breaking news
Login online
-
‘పాస్వర్డ్ సరైందే! ఎందుకు లాగిన్ అవ్వట్లేదు’
బ్యాంక్, ఆఫీస్ పోర్టళ్లు, జాబ్ కోసం దరఖాస్తులు వంటి ఇతర ముఖ్యమైన వెబ్‌సైట్‌ల్లో చాలామంది లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు కొత్తగా క్రియేట్ చేసుకుంటుంటారు. కానీ తిరిగి లాగిన్ చేయాలంటే మాత్రం సైన్ఇన్ ఇవ్వొదు. ‘అదేంటి సరిగ్గానే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నానే.. ఎందుకు అవ్వట్లేదు’ అనే అనుమానం వస్తుంది. దాంతో తిరికి ఫర్గాట్ పాస్ట్‌వర్డ్ అప్షన్కు వెళ్లాల్సి వస్తుంది. అందులోనూ కొన్ని సైట్లు పాత పాస్వర్డ్లు ఎంటర్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది.ఏవీ చూసుకోకుండా లాగిన్ చేస్తే..లాగిన్ పోర్టల్‌లో ఐడీ ఎంటర్ చేసేప్పుడు సదరు బ్లాక్‌లో ఎంటర్ చేసే అక్షరాలు యూజర్‌కు కనిపిస్తాయి. కానీ పాస్వర్డ్ ఎంటర్ చేసేప్పుడు మాత్రం సెక్యూరిటీ కారణాల వల్ల డాట్లు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అప్పర్‌కేస్, లోయర్ కేస్ ఇంగ్లీష్ అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్లు, క్యాప్స్‌లాక్ ఆన్ అవుతుంది. అవేవీ చూసుకోకుండా లాగిన్ చేస్తే అప్పటివరకు లాగిన్ అవుతుంది. కానీ లాగవుట్ చేసి తిరిగి లాగిన్ చేస్తే సైన్ఇన్ అవ్వదు. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో టెక్ నిపుణులు సూచిస్తున్నారు.చెక్ చేయాల్సిందే..ఆన్లైన్లో ఖాతాలు ఓపెన్ చేసేప్పుడు లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు టైప్ చేయాల్సి వస్తుంది. ఐడీ బ్లాక్‌లో అక్షరాలు యూజర్‌కు కనిపిస్తాయి. కానీ పాస్వర్డ్ బ్లాక్‌లో ఎంటర్ చేసే అక్షరాలు కనిపించవు. బదులుగా డాట్స్ పడుతుంటాయి. ఆ సమయంలో ఒకవేళ కంప్యూటర్ ద్వారా సైన్ఇన్ అవుతుంటే నోట్పాడ్ ఓపెన్ చేసి అందులో ముందుగా పాస్వర్డ్ టైప్‌చేసి, ఎంటర్ చేయాల్సిన అన్ని అక్షరాలు సరిగ్గా పడుతున్నాయా? లేదా ఏదైనా బటన్ సమస్యలు, లేదా కేస్ సెన్సిటివ్ అక్షరాలు టైప్ అవుతున్నాయా చెక్ చేసుకోవాలి. తర్వాత పాస్వర్డ్ బ్లాక్‌లో ఎంటర్ చేయడంతో సమస్య ఉండదు.ఇదీ చదవండి: ఏఐ ఉండగా ఉద్యోగాలొస్తాయా?మొబైల్లో ఇలా..మొబైల్లో సైనప్ అవుతుంటే మాత్రం నోట్స్‌లో రాసుకోవచ్చు. దాంతోపాటు వెర్టికల్ వ్యూలో అక్షరాలు చిన్నగా ఉంటాయి. కాబట్టి పొరపాటున ఒక అక్షరం నొక్కితే పక్కన ఉన్న లెటర్లు ప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి పరిష్కారంగా మొబైల్లో స్క్రీన్ రొటేట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఉపయోగించి ఫోన్ రొటేట్ చేస్తే కీబోర్డ్ పెద్దగా కనిపిస్తుంది. మరింత స్పష్టంగా, ఎంటర్ చేయాలనుకునే పాస్వర్డ్ సదరు బ్లాక్‌లో ఇవ్వొచ్చు. -
పింఛన్లకు కొర్రీ
సాక్షి, భీమవరం : పింఛన్ల పంపిణీలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో కొర్రీ పెట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదు రోజుల లాగిన్ గడువును ప్రస్తుత ప్రభుత్వం రెండ్రోజులకు కుదించేసింది. దీంతో తర్వాత వచ్చిన వారికి సాయం అందకుండా చేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు అందలేదని అంచనా. జూలై నెలకుగాను రాష్ట్రంలోని వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర 65,18,496 సామాజిక పింఛన్లకుగాను ఏప్రిల్ నుంచి పెంచిన సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.ఏడు వేలు చొప్పున రూ.4,400.67 కోట్లు విడుదల చేసింది. రెండ్రోజుల్లో సచివాలయ ఉద్యోగుల ద్వారా 64,58,367 మంది లబ్ధిదారులకు రూ.4,360 కోట్ల సాయాన్ని పంపిణీ చేయించారు. తర్వాత లాగిన్ నిలిపివేయడంతో ఆ తర్వాత వచ్చిన వారికి పింఛన్ అందలేదు. సాయం అందాల్సిన 60,129 మందిలో 30–40 శాతం వరకు మృతులు ఉండగా మిగిలిన వారిలో జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు, బంధువుల ఇళ్లకు వెళ్లిన వారు, అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారే అధిక శాతం మంది ఉన్నారు. ఇతర ప్రాంతాల్లోని వారికి నిరాశ..గత ప్రభుత్వంలో ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పింఛన్ల పంపిణీ చేసేందుకు సచివాలయ ఉద్యోగులకు లాగిన్ గడువు ఉండటంతో మూడు, నాలుగు తేదీల్లో దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు వచ్చి పింఛన్ సాయం తీసుకుని వెళ్లేవారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ పింఛన్ తీసుకునేందుకు రాలేని వారి వద్దకు వలంటీర్లు వెళ్లి అందించి వచ్చేవారు. ఇతర జిల్లాలతో పాటు హైదరాబాద్ వరకు కూడా వెళ్లి ఆస్పత్రుల్లోని లబ్ధిదారులకు పింఛన్ సాయం అందించిన వలంటీర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ, ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల ద్వారా సాయం అందించినప్పటికీ రెండ్రోజులు మాత్రమే గడువివ్వడంతో చాలావరకు స్థానికంగా అందుబాటులో ఉన్నవారికి మాత్రమే వారు పింఛన్లు ఇచ్చారు. గత ప్రభుత్వంలో నిర్ణీత ఐదో తేదీ దాటిన తర్వాత మిగిలిన మొత్తాన్ని జమచేసేవారు. కానీ, ఈసారి మూడో తేదీనే రూ.40.67 కోట్ల మేర మిగిలిన సొమ్మును సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి జమచేసేశారు. గతంలో మాదిరి ఐదో తేదీ వరకు గడువు ఉంటుందని రూ.7,000 పింఛన్ తీసుకునేందుకు దూరప్రాంతాల నుంచి ఎంతో ఆశగా వచ్చిన లబ్ధిదారులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. వచ్చే నెలలో ఈ సాయాన్ని కలిపి అందిస్తారా లేదా? అన్నదానిపై తమకు స్పష్టతలేదని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడువేల మందికి పైగా లబ్ధిదారులకు ఇలా పింఛన్ సాయం అందలేదు. పింఛన్ల నిలిపివేతపై కోర్టుకు..బత్తలపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్న కారణంతో పింఛన్లు ఇవ్వకపోవడంపై బాధితులు శనివారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టును ఆశ్రయించారు. ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలోని 40 మందికి పైగా అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. దీంతో లబ్ధిదారులు తమకు ఎందుకు పింఛన్లు ఇవ్వడంలేదంటూ ఈనెల మూడున బత్తలపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. ఇదే విషయంపై ఎంపీడీఓ శివనాగప్రసాద్, పంచాయతీ కార్యదర్శి గంగరత్న, వెల్ఫేర్ అసిస్టెంట్ ఫ్రాన్సిస్‌ను ప్రశ్నించారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలు అడ్డుపడటమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కావున తామేమీ చేయలేకపోతున్నామని నిస్సహాయత వ్యక్తంచేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండాపోయిందని అధికారులు అనడంతో విధిలేని పరిస్థితుల్లో లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, మండల మాజీ కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, నాయకులు ప్రతాప్‌రెడ్డి తదితరులతో కలిసి సుమారు 20 మంది లబ్ధిదారులు శనివారం ధర్మవరం కోర్టులో పిటిషన్ వేశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ పంపిణీ చేయకపోవడం విచారకరమన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు తాము పోరాటం ఆపేదిలేదని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టంచేశారు. -
ట్విటర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్' పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా థ్రెడ్స్' (Meta Threads) యాప్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే ఈ యాప్ ఎలా లాగిన్ అవ్వాలి? ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. మెటా థ్రెడ్స్ లాగిన్ విధానం.. ట్విటర్ ప్రత్యర్థిగా విడుదలైన కొత్త 'మెటా థ్రెడ్స్' వినియోగించాలనుకునే వ్యక్తి ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ ద్వారా థ్రెడ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తరువాత ఇన్‌స్టాగ్రామ్‌తో లాగిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ ఆధారాలను నమోదు చేయండి ప్రొఫైల్ ఫోటో, పేరు, బయో, లింక్‌లు వంటి ఇన్పుట్ వివరాలు ఫిల్ చేయండి.. లేదా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా తీసుకోవచ్చు. పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్రొఫైల్‌ను ఇక్కడ ఎంచుకోవచ్చు. ఇందులో మీరు ప్రైవేట్ ప్రొఫైల్ ఎంచుకుంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వ్యక్తులు మాత్రమే మీ పోస్టులు, ఇతర వివరాలు కనిపిస్తాయి. చివరగా జాయిన్ థ్రెడ్‌లపై క్లిక్ చేయండి. ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. మెటా థ్రెడ్స్ ఉపయోగాలు.. మెటా థ్రెడ్స్ యాప్ ద్వారా కంటెంట్‌ని సృష్టించవచ్చు, లింక్స్ పెట్టవచ్చు, ఫొటోలు, అయిదు నిమిషాల నిడివితో వీడియోలు పోస్ట్ చేయవచ్చు. చాలా ఫీచర్స్ దాదాపు ట్విటర్ ఫీచర్స్ మాదిరిగానే ఉంటాయి. ఇందులో ట్విటర్లో లేని కొన్ని అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ వినియోగించాలనుకునే వారు అప్పటికి ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న అందరూ ఇందులో కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. దీని కోసం ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. (ఇదీ చదవండి: ట్విటర్‌ను షేక్ చేస్తున్న మెటా థ్రెడ్స్.. లక్షలు దాటుతున్న యూజర్ల సంఖ్య!) మెటా థ్రెడ్స్ యాప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాల్లో తప్ప ప్రపంచంలోని దాదాపు 100కి పైగా దేశాల్లో ఈ రోజు (గురువారం) నుంచి అందుబాటులో వచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారుడు 500 అక్షరాలా వరకు పోస్ట్ చేయవచ్చు. కొత్తగా వచ్చిన ఈ థ్రెడ్స్ యాప్ "ట్విటర్ కిల్లర్" అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక!
ఎస్బీఐ తన ఖాతాదారులకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కొత్త నిబందనలు తీసుకువచ్చింది. ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లతో పాటు ఆన్లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ యోనో వినియోగదారులు అనుసరించాల్సిన కఠినమైన నిబంధనలతో ఈ సారి ముందుకు వచ్చింది. ఆన్లైన్ లో అనేక మోసాల కారణంగా చాలా మంది డబ్బు నష్టపోతున్నట్లు పేర్కొంది. తమ ఖాతాదారులను సురక్షితంగా ఉంచడం కొరకు బ్యాంకు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. కొత్త నిబంధనలను పాటించనట్లయితే ఖాతాదారులను వారి ఖాతాల నుంచి స్తంభింపజేస్తుంది. ఎస్బీఐ యోనో యాప్ లోకి లాగిన్ కావడానికి ముందు ఎస్బీఐ అకౌంట్ ఖాతాదారులు బ్యాంకుతో లింకు చేసిన మొబైల్ ఫోన్ నెంబరు గల మొబైల్ ద్వారానే ఎస్బీఐ యోనో యాప్ లో లాగిన్ చేయాలి. ఒకవేళ వేరే నెంబరుతో లాగిన్ చేయడానికి ప్రయత్నించినట్లయితే ఖాతాదారులు ఎలాంటి లావాదేవీ చేయడానికి ఎస్బీఐ యోనో అనుమతించదు. ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించింది. "యోనో ఎస్బీఐతో బ్యాంక్ సురక్షితంగా ఉంది! యోనో ఎస్బీఐ తన భద్రతా ఫీచర్లను మెరుగు పరుస్తుంది. కొత్త అప్డేట్ లో భాగంగా బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబరు గల ఫోన్ నుంచి మాత్రమే యోనో ఎస్బీఐని యాక్సెస్ చేసుకోవడానికి అనుమతిస్తుంది" అని తెలిపింది. Bank Securely with YONO SBI! YONO SBI is leveling up its security features. The new upgrade will allow access to YONO SBI only from the phone which has the mobile number registered with the bank. #YONOSBI #YONO #Banking #Upgrade pic.twitter.com/WtV86zQVfF — State Bank of India (@TheOfficialSBI) July 25, 2021 -
విద్యార్థుల జీవితాలతో మళ్లీ చెలగాటం!
⇔ అక్రమాలకు ఆస్కారం కల్పించిన ఇంటర్ బోర్డు ⇔ 200 ప్రైవేటు జూనియర్ కాలేజీలకే అనుబంధ గుర్తింపు ⇔ కానీ 1,750 కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతి ⇔ గుర్తింపు రాని కాలేజీల్లో చేరే వారి పరిస్థితేంటి? ⇔ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా బోర్డు చర్యలు సాక్షి. హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డు మళ్లీ అక్రమాలకు తెరతీస్తోంది. అనుబంధ గుర్తింపు పేరుతో ప్రైవేటు జూనియర్ కాలేజీల నుంచి భారీగా దండుకు నేందుకు ఆస్కారం కల్పించింది. అంతేకాదు విద్యార్థుల జీవితాల ను పణంగా పెట్టేందుకు సిద్ధమైంది. మొన్న టికి మొన్న వనస్థలిపురంలోని శ్రీవాసవి జూనియర్ కాలేజీకి గుర్తింపు ఇవ్వకపోయినా ముడుపులు పుచ్చుకొని ప్రవేశాలు చేపట్టేం దుకు ఆన్లైన్లో లాగిన్ ఇచ్చి, ఆ తరువాత గుర్తింపు లేదంటూ విద్యార్థులను రోడ్డున పడేసిన సంగతి తెలిసిందే. చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకునేందుకు ప్రభుత్వ జూనియర్ కాలే జీ నుంచి ‘శ్రీవాసవి’ విద్యార్థులతో పరీక్షలు రాయిం చింది. ఆ వ్యవహారంలో రూ. లక్షల్లో బోర్డు అధికారులు ముడుపులు పుచ్చుకున్న ట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గుర్తింపు లేక పోయినా ఆన్లైన్ లాగిన్ ఇచ్చిన బోర్డు అధికా రుల్లో ఏ ఒక్కరిపైనా చర్యలు చేపట్టకుండా దాటవేసిం ది. ఆ అక్రమాల తతంగం ఇంకా సమసి పోకుండానే మరో అక్రమానికి రంగం సిద్ధం చేసింది. బోర్డు అధికారులు అఫిలియేషన్ల ముసుగులో మళ్లీ భారీగా దండుకునే కార్యక్రమానికి తెర లేపారు. గుర్తింపు ఇవ్వకున్నా ప్రవేశాలు.. ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనల ప్రకారం అనుబంధ గుర్తింపు లేని కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,750 ప్రైవేటు జూనియర్ కాలేజీలుండగా వాటిలో కేవలం 200 జూనియర్ కాలేజీలకే ఇంటర్మీడియెట్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. మిగతా 1,500 జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇంకా జారీ చేయలేదు. ఆ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఆయా కాలేజీలను సందర్శించిన బోర్డు అధికారులు కాలేజీల వారీగా లోపాలను గుర్తించి, నోటీసులు జారీ చేశారు. వారికి బోర్డు 15 రోజుల గడువు ఇచ్చింది. ప్రస్తుతం ఆ 1,500 కాలేజీల్లో ఎన్నింటికి అనుబంధ గుర్తింపు వస్తుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ అన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టేందుకు ఇంటర్ బోర్డు ఓకే చెప్పింది. ‘పైగా గత ఏడాది ఏయే కాలేజీల్లో పరిస్థితి ఏంటో మాకు తెలుసు కాబట్టి వాటిల్లో ప్రవేశాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చాం..’ అన్న వింత వాదనను తెరపైకి తెచ్చింది. కాలేజీల్లో పరిస్థితులపై మొబైల్లో వివరాలను నిక్షిప్తం చేసినట్లు చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా బోర్డు చర్యలు కొనసాగుతుండటం పట్ల కొంతమంది అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ ఒత్తిడితోనే ఆన్లైన్ బంద్ ! కార్పొరేట్ కాలేజీలను నియంత్రించేందుకు ఇంటర్మీడియెట్‌లో ఆన్లైన్ ప్రవేశాలను చేపడతామని సాక్షాత్తూ అసెంబ్లీలోనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. కానీ ఇప్పుడు అదే కార్పొరేట్ కాలేజీల ఒత్తిడి కారణంగానే ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో ప్రవేశాలకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇన్నాళ్లు ఆన్లైన్ ప్రవేశాలు చేపట్టేందుకు పరిశీలన జరుపుతున్నామని చెప్పి ప్రవేశాలను ఆలస్యం చేసిన అధికారులు.. చివరకు ఆఫ్‌లైన్‌లో ప్రవేశాలు చేపడతామని ప్రకటించడం గమనార్హం.