ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌ను చైనా నిర్మించింది. చైనా నైరుతి ప్రాంతంలోని చాంగ్‌కింగ్–ఈస్ట్ రైల్వేస్టేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా రూపొందించింది. దీని విస్తీర్ణం 1.22 మిలియన్ చదరపు మీటర్లు. ఇది న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ కంటే ఆరురెట్ల పెద్దది. చాంగ్‌కింగ్–ఈస్ట్ రైల్వేస్టేషన్‌లో దాదాపు అరకిలోమీటరు పొడవైన 29 ప్లాట్‌ఫామ్స్, హైస్పీడ్ రైళ్ల రాకపోకలకు అనువైన 15 రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి.
ఎనిమిది అంతస్తుల ఈ రైల్వేస్టేషన్ భవంతిని అత్యధునాతనమైన హంగులతో నిర్మించారు. గంటకు 16 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ రైల్వేస్టేషన్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దారు. దీని నిర్మాణం కోసం 40 వేల మంది కార్మికులు, రోబోటిక్ యంత్రపరికరాలతో స్టేషన్ నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో కేవలం 38 నెలల్లోనే పూర్తి చేశారు.


