మనవడి కోసం ఓ తాత బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాడు. అతడి ప్రాణాలను కాపాడుకోవడం కోసం సామాజిక మాధ్యమంలో లైవ్ వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తూ డబ్బులు కూడబెడుతున్నాడు ఈ 75 ఏళ్ల తాత. అంతేగాదు ఫిజెయోథెరపీ కోసం తానే స్వయంగా ఎలాగో నేర్చుకుని మనవడికి మసాజ్ చేస్తూ..అతడు కోలుకోవాలని వెయ్యి కన్నులతో ఎదురుచూస్తున్నాడు ఆ ముసలి తాత. ఆ వయసులో అంత పెద్ద బాధ్యతను టీవీల్లోని కార్టూన్ పాత్రల్లో చూసే సూపర్‌మ్యాన్‌లా నిర్వర్తిస్తుండటం విశేషం. ఇంతకీ ఎవరా తాతా? ఏమా కథ అంటే..
చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌కి చెందిన ఝూ యున్‌చాంగ్ అనే 75 ఏళ్ల తాతన తన తొమ్మిదేళ్ల మనవడు కావో జింగ్వాన్ కోసం కష్టపడుతున్నారు. అతుడు అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) వ్యాధితో బాధపడుతున్నాడు. అతడికి ఆరు నెలల వయసున్నప్పుడు ఈ అరుదైన జన్యు వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఈ వ్యాధి వెన్నుపాములోని మోటార్ న్యూరాన్‌లను దెబ్బతీసి, క్రమంగా కండరాల బలహీనత, శ్వాసకోస సమస్యలకు దారితీసుకుంది. చైనాలో ఇలాంటి కేసులు ప్రస్తుతం 30 వేల ఎస్‌ఎంఏ కేసులు ఉన్నాయి.
ప్రతి ఏడాది కొత్తగా సుమారు 12 వేల కేసులు నమోదవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక్క ఈ చిన్నారి జింగ్వాన్‌కు SMA టైప్ 1 ఉంది. ఇది ఈ అరుదైన వ్యాధి తీవ్రమైన రూపం. అంతేగాదు అతడికి సకాలంలో చికిత్స అందకపోతే కేవలం 18 నెలలు మాత్రమే జీవిస్తాడని వైద్యులు తేల్చి చెప్పారు. ఆ వార్త ఆ చిన్నారి తల్లి జూవెయ్‌ని కుంగదీసింది. జువెయ్ ఈ ముసిలా తాత ఒక్కగానొక్క కూతురు. తన కూమార్తెకి వచ్చిన కష్టం చూసి చలించిపోయినా ఆ వృద్ధుడి తన మనవడిని ఎలాగైన కాపాడాలని ముఖానికి రంగులు వేసుకుంటూ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాడు.
ప్రత్యక్ష మేకప్ వీడియో ప్రసారాలతో అశేష ప్రేక్షక ఆదరాభిమానాలను పొందాడు. అంతేగాదు కూతురు కూడా తనకంటే తన తండ్రే బాగా మేకప్ వేయగలడని చెప్పడం విశేషం. అలా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆర్జించిన సొమ్ముని మనవడి చికిత్స కోసం ఉపయోగిస్తున్నాడు. అంతేగాదు మంచానికే పరిమితమైన మనవుడు లేచి నిలబడేలా చేసేందకు ఫిజియోథెరపీ కూడా నేర్చుకుని మరి చికిత్సలు అందిస్తున్నాడు.
తనకు బాగాలేకపోతే తగిన సంరక్షక జాగ్రత్తలు తీసుకుని మరి మసాజ్‌లు చేస్తుంటాడట. అయితే 2019లో, ఈ వ్యాధికి సంబంధించిన 'నుసినెర్సెన్' అనే మందుని కనిపెట్టారు. ఇది మనుగడ రేట్లను గణనీయంగా పెంచి, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని నిర్థారణ అయ్యింది. అయితే ఒక్కో ఇంజెక్షన్‌కు 700,000 యువాన్ల (భారత కరెన్సీ ప్రకారం రూ. 97 లక్షలు)ఖర్చవుతుంది. ఇక ఈ చిన్నారి జింగ్యాన్‌కు ప్రతి ఏడాదికి రెండు ఇంజెక్షన్లు ఇప్పించాల్సి ఉంది. ఈ చికిత్స కోసం ఈ తాతగారు తన ఫ్లాట్‌ని అమ్మేశాడు. అలాగే బంధువుల నుంచి కొంత అప్పు తీసుకున్నాడు.
బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గానే ఎందుకంటే..
ఇక అతని కుమార్తె పగటిపూట పనిచేసి సాయంత్రాలలో లైవ్-స్ట్రీమింగ్ చేసేది. ఈ 70 ఏళ్లు పైబడిన తాత గారిని ఏఉత్పత్తులకు ప్రచారం చేయడానికి ఏ కంపెనీ కూడా నియమించకోదు. దాంతో ఆయన కుమార్తె కొనుగోలు చేసిన సౌందర్య ఉత్పత్తులతో లైవ్-స్ట్రీమింగ్ చేసేందుకు బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అవతారమెత్తాడు. అలా వచ్చిన ఆదాయన్ని మనవుడి చికిత్స కోసం వెచ్చిస్తున్నాడు. అలాగే అతడి కష్టానికి చైనా ప్రభుత్వం కూడా వైద్యబీమా రూపంలో సాయం అందించింది.
2021లో ఈ వ్యాధికి సంబంధించిన మందుల ఖర్చును చైనా వైద్య బీమా పరిధిలోకి తీసుకురావడంతో ఒక్కో ఇంజెక్షన్ ధర రూ. 4 లక్షలు తగ్గి..ఆ తాతకు కొంత ఉపశమనం లభించింది . ఇప్పుడు ఆయన మనవడికి తొమ్మిదేళ్లు నిండాయి. ఆరోగ్యం బాగున్న రోజుల్లో పాఠశాలకు వెళ్లి చుదువుకోవడం తోపాటు ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటాడని ఆనందంగా చెబుతున్నాడు.
ఆయన కుమార్తె తన తండ్రిని.. తన కుమారుడి ఇంజెక్షన్ల భారాన్ని మోస్తున్న సూపర్‌మ్యాన్.. సూపర్ డాడ్.. సూపర్ తాత.. అని సగర్వంగా చెబుతోంది. కానీ ఆ తాత ఝూ మాత్రం తన మనవడు స్వతంత్రంగా తన కాళ్లపై లేచి నిలబడితే చాలని భావోద్వేగంగా చెబుతున్నాడు.
(చదవండి: హాట్ వర్సెస్ ఐస్ ప్యాక్: ఎలాంటప్పుడు మంచిదంటే..)


