్‌హాంగ్ (Yu Wenhong), తనకంటే 30 ఏళ్లు చిన్నవాడైన 25 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు సుమారు రూ. 60 కోట్ల కట్నం, విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిన వైనం పెళ్లి కాని ప్రసాదులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం చైనా మెడికల్ ఈస్తటిక్స్ రంగంలో ప్రముఖురాలైన యు వెన్‌హాంగ్ (55), 25 ఏళ్ల లియు యుచెన్ (Liu Yuchen) అలియాస్ రెన్రెన్ను వివాహం చేసుకుంది. యు, యుచెన్ (రెన్రెన్) ఈ మార్చిలో పెళ్లాడింది. పెళ్లి సందర్భంగా తన భర్తకు సుమారు 50 మిలియన్ యువాన్ల (సుమారు రూ.60 కోట్లు) విలువైన నగదు, విలాసవంతమైన ఇళ్లు, రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిందట.(పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్‌లు, వీడియో వైరల్)ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరడంతో వీరి ప్రేమ చర్చల్లో నిలిచింది. మరోవైపు లియు యుచెన్ తమ సంబంధం గురించి మాట్లాడుతూ, ఇంత విలాసవంతమైన జీవితాన్ని తాను ఊహించలేదని, కానీ ఆమె ప్రేమను, వచ్చిన అవకాశాన్ని ఉప యోగించుకున్నానని భర్త లియు యుచెన్ పేర్కొనడం గమనార్హం. కాగా యుకు గతంలోనూ వివాహాలు అయ్యాయి. అలాగే ఒక విదేశీ మోడల్ అల్బేనియన్ మోడల్ Rolando Lekajతో పదేళ్ల రిలేషన్షిప్లో ఉంది. వీరికి ఒక బిడ్డ కూడా.ఇదీ చదవండి : రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!వీరిద్దరి పరిచయం ఎలా2025లో లైవ్ స్ట్రీమింగ్‌లో వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమైనారు. ఈ పరిచయం వారిని మరింత దగ్గర చేసింది. ఆ తరువాత యు అతనికి రోల్స్-రాయ్స్, మెర్సిడెస్-బెంజ్ మోడళ్ల వంటి ప్రీమియం కార్లతో సహా అత్యంత ఖరీదైన విలాసవంతమైన వస్తువులను బహుమతిగా ఇచ్చిందని చెబుతున్నారు.నెటిజన్లు స్సందన మల్టీ మిలియన్ డాలర్ల డౌరీ కథ చైనీస్ సోషల్ మీడియా అంతటా మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొంతమంది వినియోగ దారులు యు విజయాన్ని, ఆర్థికంగా ఎదిగిన తీరును అభినందిస్తుండగా, ఈ ఉదంతం చైనాలో మారుతున్న సామాజిక విలువలు, సంపద, స్త్రీ-పురుష సంబంధాలపై కొత్త చర్చకు దారితీసింది.యు వెన్‌హాంగ్ సక్సెస్ స్టోరీసామాన్య కుటుంబంనుంచి వ్యాపారవేత్తగా యు ఎదిగిన తీరు అసామాన్యం. ఈశాన్య చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్‌లోని డాలియన్‌లో ఒక సాధారణ ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది. తండ్రి మరణం తర్వాత 18 ఏళ్లకే కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంది. బ్యూటీ ఇండస్ట్రీలో ఐబ్రో టాటూ టెక్నీషియన్‌గా కెరీర్ ప్రారంభించి, పట్టుదలతో 2004లో హాంగ్‌కాంగ్‌లో 'యంగ్ మెర్రీ రియల్ ఇంటర్నేషనల్ గ్రూప్'ను స్థాపించింది. ఆమె తనను తాను 'సెల్ఫ్ మేడ్' మహిళగా ప్రొజెక్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె వ్యాపారం చైనా వ్యాప్తంగా వందలాది బ్రాంచ్‌లతో విస్తరించింది.వ్యాపార వివాదాలు : ఆమె కంపెనీకి చెందిన కొన్ని కాస్మెటిక్ చికిత్సల శాస్త్రీయతపై గతంలో విమర్శలు వచ్చాయి. అలాగే, 2022లో వందల కోట్ల పన్ను ఎగవేత కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. -
చైనా సీసీ కెమెరాలకు చెక్! ఇక కొత్త నిబంధనలు
దేశ భద్రత, సైబర్ రక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. చైనాకు చెందిన పలు కంపెనీల సీసీటీవీ (CCTV) కెమెరాల విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఇంటర్నెట్ ఆధారిత కెమెరాల నిఘాను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 1 నుండి మారిన నిబంధనలు ఇవే..ఏప్రిల్ 1 నుండి దేశంలో విక్రయించే ప్రతి ఇంటర్నెట్-కనెక్టెడ్ సీసీటీవీ కెమెరా తప్పనిసరిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన STQC (స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్) ఫ్రేమ్‌వర్క్ నుండి అనుమతి పొందాలి.కంపెనీలు తమ కెమెరాలలో ఉపయోగించే సిస్టమ్-ఆన్-చిప్ (SoC) లేదా ప్రాసెసర్ ఎక్కడ తయారైందో స్పష్టంగా తెలియజేయాలి.ఎన్క్రిప్షన్ టెక్నాలజీ, హార్డ్‌వేర్ మూలం, ఫర్మ్‌వేర్ భద్రత మరియు ట్యాంపరింగ్ (ట్యాంపర్ రెసిస్టెన్స్) వంటి అంశాలపై STQC అధికారులు పరీక్షలు నిర్వహిస్తారు.కెమెరా డేటాను ఇతరులు రిమోట్‌గా యాక్సెస్ చేసే అవకాశం ఉందో లేదో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.విదేశాల నుండి దిగుమతి చేసుకునేవే కాకుండా, భారత్‌లో అసెంబుల్ చేసే పరికరాలు కూడా ఈ పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. క్లియరెన్స్ లేని ఉత్పత్తుల విక్రయం ఇకపై చట్టవిరుద్ధం.ఏ బ్రాండ్లపై ప్రభావం పడుతుంది?భారత సీసీటీవీ మార్కెట్లో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చలాయించిన హిక్ విజన్ (Hikvision), టీపీ-లింక్ (TP-Link), దహువా (Dahua) వంటి ప్రముఖ చైనా కంపెనీలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కొత్త నిబంధనల ప్రకారం వీరు కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.పాత కెమెరాల పరిస్థితి ఏమిటి?ఇప్పటికే ఇళ్లు, కార్యాలయాల్లో వాడుతున్న కెమెరాల విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రస్తుత కెమెరాలను స్వాధీనం చేసుకోదు. పాత కెమెరాలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, భవిష్యత్తులో ఆయా కంపెనీల నుండి వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్లు, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ (మరమ్మతులు) విషయంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.ధరలు పెరుగుతాయా?చైనా కంపెనీలకు ఆంక్షలు ఎదురైనప్పటికీ, భారతీయ బ్రాండ్లు సీపీ ప్లస్ (CP Plus), ప్రమా (Prama), క్యోబో (Kyobo), మ్యాట్రిక్స్ (Matrix), స్పర్ష్ (Sparsh) ఇప్పటికే తమ ఉత్పత్తిని భారీగా పెంచాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వీటి వాటా 80 శాతానికి చేరుకుంది. అయినప్పటికీ, భద్రతా పరీక్షల కోసం అయ్యే అదనపు ఖర్చు, సరఫరాదారుల సంఖ్య తగ్గడం వల్ల, రానున్న రోజుల్లో ముఖ్యంగా మిడ్, ప్రీమియం రేంజ్ కెమెరాల ధరలు కొంత మేర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
క్యూబా చేరుకున్న రష్యా చమురు.. ఇరాన్‌కు చైనా ఝలక్?
బీజింగ్: తమ దేశానికి రావాల్సిన మూడు చమురు నౌకలు విజయవంతంగా హార్మూజ్ జలసంధిని దాటాయని చైనా మంగళవారం ప్రకటించింది. హార్మూజ్‌ను దాటడంలో ఎంతగానో సహకరించిన ఇరాన్ పేరును ప్రస్తావించకుండానే నౌకల సాఫీ ప్రయాణానికి చేయూతనందించిన వారికి ధన్యవాదాలు అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేశారు. పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్ గుండా తమ నౌకలు ప్రయాణిస్తున్నాయని చైనా అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి.మరోవైపు ఇరాన్లో పరిస్థితులపై పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాన్ దార్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం మంతనాలు జరిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సన్నిహిత నేత అయిన వాంగ్ యీ ఇప్పటికే దేశ అధికార కమ్యూనిస్ట్ పార్టీ పొలిటికల్ బ్యూరోలోనూ సభ్యునిగా ఉన్నారు. క్యూబా చేరుకున్న రష్యా చమురు.. ఇదిలా ఉండగా.. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత రష్యా ముడిచమురు నౌక క్యూబాకు చేరుకుంది. కొంతకాలంగా రష్యా చమురును కొనుగోలుచేయొద్దంటూ క్యూబాపై అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఆంక్షలు విధించడంతో క్యూబా చమురుకష్టాలు మొదలయ్యాయి. తాజాగా రష్యా చమురును తాత్కాలికంగా అనుమతిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే క్యూబాలోని మటాంజా నౌకాశ్రయానికి రష్యా చమురునౌక ‘అనటోలీ కొలోడ్కిన్’చేరుకుంది.మార్చి 8న రష్యా నుంచి బయల్దేరి ఇంగ్లిష్ ఛానల్ మీదుగా ఈ నౌక ఇటీవల అట్లాంటిక్ సముద్రజలాల్లోకి ప్రవేశించి అమెరికా అనుమతుల కోసం వేచిచూస్తున్న విషయం తెల్సిందే. ఇది ఏకంగా 7,30,000 బ్యారెళ్ల చమురును మోసుకొచ్చింది. నౌక రాకపై క్యూబా ఇంధన, గనుల మంత్రి విసెంటే లేవీ అమితానందం వ్యక్తంచేశారు. ఇన్నాళ్లూ క్యూబా తమ చమురుఅవసరాల కోసం అత్యధికంగా వెనెజువెలాపై ఆధారపడేది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్ట్‌చేశాక ఆ దేశం నుంచి చమురురాక దాదాపు ఆగిపోయింది. దీంతో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోబోతే అమెరికా అడ్డుకోవడం తెలిసిందే. -
చెంపదెబ్బ కొట్టిన రోబోట్: వీడియో
హ్యుమానాయిడ్స్ రోబోల తయారీలో చైనా చాలా వేగంగా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే.. అక్కడి కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రోబోలను పరిచయం చేస్తూనే ఉన్నాయి. అయితే.. కొత్త రోబోల ప్రదర్శన సమయంలో కొన్ని ఊహించని సంఘటనలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.మార్చి 21న చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో జరిగిన ఒక బహిరంగ నృత్య ప్రదర్శనలో, ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ప్రమాదవశాత్తు ఒక చిన్న బాలుడి ముఖానికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన.. సిబ్బంది ఆ రోబోను పక్కకు లాగడానికి ప్రయత్నించారు.అయినప్పటికీ.. అది రింగ్ మధ్యలో తన ప్రోగ్రామ్ ప్రదర్శించింది.ఈ రోబోట్.. చైనా టెక్నాలజీ సంస్థ యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన జీ1 హ్యూమనాయిడ్ మోడల్ అని తెలుస్తోంది. సుమారు 35 కేజీల బరువున్న ఈ రోబో ధర 13500 డాలర్లు. దీనిని రీసెర్చ్, ఎడ్యుకేషన్, కమర్షియల్ ఉపయోగం కోసం ప్రత్యేకంగా తయారు చేశారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్న. ఎంత ప్రమాదకరమైన ప్రదర్శన చెప్పగా.. చిన్నారికి తగలడం అనేది చాలా బాధాకరమైన విషయం అని ఇంకొకరు పేర్కొన్నారు.Robot uprising also start small, maybe a slap here, a kick there. All to desensitize humans.pic.twitter.com/qpa8yfkIcF— The Great Translation Movement 大翻译运动 (@TGTM_Official) March 22, 2026కంపెనీలకు సూచనలురోబర్స్ తయారీ లేదా వినియోగం అనేది మంచి చర్య. అయితే వాటికి భావాలు అర్థం చేసుకోవడం, ప్రవర్తించిన విధానం పూర్తిగా తెలిసి ఉండదు. ఇలాంటి సమయంలో రోబోల వల్ల ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి వస్తుంది. కాబట్టి సంస్థలు దీనిని దృష్టిలో ఉంచుకుని రోబోట్స్ తయారు చేయాలి. అంతే కాకుండా..పూర్తిగా టెస్ట్ చేసిన తరువాత వినియోగానికి ఉపయోగించడం మంచిది. లేకుండా ప్రజలకు ఇబ్బంది, లేకుండా కంపెనీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.గతంలో జరిగిన సంఘటనరష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని 2025 నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.ఇదీ చదవండి: ఐదేళ్లలో బంగారం మార్క్.. నిపుణుల కొత్త అంచనా! -
China: ముగ్గురు సజీవ దహనం.. మరో 23 మంది..
బీజింగ్: చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. తైయువాన్ నగరంలోని ఒక భవనంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక మీడియా, అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం.. షాంగ్జీ రాజధాని తైయువాన్‌లోని షియావోడియన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, చూస్తుండగానే భవనం మొత్తానికి అవి విస్తరించాయి. దట్టమైన పొగలు, నిప్పురవ్వలు ఆకాశాన్నంటడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన 23 మందిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని జిల్లా పబ్లిసిటీ విభాగం వెల్లడించింది.3月28日晚,山西太原,亲贤北街茂业怡和巷一饭店大楼发生大火,官方通报24死伤!#太原 #火灾 pic.twitter.com/uZsvMm3utw— 中国悲剧档案 (@newszg_official) March 28, 2026భవనం నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాత్రి పూట మంటలు భవనాన్ని చుట్టుముట్టడం, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఈ వీడియోల్లో కనిపిస్తున్నాయి. అయితే, ఈ వీడియోల ప్రామాణికతను అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. -
గ్రేట్ ప్లాన్ : తక్కువ అద్దె, బోలెడన్ని లాభాలు
చదువు పూర్తి అయినా ఉద్యోగాలు దొరక్క యువత నానా పాట్లు పడుతోంది. దీంతో చైనాలోని "యీయాంగ్ సీనియర్ హౌస్" వినూత్నంగా ఆలోచించింది. ఈ ప్లాన్‌తో చైనాలో ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు, ఇటు నిరుద్యోగ యువతకు కూడా భారీ ఉపశమనం లభిస్తోంది. ఏంటా ప్లాన్? తెలుసుకోవాలని ఉందా? పదండి మరి,చైనాలోని సుజౌ (Suzhou) నగరానికి చెందిన 25 ఏళ్ల జాంగ్ జిన్ (Zhang Jin) అనే యువతి, నేటి తరం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని, ఒంటరితనాన్ని అధిగమించేలా సరికొత్త నిర్ణయం తీసుకని వార్తల్లో నిలిచింది. నెలకు కేవలం 200 యువాన్ల (సుమారు రూ.2,820) మాత్రమే అద్దె చెల్లిస్తోంది. సాధారణంగా అక్కడి మార్కెట్ ధరలతో పోలిస్తే దాదాపు 10 రెట్లు తక్కువ. దీనికి ఆమె చేయాల్సిందల్లా ఏమిటంటే వృద్ధాశ్రమంలో నివసిస్తూ, అక్కడి వృద్ధులకు తోడుగా ఉండటమే.తూర్పు చైనాలోని తూర్పు జియాంగ్జీ ప్రావిన్స్ నుండి కొత్తగా పట్టభద్రురాలైన జాంగ్, అక్కడ ఉద్యోగం సంపాదించిన తర్వాత జియాంగ్సు ప్రావిన్స్‌లోని సుజౌకు మారింది.జాంగ్ వారంలో ఐదు రోజులు ఆఫీసుకి వెళ్తుంది. సాయంత్రం వేళల్లో ,వారాంతాల్లో (Weekends) వృద్ధులతో కలిసి డ్యాన్స్ క్లాసులు, ఇతర యాక్టివిటీస్‌లో పాల్గొంటుంది. తద్వారా తక్కువ అద్దెకు ఇల్లు, పెద్దవారితో అనుబంధంతోపాటు, మానసిక ఉల్లాసాన్ని బోనస్‌గా అందుకుంటోంది.ఈ ఆశ్రమం స్వచ్ఛంద సేవ కోసం దరఖాస్తు చేసుకునే వారు 35 ఏళ్లలోపు వారై ఉండాలి, నగరంలో సొంత ఇల్లు ఉండకూడదు . పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తూ ఉండాలి. ప్రతి మూడు నెలలకు కనీసం 45 గంటల పాటు వృద్ధులకు సేవ చేయాల్సి ఉంటుంది. పెద్దలతో ఆత్మీయ అనుబంధంఈ క్రమంలో ఆశ్రమంలోని పెద్దవాళ్లతో యువతకు అనుబంధం, ఇటు వృద్ధులకు కూడా మంచి కాలక్షేపం తద్వారా చక్కటి ఆరోగ్యం కూడా అంటుంది జాంగ్. ఆశ్రమంలో ఆమెకు 89 ఏళ్ల వృద్ధుడిని పార్ట్నర్గా కేటాయించారు. ఆయన ఆమెను తన సొంత మనవరాలిలా చూసుకుంటారు. ఒకసారి జాంగ్ అనారోగ్యానికి గురైతై, ఆయన తెల్లవారుజామున 5 గంటలకే లేచి ఆమె కోసం వేడి వేడి సూప్ తయారు చేసి ఇచ్చారట. "ఈ నగరంలో నాకు ఎవరూ తెలియదు. కానీ ఈ ఆశ్రమం నాకు సొంత ఇల్లులా అనిపిస్తోంది. ఇక్కడ నాకు లభించే ప్రేమాభిమానాలు నా ఒత్తిడిని తగ్గిస్తున్నాయి," అంటుంది సంతోషంగా.ఇదీ చదవండి: ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ వివాదం : కెమెరామెన్లపై దాడిఎందుకు ఈ నిర్ణయం?చైనాలో పెరుగుతున్న వృద్ధుల జనాభా మరియు యువతపై ఉన్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ "యీయాంగ్ సీనియర్ హౌస్" (Yiyang Senior House) ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనివల్ల యువతకు అద్దె భారం తగ్గుతుంది. వృద్ధులకు ఒంటరితనం పోయి కొత్త ఉత్సాహం లభిస్తుంది. అలాగే నగరంలో ఒంటరిగా ఉండే యువతకు ఒక కుటుంబం దొరికినట్లు అవుతుంది.ప్రస్తుతం ఆ ఆశ్రమంలో ఉన్న ఏకైక వాలంటీర్ జాంగ్ మాత్రమే (మిగిలిన వారు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారు). అందుకే యాజమాన్యం మరికొంత మంది వాలంటీర్లను చేర్చుకోవాలని భావిస్తోంది.ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు -
నాటో, ఈయూ సమాచారం కోసం .. చైనా లింక్డిన్ వల ?
యూరోపియన్ భద్రతా వర్గాలు సంచలన విషయాలు వెల్లడించాయి. నకిలీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లను ఉపయోగించి నాటో (NATO) ఐరోపా సమాఖ్య (EU) సంస్థల నుండి రహస్య సమాచారాన్ని సేకరించడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆరోపించాయి.నకిలీ లింక్డిన్ ఖాతాల ద్వారా సైనిక కూటమి (నాటో) లేదా ఐరోపా సమాఖ్య (EU) సంస్థలకు చెందిన డజన్ల కొద్దీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుందని భద్రతా వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో రిక్రూట్ చేసుకున్నవారిని చిన్నపాటి నివేదికలు రాయాలని కోరుతూ కొంత మొత్తం నగదు చెల్లిస్తారని వారిపై నమ్మకం కుదిరిన తర్వాత క్రమంగా బహిరంగంగా లభ్యం కాని సమాచారం లేదా అత్యంత రహస్యమైన డేటా కోసం ఒత్తిడి చేస్తారని పేర్కొన్నాయి.ఇందులో ప్రధానంగా "కెవిన్ జాంగ్" అనే పేరుతో ఉన్న ఒక అకౌంట్ ద్వారా ఈ కుట్ర సాగినట్లు ఈయూ అధికారులు గుర్తించారు. ఇతను హాంకాంగ్‌కు చెందిన "ఓరియంటల్ కన్సల్టింగ్" అనే నకిలీ సంస్థ అధిపతిగా చెలామణి అయినట్లు పేర్కొన్నారు. చైనా నిఘా వర్గాలు అత్యంత చాకచక్యంగా ఈ నెట్వర్క్ నిర్వహిస్తున్నారని దీని వెనుక ప్రధానంగా చైనా 'స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ' ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. కాగా బ్రిటన్ గూఢచారి సంస్థ MI5 కూడా గతంలో ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ ఆరోపణలను చైనా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. -
దంతాలతో కళాఖండాలు..!
ఎన్నో రకాల శిల్పులను చూశాం. అతి సూక్ష్మమైన వాటిని తయారు చేసేవారు, గోటితో, ముక్కుతో పలు రకాల ఆర్ట్‌లను ప్రదర్శించారు. కానీ దంతాలతో ఆర్ట్ గురించి విన్నారా..?. ఔను మీరు వింటోంది నిజమే..ఈ కళను చైనా మహిళ ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.చైనాలోని హుబే ప్రావిన్స్‌కు చెందిన 25 ఏళ్ల చెన్ క్విన్ తన అసాధారణ ప్రతిభకు సంబంధించిన వీడియోలను పంచుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. కేవలం తన పళ్లతో సూక్ష్మమైన శిల్పాలు చెక్కుతూ లక్షలాది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమె వాటన్నింటిని క్యారెట్లతో చేయడం విశేషం. క్యారెట్లను కొరుకుతూ అద్భుతమైన కళాఖండాలుగా మలుస్తుందామె. చిన్న జంతువుల బొమ్మల నుంచి వివిధ సంక్లిష్టమైన నిర్మాణాల వరకు చాలా కళాఖండాలను రూపొందించింది. అందులో అత్యంత ఆకర్షణీయమైన చైనా మహా కుడ్యg, ఎల్లో క్రేన్ టవర్ ప్రతిరూపాలు, ఫీనిక్స్ కిరీటాలు, మియావో ప్రజలు ధరించి వెండి టోపీలు తదితరాల కూడా ఉన్నాయి. ఇదెలా మొదలైందంటే..క్యారెట్‌ని తింటున్నప్పుడూ ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. తొలుత సరదాగా చిన్న చిన్న ఆకృతులను తయారు చేసింది. దానికి మరింత మెరుగులు పెట్టి అందంగా శిల్పాలు చెక్కడం ప్రారంభించింది. అలా ఇప్పటి వరకు సుమారు వందకు పైగా క్యారెట్ శిల్పాలు రూపొందించిందట. ఆ క్యారెట్లన్నీ ఆమె పొలంలో పండినవేనట. పైగా క్విన్ తనను తాను దంత శిల్పిగా అభిర్ణించకుంటోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి(చదవండి: Kavitha Vasupalli: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీని తలపించే స్టోరీ..! ప్రాణాలు పణంగా పెట్టిన డాక్టర్..) -
'జిన్‌పింగ్ కోసం ఎదురుచూస్తున్నా'.. త్వరలో చైనాకు ట్రంప్
అమెరికా అధ్యక్షుడి చైనా పర్యటనకు కొత్త తేదీలు ఫిక్స్ చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. వాస్తవానికి ట్రంప్ ఈ నెలలోనే ( మార్చి) చైనాలో పర్యటించాల్సి ఉండగా యుద్ధం నేపథ్యంలో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మేలో చైనా వెళ్లనున్నట్లు తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన నూతన తేదీలను వైట్‌హౌస్ ప్రకటించింది. మే 14, 15 తేదీల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ కానున్నట్లు తెలిపింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.."యుద్ధం మరో నాలుగు నుండి ఆరు వారాల్లో ముగియవచ్చు. ట్రంప్ చైనా వెళ్లే సమయానికి పరిస్థితులు చక్కబడతాయి". అని అన్నారు.కాగా చైనా పర్యటనపై గతవారం ట్రంప్ స్పందించారు. "మేము చైనాతో కలిసి పనిచేస్తున్నాము. నేను చైనా అధ్యక్షున్ని కలవాలని ఎదురుచూస్తున్నాను. ఆయన కూడా నన్ను కలవాలని ఎదురుచూస్తాడు అనుకుంటా "అని అన్నారు. ప్రపంచ చమురు రవాణాకు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో మూతపడింది. దీంతో చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. కాగా ఈ మార్గాన్ని రక్షించడానికి సైనిక సహాయం అందించాలని ట్రంప్ చైనాను సహాయం కోరతున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక తొలిసారిగా చైనాలో పర్యటిస్తున్నారు. అధిక పన్నుల ప్రకటన తర్వాత తొలిసారిగా ఇరు దేశాల అధినేతలు భేటీ అవతుండడంతో ఇరు దేశాల వాణిజ్యానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రవి అస్తమించినా సౌర కాంతులు!
సాధారణంగా సూర్యుడు అస్తమిస్తే సోలార్ ప్లాంట్ల పని ముగిసిపోతుంది. కానీ చైనాలోని గోబీ ఎడారిలో ఉన్న దున్‌హువాంగ్ సోలార్ ప్లాంట్‌ను చూస్తే అది నిజం కాదనిపిస్తుంది. నిప్పులు కురిపించే ఎడారి ఎండను ఒడిసిపట్టి రాత్రి వేళ కూడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈ ప్లాంట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 12,000 భారీ అద్దాలతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక సరికొత్త విప్లవమని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఏమిటీ ప్లాంట్ ప్రత్యేకత?ఈ ప్లాంట్ మనం చూసే సాధారణ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్లతో పనిచేసేది కాదు. దీన్ని ‘మొల్టెన్ సాల్ట్ కాన్సంట్రేటెడ్ సోలార్ పవర్’ (సీఎస్పీ) ప్లాంట్ అని పిలుస్తారు. దీని నిర్మాణం చూస్తే మధ్యలో ఒక భారీ టవర్, దాని చుట్టూ వేల సంఖ్యలో అద్దాలు అమర్చి ఉంటాయి. ఇక్కడ ఉన్న 12,000 అద్దాలు సూర్యుడు కదులుతున్న దిశకు అనుగుణంగా వాటికి అవే పొజిషన్‌ను సర్దుబాటు చేసుకుంటాయి. ఇవి సూర్యరశ్మిని పరావర్తనం చెందించి సరిగ్గా 260 మీటర్ల ఎత్తున్న సెంట్రల్ టవర్‌పైకి కేంద్రీకరిస్తాయి.ఆ టవర్ పైభాగంలో ఉండే రిసీవర్లో ‘ద్రవ ఉప్పు’(మొల్టెన్ సాల్ట్) ఉంటుంది. అద్దాల నుంచి వచ్చే తీవ్రమైన వేడి వల్ల ఈ ఉప్పు సుమారు 565 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.రాత్రి పూట విద్యుత్తు ఎలా సాధ్యం?ఈ ప్లాంట్‌లోని అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. పగటిపూట వేడెక్కిన ఈ ద్రవ ఉప్పును భారీ ఇన్సులేటెడ్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఈ ఉప్పు తనలోని వేడిని చాలా కాలం పాటు కోల్పోదు. సూర్యుడు లేని సమయంలో లేదా రాత్రి వేళల్లో ఈ వేడి ఉప్పును ఉపయోగించి నీటిని ఆవిరిగా మారుస్తారు. ఆ ఆవిరి ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. తద్వారా 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. ఈ టవర్ ద్వారా ఏటా సుమారు 390 మిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా సుమారు 3.5 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను దీని ద్వారా తగ్గిస్తున్నారు.China’s solar plant in Dunhuang uses 12,000 mirrors to focus sunlight onto a central tower, heating molten salt to extreme temperatures.The real magic? It stores that heat so that power can be generated even after the sun goes down. pic.twitter.com/lDq0NB8jWl— Harsh Goenka (@hvgoenka) March 24, 2026భవిష్యత్తుకు మార్గదర్శిప్రపంచం ప్రస్తుతం శిలాజ ఇంధనాల నుంచి స్వచ్ఛమైన ఇంధనం వైపు మళ్లుతోంది. బ్యాటరీ స్టోరేజ్ ఖరీదైన వ్యవహారంగా ఉన్న తరుణంలో ‘మొల్టెన్ సాల్ట్’ ద్వారా ఉష్ణాన్ని నిల్వ చేయడం అనేది అత్యంత చౌకైన, సమర్థవంతమైన మార్గం. దున్‌హువాంగ్ ప్రాజెక్టు కేవలం చైనాకే కాదు, ఎడారి ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాలకు కూడా ఒక గొప్ప అవకాశం అని కొందరు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్! -
‘గ్రేట్ ఎస్కేప్’: ఏడు శునకాల వింత కథ.. నెట్టింట వైరల్!
చాంగ్‌చున్: చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో కొందరు దొంగలు ఒక ట్రక్కులో బంధించి తీసుకెళ్తున్న ఏడు పెంపుడు శునకాలు అత్యంత చాకచక్యంగా తప్పించుకోవడమే కాకుండా.. ఏకంగా 17 కిలోమీటర్ల దూరం వరకూ కలిసి ప్రయాణించి, ఎట్టకేలకు తమ యజమానుల చెంతకు చేరాయి. ఈ ‘గ్రేట్ ఎస్కేప్’ కథ నెటిజన్ల కళ్లు చెమర్చేలా చేస్తోంది.ఈ కథలోకి వెళితే ఈ ఏడు కుక్కలు వేర్వేరు జాతులకు చెందినవి. కానీ ఇవన్నీ ఒకే గ్రామంలో కలిసి ఆడుకుంటూ స్నేహంగా మెలుగుతుంటాయి. అయితే కొందరు దొంగలు వీటిని వేర్వేరు ఇళ్ల నుంచి అపహరించి, కుక్క మాంసం విక్రయించే ముఠాకు అమ్మేందుకు ఒక ట్రక్కులోనికి ఎక్కించారు. అయితే ఆ ట్రక్కు నుంచి అవి ఎలాగోలా బయటపడ్డాయి. సాధారణంగా ఇలాంటి స్థితిలో కుక్కలు భయంతో ఎటుపడితే అటు పరుగులు తీస్తాయి. కానీ, ఇవి మాత్రం కలిసిగట్టుగా ప్రయాణం సాగించాయి. Seven dogs stolen from their owners have gone viral after escaping from an illegal transport truck and making their way home.They traveled around 17 km together, led by a corgi across highways and fields, now safely back with their respective owners..🐶🐾🥺❤️ pic.twitter.com/H5VB9BQkGB— 𝕐o̴g̴ (@Yoda4ever) March 23, 2026చాంగ్‌చువాంగ్ ఎక్స్‌ప్రెస్‌వే హైవేపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నా, ఈ ఏడు కుక్కలు ఒక సైనిక దళం మాదిరిగా క్రమశిక్షణతో నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు వాహనదారులను ఆశ్చర్యపరిచాయి. ఇక్కడ ఒక హృదయ విదారక విషయం ఏమిటంటే.. గాయపడి నడవలేకపోతున్న ఒక జర్మన్ షెపర్డ్ కుక్కను మిగిలినవి వదిలివేయలేదు. ఆ గాయపడిన ‘మిత్రుడి’ చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడగా, చిన్నదైన కోర్గి కుక్క మధ్యలో నడుస్తూ ముందుకు సాగింది. ఒకటి నెమ్మదిస్తే మిగిలినవన్నీ ఆగి, వాటికి ధైర్యం చెబుతూ, ముందుకు సాగాయి.రెండు రోజుల పాటు తిండి, నీరు లేకపోయినా పొలాలు, రోడ్లు దాటుకుంటూ దాదాపు 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో స్థానిక వాలంటీర్లు డ్రోన్ల సాయంతో వీటిని గమనిస్తూ వచ్చారు. చివరికి అవి తమ సొంత గ్రామానికి చేరుకోగానే, వాటి యజమానుల ఆనందానికి అవధులు లేవు. మృత్యువు ముఖం వరకు వెళ్లి, తిరిగి ప్రాణాలతో వచ్చిన తమ పెంపుడు జంతువులను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.ఇది కూడా చదవండి: ‘ఆంత్రోపిక్’ నుంచి మరో దిమ్మతిరిగే షాక్! -
‘ఏఐ’లో చైనా ఫస్ట్.. ప్రమాదంలో భావి భారతం
ప్రపంచమంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రం జపిస్తోంది. రేపటి ఉద్యోగాలన్నీ ఏఐ నైపుణ్యం మీదనే ఆధారపడి ఉండబోతున్నాయి. సరిగ్గా ఇదే విషయాన్ని గుర్తించిన చైనా, దేశంలోని క్లాస్‌రూమ్‌ల రూపురేఖలను మార్చేస్తోంది. కానీ భారత్ మాత్రం ఇంకా మార్కులు, ర్యాంకులు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనే పాత చింతకాయ పచ్చడి నుండి బయటపడలేకపోతోంది. ఏఐ వినియోగంలో ఈ రెండు దేశాల మధ్య నున్న అంతరం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.చైనా: ‘డబుల్ రిడక్షన్’ విప్లవం2021లో చైనా 'డబుల్ రిడక్షన్' అనే కీలక విధానాన్ని తీసుకొచ్చింది. పైకి ఇది కేవలం ప్రైవేట్ ట్యూషన్లపై ఆంక్షలు అనిపించినా, దీని వెనుక ఒక వ్యూహం ఉంది. విద్యార్థులపై హోంవర్క్ ఒత్తిడిని తగ్గించి, బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలికారు. కేవలం టాపర్లను వెతకడం కంటే, ప్రతి విద్యార్థిలో నైపుణ్యాన్ని (Capabilities) పెంచడమే లక్ష్యంగా చైనా స్కూళ్లు ముందడుగు వేస్తున్నాయి. టెక్నాలజీని కేవలం ఒక సబ్జెక్టుగా కాకుండా, సమస్యలను పరిష్కరించే ఒక సాధనంగా చైనాలో విద్యార్థులకు నేర్పిస్తున్నారు.భారత్: డిగ్రీలు సరే.. ఉద్యోగాలేవి?భారత్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఏటా మన దేశంలో దాదాపు 9 లక్షల మంది ఇంజనీర్లు డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ, వారిలో ఎంతమంది ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026’ నివేదిక ప్రకారం ప్రతి 10 మంది యువకులలో నలుగురు సరైన ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ‘మన విద్యార్థులు పరీక్షలు పాస్ అయ్యేందుకే చదువుతున్నారు తప్ప, సమస్యలను పరిష్కరించడానికి కాదు’ అని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కోచింగ్ సెంటర్ల మాయాజాలంహైదరాబాద్ నుండి రాజస్థాన్‌లోని కోట వరకు.. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను కోచింగ్ సెంటర్లే నడిపిస్తున్నాయి. ర్యాంకులు, కటాఫ్ మార్కులే విద్యార్థి తెలివితేటలకు కొలమానాలుగా మారిపోయాయి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ మారడం లేదు. ప్రభుత్వం మార్పు కోసం ప్రయత్నిస్తున్నా, క్షేత్రస్థాయిలో అమలు మాత్రం నత్తనడకన సాగుతోంది.తేడా ఎక్కడ వస్తోంది?చైనా తన విద్యార్థులను ‘రేపటి’ కోసం సిద్ధం చేస్తోంది. అక్కడి విద్య.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోంది. కానీ భారత్ ఇంకా 'నిన్నటి' పద్ధతులలోనే పరీక్షలు పెడుతోంది. చైనా మోడల్లో నియంత్రణ ఎక్కువ ఉన్నా, వారు భవిష్యత్తు సాంకేతికతపై పట్టు సాధిస్తున్నారు. మన దగ్గర పోటీ ఎక్కువ ఉన్నా, అది కేవలం ర్యాంకులకే పరిమితమవుతోంది. ఏదిఏమైనప్పటికీ మన దేశంలో విద్యా విధానాన్ని సమూలంగా మార్చాల్సిన సమయం వచ్చేసిందని నిపుణులు అంటున్నారు. కేవలం మార్కులే విజయానికి కొలమానం అనుకుంటే, భవిష్యత్తులో మన యువత గ్లోబల్ మార్కెట్లో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఇది కూడా చదవండి: బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌తో భయంకర వ్యాధి? -
సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్.. చైనా సరికొత్త ఆవిష్కరణ
ఇప్పటివరకు చాలామంది సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు గురించి వినే ఉంటారు. ఎప్పుడైనా సెల్ఫ్ డ్రైవింగ్ టూవీలర్స్ గురించి విన్నారా?, గతంలో దీనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ.. ఇప్పటివరకు ఈ తరహా స్కూటర్లు లాంచ్ కాలేదు. అయితే ఇప్పుడు చైనాకు చెందిన ఒక కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ లాంచ్ కోసం సిద్ధమైంది.చైనా కంపెనీ లాంచ్ చేయనున్న సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ టెస్టింగ్ కూడా మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్కూటర్ తనకు తానుగా ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఇది ఎలక్ట్రిక్ మోడల్ అని తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.ఆటోమొబైల్ మార్కెట్లో అగ్రగామిగా ముందుకు సాగుతున్న చైనా.. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి పూనుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే లెక్కకు మించిన కొత్త మోడల్స్ విఫణిలో లాంచ్ అవుతున్నాయి.వీడియోలో గమనించినట్లయితే.. స్కూటర్ ఎవరి సహాయం లేకుండానే ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత మరోవైపు నుంచి వచ్చినప్పుడు సైడ్ స్టాండ్ కూడా తనకు తానుగానే వేసుకోవడం కూడా స్పష్టంగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఎలాంటి మోడల్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయా?, లేదా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.🚨 China is testing self-driving electric scooters with features like auto-balance. 🙏 pic.twitter.com/tL6Bz82cYi— Indian Tech & Infra (@IndianTechGuide) March 20, 2026 -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా.. యుద్దం వేళ ట్విస్ట్!
వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్‌పై అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు అత్యంత భారీ అణు ముప్పును కలిగించే దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి అంటూ బాంబు పేల్చారు. ఇదే సమయంలో రష్యా, చైనా, ఉత్తరకొరియా, ఇరాన్ దేశాలు.. అధునాతన క్షిపణి ప్రయోగ వ్యవస్థలను చురుకుగా అభివృద్ధి చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఆయా దేశాలతో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యలు చేశారు. అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసీ గబ్బార్డ్ తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పెరుగుతున్న ప్రపంచ భద్రతా ముప్పులపై తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్బంగా తులసీ గబ్బార్డ్..‘చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు అణ్వాయుధాలు, సంప్రదాయ పేలోడ్లతో కూడిన అనేక రకాల కొత్త రకాల సాంప్రదాయ క్షిపణి ప్రయోగ వ్యవస్థలపై పరిశోధనలు చేస్తున్నారు. అలాగే, అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాకు అత్యంత భారీ అణు ముప్పును కలిగించే దేశాలలో ఇరాన్, చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్ కూడా ఒకటి. ఈ దేశాలు అమెరికాను చేరగలిగే అణు సామర్థ్యం ఉన్న క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయి. అమెరికాను వాటి పరిధిలోకి తీసుకువస్తున్నాయి’ అని సంచలన ఆరోపణలు చేశారు.టార్గెట్ అమెరికా.. అంతేకాదు, మారుతున్న భౌగోళిక రాజకీయ కూటములను హైలైట్ చేస్తూ ఉత్తర కొరియా.. రష్యా, చైనాలతో తన భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటోందని అన్నారు. ఇది అమెరికా శత్రువుల మధ్య సమన్వయ సైనిక సామర్థ్యాలపై ఆందోళనలను పెంచుతోందని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికాపై దాడి చేయగల క్షిపణుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం సుమారు 3,000 ఉండగా.. 2035 నాటికి ఈ సంఖ్య 16,000 దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.పాక్ పీఎం షరీఫ్ ఇలా.. అయితే, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రశంసలు కురిపిస్తున్న వేళ తులసీ గబ్బార్డ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కాగా, 2025లో గాజా పీస్ సమ్మిట్‌లో షరీఫ్ ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. “మ్యాన్ ఆఫ్ పీస్” అని పిలుస్తూ.. ఆయన భారత్–పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నివారించారని పేర్కొన్నారు. ఆయన ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని కూడా అన్నారు.ఇరాన్ యుద్ధంపై..మరోవైపు, ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై ఆమె స్పందిస్తూ..‘ఇరాన్‌పై అధ్యక్షుడు ట్రంప్ చర్యలను సమర్థిస్తున్నాను. గత 20 రోజులుగా భీకర దాడులు చేస్తున్నా.. సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నాయకులు, అధికారులు మరణించినా ఇరాన్ మాత్రం పోరాటం ఆపలేదు. యుద్ధంలో భారీ నష్టం జరిగినా.. ఇరాన్లో ప్రభుత్వం చెక్కుచెదరలేదు. కానీ, చాలా వరకు ఇరాన్ బలహీనపడిందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ సైనిక శక్తి తగ్గినా ఇంకా ప్రమాదకరమే’ అని ఆమె తెలిపారు. -
భారీ ఊరట : చైనాకు వెళ్లాల్సిన 7 రష్యా ట్యాంకర్లు భారత్‌వైపు
చైనాకు వెళ్లాల్సిన 7 చమురు ట్యాంకర్లు దక్షిణ చైనా సముద్రంలో యూ-టర్న్ తీసుకుని భారత్‌వైపు మళ్లడం అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కీలకంగా మారింది. రష్యా చమురు నౌకలు చైనా వైపు కాకుండా భారత్ వైపు మళ్లడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఒక కీలక పరిణామంగా భావిస్తున్నారు. మాస్కో నుండి దిగుమతులను న్యూఢిల్లీ రెట్టింపు చేయడం ప్రారంభించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.దక్షిణ చైనా సముద్రం గుండా ప్రయాణిస్తూ, మొదట చైనాకు వెళ్లాల్సిన ఏడు రష్యన్ చమురు ట్యాంకర్లు అకస్మాత్తుగా తమ మార్గాన్ని మార్చుకున్నాయి షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం, 'ఆక్వా టైటాన్' అనే ఈ నౌక, జనవరి చివరలో బాల్టిక్ సముద్ర ఓడరేవు నుండి లోడ్ చేసుకున్న యురల్స్ కార్గో మార్చి 21న న్యూ మంగళూరుకు చేరుకోనుంది. సూయజ్‌మాక్స్ జౌజౌ ఎన్. భారతదేశంలోని సిక్కాకు మార్చి 25న చేరుకుంటుందని అంచనా.రష్యా నుండి కొనుగోళ్లను తాత్కాలికంగా పెంచుకోవడానికి భారతదేశానికి అమెరికా అనుమతి ఇచ్చిన కొద్ది రోజులకే, ఈ అఫ్రామాక్స్ నౌక మార్చి మధ్యలో చైనాలోని రిజావో ఓడరేవుకు చేరాల్సి ఉంది. ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!ఎందుకిలా?రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా భారతదేశానికి 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల భారత్ ఎటువంటి ఆంక్షల భయం లేకుండా రష్యా చమురును దిగుమతి చేసుకునే అవకాశం కలిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించడంతో, ఇరాన్ ప్రతిచర్యగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేసింది. దీనివల్ల మధ్యప్రాచ్యం నుండి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ వ్యాప్తం చమురు సంక్షోభం ఏర్పడింది. ముడి చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగి, ధరలు ఒక్కసారిగా బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరుకుంది.ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఇంధన భద్రత కోసం భారత్ రష్యాపై మరింతగా ఆధారపడుతోంది.ఈ ఏడు ట్యాంకర్ల రాకతో దేశీయంగా పెరుగుతున్న చమురు ధరల నుండి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని చైనాకు వెళ్లాల్సిన వనరులు ఇప్పుడు భారత అవసరాలకు ఉపయోగపడనున్నాయని అంచనా ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు -
మరో ఐదు అగ్రదేశాల్లో యుద్ధం.. భారీగా ఎత్తున సైన్యం మోహరింపు?
బీజింగ్: ప్రపంచంలో యుద్ధాల కాలం కొనసాగుతోంది. ఇప్పటికే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఈ వరుస దాడులతో పశ్చిమాసియాలో నిప్పుల వర్షం కురుస్తున్న ఈ సమయంలో.. ఆ యుద్ధం ఆసియా దేశాల వైపు మళ్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. తైవాన్‌పై చైనా, జపాన్, దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం. ఇరాన్‌లోని ఘర్షణను పరిష్కరించేందుకు అమెరికాపై పరోక్ష ఒత్తిడి తెచ్చే ప్రయత్నమా, లేక నిజమైన దాడులకు ఈ దేశాలు సిద్ధమవుతున్నాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.చైనా ఆకాంక్షల నేపథ్యంలో తైవాన్‌పై దాడి చేయడానికి సన్నద్ధమవుతోందని తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న సమయంలోనే చైనా.. తైవాన్ను చుట్టుముట్టింది. ఇప్పటివరకు 26 చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలు తైవాన్ చుట్టూ మోహరించాయి. తైవాన్ సరిహద్దుల్లో చైనా సైన్యం ఇంత భారీ స్థాయిలో మోహరించడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడంతో ఆసియా దేశాల్లో ఆందోళనలు,భయాలు మొదలయ్యాయి. -
చైనా సాయం కోరిన ట్రంప్
గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని తెరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా సహా ఏడు దేశాల సైనిక సాయం కోరారు. ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు సురక్షితంగా సాగేందుకు యుద్ధ నౌకలను పంపాలని విజ్ఞప్తి చేశారు. సాయం అందించేందుకు వెనుకడుగు వేస్తున్న మిత్రదేశాలను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. సాయం చేయని వారిని గుర్తుంచుకుంటామని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.పట్టీపట్టనట్లున్న చైనాట్రంప్ పిలుపు విషయంలో చైనా పట్టీపట్టనట్లు ఉంది. వారి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే, హర్మూజ్ ప్రాంతంలో సైనిక చర్యలు తక్షణమే నిలిపివేయాలని బీజింగ్ కోరింది. చైనా అధికారిక స్పందన ఆధారంగా ఈ నెల చివర్లో జరగాల్సిన ట్రంప్ చైనా పర్యటన ఉండే అవకాశం ఉంది.ఆచితూచి అడుగులు వేస్తున్న ఐరోపా దేశాలుహర్ముజ్ జలసంధి విషయంలో ట్రంప్ పిలుపుపై ఐరోపా దేశాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అమెరికా అభ్యర్థనపై జాగ్రత్తగా స్పందిస్తున్నాయి. యుద్ధం యొక్క తుది లక్ష్యం ఏమిటో స్పష్టత ఇవ్వాలని జర్మనీ సహా అనేక దేశాలు అమెరికాను కోరాయి. ఈ యుద్ధంలోకి లాగబడటానికి తాము ఆసక్తిగా లేమని యుకే ప్రధాని కియార్ స్టార్మర్ స్పష్టం చేశారు. మరోవైపు రెడ్ సీలో నౌకల రక్షణ కోసం జరుగుతున్న మిషన్‌ను హర్ముజ్ వరకు విస్తరించే అంశంపై యూరోపియన్ యూనియన్ ఆలోచిస్తోన్నట్లు తెలుస్తుంది.వెనక్కు తగ్గని ఇరాన్ఇరాన్ మిసైల్ లాంచర్లలో 70 శాతం ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ, ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హిజ్బుల్లా ముప్పును ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ లెబనాన్‌లోకి అదనపు భూసేనలను పంపింది. దక్షిణ లెబనాన్‌లో జరిగిన దాడిలో ముగ్గురు మరణించారని సమాచారం. -
ఏంటీ.. రోబో అరెస్టా..
చైనాలో ఓ వృద్ధురాలిని బెదిరించినందుకుగానూఓ హ్యూమనాయిడ్ రోబోను పోలీసులు అరెస్టు చేశారు!! ఇంటర్నెట్లో ఈ వార్త రాగానే.. ఏంటి బ్రో.. రోబో అరెస్టా? అనినోరెళ్లబెట్టినోళ్లు కొందరైతే.. చైనాలో ఇంతే.. చైనాలో ఇంతే అనిసరిపుచ్చుకున్నవాళ్లు మరికొందరు. మరి.. మనమేం చేద్దాం..నిజంగా ఏం జరిగిందో తెలుసుకుందాం.. రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న 70 ఏళ్ల మహిళ ఒక్కసారిగా రోబో తన వెనుక నిల్చుని ఉండటాన్ని చూసి హడలిపోయారు. నా గుండె ఆగినంత పనైంది అంటూ తిట్టేశారు. ఆ వృద్ధురాలు రోబోను తిడుతున్నట్లు.. చేతులు పలుమార్లు గాల్లోకి లేపి రోబో ఏదో అంటున్నట్లుగా ఉన్న వీడియో వైరల్‌గా మారింది. రోబో తనను ఫాలో చేసిందని.. భయపెట్టిందని ఆ మహిళ పోలీసులకు చెప్పడంతో యూనీట్రీ జీ–1 రోబోను పోలీసులు అరెస్టు చేసే నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. భయపడటం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆస్పత్రికి పంపారు. అయితే, వైద్యులు బాగానే ఉందని అనడంతో ఆ రోబో ఆపరేటర్ మీద తాను ఎలాంటి అధికారిక ఫిర్యాదు చేయడం లేదని ఆమె పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు రోబోను ఆపరేటర్‌కు అప్పగించి.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ రోబో దగ్గర్లోని విద్యాసంస్థదట. ఆ సంస్థ ప్రమోషన్ కార్యక్రమాలకు దాన్ని వాడుతున్నారు. ఆ రోజున తన దారిలో తాను రోబో వెళ్తుండగా.. ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు రోబో ఆపరేటర్ చెప్పారు. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్టు చేయకున్నా.. ఇలా రోబోను అదుపులోకి తీసుకోవడం కూడా ఇదే తొలిసారని చెబుతున్నారు. మరోవైపు ఇంటర్నెట్లో నెటిజనులు ఎప్పట్లాగా రెండుగా విడిపోయారు. కొందరిటు.. కొందరటు చేరారు. ఇంతకీ మీరెటు? తప్పు రోబోదా? ఆ వృద్ధురాలిదా? -
రోజూ వైన్, మాంసం : షాకిస్తున్న 102 ఏళ్ల బామ్మ
తూర్పు చైనాకు చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు తన ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జీవితంపై ఆమె దృక్పథం, లైఫ్‌స్టైల్, ఫుడ్ తదితర వివరాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వందేళ్లు జీవించినవారు కఠినమైన ఆహార నియమాలు, చక్కటి జీవనశైలి, నియమ నిబద్ధతతో ఉంటారని అనుకుంటాం కదా. కానీ ఈమె అలవాట్లు అందుకు భిన్నం. ప్రస్తుతం సెంచరీ దాటేసింది తైజౌ గ్రామీణ ప్రాంతంలో నివసించే జిన్ బావోలింగ్ (Jin Baoling).సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ 102 ఏళ్ల జిన్ బావోలింగ్ కొడుకు, కోడలు మనవరాలు సహా సన్నిహిత కుటుంబ సభ్యులతో జీవిస్తోంది. వృద్ధురాలి. దీర్ఘాయువు రహస్యాలు, దినచర్యఏంటో తెలిస్తే షాకవ్వక మానరు.తైజౌ ఈవినింగ్ న్యూస్ నివేదిక ప్రకారం, వందేళ్లు నిండిన ఆమె మానసికంగా చురుగ్గా, సాధారణంగా మంచి శారీరక స్థితిలో ఉంటుంది. గత 50 ఏళ్లుగా ఆమె ఆసుపత్రి మెట్లు ఎక్కకపోవడం విశేషం.జిన్ బావోలింగ్ రోజులో దాదాపు 15 గంటలు నిద్రపోతుందట. ఉదయం 9 గంటలకు నిద్రలేచి, తన తోటలో సూర్యరశ్మిలో కూర్చుని సమయం గడుపుతుంది.గటిపూట కూడా అప్పుడప్పుడు కునుకు తీస్తుంది. రాత్రి 7 గంటలకల్లా పడుకుంటుంది. ప ఆమె ఆరోగ్యంలో ఈ విశ్రాంతి కీలక పాత్ర పోషిస్తుందని ఆమె కుమారుడు చెబుతున్నారు.ఆహారపు అలవాట్లలో మాంసాహారం ఎక్కువ, కూరగాయలు తక్కువ ఉండటం మరో విశేషం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కూరగాయలు తినాలని చెబుతుంటారు, కానీ ఈమె మాత్రం కూరగాయలను అస్సలు ఇష్టపడరు. పైగా 'పిగ్ ట్రాటర్స్' (పంది కాళ్లు) అంటే చాలా ఇష్టం. దీన్ని చైనాలో చాలా రుచికరమైనవిగా భావిస్తారు. కొల్లాజెన్‌లో సమృద్ధిగా ఉండే ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే కొన్నిసాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఉపయోగిస్తారట. జిన్ దీన్ని దాదాపు ప్రతిరోజూ తింటుంది. ఇంకా డంప్లింగ్స్, స్టీమ్డ్ బన్స్ లేదా వంటోన్స్ తోపాటు,రోజుకు మూడు ఆరెంజ్ పండ్లు, రెండు గుడ్లు తీసుకుంటారు. వీటితో పాటు కేకులు, బ్రెడ్ , బ్రౌన్ షుగర్, ఖర్జూరాలతో చేసిన టీని ఎంజాయ్ చేస్తారు. ఏమి తిన్నా అన్నీ టైం ప్రకారం తినాల్సిందే.ప్రతీ పూట మందు ఉండాల్సిందే ఆమె ఆహారంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జిన్ ప్రతీ భోజనంతో పాటు రైస్ వైన్ (బియ్యంతో చేసిన మద్యం) తాగుతుంది. ఖర్జూరాలు, లిచీ వంటి పండ్లతో నిల్వ చేసిన ప్రత్యేకమైన వైన్ ఆమె కోసం ఇంట్లోనే సిద్ధంగా ఉంటుంది.ఇంకా ఈమె కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఖర్జూరం, లాంగన్, లీచీ , యమ్బెర్రీస్, రైస్ వైన్ జాడిలు ఉంటాయి.కాళ్ళ కీళ్ళు సమస్యల కారణంగా నడిచేటప్పుడు జిన్‌కు సహాయం అవసరం కానీ 102 ఏళ్లు ఉన్నప్పటికీ ఆమె చూపు ఇంకా స్పష్టంగానే ఉంది. చేతులు కూడా వణకవు. ఖాళీ సమయంలో సాక్సులు కుట్టడం, చెప్పుల సోల్స్ రిపేర్ చేయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ చురుగ్గా ఉంటుంది. ఆమెలోని పాజిటివ్ మైండ్‌సెటే దీర్ఘాయువుకు ప్రధాన కారణం అంటారు ఆమె కుమారుడు. అలాగే ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడకుండా, మనసులో కుళ్లు,కుతంత్రాలు లేకుండా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుం దని చెప్పారు. దృఢత్వం, ఉల్లాసమైన వ్యక్తిత్వం కారణంగా, స్థానికులు ఆమెను ఆప్యాయంగా "ఓల్డ్ బేబీ" అని పిలుచుకుంటున్నారు.నెటిజన్లు స్పందనతమకు నచ్చినట్లు జీవించడమే అసలైన ఆరోగ్యం" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఆమె అలవాట్లను ప్రశంసించారు. “ఆయుర్దాయం కోసం ఉత్తమ ఔషధం ఏమిటంటే, మీరు చాలా సుఖంగా ఉండే విధంగా జీవించడం, అతిగా ఆలోచించని హృదయంతో జీవించడం.” అని ఒకరు, “అమ్మమ్మ జిన్ సుదీర్ఘ నిద్ర , చక్కటి విశ్రాంతితో యువకులను మించిపోయింది.”అని మరొకరు వ్యాఖ్యానించారు.. “ఒక వందేళ్లు దాటిన వ్యక్తి అసాధారణ ఆరోగ్య అలవాట్లతో తన సొంతనిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతున్నందుకు చాలా సంతోషం. నా తాతకు 94 సంవత్సరాలు, అతను తాగడం, ఆలస్యంగా మేల్కొని ఉండటం, ఎక్కువ పాటలు పాడటం, చెస్ ఇష్టపడతాడు.” అంటూ మరొక నెటిజన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. -
జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి..
-
బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్ , ఉబ్బితబ్బిబ్బైన యజమాని
బాల్యంలో చదువుకున్న ‘బంగారు బాతు గుడ్డు’ కథ గుర్తుందా. చైనాలోని ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం గురించి తెలుసుకుంటే మాత్రం తప్పకుండా మరోసారి గుర్తు రాక మానదు. అసలు స్టోరీ ఏంటీ అంటే. చైనాకు చెందిన ఒక కుటుంబానికి ఊహించని అదృష్టం వరించింది. తాము పెంచుకున్న బాతును విందుకోసం వధించారు. అనూహ్యంగా దాని పొట్టలో బంగారాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. దీని విలువ రూ.1.6 లక్షలు ఉంటుందని అంచనా. మెయిన్‌ల్యాండ్ మీడియా అవుట్లెట్ జిన్వెన్ఫాంగ్ నివేదించిన ప్రకారం, ఆ ముక్కలు మొత్తం 10 గ్రాముల బరువు కలిగి ఉన్నాయి. వాటి అంచనా విలువ దాదాపు 12,000 యువాన్లు, అంటే దాదాపు రూ. 1.6 లక్షలు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, ఈ సంఘటన ఫిబ్రవరిలో హునాన్ ప్రావిన్స్‌లోని లాంగ్‌హుయ్ కౌంటీలో జరిగింది. లియు అనే గ్రామస్థుడు, బాతును వధించిన తర్వాత దానిని శుభ్రం చేస్తున్నప్పుడు చిన్న చిన్న బంగారు ముక్కల్ని గమనించాడు. దీంతో ఇది నిజంగా బంగారమేనా అని నిర్ధారించుకునేందుకు, ఇంట్లోనే బర్నింగ్ టెస్ట్ నిర్వహించాడు. నిజమైన బంగారమే అని తెలిసి సంతోషంగా ఉబ్బితబ్బిబ్బైనాడు. రాబోయే అదృష్టానికి సంకేతంగా లియు తండ్రి అభిప్రాయపడగా, ఇది కొత్తేమీ కాదనీ, ఇంత పెద్ద మొత్తంలో లభించడం మాత్రం ఇదే తొలిసారని కొడుకు లియూ చెప్పాడు.(రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్)అయితే బాతులు, ఇతర పక్షులు ఆహారం తీసుకునేటప్పుడు చిన్న రాళ్ళు, ఇసుక లేదా గ్రిట్ మింగడం చాలా కామన్. అలా ఒకప్పుడు బంగారు తవ్వకాలతో ముడిపడి ఉన్న నది దగ్గర ఆహారం తీసుకుంటుండగా ఈ బాతు పొట్టలోకి బంగారం చేరి ఉంటుందని విశ్వసిస్తున్నారు.అ యితే ప్రస్తుతం బాతు పొట్టలో దొరికిన బంగారం ఎవరిది అని నిర్ణయించడం కష్టమంటున్నారు అధికారులు. 1970-1990ల మధ్య కాలంలో, ఈ నది దగ్గర బంగారం కోసం వేట చాలా జోరుగా సాగేది. అయితే, తరువాత ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రైవేట్ బంగారు తవ్వకాలను నిషేధించింది.ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య -
ఇరాన్ కి అండగా రష్యా, చైనా సూసైడ్ డ్రోన్స్ వెనుక వ్యూహం ఏంటి?
-
ఇక చాలు ఆపేయండి... యుద్ధంపై చైనా కీలక ప్రకటన
-
‘ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు ఓటమి ఖాయం’.. కారణాలివే..
బీజింగ్: ప్రముఖ చైనీస్-కెనడియన్ విద్యావేత్త, జియోపాలిటికల్ విశ్లేషకుడు షూఏచిన్ జియాంగ్ (Xueqin Jiang) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన ప్రకారం, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌పై కొనసాగుతున్నప్పటికీ, ఈ యుద్ధంలో అమెరికా ఓటమి తప్పదని అంచనా వేశారు.జియాంగ్ ‘ప్రిడిక్టివ్ హిస్టరీ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ, గేమ్ థియరీ ఆధారంగా జియోపాలిటికల్ విశ్లేషణలు చేస్తుంటారు. ఇటీవల విడుదల చేసిన వీడియోలో, అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ప్రాచీన గ్రీకు చరిత్రలోని అథెన్స్ సిసిలీ యాత్రతో పోల్చారు. ఆయన అభిప్రాయం ప్రకారం, అధిక ఖర్చులు, వ్యూహపరమైన తప్పిదాలు కారణంగా అమెరికా ఈ యుద్ధంలో ఓడిపోతుందని చెప్పారు.1976లో చైనాలో జన్మించిన జియాంగ్, యేల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం బీజింగ్‌లోని మూన్‌షాట్ అకాడమీలో చరిత్ర, తత్వశాస్త్రం బోధిస్తున్నారు. విద్యా రంగంలో ఆయన చేసిన సంస్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించే ప్రయత్నాలు ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. 2024లో ఆయన ఇచ్చిన ఒక లెక్చర్‌లో, అమెరికా-ఇరాన్ యుద్ధం తప్పనిసరిగా జరుగుతుందని, అది అథెన్స్ సిసిలీ యాత్ర లాంటి ఘోర పరాజయానికి దారితీస్తుందని చెప్పారు. ఆయన అంచనాలు ఇప్పటివరకు నిజమవుతున్నందున, ప్రపంచవ్యాప్తంగా ఆయనను చైనాకు చెందిన నోస్ట్రాడమస్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, జియాంగ్ చేసిన విశ్లేషణలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చరిత్ర ఆధారంగా భవిష్యత్తు అంచనా వేసే ఆయన విధానం, గేమ్ థియరీ వినియోగం, జియోపాలిటికల్ విశ్లేషణలు అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి, షూఏచిన్ జియాంగ్ ఒక విద్యావేత్త మాత్రమే కాకుండా, చరిత్రను ఆధారంగా చేసుకుని భవిష్యత్తు అంచనా వేసే విశ్లేషకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. -
ఇరాన్ దాడుల వెనుక చైనా రహస్య సాయం!
టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తమ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారని పేర్కొన్న తర్వాత పశ్చిమాసియాలోని లక్ష్యాలపై ఇరాన్ భీకరంగా దాడులు చేస్తోంది. ఇరాన్ దాడులు కొనసాగిస్తున్న తీరును చూస్తే ఆ దేశం వద్ద అతి భారీగా క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంత భారీ ఎత్తున ఇరాన్ దాడులు చేస్తుండడానికి కారణం దశాబ్దాలుగా ఆ దేశం నిర్మించుకున్న ఆయుధాగారం. ఇరాన్ ఇంతగా క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని పెంచుకోవడం వెనుక చైనా ఉందా? డ్రాగన్ దేశం ఆయుధాలు సరఫరా చేసిందా? సాంకేతిక సాయం అందించిందా?ఇరాన్ ఆయుధాలు కేవలం ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులనే కాదు.. యూఏఈ, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా సహా దాదాపు 10 దేశాల్లోని లక్ష్యాలను తాకాయి. దీంతో ఇరాన్ పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లను నిల్వ చేసుకుందన్న విషయం స్పష్టమవుతోంది. షాహీద్ క్లాస్ కమికాజే డ్రోన్లు, ఫత్తాహ్ క్లాస్ హైపర్సోనిక్ క్షిపణులు వంటివి ఇరాన్ భద్రతా వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఈ ఆయుధాగార అభివృద్ధిలో చైనా పాత్ర గురించి బయటకు వివరాలు అంతగా తెలియవు.ఓ అంతర్జాతీయ పత్రిక తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు వివరాలను వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు ఇరాన్‌కు చైనా ఆయుధాలు అందించిందని వివరించింది. చైనా తయారీ సీఎం302 యాంటీ షిప్ క్షిపణుల కొనుగోలుపై ఇరాన్-చైనా ఒప్పందం కూడా చేసుకోవాలనుకున్నాయి.ఇరాన్ ప్రస్తుత ఆయుధాగారంలో అధిక శాతం స్వదేశీ ఉత్పత్తులే ఉన్నప్పటికీ, వాటిలో అనేక సిస్టమ్స్ చైనా పాత మోడళ్ల ఆధారితంగా ఉన్నాయని లేదంటే చైనా తయారీ భాగాలపై ఆధారపడి వాటిని ఇరాన్ తయారు చేసినట్లుందని విశ్లేషకులు చెప్పారు. ఈ విధంగా దశాబ్దాలుగా ఇరాన్ ఆయుధాగార నిర్మాణంలో చైనా పాత్ర ఉంది. చైనా నుంచి పెద్ద ఎత్తున సాయం అందకుండా ఇరాన్ ఈ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని సాధించలేదని అంతర్జాతీయ నిపుణులు అన్నారు.1979 నుంచే ఆయుధాల సరఫరా షురూ..ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో 1979-1989 మధ్య ఇరాన్ మొదటిసారి చైనా నుంచి ఆయుధాలు పొందింది. పశ్చిమ దేశాలు విధించిన ఆయుధ నిషేధాల మధ్య, 1986లో హై-2, సీ-801 యాంటీ షిప్ వ్యవస్థలను కూడా చైనా సరఫరా చేసింది. స్టాక్‌హోమ్ పీస్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. ఇరాన్‌కు చైనా అతిపెద్ద ఆయుధ సరఫరాదారుల్లో ఒకటి. విమానాలు, క్షిపణులు, తుపాకీ వ్యవస్థలు సహా రక్షణ పరికరాలను అందించింది.అయితే, 2005 సెప్టెంబర్‌లో ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం పాటించలేదని పేర్కొనడంతో చైనా ప్రత్యక్ష ఆయుధ విక్రయాలు ఆపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా అణ్వాయుధాలకు సంబంధించిన సాంకేతిక వస్తువుల ఎగుమతి దిగుమతిపై నిషేధం అమలైంది. అమెరికా ఆంక్షలు చైనా ఆయుధ విక్రయాలను మరింత నియంత్రించాయి. అమెరికా ఆంక్షలు ఉన్న దేశాలకు చైనా సాధారణంగా ఆయుధాలు విక్రయించదు.చైనా ఇంకా ఎలా సాయపడింది?ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల నిల్వలు, ఫత్తాహ్ బాలిస్టిక్ క్షిపణులు, షాహీద్ కమికాజే డ్రోన్లలో అధిక శాతం ఇరాన్ స్వదేశీ పరిశోధన ఫలితాల ఆధారంగా అభివృద్ధి చేసుకుంది. నూర్, ఖద్ర్, నస్ర్ క్లాసెస్, సీ-802 వంటివి చైనా సిస్టమ్స్ ఆధారంగా ఇరాన్ ఉత్పత్తి చేసుకుంది.అయినా చైనా ప్రత్యక్ష విక్రయాలకన్నా ద్వంద్వ వినియోగ (డ్యూయల్ యూజ్) భాగాలు సరఫరా చేస్తోంది. మైక్రోచిప్స్, ఎలక్ట్రానిక్ భాగాలు, నావిగేషన్ వ్యవస్థలు వంటి పౌర వినియోగ వస్తువులు సైనిక పరికరాల్లో అమర్చవచ్చు. ద్వంద్వ వినియోగ సాంకేతికత అంటే పౌర ప్రయోజనాలకూ, సైనిక ప్రయోజనాలకూ ఉపయోగపడే సాంకేతిక భాగాలు.క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ ప్రోగ్రామ్స్‌పై చైనా ప్రోపెల్లెంట్లు, ఎలక్ట్రానిక్ భాగాలు అందించింది. ప్రోపెల్లెంట్ అంటే క్షిపణి నడిపే ఇంధన పదార్థం. 1990 దశక ప్రారంభం నుంచి చైనా బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధిలో నైపుణ్యం, సాంకేతికత, భాగాలు, శిక్షణను ఇరాన్‌కు అందించింది.అలాగే, ఇరాన్‌కు చైనా సోడియం పెర్క్లోరేట్ సరఫరా చేసింది. ఇది అమోనియం పెర్క్లోరేట్ తయారీలో ఉపయోగపడుతుంది. అమోనియం పెర్క్లోరేట్ అంటే ఘన ఇంధన క్షిపణుల ప్రధాన పదార్థం. 2023 మార్చిలో అమెరికా ఖజానా శాఖ, వేల ఏరోస్పేస్ భాగాలు ఇరాన్ ఎయిర్‌క్రాఫ్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ కంపెనీకి విక్రయించారని ఆరోపిస్తూ చైనా, హాంకాంగ్ కేంద్రంగా ఉన్న 5 కంపెనీలు, ఒక వ్యక్తిని ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చింది. ప్రతిగా ఇరాన్ చమురును చైనా విస్తారంగా దిగుమతి చేసుకుంటోంది. -
భారత్ గ్లోబల్ పవర్‌గా ఎదగకుండా చేయడానికే..: ఖమేనీ ప్రతినిధి
న్యూఢిల్లీ: భారత్‌తో పాటు చైనాను గ్లోబల్ పవర్స్‌గా ఎదగకుండా చేయడానికే తమ దేశంతో అమెరికా ఘర్షణలకు దిగుతోందని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి (ఖమేనీ ప్రతినిధి) అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో అబ్దుల్ మజీద్ ఇవాళ ఢిల్లీలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయం నుంచి భారత్‌కు ప్రత్యేక ప్రతినిధిగా అబ్దుల్ మజీద్ ఉన్నారు.అమెరికా అగ్రరాజ్య హోదాను నిలుపుకోవడానికి ప్రపంచ ఘర్షణలను ప్రోత్సహిస్తోందని అబ్దుల్ మజీద్ ఆరోపించారు. “సమీప భవిష్యత్తులో ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాలుగా భారత్, చైనా, రష్యా, అమెరికా ఉంటాయి. అయితే, భారత్ లేదా చైనా తనతో పాటు సమాన శక్తులుగా ఎదగడాన్ని అమెరికా జీర్ణించుకోదు. అందుకే దీన్ని అడ్డుకోవడానికి ఈ యుద్ధాలను ప్రేరేపించి అమెరికా తన ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటోంది” అని అబ్దుల్ మజీద్ చెప్పారు.అమెరికా ప్రారంభించిన యుద్ధమిది..ఈ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్ అని, ఇరాన్ కాదని అబ్దుల్ మజీద్ తెలిపారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నుంచి తమ దేశం తనను తాను రక్షించుకుంటోందని ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజానీ కూడా ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. “మాపై దాడి చేసి మా పౌరులపై బాంబులు వేస్తున్నారు. మేము కేవలం మమ్మల్ని మేము రక్షించుకుంటున్నాం” అని చెప్పారు. యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికానే కాబట్టి దానిని ముగించాల్సింది కూడా ఆ దేశమేనని అబ్దుల్ మజీద్ తెలిపారు. వారు ఆపితే తాము కూడా ఆపుతామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: భారత్‌కు మరో ఐదు ఎస్-400లు.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..ఇరాన్ రెండు యుద్ధాలు ఎదుర్కొంటోందని అబ్దుల్ మజీద్ తెలిపారు. ఒకటి అమెరికా, ఇజ్రాయెల్‌తో సైనిక ఘర్షణ, మరొకటి నకిలీ వార్తల యుద్ధం అని అన్నారు. “అమెరికా, ఇజ్రాయెల్‌పై సైనిక యుద్ధాన్ని మేము ఎదుర్కోగలం. అయితే దీనికంటే పెద్ద మరో యుద్ధం జరుగుతోంది. అదే నకిలీ కథనాల యుద్ధం. ఈ యుద్ధంలో వారు నకిలీ వార్తలు సృష్టిస్తారు. ఇరాన్ ప్రజలు పాలన మార్పు కోరుకుంటున్నారని చెబుతారు” అని ఆయన అన్నారు. మొత్తానికి ఇతర దేశాల ఎదుగుదలను అడ్డుకోవడమే అమెరికా లక్ష్యమని, తద్వారా వాషింగ్టన్కు తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందని చెప్పారు. -
ఇరాన్‌ను కాపాడుకుంటాం చైనా కీలక ప్రకటన..
-
అమెరికాకు చైనా చెక్ పెట్టాలా
-
ఇరాన్‌పై ఇజ్రాయెల్,అమెరికా దాడులు..యుద్ధంలోకి చైనా ఎంట్రీ?
బీజింగ్: ఇరాన్‌పై ఇజ్రాయెల్,అమెరికా దాడుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌కు మద్దతుగా చైనా గళం విప్పింది. ఇరాన్‌కు మద్దతుగా అమెరికా,ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు చైనా సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇరాన్ సార్వభౌమాదికారాన్ని కాపాడతామని చైనా హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తక్షణమే ఆపాలని డిమాండ్ చేసింది. -
నాలుగో రోజుకు చేరుకున్న యుద్ధం.. వార్‌లోకి చైనా ఎంట్రీ..!
-
చందమామ చిక్కేదెవరికి?
దశాబ్దాల తర్వాత జాబిల్లిపై అమెరికా దృష్టిసారించిన మరుక్షణమే చైనా సైతం తన అంతరిక్ష పరిశోధనలకు చందమామను కేంద్రస్థానంగా మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రాకెట్లు, వ్యోమనౌకలు, ల్యాండర్లతో రంగంలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది. 2028కల్లా చంద్రునిపై ‘ఆర్టిమిస్ ప్రోగ్రామ్’ద్వారా మానవసహిత ప్రయోగాలను పునరుద్ధరించాలని అమెరికా ప్రణాళికలు రచించింది. ప్రతిరంగంలో అమెరికాతో పోల్చుకుని ఆ దిశగా పావులు కదిపే చైనా ఇప్పుడు శాస్త్ర పరిశోధనలు, అంతరిక్ష వనరులు, దేశ ప్రయోజనాలే పరమావధిగా ముందడుగు వేస్తోంది. దీంతో ఒక్కసారిగా చంద్రుని కేంద్రంగా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల పోటీకి తెరలేచింది. చైనా ఎలా సంసిద్ధమవుతోంది? మానవసహిత ప్రయాణాలు సాధ్యమయ్యేలా అత్యంత శక్తివంతమైన లాంగ్ మార్చ్–10 రాకెట్‌ను చైనా అభివృద్ధి చేస్తోంది. దీనికి సంబంధించిన తక్కువ కాలానికి ఇంజిన్‌ను పూర్తి లేదా పాక్షిక సామర్థ్యంతో మండించడం(క్రిటికల్ స్టాటిక్ ఫైర్), ప్రయోగశాలలో రాకెట్ సామర్థ్యాన్ని పరీక్షించడం(లో ఆలి్టట్యూట్ డెమోన్‌్రస్టేషన్ టెస్ట్)లను విజయవంతంగా పూర్తిచేసింది. వ్యోమగాములను మోసుకెళ్లే పునర్ వినియోగ క్యాప్సూ్యల్ ‘ది మెంగ్జోయూ’ను చైనా పరీక్షిస్తోంది. ఈ క్యాపూŠస్ల్తో డైనమిక్ ప్రెషర్ విధానంలో వ్యోమగాములు తప్పించుకునే టెస్ట్‌ను విజయవంతంగా పరీక్షించింది. ప్రయోగవేదిక నుంచి వ్యోమనౌక గాల్లోకి లేచేటప్పుడు హఠాత్తుగా అగ్నిప్రమాదం లాంటివి జరిగితే వ్యోమగాములు తప్పించుకునే మ్యాక్స్ క్యూ అబోర్ట్ టెస్ట్‌నూ విజయవంతంగా పరీక్షించింది. చైనా వ్యోమగాములు(టైకోనాట్స్)ను చందమామ ఉపరితలం మీదకు తీసుకెళ్లే తిరిగి కక్ష్యలోకి తీసుకొచ్చే ‘ది లాన్యే లూనార్’ల్యాండర్నూ చైనా పరీక్షిస్తోంది. లాన్యే అంటే చందమామను హత్తుకోవడం. ఈ పదాన్ని మావో జెడాంగ్ తన కవితలో తొలిసారిగా ఉపయోగించారు. సిముల్యేషన్ సమయంలో ఈ ల్యాండర్.. ల్యాండింగ్, టేకాఫ్‌లను అత్యంత ఖచ్చితత్వంతో పూర్తిచేసిందని చైనా ఇటీవలే ప్రకటించింది. చందమామపైకి లాంగ్ మార్చ్–10 రాకెట్ పలు మార్లు ప్రయోగాలకు అనువుగా ప్రయోగవేదికలను విస్తరిస్తున్నారు. లాంచ్ప్యాడ్లు, ట్రాకింగ్ స్టేషన్లు, అనుబంధ భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో హైనాన్లోని వెన్చాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్సైట్లో నిర్మాణపనులు వేగవంతమయ్యాయి. వ్యోమగా ములతో కూడిన డీప్–స్పేస్ ఆపరేషన్ల కోసం ఇతర కీలక వసతులను అందుబాటులోకి తెస్తున్నారు.చందమామ మీదకు వెళ్లేది ఎప్పుడు? మరో నాలుగేళ్లలో తొలి వ్యోమగాముల బృందాన్ని చందమామ మీద దింపాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు సంబంధించిన పనులన్నీ షెడ్యూల్ ప్రకారం చకచకా జరుగుతున్నాయని ‘ది చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ’ప్రకటించింది. ‘‘ప్రయోగ పరీక్షలు అన్నీ విజయవంతమవుతూ, మౌలికసదుపాయాల కల్పన పూర్తవుతూ లక్ష్యాన్ని చేరువచేస్తున్నాయి. అంతరిక్ష చరిత్రలో సరికొత్త మైలురాయిని త్వరలో చేరుకోబోతున్నాం’’అని స్పేస్ ఏజెన్సీ పేర్కొంది.ఈ ఏడాది బిజీబిజీ.. 2026లో బిజీ షెడ్యూల్‌తో చైనా దూసుకుపోతోంది. సొంతంగా నిర్మించుకున్న అంతరిక్ష కేంద్రం ‘తియాన్‌గాంగ్ స్పేస్ స్టేషన్’కు రెండు సార్లు వ్యోమగాములను పంపనుంది. సరకులను పంపేందుకు ఒక ప్రయోగం చేయనుంది. ఒక టైకోనాట్ను ఒక పూర్తి ఏడాదికాలం అక్కడే ఉంచనుంది. తద్వారా సుదీర్ఘకాలంపాటు అంతరిక్షంలో ఉంటే ఎలాంటి అనారోగ్యపరిస్థితులను ఎదుర్కోవాల్సి రావొచ్చు? అనే అంశంపై అధ్యయనంచేయనుంది. కొత్త మాడ్యూళ్లను తీసుకెళ్లేందుకు హాంకాంగ్, మకావూ నుంచి ఇద్దరు టైకోనాట్స్ను అంతరిక్ష కేంద్రానికి పంపనుంది. పాకిస్తాన్ వంటి అంతర్జాతీయ భాగస్వామ్య దేశాల వ్యోమగాములకు చైనా స్పేస్‌స్టేషన్ స్వాగతం పలకనుంది. నాసా మిషన్‌లో వచి్చన మార్పులేంటి? 2027లో దిగువ కక్ష్యలో తొలుత ఒక వ్యోమనౌకను ప్రయోగించనుంది. వాణిజ్య లాం్యడర్లతో అనుసంధానం కోసం రిహార్సల్ చేయనుంది. ఈ కమర్షియల్ ల్యాండర్లను స్పేస్ఎక్స్, బ్లూ ఆరిజిన్ సంస్థలు రూపొందిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఆర్టిమిస్–2 ప్రాజెక్ట్‌ను అమెరికా చేపట్టనుంది. వ్యోమగాములతో బయల్దేరే వ్యోమనౌక చంద్రుని సమీప కక్ష్యలోకి వెళ్లి అక్కడి నుంచి జాబిలి సమాచారాన్ని సేకరిస్తుంది. చంద్రుని స్వల్ప గురుత్వాకర్షణ శక్తినే వడిసెలా వాడుకుని తిరిగి భూమి దిశలో పయనించనుంది. 2027లో ఆర్టిమిస్–3 ఆ తర్వాత 2028లో ఆర్టిమిస్–4ను అమలుచేయనుంది. మళ్లీ చందమామపై దృష్టి ఎందుకు సారించారు? చంద్రుని దక్షిణ ధృవంలోని బిలాల్లో ఘనరూప నీరు ఉందని తాజా పరిశోధనలు బలంగా చెబుతున్నాయి. ఈ నీటిని ఉపయోగించుకుని అక్కడ వ్యోమగాముల కోసం స్థిరనివాసాలు ఏర్పాటుచేయాలని అమెరికా భావిస్తోంది. అక్కడి నుంచి అంతరిక్ష ప్రయోగాలు చేయాలని ఆశిస్తోంది. అరుణ గ్రహంపై యాత్రకు జాబిలిని మజిలీగా మార్చుకోవాలని భావిస్తున్నారు. హీలియం–3 అనే అరుదైన ఐసోటోప్ చందమామపై సమృద్దిగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వ్యోమగాములు అక్కడ స్థిరపడ్డాక ఈ ఐసోటోప్‌తో కేంద్రక సంలీన చర్య ద్వారా నిరంతరాయంగా కరెంట్‌ను ఉత్పత్తిచేసి విద్యుత్ అవసరాలను తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఇరాన్ కొంప ముంచిన చైనా
టెహ్రాన్: అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల వేళ చైనా..ఇరాన్ కొంప ముంచింది. అణు చర్చల తర్వాత ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడులకు తెగబడ్డాయి. ప్రతి చర్యగా ఇరాన్ ఇటీవల చైనా నుంచి తెచ్చుకున్న హెచ్-9బీ (HQ-9B)ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (SAM) వ్యవస్థను ఉపయోగించింది. అయితే, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విఫలమైంది. తద్వారా ఇరాన్లో భారీ ఆస్తినష్టం, ప్రాణం నష్టం జరిగినట్లు సమాచారం.ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది క్షిపణుల ఆధారిత రక్షణ కవచం. నేల మీద గాని, నౌకల మీద గాని ఏర్పాటు చేసి, ప్రత్యర్థి విమానాలు లేదా క్షిపణులను గగనతలంలోనే కూల్చివేయడం దీని పని. ఇరాన్ శత్రు దేశాల నుంచి సురక్షితంగా ఉండేలా చైనా నుంచి ఆయిల్ ఫర్ వెపన్ ఒప్పందం కింద హెచ్‌క్యూ-9బీని తెచ్చుకుంది. గతేడాది ఇజ్రాయెల్ దాడుల సమయంలో రష్యా తయారు చేసిన ఎస్-300పీఎంయూ-2 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరిగా పనిచేయలేదు. అందుకు అప్‌గ్రేడ్‌గా ఈసారి రష్యా నుంచి కాకుండా చైనా నుంచి ఎయిర్ డిఫెన్స్ దిగుమతి చేసుకుంది. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల వేళ ఇరాన్ హెచ్‌క్యూ-9బీని ఉపయోగించింది. కానీ ఇప్పుడు ఈ కొత్త వ్యవస్థ విఫలమైంది.ఇరాన్లో నాటంజ్ అణు కేంద్రం,ఫోర్డో ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ, ఐఆర్సీజీ మిసైల్,యూఏవీ బేస్‌లు, అలాగే టెహ్రాన్, ఇస్ఫహాన్ సమీపంలో ఎయిర్‌బేసులు ఉన్నాయి. ఆ ఎయిర్‌బేస్‌లపై శత్రు దాడుల నుంచి రక్షించేలా హెచ్-9బీ ఎయిర్ డిఫెన్స్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎస్-300పీఎంయూ-2, బావర్-373, ఖోర్దాద్-15,రాద్, టోర్-ఎం2, పాంటిసిర్-ఎస్1 వంటి ఇతర రక్షణ వ్యవస్థల్ని మోహరించింది. అయితే అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అణుకేంద్రాలను రక్షించడంలో హెచ్‌క్యూ-9బీ ఆధారిత రక్షణ పూర్తిగా విఫలమైంది. 31 ప్రావిన్స్‌లో 20కి పైగా ప్రాంతాలు అమెరికా,ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్ర ప్రభావితమయ్యాయి. ఒక్క ఇరాన్ మాత్రమే కాదు..గతంలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్ సిందూర్‌ను తిప్పికొట్టేలా చైనా నుంచి పాకిస్థాన్ తెచ్చుకున్న హెచ్‌క్యూ-9బీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తేలిపోయింది. ఇప్పుడు ఇరాన్లో సైతం చైనా డిఫెన్స్ ఎయిర్ సిస్టం విఫలం కావడంతో ప్రపంచ దేశాల ఎదుట చైనా భంగపాటుకు గురైంది. -
వదిలిపెట్టేది లేదు... చైనా, టర్కీ నుంచి ఇరాన్‌కు ఆయుధాలు


