జనాభా.. జగమెరుగని సత్యాలు | World Population Day: Consequences Of Population Growth | Sakshi
Sakshi News home page

జనాభా.. జగమెరుగని సత్యాలు

Jul 11 2026 9:08 AM | Updated on Jul 11 2026 9:08 AM

World Population Day: Consequences Of Population Growth

ప్రపంచ జనాభా దినోత్సవం

ప్రతి ఏటా జూలై 11న ప్రపంచవ్యాప్తంగా ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ నిర్వహిస్తారు. జనాభా పెరుగుదల వల్ల కలిగే పరిణామాలు, వనరుల కొరత, లింగ సమానత్వం, మానవ హక్కులపై అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ఈ రోజును కేటాయించింది.

– మొదటి ‘వంద కోట్లు’ చేరడానికి లక్షల ఏళ్లు!
మానవ చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ జనాభా మొదటి 100 కోట్లకు చేరడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది (దాదాపు క్రీ.శ. 1804 లో). కానీ, ఆ తర్వాత కేవలం 200 ఏళ్లలోనే ఆ సంఖ్య ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగిపోవడం విశేషం!

– 830 కోట్లు
గణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జనాభా 830 కోట్లు దాటి దూసుకుపోతోంది.  2022 నవంబర్‌ నాటికి మనం 800 కోట్ల మార్కును దాటగా, కేవలం ఈ నాలుగేళ్లలోనే జనాభా ఎంత వేగంగా పెరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

– 1000 కోట్లకు ఎప్పుడు చేరుతాం?
ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం.. ప్రపంచ జనాభా 2030 నాటికి 850 కోట్లకు, అలాగే 2050 నాటికి 970 కోట్లకు చేరుకుంటుంది. ఇక 2080 నాటికి ప్రపంచ జనాభా గరిష్టంగా 1030 కోట్లకు చేరి, ఆ తర్వాత స్థిరంగా ఉండిపోతుందని లేదా క్రమంగా తగ్గుముఖం పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

– సెకనుకు నలుగురు
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు సగటున నలుగురు పిల్లలు జన్మిస్తుంటే, ఇద్దరు మరణిస్తున్నారు. అంటే ప్రతి సెకనుకు ఇద్దరు చొప్పున ప్రపంచ జనాభాకు అదనంగా చేరుతున్నారు. ఈ లెక్కన రోజుకు దాదాపు 2 లక్షల మందికి పైగా కొత్తగా భూమిపైకి వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement