ఖట్ట్మాండు: నేపాల్ ప్రధాని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో ఉన్న దీర్ఘకాలిక సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో చైనా, బ్రిటన్ దేశాలు జోక్యం చేసుకోవాలని కోరారు. నేపాల్ పార్లమెంట్‌లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విధంగా మాట్లాడారు.
ఇటీవలే నేపాల్ ప్రధానిగా ఎన్నికైనా బాలేంద్ర షా ఆదివారం నేపాల్ పార్లమెంటులో మాట్లాడుతూ "కేవలం భారత్ మాత్రమే నేపాల్ భూభాగాలను ఆక్రమించలేదు. నేపాల్ కూడా భారత్‌కు చెందిన పలు ప్రాంతాలను ఆక్రమించింది. ఈ అంశంపై ఇరు దేశాలు దీనిపై చర్చించుకోవాలి." అని అన్నారు.ఈ సరిహద్దు వివాదం 'బ్రిటిష్ ఇండియా' కాలం నాటిదని, అందుకే ఈ సమస్య పరిష్కారంలో ఇంగ్లాండ్ (బ్రిటన్) కూడా పాలుపంచుకోవాలని నేపాల్ భావిస్తోందని షా పేర్కొన్నారు.
వివాదం ఏంటి?
లింపియాధురా, లిపులేఖ్ మరియు కాలాపానీ ప్రాంతాలపై నేపాల్ హక్కులు కోరుతోంది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత, జూన్ మొదటి వారం నుండి లిపులేఖ్ కనుమ ద్వారా భారత్-చైనాలు సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించబోతున్నాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దౌత్యపరమైన నోట్ పంపింది.అయితే దీనిపై చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భారత్ ప్రత్యుత్తరం ఇచ్చినట్లు నేపాల్ ప్రధాని పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం స్పందన
నేపాల్ చేస్తున్న భూభాగాల వాదనలకు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఏకపక్షంగా సరిహద్దులను పెంచుకుంటూ పోవడం చెల్లదని, అయితే ఈ సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.


