ఫేస్‌బుక్ జనాభా
పిన్న వయస్కుల ఖండం
రోజురోజుకి సోషల్ మీడియాలో అకౌంట్ యాక్టివ్ కొత్త లాగిన్‌లు అధికంగా పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం.. జనాభా పెరుగుదలకన్నా అకౌంట్ లాగిన్‌ల పెరుగుదలే ఎక్కువ. దీని ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, షేర్‌చాట్, యూట్యూబ్, ట్విట్టర్ లాగిన్‌ల సంఖ్య చూసినట్లయితే... ఫేస్‌బుక్ ముందు స్థానంలో ఉంది.
ఫేస్‌బుక్ జనాభా.. చైనా, భారత్ కంటే ఎక్కువ!
మీకో విచిత్రమైన నిజం తెలుసా? ఒకవేళ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ గనుక ఒక దేశం అయితే, అదే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అవుతుంది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ను ప్రతి నెలా వాడే యాక్టివ్ యూజర్ల సంఖ్య దాదాపు 300 కోట్లకు పైమాటే! భారతదేశం, చైనా దేశాల ఉమ్మడి జనాభా కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ.
అత్యంత పిన్న వయస్కుల ఖండం.. ఆఫ్రికా..!
ప్రపంచంలోనే అత్యంత వేగంగా జనాభా పెరుగుతున్న ప్రాంతం ఆఫ్రికా ఖండం. ఇక్కడి సగటు వయస్సు కేవలం 19 ఏళ్లు మాత్రమే. రాబోయే 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పుట్టబోయే పిల్లల్లో సగానికి పైగా ఆఫ్రికాలోనే జన్మిస్తారని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. దీనికి భిన్నంగా యూరప్ ఖండంలో సగటు వయస్సు 43 ఏళ్లుగా ఉంది.


