
బ్యాంక్, ఆఫీస్ పోర్టళ్లు, జాబ్ కోసం దరఖాస్తులు వంటి ఇతర ముఖ్యమైన వెబ్‌సైట్‌ల్లో చాలామంది లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు కొత్తగా క్రియేట్ చేసుకుంటుంటారు. కానీ తిరిగి లాగిన్ చేయాలంటే మాత్రం సైన్‌ఇన్ ఇవ్వొదు. ‘అదేంటి సరిగ్గానే పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తున్నానే.. ఎందుకు అవ్వట్లేదు’ అనే అనుమానం వస్తుంది. దాంతో తిరికి ఫర్‌గాట్ పాస్ట్‌వర్డ్ అప్షన్‌కు వెళ్లాల్సి వస్తుంది. అందులోనూ కొన్ని సైట్లు పాత పాస్‌వర్డ్‌లు ఎంటర్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది.
ఏవీ చూసుకోకుండా లాగిన్ చేస్తే..
లాగిన్ పోర్టల్‌లో ఐడీ ఎంటర్ చేసేప్పుడు సదరు బ్లాక్‌లో ఎంటర్ చేసే అక్షరాలు యూజర్‌కు కనిపిస్తాయి. కానీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసేప్పుడు మాత్రం సెక్యూరిటీ కారణాల వల్ల డాట్‌లు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అప్పర్‌కేస్, లోయర్ కేస్ ఇంగ్లీష్ అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్లు, క్యాప్స్‌లాక్ ఆన్ అవుతుంది. అవేవీ చూసుకోకుండా లాగిన్ చేస్తే అప్పటివరకు లాగిన్ అవుతుంది. కానీ లాగవుట్ చేసి తిరిగి లాగిన్ చేస్తే సైన్‌ఇన్ అవ్వదు. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
చెక్ చేయాల్సిందే..
ఆన్‌లైన్‌లో ఖాతాలు ఓపెన్ చేసేప్పుడు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు టైప్ చేయాల్సి వస్తుంది. ఐడీ బ్లాక్‌లో అక్షరాలు యూజర్‌కు కనిపిస్తాయి. కానీ పాస్‌వర్డ్ బ్లాక్‌లో ఎంటర్ చేసే అక్షరాలు కనిపించవు. బదులుగా డాట్స్ పడుతుంటాయి. ఆ సమయంలో ఒకవేళ కంప్యూటర్ ద్వారా సైన్‌ఇన్ అవుతుంటే నోట్‌పాడ్ ఓపెన్ చేసి అందులో ముందుగా పాస్‌వర్డ్ టైప్‌చేసి, ఎంటర్ చేయాల్సిన అన్ని అక్షరాలు సరిగ్గా పడుతున్నాయా? లేదా ఏదైనా బటన్ సమస్యలు, లేదా కేస్ సెన్సిటివ్ అక్షరాలు టైప్ అవుతున్నాయా చెక్ చేసుకోవాలి. తర్వాత పాస్‌వర్డ్ బ్లాక్‌లో ఎంటర్ చేయడంతో సమస్య ఉండదు.
ఇదీ చదవండి: ఏఐ ఉండగా ఉద్యోగాలొస్తాయా?
మొబైల్‌లో ఇలా..
మొబైల్‌లో సైనప్ అవుతుంటే మాత్రం నోట్స్‌లో రాసుకోవచ్చు. దాంతోపాటు వెర్టికల్ వ్యూలో అక్షరాలు చిన్నగా ఉంటాయి. కాబట్టి పొరపాటున ఒక అక్షరం నొక్కితే పక్కన ఉన్న లెటర్లు ప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి పరిష్కారంగా మొబైల్‌లో స్క్రీన్ రొటేట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఉపయోగించి ఫోన్ రొటేట్ చేస్తే కీబోర్డ్ పెద్దగా కనిపిస్తుంది. మరింత స్పష్టంగా, ఎంటర్ చేయాలనుకునే పాస్‌వర్డ్ సదరు బ్లాక్‌లో ఇవ్వొచ్చు.