వాట్‌ యాన్‌ ఐడియా..! తల్లిదండ్రుల కష్టం తెలియాలని .. | Chinese School Makes Rebellious Teens Carry Baby Dolls | Sakshi
Sakshi News home page

వాట్‌ యాన్‌ ఐడియా..! తల్లిదండ్రుల కష్టం తెలియాలని ..

May 22 2026 3:43 PM | Updated on May 22 2026 5:58 PM

Chinese School Makes Rebellious Teens Carry Baby Dolls

శిశువులను సరిగ్గా ఎత్తుకోవడం నుంచి వారి ఆలనాపాలన వరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. ‘అది చెబితే అర్థమయ్యే కష్టం కాదు. స్వయంగా తెలుసుకోవాలి’ అంటూ తూర్పు చైనాలోని యువాన్‌జోంగ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ వినూత్నమైన ప్రయోగం చేసింది. శిశువులను చూసుకోవడంలో తల్లిదండ్రులకు ఎదురయ్యే సవాళ్ల గురించి విద్యార్థులకు బోధించే ప్రయత్నంలో భాగంగా రోజంతా బొమ్మ శిశువును చూసుకోవాలని అసైన్‌మెంట్‌ ఇచ్చింది. 

అల్లరి పనులు చేసే, గేమింగ్‌ వ్యసనానికి బానిసైన, చదువుపై ఆసక్తి లేని విద్యార్థులను సరిౖయెన దారిలోకి తీసుకురావడం ఈ పాఠశాల ప్రత్యేకత.స్కూల్‌లో విద్యార్థులు బొమ్మ శిశువులను తమ వీపుపై మోస్తారు. మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు కూడా వాటిని పట్టుకొని ఉంటారు. నిజమైన శిశువులలాగే వాటిని చూసుకోవాలని ఉపాధ్యాయులు ఆదేశించారు. 

శిశువులకు సంబంధించి తల్లిదండ్రులు ఎదుర్కొనే శారీరక శ్రమను విద్యార్థులకు అర్థం చేయించడానికి ఒక్కొక్కరికి 2.5 కిలోల బరువు ఉన్న బొమ్మ ఇచ్చారు. ‘ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్యార్థులు తమ తల్లిదండ్రులను గౌరవించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం’ అంటున్నారు యువాన్‌ జోంగ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌.

(చదవండి: ఆ భారతీయ విలువలను తప్పక నేర్చుకోవాలి..! వైరల్‌గా విదేశీ మహిళ పోస్ట్‌)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement