బంగారం కాదు..ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ ‘చిన్న వస్తువు’ ఏంటో తెలుసా? | Semiconductor War Explained, Why The World’s Biggest Powers Are Fighting Over Tiny Semiconductors, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

బంగారం, క్రూడాయిల్‌ కాదు..ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ ‘చిన్న వస్తువు’ ఏంటో తెలుసా?

Jul 8 2026 9:44 AM | Updated on Jul 8 2026 10:36 AM

Semiconductor War Explained:Why Taiwan Controls the Future of Technology

ప్రస్తుతం 21వ శతాబ్దంలో.. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైనది, అత్యంత పవర్‌ఫుల్ వస్తువు ఏది? అని ఎవరినైనా అడిగితే.. చాలామంది బంగారం, ప్లాటినం లేదా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) అని చెప్తారు. కానీ, ఒక జర్నలిస్ట్‌గా ప్రపంచ పరిణామాలను నిశితంగా గమనిస్తే అసలు నిజం వేరే ఉందని అర్థమవుతుంది. 

ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ.. అగ్రరాజ్యాలను శాసిస్తున్నది బంగారం కాదు.. ఒక చిన్న ఇసుక రేణువుతో తయారయ్యే 'మైక్రోచిప్'.. దాన్నే సెమీకండక్టర్ అంటారు!అవును.. మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ మొదలు.. అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్ వరకు.. మీ ఇంట్లోని స్మార్ట్ టీవీ నుంచి.. యుద్ధరంగంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే అత్యాధునిక డ్రోన్లు, మిస్సైళ్లు, రాడార్ వ్యవస్థల వరకు.. ఈ చిన్న చిప్ లేకపోతే ఏదీ నడవదు.. కదలదు.. అంతా డెడ్! 

కేవలం మన గోరు పరిమాణంలో ఉండే ఈ చిన్న చిప్స్ కోసం.. ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య ఒక నిశ్శబ్ద, భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అదే 'గ్లోబల్ సెమీకండక్టర్ వార్'.ఇది బుల్లెట్లతో, సైన్యంతో జరిగే యుద్ధం కాదు.. గ్లోబల్ టెక్నాలజీని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి జరుగుతున్న ఒక మైండ్ గేమ్! ఈ డిజిటల్ యుగంలో.. ఈ 'చిప్ వార్' లో గెలిచినవాడే రేపటి ప్రపంచానికి ఏకఛత్రాధిపతి.. వాడే అసలైన గ్లోబల్ డాన్! దాని కథాకమామిషు ఏంటో ఇవాళ్టి ‘సాక్షి డిజిటల్’ పాడ్‌కాస్ట్‌లో తెలుసుకుందాం. వివరాలకు కింది వీడియోను క్లిక్ చేయండి..

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement