అదుపుతప్పిన రోబో.. భయపడ్డ విద్యార్థులు (వీడియో) | Robot Loses Control During Sports Day Event In China | Sakshi
Sakshi News home page

అదుపుతప్పిన రోబో.. భయపడ్డ విద్యార్థులు (వీడియో)

May 5 2026 11:58 AM | Updated on May 5 2026 12:11 PM

Robot Loses Control During Sports Day Event In China

చైనాలోని జిన్‌జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్‌లోని ఒక పాఠశాలలో క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక రోబో అదుపుతప్పి.. విద్యార్థులను భయబ్రాంతులకు గురించి చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విద్యార్థులను అలరించడానికి ఏర్పాటు చేసిన రోబో అకస్మాత్తుగా కిందపడిపోయింది. ఆ తరువాత అక్కడున్న ప్రదర్శనకారులపై కుంగ్-ఫూ కిక్‌లు విసరడం ప్రారంభించింది. దిక్కుతోచని విధంగా.. అడ్డదిడ్డంగా పరుగులు పెట్టింది. మైదానంలో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు.

పరిస్థితిని అర్థం చేసుకుని, దానిని కంట్రోల్ చేసే వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి రోబోట్‌ను పట్టుకున్నాడు. ఆ తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే మైదానంలోని విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు.

ఇదే మొదటిసారి కాదు
రోబోలు తడబడటం ఇదే మొదటిసారి కాదు. 2026 మార్చి నెలలో.. చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో జరిగిన ఒక బహిరంగ నృత్య ప్రదర్శనలో, ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ప్రమాదవశాత్తు ఒక చిన్న బాలుడి ముఖానికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన.. సిబ్బంది ఆ రోబోను పక్కకు లాగడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ.. అది రింగ్ మధ్యలో తన ప్రోగ్రామ్ ప్రదర్శించింది.

రష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని 2025 నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్‌లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.

కంపెనీలకు సూచనలు
రోబర్స్ తయారీ లేదా వినియోగం అనేది మంచి చర్య. అయితే వాటికి భావాలు అర్థం చేసుకోవడం, ప్రవర్తించిన విధానం పూర్తిగా తెలిసి ఉండదు. ఇలాంటి సమయంలో రోబోల వల్ల ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి వస్తుంది. కాబట్టి సంస్థలు దీనిని దృష్టిలో ఉంచుకుని రోబోట్స్ తయారు చేయాలి. అంతే కాకుండా..పూర్తిగా టెస్ట్ చేసిన తరువాత వినియోగానికి ఉపయోగించడం మంచిది. లేకుంటే.. ప్రజలకు ఇబ్బంది, తద్వారా కంపెనీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement