
విద్యార్థుల జీవితాలతో మళ్లీ చెలగాటం!
ఇంటర్మీడియెట్ బోర్డు మళ్లీ అక్రమాలకు తెరతీస్తోంది. అనుబంధ గుర్తింపు పేరుతో ప్రైవేటు జూనియర్ కాలేజీల నుంచి భారీగా దండుకు నేందుకు ఆస్కారం కల్పించింది. అంతేకాదు విద్యార్థుల జీవితాల
⇔ అక్రమాలకు ఆస్కారం కల్పించిన ఇంటర్ బోర్డు
⇔ 200 ప్రైవేటు జూనియర్ కాలేజీలకే అనుబంధ గుర్తింపు
⇔ కానీ 1,750 కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతి
⇔ గుర్తింపు రాని కాలేజీల్లో చేరే వారి పరిస్థితేంటి?
⇔ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా బోర్డు చర్యలు
సాక్షి. హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డు మళ్లీ అక్రమాలకు తెరతీస్తోంది. అనుబంధ గుర్తింపు పేరుతో ప్రైవేటు జూనియర్ కాలేజీల నుంచి భారీగా దండుకు నేందుకు ఆస్కారం కల్పించింది. అంతేకాదు విద్యార్థుల జీవితాల ను పణంగా పెట్టేందుకు సిద్ధమైంది. మొన్న టికి మొన్న వనస్థలిపురంలోని శ్రీవాసవి జూనియర్ కాలేజీకి గుర్తింపు ఇవ్వకపోయినా ముడుపులు పుచ్చుకొని ప్రవేశాలు చేపట్టేం దుకు ఆన్‌లైన్‌లో లాగిన్ ఇచ్చి, ఆ తరువాత గుర్తింపు లేదంటూ విద్యార్థులను రోడ్డున పడేసిన సంగతి తెలిసిందే. చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకునేందుకు ప్రభుత్వ జూనియర్ కాలే జీ నుంచి ‘శ్రీవాసవి’ విద్యార్థులతో పరీక్షలు రాయిం చింది. ఆ వ్యవహారంలో రూ. లక్షల్లో బోర్డు అధికారులు ముడుపులు పుచ్చుకున్న ట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గుర్తింపు లేక పోయినా ఆన్‌లైన్ లాగిన్ ఇచ్చిన బోర్డు అధికా రుల్లో ఏ ఒక్కరిపైనా చర్యలు చేపట్టకుండా దాటవేసిం ది. ఆ అక్రమాల తతంగం ఇంకా సమసి పోకుండానే మరో అక్రమానికి రంగం సిద్ధం చేసింది. బోర్డు అధికారులు అఫిలియేషన్ల ముసుగులో మళ్లీ భారీగా దండుకునే కార్యక్రమానికి తెర లేపారు.
గుర్తింపు ఇవ్వకున్నా ప్రవేశాలు..
ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనల ప్రకారం అనుబంధ గుర్తింపు లేని కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,750 ప్రైవేటు జూనియర్ కాలేజీలుండగా వాటిలో కేవలం 200 జూనియర్ కాలేజీలకే ఇంటర్మీడియెట్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. మిగతా 1,500 జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇంకా జారీ చేయలేదు. ఆ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఆయా కాలేజీలను సందర్శించిన బోర్డు అధికారులు కాలేజీల వారీగా లోపాలను గుర్తించి, నోటీసులు జారీ చేశారు. వారికి బోర్డు 15 రోజుల గడువు ఇచ్చింది. ప్రస్తుతం ఆ 1,500 కాలేజీల్లో ఎన్నింటికి అనుబంధ గుర్తింపు వస్తుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ అన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టేందుకు ఇంటర్ బోర్డు ఓకే చెప్పింది. ‘పైగా గత ఏడాది ఏయే కాలేజీల్లో పరిస్థితి ఏంటో మాకు తెలుసు కాబట్టి వాటిల్లో ప్రవేశాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చాం..’ అన్న వింత వాదనను తెరపైకి తెచ్చింది. కాలేజీల్లో పరిస్థితులపై మొబైల్‌లో వివరాలను నిక్షిప్తం చేసినట్లు చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా బోర్డు చర్యలు కొనసాగుతుండటం పట్ల కొంతమంది అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేట్ ఒత్తిడితోనే ఆన్‌లైన్ బంద్ !
కార్పొరేట్ కాలేజీలను నియంత్రించేందుకు ఇంటర్మీడియెట్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలను చేపడతామని సాక్షాత్తూ అసెంబ్లీలోనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. కానీ ఇప్పుడు అదే కార్పొరేట్ కాలేజీల ఒత్తిడి కారణంగానే ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో ప్రవేశాలకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇన్నాళ్లు ఆన్‌లైన్ ప్రవేశాలు చేపట్టేందుకు పరిశీలన జరుపుతున్నామని చెప్పి ప్రవేశాలను ఆలస్యం చేసిన అధికారులు.. చివరకు ఆఫ్‌లైన్‌లో ప్రవేశాలు చేపడతామని ప్రకటించడం గమనార్హం.